21, అక్టోబర్ 2020, బుధవారం

సుభాషితం


👌నేటి మంచి మాట👌*🌹


"స్వచ్చమైన, నిర్మలమైన, పవిత్రమైన మనస్సు,ప్రేమ ఉన్న వారి సామీప్యం,సహచర్యం గొప్పది. "


        "స్వచ్ఛమైన, నిరాడంబరమైన ప్రేమ ముందు అహం నేలకూలుతుంది."


        "పరీక్ష సమయంలో మనం ధైర్యంగా ఉండాలి. ఓపిగ్గా ఉండాలి. కాలమే సమసదానం చెబుతుంది అప్పుడు అంతిమ విజయం మనదే మిత్రమా!"


భగవత్ బందువులందరికి శుభోదయం


🕉🙏🕉?

 *శుభోదయం*       

           

          *ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం మొండితనం రెండు కావాలి!*

          *మంచితనం మనుషుల మీద మొండితనం పరిస్ధితులమీద చూపించాలి!*


🌞🌅🌞🌅🌞🌅🌞?

💎 నేటి ఆణిముత్యం 💎*



మాట వదలిన నయ్యది మరల రాదు,

వదలి పెట్టిన యవకాశ మదియు రాదు;

రాదు విడచిన బాణంబు క్రమ్మరింప,

కాలమదికూడ రాదుగా గడచిపోవ



*భావము :*



పలికిన మాట, చేజేతులా వదలు కొన్న అవకాశం, వింటి నుండి విడిచిన బాణం తిరిగి రానట్లే, గడిచిన కాలం రాదు.


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ

🤠 నేటి సామెత 🌸*



*నువ్వు దంచు నేను బుజాలెగరేస్తాను*



వడ్లు నువ్వు దంచు, నేను దంచుతున్నట్లు అభినయిస్తూ భుజాలు ఎగరేస్తాను .పని నువ్వు చెయ్యి, నేను ఎగ్గొడతాను అనటం.

: *

🤘 నేటి సుభాషితం🤘*



*మేధస్సు యొక్క నిజమైన సంకేతం జ్ఞానం, కానీ కల్పన కాదు.*

కామెంట్‌లు లేవు: