21, అక్టోబర్ 2020, బుధవారం

శ్రీమ‌ణ‌వాళ‌మాముని తిరున‌క్ష‌త్ర‌ము*

  *శ్రీమ‌ణ‌వాళ‌మాముని తిరున‌క్ష‌త్ర‌ము*


క‌రుణావార‌ధి ర్జీయాత్ కాంత‌జామాతృసంయ‌మీ

ఆశీద్యేనాశ్వినీలోక: త‌మోఘ్నేనేచ్చ‌తా సుఖ‌మ్


త‌మ‌ను ఆశ్ర‌యించిన‌వారి అఙ్ఞాన‌ము తీర్చి వారికి మోక్ష‌మ‌నే ప‌ర‌మానందం క‌ల‌గాల‌ని ఎల్ల‌ప్పుడు ప్ర‌య‌త్నించే క‌రుణ‌ క‌ల‌వారైన‌ వ‌ర‌వ‌ర‌మునుల‌నే ఆచార్య‌ శ్రేష్టులు గొప్ప‌ వైభ‌వ‌ముతో ప్ర‌కాశించాలి


*రామానుజ సాంప్ర‌దాయ‌ములో ఎంద‌రో* *జీయ‌ర్లు ఉన్నా పెరియ‌జీయ‌ర్ గా* *మ‌మామునులు ప్ర‌సిద్దులు*

*రామానుజ‌ సిద్దాంత‌ము అతి సామాన్యుల‌కు*

*సైత‌ము అందాల‌ని వీరు ఎంతో క‌ృషి చేశారు*

*సాక్షాత్ శ్రీరంగ‌నాధులే వీరి శిష్యులైనారు*

*అంటే వీరి వైభ‌వ‌మెంత‌టిదో అర్ద‌మ‌వుతుంది*

*రామానుజులే మ‌ర‌లా మణ‌వాళ‌మామునిగా*

*అవ‌తరించారు అని వారి చ‌రిత్ర‌ మ‌న‌కి*

*తెలియజేస్తుంది*


*వైదిక‌ మ‌తానికి సంభందిచిన‌ ఏ* *సంప్ర‌దాయమువారైనా అనుసంధాన‌ము చేసే*

*మంగ‌ళం కోశ‌లేంద్రాయ‌ అంటూ* *ప్రారంభమయ్యే శ్రీరామ‌ మంగ‌ళాశాస‌న‌ము*

*అనుగ్ర‌హించిన‌ది మ‌ణ‌వాళ‌మామునులు*


*వారి తిరున‌క్ష‌త్ర‌ మ‌హోత్స‌వ‌ వేళ‌ దాసోహ‌ము*

*తెలుపుతూ......*


*జ‌య‌ శ్రీమన్నారాయ‌ణ*

*జ‌య‌ రామానుజ‌*

కామెంట్‌లు లేవు: