21, ఆగస్టు 2020, శుక్రవారం

శ్రీనృసింహ శతకము

శ్రీనృసింహాష్టోత్తర శత నామాంచిత శ్రీ యాదాద్రి శ్రీనృసింహ శతకమునందలి 104వ పద్యము.

104. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
మత్తహంసినీ వృత్త గర్భ సీసము.

ఎన్ని కను మురారి! నిన్నే విభుఁడుగా ను - తింతు,  రా, మదిలోన శాంతి నిల్ప.

సాకఁగను పరాకు నీకేల ప్రవరుండ! - కావఁగా కష్టమా కామితప్రద!

పుణ్యులును, నరోత్తముల్ జీవనము నీవె - యందురే, వినవేమి? సుందరాంగ!

రాక్షసారి! పరాత్పరా! నీవె ప్రభవంబుఁ - గొల్పరా! తీర్చరా కోరికలను.

గీ. మత్తహంసిని గర్భ సన్మహిత సీస

సచ్చిదానంద విగ్రహా! సన్నుతులయ!

భక్త జన పోష! భవశోష! పాపనాశ!

శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!

104వ సీస గర్భస్థ మత్తహంసినీ వృత్తము

(జ త స జ గ .. యతి 7)
 
మురారి! నిన్నే విభుఁడుగా నుతింతురా.

పరాకు నీకేల ప్రవరుండ! కావఁగా.

నరోత్తముల్ జీవనము నీవె యందురే!

పరాత్పరా! నీవె ప్రభవంబుఁ గొల్పరా!

ఈ పద్యమును హృద్యముగా ఆలపించిన బ్రహ్మశ్రీ ఏల్చూరి రామబ్రహ్మానందరావు గారికి ధన్యవాదములు.

సద్విధేయుఁడు
చింతా రామకృష్ణారావు.

కామెంట్‌లు లేవు: