✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️
శాంతి మంత్రం
✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️
*ఓం సహనావవతు | సహనౌ భునక్తు | సహవీర్యం కరవావహై!*
*తేజస్వీనావధీతమస్తు మా విద్విషావహై ||*
*ఓం శాంతిః శాంతిః శాంతిః॥*
*ఇది కఠోపనిషత్తు యొక్క శాంతి మంత్రం. గురు శిష్యులు ఇద్దరూ కలిసి విద్యారంభ సమయంలో చదివే మంత్రం. ఏ దోషాలు, విఘ్నాలు లేకుండా విద్యాభ్యాసన పూర్తవ్వాలని చేసే ప్రార్ధన. చాలామంది సహనా+భవతు అని చదువుతారు, కానీ అది సహన+అవతు.*
సహనౌ = మన ఇద్దరినీ;
అవతు = రక్షించు గాక;
సహనౌ = మన ఇద్దరినీ;
భునక్తు = పోషించు గాక:
సహ - కలిసి:
వీర్యం = ఊర్జాశక్తితో;
కరవావహై = పరిశ్రమిద్దాం గాక; అధీతం = స్వాధ్యాయం;
నౌ = మనకు;
తేజస్వి = తేజోవంతం;
అస్తు = అగుగాక;
మా విద్విషావహై = ద్వేషించుకొనకుండా ఉందుము గాక!!
*గురుశిష్యులైన మన ఇద్దరిని ఆ పరబ్రహ్మ రక్షించుగాకా! ఇద్దరినీ పోషించుగాకా! ఇద్దరమూ ఊర్జాశక్తితో పరిశ్రమిద్దాం గాకా! మన స్వాధ్యాయము (నేర్చుకునే విద్య) ఏకాగ్రమూ ఫలవంతమూ అగుగాకా! ఎన్నడు మనమిద్దరం పరస్పరం ద్వేషించుకొనకుండా ఉండెదము గాక..*
*ఓం శాంతిః శాంతిః శాంతిః!*
*సర్వే జనాః సుఖినోభవంతు!!*
*ఓం తత్సత్ !!!*
*తత్సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!!*
*ఓం నమః శివాయ!!!*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️
(*సంకలనం : భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*
☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి