23, మే 2024, గురువారం

శరభుడి జయంతి

 🎻🌹🙏నేడు శరభుడి జయంతి

పరమశివుడి మరో అవతారం శరభుడు...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿ఇది సాధారణంగా చాలామందికి తెలీదు.  శివుడి భీకర శక్తివంతమైన రూపం.చాలా మందికి సాధారణంగా తెలీని పరమశివుని మరో అవతారం శరభుడు. 


🌸ఇది విశ్వాన్ని రక్షించ డానికి శివుడు ధరించిన చాలా శక్తివంతమైన రూపంగా భావిస్తారు. 

ఆయన శరభేశ్వరుడిగా అవతారం ధరించి విష్ణుమూర్తి యొక్క కోప రూపమైన , సగం మానవుడు సగం సింహరూపమైన నరసింహ అవతారాన్ని నియంత్రించాడు.


🌿విష్ణుమూర్తి నరసింహ అవతారాన్ని తనకి ఎంతో ఇష్టమైన భక్తుడు ప్రహ్లాదుడుని రాక్షసుడైన , తండ్రి అయిన హిరణ్యకశిపుడి నుంచి రక్షించడానికి నృసింహ అవతారం ఎత్తాడు. 


🌸అతన్ని చంపిన నరసింహుడిలో ఆగ్రహ జ్వాలలు ఇంకా తగ్గలేదు, అదేపనిగా గాండ్రిస్తూ , ప్రపంచాన్ని మొత్తం భయంతో వణికించాడు. 


🌿దీని వల్ల జరిగే అనర్థాలను ముందే గ్రహించి , ఇతర దేవతలు, అధిదేవతలు మహాదేవుడి సాయం కోరగా , ఆయన శరభుడి అవతారం ధరించి కోపంలో ఉన్న నరసింహుడిని శాంతింపచేసి , మామూలు విష్ణురూపంలోకి మార్చాలని నిర్ణయించాడు.


🌷శరభుడిగా శివుడి రూపలక్షణాలు🌷


🌸శివుడి అవతారమైన శరభుడు మానవుడు, జంతువు మరియు పక్షి కలగలసిన అతిపెద్ద పరిమాణంలో ఒళ్ళంతా పొక్కులు కల రూపం. 

అనేక చేతులు, పంజాలు మరియు కాళ్ళు ఉండి దాదాపు పెద్ద డ్రాగన్ పక్షిలాగా ఉంటాడు. 


🌿అట్టలు కట్టిన జుట్టు ఆ రూపంలో చాలా కోపాన్ని సూచిస్తుంది. 

తలపై ఒక పెద్ద జుట్టుతో నిండిన భాగం డోమ్ లాగా కన్పిస్తుంది, శరీరానికి వెనకవైపు విచ్చుకుని ఉండే పెద్ద రెక్కలు మరియు పొడవైన తోక వీపుపై ఉంటాయి. 


🌸నోటిలో చాలా సూదిగా ఉండే దంతాలు, పటిష్టమైన పంజాలు ఆ రూప ముఖ్య ఆయుధాలు. 

ఉరుములాంటి గొంతు ప్రతిద్వనులు సృష్టిస్తూ అస్సలు వినలేము.

మూడు కళ్ళు నిప్పు కణితులవలె మండుతూ ఉంటాయి. 


🌿పళ్ళు మరియు పెదవులు స్పష్టంగా ఏర్పడి , కన్పిస్తాయి కూడా, మొత్తంగా అన్ని సమయాల్లో భరించలేని ఒక బుసకొట్టే శబ్దం వినిపిస్తూనే ఉంటుంది.


🌷పరమశివుని శరభావతారం కథ🌷


🌿మొదటగా శివుడు వీరభద్ర రూపం ధరించి నరసింహుడిని శాంతించ మని కోరాడు. 

కానీ నరసింహుడు మాట వినిపించుకోలేదు. 

అందుకని ఆకారంలో , శక్తిలో నరసింహుడిని మించిన శరభావతారాన్ని శివుడు ఎత్తాల్సి వచ్చింది.


🌸శరభుడు తన పొడవైన తోకతో నరసింహుడిని ఎత్తి పడేయబోయాడు...

నరసింహుడికి విషయం అర్థమై శరభుడిని క్షమించమని ప్రార్థించాడు...


🌿ఇది పరమశివుడికి నరసింహుడు విష్ణుమూర్తిగా మారిపోయాడని అర్థమై అతన్ని ఇక బాధించలేదు, శివుడి ఈ అవతారానికి గౌరవంగా నరసింహుడు తన సింహపు చర్మాన్ని వలసి శరభేశ్వరమూర్తికి కానుకగా సమర్పించాడు,  


🌸అలా పరమశివుడి శరభుడి అవతారం విష్ణుమూర్తి అవతారమైన నరసింహుడిని మామూలుగా మార్చింది, ఈ శివుడి అవతారాన్ని శరభేశ్వరుడిగా కొలుస్తారు.


🌿శివాలయాల్లో గర్భగుడికి ముందు రెండు శరభేశ్వరుడి విగ్రహాలను ప్రతిష్టించడం కూడా చూడవచ్చు..స్వస్తీ..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


ఓం నమః శివాయ నమః 🪷🙏🪷

భక్తి ముక్తి శైలు భవాని 🙏😊🪈🍊🍊🌸

కామెంట్‌లు లేవు: