12, మే 2024, ఆదివారం

అమ్మ ప్రేమ

 *సృష్టి లో తియ్యనైనది,కమ్మనైనది, అమృత తుల్యమైనది,అమోఘ మైనది,అనిర్వచనీయమైనది,వర్ణించలేనిది, వెలకట్ట లేనిది....ప్రతి ఒక్క ప్రాణి కి లభించేది అమ్మ ప్రేమ* *మాత్రమే*.


అమ్మ అంటే ఒక పేరు కాదు,ఒక వ్యవస్థ,నీకు సర్వం నేర్పేది అమ్మే,నీకు రెక్కలు వచ్చే వరకు నిన్ను కంటికి రెప్పల కాపాడి తన ఒడిలో లాలించి,అమృతం పంచేది ఒక్క తల్లి మాత్రమే.


తల్లి మనస్సు తెలుసుకోవడం,సాగరం ఈదడం ఒకటే. తన బిడ్డ ఎంత పెద్దవాడైన *యశోదమ్మ లాంటి తల్లులకు చిన్ని కృష్ణయ్యే*


నలుగురు కుటుంబ సభ్యులు గల కుటుంబం లో ముగ్గురు కి మాత్రమే అన్నం వున్నప్పుడు,*నాకు ఆకలిగా లేదు అని చెప్పే దేవత అమ్మ*.


*అమ్మ అనే పదానికి ఖరీదు కట్టగల వారెవ్వరూ.*

అమ్మ తనం పొందడం ఒక వరం.

నీ కాలికి గాయమై రక్తమోడితే,అమ్మ కంట్లో రక్తం వుబుకుతుంది.


పాశ్చాత్య దేశస్థులు మే రెండవ ఆదివారం,*మదర్స్ డే* గా జరుపు కుంటున్నారు.


*భారతదేశం లాంటి సంప్రదాయ దేశాల్లో ప్రతి రోజు మదర్స్ డే నే. మనం తల్లి, దండ్రులను ప్రతి రోజు పూజించాలి.*


*తల్లులందరికి వందనం*....



*మూర్తి's కలం*......✒️

కామెంట్‌లు లేవు: