💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *అతో విముక్త్యై ప్రయతేత విద్వాన్*
*సన్న్యస్త బాహ్యార్థ సుఖఃస్పృహస్సన్*|
*సన్తం మహాన్తం సముపేత్య దేశికం*
*తేనోపదిష్టార్థసమాహితాత్మ||*
*ఆదిశంకరాచార్య - వివేకచూడామణి*
తా𝕝𝕝 బాహ్యంగా కనిపించే వస్తుమయ ప్రపంచపు అనిత్యత్వాన్ని తద్వారా కలిగే అశాంతిని గుర్తించిన విద్యావివేక సంపన్నుడైన సత్యాన్వేషి అంతరంగశాంతిని సమత్వాన్ని సాధించేందుకు కరుణామూర్తి అయిన సద్గురువును ఆశ్రయించి ఆయన వాక్కులనే తన జీవితంగా మలుచుకొని త్రికరణశుద్ధిగా జీవించాలి.
👇 //------ ( *మోహముద్గరం* )-----// 👇
శ్లో𝕝𝕝
*సుర మందిర తరు మూలనివాసః*
*శయ్యా భూతలమజినం వాసః౹*
*సర్వ పరిగ్రహ భోగ త్యాగః*
*కస్యసుఖం న కరోతి విరాగః* ॥18॥
భావం: దేవాలయాల్లోనూ, చెట్ల మొదళ్ళలోనూ నివసిస్తూ; కటిక నేల మీద నిద్రిస్తూ; చర్మాన్ని వస్త్రంగా ధరిస్తూ; దేనినీ గ్రహించకుండా - *ఏమీ కావాలని కోరుకోకుండా అన్ని భోగాలను విడిచిపెట్టిన ఏ విరాగికి సుఖం లభించదు*? 'తప్పక లభిస్తుంది'.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి