6, మార్చి 2024, బుధవారం

మూడు ధాతువులు

 మానవశరీరం నందలి మూడు ధాతువులు గురించి సంపూర్ణ వివరణ  -


   మానిషి యొక్క శరీరం నందు ప్రధాన పాత్ర వహించునవి మూడు ధాతువులు అవి .


 1 . వాతం 2 .పిత్తం. 3 . శ్లేష్మం .


    మనిష్యుని యొక్క తల భాగం నుంచి రొమ్ము భాగం వరకు శ్లేష్మ సంబంధ శరీరం ఉండును.  రొమ్ము క్రింద నుంచి నడుము పైభాగం వరకు ఉండునది పిత్త శరీరం . నడుము క్రింద బాగం నుంచి పాదాల వరకు ఉండునది వాత శరీరం.  ప్రతి ఒక్కరిలోనూ ఇదే విధముగా ఉండును.  అవి తమయొక్క స్థానాన్ని దాటి ప్రకోపించినప్పుడు మనుష్యునికి ఆయా సంబంధ వ్యాధులు కలుగును. అనుభవం గల వైద్యుడు సరిగ్గా సమస్యని గుర్తెరిగి వైద్యం చేయవలెను .


      ఇప్పుడు ఈ మూడు ధాతువులు గురించి సంపూర్ణంగా వివరిస్తాను.


 *  వాతము - 


           కన్ను మూసి తెరవాలి అన్నను , ముక్కుతో శ్వాస పీల్చి వదలాలి అన్నను, కాళ్ళు చేతులు కదల్చాలన్న , రక్తం శరీరం అంతా ప్రవహించాలన్న , జీర్ణక్రియ సంపూర్ణంగా జరగాలన్నా వాయువు సహాయం కావలెను.  ఇక్కడ వాతమునకు మరొక పేరే వాయవు. శరీరంలో నాడుల ద్వారా ఈ క్రియలు అన్నియు జరుగును. ఎప్పుడైనా ఈ క్రియలలో ఆటంకం కలిగి నొప్పులు వచ్చాయి అంటే అది పూర్తిగా వాతసంబంధమైన సమస్యగా పరిగణించాలి.


            ఈ వాతం శారీరక క్రియలనే కాకుండా మానసిక క్రియలను కూడా ప్రభావితం చేస్తుంది. ఒక మనిషి అతిగా ఆలోచించడం మరియు పిచ్చిపట్టడానికి కూడా ఈ వాతమే కారణం. శరీరంలోని వాతం విపరీతంగా ప్రకోపించి తలకు ఎక్కినప్పుడు మనుష్యునికి పిచ్చిపట్టును. తీవ్రమైన భాధ, విచారం కలిగి ఉండును. ఆయుర్వేద గ్రంధాలలో వాతం యొక్క హెచ్చుతగ్గులు వలన కలిగే రోగాలను 80 రకాలుగా వివరించారు. వాటిని అశీతివాతాలు అంటారు.  ఈ వాత వ్యాధులను నయం చేయాలి అంటే నాడుల్లో ఉండే మాలిన్యాలను తొలగించే ఔషధ సేవన అత్యుత్తమం .


 *  పైత్యం -


           పిత్తమునే పైత్యంగా వ్యవహరిస్తారు .  మనము తీసుకున్న ఆహార పదార్ధాలు అన్ని జీర్ణం కావాలంటే వేడి అవసరం . దేహము నందు ఉండే మాలిన్యాలు అన్నింటిని బయటకు వెడలించుటకు కూడా వేడి అవసరం . శరీరం నందు ఉండు మాలిన్యాలను దహించుటకు కూడా పిత్తం ఎంతో అవసరం . ఈ పిత్తం దేహాన్ని చురుకుగా , చలాకీగా ఉంచుటకు కూడా అవసరం. దేహము యెక్క వేడి నందు హెచ్చుతగ్గులు కలిగినను , భాధలు కలిగినను పైత్యం యొక్క పరిమితిలో సమస్యలు మొదలు అయినవని గ్రహించాలి.


                 ఆకలి లేకున్నను , మితము తప్పిన ఆకలి ఉన్నను , మలమూత్రాదులు ఎక్కువ ఉన్నను, లేకున్నను , చెమట ఎక్కువ పోసినా , పొయ్యకున్నను అది పైత్య సంబంధ సమస్యగా గుర్తించాలి. పైత్యం అనగా అగ్నిసంభంధమైనది. దేహములో ఎక్కడైనను మంటలు పుట్టినాయి అంటే అది ఖచ్చితంగా పైత్య ప్రభావంగా  గుర్తుంచుకోవాలి. దేహంలో యే భాగమైనా కాంతి 

తగ్గినను, దేహంలో ఎక్కడైనా గడ్డకట్టినను జరిగింది అంటే అది పైత్యం తక్కువ కావడం వలన సంభవించిందిగా భావించాలి. దేహం పైన ఎక్కడైనా కురుపు లేచింది అంటే శరీరంలో పైత్యం పెరిగింది అని తెలుసుకోవలెను.  ఈ పైత్య వ్యాధుల నివారణ కొరకు శరీరంలో ఉండు వేడిలో హెచ్చుతగ్గులు లేకుండా సమస్థితిలో ఉండేలా చూసుకోవాలి.


 *  శ్లేష్మము  -


           మనము తినిన ఆహారం అంతయు జీర్ణావయవముల యందు వచనమై రసముగా మారును. ఈ రసముకే ఆంగ్లము నందు "లింఫ్ " అందురు. జీర్ణశయం నందలి కోట్లాదిగా వ్యాపించి ఉన్న శోషరసకేశ నాళికలు ద్వారా ఈ రసం స్వీకరించబడి శోషరస వాహికలలో చేరుచున్నది.దేహము నందు రక్తనాళాలు ఎట్లు వ్యాపించి ఉండునో ఈ శోషరస వాహికలు దేహమంతా వ్యాపించి ఉండును. ఈ రస వాహికలకు శ్లేష్మరస వాహికలు అని పేరు .


            మన శరీర కదిలికల వలన శరీరం నందలి అతిగా వేడి పుట్టకుండా కాపాడునది ఈ శ్లేష్మము  యంత్రం పనిచేయునప్పుడు యంత్రభాగాల యందు వేడి జనించకుండా కందెన ఎలా ఉపయోగపడునో అదేవిధంగా శ్లేష్మం పనిచేయును. శరీరం నందు శ్లేష్మం తక్కువైనచో శరీరభాగాలు తీవ్రవేడికి గురి అగును.  హెచ్చుతగ్గులు లేని శ్లేష్మం వలన శ్వాసనాళాలు సాఫీగా పనిచేయును .  శ్లేషం దేహమునకు సరిపోనంత ఉండిన నిరుత్సాహము , అలసట , నిస్తేజము వంటి మానసిక ఆందోళనలు యే కాక దేహము నందు వేడి , దేహము యొక్క చివరలు , పాదములు , చేతులు మంటలుగా ఉండటం, కండ్లు తిరుగుట, శోష, దప్పిక , గాబరా , దాహాము మొదలయిన దుర్గుణాలు కనిపించును.


           ఈ శ్లేష్మము దేహావసరాలకు మిగిలియున్నప్పుడు తరువాత వాడుకొనుటకు కొంతభాగం మేధముగా మారును . దీనినే కొవ్వు అనుదురు. ఈ మేధము ఉదరము నందు , రొమ్ముల యందు , పిరుదల యందు చేరి నిలువ ఉండును.  సరైన ఆహారం దొరకనప్పుడు , ఉపవాస సమయాల్లో ఈ కొవ్వుని శరీరం తన క్రియలకు ఉపయోగించుకొనును. ఈ శ్లేష్మం అధికమైనప్పుడు ముక్కునుంచి చీమిడి కారడం, కురుపు నుంచి వెలువడే చీము, పురుషుల్లో కలిగే శుక్లనష్టం, స్త్రీలలో వచ్చు తెల్లబట్ట, గడ్డలలో గట్టిగా ఉండు పదార్థం , మోకాలి సంధి యందు నొప్పి కలుగును.  


              కావున పైన చెప్పిన మూడు ధాతువులలో హెచ్చుతగ్గులు జరగకుండా మంచి ఆహారపు అలవాట్లు ఏర్పరుచుకోవాలి. 


 

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కామెంట్‌లు లేవు: