శ్రీరామ (106)
శుభోదయం.
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
పాపకర్మలవలన ప్రజలు దుఃఖాలను అనుభవిస్తున్నారు అన్నది సామాన్యంగా అందరూ అనేదే.
కానీ నిజానికి సరైనబోధ లేక ప్రజలు దుఃఖాలను అనుభవిస్తున్నారు.
" లాభస్తేషాం, జయస్తేషాం, కుతస్తేషాం పరాభవః, ఏషా మిందీవరశ్యామో హృదయస్థో
జనార్దనః "
(నల్లకలువ ఛాయవంటి మేనిఛాయకలిగిన జనార్దనుడు ఎవరి హృదయంలో ఉంటాడో, వారిదే లాభం, వారిదే జయం.వారికి పరాభవం సంభవించటం అనే మాటే లేదు)
మొదలగు శాస్త్రవాక్యములు భగవంతునియందు మనస్సు లగ్నం చేస్తే సమస్త శుభ ఫలితములు లభిస్తాయని తెలియజేస్తున్నాయి.
ఈ బోధను పట్టించుకోనందువల్లే మనకు దుఃఖాలు.
' సూతసంహిత ' ఈవిధంగా చెబుతోంది.
" ఎవని మనస్సు బ్రహ్మ విచారణయందు క్షణకాలమైనను స్థిరముగా నుండునో అతడు భూమండలములోని సమస్త తీర్థజలములందు స్నానము చేసినవాడగును.
సమస్త భూమిని దానం చేసినవాడగును.
వేయి యజ్ఞములు చేసినవాడును,
సకల దేవతలను పూజించినవాడును,
తన పితరులను సంసారమునుండి ఉద్ధరించినవాడును, అగును.
అతడు మూడులోకములందును పూజింపబడు వాడగును.
ఎవని మనస్సు అపార జ్ఞానానంద సాగరమగు పరబ్రహ్మ యందు లీనమగునో,
అతనిచే వంశమంతయు పవిత్రమగును.
అతని తల్లి కృతార్థురాలగును.
అతడు నివసించే భూమి పుణ్యభూమి యగును.
(శ్లో// స్నాతం తేన సమస్త తీర్థ సలిలే సర్వా ౽ పి దత్తావని /
ర్యజ్ఞానాం చ సహస్ర మిష్ట మఖిలా దేవాశ్చ సంపూజితాః /
సంసారాచ్చ సముద్ధృతాః స్వ పితర స్త్రైలోక్య
పూజ్యో ౽ ప్యసౌ /
యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనః ప్రాప్నుయాత్ /
కులం పవిత్రం, జననీ కృతార్థా, విశ్వంభరా పుణ్యవతీ చ తేన /
అపార సంవిత్సుఖ సాగరే ౽ స్మిన్ లీనం పరేబ్రహ్మణి యస్య చేతసః //
(సూతసంహిత - 2 - 20 - 45)
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
9-3-'26.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి