1, ఆగస్టు 2020, శనివారం

సుఖసంతోషాలు,



నిరాశా వ్యాకులతలనే ద్వంద్వాలతో మన హృదయాన్ని కలతచెందనీయరాదు.

శారీరక శక్తులు కేంద్రీకరించబడి, ఏకాగ్రమైనప్పుడే ఒక వ్యక్తి ఉత్తమంగా ప్రయత్నించగలడు.

కానీ మనస్సు కేంద్రీకరింపబడకుండా శరీరం నిలకడ పొందదు.

 శరీరం గురించి ఆలోచించడం ద్వారా శరీరాన్ని నియంత్రించలేం.

ఉన్నతమైన విషయాలను ఆలోచించడం ద్వారా,
వాటిని శరీరానికి సమస్వయించడం ద్వారా మాత్రమే శరీరాన్ని నియంత్రించగలం.

మనశ్శరీరాల రెంటినీ ఈ పద్దతి ద్వారా ఏకం చేసి సమస్థితిని పొందవచ్చు.

 మనం జనసమూహంలో ఉన్నప్పుడూ,
ఒంటరిగా ఉన్నప్పుడూ,
అన్ని వేళలా ఈ సమత్వస్థితిని సాధన చేయాలి.

మనం అన్ని సమయాల్లోను పవిత్రత మరియు ప్రశాంత మనస్సును కలిగి ఉండాలి.

*శ్రీకృష్ణార్పణమస్తు*

కామెంట్‌లు లేవు: