పాపములు - వ్యాదులు - పరిహారములు.
ప్రస్తుత కాలం లో కొన్ని పాపాలు తెలిసో తెలియకో చేయడం జరుగుతుంది. ఆ పాపాలు మనల్ని రోగాల రూపం లో వెంటాడుతుంది. కొన్ని రకాల జబ్బులకి మనం ఎంత మందులు వాడినా అవి తగ్గవు . అటువంటప్పుడు జబ్బులకి ముందు మందులు వాడాలి . తగ్గకపోతే రెండో ప్రయత్నం గా దానాలు ఇవ్వాలి . మూడో ప్రయత్నం గా మంత్ర జపం చెయించాలి, నాలుగో ప్రయత్నం హొమం చేయాలి .
* గ్రహణ కాలం లో సంభోగం చేయడం మహా పాపం గా పరిగణించబడుతుంది . గురువులని ద్వేషించుట, బ్రాహ్మణులని హింసించుట , ( బ్రాహ్మణ శబ్దమును కు అర్ధం జన్మను బట్టి ఆ కులంలో పుట్టడం కాదు.). ఇవి చేయడం వలన క్షయ, కాన్సర్ వంటి భయంకర వ్యాధులు వస్తాయి .
రేమిడి -
విష్ణు సహస్ర నామ స్తోత్రం భక్తి శ్రద్ధలతో 1116 సార్లు చేయాలి . లేదా రుద్ర సూక్తం 1116 సార్లు చేయాలి . ఆ తరువాత హోమం చేసి వస్త్రాలు దానం చేయాలి .
బ్రాహ్మణుడు అంటే ఎవరు ?
* దేవత్పత్యుపనయనాది సంస్కారాలు అనబడే రెండు జన్మలు గలవాడు.
* బ్రహ్మ వర్చస్సు చేత ప్రకాశించే వాడు.
* బడబాగ్ని వలె తృప్తి లేనివాడు.
* తనని తాను పాపం నుండి రక్షించు కొనుచు ఇతరులుని కుడా రక్షించు వాడు.
* పరబ్రహ్మ యందు నిష్ఠ కలవాడు.
* బ్రహ్మ జ్ఞానం గలవాడు.
జన్మ వలన అందరు శుద్రులే, " కర్మ " వలన ద్విజుడు అవుతున్నాడు. వేదం నేర్వడం వలన విప్రుడు అనిపించు కుంటున్నాడు. బ్రహ్మ జ్ఞానం పొందిన వాడే బ్రాహ్మణుడు అవుతున్నాడు . అటువంటి వారిని హింసించ రాదు . అని అర్దం.
* అన్నం గాని ఏ ఇతర ఆహార పదార్ధాన్ని గాని దొంగిలించరాదు . ఇతరులు తింటున్న ఆహరాన్ని లాగుకోకుడదు. ఇలాంటి పాపం చేయడం వలన శరీరం క్షీణించి పోయే వ్యాధి వస్తుంది.
రేమిడి -
శివుని బొమ్మ ను దానం చేయడం . శివుని బొమ్మ అనగా మట్టితో చేసిన బొమ్మైన కావొచ్చు. గాని దానం చేసే ముందు "ఓం నమః శివాయ " అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 5 వేల సార్లు జపించాలి.
* ఈ జన్మ లో కుష్టు రోగానికి కారణం బ్రాహ్మణుడిని హత్య చేయడం , గురుపత్ని సంగమం, మందులని దొంగతనం గా అమ్మడం , నమ్మిన వానికి విషం ఇచ్చి చంపుట.
రేమిడి -
రుద్ర, ఆయహు సూక్తములని పారయణం చేయడం , సూర్యునిది, ఒక ఎద్దుది బంగారం తో బొమ్మలు చేయించి దానం ఇవ్వవలెను.
దానం అనేది ఇచ్చేవారి ఆర్థిక స్తోమత్తు ను బట్టి ఉంటుంది . బంగారు ప్రతిమలు దానం చేయడం అనేది ఆ రొజులలొ బంగారం చౌకగా ఉండేది కాబట్టి చెప్పబడింది.ఈ రోజుల్లో ఇది సాధ్యపడదు. అందువలన వెండితో ఈ ప్రతిమలు చేయించి కుష్మాండ హొమం జరిపించి పుణ్యాత్ములకు దానం ఇవ్వాలి .కుష్టు రోగం రావడానికి ఇతర కారణాలు ఉన్నాయి . పెద్ద మొత్తం లో దూది కట్టలు అమ్మి డబ్బు తినివేయుట , ఇతరుల బట్టలను దొంగిలించుట, అంతే కాక కంచు అనే లోహంతో చేసిన గిన్నెలను దొంగిలించుట ఇవి కుడా కారణములే.
* దైవం యెక్క ధనం దొంగిలిస్తే పాండురోగం వస్తుంది.
రేమిడి -
కూష్మాండ హొమం చేయవలెను .
* పండితుల యెక్క , గుడ్డి వారి యెక్క డబ్బు దొంగిలించినా, లేదా నిషేధింపబడిన రొజులలో సంభోగం చేసినా భగన్ధరమ్ అనే రోగం వస్తుంది. ఆవులను చంపినా ఈ వ్యాధికి గురికావలసిందే.
రేమిడి -
వెండితో ఆవు ప్రతిమ చేయించి దానం ఇవ్వవలెను.
* నేత్ర రోగములు రావడానికి కారణం కృతఘ్నత , ఇతరుల కళ్ళను పోడిపించడం , పర స్త్రీలను కామం తో చూడటం .
రేమిడి -
పాలు పెసరపప్పు కలిపి నేతితో పాయసం చేసి దానం చేయాలి . గరుక్మంతుని ప్రతిమ రాగిది కాని వెండిది కాని దానం ఇవ్వవలెను. " నేత్ర రక్షా సూత్రం" చదువుతూ హొమం చేయవలెను .
* సద్బ్రాహ్మణులను సన్మార్గులైన వారిని విమర్శించుట , తిట్టుట, తల్లితండ్రులను ద్వేషించుట , ఇంకొకరి ఆహరం ను దొంగిలించుట ఇవన్ని వాతరోగం లేక కీళ్ళ నొప్పుల రోగమునకు కారణం .
రేమిడి -
రాగితో లేడి బొమ్మ తయారు చేసి దానిని కొత్త బట్టలతో సహా వాయుసుక్తం చదువుతూ దానం ఇవ్వవలెను.
* శూల నొప్పి ( colic trouble ) కారణం కన్యలను పాడు చేయుట, జంతు సంభోగం , పని చెసే స్త్రీ ( servent maid ) తో సంబొగం, కొన్ని కొన్ని శాస్త్రోక్తమైన క్రియలు చేయకుండా ఉండుట .ఒకరికి విషం ఇచ్చి చంపుట, లేదా పదునైన ఆయుధం ద్వారా హతమార్చుట, ఇవన్ని కుడా శూల నొప్పి రావడానికి కారణాలు.
" పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేన పీడితః "
అనే సూక్తి ఉన్నది. దాని వలెనే రోగాలు కలుగుతున్నాయి అనే నమ్మకం అయితే పైన చెప్పిన పాపాలకు దీని క్రింద చెప్పిన విరుగుడు చాలా చిన్నది. రెండొవది పాపమనే ది దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణం గా అర్దం మారినది. ఇందులొ విషం ఇచ్చి చంపడం, పదునైన అయుధాల ద్వారా చంపడం ఇవి పాపాలు కావు. రేమిడి లలొ నువ్వులు దానం చేయాలనీ ఉన్నది. పద్మములు దానం చెయవచ్చు. అలాగే త్రిశూలం వెండితో కాని బంగారం తో కాని చేయించి దానం ఇవ్వడం దీనిని జగ్రత్తగా పరిశిలిస్తే శూల నొప్పికి త్రిశూలం దానం చేయడానికి సంభందం ఉన్నదా ? శూల నొప్పిలో ప్రధాన పాత్ర వహించె వాడు శని. నొప్పిని పెంచి ఇబ్బంది పెట్టేవాడు కుజుడు. అందువలన ఈ రెండింటికి సంభందించిన వస్తువులు దానం చేయలి
* 8 కిలోల మినుములు శనివారం సూర్యోదయ వేళలో ప్రారంబించి వృద్ధ బ్రాహ్మణులకు దానం ఇయ్యవలెను.ఈ దానం శివాలయం లొ ఇస్తే మంచిది.
* 6 కిలొల ఎర్రటి మసూర్ పప్పు మంగళవారం సూర్యోదయ వేళలో సుబ్రమణ్య స్వామి కోవెలలో యవ్వనవంతులు అగు యువతులకు దానం ఇవ్వవలెను.
* 14 కిలొల నువ్వులు నవగ్రహాల ఆలయానికి వెళ్లి శని వారం ఉదయం ముసలి బ్రాహ్మణులకు దానం చేయాలి . వారు 8 మంది ఉంటే మంచిది.
* 8 సెం .మీ గాని 8 అంగుళాల పొడవు గల వెండి త్రిశూలం చేయించి దానికి "ఓం నమః శివాయ " అను పంచాక్షరి మంత్రం తో 1116 సార్లు జపించి ధారపోసి ఆతర్వాత దానం ఇవ్వడం మంచిది .
మధుమేహమునకి గోదానం వరుణ మంత్రోచ్చారణ తో చేస్తే మధుమేహం పొతుంది.
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి