15, మార్చి 2025, శనివారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఈ శ్లోకంలో మహాదేవుడైన ఈశ్వరుని సింహ రూపంగా స్తుతిస్తున్నారు. ఈశ్వరుని యందు సింహ లక్షణాలు ఉన్నాయని శంకరులు చెప్పారు.*


*శ్లోకం. :  44*        


*కరలగ్నమృగః కరీంద్రభంగో*

                         

*ఘన శార్దూల విఖండనోస్తజంతుః*

                         

*గిరిశో విశదాకృతిశ్చ చేతః*

                         

*కుహరే పంచముఖోస్తిమే కుతోభీః ?*


*పదవిభాగం :-*


*కరలగ్నమృగః _  కరీంద్ర భంగః _ ఘన శార్దూల విఖండనః _ అస్తజంతుః_ గిరిశః _ విశదాకృతిః _ చ _ చేతఃకుహరే _ పంచముఖః _ అస్తి _ మే _ కుతః _ భీః.*


*తాత్పర్యము :-*


*సింహానికి మృగములు చేతికి చిక్కుతూ ఉంటాయి. పరమేశ్వరుడు కూడా మృగమును చేతిలో ధరించాడు. సింహము గజములను చంపుతుంది. ఈశ్వరుడు సహితమూ గజాసురుని సంహరించాడు. సింహము వ్యాఘ్రములను ఖండిస్తుంది.  పరమేశ్వరుడు వ్యాఘ్రాసురుని ఖండించాడు. సింహాన్ని చూసి జంతువులన్నీ కనబడకుండా పారిపోతాయి. ఈశ్వరుని యందే జంతువులన్నీ లయము చెందుతాయి. సింహానికీ శివునికీ పర్వతమే నివాస స్థలము. సింహము శరీరకాంతి తెలుపు. ఈశ్వరుడు కూడా తెలుపే. సింహము పంచముఖి. అనగా విశాలమైన నోరు కల్గి యుంటుంది. ఈశ్వరునికీ ఐదు ముఖాలున్నాయి. అటువంటి మహాదేవుడు నా హృదయమనే గుహలో నివసించి యున్నాడు. నాకు ఏ భీతియూ లేదు.*


*వివరణ :-*


*ఈశ్వరుడు పంచముఖుడు. ఆయనకు  1). సద్యోజాతం   2). వామదేవం  3)  అఘోరం   4)   తత్పురుషం   5)   ఈశానం  అనే ఐదు ముఖాలున్నాయి.*


*సింహం కూడా పంచముఖమే. అంటే విశాలమైన నోరుగలది అని అర్థం.*


*సింహంవంటి శివుడు తన హృదయమనే గుహ లో వున్నాడు కాబట్టి తనకు ఏమీ భయంలేదని శంకరులు చెప్పారు. పెద్ద వారి యండ దొరికితే మనకు ధైర్యంగా ఉంటుంది కదా ! సింహ లక్షణాలు గల పరమేశ్వరుని యండ దొరికితే ఇంక చెప్పవలసినదేమున్నది ?  అని శంకరులు అన్నారు.*


*అంటే అందరూ శివుని తమ హృదయాల్లో నిలుపుకొన్నట్లయితే మృత్యువు వల్ల కూడా వారికి భయం ఉండదని గ్రహించాలి.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: