12, డిసెంబర్ 2024, గురువారం

*శ్రీ కాళహస్తీశ్వర శతకము - 116*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


 నేటితో శ్రీ కాళహస్తీశ్వర *శతకము పూర్తి అయినది* ...

.

  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏


*దంతంబుల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే*

*కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు గానప్పుడే*

*వింతల్మేన జరింపనప్పుడే కురుల్వెల్వెల్ల గానప్పుడే*

*చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!!!*


         *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 116*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఇంకా పండ్లు ఊడిపోకమునుపే, శరీరములో సత్త్వము ఉన్నపుడే, స్త్రీలు ముదిమివల్ల తమను అసహ్యించుకోక మునుపే, (అనగా అన్నిపనులు చేయుటకు శక్తి నశింపకముందే) ముదిమి మీదపడక ముందే, తనువులో వింతలు ( క్రొత్త రోగములుచేత శరీరములో చాల మార్పులు రాకముందే) పుట్టకముందే నీపాదపద్మములను ధ్యానించి తరించు మార్గము నన్వేషింపవలెను. ముదుసలితనము వచ్చిన తరువాత ఏ పని చేయుదమన్నను శరీరము సహకరించదు గావున ముందే జాగ్రత్తగలవాడై మానవుడు ప్రవర్తింపవలెను. శ్రీకాళహస్తీశ్వరా!*


✍️🌷🌹🌺🙏

కామెంట్‌లు లేవు: