1, ఆగస్టు 2020, శనివారం

పోత‌న త‌ల‌పులో-- (6)

నా,నేను అన్న భావ‌న‌ను వ‌దిలి, భాగ‌వ‌త‌ర‌చ‌న‌లో అడుగ‌డుగునా
స‌ర్వ‌స‌మ‌ర్ఫ‌ణ భావ‌న‌ను  ప‌లికించి తెలుగు జాతిని మేల్కొలిపిన మ‌హిత‌మూర్తి పోత‌న‌...

                                ***
పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ, నంభోయానపాత్రంబునన్
నెట్టం గల్గను, గాళిఁ గొల్వను, బురాణింపన్ దొరంకొంటి, మీఁ
దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నా కీవమ్మ యో! యమ్మ! మేల్
పట్టున్ నా కగుమమ్మ, నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ!

                             ****

త‌ల్లీ, సరస్వతీదేవి! నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను;  రెల్లుపొద‌లో పుట్టిన కుమార‌స్వామిని కాను ; పడవలో పుట్టిన వ్యాసుడను కాను; కాళీమాతను కొలిచిన కాళిదాసుని కాను (అంత‌టి గొప్ప వాడిని కాను);
కానీ త‌ల్లీ ! ఈ భాగవత రచన కు సంక‌ల్పించాను. నాకు త‌గినంత శ‌క్తిని ప్ర‌సాదించుత‌ల్లీ! బ్రాహ్మ‌ణీ
 దయామయీ!
  స‌ర్వం నీవై న‌డిపించుత‌ల్లీ , భారం అంతా నీదే, అని ద‌యామ‌యిపై భారం వేసి క‌లం క‌దిలించాడు పోత‌న‌. అంత‌టి భ‌క్తి క‌ల‌వాడు క‌నుకే అమ్మ ఆయ‌న చేత భాగ‌వతంలో 9 వేల కు పై బ‌డిన పద్యాల‌ను అల‌వోక‌గా ప‌లికించింది.

🏵️పోత‌నను స్మ‌రిద్దాం- తెలుగువారిగా త‌రిద్దాం🏵

కామెంట్‌లు లేవు: