5, ఏప్రిల్ 2021, సోమవారం

సహనావవతు

 శుభమస్తు, శుభోదయం, మన పురాతన సుసాంప్రదాయ అఖండ భారతీయ సనాతన ధార్మిక చైతన్య స్రవంతి, సకల విశ్వ జీవరాశికి సంపూర్ణ నిత్య సత్య ఆరోగ్య మార్గదర్శక స్ఫూర్తి ! నేడది నిజ నిర్ధారణాత్మకమై, సత్య చైతన్య దార్శనిక స్వరూపమై, సకల విశ్వ వ్యాప్తమై భాసిల్లుతుండ, సకల ప్రాణులందు సత్వర రోగనిరోధక శక్తి ఇనుమడింపచేసెడి వివిధమైన, అమృతతుల్యమైన ఓషధులకాలవాలమైన మన భరతఖండంలో, హిమవత్పర్వత ప్రాంతాల పరిసరాలలో అనాదిగా అలరారుతున్న అనేకానేక రకాల, సకల ఆరోగ్య ప్రదాయక సంజీవినీ మూలికలు, సంపూర్ణ ఆరోగ్య ప్రదాతలుగ ప్రతి క్షణం, విశ్వ జీవరాశి సుఖసంతోషాలకు తోడ్పడడం మనకెంతో ఆనందకరమైన మహోన్నత విషయంగ సద్భావాన్ని పంచుకుంటూ, ఈ సువిశాల విశ్వంలోని సకల చరాచర జీవజాలం అందరూ సమైక్యంగ ఆ ఓషధీ పరిమళాన్ని ఆస్వాదించడానికి, సకల మానవాళి తమ వంతు సంపూర్ణ కృషి సల్పాల్సిన సమయం ఆసన్నమైందన్న సత్యాన్ని గ్రహించి, అందరికీ సకల ఓషధులు సంపూర్ణంగ, పుష్కలంగా సమకూరేలా నిత్య సుమైత్రీ చైతన్య స్ఫూర్తివంతమైన కృషి సల్పడం నేటి తక్షణ కర్తవ్యం !                                                           🙏" సహనావవతు ! సహ నౌ భునక్తు ! సహ వీర్యం కరవావహై ! తేజస్వి నావధీతమస్తు !మా విద్విషావహై ! "                                               🌹ఓం శాంతి శ్శాంతి శాంతిః !                                                                                           ✍️గుళ్లపల్లి ఆంజనేయులు

కామెంట్‌లు లేవు: