1, ఆగస్టు 2020, శనివారం

రాత్రి ఆహారం

రాత్రి ఆహారం తీసుకోవడం మనేయవచ్చా

*మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి అంటే రోజూ మూడు పూటలా ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. అలాగే  నియమనుసారం, సమయానికి ఆహారం తినకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. రోజుకి మూడుసార్లు ఆహారానికి మధ్య తగినంత సమయం ఉంటుంది. ఉదయం పలహారనికి, రాత్రి భోజనానికి మధ్య చాలా విరామ సమయము ఉంటుంది. రాత్రి భోజనాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మళ్ళీ ఆహారం తినడానికి ఇంకా ఎక్కువ సమయం అవుతుంది. కారణంగా శరీరం తన శక్తిని కోల్పోయి బలహీన పడుతుంది. శరీర క్రియావ్యవస్థ పనిచేయడానికి కావలసిన శక్తి తగినంతగా శరీరానికి అందదు. అంతక ముందు కాలంలో ఎక్కువగా తిని పెంచిన కొవ్వు చర్మంలో, కాలేయంలో, శరీరంలో ఇతరభాగాల్లో నిలవ ఉంటుంది. అది మనం ఆహారం ఏమి తిననప్పుడు కరిగి శరీరానికి తాత్కాలికముగా బలాన్ని చేకూరుస్తుంది. కానీ అది కూడా శరీరాన్ని బాగా అలసిపోయేలా చేస్తుంది. అదే పనిగా మళ్ళీ మళ్ళీ సమయానికి ఆహారం తీసుకొనకపోతే ఆరోగ్యం దెబ్బతిని వివిధ రోగాలకు దారి తీస్తుంది.*

*సర్వేజనా సుఖినో భవంతు.... మీ ఆకొండి రామ మూర్తి....
*******************

కామెంట్‌లు లేవు: