15, మార్చి 2025, శనివారం

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: మూడవ అధ్యాయం

కర్మయోగం: అర్జున ఉవాచ


జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన 

తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ (1)


వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే 

తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయో௨హమాప్నుయామ్ (2)


జనార్దనా... కర్మకంటే జ్ఞానమే మేలని నీ వుద్దేశమా  అలాంటప్పుడు ఘోరమైన ఈ యుద్ధ కర్మకు నన్నెందుకు పురికొల్పుతున్నావు అటూయిటూ కాని మాటలతో నా మనసుకు మరింత కలత కలగజేస్తున్నావు. అలా కాకుండా నాకు మేలు చేకూర్చే మార్గం ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పు.

కామెంట్‌లు లేవు: