17, ఆగస్టు 2024, శనివారం

దేవాలయాలు - పూజలు 13*

 *దేవాలయాలు - పూజలు 13*


సభ్యులకు నమస్కారములు.


గత వ్యాసాలలో తెలుసుకున్నాము దేవీ దేవతలకు దేవాలయాలలో గాని, గృహంలో గాని *నైవేద్యంగా* సమర్పించే ఆహార పదార్థాలు, ఫలాదులకు గూడా నిశ్చితమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది . దేవీ మరియు దేవతా మూర్తుల ప్రసన్నతకు ఆయా దేవతలకు అనుగుణ్యమైన ఆహార పదార్థాలను, ఫలాదులను *నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది*. 


ప్రసాదములలో దిగువ ఉదహరించిన విధంగా *నానావిధత్వము* గమనించ వచ్చును.

1) *గుడాన్న ప్రీతీ మానసా* :- బెల్లము మరియు అన్నము కల్సిన నైవేద్యము పట్ల కడు ప్రీతి గల్గిన దేవతలు.

2) *స్నిగ్దోన ప్రియా* :- స్నిగ్ధ అంటే తెలుపు. తెలుపుగా ఉండే అన్నము మరియు కొబ్బఱల మిశ్రమము గల నైవేద్యము పట్ల ప్రీతిగల దేవతా మూర్తులు. తెలుపు అంటే ప్రకాశము అని అర్థము గూడా కలదు.

3) *పాయసాన్న ప్రియ*:- క్షిరాన్నము = పాలు, శర్కర, అన్నము, మరియు ఇతర మధుర పదార్థాలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడిన నైవేద్యము పట్ల ఆసక్తిగల మూర్తులు.

4) *మధు ప్రీతా* తేనెతో సంయుక్తంగా నైవేద్యమును ప్రీతిగా స్వీకరించే దేవతలు. 

5) *దద్ధన్యాసక్త హృదయ* :- అన్నము మరియు పెరుగు మిశ్రమముల పట్ల హృదయము (వాంఛ) కల్గిన దేవతలు.

6) *ముద్గోదనాసక్త హృదయ* :- పెసలు మరియు అన్నము కల్గిన నైవేద్యము పట్ల ఆసక్తి చూపే దేవతలు.

7) *హరిద్రానైక రసికా* :- పసుపుతో కల్సిన అన్నముతో తయారు చేయబడిన నైవేద్యము పట్ల రసికత = రసజ్ఞత = అమిత ఇష్టము కల్గిన దేవతలు.

8) *సర్వోదన ప్రీతి చిత్త* :- అన్ని రకముల నైవేద్యముల పట్ల చిత్తము = మనసు = ప్రీతి = ఇష్టము గల దేవీ దేవతలు.


అయితే శుద్ధ సాత్విక 

గుణంగలపదార్థాలను

నైవేద్యంగా సమర్పించినవైతే మరింత శక్తిమయమైన ప్రసాదాలుగ మనంపొందగలం.


మనం సమర్పించే ధనకనక వస్తువిశేషాలన్నీ *ధర్మమర్థంచకామంచ*

ధర్మ మార్గమున సంపాదించిన ధనమును ఉపయోగించి కామితార్దపూజలకు వినియోగించిన దైవత్వం సంపూర్ణంగా నిండిపోతుంది. *ధర్మ మార్గాన సంపాదించిన ధనము వలన చేయబడిన దైవ కార్యాలు విశేష ఫలితాన్ని సమకూరుస్తాయి*.


ధన్యవాదములు

*(సశేషము)*

కామెంట్‌లు లేవు: