🔱ఉత్తరకోసమంగై
మంగళనాధుడు🔱
పరమేశ్వరుడు ప్రధమంగా వెలసిన పుణ్యస్ధలం
ఉత్తరకోసమంగై.
ప్రాచీన కాల ఋషులు, యోగులు,
మహాత్ములు, సిధ్ధులు అందరు దర్శించి పూజించిన పురాతన ఆలయం. నవగ్రహాలు అవతరించడానికి ముందే
ఆవిర్భవించిన ఆలయంగా నాలుగు యుగాలకి ముందే వున్న ఆలయంగా ఈ ఆలయం ప్రసిధ్ధిపొందింది.
వేయి మంది శివ భక్తులు ఒకే సమయంలో మోక్షం పొంది సహస్రలింగోద్భవం జరిగిన పుణ్యక్షేత్రం యిది. ఇక్కడ 3000 సంవత్సరాలు గా పూవులు పూస్తూ కాయలు కాస్తున్న బదరీ వృక్షం ఈ ఆలయంలోనే వుంది.
దక్షిణేశ్వరా, సర్వేశ్వరా అని కీర్తించబడే మంగళనాధుడు ఈ ఆలయం మూలవిరాట్.
అత్యంత మహిమాన్వితమైన మరకత నటరాజస్వామి విగ్రహం యీ
ఆలయంలోనే వున్నది.
ఈ ఆలయం లోని అమ్మవారు మంగళనాయకిగా భక్తుల కోరికలు తీరుస్తున్నది.
ఉత్తరకోసమంగైలో వున్న శివలింగం స్వయంభూ లింగం, 3000 వేల సంవత్సరముల
నాటిదని నిర్ణయించబడింది.
ఈ ఆలయం
సుమారు 20 ఎకరాల సువిశాలస్ధలంలో వున్నది.
ప్రాచీన కాలంలో యీ ప్రాంతమంతా శివపురం, దక్షిణ
కైలాసం, చతుర్వేది మంగళం, ఇలందికై పళ్ళి, బదరికా క్షేత్రం , బ్రహ్మపురం,
వ్యాఘ్రపురం,
మంగళపురి,
బదరిశయన క్షేత్రం అనే పేర్ల తో పిలువబడినది.
ఇక్కడ వున్న శిలా శాసనాలలో రావణుని భార్య మండోదరి పేరు కనిపిస్తుంది.
ఈ ఆలయంలోని పంచలోహ నటరాజస్వామి వ్యత్యాసంగా దర్శనమిస్తాడు. ఈ విగ్రహంలో కుడి ప్రక్కన
పురుషులు చేసే తాండవం, ఎడమ ప్రక్కన ముగ్ధమనోహర స్త్రీ లావణ్యం రెండూ గోచరిస్తాయి.
ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, కుమారస్వామి దర్శనమిస్తారు.
ఈ ఆలయంలోని కుమారస్వామికి వాహనంగా ఏనుగు వున్నది.
కుమారస్వామికి ఇంద్రుడు తన ఐరావతాన్ని
యీ ఆలయంలోనే కానుకగా యిచ్చాడని ఈ స్ధల మహాత్య
చరిత్ర అయిన
'ఆది చిదంబర మహాత్యం' వివరిస్తున్నది.
రామేశ్వరం నుండి 83 కి.మీ దూరం లోను,
రామనాధపురం నుండి 18 కి.మీ దూరంలోను యీ ఆలయం వున్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి