21, అక్టోబర్ 2020, బుధవారం

శివామృతలహరి


.శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు రచించిన

 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;


మ||

తలపన్ నిర్గుణ బ్రహ్మమొక్కటియె - విస్తారింప నా బ్రహ్మమే

పొలుపారున్ సగుణంబునన్ వరకృపాంబోరాశియౌ 'తల్లిగా

మెలగున్ ధర్మమురూపుగాంచిన మహామేధావియౌ ' 'తండ్రిగా

శిల 'లింగాకృతి బ్రహ్మమీవె దలపన్ శ్రీ సిద్ధలింగేశ్వరా !


భావం;

అర్థంచేసుకోగలిగితే  కనపడని నిర్గుణ బ్రహ్మ ఒకటే అని తెలుస్తుంది.ఇంకా కొంచెం లోతుగా అర్థం చేసుకోగలిగితే 

సగుణ రూపంలో వరాలిస్తూ అపారమైన కరుణా కటాక్షాలను కురిపించే తల్లి రూపంలోనూ మరియు

ధర్మస్వరూపుడు,అత్యంత మేధావి అయిన తండ్రి రూపంలోనూ కనిపించేది, లింగాకృతిలో ప్రకాశిస్తున్న పరబ్రహ్మ స్వరూపం అయిన నీవే అని తెలుస్తుంది కదా శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

కామెంట్‌లు లేవు: