21, అక్టోబర్ 2020, బుధవారం

సంఖ్యావాచక పదాలు


       *సంఖ్యావాచక పదాలు*

                           






*షట్కాలాలు :* ప్రాత:కాలం, సంగమకాలం, మధ్యాహ్నకాలం, అపరాహ్ణకాలం, సాయాహ్నకాలం = సాయంకాలం, ప్రదోషకాలం = మునిమాపు వేళ


*యుద్ధషట్కము :* 'భీష్మపర్వం" మొదలుకొని "స్త్రీ పర్వం" వరకు గల ఆరు పర్వాలను "యుద్ధ షట్కము" అని అంటారు. అవి- 1. భీష్మపర్వం, 2. ద్రోణపర్వం, 3. కర్ణపర్వం, 4. శల్యపర్వం, 5. సౌప్తికపర్వం, 6. స్త్రీపర్వం.


*షణ్మతాలు :* పాషండ, చార్వాక, బౌద్ధ, జైన, వామన, గాణపత్యాలు.


*షణ్మతాలు :* "బౌద్ధం వైదిక శైవంచ సౌరం విష్ణుచ శాక్తకం" అని కూడా ఒక శ్లోకం ఉంది. 


దీని ప్రకారం మతాలు: బౌద్ధమతం, వైదికమతం, శైవమతం, సౌరమతం, వైష్ణవమతం, శాక్తేయం

కామెంట్‌లు లేవు: