7, డిసెంబర్ 2020, సోమవారం

తల్లి_గర్భం_దేవాలయం

 *తల్లి_గర్భం_దేవాలయం*          

                 🙏🙏


తల్లి గర్భం గర్భగుడి కన్నా గొప్పది.  అక్కడ ఒక సృష్టి నిర్మాణం యొక్క ప్రణాళిక జరుగుతుంది, గర్భంతో ఉన్న సమయంలో మీ ఆలోచన అలవాటు మనసు ఎలా ఉంటే అలాంటి సంతానాన్ని మీరు సమాజానికి ఇస్తున్నారు అని తెలుసుకోండి. అయితే తల్లిదేన బాధ్యత తండ్రి స్వభావం రాదా అంటే కచ్చితంగా తండ్రిదే ప్రధమ బాధ్యత,ఎందుకు కంటే, తల్లి గర్భంలో కి చేరడానికన్నా ముందు 3 నెలలు ఆ కణం తండ్రి గర్భంలో ప్రాణం పోసుకుంటుంది మూడు నెలలు తర్వాత తల్లి గర్భంలోకి చేరుతుంది అలా చేరిన తర్వాత 9 నెలలు ఎదుగుతుంది, తర్వాత బిడ్డగా భూమి పైకి వస్తుంది శిశువు,ఆ మూడు నెలలు ఈ 9 నెలలు కలిపి  యాడాది కాలం గర్భంలో ఉండటం వల్ల12 నెలలు సం గా నిర్ణయించారు, సంవత్సరం కి ఆయువు లెక్కిస్తారు.  


తండ్రి గర్భంలో నుండి తల్లి గర్భంలోకి ప్రవేశించిన కణం ఆ సమయంలో తండ్రి యొక్క ఆలోచనలు పునికిపుచ్చు కుంటాడు అలాగే ఆ తల్లి గర్భంలో శిశువు ఎదిగే సమయంలో ఆమె బాధ సంతోషం ఆలోచనలు అనుగుణంగా బిడ్డ యొక్క మనస్తత్వం ఏర్పడుతుంది. కనుక సమాజానికి మీరు అందించే గొప్ప సంపద మీ సంతానం గా ఇచ్చేది గొప్ప వరం గా మారుతుందా శాపంగా మారుతుందా మీ చేతిలోనే ఉంటుంది. 


ఏ తత్వం తో దేహం ఏర్పడుతుందో దాని స్వభావం మనకు ఉంటుంది, ఎలా అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది అలాగే మన దేహానికి కూడా ఆకర్షణ శక్తి ఆకర్షించే గుణం ఉంటుంది అనగా అందానికి సంబంధించిన విషయం అని వెంటనే అనుకుంటారు కాదు ,భూమి ఎలా అయితే విశ్వప్రాణశక్తితో ప్రతిదీ తన వైపుకి ఆకర్షిస్తుందో అలాగే మనిషి దేహానికి విశ్వప్రాణశక్తిని ఆకర్షించే శక్తి కలిగి ఉంటుంది ప్రతి నాడి కి ఒక బీజం ప్రతి బీజం యొక్క స్మరణ కి ధ్వనికి దేహంలో స్పందించే గుణం అలా స్పందించడం వల్ల కలిగే ప్రకంపనలు విద్యుత్ శక్తి కలిగి ఉంటుంది ఆ శక్తి శరీరంలో నిక్షిప్తమై కుండలినీ శక్తిని జాగృతం చేస్తుంది. దేహానికి భూమి తత్వం ఉంటుంది అని మనకు మన ఋషుల ఎప్పుడో తెలియచేసారు అందుకే ఎన్నో మృతకణాలు తో దేహం మట్టితోనే ఉంటుంది మంత్రం ఉచ్చారణ వల్ల దేహానికి కలిగే మార్పు దుర్వాసనని తొలగిస్తుంది దేహంలో అనేక మంచి మార్పులకు కారణం అవుతుంది, ఆహారం దేహాన్ని పోషిస్తే ధ్యానం ఆత్మ శక్తిని పోషిస్తుంది. భూమి తత్వం కలిగినది కనుక భూమి అవతారం అయిన వారాహి మూలాధారం లో ప్రథమంగా ఆరాధిస్తారు.. ధ్యానంలో మొదట కదలికలు కలిగిన సమయంలో అక్కడ రక్షించే దేవత వారాహి గా మీకు లలితా నామ వివరణలో వివరంగా తెలియచేశాను. కర్మను తొలగించే ప్రయత్నంలో అవరోధాలు తొలగిస్తుంది.


ఇదంతా తల్లి గర్భంలో జరిగే సృష్టి ఈ సృష్టిని ఎవరు చేస్తున్నారు అమ్మవారు ,అమ్మవారు ఉంటే తల్లిగర్భం గర్భగుడితో సమానం. అలాగే పురుడు అంటే  మైలు అంటారు దానికి కారణం స్త్రీ లలో మైలుగా వ్యర్థం అవుతున్నది తల్లి గర్భంలో బిడ్డకు ఆహారంగా దేహం ఎదుగుదలకు కారణం అవుతుంది. ఆ మైలు రుదిరం పిండానికి ఎదుగుదలకు కారణం అవ్వడం వల్ల వారికి ఆసమయంలో బహిష్టు ఉండదు బిడ్డకు రక్షణగా ఉండే ఉమ్మనీరు వల్ల బిడ్డ క్షేమంగా కదులుతాడు, పురుడు తర్వాత ఆ వ్యర్థం అంతా విసర్జించడం వల్ల పురిటి మైలుని పాటిస్తారు ,తల్లి వేరుని తెంచుకుంటాడు కనుక అది చాలా పెద్ద మైలే అవుతుంది. 


గర్భంలో ఈ ఉమ్మ నీరు గతజన్మ పాప పుణ్యాలు గుర్తు చేస్తుంది బిడ్డ రూపంలో ఉండే జీవి ఆ దుర్వాసనని వైతరిణి నది దాటే టప్పుడు కలిగిన బాధని అనుభవిస్తూ ఆ కర్మను పూర్తి చేసుకుని నీ దగ్గరకు వస్తాను స్వామి మళ్ళీ జన్మ లేకుండా ఇటువంటి బాధను అనుభవించకుండా కాపాడు అని వేడుకుంటూ ఉంటాడు. పుట్టిన మూడు నెలలకు గత జన్మ జ్ఞాపకాలను మర్చిపోయి ఈ జన్మ వాసనలకు అలవాటు పడుతూ ఈ జన్మ బంధాలకు దగ్గర అవుతూ మాయలో పడిపోతాడు గర్భంలో తల్లిదండ్రులు యొక్క స్వభావం తో అదే మనస్తత్వం తో ఎదుగుతారు. ఆధ్యాత్మిక సంపాదన కలిగిన జీవి ఆ గతజన్మ పుణ్యం వల్ల ఆ మార్గం లో నడుస్తాడు ప్రలోభాలకు లొంగకుండా మాయనుండి బయటపడే మార్గాన్ని అన్వేషించండి మొదలు పెడతాడు.


మంచి ఆలోచన గలిగిన విషయాలు కథలు సంతోషంగా ఉండే మాటలు, అత్యత్మిక విషయాలు సంగీతం ఇలాంటి వన్ని గర్భం సమయంలో పాటిస్తే మంచి సంస్కారవంతులు గా ఉన్నతంగా  జన్మిస్తారు, మంచి జ్ఞానం ఉన్న పుస్తకాలు చదవటం దానం చేయడం ప్రేమగా ఉండటం వల్ల మీ పిల్లలు మీ పట్ల అదే స్వభావంతో ఎదుగుతారు, అలా అని మీరు చెడ్డవాళ్ళ మీకు అలాంటి పిల్లలు ఉన్నారు అనుకోకండి మీరు  మంచి వాళ్ళు అయినా మీరు చూసే tv సీరియల్స్ వినే విషయాలు తగాదాలు క్రిమినల్ కథలు ఇటువంటి చూడటం వినటం, భయపడటం ఆస్థి తగాదాలు కట్నం గొడవలు ఇటువంటి వాటి వల్ల మీ సమస్య మనసుపైన ప్రభావం చూపడం వల్ల అది బిడ్డ అలోచనలు పైన ప్రభావం చూపుతుంది.


జన్మ అంటే ఋణం ఎవరికి ఋణపడి ఉంటామో వారే జన్మిస్తారు ఎవరు మనకు ఋణపడి ఉంటారో వాళ్ళు జన్మిస్తారు, ఉదాహరణకు ఒక తల్లి మంచి మనసుతో ఒక సాధువుకు ఆహారాన్ని ఇస్తూ ఉండేది ఏంతో కాలం ఆమె భక్తితో అలా ఆహారాన్ని ఇస్తుండటం తో ఆ సాధువుకి ఆమె పట్లమాతృత్వపు మమకారం కలిగింది అమెపట్ల ఒక ఆపేక్ష అనురాగం ఆ సాధువు హృదయం లో కలగడంవల్ల సాధన ద్వారా పుణ్యము పాపము అనే రెండు కర్మలు వదిలిపోయినా, మోక్షానికి వెళ్లకుండా మళ్ళీ జన్మ లో అమెకు బిడ్డగా జన్మించి మాతృత్వం యొక్క మమకారం తీర్చుకుని ఆ తల్లిదండ్రులకు ఎనలేని కీర్తిని సంపాదనగా ఇచ్చి తరతరాలుకు తరింప చేస్తారు అటువంటి వారే, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రమణ మహర్షి, అబ్దుల్ కలాం గారు, ఇంకా ఇలాంటి ఎందరో మహానుభావులు.


ఒక యోధుడిని ఒక వీరుడిని, ఒక యోగిని, ఒక శాస్త్రవేత్త ని, ఒక రాముడిని, ఒక శివాజీ ని ఇలాంటి మహానుభావులను కనే శక్తి మనకు ఉంది. ఒక రావణుడు, నరకాసురుడు, కీచకుడుని కనే శక్తి కూడా మనకే ఉంది. మంచి కర్మలు మంచి ఆలోచనలు తో మంచి సంతానాన్ని మంచి పెంపకంతో గొప్ప సమాజాన్ని నిర్మించేశక్తి కూడా మనకు ఉంది ఇది గుర్తు పెట్టుకోండి.


👉 సంతానం లేని దంపతులు పాపాత్ములు కారు, ఎవరికి ఋణపడని వాళ్ళు అని అర్థం, వారికి ఎవరూ ఋణం లేరు అని అర్ధం కనుక సంతానం లేని వాళ్ళు బాధపడకండి ఎవరికీ మీరు ఋణపడలేదు అనుకోండి పుణ్యకార్యాలు  చేస్తూ జీవితాన్ని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా జీవించి మళ్ళీ జన్మ లేకుండా చేసుకోండి. పార్వతీ దేవి ఒక్క బిడ్డను కూడా తన గర్భంలో మోయలేదు కానీ ఆమె ఈ సృష్టికి తల్లి అలాగే గర్భం లో మోయకున్నా తల్లి మనసు ఉంటే బిడ్డను పెంచుకోవచ్చు. బాధ సంతోషం అనేది మనము స్వీకరించే దాన్నిబట్టి ఉంటుంది. 

*వాట్సాప్ లో నాకు వచ్చిన ఓ సందేశం.* 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: