*తెలుగుభాష గొప్పదనం*
*అత్త:* ఇదిగో కోడలు పిల్లా! ఓ సారిలా రా!
*కోడలు:* వస్తున్నా *నత్తయ్యా*
*అత్త:* అత్తయ్యా అని అనలేవూ? నత్తయ్యా, గిత్తయ్యా అని అనకపోతే
*కోడలు:* నేను నత్తయ్యా అన్నానా? మడిగట్టుకుని గూడ వున్నారు, అబద్ధమాడ *కత్తయ్యా!* మైల పడిపోతారు.
*అత్త:* ఇప్పుడే మన్నావ్ ! కత్తయ్యా అనలేదటే ! పరమ సాత్వికురాలిని నన్నే కత్తయ్యా అంటావా !
*కోడలు :* అయ్యో ! నా ఖర్మకొద్దీ దొరికా *రత్తయ్యా* మీరు
*అత్త:* మళ్ళీ ఇంకో కొత్త కూత ! ఇప్పుడు రత్తయ్యా అని అన్నావా లేదా ?
*కోడలు:* అయ్యో ! నా రాత! అది సంధి. మీరు తెలుగు సరిగ చదువుకోలే *దత్తయ్యా*
*అత్త:* మరో మాయదారి కూత. దత్తయ్యా అట ! వాడెవడు? అయ్యో ! అయ్యో ! నేను నీలాగ చదువుకోలేదని నన్ను *నత్తయ్యా, కత్తయ్యా , రత్తయ్యా, దత్తయ్యా* అంటూ వెధవ పేర్లతో పిలుస్తావటే ! అబ్బాయి రానీ చెబుతా నీ సంగతి
*కోడలు:* అలా ఉడికి పోయి ఆయాసం తెచ్చుకోకండి. బిపి పెరుగుతుంది. మీరనుకున్న వన్నీ *‘ఉకారసంధి’* వలన ఏర్పడిన పదా *లత్తయ్యా*
*అత్త:* ఓరి దేవుడో! నన్ను మళ్ళీ లత్తయ్యంటోంది నాయనో !
ఇదే తెలు *'గత్తయ్యా'*
*తేనెలొలుకు తెలుగు* ఇంతటి మాధుర్యం ఏ భాషకు ఉంటుంది **చెప్పత్తయ్య* xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxఈ పోస్టు పాతదే... కానీ మిత్రులందరు తెలుగు గొప్పతనాన్ని గుర్తు చేసుకోవాలని పోస్ట్ చేశాను (దీన్ని ఓ మిత్రుడు నాకు పంపాడు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి