21, అక్టోబర్ 2020, బుధవారం

ఆత్మజ్ఞానం పరం జ్ఞానమ్*

 *సంస్కృత సూక్తి*


*ఆత్మజ్ఞానం పరం జ్ఞానమ్*


ఆత్మజ్ఞానమే ఉత్తమమైన జ్ఞానం. *                           జై శ్రీమన్నారాయణ -        జై శ్రీహనుమాన్*


మన మనస్సులో కలిగే ఆలోచనలే మన స్వభావాన్ని నిర్మిస్తాయి. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు ఈ విధంగా చెపుతాడు. 


*ఎల్ల వేళలా నన్నే స్మరిస్తూ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, నీ మనోబుద్ధులు నాకు సమర్పించు, అప్పుడు నిస్సంశయంగా నన్ను పొందుతావు*


పవిత్రములైన వాటి గురించి యోచిస్తే, మనం పవిత్రులం అవుతాము. మన హృదయం సదా ప్రేమతో నిండి ఉంటే ద్వేషానికి అక్కడ తావులేదు. అప్పుడు మనలోని శాంతిని ఎవరూ భగ్నపరచలేరు. మనం అజాగ్రత్తగా వ్యవహరిస్తే మన స్వభావమే మారిపోగలదు. 


ఎవరి గురించైనా చెడు తలపు కలిగే ముందు ఆ చెడు మనలో ప్రవేశిస్తుంది. సాధువర్తనను కలిగి ఉంటే సాధుశీలురుగా అవుతాము. దాని గురించి యోచిస్తే, ఆ సాధుత్వం మనలో స్ఫూర్తిని  కలిగిస్తుంది. మనకు సరియైన త్రోవను చూపుతుంది. మన జీవితాన్నే మార్చివేస్తుంది.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: