గుండె జబ్బులు= ఆయుర్వేద మందు - అర్జునరిష్ఠ
ఈ రోజుల్లో 50 సంవస్తరాలు దాటిన వారికి తరచూ చూస్తున్న ఆరోగ్య సమస్య గుండె జబ్బులు. విచిత్రం ఏమిటంటే స్త్రీలలో పురుషులకు లేని కొన్ని హార్మోనులు ఉంటాయి కాబట్టి వారికి గుండె జబ్బులు రాకుండా వారి శరీరమే వారిని కాపాడుతుంది. కానీ దురదృష్టం ఏమిటంటే ప్రస్తుతం మనం తీసుకునే కలుషిత ఆహరం వల్ల స్త్రీలు కూడా గుండె జబ్బుల బారిన తరచూ పడటం చూస్తున్నాం.
గుండె జబ్బు అనగానే మనం రోజు వేనేది .B,P, రక్త పోటు నిజానికి ఇది గుండెకు సంబందించిన వ్యాధి అని మనం అనుకుంటున్నాం కానీ రక్తపోటు ప్రతీ వారికి ఉంటుంది. దాని విలువలు ఎక్కువ అయితే దానిని Hypertension అని అంటారు ఇక్కడ మనం కొద్దిగా రక్త పోటు అంటే ఏమిటో తెలుసుకుంటే మనకు ఈ విషయం బోధ పడుతుంది. మన శరీరం లోని అన్నిఅవయవాలు వాటి వాటి నిర్ణిత పనులు చేయాలి అంటే వాటికి శక్తి కావలి. ఆ శక్తి రక్తం (మంచి రక్తం) ద్వారా వస్తుంది. అంటే శరీరంలో ప్రతి అణువు అణువు ఉత్తేజితం కావాలంటే అక్కడకు రక్తం సరఫరా కావలి. రక్తం సరఫరా కావలి అంటే రక్తాన్ని పంపు చేసే పరికరంకావలి ఆ పరికరమే గుండె. (ఇంకా వివరంగా వేరొక వ్యాసంలో విశదీకరించ ప్రయత్నిస్తాను) గుండె కొట్టుకోవటం వలన శరీరంలో రక్త ప్రసరణ జరుగుతుంది. రక్త పోటుని మనం కొలిస్తే అది 120/80 Hg అనే రీడింగ్ ఉంటే ఆ మనిషి పూర్తి ఆరోగ్య వంతుడు అని అనవచ్చు కాకుండా ఈ రీడింగ్ అంతకంటే తక్కువగా ఉంటే Low Blood pressure అని అదే ఈ రీడింగు చాలా ఎక్కువగా ఉంటే Hypertension అని అంటారు. ఇటువంటి అసామాన్య పరిస్థితుల్లో మనకు అనేక ఇబ్బందులు కలుగుతాయి తక్కువ pressure ఉంటే రక్తం శరీరానికి అందక ఇబ్బందులు వస్తాయి ఎక్కువ pressure ఉంటే రక్తనాళాలు ఆ వత్తిడికి లోనయి ఆవేశము, అసహనం, మొదలగు వాటితో మొదలై, పక్షవాతము, గుండె పోటు వరకు దారితీస్తాయి. కాబట్టి మనం ఎల్లప్పుడూ మన రక్త పోటును స్థిరంగా ఉంచుకోవాలి.
ఇతర గుండె సంబంధ వ్యాధులు: chest pain,cardiac problems like congestive heart failure, heart blockage, angina pectoris, myocardial infarction, ischemic cardiac myopathy, mitral regurgitation (which is a backflow of blood caused by the failure of the heart's mitral valve to close tightly) and asthma.
ఈ రోగాల పేర్లు మనం తరచూ వింటున్నాము. వీటిలో ఏ ఒక్క రోగం సోకినా లక్షలలో డాక్టర్లకి హాస్పెటళ్ళకి ఖర్చు చేయవలసి వస్తున్నది అన్నది కాదని ఎవరైనా చెప్పగలరా.
రక్తనాళాలలో కొవ్వు పేరుకొని పుడుకొని పొతే వారికి గుండె పోటు వస్తుందని గుండె పోటు వస్తే మనిషి అకస్మాత్తుగా చనిపోతాడని మనందరికీ తెలుసు. మన ఆధునిక వైద్యంలో రక్త నాళాలు పుడుకొని పోయిన వన్న విషయం నిర్ధారణ చేయటానికి Angiogram పరీక్ష చేస్తారు. దాని గూర్చి చుడండి
Angiograms are generally safe, complications occur less than 1% of the time. However, there are risks with any test. Bleeding, infection, and irregular heartbeat can occur. More serious complications, such as heart attack, stroke, and death can occur, but they are uncommon
అంటే Angiogram పరీక్షలో రోగికి పైన పేర్కొన్న రిస్కులు ఉంటాయి అన్నమాట. చూసారా సీరియస్ కంప్లైంట్ ఏమిటంటే heart attack, stroke, and death దీనిని బట్టి అది యెంత ప్రమాదకరమో తెలుస్తుంది.
ఇటువంటి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవటం మనకు అవసరమా ఒక్కసారి ఆలోచించండి మనకు ఆంగ్లంలో ఒక సామెత వున్నది (A stitch in time saves nine) అదేమంటే సరైన సమయంలో తీసుకొనే నిర్ణయం భవిష్యత్తులో జరిగే పెను ఆపదను తొలగిస్తుంది. ఇవ్వన్నీ నేను చెప్పటానికి కారణం ఇప్పుడు మనం ఒక విపత్కర పరిస్థితిలో వున్నాము అదే కలుషిత ఆహరం. మనం తినే అన్ని ఆహార పదార్ధాలు కూడా కలుషితమే. గొంగళిలో తింటూ వెంట్రుకలు వస్తున్నాయి అన్నట్లుగా వుంది ప్రస్తుత పరిస్థితి. మనకు సులభంగా ఆరోగ్య సంరక్షణ చేసుకోవటానికి మన మహర్షులు మనకు అందించిన దివ్య జ్ఞ్యానం ఆయుర్వేదం. నేను మీకు ఇప్పుడు ఒక చక్కటి ఆయుర్వేద మందుని తెలుపుతున్నాను. దానిపేరే అర్జునరిష్ట ఈ మందు మనకు సిరపు రూపంలో లభిస్తుంది.
అర్జునరిష్ట సిరపు 450 మిల్లి లీటర్ల పరిమాణము కలిగిం సీసాలలో లభిస్తుంది. అనేక ఆయుర్వేద కంపెనీలు ఈ మందుని తయారు చేస్తున్నాయి. మీకు పతంజలి మందు మిగిలిన వాటి కన్నా చవుకగా, నాణ్యంగా దొరుకుతుంది. ఏ కంపెనీ మందు వాడాలి అన్నది మీ నిర్ణయం.
అర్జునరిష్ట సిరపు ఎవరు యెట్లా వాడాలి: ఇది ద్రవ రూపంలో వున్న ఔషధము. దీనిని 50 సంవత్సరాలు నిండిన వారైనా లేక గుండె జబ్బుతో బాధ పడే వారు అందరు సురక్షితంగా ఉపయోగించ వచ్చు. దీని వాడకం వలన రక్త పోటు మొదలుకొని పైన పేర్కొన్న అన్నిరకాల రుగ్మతలతో బాధ పడే వారు వాడ వచ్చు. ఈ మందుని భోజనం చేసిన తరువాత సీసా మీద పేర్కొన్న డోసు ప్రకారము మీ మీ సమస్య తీవ్రత అనుసరించి తీసుకోవచ్చు . రక్తపోటు వున్న ప్రతి వారు తప్పక ఈ మందు సేవనం చేయాలనీ నేను సూచిస్తాను.
అర్జునరిష్ట సిరపు సైడ్ అవేక్ట్లు:: ఈ ముందుకి తీవ్రమైన దుష్పరిణామాలు ఏవి లేవు చాలా మటుకు సురక్షితం. అయినా కూడా ఎప్పుడు మోతాదు మించి ఏ మందు వాడ రాదు. కొన్ని సామాన్యు మైన దుష్ ఫలితాలు ఉండవచ్చు కానీ అవి పెద్దగా అపకారం చేయవు.
మిత్రులారా మీరు ఏ రకమైన గుండె జబ్బుతో బాధ పడుతున్నా తక్షణమే ఈ మందుని వాడండి. మీకు Bi pass surgery (బైపాస్ సర్జరీ ) చేయాలి లేకపోతె చనిపోతారు అని డాక్టర్లు సూచించిన రోగులకు కూడా ఈ మందు బాగా పనిచేస్తుందని నేను చెప్పటం కాదు వాడి మేరె నిర్దనించుకోండి. లక్షల రూపాయలు వెచ్చించి ఆపరేషనులు చేయించుకోవటం ముఖ్యమా లేక అతి తక్కువ ఖర్చుతో మీ ఇంట్లో ఉండి ఆరోగ్యం చేకూర్చుకోవటం ముఖ్యమా అన్నది మీ నిర్ణయానికే వదిలి వేస్తున్నాను.
గమనిక: తీవ్రమైన గుండె జబ్బులతో బాధ పడేవారు మంచి ఆయుర్వేద డాక్టరు సలహాతో ఔషధ సేవనం చేసి ఆరోగ్యవంతులు కాగలరు.
మరో ఔషధంతో మరల కలుద్దాము.
మీ
బుధజన విధేయుడు
భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి