21, అక్టోబర్ 2020, బుధవారం

విద్యాతీర్థనివాసినీం

N Sastry: (3)విద్యాతీర్థనివాసినీం గిరిసుతాం విద్యాధరీం మంగలాం,

విద్యా భారతభారతీం హరసఖీం మన్త్రార్థసంవేదితామ్|

విద్యాయా:పరతత్వసారమఖిలం సంబోధయన్తీం నృణాం,

వన్దే శారదమాతరం శ్రుతినుతాం సర్వార్థసంపూరణీమ్ ||

భావం-విద్యాతీర్థనివాసిని అయినటువంటి, పర్వతరాజపుత్రి అయినటువంటి, అన్నివిద్యలకు నెలవు అయినటువంటి, మంగళకరమైనటువంటి, భారతవిద్యయందు భాసిల్లుచున్నటువంటి, శివునియొక్క పట్టపురాణి అయినటువంటి, మంత్రార్థముద్వారా తెలియబడేటటువంటి, విద్యయొక్కపరతత్వసారమునంతయు నరులకు బోధించేటటువంటి, వేదవినుత అయినటువంటి, సర్వార్థములను సిద్ధింపజేసేటటువంటి, శారదామాతను నమస్కరించుచున్నాను.

(4)విజ్ఞానామ్బుజసంస్థితాం కరతలే ప్రజ్ఞానకల్హారిణీం,

వేదారణ్యవిహారిణీం సురనుతాం వేదాటవీదీధితిమ్|

కైవల్యామృతదాయినీం భవసతీం శ్రీపీఠసంచారిణీం,

వన్దే శారదమాతరం శ్రుతినుతాం సర్వార్థసంపూరణీమ్ ||

భావం-విజ్ఞానమనే పద్మమునందు కూర్చున్నటువంటి, చేతిలో ప్రజ్ఞానరూపమైనకలువను ధరించినటువంటి, వేదారణ్యమందు విహరించేటటువంటి, దేవతలచేతస్తుతించబడే టటువంటి, వేదారణ్యమునందు వెలుగు అయినటువంటి, కైవల్యామృతమును ఇచ్చేటటువంటి, భవుని రాణిఅయినటువంటి, శ్రీపీఠమునందు సంచరించేటటువంటి,సర్వార్థములను సిద్ధింపజేసేటటువంటి, వేదవినుత అయినటువంటి, శారదామాతను నమస్కరించుచున్నాను.

కామెంట్‌లు లేవు: