*జైశ్రీరామ్*
2-7-2020
అభ్యాసం-37
*సుభాషితం*
"ఆలస్యం హి మనుష్యాణాం
శరీరస్ధో మహాన్ రిపుః |
నాస్త్యుద్యమ సమో బంధుః
కృత్వాయం నా వసీదతి"||
*భావం*
సోమరితనం అనేది మనుష్యులకు ప్రధాన శత్రువు.అది మన శరీరంలోనే ఉంటుంది కాబట్టి మరింత హానికరమైనది.పని అనేది మనకి అత్యంత నమ్మకమైన బంధువు లాంటిది (Work is God). అది పతనంనుండి కాపాడుతుంది.
*అమృతవచనం*
ఒక *ఫ్రెంచ్* దేశస్థుడు భారత్ వచ్చి 2017 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలా అన్నారు:
పూర్వకాలంలో భారతీయులు నూతన పరిశోధనలు చేసి అనేక విషయాలలో వినూత్నమైన పద్దతులను ఆవిష్కరించి ప్రపంచ దేశాలకు అందించేవారు. కాని ప్రస్తుతం అదిలేదు. ప్రస్తుతం ఆ ఆవిష్కరణా సామర్థ్యాన్ని కోల్పోయి విదేశీ అనుకరణను మొదలు పెట్టారు.భారత్ ఒక అగ్రదేశంగా ప్రపంచదేశాలలో ఉన్నతమైనిదిగా ఎదగవలసిఉంది.కాని భారతీయులు ఇతరులను అనుకరించేవారు (Best copiers) గా తయారయ్యారు.ఇది చాలా శోచనీయం.
*బాలీవుడ్* కూడా సీన్ బై సీన్ (scene by scene) సన్నివేశాలు,మాటలు అన్నీ పశ్చిమ దేశాలను అనుకరిస్తోంది.
పూర్వకాలంలో మొగలుల పరిపాలనా సమయంలో కూడా భారతీయులు పరశోధనాత్మకం (innovative) గా ఉండేవారు. **చెస్**ఆటను కనిపెట్టారు.లెక్కలకు ఆధారము ప్రాణము అయిన *సున్నాను* కనిపెట్టారు. భారత్ యొక్క *ఖగోళభౌతికశాస్త్రం* (Astrophysics) ప్రపంచ దేశాలలో ఉన్నతమైనది.18వ శతాబ్దం వరకూ భారత ఖగోళ శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఉన్నతంగా ఉండేవారు.
*వస్త్రపరిశ్రమలో* భారత్ కు గొప్పపేరు.భారత్ లో తయారుచేసిన వస్త్రాలు, చేతితో నేసినవి విదేశాల్లో మంచి గిరాకీ ఉండేది.ఆరోజుల్లో కరెన్సీ లేదు వస్తువుల మార్పిడే జరిగేది.వస్త్రాలకు సమానమైన తూకం బంగారం వచ్చేది. 10 గజాల చీరను అగ్గిపెట్టెలో పట్టేటట్లుగా చేయగల అద్భుతమైన నైపుణ్యం భారతీయుల్లో ఉండేది.
భారత్ మీద వరుసగా విదేశీ ఆక్రమణలవల్ల,విధర్మీయ పాలనవల్ల పరిశోధనాత్మకమైన తత్వాన్ని భారతీయులు కోల్పోయారు.విదేశీపాలనలో అనేక యిబ్బందులకు లోనై ఇమేజినేషన్,ఇన్నొవేషన్ లేకుండా పోయింది.
స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా ఆ బానిసత్వ భావాలు,అనుకరణ విధానాలు పోలేదు.దానినుంచి భారతీయులు త్వరగా బయటకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది.
శ్రీవేంకటేశ్వర్లు వబిలిశెట్టి
విశ్వహిందూ పరిషత్
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి