21, అక్టోబర్ 2020, బుధవారం

భారత దేశం అంటే అర్థం

 💐💐💐భారత దేశం అంటే అర్థం ఏమిటి హిందువులు అంటే ఎవరు ?💐💐💐


        "ఒక చిన్న వ్యాసం" 


వీటిలో మనం తెలుసుకోవాల్సిన మొదటిది "జంబూ ద్వీపము".


  ఇప్పటికీ పూజ సంకల్పము లో ఈ పేరు ఉపయోగిస్తారు (అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే ★జంబూద్వీపే ★భరతవర్షే, ★భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, కృష్ణా-గోదావర్యోర్మధ్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు)...


 జంబూ అంటే "నేరేడు" పండు, ఈ దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చింది. (జంబు ద్వీపం వివరణ పోస్ట్ చివరలో ఉంది)


  ఆ తరువాత పేరు "★భారతదేశం" లేదా "★భరత వర్షం", ఈ పేరు నాటి రాజు పేరు మీదగా వచ్చినది, ఈ రాజు పేరు "భరతుడు". ఇతను విశ్వామిత్ర, మేనకల కుమార్తె అయిన శకుంతల యొక్క కుమారుడు.


 తరువాతి పేరు హిందూ దేశం, ఇది సింధునది పేరు మీదగా వచ్చినది, పూర్వపు పర్షియనులు, గ్రీకులు సింధునదికి ఆవల ఉన్న దేశం కనుక ఈ పేరుతో పిలిచారు.


 తరువాత హిందూదేశం యొక్క రూపాంతరం ఐన ఇండియా అనే పేరు, బ్రిటీషు వారి వలన ప్రముఖ ప్రాముఖ్యతను పొందినది, ప్రస్తుతము భారత దేశానికి రెండు ప్రభుత్వ గుర్తింపు పొందిన పేర్లు కలవు, అవి ఇండియా, భారత దేశం. 


ఇంకా హిందూస్తాన్ అనునది కూడా హిందూ దేశం యొక్క రూపాంతరమే!


ఇండియా:-

కొంత మంది INDIA అంటే independent nation declared in August అని అనుకుంటారు.. అది తప్పు. ఎలా??? 


  ఇండియా అనే పదం ఇండస్ (సింధు నది) నుండి వచ్చింది... మన దేశానికి బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా అనే కంపెనీ పేరు తో వచ్చారు కాబట్టి ఇండియా అనే పేరు ముందు నుండే ఉంది. ప్రత్యేకంగా ఆగస్ట్ లో స్వాతంత్రము వచ్చినందు వల్ల ఇండియా అనే పేరు రాలేదు...


ఈ ఆంగ్ల పదము, గ్రీకు పదమైన 'లాటిన్' ద్వారా ఇండియా.

  'బైజాంటియన్లో' సింధూనది కి ఆవల గల రాజ్యం. 

2500 సం!! క్రితం (హెరొడోటస్ పాలిటోనిక్) "ఇండియన్ లాండ్" 

అవెస్తన్ నుండి "హిందుస్" (సింధూ నదిని సూచిస్తుంది) 

దరాయిస్ 1 నుండి, సంస్కృతం నుండి సింధు (సింధూ నదిని సూచిస్తుంది). 


★భారతదేశము - హిందూస్థాన్ -హిందువులు:-


భా అనే శబ్దానికి అర్ధం నిరంతరం జ్ఞానం తో వెలిగే వాడు అని అర్ధం


 సంస్కృత పదమైన "భారత్", "భారత" అనే పదం నుండి ఉద్భవించింది.


  హైందవ గ్రంథాలలోనే హిందూ అనే శబ్దం లేదంటున్నారు. ఇది నిజం కాదు...


'హిందూ' అనే సంస్కృతం లో కూడా ఉంది...


  అతి ప్రాచీనమైన ఈ నామానికి మూలాధారం ఋగ్వేదమంత్రాలే అని కొందరు పరిశోధకులు నిరూపించారు... వేదంలో అనేక చోట్ల కనబడే " సప్తసింధు" శబ్ధంనుండి హిందూశబ్ధం పుట్టింది. 


  ప్రాకృతజనులు, పారశీకులు 'స'ను 'హ' గా అనడంలో "సప్తసింధు" అనేది "హప్త హిందు" అయి దాని సంక్షిప్త రూపం "హిందూ" అయిందని వివరించారు... 


'స' కారం 'హ' కారంగా మారటానికెన్నో పదాలు ఉదాహరణలున్నాయి. సప్త అనేది హప్తగా,కేసరి అనేది ప్రాచీన హిందీలో 'కేహరి' గా, సరస్వతి అనేది పర్షియాలో 'హరహ్వతి' గా, అసుర అనేది 'అహుర' గా అవుతుంది. 


 పర్షియన్ల ప్రాచీన అవెస్తా గ్రంథంలో "సప్తసింధువును" "హప్తహిందువు" గానే చెప్పారు.పర్షియన్లు వైదికార్యుల్ని "హిందువులు" అనే పిలిచేవారు. 


 హప్త హిందూ శబ్దానికి మూలమైన సప్తసింధువులు "ఇమం మే గంగే యమునే సరస్వతీ శుతుద్రీ స్తోమం సచతా పరుష్ణ్యా ఆశిక్న్యా మరుద్వృధే వితస్తయార్జీకీయే ఋణోహ్య సషోమయా " అనే ఋగ్వేదమంత్రంలో చెప్పబడ్డాయి...


  గంగ, యమున, శుతుద్రీ, మరుద్వృధ, ఆర్జీకీయ, సుషోమ అనే ఏడునదులు సప్తసింధువులు.ఈ సప్త సింధూ శబ్ధం"అష్టౌవ్యఖ్యత్ కుకుభ: పృథివ్యా స్త్రీ ధన్వయోజనా సప్తసింధూన " (1-35-8) వంటి అనేక ఋగ్మంత్రాలలో కనబడుతుంది.


  ఆ సప్త సింధు వాసులు సింధువులై క్రమంగా హిందువులైయ్యారు. బహుళప్రచారంలో ఉన్న భాషలన్నిటా పైరీతి హిందూశబ్ధమే గ్రహింపబడుట వలన అదే స్థిరమైంది. అలా హిందూశబ్ధం "సప్తసింధు "ద్వారానే స్థిరపడినా, లేక స్వతంత్ర శబ్ధంగానే ఏర్పడినా అది అతి ప్రాచీనము,అతి పవిత్రమైన శబ్ధము. దానికెన్నో వివరణలు ఉన్నాయి...


విష్ణు పురాణం (2.3.1)


"వర్షం" (దేశం) సముద్రానికి ఉత్తరాన ఉన్న, హిమములతో కూడిన పర్వతాలకు దక్షిణాన గల, దీనిని భారతం అని, ఇక్కడ భారత సంతతి నివసిస్తుంది."


వామన పురాణం (13: 1-15)

భరత వర్షం, జంబు ద్వీపం, ప్రస్తావన కనపడుతుంది


【కాస్త నిదానంగా చదివి, అర్ధం చేసుకోగలరు】


  మనుస్మృతి మరియు కొన్ని బౌద్ధధర్మ గ్రంథాలు, 'ఆర్యదేశ్' అనే పదము ఉపయోగంలో కానవస్తుంది. భారతదేశాన్ని 'ఆర్యవర్త', 'ఆర్యవర్తం' అని పిలువబడింది. తమిళ కవి తన కవితలో భారతదేశాన్ని ఆర్యనాడు అని సంబోధించాడు. 'ఆర్య' అనగా 'ఉన్నతుడు', 'దేశ' లేదా 'నాడు' అనగా ప్రాంతము.


  4000 సం!! క్రితం నాటి వృద్ధస్మృతిలో "హింసయా దూయతే యశ్చ - సదాచారతత్పర; వేదగో ప్రతిమాసేవీ - స హిందూ ముఖ వర్ణభాక్ " అనిచెప్పబడింది. దీనినిబట్టి హింసనుగూర్చి 

దు:ఖించేవాడు, సదాచార తత్పరుడు, వేదములు - గోవులు - దేవతాప్రతిమలనారాధించేవాడు "హిందువు" అని తెలుస్తుంది.


అలానే "హింసయా దూయతే చిత్తం - తేన హిందురితి స్మృత:" అని చెప్పడం వలన శారీరక,మానసిక, వాచిక త్రివిధ హింసల విషయమునను మనస్సు పరితాపం పొందువాడు హిందువు.


 ఈ హిందూ నిర్వచనాన్ని స్పష్టపరుస్తూనే ఆదికవి వాల్మీకి నుండి ఆదికావ్యం రామాయణం వెలువడింది. ఆ రామాయణమే "రామో విగ్రహవాన్ ధర్మ: "అనిపించుకున్న ధర్మస్వరూపుడైన రామునిచరిత్ర తెలియజేసింది. 


 బోయవాడు క్రౌంచపక్షిని బాధించుటచే బాధపడ్డ వాల్మీకి హృదయం నిజమైన ★హిందూ - హృదయం. అందుండి అప్రయత్నంగా వెలువడిన "మానిషాద"* అనే శ్లోకమే హిందూ హృదయానికి అద్దం పట్టే రామాయణ మూలకారణం.


2400 వ సం!!* క్రితం నాటిదే అయిన ★బార్హస్పత్య శాస్త్రంలో "హిమాలయం సమారభ్య - యావదిందుసరోవరం; తద్దేవ నిర్మితం దేశం - హిందుస్థానం ప్రచక్షతే " ఇక్కడ హిమాలయం నుండి హిందూమహాసముద్రం వరకు వ్యాపించింది. హిందూ భూమిగా చెప్పబడింది.ఈ హిందూ భూమి యందు నివసించువారు హిందువులని కూడా దీని ద్వారా గ్రహించవచ్చు. 


ఈ దేశం పరమాత్ముని సృష్టికి నాభివంటిది. అందువలన దీనికి "అజ నాభ" అనికూడా పేరు వచ్చింది.


★వృద్ధస్మృతిలో చెప్పినట్లే "మేరుతంత్రం"లో కూడా "హీనం చ దూషయత్యేవ హిందు రిత్యు చ్యతే ప్రియే" అని హీనతను దూషించేవాడే హిందువని పార్వతీదేవికి పరమశివుడు వివరిస్తాడు. 


కార్తవీర్యార్జునుడు సిద్ధిపొందిన మంత్రాలే ఈ "మేరుతంత్ర "గ్రంథం. 


11 వ శతాబ్దం నాటి ★పారిజాతాపహరణ నాటకంలో "హినస్తి తపసా పాపాన్ దైహికాన్ దుష్ట మానసాన్ ; హేతిభి: శతృవర్గశ్చ స హిందు రభిదీయతే " అని ఎవరు తన దేహ మనస్సంబంధమైన పాపాలను తపస్సుద్వారా నాశనం చేసుకొంటారో,శతృవులను ఖడ్గంతో అంతంచేస్తారో వారు హిందువులు అని చెప్పబడింది. 


హిందూ శబ్ద విశిష్టతను చాటే నిర్వచనాలలో 14వ శతాబ్ది నాటి ★మాధవ - దిగ్విజయంలో "ఓంకార మూల మంత్రాఢ్య - పునర్జన్మ దృఢాశయ" "గోభక్తో భారతగరు, హిందుర్హింసక దూషక:" అని చెప్పబడినది. ఓం కారాన్ని మూలమంత్రంగా భావించేవాడు, పునర్జన్మయందు విశ్వాసం కలవాడు,గో భక్తుడు, భారతమే గురుస్తానమైన వాడు, హింసను దూషించేవాడు *"హిందువు" అని చెప్పబడింది.


  హిందూ శబ్దం అనేక నిఘంటువులలో వివరింపబడినది.


★శబ్దకల్పదృమంలో " హీనం దూషయతి ఇతి హిందు:" జాతివిశేష: అని చెప్పుటవలన చెడును దూషించేవాడు హిందువని, హిందూ అనేది ఒక జాతి అని తెలుస్తుంది. అదే మన హిందూజాతి."


పృషోదరాదిత్వాత్సాధు:" అని రూపసాధన కూడా వివరింపబడింది.


 " హిందు: - హిందూ - హిందవ:" అని శంభుశబ్దమువలే ఉకారాంతంగా గ్రహించాలి అని ★మేదినీకోశం చెబుతుంది.


 "హిందుర్హిందుశ్చ సంసిద్ధౌ దుష్టానాం చ విధర్షణే " అని హిందువు దుష్టులను, చెడును,అంతం చేయడానికే ఏర్పడినాడని ★అద్భుతరూపకోశం చెబుతోంది.  


 హిందువనగా విష్ణువని, యోగి అనికూడా అర్థం. " హిందుర్హి నారాయణాది దేవతారక్త:" శ్రీ మన్నారాయణాది దేవతలయందు భక్తి కలవాడు హిందువని ★హేమంతకవికోశం చెబుతున్నది.


" హిందుర్దుష్టనృహాప్రోక్తా నార్యనీతి విదూషక: ; సద్ధర్మపాలకో విద్వాన్ - శ్రౌతధర్మపరాయణ: " అనగా దుష్టులను అంతమొందించు వాడు, దుష్టనీతిని నిరసించువాడు, ధర్మమును పాలించువాడు, విజ్ఞుడు, వేద ధర్మములను ఆచరించేవాడే హిందువని ★రామకోశం చెబుతుంది.


 బ్రహ్మాండపురాణంలో సూతుడు ప్రపంచములోని భూభాగములు, జలభాగముల గురించి ఇలా చెప్పాడు---


★సప్త - ద్వీపాలు: జంబు ద్వీపం లో దేశాలు (వర్షాలు): 


 ★స్వాయంభువమనువు కొడుకు ప్రియవ్రతుడు. ఈయనకు మొదటి భార్యవలన ఉత్తమ, తామస, రైవతులు జన్మించారు.రెండవ భార్య బర్హిష్మతి. ఈమెవలన అగ్నీధ్ర, ఇధ్మజహ్వ, యజ్ఞబాహు, మహావీర, హిరణ్యరేతస, గృహపుష్ఠ, సవన, మేధాతిధి, వీతిహోత్ర, కలి, ఊర్జస్వతీ, అనేవారు జన్మించారు.


★వీరిలో మహావీర, సవన, కలి అనేవారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు.స్వాయంభువ మనువు తన మనుమలలో ఏడుగురిని ఏడు ద్వీపములకు చక్రవర్తులను చేసెను. వారు తమ తమ సంతానానికి ఆయా ద్వీపాలను పంపకం చేయడం వలన అనేక రాజ్యాలు ఏర్పడినాయి. అలా ముందుగా వివిధ ద్వీపాలకు చక్రవర్తులైన మనువు మనుమలు.


★జంబూద్వీపం - అగ్నీంద్రుడు

ప్లక్షద్వీపం - మేధాతిథి

శాల్మలీద్వీపం - వపుష్మంతుడు

కుశద్వీపం - జ్యోతిష్మంతుడు

క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు

శాకద్వీపం - హవ్యుడు

పుష్కరద్వీపం - సేవనుడు.


జంబూద్వీపమ్:


జంబూద్వీపము 9 వర్షాలు లేదా భాగాలుగ విభజించబడినది. అవి


ఇలావృత (హిమాలయాలు మరియు టిబెట్ ప్రాంతము)


భధ్రవర్ష (హిమాలయాల తూర్పు ప్రాంతము) - తూర్పు


హరి (అరేబియా) - దక్షిణము


కేతుమాలం (ఇరాన్, టర్కీ ) పశ్చిమం


రమ్యక (రష్యా, సైబీరియా) ఉత్తరము


హిరణ్మయ (మంచూరియా) ఉత్తరము


కురు (మంగోలియా) ఉత్తరము


కింపురుష / కిన్నర (హిమాలయాల దక్షిణ ప్రాంతాలు) దక్షిణము


★భరత - వర్ష (★భారత -ఉపఖండము)

ఈ ద్వీపము చుట్టు లవణాంబుధి (ఉప్పు సముద్రం) యున్నది. 


ఈ ద్వీపంలో 6 పర్వతాలు: 


హిమాలయము, మేరు పర్వతము, నీలాచలము, హిమాచలము, శ్వేతాచలము, మాల్యవంతము, గంధమాదనము, వింధ్యపర్వతము.


తన తండ్రి ఆస్తిలో జంబూద్వీపానికి అగ్నీధ్రుడు అధికారి అయినాడు.ఈయనకు 9 మంది పిల్లలు కలిగి ఉన్నారు.


మొదటివాని పేరు అజ, ★అజనాభి, నాభి అని కంపిస్తుంది. మిగిలినవారి పేర్లను బట్టి కింపురుష, హరి, ఇలావృత, రమ్యక, హిరణ్మయి, కురు, భద్రాశ్వ, కేతుమాల వర్షాలు వచ్చినవి.అజ శబ్దమునుంచి ఆసియా వచ్చినది.


నేటికి కూడా మనదేశములో ఒక భాగాన్ని జమ్ము అనిపిలుస్తున్నాము.హిమాలయాలలో ప్రవహించే నదులకు టిబెట్ దేశస్థులిచ్చిన పేరు చివర సంపో లేక త్సంసో అనే శబ్దం కంపిస్తుంది. ఇది జంబూ శబ్దమే...


 నేను హిందువుని...

నా ధర్మం యొక్క గొప్పదనం నాకు తెలుసు...


నాకు ఇతర మతాల వారిని, విమర్శించాల్సిన అవసరం లేదు నా ధర్మం జోలికి రానంతవరకు.


నా ధర్మాన్ని విమర్శించేవారు అజ్ఞానులనే నా అభిప్రాయం...


నరాలు తెగి రక్తం చిందుతున్నా...

నా' గుండెచప్పుడు ఆగేవరకు గర్వంగా చెప్పగలను నేను హిందువునని...

కామెంట్‌లు లేవు: