12, మే 2024, ఆదివారం

వాణీ వైభవం

 శు భో ద యం🙏

వాణీ వైభవం!

రమణీయాక్షసరాకృతిం బొలుచు వర్ణశ్రేణి

   వీణానులా/

పముచేతం గరగించి యందు నిజబింబం

   బొప్ప నచ్ఛామృత/

త్వము ఆత్మప్రతిపాదకత్వమును దద్వర్ణాళి

   యం డెల్ల బూ/

ర్ణము గావించిన వాణి తిర్మలమహారాయోక్తి

   బొల్చున్ కృపన్! వసు 1-4

అద్భుతమైన సరస్వతీ స్తుతి.

అమ్మ వీణ వాయిస్తున్నది. ఆ నాదము (అనులాపము) వల్ల ఆమె చేతిలో గల అక్షసరము లోని వర్ణములు కరిగినవి.

సరస్వతి అక్షమాల పట్టుకొనును. అక్షమాల స్ఫటికము(తెల్లని రాయి) చేత చేసిన తెల్లని పూసల దండ. అక్షమాల అనగా మరియొక అర్థము 'అ' నుండి 'క్ష' వరకు గల అక్షర సమూహము

ఈ పూసల ఆకృతిలోగల అక్షరములు (అక్షసరాకృతిం బొలుచు వర్ణశ్రేణి) వీణానాదములోని మాధుర్యమునకు కరిగినవి. ద్రవమైనవి. అవి స్ఫటికమునకు సంబంధించినవగుటచే తెల్లని పారదర్శకమైన ద్రవమైనవి.ఈ ద్రవమేమి? నాదమాధుర్యమున కరిగిన వర్ణములు. కరిగిన వర్ణముల అంతరమందు గల నాదసుధ. వెరసి సంగీతసాహిత్యముల మేళనము. ఇక్కడ ప్రత్యేకముగా సాహిత్యాంతర్గత సంగీతము. ఆద్రవములోనికి అమ్మ చూచినది. దేవి శుద్ధ ధవళ స్వరూపము దానిలో ప్రతిబింబించినది.అనగా సాహిత్యాంతగతసంగీత సమ్మేళనాకృతి సరస్వతి ఆత్మ స్వరూపమైనది. ఆశుద్ధస్వరూపము తన ప్రభువైన తిరుమలరాయని వాక్కులో వర్తించు గాక (బొల్చున్ కృపన్) అంటున్నాడు భట్టుమూర్తి.

భంగ్యంతరంగా తన కవిత్వమున సంగీత స్వరూపము సాహిత్యమునందున మమైకమై సరస్వతీస్వరూపముగనలరారునని సూచించుచున్నాడు.

ఆంధ్రసాహిత్యమున అందమైన సరస్వతీ స్తుతులలో ముందువరుసలో నిలుచు స్తుతి ఇది.

సాహిత్యార్ధము సూర్యగణపతుల వారు!

ఆధ్యాత్మాకార్ధం గురువు గారు శ్రీ చిర్రావూరు వారు

రమణీయాక్షసరాకృతిం బొలుచు వర్ణశ్రేణి

   వీణానులా/

పముచేతం గరగించి యందు నిజబింబం

   బొప్ప నచ్ఛామృత/

త్వము ఆత్మప్రతిపాదకత్వమును దద్వర్ణాళి

   యం డెల్ల బూ/

ర్ణము గావించిన వాణి తిర్మలమహారాయోక్తి

   బొల్చున్ కృపన్! వసు 1-4

అద్భుతమైన సరస్వతీ స్తుతి.

అమ్మ వీణ వాయిస్తున్నది. ఆ నాదము (అనులాపము) వల్ల ఆమె చేతిలో గల అక్షసరము లోని వర్ణములు కరిగినవి.

సరస్వతి అక్షమాల పట్టుకొనును. అక్షమాల స్ఫటికము(తెల్లని రాయి) చేత చేసిన తెల్లని పూసల దండ. అక్షమాల అనగా మరియొక అర్థము 'అ' నుండి 'క్ష' వరకు గల అక్షర సమూహము

ఈ పూసల ఆకృతిలోగల అక్షరములు (అక్షసరాకృతిం బొలుచు వర్ణశ్రేణి) వీణానాదములోని మాధుర్యమునకు కరిగినవి. ద్రవమైనవి. అవి స్ఫటికమునకు సంబంధించినవగుటచే తెల్లని పారదర్శకమైన ద్రవమైనవి.ఈ ద్రవమేమి? నాదమాధుర్యమున కరిగిన వర్ణములు. కరిగిన వర్ణముల అంతరమందు గల నాదసుధ. వెరసి సంగీతసాహిత్యముల మేళనము. ఇక్కడ ప్రత్యేకముగా సాహిత్యాంతర్గత సంగీతము. ఆద్రవములోనికి అమ్మ చూచినది. దేవి శుద్ధ ధవళ స్వరూపము దానిలో ప్రతిబింబించినది.అనగా సాహిత్యాంతగతసంగీత సమ్మేళనాకృతి సరస్వతి ఆత్మ స్వరూపమైనది. ఆశుద్ధస్వరూపము తన ప్రభువైన తిరుమలరాయని వాక్కులో వర్తించు గాక (బొల్చున్ కృపన్) అంటున్నాడు భట్టుమూర్తి.

భంగ్యంతరంగా తన కవిత్వమున సంగీత స్వరూపము సాహిత్యమునందున మమైకమై సరస్వతీస్వరూపముగనలరారునని సూచించుచున్నాడు.

ఆంధ్రసాహిత్యమున అందమైన సరస్వతీ స్తుతులలో ముందువరుసలో నిలుచు స్తుతి ఇది.🙏🌷🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: