దక్షత' అంటే సమర్ధత అనే అర్ధం మనం సాధారణంగా తీసుకుంటాము. ఒక ఉద్యోగం ఎవరికైన ఇవ్వాలంటే ముందుగా వ్రాత పరీక్ష పెట్టి తరువాత మౌఖిక పరీక్ష పెట్టి ఆ అభ్యర్థి సమర్ధత కలిగి ఉన్నాడా లేదా అని పరీక్షించిన తరువాత ఉత్తీర్ణత సాధించిన వారికి వారి ఉత్తీర్ణతల స్థాయిలను బట్టి ఉద్యోగాలు ఇవ్వటం పరిపాటి. అంటే ఏదైనా ఉద్యోగం ఒక వ్యక్తికీ ఇవ్వాలంటే ఆ ఉద్యోగ బాధ్యతలను సదరు వ్యక్తి దక్షతతో నిర్వహించగలడు అని అధికారులకు కలిగిన తరువాతే ఎంపిక చేస్తారు. ఇది మనం నిత్యం చూస్తున్నాము.
దక్షత అంటే సామర్థ్యం, నైపుణ్యం, లేదా పనిని సమర్థవంతంగా నిర్వహించే శక్తి అని అర్థం. ఇది పరిపాలనలో చురుకుదనాన్ని, బాధ్యతను, మరియు పనితీరులోని పరిణితిని సూచిస్తుంది. ఇది సాధారణంగా వ్యాపార, పరిపాలనా, లేదా వ్యక్తిగత సామర్థ్యాన్ని తేలియచేస్తుంది. దక్షత కేవలం ఉద్యోగంలోనేనా లేక ఇతర విషయాలలో కూడా అవసరమా అంటే నిత్యజీవితంలో ప్రతి కార్యం సమర్ధవంతంగా చేయటానికి దక్షత అవసరం ఉంటుంది అని చెప్పవచ్చు. మనకు ఒక సామెత వున్నది అదేమిటంటే మట్టికి పోయిన ఇంటివాడే పోవాలి. నిజానికి మట్టిని తేవటం అనేది చాలా చిన్న పని. అక్కడ ఎటువంటి దక్షత అవసరం లేదు. కానీ అదే దక్షుడు అయిన సొంతమనిషి వెళితే చక్కటి మట్టిని వెతికి తీసుకొని వస్తాడు అనే భావంతో దీనిని వాడుతారు. ఒక సంసారి ఇంటిని నిర్వహించటానికి కూడా దక్షత అవసరం అని అంటాడుభాస్కర శతక కవి.
దక్షుడు లేని యింటికిఁ బదార్థము వేఱొక చోట నుండి వే
లక్షలు వచ్చుచుండినఁ బలాయనమై చనుఁగల్ల గాదు ప్ర
త్యక్షము వాగులున్ వరద లన్నియు వచ్చిన నీరు నిల్చునే
యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా!
ఏరకంగా అయితే కట్టలు తెగిన చెరువులోని నీరు నిలవకుండా పడుతుందో అదే రకంగా ఇంటి యజమాని సమర్ధుడు కాకపొతే ఇంట్లోని ద్రవ్యం మొత్తం వృధాగా ఖర్చు అయి ఆ యిల్లు కష్టాల పాలు అవుతుందని చెపుతున్నాడు కవి.
దక్షుని లక్షణాలు ఎలా వుంటాయో కూడా ఏనుగు లక్ష్మణ కవి సుభాషితాలలో తెలిపాడు.
ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారుఁ బూసెజ్జపై,
నొకచోశాకము లారగించు, నొకచో నుత్కృష్ట శాల్యోదనం, అర్ధం
బొక్కచో బొంత ధరించు, నొక్కొక తఱిన్ యోగ్యాంబర శ్రేణి, లె
క్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్
అనగా కార్యసాధకుడైన వాడు తన సౌకర్యములను గూర్చి గాని, లేదా వ్యవస్థను గూర్చి గాని చింతించడు. క్లిష్టమైన పరిస్తితులైన లేక చాలా సౌకర్యమైన పరిస్తితులైన అన్నిటిని సమానంగా చూస్తూ కేవలం తన ద్రుష్టి మాత్రం తాను నిర్వహించవలసిన కార్యం మీద మాత్రమే నిలుపుతూ కార్యాలను సాధిస్తాడని అంటున్నాడు కవి.
దక్షత కలిగిన వాడే చేసే ప్రతి పని ఎంతో నైపుణ్యం గా పరిపూర్ణంగా ప్రశంసాత్మకంగా సత్వరం జరిగేటట్లుగా ఉంటుంది అని వేరే చెప్పనవసరం లేదు. ఏ పనిలో ఆయన ఆ పని చేసే విధానంలోనే చేసే వాడి యొక్క దక్షత తెలుస్తుంది మనం ఎంతో చక్కగా అందంగా ఆకర్షణీయంగా ఉండేటటువంటి పెద్ద పెద్ద భవంతులని చూస్తూ ఉంటాం అంత చక్కటి భవంతులు కట్టాలంటే ఆ నిర్మించిన మేస్త్రీలు తప్పకుండా దక్షులై ఉండాలి అని వేరే చెప్పనవసరం లేదు. అదే పెద్ద చిన్న పనిలో కూడా దక్షత ఎంతో అవసరం ఒక కార్యంలో చక్కగా వంట చేయడం కూడా ఒక దక్షత గమనించవచ్చు రాజ్యాంగ మనం ఏ పెళ్లిళ్లలో కానీ ఫంక్షన్లలో కానీ వెళ్లి భోం చేస్తే అక్కడ వంట ఎవరు చేశారు చాలా బాగా చేశారు అని వంట చేసిన వారిని మెచ్చుకోవటం పరిపాటి ఎంతో ఖర్చుపెట్టినా ఆ ఫంక్షన్ నిర్వహించిన యజమానిని అస్సలు చదవాలి అదే వంట సరిగా చేయకపోతే ఆ యజమాని ఎంత ఖర్చు పెట్టినా అందరి చేత మాట పడాల్సి వస్తుంది అందుకని వంటవారు ఎక్కువ అడిగినా గాని పేరు ఉన్న వంట వాళ్ళని ఎంచుకొని కార్యాలలో వంటలు చేయించడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఒక కార్యాలయాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే ఆ కార్యాలయపు అధికారి దక్షుడు అయి ఉండాలి దక్షుడు అయినటువంటి అధికారి ఉంటే కార్యాలయంలోని అన్ని పనులు సక్రమంగా సమయానుకూలంగా జరుగుతూ ఉంటాయి అదే దక్షుడు కానటువంటి అసమర్ధుడు అయినటువంటి సోమరిపోతు అయినటువంటి అధికారి గనక ఉంటే ఆ కార్యాలయంలో పనిచేసే వాళ్లు కూడా సక్రమంగా పనిచేయకుండా పనులన్నీ వాయిదా వేస్తూ ఆ కార్యాలయం మొత్తం ఒక చెడ్డ పేరు తెచ్చుకోవడమే కాకుండా ఆ కార్యాలయపు పై అధికారి అది గమనిస్తే వెంటనే ఈ కార్యాలయం అధికారిని ఒక తక్కువ పని తక్కువ దక్షతగా నిర్వహించే స్థలానికి బదిలీ చేయటం పరిపాటి
ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్ |
ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని నిర్వహించాలని అనుకుంటే దానిని మూడు రకాల మనుషులు చేయ పూనుకుంటారు సమర్ధుడు అన్నవాడు ఆ కార్యం పూర్వపరాలు పూర్తిగా పరిశీలించి వాటిలోని ఒడిదుడుకులను సమన్వయపరచుకొని ఎటువంటి కష్టనష్టాలు ఎదురైనా వాటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఆ కార్యాన్ని చేస్తాడని అదే మద్యములు ఆ కార్యాన్ని ప్రారంభించి కొంత మటుకు నిర్వహించి ఇక తమ వంతు పని అయిపోయిందని పూర్తి కార్యం చేసే సమర్థత తమకు లేదని మధ్యలోనే జారుకుంటారని నీచ మానవులు ఆ కార్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయటానికి కూడా కోనుకోవాలని అవి అభిప్రాయపడుచున్నాడు మనం సమాజంలో కూడా ఇటువంటి సంఘటనలు అక్కడక్కడ చూస్తూ ఉంటాం కొంతమంది శక్తికి మించిన పనిని కూడా చాకచక్యంగా తమ తోటి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని నిర్వహించటం చూస్తూ ఉంటాం అదే కొంతమంది పని కొంత మటుకు మొదలుపెట్టి మధ్యలో వదిలేసిన వారు ఉంటారు మనం అక్కడక్కడ కొన్ని గృహాలు సగం మటుకు నిర్మించబడి ఉండి వదిలేసిన చూస్తుంటాం దీనికి ఇది ఒక ఉదాహరణ అదే కొంతమందికి ఎంత ధనం ఉన్నా కూడా ఒక గృహాన్ని కూడా కొనలేరు ఎందుకంటే వాళ్లంతాటి వాళ్ళే అనుకుంటారు ఈ గృహాన్ని కొనటం అనేది తమ శక్తికి మించిన దాన్ని భావించి వాటి జోలికే పోరు ఆ ధనాన్ని ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో వాళ్లు తమ జీవితాన్ని గడుపుతారు ఇటువంటి వారు వాళ్ళు సుఖపడలేరు ఎదుటి వాళ్ళను కూడా సుఖపెట్టలేరు అనేది జీవిత సత్యం ప్రతి మనిషి ఒక దక్షిణంగా ప్రవర్తించి ప్రతి కార్యాన్ని నిర్వహిస్తే తన కుటుంబాన్ని అదేవిధంగా సమాజాన్ని చక్కగా అనుసంధానం చేసుకుంటే సమాజంలో అందరూ సుఖసంతోషాలతో ఉండదక్షత' అంటే సమర్ధత అనే అర్ధం మనం సాధారణంగా తీసుకుంటాము. ఒక ఉద్యోగం ఎవరికైన ఇవ్వాలంటే ముందుగా వ్రాత పరీక్ష పెట్టి తరువాత మౌఖిక పరీక్ష పెట్టి ఆ అభ్యర్థి సమర్ధత కలిగి ఉన్నాడా లేదా అని పరీక్షించిన తరువాత ఉత్తీర్ణత సాధించిన వారికి వారి ఉత్తీర్ణతల స్థాయిలను బట్టి ఉద్యోగాలు ఇవ్వటం పరిపాటి. అంటే ఏదైనా ఉద్యోగం ఒక వ్యక్తికీ ఇవ్వాలంటే ఆ ఉద్యోగ బాధ్యతలను సదరు వ్యక్తి దక్షతతో నిర్వహించగలడు అని అధికారులకు కలిగిన తరువాతే ఎంపిక చేస్తారు. ఇది మనం నిత్యం చూస్తున్నాము.
దక్షత అంటే సామర్థ్యం, నైపుణ్యం, లేదా పనిని సమర్థవంతంగా నిర్వహించే శక్తి అని అర్థం. ఇది పరిపాలనలో చురుకుదనాన్ని, బాధ్యతను, మరియు పనితీరులోని పరిణితిని సూచిస్తుంది. ఇది సాధారణంగా వ్యాపార, పరిపాలనా, లేదా వ్యక్తిగత సామర్థ్యాన్ని తేలియచేస్తుంది. దక్షత కేవలం ఉద్యోగంలోనేనా లేక ఇతర విషయాలలో కూడా అవసరమా అంటే నిత్యజీవితంలో ప్రతి కార్యం సమర్ధవంతంగా చేయటానికి దక్షత అవసరం ఉంటుంది అని చెప్పవచ్చు. మనకు ఒక సామెత వున్నది అదేమిటంటే మట్టికి పోయిన ఇంటివాడే పోవాలి. నిజానికి మట్టిని తేవటం అనేది చాలా చిన్న పని. అక్కడ ఎటువంటి దక్షత అవసరం లేదు. కానీ అదే దక్షుడు అయిన సొంతమనిషి వెళితే చక్కటి మట్టిని వెతికి తీసుకొని వస్తాడు అనే భావంతో దీనిని వాడుతారు. ఒక సంసారి ఇంటిని నిర్వహించటానికి కూడా దక్షత అవసరం అని అంటాడుభాస్కర శతక కవి.
దక్షుడు లేని యింటికిఁ బదార్థము వేఱొక చోట నుండి వే
లక్షలు వచ్చుచుండినఁ బలాయనమై చనుఁగల్ల గాదు ప్ర
త్యక్షము వాగులున్ వరద లన్నియు వచ్చిన నీరు నిల్చునే
యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా!
ఏరకంగా అయితే కట్టలు తెగిన చెరువులోని నీరు నిలవకుండా పడుతుందో అదే రకంగా ఇంటి యజమాని సమర్ధుడు కాకపొతే ఇంట్లోని ద్రవ్యం మొత్తం వృధాగా ఖర్చు అయి ఆ యిల్లు కష్టాల పాలు అవుతుందని చెపుతున్నాడు కవి.
దక్షుని లక్షణాలు ఎలా వుంటాయో కూడా ఏనుగు లక్ష్మణ కవి సుభాషితాలలో తెలిపాడు.
ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారుఁ బూసెజ్జపై,
నొకచోశాకము లారగించు, నొకచో నుత్కృష్ట శాల్యోదనం, అర్ధం
బొక్కచో బొంత ధరించు, నొక్కొక తఱిన్ యోగ్యాంబర శ్రేణి, లె
క్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్గ
అనగా కార్యసాధకుడైన వాడు తన సౌకర్యములను గూర్చి గాని, లేదా వ్యవస్థను గూర్చి గాని చింతించడు. క్లిష్టమైన పరిస్తితులైన లేక చాలా సౌకర్యమైన పరిస్తితులైన అన్నిటిని సమానంగా చూస్తూ కేవలం తన ద్రుష్టి మాత్రం తాను నిర్వహించవలసిన కార్యం మీద మాత్రమే నిలుపుతూ కార్యాలను సాధిస్తాడని అంటున్నాడు కవి.
దక్షత కలిగిన వాడే చేసే ప్రతి పని ఎంతో నైపుణ్యం గా పరిపూర్ణంగా ప్రశంసాత్మకంగా సత్వరం జరిగేటట్లుగా ఉంటుంది అని వేరే చెప్పనవసరం లేదు. ఏ పనిలో ఆయన ఆ పని చేసే విధానంలోనే చేసే వాడి యొక్క దక్షత తెలుస్తుంది మనం ఎంతో చక్కగా అందంగా ఆకర్షణీయంగా ఉండేటటువంటి పెద్ద పెద్ద భవంతులని చూస్తూ ఉంటాం అంత చక్కటి భవంతులు కట్టాలంటే ఆ నిర్మించిన మేస్త్రీలు తప్పకుండా దక్షులై ఉండాలి అని వేరే చెప్పనవసరం లేదు. అదే పెద్ద చిన్న పనిలో కూడా దక్షత ఎంతో అవసరం ఒక కార్యంలో చక్కగా వంట చేయడం కూడా ఒక దక్షత గమనించవచ్చు రాజ్యాంగ మనం ఏ పెళ్లిళ్లలో కానీ ఫంక్షన్లలో కానీ వెళ్లి భోం చేస్తే అక్కడ వంట ఎవరు చేశారు చాలా బాగా చేశారు అని వంట చేసిన వారిని మెచ్చుకోవటం పరిపాటి ఎంతో ఖర్చుపెట్టినా ఆ ఫంక్షన్ నిర్వహించిన యజమానిని అస్సలు చదవాలి అదే వంట సరిగా చేయకపోతే ఆ యజమాని ఎంత ఖర్చు పెట్టినా అందరి చేత మాట పడాల్సి వస్తుంది అందుకని వంటవారు ఎక్కువ అడిగినా గాని పేరు ఉన్న వంట వాళ్ళని ఎంచుకొని కార్యాలలో వంటలు చేయించడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఒక కార్యాలయాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే ఆ కార్యాలయపు అధికారి దక్షుడు అయి ఉండాలి దక్షుడు అయినటువంటి అధికారి ఉంటే కార్యాలయంలోని అన్ని పనులు సక్రమంగా సమయానుకూలంగా జరుగుతూ ఉంటాయి అదే దక్షుడు కానటువంటి అసమర్ధుడు అయినటువంటి సోమరిపోతు అయినటువంటి అధికారి గనక ఉంటే ఆ కార్యాలయంలో పనిచేసే వాళ్లు కూడా సక్రమంగా పనిచేయకుండా పనులన్నీ వాయిదా వేస్తూ ఆ కార్యాలయం మొత్తం ఒక చెడ్డ పేరు తెచ్చుకోవడమే కాకుండా ఆ కార్యాలయపు పై అధికారి అది గమనిస్తే వెంటనే ఈ కార్యాలయం అధికారిని ఒక తక్కువ పని తక్కువ దక్షతగా నిర్వహించే స్థలానికి బదిలీ చేయటం పరిపాటి
ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్లు
ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్ |
ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని నిర్వహించాలని అనుకుంటే దానిని మూడు రకాల మనుషులు చేయ పూనుకుంటారు సమర్ధుడు అన్నవాడు ఆ కార్యం పూర్వపరాలు పూర్తిగా పరిశీలించి వాటిలోని ఒడిదుడుకులను సమన్వయపరచుకొని ఎటువంటి కష్టనష్టాలు ఎదురైనా వాటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఆ కార్యాన్ని చేస్తాడని అదే మద్యములు ఆ కార్యాన్ని ప్రారంభించి కొంత మటుకు నిర్వహించి ఇక తమ వంతు పని అయిపోయిందని పూర్తి కార్యం చేసే సమర్థత తమకు లేదని మధ్యలోనే జారుకుంటారని నీచ మానవులు ఆ కార్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయటానికి కూడా కోనుకోవాలని అవి అభిప్రాయపడుచున్నాడు మనం సమాజంలో కూడా ఇటువంటి సంఘటనలు అక్కడక్కడ చూస్తూ ఉంటాం కొంతమంది శక్తికి మించిన పనిని కూడా చాకచక్యంగా తమ తోటి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని నిర్వహించటం చూస్తూ ఉంటాం అదే కొంతమంది పని కొంత మటుకు మొదలుపెట్టి మధ్యలో వదిలేసిన వారు ఉంటారు మనం అక్కడక్కడ కొన్ని గృహాలు సగం మటుకు నిర్మించబడి ఉండి వదిలేసిన చూస్తుంటాం దీనికి ఇది ఒక ఉదాహరణ అదే కొంతమందికి ఎంత ధనం ఉన్నా కూడా ఒక గృహాన్ని కూడా కొనలేరు ఎందుకంటే వాళ్లంతాటి వాళ్ళే అనుకుంటారు ఈ గృహాన్ని కొనటం అనేది తమ శక్తికి మించిన దాన్ని భావించి వాటి జోలికే పోరు ఆ ధనాన్ని ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో వాళ్లు తమ జీవితాన్ని గడుపుతారు ఇటువంటి వారు వాళ్ళు సుఖపడలేరు ఎదుటి వాళ్ళను కూడా సుఖపెట్టలేరు అనేది జీవిత సత్యం ప్రతి మనిషి ఒక దక్షిణంగా ప్రవర్తించి ప్రతి కార్యాన్ని నిర్వహిస్తే తన కుటుంబాన్ని అదేవిధంగా సమాజాన్ని చక్కగా అనుసంధానం చేసుకుంటే సమాజంలో అందరూ సుఖసంతోషాలతో ఉండగలుగుతారు
గుతారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి