26, డిసెంబర్ 2023, మంగళవారం

ఆలోచనాలోచనాలు

 @@@ ఆలోచనాలోచనాలు @@@                                   1* "" Opportunity is NO WHERE"" అని నీరసపడి కూర్చోకండి.  "" Opportunity is NOW  HERE."" అనే ఆశాభావంతో జీవితంలో పురోగమించండి.                  2* అసూయ అనేది అస్తవ్యస్తమైన దయ్యం వంటింది. అది ఎదుటి వారి కంటే మనకే హాని కలుగజేస్తుంది.                       3* అందరిపట్ల మర్యాదగా వ్యవరించండి. ఎక్కువ మందితో పరిచయాలు పెంచుకోండి. ఒక్కరిద్దరితో మాత్రం స్నేహంగా ఉండండి. ఎవరికీ శత్రువు కాకండి.                                4* అద్భుత విజయం వెనకవున్న రహస్యం కేవలం కష్టించి పనిచేయడమే! అందుకే క్రమశిక్షణే సోపానం. అన్నిటికీ అదృష్టంపై ఆధారపడేవాడు తన జీవితాన్ని లాటరీగ చేసుకొంటాడు.                     5* అవమానకరమైన బ్రతుకు బ్రతికేకన్నా గౌరవప్రదమైన మరణమే మేలు. ఆకలితో నకనకలాడుతున్నా సింహం మాంసాన్ని విడిచి గడ్డి మేయదు కదా!                    6* భూములు, భవనాలు, ఆస్తిపాస్తులు, బాంక్ బాలెన్సులు -- వీటన్నిటికన్నా చక్కటి కుటుంబం, మంచి మిత్రులు, ఆపదలో సహాయపడగల్గిన బంధువర్గం-- ఇదే నిజమైన సంపద.                                 7* ఆశావాది చూసేది గులాబీని; ముళ్ళను కాదు. నిరాశావాది చూసేది ముళ్ళనే; కాదు గులాబీని; --- ఖలీల్ జిబ్రాన్.                    8* ఇతరుల కోసం ఆరు గంటలు కష్టపడడానికి అతడు ఇష్టపడలేదు. ప్రస్తుతం తనకోసం పన్నెండు గంటలు శ్రమిస్తున్నాడు. ఆ వ్యక్తినే సమాజం వ్యాపారస్థుడు అని పిలుస్తుంది.                    9* ఈ మాటలను చెప్పాలంటే కొంచెం బాధగా ఉంది. కానీ చెప్పక తప్పడం లేదు. ఇతరులు శ్రమించి సంపాదించినదానిని తేరగా తిందామనుకొన్న ప్రతి వ్యక్తి "" మరొకరు కక్కిన కూటికి ఆసించే ఆశపోతే!""                    10* ఈ రోజు చెయ్యగలిగిన పనిని రేపటికి వాయిదా వెయ్యవద్దు. ఎందుకంటే ఆ రాబోయే "" రేపు"", రెండు రోజుల పనిభారాన్ని మొయ్యలేకపోవచ్చు.           11* ఇతరులు మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారా? ఒకందుకు ఇది మంచిదే! మనపట్ల మరొకరు జాలి చూపడం కంటే అసూయ చెందడం మెరుగైనదే!                         12* సత్యం ఇది. ఏ రోగం లేనివాడు పడుచువాడు. ఏ అప్పు లేనివాడే నిజమైన సంపన్నుడు.                 13* నీవు నడక నేర్చేముందు, సైకిల్ తొక్కడం నేర్చేటప్పుడు ఎన్ని పర్యాయాలు పడి లేచావో, గుర్తు తెచ్చుకో! ఎన్నటికీ ప్రయత్నాన్ని విడిచిపెట్టకు. ( Never , Never, Never give up!).    14*  ఈ ప్రపంచంలో కీర్తి శిఖరాలను అధిరోహించిన వారంతా ఒక్క అంగలో శిఖరాగ్రాన్ని చేరలేదు. ప్రపంచమంతా గాఢమైన నిద్రలో విశ్రాంతి తీసుకొంటుంటే, వీరు మాత్రం ఎన్నో సుఖాలను త్యాగం చేసి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ, పైకి ఎగబ్రాకారు.                          15* ఎత్తెన పర్వతాలను అధిరోహించే వ్యక్తులను జాగ్రత్తగా గమనించండి. వారు ఎంతో ముందుకు వంగి పైకి సాగుతుంటారు. మనమూ అంతే! ఎంత అణకువగా ఉంటే అంత వేగంగా కార్యసిద్ధి అవుతుంది.                           తేది 22--12--2023, శుక్రవారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: