*వరలక్ష్మీదేవికి వందనమ్*
మ॥
దరహాసమ్మున దృక్కులూన్చి ప్రియభక్తశ్రేణి సంరక్షణా
స్థిరసంకల్పము లక్ష్యమై భువిని సుశ్శ్రేయమ్ము వాంఛించుచున్
వరలక్ష్మీ ప్రియరూపివై సిరుల నిర్వ్యాజమ్ముగా నిచ్చుచున్
వరలన్ శ్రావణమందు నైదువలు సంభావించి పూజింతురే!
చం॥
కలశములోన నిర్గుణముగా నిను భావన జేసి భక్తితో
లలితవిలాసహాససుమలాంఛనభాసితరూపరమ్యతామలవరలక్ష్మిగా స్తుతుల నర్చన జేయుచు వేడుకొంచు ని
న్నలరుల భూషణమ్ముల పదాబ్జపులత్తుక లోర్మి బుల్ముచున్
కలకలలాడు శ్రావణపుకౌర్ణ్యము నందున గొల్తు రైదువల్
కం॥
ఇరుగు పొరుగు మహిళామణు
లరుదెంచగ నీవుగ దలపందున గలుగన్
మరచిన దేహము నందున
నరమరికలు లేక వాయనాంబుల తోడన్
ఉ॥
గౌరవ మిచ్చుటే విమలకాంచనపుష్పము నీ పదమ్ములన్
స్మేరముఖమ్ములన్ నిలిపి జేసెడు పూజగు నైదువాళికిన్
భూరి వరమ్ము లీయగదె మోహము ద్రుంచుచు కోరి వచ్చుచున్
భారము నీదె యంచు నిను ప్రార్థన వేడెడు స్త్రీజనాళికిన్
మీ
*~శ్రీశర్మద*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి