శు భో ద యం🙏
చమత్కార భాషణం!
ఏమీనన దాబేలన /
నాముంగిటి కేలరాడు నరహరి పిన్నా /
రాముని ముమ్మాఱంపితి/
బ్రేమంబున బుద్దిచెప్పి పిలువవె కలికీ /
-చాటుపద్య రత్నాకరము-చతుర్థ తరంగము 70 వ పద్యము.
ఒక గడుసు యువతి తన చెలికత్తెతో తనకోసం ప్రయత్నిస్తున్న గడుసు పిల్లవానికి పంపే సందేశం
"ఓ కలికీ!ఆ నరహరి వట్టి బేల పిన్నవాడు . నేనేమి అనను .నాముందుకెందుకు రాడు?ప్రేమతో బుద్ధి చెప్పి పిలుచుకొనిరా.
సరే ఈ సందేశము వదిలేద్దాము.
ఈ పద్యం లో దశావతారములు ఎలా సూచింప బడ్డాయో చూద్దాము
.
ఏమీనన, మీన/ తాబేలన, తాబేలు/ ముంగిటి* కిటి =వరాహము / నరహరి/పిన్న=వామన / రాముని ముమ్మాఱంపితి/ బుద్దిచెప్పి* బుద్ది/ కలికీ
"మత్స్యః కూర్మ వరాహశ్చ నారసింహాశ్చ వామనః
రామో రామశ్చ రామశ్చ బుద్ధ: కల్కి రేవచ"-
అని గదా దశావతారములు పేర్కొనబడినవి.
స్వస్తి!🙏🙏🌷🌷🌷🕉️🕉️🕉️🌷🕉️🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🕉️🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి