7, డిసెంబర్ 2020, సోమవారం

రైతు చట్టానికి

 కేంద్రం తెచ్చిన రైతు చట్టానికి నెనుఎందుకు వ్యతిరేకించాలి.

🌾రైతు పండించిన పంటను మార్కెట్ తీసుకవెళ్ళితే దోషిలు తీసి ధాన్యం దోచుకునే పద్ధతిని తీసివేసినందుకు వ్యతిరేకించాల?

🌾రైతు ధాన్యం మార్కెట్ కు తీసుక వెళ్ళితే కచర ఉంది ధాన్యం లో అని 2-3 కిలోల ధాన్యం కట్టింగ్ చేసే పద్ధతి లేకుండా చేసినందుకు వ్యతిరేకించాల?

🌾ధాన్యం మొత్తం తూకం ఐనతారువత పట్టి చేసేటప్పుడు ఆర్థివాడు నూటికి 3 రూపాయల కట్టింగ్ కమిషన్ తీసుకోవడం తీసివేసినందుకు వ్యతిరేకించాల?

🌾రైతు పండించిన ధాన్యం మార్కెట్ లో కాకుండా ప్రయివేట్ కంపనితో ఒప్పందం కుదుర్చుకునే సౌకర్యం కల్పించినందుకు వ్యతిరేకించాల?

🌾రైతు పండించిన పంటకు ఎక్కడ అధికారేటు ఉంటే అక్కడ అమ్ముకునే సౌకర్యం కల్పించినందుకు వ్యతిరేకించాల?

🌾రైతు పండించిన పంటను దళారులు తక్కువరేటుకు కొని నిల్వవుంచి అధికారేటు వచ్చినప్పుడు అమ్ముకునే పద్ధతిని కాకుండా రైతు అధిక రేటు వచ్చేవరకు నిల్వ ఉంచే సౌకర్యం కలిపించినందుకు వ్యతిరేకించాల?

🌾రైతు వేసే పంటను ఒక్క ప్రయివేట్ కంపెనీ తో 5 సమాత్సరాలు నికే నా పంటను అమ్ముతాను అని ప్రయివేట్ కంపెనీ తో అగ్రిమెంట్ చేసి వారి నుండి అడ్వాన్స్ రూపంలో పంట పెట్టుబడికి డబ్బులు తీసుకునే సదుపాయం రైతులకు కల్పించినందుకు వ్యతిరేకించాల?

🌾ఉదాహరణకు రైతు పండించిన టమాట మార్కెట్ లో కిలో 10 రూపాయలకు అమ్మితే దళారి అదే టమాటను వినియోగదారులకు 40 రూపాయలకు అమ్ముతాడు దళారి ఎలాంటి కష్టం లేకుండా 30 రూపాయలు సపదిస్తున్నాడు పట్టపండించిన రైతు 24 గంటలు 3 నెలలు కష్టపడితే 10  రూపాయలు సంపదిస్తాడు.

అదే రైతు పండించిన టమాటను నేరుగా రైతే వినియోగదారునికి 25 రూపాయలకు అమ్మితే ఇటు రైతు లాభ పడుతాడు అటు వినియోగదారునికి తక్కురేటుకు వస్తుంది.

అలాంటి పద్ధతిని తెస్తునందుకు వ్యతిరేకించాల?

అస్సులు ఈ చట్టానికి మనం ఎందుకు వ్యతిరేకించాలి.ఈచట్టం ద్వారా రైతుకు మేలు జరుగుతుంది తప్ప ఎక్కడ నష్టం మాత్రం జరగడం లేదు.


కేంద్రప్రభుత్వం తెచ్చిన ఈ చట్టానికి ఒక్క రైతు ని అభిమానించే భారతీయుడి గా నా పూర్తి మద్దతును తెలియజేస్తున్నాను.

జై జవాన్

జై కిసాన్. JAI MODI, JAI BJP

కామెంట్‌లు లేవు: