21, అక్టోబర్ 2020, బుధవారం

ఊహలకు

 📓📓📓📓📓📓📓📓📓

_*పిల్లల ఊహలకు రెక్కలు తొడగండి.*_

👸🤴👸🤴👸🤴👸🤴👸

_*కథలతో సృజనాత్మక ఆలోచనా సామర్థ్యం సాధ్యం*_

*మురళీకృష్ణ*

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

*అనగనగా ఓ పేద పండితుడు. ఆయన పాండిత్యానికి మెచ్చి రాజు ఏం కావాలో కోరుకోమన్నాడు. ‘రాజా! నాకు మీ కష్టార్జితం ఏదైనా ఉంటే ఇవ్వండి’ అని అడిగాడు ఆ పండితుడు! మారువేషంలో రాత్రంతా కట్టెలు కొట్టి, రెండు అణాలు సంపాదించి.. సమర్పించాడా మహారాజు! వాటిని తీసుకుని ఇంటికి వెళ్లిన పండితుడిపై ఆయన భార్య కేకలేసింది. ‘రాజు వరమిస్తే.. ఆయన కష్టార్జితం అడుగుతావా? ఈ ముష్టి రెండణాలు ఎవరిక్కావాలి?’ అంటూ వాటిని మంటల్లో విసిరేసింది.*


*ఒక్కసారిగా అగ్ని జ్వాల ఎగిసిపడింది. చూస్తుండగానే వారి ఇల్లు బంగారం అయింది. ఎంత తీసినా అగ్నిహోత్రం నుంచి వస్తూనే ఉన్న బంగారు నాణేలు చూసి ఆ ఇల్లాలు నివ్వెరబోయింది. ‘చూశావా! ఇదీ కష్టార్జితం గొప్పతనం!’ అన్నాడా పండితుడు. కష్టార్జితం వేయిరెట్ల ఫలితాన్ని ఇస్తుందని అమ్మమ్మ చెప్పిన కథ ఇది.*

 

*కథ అంటే నీతి..కథ ఒక రీతి.. కథ అంటే నిజాయితీ! పిల్లలను చేరదీసి కథలు చెప్పండి..ఆ కథలే పిల్లలను వేలు పట్టి నడిపిస్తాయి. ‘నీతి చంద్రిక’లై దారి చూపుతాయి. రోబోటిక్‌ యుగంలో ఉన్నా.. అంతరిక్షంలో కాలనీలు కట్టినా.. చందమామ కథలు చెప్పాల్సిందే!* *‘బాలమిత్ర’ వంటి పుస్తకాలు కావాల్సిందే!* *ఎందుకంటే ఆ కాల్పనిక శక్తే మానవ జాతిని ఇంతవరకూ నడిపించింది. పసి మనసుల్లో..*

*ఎందుకు, ఏమిటి, ఎలా?*

*అన్న ప్రశ్నలను ఉదయింపజేసి..*

*పరిష్కారాలను ప్రసరింపజేసింది. అందుకే ‘కథలు చెప్పకు’ అని పిల్లలను ఎప్పుడూ చిన్నబుచ్చకండి. వాళ్ల కథలు వినండి. సమయం లేదని సాకులు చెప్పకుండా..ఎంచక్క పిల్లలకు కథలు చెప్పండి!    సందర్బా నుసారంగా  వారికి ఓ చక్కని కథల పుస్తకాన్ని బహూకరించండి! వారి కళ్లలోని వెలుగులో ఎన్ని కలలో..ఎన్ని కథలో..!!*


*కథలు మేలుకొలుపులు! వినేకొద్దీ ఇంకా వినాలనిపిస్తాయి. చదివే కొద్దీ ఇంకా చదవాలనిపిస్తాయి. చెప్పేకొద్దీ ఇంకా చెప్పాల నిపిస్తాయి. అసలు ఒక్క కథతో ఎలా సంతృప్తి చెందగలం? అమ్మమ్మ కథ చెబుతుంటే చందమామకు కునుకు రావాలిగానీ పిల్లలు నిద్రపోతేకదా! అమ్మమ్మా.. ఇంకా చెప్పు..తాతయ్యా..ఇంకోటి చెప్పు.. అని అడుగుతూనే ఉంటారు పిల్లలు! ఒక రాత్రా..రెండు రాత్రులా..? జీవితాంతం చెప్పినా తరగని కథలు! పిల్లలకు దారి చూపే వెలుగు రేఖలు!*

 

_*కథ ఎందుకు చెప్పాలి*_


*‘జ్ఞానం కంటే ఊహాశక్తి చాలా గొప్పది’ అన్నాడు ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌! ఈ మాట అక్షరాలా నిజం! పిల్లల్లో ఆ ఊహాశక్తిని పెంపొందించడానికి కథ చెప్పడం ఓ చక్కని మార్గం! అనగనగా..అనగానే పిల్లలు ఊహా ప్రపంచంలోకి వెళ్లిపోతారు. కథలోని పాత్రల్లో తమను తాము ఊహించుకుంటారు. దృశ్యాన్ని చూస్తే అనుభూతి లభిస్తుంది. కానీ ఆలోచించే అవసరం ఎక్కువ ఉండదు. కానీ కథ చెప్పడం, చదవడం, వినడం వల్ల పిల్లల కాల్పనిక జగత్తు విస్తృతమవుతుంది. సృజనాత్మక సామర్థ్యం పెరుగుతుంది. కథతోబాటు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలా ఎందుకు? ఇలా ఎందుకు? అని అడుగుతారు. దీంతో వారి ఆలోచనా పరిధి పెరుగుతుంది. ప్రశ్నించే తత్త్వంతోబాటు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం అలవడుతుంది. అన్నిటికీ మించి వివిధ పదాలను పరిచయం చేస్తూ భాషా సంపత్తిని పెంచడానికి కథలు దోహదం చేస్తాయి.*


*కథ చెప్పడం ఓ కళ! పిల్లల మనస్సులకు హత్తుకునే విధంగా కథ చెప్పాలి.కథ చదివి వదిలేసేది కాదు. అది మనల్ని సంస్కరిస్తుంది. కౌసల్య చెప్పిన కథలు రామయ్యను ఽధర్మ నిరతుడ్ని చేశాయి. ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అని లోకం కీర్తించేలా చేశాయి. కథలతో ఆర్యాంబ నేర్పిన సంస్కారం శంకరులను జగద్గురువును చేసింది. తల్లి భువనేశ్వరీదేవి చెప్పిన గాధలు వివేకానందుడిని సనాతన సారథిని చేశాయి. అమ్మ చెప్పిన కథలు రవీంద్రుడిని కవీంద్రుడిని చేశాయి. రొట్టెలు తినిపిస్తూ.. తారలను చూపిస్తూ.తల్లి చెప్పిన కథలు అబ్దుల్‌ కలామ్‌ను మేధావిగా తీర్చిదిద్దాయి.*

www.bestsocialteacher.com 

_*ప్రశ్నించి.. ఆలోచింపజేసే కథలు*_


*తెనాలి రామకృష్ణ కథలు, విష్ణుశర్మ ‘పంచతంత్రం’, చిన్నయసూరి ‘నీతి చంద్రిక’, కాశీమజిలీ కథలు, పేదరాసి పెద్దమ్మ కథలు, విక్రమార్క భేతాళ కథలు, అక్బర్‌ బీర్బల్‌ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు మొదలైనవి..*

 

*మీ పిల్లలు తెలివైనవాళ్లుగా ఎదగాలనుకుంటే వాళ్లకు మంచి కాల్పనిక కథలను చదివి వినిపించండి.*

 

_*ఐన్‌స్టీన్‌, భౌతిక శాస్త్రవేత్త*_


*మీరెప్పుడూ చదవని పుస్తకాన్ని మీ పిల్లలకు ఇవ్వకండి. ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించండి*.

 _*జార్జ్‌ బెర్నార్డ్‌ షా, ప్రఖ్యాత ఐరిష్‌ రచయిత*_



*ఇక ఈ తరం చిన్నారులు మాతృభాషలో చదవడం లేదు.* 

*తెలుగు కథ, పద్యం తెలియకుండానే చదువులు పూర్తయిపోతున్నాయి.* *పిల్లల్లో సృజనను పెంపొందించే శక్తి ఉన్న కథలను ముందుతరాలకు అందించాలనేదే  నా/ మన  తపన,  ఆశయం.*


*వీలయినంత  మంచి కథలను పిల్లలకు అందించే ప్రయత్నం చేయండి.*

📓📓📓📓📓📓📓📓📓

*సేకరణ:కెయస్వీ కృష్ణా రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, గంటి, కొత్తపేట మండలం, తూర్పుగోదావరి, 9492146689.*

www.bestsocialteacher.com

*Admin, best social teacher whatsapp groups.*

📓📓📓📓📓📓📓📓📓

_*If like this msg forward it without editing. It is the only respect we can give to the writer and collector. Hope you will.*_

📓📓📓📓📓📓📓📓📓

కామెంట్‌లు లేవు: