*భగవద్గీత సంబంద 68 పుస్తకాలు ఒకేచోట ఉచితంగా తెలుగులో*
➖➖➖✍️
భగవద్గీత సరళ తెలుగులో http://bit.ly/Gita_1
భగవద్గీత http://bit.ly/Gita_2
భగవద్గీత-భగవాన్ ఉవాచ http://bit.ly/Gita__3
భగవద్గీత http://bit.ly/Gita_4
యథార్ధ గీత http://bit.ly/Gita_5
శ్రీమద్భగవద్గీత -శ్రీ శంకర భాష్యం యధాతదం-1,2 http://bit.ly/Gita_6
భగవద్గీత(మలయాళ స్వామి అనువాదం) http://bit.ly/Gita_7
గీతా సంహిత http://bit.ly/Gita_8
భగవద్గీత-అంతరార్ధ విశేషణాయత్నం http://bit.ly/Gita_9
గీతామృతం http://bit.ly/Gita_10
గీతా ప్రవచనములు http://bit.ly/Gita_11
జీవిత సాఫల్యానికి గీత చూపిన మార్గము http://bit.ly/Gita_12
గీతా సంగ్రహము http://bit.ly/Gita_13
గీతోపన్యాసములు http://bit.ly/Gita_14
గీతా ముచ్చట్లు http://bit.ly/Gita_15
గీతా భోధామృతము http://bit.ly/Gita_16
గీతా ప్రతిభ http://bit.ly/Gita_17
భగవద్గీతా పరిచయము http://bit.ly/Gita_18
భగవద్గీతా ప్రవేశము http://bit.ly/Gita_19
గీతా వ్యాసములు-2 http://bit.ly/Gita_20
గీతామృత సార సంగ్రహము http://bit.ly/Gita_21
స్థిత ప్రజ్ఞుడు - భక్తుడు http://bit.ly/Gita_22
గీతా వచనము http://bit.ly/Gita_23
భగవద్గీత -అర్జున విషాద,సాంఖ్య యోగం-వచన http://bit.ly/Gita_24
గీతారహస్యము http://bit.ly/Gita_25
గీతోపదేశతత్త్వము-1 http://bit.ly/Gita_26
శ్రీ కృష్ణుని గీతావాణి http://bit.ly/Gita_27
గీతామూలం http://bit.ly/Gita_28
భగవద్గీత భాష్యార్క ప్రకాశికానువాదము http://bit.ly/Gita_29
భగవద్గీతా మననము http://bit.ly/Gita_30
గీతా సామ్యవాద సిద్ధాంతం http://bit.ly/Gita_31
మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు http://bit.ly/Gita_32
నిత్య జీవితంలో భగవద్గీత http://bit.ly/Gita_33
గీతా హృదయము-జ్ఞానయోగం http://bit.ly/Gita_34
ప్రశ్నోత్తరీప్రవచన గీత http://bit.ly/Gita_35
గీతా శాస్త్రం http://bit.ly/Gita_36
గీతా తత్త్వవివేచనీ http://bit.ly/Gita_37
భగవద్గీత టీకా తాత్పర్య సహిత http://bit.ly/Gita_38
శ్రీగీతారాధన http://bit.ly/Gita_39
శ్రీమద్బగవద్గీత-1,2,3 http://bit.ly/Gita_40
జ్ఞానేశ్వరి-2,3 http://bit.ly/Gita_41
నీలకంఠీయ భగవద్గీతా భాష్యము http://bit.ly/Gita_42
గీతా యోగము http://bit.ly/Gita_43
గీతా భావార్ధ చంద్రిక http://bit.ly/Gita_44
భగవద్గీత విజ్ఞానదీపిక http://bit.ly/Gita_45
శ్రీ భగవద్గీత - గీతార్ధ దీపికా సహితము http://bit.ly/Gita_46
గీతామృతము http://bit.ly/Gita_47
వాసు దేవః సర్వం http://bit.ly/Gita_48
గీతా మాధుర్యం http://bit.ly/Gita_49
గీతా వచనము http://bit.ly/Gita_50
గీతా మహత్యం http://bit.ly/Gita_51
గీతా మాధుర్యము http://bit.ly/Gita_52
రెండు గీతలు భగవద్గీత-ఉత్తరగీత http://bit.ly/Gita_53
స్వస్వరూప సంధానము http://bit.ly/Gita_54
శత పత్రము-గీతా శాస్త్రము http://bit.ly/Gita_55
అనాసక్తి యోగం http://bit.ly/Gita_56
అమృతవాహిని-1 నుంచి 6 భాగాలు http://bit.ly/Gita_57
మదాంధ్ర భగవద్గీత-2 http://bit.ly/Gita_58
భగవద్గీత-పారాయణ http://bit.ly/Gita_59
ఆంధ్రీకృత భగవద్గీత http://bit.ly/Gita__60
మద్భగవద్గీతా మననము-పారాయణ http://bit.ly/Gita_61
భగవద్గీత - ఆంధ్ర పద్యానువాదము http://bit.ly/Gita_62
భగవద్గీత(పద్య) http://bit.ly/Gita_63
భగవద్గీత - గీతికలలో http://bit.ly/Gita_64
భగవద్గీత - పద్య కావ్యము http://bit.ly/Gita_65
భగవద్గీత - గేయ మాల http://bit.ly/Gita_66
భగవద్గీత - గేయ కృతి http://bit.ly/Gita_67
భగవద్గీత - బుర్రకథ http://bit.ly/Gita_68
భగవద్గీత పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి :pray:.
మరింత సమాచారం కోసం:
Website: www.freegurukul.org
Facebook: www.fb.com/free gurukul
*భగవత్గీతలో
పరిశీలించవలసిన అంశములు
*సంక్షిప్తంగా
ప్రశ్నలు-సమాధానాల రూపంలో
1).జీవితం యొక్క ముఖ్య ఉద్దేశ్యం?
- జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం జీవన రహస్యం తెలుసుకొనుట, ఏదైతే జనన మరణాల బంధనం ఉందో దాని నుండి ముక్తిని పొందుట అది తెలుసుకోవడమే ముఖ్యం మరియు మోక్షమునకు మార్గము.
2).జనన మరణ బంధం యొక్క ముక్తి ఎవరు?
-ఏదైతే జన్మ స్వయం ఆత్మను తెలుసుకొనెనో ఆదే ఆ జనన మరణ ముక్తి.
3).ఈ విశ్వమున మానవులకు సుఖము మరియు దుఃఖము ఎందులకు?
- స్వార్థము, భయము లాలాచము దు:ఖమునకు మూలకారణం.
4).పరమాత్మ దుఃఖమును ఎందుకు సృష్టించాడు? -పరమాత్ము ప్రపంచాన్ని సృష్టించాడు, మానవులు తమ ఆలోచన వ్యవహారముల వలన సుఖదుఃఖాలను తనంతట తానే సృష్టించుకున్నారు.
5).పరమాత్మ ఏమిటి ఎవరు అతని రూపం స్త్రీనా లేక పురుషుడా?
-కారణం లేకుండా కరణం ఉండదు ఈ కారణం యొక్క అస్తిత్వం ప్రమాణము నీవు ఉన్నావు అది ఉన్నది ఆ ఆధ్యాత్మిక కారణంతోనే పరమాత్మ పుడుతుంది.
6).సౌఖ్యం అంటే ఏమిటి? -ప్రతి కార్యవ్యవహారమునకు పరిమాణం ఉంటుంది ఆ పరిమాణం మంచిది అవ్వచ్చు కీడు కలిగించేది కూడా ఆవ వచ్చును ఆ పరిమాణమే సౌభాగ్యం అని చెప్పవచ్చు, నేటి ప్రయత్నం రేపటి సౌభాగ్యం అని అనవచ్చును.
7). ఈ విశ్వమున ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి?
- ప్రతి దినం వేలాది, లక్షలాది మంది ప్రజలు మరణిస్తూ ఉంటారు, ఆ మరణాలు అందరూ చూస్తూనే ఉంటారు, అయినప్పటికీ కూడా అనంత కాలం వరకు జీవించాలని కోరిక ఉంటుంది ఇదియే ఆశ్చర్యకరమైన విషయం.
8). ఏ విషయమును హరింప చేసుకుంటే మనుష్యుడు ధనికుడు అవుతాడు?
-లోభము.
9).జీవితాన్ని సుఖమయం చేసే మార్గం ఏమిటి?
- మంచి స్వభావము కలిగి ఉండటం జీవితం సుఖమయంనకు మంచి మార్గం.
10).ఏ విషయం కోల్పోతే మనిషి దుఃఖము లేకుండా ఉంటాడు?
క్రోధము( కోపము)
11). ఈ విశ్వమున ధర్మాన్ని మించిన పెద్ద విషయం ఏమిటి?
- దయ, కరుణ, జాలి.
12). ఏ విషయమును ఎదుటి వ్యక్తికి ఇవ్వకూడదు?
-మోసం, దగా
13).ఏ విషయము ఎదుటి వ్యక్తి దగ్గర తీసుకోకూడదు?
- గౌరవం,ఏదైనా పురస్కారము, మరియు పొగడ్త
14). ఈ విశ్వంనందు ఏ విషయంలో సకల జీవుల నుండి కొంత లబ్ది పొంద వచ్చును?
-అశాశ్వతమైన అజ్ఞానము వీడి శాశ్వతమైన పరిజ్ఞానం పొందుట.
15).ఈ ప్రపంచంలో ఓడిపోనటువంటిది?
-సత్యం, ధర్మం.
16).ఈ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్నటువంటిది, వ్యాపించునటువంటి విషయం? -అబద్ధము మరియు అసత్యం.
17).ఏదైనా ఇచ్చింది మరిచిపోవడం అంటే ఏమిటి? -పరోపకారం.
18.ఈ విశ్వంలో అత్యంత కీడు కలిగించే విషయం ఏమిటి? -మోహము,.
19).ఈ ప్రపంచంలో బంగారు కల?
-జీవితంను సాపల్యం చేసుకోవడం.
20).ఈ ప్రపంచంలో పరివర్తనం చెందని విషయం ఏమిటి?
-ఇచ్చిన మాట.
21).ఈ విషయమును తమంతట తమకు అర్థం కానిది, అర్థం చేసుకో లేనిది? -తనలో ఉన్న మూర్ఖత్వం.
22).ఈ ప్రపంచంలో నష్టం లేనిది, నాశనం లేనిది?
-ఆత్మ మరియు జ్ఞానము.
23).ఈ ప్రపంచంలో కోల్పోతే తిరిగి రానిది?
-సమయము.
కాలాన్ని నీవు నిర్లక్ష్యం చేస్తే, కాలం కూడా నిన్ను నిర్లక్ష్యం చేస్తుంది.
నీవు చేస్తున్న నిర్లక్ష్యం శత్రువు కన్నా ఎక్కువగా కీడు చేస్తుంది.
లోకంలో మరే ఇతర గ్రంధాలకి లేని విశిష్టత ఒక్క 'భగవద్గీత' కు మాత్రమే ఉంది.*
1) ఏమిటా విశిష్టత..?
అవతారమూర్తులు,మహర్షులు,మహానుభావులు జన్మించినప్పుడు వారివల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది.
ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞత గా వారి జన్మదినాన్ని 'జయంతి' గా జరుపుకుంటారు.
అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల 'గీతాజయంతి' ని జరుపుకుంటారు.
ప్రపంచం లో ఏ ఒక్క ఇతర గ్రంధానికి కూడా జయంతి లేదు.
2)ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం..?
సుమారు 5200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్వాణం సమీపిస్తున్న సమయంలో..
కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞనం తో ప్రవేశిస్తున్న తరుణంలో..
ఆ అజ్ఞనపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ..మానవజాతి పై వెలుగులు విరజిమ్ముతూ భగవద్గీత ఉదయించింది.
3) ఏముంటుంది ఈ భగవద్గీత లో..?
ఏది తెలిస్తే మానవుడికి ఇంక మరేదీ తెలియాల్సిన అవసరం లేదో...
ఏది ఆత్మ, పరమాత్మ ల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో..
ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకి నడిపించగలదో..
అదే ఉంటుంది.
నూనె రాస్తే రోగాలు పోతాయి..దయ్యాలు వదిలిపోతాయి లాంటి మూఢనమ్మకాలు ఉండవు.
నన్ను నమ్మనివాన్ని చంపండి అనే ఉన్మాదం ఉండదు.
నన్ను దేవుడిగా ఒప్పుకోనివాన్ని నరకంలో వేసి కాలుస్తా అనే పైశాచికత్వం ఉండదు.
4) భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితం పై ఆసక్తి పోతుందా..?
భగవద్గీత విన్న అర్జునుడు అడవులకి పోలేదు..
గాంఢీవాన్ని ధరించి కదనక్షేత్రానికి వెళ్లాడు.
భగవద్గీత కర్తవ్య విముఖుడు ఐనవాడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది.
5)భగవద్గీత శాస్త్రీయ గ్రంధమా..?
ప్రపంచం లో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీత ని కోట్ చేసినవాళ్ళే..
భగవద్గీత ని మొదటిసారి చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే..
6) ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీతే ప్రపంచం లో మొదటి స్థానం లో ఉండాలి కదా..
ఇతర మత గ్రంధాలు ముందు వరసలో ఉన్నాయని అంటున్నారు...?
కలియుగం లో అజ్ఞనానికి ఆదరణ ఎక్కువ ఉండటం సహజం.
విదేశీయుల్లా కత్తి పట్టుకుని,రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చేయలేదు.
బ్రిటిష్ వాళ్లు, మొహమ్మదీయులు మతవ్యాప్తి కోసం ప్రపంచం పై చేసిన దండయాత్రలు, తద్వారా జరిగిన విద్వంసం ..చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఉన్నాయి.
వారు కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశం పై దాడులు చేసి, దురాక్రమణలు చేసి, ప్రలోభపెట్టినా చేయలేని పనిని..
ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీత ని ప్రచారం చేయడం ద్వారా కొన్ని కోట్లమంది పాశ్చాత్యులని కృష్ణభక్తులుగా మార్చారు..
"ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగం తో పరుగులు తీస్తుందనడానికి ఇదే నిదర్శనం."
భగవద్గీతను ఎందుకు పఠించాలి?
బ్రహ్మరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని అంటారు. నిజమే! తలరాతను ఎవరూ మార్చుకోలేకపోవచ్చు. కానీ, గీతను చదివితే మాత్రం జీవనరేఖను దివ్యంగా దిద్దుకోవచ్చు. భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహసారం. ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే లోకం స్వర్గధామం అవుతుంది. అర్జునుడు యుద్ధంలోను, మనిషి జీవితంలోను గెలుపు కోసం చదవాల్సింది, నేర్చుకోవాల్సింది గీత నుంచే…భగవద్గీత అనగా….భగవంతునిచే గానం చేయబదినదని అర్థం. అంతే భగవంతుని చేత చెప్పబడింది. ప్రపంచ సాహిత్యంలోనే భగవద్గీతను మించిన గ్రంథం లేదు. భగవత్ తత్వము, భగవంతుడిని చేరే మార్గాలు, మనిషి పరమపదాన్ని పొందడానికి ఆచరించే మార్గాలు తదితర విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. గీతలోని 18 అధ్యాయాలు మోక్ష సౌధానికి చేర్చే 18 సోపానాలని వేదాంత కోవిదులు చెబుతారు. ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత ఈ మూడింటినీ కలిసి ‘ప్రస్థాన త్రయం’ అంటారు. ప్రాస్థానం అనగా ప్రయాణం. మనిషి పరమపద ప్రయాణానికి కావలిసిన సాధన సంపత్తుల గురించి, నేర్చుకోవాల్సిన జ్ఞానం గురించివీటిలో పుష్కలంగా ఉంది. నేటి మానసిక నిపుణులు వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీతను మించిన పాఠం లేదని అంటున్నారు.
లోకంలో ఉన్న సర్వ విషయాలు గీతలో ఉన్నాయి. ఇందులో లేనివి బయట మరెక్కడా లేవు. ఉపనిషత్తులు వేదాలలో ఒక భాగామ్. ఇవి 108 వరకు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు వ్యాస మహర్షిచే క్రోడీకరింపబడి 555 సూత్రాలుగా రూపొందించబడ్డాయి. భగవద్గీతలో సర్వ ఉపనిషత్తుల సారం 700 శ్లోకములలో నిక్షిప్తమై ఉంది. అందుకే దీనిని ‘మోక్ష సప్తసతి’ అని కూడా అంటారు. ఉపనిషత్తులను చదవాలి. బ్రహ్మసూత్రాలను మననం చేయాలి. భగవద్గీతను నిత్య జీవితంలో ఆచరించాలి. భగవద్గీత వేదాంత విషయాలు, వేదాంత రహస్యాలు, పరమ పదాన్ని చేరే ఉపాయాలు ఉన్నాయి కాబట్టి సన్యాసం స్వీకరించిన మోక్షగాములకు, వయసు మళ్ళినవారికి ఉపయోగపడే గ్రంథమనే అభిప్రాయం చాలమందిలో పాతుకుపోయింది. కానీ, ఇది నిజం కాదు. గీత ప్రపంచంలోని అన్ని విషయాలను చర్చిస్తుంది. ఇది స్పృశించని అంశమంటూ లేదు. అందుకే ఇది ప్రపంచంలోనే మకుటాయమానమైన సాహిత్య ఉద్గ్రంథం. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస నిపుణులు భగవద్గీతను ఆధారం చేసుకునే నేటి యువతకు శిక్షణ ఇస్తున్నారు.
గీతలో దైనందిన జీవితంలో సత్ప్రవర్తనతో ఎలా మెలగాలి? సన్మార్గాన ఎలా నడవాలి? సుఖశాంతులతో ఆత్మానుభూతిని పొంది, లోక కల్యాణానికి ఎలా పాటుపడాలి అనే పలు విషయాలు పొందుపరచబడ్డాయి. అందుకే భగవద్గీత కేవలం ‘పారాయణ గ్రంథం’ కాదు, ‘అనుష్టాన గ్రంథం’ (అంటే నిత్యం చదివి అందులోని అంశాలను ఆచరించదగ్గది). భగవద్గీత కేవలం వేదాంత గ్రంథం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యశాస్త్రం, ఆహారవిజ్ఞానశాస్త్రం, నైతికధార్మిక శాస్త్రం. ఇవన్నీ కలిపి మనిషి నిత్య జీవన శాస్త్రం. మనిషి జీవితానికి సంబంధించి అన్ని విషయాలను ఇది చర్చించింది. అందువల్లే భగవద్గీతను ‘మానవ జీవిత సంపూర్ణ సౌర సంగ్రహం’ అని అన్నారు. గీతలోని ఉపదేశాలను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆచరిస్తే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. భగవద్గీతలో ముఖ్యంగా ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమై ఉన్న ప్రకృతి గుణాలైన సత్వ, రాజ, స్తమములను నిత్య జీవితంలో జయించడం, ద్వంద్వాములను నిగ్రహించడం, సదాచారం, సమబుద్ధి, సత్ప్రవర్తన పెంపొందించుకోవడం, సత్వగుణాలను అలవర్చుకోవడం, నిష్కామ కర్మానుష్టానం ద్వారా ఉత్తమ స్థితికి చేరుకోవడం, సాత్విక ఆహార నియమాలను పాటించడం, రాజసిక, తామసిక పదార్థాలను విసర్జించడం, ధ్యాన యోగ సాధన ద్వారా నిరంతర దైవచింతన, జ్ఞానాన్ని పొందగోరువారు పాటించాల్సిన నియమాలు, ప్రతి ప్రాణిలో భగవంతుడిని చూడగలగడం….ఇంకా ఎన్నో విషయాలు విపులీకరించి ఉన్నాయి. వాటిని తెలుసుకుని ఆచరించిన మనిషి మహనీయుడు అవుతాడు.ప్రస్తుత మానవ జీవితమ పూర్తిగా భౌతిక దృక్పథానికే పరిమితమైంది. స్వార్థమే పరమావధిగా తలుస్తూ, మనశ్శాంతి లేక కాలం గడుపుతున్నాడు. ఈ దృక్పథం మారాలంటే, మనసులో గూడు కట్టుకున్న స్వార్థం పోవాలంటే, నిత్య జీవితంలో మనశ్శాంతితో బతకాలంటే ఆధ్యాత్మిక చింతన కావాలి. అటువంటి మార్పు కోరుకునేవారు తమ దైనందిన వ్యవహారాల్లో ‘గీత’కూ చోటు కల్పించాలి. అప్పుడు స్వీయాభివృద్ధితో పాటు సమాజభివృద్ధి ఎలా సాధ్యామవుతుందో ప్రతి ఒక్కరూ అనుభవం మీద తెలుసుకోవచ్చు.
మార్గశీర్ష శుద్ధ ఏకాదశి. పరమ పావనమైన గీతాజయంతి. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకొని సర్వ జగత్తుకూ ఉపదేశించినటువంటి బ్రహ్మవిద్యా శాస్త్రం భగవద్గీత. అది ఈరోజున ఉపదేశించారు అని సంప్రదాయం చెప్తూన్నది. దాని ప్రకారంగా ఈ పవిత్రమైన ఏకాదశిని గీతాజయంతి అని వ్యవహరించడం జరుగుతున్నది. మానవజీవితంలో ప్రతి దశలోనూ ప్రతి సమస్యకీ పరిష్కారం చెప్పగలిగే గ్రంథం భగవద్గీత. ఎవరితో ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తిస్తే మనం ఈ జీవితాన్ని సార్థక పరచుకోగలం? చిట్టచివరికి జీవన పరమార్థమైన కైవల్యాన్ని పొందగలమో చెప్తున్న గ్రంథమిది.
ముందుగా "అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే" అని మొదలౌతుంది. అశోచ్యానన్వ శోచస్త్వం అంటే దుఃఖించ గూడని వాటి కోసం దుఃఖించకు అని మొదలు పెడుతున్నది. అంటే ఆనందంగా ఉండు, దుఃఖపడకు అనేది ప్రధమ వాక్యం కృష్ణ బోధలో. మళ్ళీ చిట్టచివరికి
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ!
అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః!!
అన్నాడు. దుఃఖపడకు అనేది చివరి వాక్యం. మొదట దేని గురించి దుఃఖ పడకూదదో దాని గురించి దుఃఖపడకు అని. చిట్టచివరికి దుఃఖపడకు, శోకించకు అని చెప్తున్నాడు. అంటే గీతయొక్క పరమార్థం శోకనాశనం, దుఃఖనాశనం. సృష్టిలో ఎవరైనా కోరుకొనేది అదే. దుఃఖం లేకుండా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అటువంటి పరమానందం అంటే ఏమిటో తెలియజేస్తూ అజ్ఞాన జనితమైన సర్వ శోకాలనీ నశింప చేయడం కోసమే భగవద్గీత పుట్టింది. అందుకే మొదటి వాక్యం చివరి వాక్యం రెండూ కూడా మనలో ఉన్నటువంటి సర్వ దోషాలనీ దుఃఖాలనీ పోగొట్టి పరమానంద జ్ఞానాన్ని ప్రసాదించడమే లక్ష్యమని తేటపరుస్తున్నది.
మార్గ శిర శుద్ధ ఏకాదశినాడు కురుక్షేత్ర సమర ప్రాంగణంలో యదుకుల కృష్ణుడు కురుకుల అర్జునునికి సకల వేదసారమైన ఉపనిషత్ రూపమైన గీతను బోధించాడన్నది తరతరాల విశ్వాసం. భగవంతుడు బోధించిన గీత భగవద్గీత. అందువల్ల మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి.
భగవత్గీత ని వివిధ భాషల్లో కి అనువాదం చేసినది ఎవరు??
పోస్ట్ చివరి దాకా చదవండి మీకోక షాక్ తగులుతుంది
భగవత్గీత ని ఉర్దూ లోకి అనువదించిన వ్యక్తి
మొహమ్మద్ మెహరుల్లా (హిందూ ధర్మం స్వీకరించారు)
అరబిక్ లోకి అనువదించిన వ్యక్తి ఈ.ఎల్.ప్యాచ్ కమండో(ఇస్కాన్ లో చేరిపోయారు)
ఇంగ్లీష్ లోకి అనువదించిన వ్యక్తి
చార్లెస్ విల్కినోస్
"సనాతన ధర్మం ఒక్కటే ఈ ప్రపంచంలో సర్వైవ్ అవ్వగలదు" అని అన్నారు
బ్రెజిల్ లోకి అనువాదం చేసిన వ్యక్తి
బ్రాకెట్స్ లోవి వాళ్ళ ఒరిజినల్ పేర్లు హృదయనంద గోస్వామి( హోవార్డ్ జె. రేనిస్క్) అలానే నలుగురు భక్తులతో కలిసి చేసాడు
మహాకాళ దాస( లిమా మరికొ పొమ్బో)
లోకసాక్షి దాస (లుకో వలేర)
ఆరాధ్య దాస(కార్లోస్ ఫెర్నాండెస్ అమరో)
ఈశ్వర దాస(ఎనియస్ గువెర్రియో)
రష్యన్ లోకి అనువదించిన వ్యక్తి నోవికోవ్(కృష్ణ భక్తుడు ఐపోయాడు)
ఇప్పుడు ప్రపంచంలో వేరు వేరు భాషల్లోకి చేసిన వారి పేర్లు తెలుసుకుందాం
హీబ్రు లోకి అనువాదం చేసినవారు (ఈయన ఇశ్రాయేలీయుడు) బేజాషుటోన్ లీ ఫనా
జర్మన్ లోకి అనువాదించిన వ్యక్తి
ఫిడెరిక్ మేయర్
పర్షియన్ లోకి అనువదించిన వ్యక్తి
దారా షికోహ్
చైనీస్ లోకి అనువాదం చేసిన వారు
జెన్ కెము,జోవ గువోహ్వ ఇద్దరితో జి బిజూహాంగ్
అలానే హువాంగ్ బావోషేంగ్ తో మరో నలుగురు
గువో లియాంగన్,లీ నాన్,జి వెయిజన్,డ్యూయన్ కీన్గ్ ఒక కమిటీ లాగా ఏర్పడి అనువాదం చేశారు
స్పానిష్ లోకి అనువాదం చేసిన వారు హార్మోన్డ్స్ వర్త్, రైడర్&కో
జనపనీస్ లోకి అనువాదం చేసిన వ్యక్తి
సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ ఒక జపనీస్ మహిళ ని వివాహం చేసుకుని ఆ భాష లోకి అనువాదం చేశారు
లాటిన్ లోకి అనువాదం చేసిన వ్యక్తి
ఆగస్టు విల్హేమ్
ఫ్రెంచ్ లోకి అనువాదం చేసినది
పర్రాడ్
గ్రీకు లోకి అనువాదం చేసినది
జార్జ్ కె. టైపాల్ దాస్
ఇప్పటి వరకు మన భగవత్గీత ని 230 భాషల్లో మేధావులు అనువదించారు వాళ్ళల్లో
58 బెంగాలీ
44 ఇంగ్లీష్
12 జెర్మన్
4 రష్యన్
4 ఫ్రెంచ్
13 స్పానిష్
5 అరబిక్
3 ఉర్దూ అలానే మరెన్నో భాషల లోకి అనువాదాలు ఉన్నాయి
చివరి ట్విస్ట్
ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఖురాన్ ని
బెంగాలీ లోకి అనువదించినది గిరీష్ చంద్రసేన్....కానీ ఆయన ముస్లిం అవ్వలేదు హిందూ గానే కొనసాగుతున్నారు 😜😝
హిందూ ధర్మ చక్రం
*ఓం శ్రీ కృష్ణ పరమాత్మయే నమ:
Telegram: http://t.me/freegurukul
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి