*ధార్మికగీత - 48*
*శ్లో:- అలసస్య కుతో విద్యా ?*
*అవిద్యస్య కుతో ధనం?*
*అధనస్య కుతో మిత్రం?*
*అమిత్రస్య కుత స్సుఖమ్?*
అలసత్వంబున విద్య లెట్లమరి
లన్ ? యా విద్యయే లేనిచో
నిలలో సంపద లెట్లుగూడుమరి
తా నేరీతి జీవించెడున్ ?
కలిలో సంపదలేనిచో హితులు
తా గల్గేరు నెబ్భంగిగన్ ?
పలుకన్ మిత్రులు లేనిచో సుఖము
లెబ్భంగిన్ నరున్ జేరెడున్ ?
✍️ గోపాలుని మధుసూదన రావు
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి