ఆధ్యాత్మికం

1. మానవ ప్రయాణం: 
మన  వేదాలు, వేదాల తరువాత ఉపనిషత్తులు. పురాణ ఇతిహాసాలు ఒక్కొక్క హిందూ గ్రంధం మనిషిని ఆధ్యాతిమిక వైపు దృష్టిని మళ్లించటానికి మాత్రమే. కానీ చివరి లక్ష్యం మాత్రం మోక్షం మాత్రమే. వేరే ఏ ఇతర మతాలలో కనీసం మాట వరుసకు కూడా లేని విచారణ మన హిందూ ధర్మంలోని వున్నా అతి ఉన్నతమైన, పవిత్రమైన భావన ఈ మోక్షం. 
వేదాల తరువాత వచ్చినవి వేదాల చివరలో వున్నవి ఉపనిషత్తులు, అందుకే వేదాంతం అని అన్నారు.  నిజానికి ఉపనిషత్తులు వేదాల కన్నా భిన్నమైనవి, ఎందుకంటె వేదాలు కర్మ కాండని తెలుపుతే ఉపనిషత్తులు జ్ఞానాన్ని అంటే జ్ఞాన కాండని తెలుపుతాయి. కర్మలు చేయటం వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేవి వేదాలు ఉపదేశిస్తే, ఉపనిషత్తులు యెట్లా తెలుసుకోవాలి, మనిషి తానె యెట్లా భగవంతుడు గా కావలి అని చెప్పేవి ఇవి. 
ఉపనిషత్తులు చాలా వున్నాయ్ అని అన్నారు, కానీ అందులో 108 ప్రముఖంగా అంతకన్నా ప్రముఖంగా 10 ఉపనిషత్తులు అని పండితులు ప్రస్తావిస్తున్నారు. అన్ని ఉపనిషత్తులు మహా ఋషుల తో జరిగిన సంవాదాలే. అంటే మహర్షులు వారి శిస్యులకు ఇచ్చిన జ్ఞాన సంపద మాత్రమే. 
మనం ఒక విషయం ఇక్కడ ప్రస్తావించాలి. ఏ ఒక్క మహర్షి కూడా యెంత జ్ఞానాన్ని ప్రసాదించిన దానికి తానూ కర్తనని ఎక్కడ పేర్కొనలేదు. తానూ మహాపురుషుల వద్ద నుండి విన్నది, తెలుసుకున్నది మీకు తెలియ చేస్తున్నాను అని నుదువుతారు. దీనిని బట్టి మన మహర్షులు యెంత నిస్వార్ధంగా ఇతరులకు జ్ఞాన బోధ చేసారో తెలుస్తున్నది. ఏ వక్కటి తన గొప్పతనం కాదని వారు నిరాడంబరులుగా వున్నారు. వారి ధ్యేయం కేవలం జ్ఞాన విస్తరణే కానీ తమకు ఖ్యాతి రావాలని ఏ మహర్షి కోరుకోలేదు. 
ఈ రోజుల్లో ఏదో చిన్న విషయం తెలిసినా అది తన ప్రతిభ అని తనకన్నా గొప్పవాళ్ళు లేరనే విధంగా మనుషులు ప్రవర్తిస్తున్నట్లు మనం చుస్తువున్నాం. 
ఉపనిషత్తులలో ఉన్న గొప్ప గొప్ప విషయాలను సూక్షంగా చెప్పే వాక్యాలను మహావాక్యాలు అన్నారు. ఈ వాక్యాలు రెండు లేక మూడు పదాలతో ఉండి భగవత్ శక్తిని తెలియ చేస్తుంటాయి. 
ఉదా : 1) అహం బ్రహ్మస్మి: రెండు పదాలతో వున్నా ఈ మహా వాక్యం నేను బ్రహ్మను ఐ వున్నాను అని తెలుపుతుంది. 
2) తత్ త్వమసి : ఈ మహావాక్యం కూడా చాల ప్రముఖంగా వినబడేది. దీని భావం నీవు వెతికే బ్రహ్మ పదార్ధం నీవే అయి వున్నావు అని చెపుతున్నది. ఈ విధంగా అనేక మహా వాక్యాలు చోటుచేసుకున్నాయి. 
ఉపనిషత్తులు అన్ని కూడా అద్వయిత జ్ఞానాన్ని మనకు తెలియ చేస్తున్నాయ్. అంటే దేముడు జీవుడు వేరు కాదు ఒకటే వివరంగా చెప్పాలంటే ఈ చరా చార సృష్టిని నియంత్రించే శక్తీ ఆయన భగవంతుడు జ్ఞానీ ఒకటే కానీ వేరు కాదు అనే మహోన్నత జ్ఞానం మనకు తెలుపు తున్నాయి. 
ఆది శంకరా చర్య ఈ అద్వియేత జ్ఞానాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అప్పటి బౌద్ధ వాదాన్ని నివారించి భారతావనిలో 
హిందువాన్ని పునరుద్దించారు. బౌద్ధ వాదం నుండి చార్వాక వాదం వెలువడింది ఒక రకంగా చెప్పాలంటే ఇది నాస్తిక వాదం లాంటిదే. 
తరువాత కాలంలో మనకు విశిష్ట అద్విఏతము, ద్వయితం లాంటివి  వచ్చినట్లు మనకు చరిత్ర చెప్పుతున్నది. తరువాత తరువాత ఇప్పుడు నాస్తిక వాదం కూడా వ్యాప్తి చెందుతున్నది. 
కాల గమనంలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని గనుక మనం పరిశీలిస్తే 1) నేను, దేముడు వేరు కాదు నేనే దేముడిని అనే అద్విఏత వాదం 2) నేను దేవుడితో సన్నిహితంగా వుంటాను అనే విశిష్ట అద్వియతః జ్ఞానం, 3) దేముడు వీరు నేను వేరు అనే ద్విఏత జ్ఞానం 4) నాకు దేముడితో పని లేదు నేను చూసే, నేను చేసే దానికి నేనే కర్తను అనే నాస్తిక వాదం. ఇది చార్వాకుడి సిధాంతానికి దగ్గరలో ఉంటుంది. 
ఇవ్వన్నీ పరిశీలిస్తే మనకు ఒక విషయం బోధ పడుతుంది. 
మనిషి పరిణామం ఏ దిశలో వున్నది అన్నది ప్రశ్నర్ధకంగా వున్నది. 
రాను రాను దైవత్వం సన్నగిల్లి మూఢ భక్తి ప్రబలుతున్నది. దేముడి గుడికి వెళితే చాలు నా జన్మ ధన్యమైనది, నేను తిరుపతి దేముడిని దగ్గర నుండి రెకమండేషన్తో చూసాను చాలా ఆనందంగా వుంది, నాకు జన్మ సార్ధకం అయంది. ఫలానా బాబా నాతొ మాట్లాడాడు, అయన కళ్ళకు నేను మొక్కాను నా తలమీద చేయి వేసి నన్ను నిమిరాడు, దీవించాడు, ఫలానా స్వామి నాకు ఉపదేశం చేసాడు ( డబ్బులు తీసుకొని) నేను ధన్యుడిని అయ్యాను. నా కోరికలు తప్పకుండా తీరుతాయి. ఫలానా ఆయనకు, ఆమెకు దేముడు వంటిమీదికి వస్తాడు తాను అడిగినది (డబ్బులు, ఇతరములు) ఇస్తే మన కస్టాలు తీరుతాయి. ఫలానా సమాధి వద్దకు వెళ్లి మొక్కుతె నా కోరికలు తీరుతాయి. ఫలానా బాబా గుడికి వెళ్లి మొక్కితే నాకు మంచి జరుగుతుంది. ఇటువంటి మూఢ భక్తి రోజు రోజుకి పెరుగుతున్నది. దీనికి ఆనకట్ట వేయవలసిన అవసరం వున్నది. 

మనం మన భారత చరిత్రలో ఎంతో శక్తీ గలిగిన మహర్షులని, దేవర్షులని చూసాము. వారు చూపిన అద్భుత శక్తులు మనకు పురాణ ఇతిహాసాలలో కనపడుతున్నాయి. 

సృష్టికి ప్రతి సృష్టి చేసిన బొందితో త్రిశంకుని స్వర్గానికి పంప ప్రయత్నించిన విశ్వామిత్రుడు, చనిపోయిన భార్యను తన కుమారుడైన పరశురాముని కోరికతో బతికించిన జమదగ్ని, కుశుడిని సృష్టించిన వాల్మీకి మహర్షి, తన భార్యను రాయిని చేసిన గౌతమ మహర్షి ఇలా చెప్పుకుంటూ పొతే అనేక మహర్షులు మన భారతావనిలో కనపడతారు. 

నిజానికి అంత గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారిని ఎవ్వరిని కూడా దేముడు అని కొలవ లేదు. అది మన సాంప్రదాయం ఎందుకంటె అప్పుడు భూమిమీద వున్న జనులు అందరు గొప్ప వాళ్ళు శాపాలు ఇవ్వ గలవారు. ఎంతో కొంత తప్పశెక్తి వున్నవాళ్లు. అంతే కాదు ఇప్పటికి కూడా మనం ఆ మహర్షులను దేముళ్ళగా చూడటం లేదు. వాళ్ళకి ఆలా చూడాలి అనే కోరిక కూడా లేదు. 

నేనే దేముడిని: 
నేనే దేముడిని అనే వాదం మొదటి సారిగా మనం హిరణ్యకశ్యపుని చూస్తాము. తాను నేనే దేముడిని అని అనటంలో నిజానికి అర్ధం వుంది కూడా యందు కంటే   హిరణ్యకశ్యపుడు మహా బలవంతుడు, మహా తపోశక్తి వంతుడు. ఇంద్రాది దేవతలని, నవగ్రహాలని తన స్వాధీనంలో తెచ్చుకున్న ధీశాలి. అంత శక్తీ వంతుడు తన శక్తీ వల్ల వచ్చిన గర్వంతో తానూ దేముడిని అని అనుకున్న కొంత అర్ధం వుంది. 

మరి ఇప్పుడు ఎలాంటి శక్తి లేని సామాన్యు మానవులు తాము బాబా లమని సాక్షాతూ ఫలానా దేముడి అవతారలమని, మేము ఆ మాయలు చేస్తాము ఈ మాయలు చేస్తాము  అని సామాన్యు ప్రజలని మభ్య పెట్టి అనేక విధాలుగా వ్యాపారాలు చేస్తూ ఉంటే. అమాయక ప్రజలు వారి మాటలు నమ్మి వారి పూజలు, వ్రతాలు, వారికి అస్ట్తోతరాలు, సహస్ర నామ పూజలు, భజనలు, హారతులు ఇచ్చి తమ మూఢ భక్తిని చాటుకుంటున్నారు. అంతే కాదు ఎవరైనా పండితులు, జ్ఞానులు మీరు చేసేది పొరపాటు అట్లా మన హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలని పాడు చేయవద్దని అంటే వారిని ఇష్టమొచ్చినట్లు విమర్శించటం చేస్తున్నారు.

మన సమాజంలో సరైన మార్గ నిర్దేశం చేసే వారు లేక పోవటమే  దీనికి కారణం. మనం దేముడిని తాత్కాలికమైన ఐహిక మైన తుచ్చమైన వాంచితాలని కొరకుడదని అది అసురత్వం అవుతుందని మనలో చాలా మందికి తెలియదు. దానికి కూడా కరణం లేక పోలేదు. మనలో చాలా మంది శ్రీమత్ భగవత్ గీత జీవితంలో ఒక్క సారి కూడా చదవక పోవటమే. 

శ్రీమత్ భగవత్ గీత లో కృష్ణ భగవానుడు 16 అధ్యాయంలో దివాత్వాన్ని గూర్చి అసురత్వాన్ని గూర్చి నిశితంగా విశదీకరించారు.  ఏ మానవుడు శ్రీమత్ భగవత్ గీత చదువుతాడో అతను తప్పక జీవితంలో ఒక క్రమశిక్షణా పరుడు దేముడి మీద ఒక స్థిర భావం కలిగిన వాడు అవుతాడు. అతను తప్పక మన ముందు కనిపించే ఇతర మనుషులను దేముడిగా అంగీకరించాడు. గీతా జ్ఞానం సంపూర్ణంగా అలవవరచుకున్న మానవుడు సాక్షాత్తు తానే భగవంతుడు అవుతాడు అందుకు సందేహం లేశమంతయినా లేదు. 

ఇప్పటి కాల పరిస్థితుల్లో ప్రతి మనిషికి శ్రీమత్ భగవత్ గీత చదివే ఒక మంచి అలవాటుని చేయాలి. ఏ ఆహరం భుజించే వాడు ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, త్రిగుణాలు ఏమిటి అందులో సత్వ గుణం ఎలా గొప్పది, సత్వ గుణ వంతుడు యెట్లా ప్రవర్తిస్తాడు, రోజా గుణవంతుడు యెట్లా ప్రవర్తిస్తాడు, తమోగుణవంతుడి నడవడి యెట్లా ఉంటుంది లాంటి అనేక విషయాలు ప్రతి మనిషి శ్రీమత్ భగవత్ గీత వల్ల మాత్రమే తెలుసుకోగలరు. 

ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీమత్ భగవత్ గీత మానవాళికి అందించిన ఒక మహా వరం 

మీరు, రామాయణ, మహా భారతాదులు వేదాలు, అష్టా దశ పురాణాలు చదవక పోయిన ఏమి నష్టం లేదు వాటి వల్ల మనకు జ్ఞానం వస్తే రావచ్చు కానీ ఒక్క శ్రీమత్ భగవత్ గీత చదివితే మీకు మంచి నడవడిక వస్తుంది. ఇప్పుడు సమాజంలో లోపిస్తుంది వినయము విధేయత, గౌరవము, మర్యాద. అదే గీత చదివి ఆకళింపు చేసుకునే వాడి వల్ల ఈ సమాజం ఉద్దరించ బడుతుంది. ఏది సత్యం ఏది అసత్యం అనే జ్ఞానం కలుగుతుంది. కాబట్టి మిత్రులారా మీరంతా తప్పక గీతను ముందుగా  చదవండి, చదివించండి. మారె ఇతర హిందూ గ్రంధాన్ని ఆయన గీత చదివిన తరువాత చదవండి. మన హిందూ వాగ్మయం చాలా ప్రశస్తమైనది ప్రతి గ్రంధం అపార జ్ఞానాన్ని మనకు ఇస్తుంది. మన వాగ్ముయం చదవటం కాదు దానిని గూర్చి తెలుసుకోవటానికి ఒక జీవిత కాలం సరిపోదు. అటువండి ఈ మహా వట వృక్షన్ని గడ్డి పరకకన్నా చిన్న గున్న మతాల వాళ్ళు విమర్శిస్తూ ఉంటే మనం చూస్తూ వున్నాము. యెందుకు మనకు మన ధర్మం మీద అవగాహన లేకపోవటం వల్ల శ్రీమత్ భగవత్ గీత గూర్చి ఏమాత్రం తెలియని మూర్ఖులు శ్రీకృష్ణ భగవానుని నీచంగా విమర్శిస్తూ ఉంటే మనం ఏమి చేయటంలేదు. ఎందుకు మనకు శ్రీమత్ భగవత్ గీత గూర్చి తెలియక పోవటం వల్ల.  ఇలా వ్రాసుకుంటూ పోతే ఏమైనా వ్రాయవచ్చు. ఎంతయినా వ్రాయవచ్చు. మన ధర్మం అపారం, ఇది నిరంతరంగా సాగే ఒక ఝరి. అనంతమైనది.  
ఓం తత్సత్ 
ఓం శాంతి శాంతి శాంతిః 
సర్వే జన సుఖినో భవంతు.
******************
శ్రీకృష్ణలీలలు ౼ 3
౼౼౼౼౼౼౼౼౼౼
పడగలపయినిల్పి పాదాలునర్తించు
ఆర్తి ఏమి వచ్చె నయ్య కృష్ణ!
ఆర్తి కానెకాదె! ఆదరంబునుచూపు
నృత్యలీల యద్ది యెరుగుడయ్య!

చీరె లేలనయ్య! కోరి యెత్తుకుపోవ
కొంటెచేష్ట  కృష్ణ! కూడదయ్య
అనగ కొంటెచేష్ట మనసునాకట్టుగా
అట్లె సతులగావ నదియెగోల?

పర్వతంబు కేలపట్టి యెత్తుటయేల!
చిన్నికృష్ణ! మాను చిలిపిచేష్ట
లనిన నాదు లీల లరయ బూనుండయ్య
కృష్ణ తత్వమద్ది తృష్ణ తీర్చు.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం
***************
శ్రీగోదాష్టకం
1) శ్రీకృష్ణదేవరాయవిరచితఆముక్తమాల్యదప్రథాననాయికాం
   నిరంతరశ్రీవిష్ణునామస్మరణతత్పరశ్రీవిష్ణుచిత్తతనూజాం
   శ్రీరంగనాథహృత్కమలస్థితశోభాయమానశ్రీరంగనాయకీం
   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||

2) రత్నమణిమాణిక్యకేయూరవైఢూర్యభూషోజ్జ్వలాం
   చందనహరిద్రాకుంకుమచర్చితభవ్యాంఘ్రితేజోమయీం
   సాంద్రానందకరుణాప్రపూర్ణదివ్యమంగళవిగ్రహాం
   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||
3) సంభ్రమాశ్చర్యజనకవిచిత్రకిరీటవేషధారిణీం
   బ్రహ్మజ్ఞానప్రదాయకప్రపన్నార్తిహరకమలనయనాం
   సంతతశ్రీరంగనాథగుణగానమత్తచిత్తమహాపతివ్రతాం
   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||

4) త్రిభువనైకపాలకసంసారార్ణవతారకమోక్షమార్గనిశ్శ్రేణికాం
   భక్తజనావళిసముద్ధరకారణశ్రీతులసీకాననసముద్భవాం
   భూదేవీస్వరూపఅష్టాక్షరమంత్రరాజభవ్యోపాసినీం
   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||
5) యజ్ఞహవ్యకవ్యఫలదాయకస్వాహాస్వధాస్వరూపిణీం
   సంగీతసాహిత్యవేదశాస్త్రజ్ఞానప్రదాయకకుశాగ్రబుద్ధిం
   అష్టైశ్వర్యప్రదాయకసత్సంతానదాయకమహారాజ్ఞీం
   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||

6) సంక్షోభకల్లోలదుఃఖభరితజనజీవనశాంతిప్రదాయినీం
  శాకసస్యప్రదాయకబలోత్సాహప్రదకరుణాంతరింగిణీం
  సకలగ్రహపీడానివారకసత్ఫలప్రదాయకవిశ్వమాతరం
 యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||
7) గార్హపత్యఆహవనీయదక్షిణాత్యశ్రౌతాగ్నిస్వరూపిణీం
   సహస్రకిరణప్రజ్వలతేజోమయద్వాదశాదిత్యస్వరూపిణీం
   నిరంతరఆరోగ్యభాగ్యదాయకఅశ్వినిదేవతాస్వరూపిణీం
   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||
8) బ్రహ్మతేజప్రదాయకత్రికాలసంధ్యాస్వరూపిణీం
   మృదుమంజులభాషణమందగజగామినీం
   గోపీచందనతిలకాంచితబహుసుందరవదనాం
   యామునయతీశ్వరపూజితచరణాం శ్రీగోదామనసిభావయే ||
   సర్వం శ్రీగోదాదేవిదివ్యచరణారవిందార్పణమస్తు
************************
పగిలిన పెదవులు :

వేద స్వరూపమైన పరమాచార్య స్వామివారు వేదాంత సారమైన అద్వైతాన్ని లీలగా ప్రదర్శించిన వేళ.

చాలా సంవత్సరాల క్రితం శీతాకాలంలో తీవ్రమైన చలి వల్ల పరమాచార్య స్వామివారి పెదవులు ఎండిపోయి, పెద్ద పెద్ద పగుళ్ళు ఏర్పడ్డాయి. శ్రీవారు మాట్లాడితే ఆ పగుళ్ళ వల్ల చాలా బాధ కలిగేది. కానీ, ఆ దయామయుడు దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారిని అనుగ్రహించేవారు.

చలికాలంలో పెదవులు ఎండిపోయి పగుళ్ళు ఏర్పడినప్పుడు, పెదవులకు వెన్న రాయడం వల్ల అవి తగ్గి ఉపశమనం కలిగిస్తుంది. మరలా పెదవులు కోమలంగా అవుతాయి. తరతరాలుగా మనవాళ్ళు పాటిస్తున్నది ఇదే.

కాని సాంప్రదాయం పాటించే స్వామివారు బయట అంగళ్ళలో అమ్మే వెన్నను వాడారు, దాన్ని పెదవులకు పూసుకోరు. మరి ఏమి చెయ్యాలి?
ఒక ముసలావిడ దీన్ని గ్రహించి ఐదు శేర్ల ఆవుపాలు తీసుకుని, వాటిని మరిగించి, మజ్జిగ చేసి బాగా చిలికి వెన్నను తీసింది. దాన్ని పరమాచార్య స్వామివారికి సమర్పించి, “పెరియవా పెదవులు పగిలి ఇబ్బంది పెడుతున్నాయి. నిష్ఠతో మడిగా పాలు చిలికి ఈ వెన్నను తీసాను. పెరియవా పెదవులకు ఈ వెన్న పూసుకోవలసింది” అని ప్రార్థించింది.

మహాస్వామివారు ఆ వెన్నను ఒకసారి చూసారు. బహుశా వారికి ద్వాపర యుగపు సంఘటనలు గుర్తుకు వచ్చాయి ఏమో, చూడగానే చిన్నగా నవ్వారు.

ఆ వెన్నని కేవలం పరమాచార్య స్వామివారి కళ్ళే కాదు మరో రెండు కళ్ళు కూడా అంతే అమితానందాలతో చూస్తున్నాయి. అప్పుడు బహుశా స్వామివారి దర్శనానికి వచ్చిన ఒక బాలుడు ఆత్రుతగా స్వామివద్దకు వచ్చి వెన్న కావలన్నట్టుగా తన చిన్ని చేయి చాచాడు. బాలగోపాలుడే అక్కడకు వచ్చి వెన్న కావాలని అడుగుతున్నాడేమో.

అడగకుండానే మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన కరుణాసముద్రులైన మహాస్వామివారు వెంటనే ఆ వెన్న జాడిని ఆ బాలునికి ఇచ్చేశారు. ఇది చూసిన అక్కడివారందరూ కాస్త ఖేద పడ్డారు. “ఎంత పిల్లాడే అడిగినా నిమ్మపండంత వెన్నను ఇచ్చుంటే సరిపోయేది కదా మొత్తం వెన్నను ఇచ్చేయ్యకుండా” అని అనుకున్నారు.

వారి ఆలోచనల్ని పసిగట్టిన మహాస్వామివారు అక్కడున్న వారితో, “ఎందుకు అందరూ అంత చింతిస్తున్నారు? ఆ వెన్నను ఆ బాలుడు తింటే నా పెదవులు సరిపోతాయి. దిగులు పడకండి” అన్నారు. ఆ సాయంత్రానికే స్వామివారి పెదవుల పగుళ్ళు నయమై మునుపటి వలె అయ్యాయి. బహుశా బాలగోపాలుడు ఆ వెన్నాను తినేశాడేమో.

శరీరములు వేరైనా ఆత్మా ఒక్కటే కదా. అదే కదా అద్వైతం.

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
**********************

*ఆమిషీకృత మార్తాండం;
గోష్పదీ కృత సాగరం|
తృణీకృత దశగ్రీవం
ఆంజనేయం నమామ్యహం*

 సూర్యుడిని మాంసపు ముక్కగా చేసినవానిని, సముద్రాన్ని ఆవు గిట్టతో ఏర్పడిన గుంట మాదిరి చేసినవానిని, రావణాసురుడిని గడ్డి పోచ వలె చూసిన ఆంజనేయునికి నమస్కరించుచున్నాను.
***************

*సప్తమాతృకలు*

 సప్తమాతృకలంటే ఎవరో చూద్దాం. ఈ సప్తమాతృకలకే ఏడుమంది అక్కా చెల్లెల్లని, అక్కమ్మ గారని, ఏడు శక్తిస్వరూపాలని పిలుస్తారు.

వారు
(1) హంసవాహనంగా కల బ్రాహ్మణి, బ్రహ్మ అంశం
(2) గరుడవాహనంగా గల వైష్ణవి, విష్ణువు అంశం
(3)  నెమలివాహనంపై కౌమారి సుబ్రహ్మణ్య స్వామి అంశం
(4) ఐరావతం మీదనున్న ఇంద్రాణి, యింద్రుని అంశం
(5) మహిష వాహనంగావున్న వారాహి, యజ్ఞ వరాహస్వామి అంశం
(6) శవవాహనంగా గల చాముండి, అమ్మవారి భ్రుకుటి మధ్యనుండి వెలువడిన అంశం
(7)  వృషభ
వాహనంగా కల మహేశ్వరి, ఈశ్వరుని అంశం.
********************
శ్రుత్వా సాగరబన్ధనం దశశిరాః సర్వైః ముఖైః ఏకదా
తూర్ణం పృచ్ఛతి వార్తికం స చకితో భీత్యాకులః సంభ్రమః
వద!స్సత్యం అపాంనిధి స్సలిలధిః కీలాలధి స్తోయధిః
పాదోధిః ర్జలధిః పయోధిః ఉదధిః వారాంనిధిః వారిధిః
*********************

శ్రీరామ సేతుబంధన వార్త విన్న 10 తలల రావణుడు ఆశ్చర్యంగా పది తలలతో తొట్రుబాటుతో పలికినది. ఇది హనుమద్రామాయణం లోనిది. ఎంతైనా స్వామి హనుమ నవవ్యాకరణవేత్త కదా. రావణుని తొట్రుపాటు పది తలలతో పలకడం మంచి ఊహ కదా.
************************

*పూర్ణమదః పూర్ణమిదం అర్థం*

*ఓం పూర్ణమదః పూర్ణమిదం పుర్ణాత్పూర్ణముదచ్యతే |*పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||*

మాములుగా ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చుస్తే *"అది పూర్ణం, ఇది పూర్ణం. పూర్ణంనుండి పూర్ణం ఉద్భవిస్తుంది. పూర్ణం నుండి పూర్ణం తీసివేసినా పూర్ణమే మిగులుతుంది." ఇది భగవంతుని పూర్ణ తత్వాన్ని చెప్పే శ్లోకం.* భగవంతుని నుండి ఈ ప్రపంచమంతా ఉద్భవించినా ఆయనయొక్క పూర్ణత్వానికి ఏ లోటు లేదని చెపుతుంది. కానీ ఈ శ్లోకం మామూలు మన బుద్ధులకు అర్థం చేసుకోవటం కష్టం.
అందుకే గురువులు ఈ శ్లోకానికి రెండు చక్కని ఉదాహరణలు చెబుతారు....

*ఒక దీపం ఉందనుకోండి. ఆ దీపంనుండి ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు. ఒక దీపం నుండి ఇలా వెలిగించబడిన మిగిలిన దీపాలు కూడా అంతే కాంతిని కలిగిఉంటాయి. కానీ ఇలా ఎన్ని దీపాలు వెలిగించినా మొదటి దీపానికి వచ్చే లోపం ఏదీ లేదు. అది ఎప్పుడూ పూర్ణంగానే ఉంటుంది.*

*అలాగే మనం ఒక అక్షరం చక్కగా నేర్చుకున్నామనుకోండి, ఆ అక్షరాన్ని మనం ఎంతమందికైనా నేర్పించవచ్చు. అలాగే ఆ అక్షరాన్ని మనం ఎన్నిసార్లైనా వాక్కు ద్వారా, వ్రాత ద్వారా ఉపయోగించవచ్చు. కానీ మనలో ఇమిడిపోయిన ఆ అక్షరానికి ఎటువంటి లోటు రాదు. అది ఎప్పుడూ పూర్ణంగానే మనలో నిలిచి ఉంటుంది.ఇలాంటిదే మనం లెక్కలలో అనంతంని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
***************************

हसता क्रियते कर्म रुदता परिभुज्यते।
दुःखदाता न कोऽप्यस्ति सुखदाता न कश्चन॥

स्वकर्मणा भवेद्दुःखं सुखं तेनैव कर्मणा।
तस्माच्च पूज्यते कर्म सर्वं कर्मणि संस्थितम्॥

హసతా క్రియతా కర్మ
రుదతా పరిభుజ్యతే।
దుఃఖదాతా న కోఽప్యస్తి
సుఖదాతా న కశ్చన॥

స్వకర్మణా భవేద్దుఃఖం
సుఖం తేనైవ కర్మణా।
తస్మాచ్చ పూజ్యతే
సర్వం కర్మణి సంస్థితమ్॥

"మానవుడు కర్మలను నవ్వుతూ చేసి ఏడుస్తూ అనుభవిస్తాడు. అంతేగాక వేరుగా యెవడూ దుఃఖదాతా లేడు. సుఖదాతా లేడు.
మానవుడికి తన పనుల మూలంగానే దుఃఖము, సుఖము కూడా కలుగుతాయి.
అందుచేతనే కర్మ అందరిచేత పూజించబడుతుంది. కర్మలోనే సమస్తమూ గర్భితమై ఉన్నది."
***************************
సంస్కృతం మరియు తెలుగులో మహా మృత్యుంజయ మంత్రం
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् |
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् ||

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||

ఈ మంత్రానికి అర్ధం
అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు,సుగంధ భరితుడు అయిన శివున్ని మేము పుజిస్తున్నాము.
పండు తొడిమ నుండి వేరుపడు విధముగా, మేము కూడా మరణము నుండి, మర్త్యత్వము నుండి విడుదల పొందాలి.
***************

360 కామెంట్‌లు:

«అన్నిటి కంటే పాతది   ‹పాతవి   360లో 201 – 360
PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*126వ నామ మంత్రము*

*ఓం శాంకర్యై నమః*

శాంతి,సౌఖ్యములను చేకూర్చు శంకరుని ఇల్లాలై తన భక్తులకు భౌతిక మరియు ఆధ్యాత్మిక సుఖశాంతులను ప్రసాదించు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శాంకరీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం శాంకర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులు సఖశాంతులతో, ఆధ్యాత్మికానందముతో జీవనముగడుపుదురు.

మనం యోగాలో చేయు ఉచ్ఛ్వాసనశ్వాసల్లో *ఓం* కారం నినదింపజేస్తాము. . ఈ *ఓం* అనే బీజాక్షరం చేత పరమేశ్వరుడు తెలియబడతాడు. అట్టి *ఓం* కారంలో కలిగే అనుభూతినే *శం* అని అంటారు. *శం* అనగా శాంతి,సౌఖ్యము. *కరుడు* అనగా కలిగించేవాడు. అందుకే పరమశివుని *శంకరుడు* అన్నారు.

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను అరిషడ్వర్గములను అదుపులో పెట్టుకోవాలంటే కావలసినది *శమము* అనే శక్తి. అరిషడ్వర్గములను అదుపులో పెట్టిననాడు శాంతి, సౌఖ్యము నిశ్చయంగా లభిస్తాయి. ఈ అరిషడ్వర్గములకు బానిస అయినవాడు శాంతిసౌఖ్యములు కరువై అశాంతి, అసౌఖ్యములతో జీవించుతాడు. హిరణ్యకశిపుడు వరగర్వంతో మదమెత్తి, క్రోధావేశముతో శ్రీహరినే దూషిస్తాడు. సాక్షాత్తు తన పుత్రుడైన ప్రహ్లాదుని హరిభక్తికి మాత్సర్యపూరితుడై తన పుత్రుని నానాహింసలు పెడతాడు. గరళమిచ్చి, సర్పములచేత కరిపించి, పర్వతముల నుండి పడద్రోసి హింసిస్తాడు. శ్రీహరిపై క్రోధము, వరగర్వముతో మదము, తన పుత్రుడు తన వైరిపక్షమైన శ్రీహరిని భక్తుడగుటచే మాత్సర్యము పూరితుడుకూడా అయాడు. కడకు శ్రీహరిచేతనే సంహరింపబడతాడు. పరస్త్రీలోలుడై, రావణబ్రహ్మ కూడా శ్రీహరి అవతారమైన కోదండరాముని చేతిలో హతమవుతాడు. అరిషడ్వర్గములు వశములో పెట్టగలిగే శక్తిని శమము అన్నారు. శమమనే శక్తిని ప్రసాదించే వాడు శంకరుడు. ఆ *శంకరుడు* *ఓంకారము* ద్వారా ప్రసన్నుడై శమము అనే శక్తిని ప్రసాదిస్తాడు. అట్టి శమమును ప్రసాదించే శంకరుని భార్య అయిన జగన్మాత *శాంకరి* అని నామ ప్రసిద్ధమైనది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శాంకర్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*703వ నామ మంత్రము*

*ఓం సర్వమోహిన్యై నమః*

త్రైలోక్యమోహనచక్రస్వరూపిణిగాను, త్రైలోక్యమోహన మంత్రస్వరూపిణిగాను, జగత్తునంతనూ మోహపెట్టునదిగాను విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సర్వమోహినీ* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం సర్వమోహిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరాశక్తిని ఆరాధించు భక్తులు ఆ తల్లి దయచే అనర్థదాయకమైన వ్యామోహపీడితులు కాకుండా పరమార్థిక చింతయందును, ధర్మబద్ధమైన వాటియందును, జగన్మాత పాదసేవయందును ఇష్టము కలిగించి జీవింపజేసి తరింపజేయును.

జగన్మాత అందరినీ మోహ పెట్టునది. మనలో ద్వైతులు, అద్వైతులు అని రెండు తెగలవారున్నారు.అద్వైతులు జ్ఞానము కలిగినవారు. జీవాత్మ, పరమాత్మలు రెండూ ఒకటే అని నమ్ముతారు. అద్వైతులు జీవుడు వేరు, దేవుడు వేరు అంటారు. అద్వైతులను మోహపెడుతుంది. ఐహికవాదులను అరవై నాలుగు తంత్రములద్వారా మోహింపజేస్తుంది. శుద్ధబ్రహ్మను ఆవరించిన మాయయే నిజమని నమ్మేవారిని మోహింపజేస్తుంది. జగత్తంతా మాయ. మాయను దాటి పరబ్రహ్మము ఒకటి ఉంది అని నమ్మేవారికి సాయుజ్యమును ప్రసాదిస్తుంది శ్రీమాత.

క్షీరసాగర మథనమప్ఫుడు దేవతలు, రాక్షసులు అమృతం కోసం పోట్లాట పెట్టుకుంటారు. దేవతలు జ్ఞానులు. రాక్షసులు అజ్ఞానులు గనుక రాక్షసులను మోహంవైపు తిప్పి దేవతలకు అమృతం ప్రసాదించినది మోహిని. ఆ విధంగా అజ్ఞానులను, ఆత్మజ్ఞాన రహితులను మోహంలో పడవేస్తుంది. అందుకే జగన్మాత *సర్వమోహినీ*

మోహం అంటే ఇష్టం. తనభార్య, తన సంపదలు, తన బిడ్డలు - వీరిపై ఇష్టపడితే మోహం అవుతుంది. ఈ మోహానికి ధర్మార్థకామములు తోడైతే తనవరకూ, తనవాటివరకూ, తనవారివరకూ మోహం పరిమితమౌతుంది. అది ధర్మార్థకామముల పరిధిని దాటించి పరస్త్రీ, పరసంపదలు అనేభావన కలిగితే అది వ్యామోహం అవుతుంది. ఇట్టి స్థితిలో జ్ఞానులను అనగా తనభక్తులను మోహంలో ఉంచుతుంది తప్ప వ్యామోహంలో ఉంచదు. మిగిలినవారు వ్యామోహంలో చిక్కుకని, ధర్మార్థకామములు పెడదారిని పట్టించితే అట్టివారికి జన్మరాహిత్యమైనమోక్షమా లేక మళ్ళీ మళ్ళీ జన్మము, అనేక నీచయోనులలో పుట్టి పాపకర్మల ఫలమనుభవించాలా అనునది నిర్ణయిస్తుంది జగన్మాత.

మూలాధార చక్రాన్ని శ్రీ విద్యోపాసనలో త్రైలోక్య మోహన చక్రము అంటారు.ఇది నాల్గు దళములు గల పద్మము. ఈ చక్రమునకు ఆధి దేవత విఘ్నేశ్వరుడు. బీజాక్షరము "లం". జగన్మాత ఈ *త్రైలోక్యమోహన చక్రస్వరూపిణి* లేదా *త్రైలోక్యమోహనమంత్రస్వరూపిణి* గా విరాజిల్లుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సర్వమోహిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*18.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*విలోక్యౌశనసీం రాజంఛర్మిష్ఠా సప్రజాం క్వచిత్|*

*తమేవ వవ్రే రహసి సఖ్యాః పతిమృతౌ సతీ॥7940॥*

పరీక్షిన్మహారాజా! కొంతకాలమునకు పిమ్మట దేవయాని పుత్రవతి అయ్యెను. అంతట ఒకనాడు శర్మిష్ఠ తన ఋతుకాలమున రహస్యముగా యయాతిని పుత్రభిక్ష పెట్టుమని అభ్యర్థించెను.

*18.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*రాజపుత్ర్యార్థితోఽపత్యే ధర్మం చావేక్ష్య ధర్మవిత్|*

*స్మరన్ఛుక్రవచః కాలే దిష్టమేవాభ్యపద్యత॥7941॥*

అంతట ధర్మజ్లుడైన యయాతి రాజపుత్రికయైన శర్మిష్ఠయొక్క అభ్యర్థన (సంతానప్రాప్తికై ఆమె చేసిన ప్రార్థన) సముచితమైనదే యని భావించెను. ఇంతలో శుక్రాచార్యుడు పెట్టిన ఆంక్ష (ఎట్టి పరిస్థితిలోను నీవు ఈమెను చేరదీయరాదు - అను వచనములు) గుర్తునకు వచ్చినను, 'ప్రారబ్ధము ప్రకారము జరుగవలసినది జరుగును' అని భావించి, ఆమె కోరికనుదీర్చెను. (కామేచ్ఛతోగాక పుత్రభిక్ష పెట్టుటకై అతడు అట్లొనర్చెను. *దైవప్రాపితమేవ తత్సంగమ్ - అభ్యపద్యత - నతు కామతః* (వీరరాఘవీయ వ్యాఖ్య)

*18.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*యదుం చ తుర్వసుం చైవ దేవయానీ వ్యజాయత|*

*ద్రుహ్యుం చానుం చ పూరుం చ శర్మిష్ఠా వార్షపర్వణీ॥7942॥*

దేవయానికి యదువు, తుర్వసుడు అను పుత్రులు కలిగిరి. వృషపర్వుని కూతురైన శర్మిష్ఠకు ద్రుహ్యుడు, అనువు, పూరువు అను ముగ్గురు కుమారులు కలిగిరి.

*18.34 (ముప్పది నాలుగ శ్లోకము)*

*గర్భసంభవమాసుర్యా భర్తుర్విజ్ఞాయ మానినీ|*

*దేవయానీ పితుర్గేహం యయౌ క్రోధవిమూర్ఛితా॥7943॥*

*18.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*ప్రియామనుగతః కామీ వచోభిరుపమంత్రయన్|*

*న ప్రసాదయితుం శేకే పాదసంవాహనాదిభిః॥7944॥*

రాక్షస రాజు కూతురైన శర్మిష్ఠకు తన భర్తయగు యయాతివలననే సంతానము ప్రాప్తించినట్లు ఎఱింగి, అహంకారవతియైన దేవయాని మిగుల క్రుద్ధురాలై పుట్టింటికి (తండ్రి కడకు) వెళ్ళెను. కామియైన (స్త్రీ లోలుడైన) యయాతియు తనకు ప్రాణప్రియయైన దేవయానిని అనుసరించి వెళ్ళెను. పిమ్మట అతడు ఆమె కాళ్ళుపట్టుకొని అనునయవచనములతో ప్రసన్నురాలిని చేసికొనుటకై ఎంతగా ప్రయత్నించినను ఫలితము శూన్యమయ్యెను.

*18.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*శుక్రస్తమాహ కుపితః స్త్రీకామానృతపూరుష|*

*త్వాం జరా విశతాం మంద విరూపకరణీ నృణామ్॥7945॥*

పిమ్మట శుక్రాచార్యుడు కుపితుడై "యయాతీ! నీవు స్త్రీ లోలుడవు, మందబుద్ధివి, అసత్యవాదివి. ముసలితనము వలన మానవుని రూపము కళావిహీనమగును. అట్టి వృద్ధత్వము నీకు వెంటనే ప్రాప్తించుగాక" అని పలికెను.

*యయాతిరువాచ*

*18.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*అతృప్తోస్మ్యద్య కామానాం బ్రహ్మన్ దుహితరి స్మ తే|*

*వ్యత్యస్యతాం యథాకామం వయసా యోఽభిధాస్యతి॥7946॥*

*అప్పుడు యయాతి ఇట్లు పలికెను* - బ్రాహ్మణోత్తమా! మీ కూతురగు దేవయానితో నేను పూర్తి సుఖభోగములను అనుభవించినవాడను కాను (దేవయానితో నేను ఇంకను దాంపత్య సుఖములను పొందగోరుచున్నాను. నీవు ఇచ్చిన ఈ శాపము వలన నీ కూతురు సుఖములకును విఘాతము కలుగునుగదా!" అంతట శుక్రాచార్యుడు అతనితో ఇట్లు నుడివెను- "యయాతీ! ఎవ్వరైనను మనస్ఫూర్తిగా తన యౌవనమును నీకు ఇచ్చినచో అతనికి నీ వార్ధక్యమును ఇచ్చివేసి, నీవు సుఖముసు పొందవచ్చును".

*18.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*ఇతి లబ్ధవ్యవస్థానః పుత్రం జ్యేష్ఠమవోచత|*

*యదో తాత ప్రతీచ్ఛేమాం జరాం దేహి నిజం వయః॥7947॥*

*18.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*మాతామహకృతాం వత్స న తృప్తో విషయేష్వహమ్|*

*వయసా భవదీయేన రంస్యే కతిపయాః సమాః॥7948॥*

శుక్రాచార్యుడు ఇట్టి వెసులుబాటును కల్పింపగా యయాతి తన నగరమును చేరి పెద్దకుమారుడగు యదువుతో ఇట్లనెను- "నాయనా! మీ మాతామహుని (తల్లియొక్క తండ్రి) వలన ప్రాప్తించిన నా ముసలితనమును దీసికొని, నీ యౌవనమును నాకు ఇమ్ము. నేను ఇంకను విషయసుఖములయందు తృప్తి చెందలేదు. నీ నుండి తీసికొనిన యౌవనముతో కొంతకాలము భోగములను అనుభవింపగలను.

*యదురువాచ*

*18.40 (నలుబదియవ శ్లోకము)*

*నోత్సహే జరసా స్థాతుమంతరా ప్రాప్తయా తవ|*

*అవిదిత్వా సుఖం గ్రామ్యం వైతృష్ణ్యం నైతి పూరుషః॥7949॥*

*యదువు పలికెను* - "తండ్రీ! నీకు నడిమి వయస్సులో ప్రాప్తించిన ఈ వార్థక్యమును తీసికొనుటకు నేను సిద్ధముగా లేను. ఏలయన, మానవుడు విషయ సుఖములను అనుభవింపకముందే వైరాగ్యమును పొందజాలడు గదా!

PVD Subrahmanyam చెప్పారు...

*18.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*తుర్వసుశ్చోదితః పిత్రా ద్రుహ్యుశ్చానుశ్చ భారత|*

*ప్రత్యాచఖ్యురధర్మజ్ఞా హ్యనిత్యే నిత్యబుద్ధయః॥7950॥*

పరీక్షిన్మహారాజా! యయాతి తన పుత్రులైన తుర్వసుని, ద్రుహ్యుని, అనువును గూడ ఇట్లే అర్థించెను. కాని అనిత్యమైన యౌవనమును శాశ్వతమని భావించుచున్న అల్పజ్ఞులగుటచే వారును అందులకు అంగీకరింపరైరి.

*18.42 (నలుబది రెండవ శ్లోకము)*

*అపృచ్ఛత్తనయం పూరుం వయసోనం గుణాధికమ్|*

*న త్వమగ్రజవద్వత్స మాం ప్రత్యాఖ్యాతుమర్హసి॥7951॥*

అనంతరము వయస్సుచే చిన్నవాడైనప్పటికిని, గుణములచే మిన్నయైన తన తనయుడైన పూరుని పిలిచి యయాతి ఇట్లడిగెను- "నాయనా! నీ అన్నలవలె నీవును నా కోరికను తిరస్కరింపవు గదా!"

*పూరురువాచ*

*18.43 (నలుబది ఒకటవ శ్లోకము)*

*కో ను లోకే మనుష్యేంద్ర పితురాత్మకృతః పుమాన్|*

*ప్రతికర్తుం క్షమో యస్య ప్రసాదాద్విందతే పరమ్॥7952॥*

*18.44 (నలుబది నాలుగవ శ్లోకము)*

*ఉత్తమశ్చింతితం కుర్యాత్ప్రోక్తకారీ తు మధ్యమః|*

*అధమోఽశ్రద్ధయా కుర్యాదకర్తోచ్చరితం పితుః॥7953॥*

*పూరువు పలికెను* "తండ్రీ! మహారాజా!పుత్రునియొక్క శరీరము (జన్మ) నిజముగా తండ్రినుండియే లభించినది. పైగా, తండ్రి అనుగ్రహము ఉన్నచో (సుతునకు) పరమపదము గూడ ప్రాప్తించును. అట్టి స్థితిలో ఈ లోకమున తండ్రి చేసిన మేలునకు ప్రత్యుపకారమును చేయని పుత్రుడు ఎవడుండును? తండ్రియొక్క మనస్సెరిగి ప్రవర్తించువాడు ఉత్తముడు. తండ్రియాజ్ఞ యైనంతనే త్రికరణ శుద్ధిగా దానిని శిరసావహించువాడు మధ్యముడు. తండ్రి ఆదేశమును విధిలోని స్థితిలో అశ్రద్ధతో ఆచరించువాడు అధముడు. ఇక తండ్రి చెప్పినను వినక దానిని వ్యతిరేకించువాడు అధమాధముడు. నిజమునకు అతడు పుత్రుడనని చెప్పికొనుటకే అర్హుడు కాడు. యదార్థముగా అతడు పురీషప్రాయుడు.

*18.45 (నలుబది ఐదవ శ్లోకము)*

*ఇతి ప్రముదితః పూరుః ప్రత్యగృహ్ణాజ్జరాం పితుః|*

*సోఽపి తద్వయసా కామాన్ యథావజ్జుజుషే నృప॥7954॥*

పరీక్షిన్మహారాజా! ఇట్లు పలికిన పిమ్మట పూరుడు సంతోషముతో తండ్రి వార్ధక్యమును స్వీకరించెను. అంతట యయాతియు తన కుమారుడగు పూరుడు ఇచ్చిన యౌవనముతో తనివితీర సుఖములను అనుభవించెను.

*18.46 (నలుబది ఆరవ శ్లోకము)*

*సప్తద్వీపపతిః సంయక్ పితృవత్పాలయన్ ప్రజాః|*

*యథోపజోషం విషయాంజుజుషేఽవ్యాహతేంద్రియః॥7955॥*

అప్పుడు సప్తద్వీపాధిపతియైన యయాతి ప్రజలను తన కన్న బిడ్డలవలె చక్కగా పరిపాలించెను. ఇంద్రియపటుత్వము కలిగియున్న ఆ మహారాజు ఇష్టానుసారముగా తన కోర్కెను దీర్చుకొనెను.

*18.47 (నలుబది ఏడవ శ్లోకము)*

*దేవయాన్యప్యనుదినం మనోవాగ్దేహవస్తుభిః|*

*ప్రేయసః పరమాం ప్రీతిమువాహ ప్రేయసీ రహః॥7956॥*

అప్పుడు దేవయానియు ప్రతిదినము తన ప్రాణనాథుడగు యయాతికి త్రికరణ శుద్ధిగా సేవలొనర్చుచు, ఏకాంతముస ముద్దుమురిపెములతో సంతోషింపజేయుచుండెను.

*18.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*

*అయజద్యజ్ఞపురుషం క్రతుభిర్భూరిదక్షిణైః|*

*సర్వదేవమయం దేవం సర్వవేదమయం హరిమ్॥7957॥*

వేదములచే ప్రతిపాదింపబడిన సకల దేవతల స్వరూపములను విరాడ్రూపుడైన ఆ శ్రీహరివే. ఆ స్వామి వేదమయుడు. ఆ ప్రభువు యజ్ఞపురుషుడు, యజ్ఞభోక్త, యజ్ఞఫలప్రదాత. అంతేగాదు తనను ఆరాధించిన వారియొక్క సకలబాధలను తొలగించువాడు ఆ పరమాత్మ.

*క్రతుభిః సర్వదేవతా శరీరకం, ఆరాధక - ఆర్తిహరం, సర్వయజ్ఞారాధ్యం, తత్ఫలదం, తద్భోక్తారం భగవంతమ్ అయజత్ - (ఆరాధితవాన్)* (వీరరాఘవీయ వ్యాఖ్య)

అట్టి శ్రీహరిని యయాతి పెక్కు యజ్ఞములద్వారా ఆరాధించెను. ఆ మహారాజు ఆయా యజ్ఞములను చేయునప్పుడు ఋత్విక్కులు మొదలగు బ్రాహ్మణోత్తములకు భూరిదక్షిణల నొసంగి తృప్తి పరచెను.

*హతో యజ్ఞస్త్వదక్షిణః* = దక్షిణలను ఒసంగకుండ చేసెడి యజ్ఞము నిష్ఫలము (నీతిశాస్త్రము)

*18.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*

*యస్మిన్నిదం విరచితం వ్యోమ్నీవ జలదావలిః|*

*నానేవ భాతి నాభాతి స్వప్నమాయామనోరథః॥7958॥*

PVD Subrahmanyam చెప్పారు...

*18.50 (ఏబదియవ శ్లోకము)*

*తమేవ హృది విన్యస్య వాసుదేవం గుహాశయమ్|*

*నారాయణమణీయాంసం నిరాశీరయజత్ప్రభుమ్॥7959॥*

ఒక్కొక్కప్పుడు మేఘములు ఆకాశమున విరాజిల్లుచుండును. మరియొకప్పుడు అవి అదృశ్యములగు చుండును. అట్లే చరాచరాత్మకమైన ఈ జగత్తు భగవద్రూపమైన ఈ విశ్వమునందు ఒక్కొక్కప్పుడు వివిధ రూపములలోభాసిల్లుచుండును. మరియొకప్పుడు దృశ్యమానము కాకుండును. అనగా - పాలనదశలో దేవమనుష్యాది నామరూప భేదములతో ఈ జగత్తు ప్రతీతమగుచుండును. ప్రళయకాలమున భగవంతునిలో లీనమై, అవ్యక్తమగుచుండును. ఈ జగత్తు స్వప్నములోని మనోరథములవలె చంచలము, కల్పితము. శ్రీమన్నారాయణుడు సకలప్రాణుల హృదయములలో విరాజమానుడై యుండును. ఆస్వామి స్వరూపము సూక్ష్మాతిసూక్ష్మము. అట్టి సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి ఐన శ్రీహరిని తన మనస్సునందు నిలుపుకొని యయాతి నిష్కామభావముతో భగవదర్పితముగా పెక్కు యజ్ఞములను ఒనర్చెను.

*18.51 (ఏబది ఒకటవ శ్లోకము)*

*ఏవం వర్షసహస్రాణి మనఃషష్ఠైర్మనఃసుఖమ్|*

*విదధానోఽపి నాతృప్యత్సార్వభౌమః కదింద్రియైః॥7960॥*

ఈ విధముగా యయాతి, చంచలములైన షడింద్రియములచే వేయి సంవత్సరములపాటు మానసిక భోగములను అనుభవించుచున్నను అతనికి తనివిదీరకుండెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే అష్టాదశోఽధ్యాయః (18)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు పదునెనిమిదవ అధ్యాయము (18)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*127వ నామ మంత్రము*

*ఓం శ్రీకర్యై నమః*

సమస్త సంపదలను మరియు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను అనుగ్రహించు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శ్రీకరీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులు సిరిసంపదలు, ఆధ్యాత్మిక సంపదలు సంప్రాప్తమయి ఆనందముతో, ఆత్మానందానుభూతితో జీవింతురు.

జగన్మాత అష్టలక్ష్మీ స్వరూపిణి. భక్తులకు కేవలం పాడిపంటలు, సిరిసంపదలు మాత్రమేగాక ఒక గృహస్థుకు కావలసిన విద్య, ఆరోగ్యము, కష్టములనెదుర్కొనే ధైర్యము, వంశాభివృద్ధి (సంతానము), పాడిపంటలు, తలచిన ధర్మకార్యములందు విజయము, వస్తువాహనములను మరియు ధర్మార్థకామములను పురుషార్థములకు అనుగుణంగా, పూర్వజన్మ కర్మఫలము ననుసరించి అనుగ్రహించు అష్టలక్ష్మీ స్వరూపిణి.

*శ్రీ* అంటే సంపదమాత్రమేకాదు. సర్వ శుభకరం. సర్వ మంగళకరం. మనకు కావలసింది అదేకదా. సిరిసంపదలు, వస్తువాహనములు, పాడిపంటలకు లోటు లేకున్నప్పటికిని అందరూ సంతోషంగా ఉండాలి. దుఃఖకరమైనది ఏదియు సంభవింపకూడదు. ఏదైనా పని చేయునప్పుడు *శ్రీ* కారం చుట్టాము అంటాము. అంటే తలపెట్టిన కార్యము శుభకరము గాను, మంగళకరముగాను జరగాలనే భావనేకదా ఈ *శ్రీకారం* చుట్టాము అని అనడంలోని అంతరార్థము. శ్రీకారం చుట్టామంటేనే సర్వమంగళకారిణి అయిన జగన్మాతను తలచినట్లేగదా. అందుకు ఆ తల్లి తలచిన పనులు అవిఘ్నముగా, సర్వశుభకరముగా సిద్ధింప జేయును. అందుకే జగన్మాత *శ్రీకరీ* అని అనబడినది. నారాయణుడు అంటే శ్రీమన్నారాయణుడు. నారాయణి అంటే జగన్మాత. విష్ణుసహస్రంలో

*శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః* (విష్ణుసహస్ర నామస్తోత్రము, 65వ శ్లోకము, రెండవ పాదము)

పై శ్లోకంలో *శ్రీకరః* (శ్రీకరుడు) అని శ్రీమన్నారాయణుని స్తుతించాము.

ఇక్కడ నారాయణి కూడా *శ్రీకరి* అని స్తుతింపబడుతూ, మువురమ్మల (మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతి) అనడంచేత కూడా *శ్రీకరీ* అని నామ ప్రసిద్ధమైనది.

*అష్టలక్ష్ములు*

1) ఆదిలక్ష్మి, 2) ధాన్యలక్ష్మి, 3) ధైర్యలక్ష్మి, 4) గజలక్ష్మి, 5) సంతాన లక్ష్మి, 6) విజయలక్ష్మి, 7) విద్యాలక్ష్మి, 8) ధనలక్ష్మి.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శ్రీకర్యై నమః* అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*704వ నామ మంత్రము*

*ఓం సరస్వత్యై నమః*

జ్ఞానాధిష్ఠాన దేవతా స్వరూపిణిగా, జ్ఞానముద్రాస్వరూపిణిగా, ప్రాణుల జిహ్వలయందు వాగ్రూపిణిగా, సరస్వతి యను నదీస్వరూపిణిగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సరస్వతీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం సరస్వత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు సాధకులకు ఆ తల్లి కరుణచే చక్కని వాక్పటిమ, పలువురిలో మన్ననలందగల సంభాషణా చాతుర్యత, (విద్యార్థులయినచో) విద్యాబుద్ధులు, వేదాధ్యయనులకు వాక్శుద్ధి సంప్రాప్తించును ఆ జగన్మాత ఆరాధనలో.

సరస్వతి యనగా జ్ఞానిభిమానినీ దేవత. జ్ఞానముద్రస్వరూపురాలు గూడా. అనగా బ్రహ్మజ్ఞాన స్వరూపురాలు. అజ్ఞానముచే జ్ఞానమావరింపబడినది అనగా ప్రాణులు మోహమును పొందుచున్నారు. ఈ విషయం *సర్వమోహినీ* (703వ నామములో చెప్పబడినది. జ్ఞానమంటే అద్వైతము (జీవుడు, దేవుడు ఒకటే), అజ్ఞానము అద్వైతము అనగా జీవుడు వేరు, దేవుడు వేరు. అలా అన్నప్ఫుడు అజ్ఞాని మోహావేశభరితుడై భౌతికసుఖలోలత్వమునకు ఆశపడును.

వ్యాఘ్రపాదుడు అను మహాత్ముని కుమారులు ఉపమన్యు మరియు దౌమ్యుడు. ఈ దౌమ్యుడు కన్యకలకు నామకరణము చేయునపుడు రెండు సంవత్సరముల కన్యకకు సరస్వతి అని పేరు పెట్టెను. అందుచే రెండుసంవత్సరముల కన్యక భరద్వాజస్మృతిలో ప్రాణులందరి జిహ్వలందు వాక్కులకు స్థానమై ఎల్లప్పుడు ఉంటుంది గనుక, సరస్వతి వాగ్రూపురాలు అయి ఉండుటచేతను,రెండు సంవత్సరముల కన్యకకు సరస్వతి అని పేరు పెట్టిరి. అందుచేతనే రెండు సంవత్సరముల కన్యకను సరస్వతిగా నవరాత్రులలో ఆరాధించు సాంప్రదాయము గలదు.
అందరి జ్ఞానదృష్టులు ఈ రెండు వత్సరముల కన్యకపై యుండును గనుక ఆ రెండువత్సరముల బాలికకు సరస్వతి అని నామమును నిర్ణయించిరి. జగన్మాత *సరస్వతీ* యని ఈ కారణముచే చెప్పదగును. ఈ సరస్వతి సర్వులకు జ్ఞానదృష్టులను స్రవింపజేయుటచే గూడ, జగన్మాత *సరస్వతీ* యను నామముచే ప్రసిద్ధురాలు. జగన్మాత జ్ఞానప్రవాహ.

పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది.

సృష్టిచేయాలని బ్రహ్మ తపస్సు చేసినప్పుడు అతని శరీరం నుంచి పదిమంది కుమారులు, పదిమంది కుమార్తెలు ఉద్భవించారు. కుమార్తెలలో చివరిది శతరూప. ఆమెయే సరస్వతి.

సరస్వతీ నది హిందూ పురాణములలో చెప్పబడిన ఓ పురాతనమైన నది.
ఆ తరువాత మహాభారతములో ఈ నది ఎండిపోయినట్లు చెప్పబడింది. కాని సరస్వతీ నది అంతర్వాహినియై ఉంటుందని, ప్రయాగవద్ద గంగా, యమునలలో అంతర్వాహినిగా కలిసి, త్రివేణీ సంగమము ఏర్పడినదని పురాణగాథ.

మూలాధారం నుండి సహస్రారం దిశగా కుండలినీ శక్తి సుషుమ్నా మార్గంలో పయనిస్తుంది. సుషుమ్నాకు ఇరువైఫుల ఉండే ఇడ, పింగళ నాడులు రెండూ గంగ, యమునలు అయితే, సుషుమ్నా నాడి సరస్వతీ రూపము. ఆవిధంగా జగన్మాత సరస్వతీ స్వరూపురాలు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సరస్వత్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*19.1 (ప్రథమ శ్లోకము)*

*స ఇత్థమాచరన్ కామాన్ స్త్రైణోఽపహ్నవమాత్మనః|*

*బుద్ధ్వా ప్రియాయై నిర్విణ్ణో గాథామేతామగాయత॥7961॥*

*శ్రీశుకుడు పలికెను* - "పరీక్షిన్మహారాజా! యయాతి ఈ విధముగా స్త్రీలోలుడై సుఖభోగములలో మునిగి తేలుచుండెను. ఒకనాడు అతడు తన జీవితము పతనోన్ముఖమై సాగుచున్నట్లు గ్రహించి, విరక్తిని పొందెను. అంతట అతడు తనకు ప్రియమైన దేవయానికి ఈ గాథను తెలిపెను.

*19.2 (రెండవ శ్లోకము)*

*శృణు భార్గవ్యమూం గాథాం మద్విధాచరితాం భువి|*

*ధీరా యస్యానుశోచంతి వనే గ్రామనివాసినః॥7962॥*

భృగువంశజురాలైన దేవయానీ! నావలె విషయసుఖ లోలుడైన వానియొక్క గాథను తెలిపెదను వినుము. ఇట్టి గృహస్థులను ఉద్ధరించుటకై, జితేంద్రియులైన వనవాసులు (మునులు; వారికై జాలిపడుచు) ఆలోచించుచుందురు.

*19.3 (మూడవ శ్లోకము)*

*బస్త ఏకో వనే కశ్చిద్విచిన్వన్ ప్రియమాత్మనః|*

*దదర్శ కూపే పతితాం స్వకర్మవశగామజామ్॥7963॥*

ఒకానొక మేకపోతు వనములలో తనకు ఇష్టమైన వస్తువుకొఱకై వెదకుచు అటునిటు సంచరించు చుండెను. అప్పుడు అది కర్మవశముస బావిలో పడియున్న ఒక మేకను చూచెను.

*19.4 (నాలుగవ శ్లోకము)*

*తస్యా ఉద్ధరణోపాయం బస్తః కామీ విచింతయన్|*

*వ్యధత్త తీర్థముద్ధృత్య విషాణాగ్రేణ రోధసీ॥7964॥*

పిమ్మట మేకపోతు ఆ మేకను బావిలోనుండి గట్టెక్కించుటకై ప్రేమతో ఉపాయమును ఆలోచించెను. అది తన కొమ్ముల కొనలతో ఒడ్డున త్రవ్వి బావిలోనికి మార్గమును ఏర్పరచెను.

*19.5 (ఐదవ శ్లోకము)*

*సోత్తీర్య కూపాత్సుశ్రోణీ తమేవ చకమే కిల|*

*తయా వృతం సముద్వీక్ష్య బహ్వ్యోఽజాః కాంతకామినీః॥7965॥*

*19.6 (ఆరవ శ్లోకము)*

*పీవానం శ్మశ్రులం ప్రేష్ఠం మీఢ్వాంసం యాభకోవిదమ్|*

*స ఏకోఽజవృషస్తాసాం బహ్వీనాం రతివర్ధనః|*

*రేమే కామగ్రహగ్రస్త ఆత్మానం నావబుధ్యత॥7966॥*

పొందికగా ఉన్న ఆ మేక బావిలో నుండి బయటికి వచ్చిన పిదప ఆ మేకపోతును వరించెను. యౌవనములో నున్న ఆ మేకపోతు చక్కని మీసములుగలిగి దృఢముగా ఉండెను. రతిక్రీడకై ఉత్సాహపడుచు మేకలకు హాయిని కొల్పునదై యుండెను. అట్టి మేకపోతును జూచి, తక్కిన మేకలన్నియును దానిపై మోహపడసాగెను. అంతట ఆ ఒక్క మేకపోతే అచటి మేకలన్నింటితో క్రీడించుచు వాటిని సుఖపెట్టుచుండెను. కామాతురయైన ఆ మేకపోతు ఆ పిచ్చిలోబడి తన వివేకమును పూర్తిగా కోల్పోయెను.

*19.7 (ఏడవ శ్లోకము)*

*తమేవ ప్రేష్ఠతమయా రమమాణమజాన్యయా|*

*విలోక్య కూపసంవిగ్నా నామృష్యద్బస్తకర్మ తత్॥7967॥*

*19.8 (ఎనిమిదవ శ్లోకము)*

*తం దుర్హృదం సుహృద్రూపం కామినం క్షణసౌహృదమ్|*

*ఇంద్రియారామముత్సృజ్య స్వామినం దుఃఖితా యయౌ॥7968॥*

అప్పుడు బావిలోనుండి బయటపడిన మేక, తన భర్తయైన పోతుపై మరులుగొనిన మరియొక మేకతో తన పతి (పోతు) క్రీడించుట చూచి, దాని చేష్టలను సహింపలేకపోయెను. అంతట అది 'ఈ మేకపోతు మిక్కిలి కామాతుర. దీని ప్రేమ క్షణికమైనది. కనుక, దీనిని విశ్వసింపరాదు. ఇది మిత్రరూపములో ఉన్న శత్రువు. అనగా - పయోముఖ విషకుంభము' అని భావించి ఇంద్రియలోలుడైన తన భర్తను త్యజించి, కుమలిపోవుచు తన పాలకుని కడకు వెళ్ళిపోయెను.

*19.9 (తొమ్మిదవ శ్లోకము)*

*సోఽపి చానుగతః స్త్రైణః కృపణస్తాం ప్రసాదితుమ్|*

*కుర్వన్నిడవిడాకారం నాశక్నోత్పథి సంధితుమ్॥7969॥*

అంతట ఆ మేకపై మోహములో మునిగియున్న ఆ పోతు దైన్యముతో ఒప్పుచు దానిని (ఆ మేకను) సానుకూలముగా జేసికొనుటకై బ్రతిమాలుచు వెంటబడెను. ఎంతగా ఆ పోతు 'మే-మే' అని అఱచుచు వెంబడించినను అది (ఆ పోతు) దానిని (ఆ మేకను) దారికి తీసికొని రాలేకపోయెను.

PVD Subrahmanyam చెప్పారు...

*19.10 (పదియవ శ్లోకము)*

*తస్యాస్తత్ర ద్విజః కశ్చిదజాస్వామ్యచ్ఛినద్రుషా|*

*లంబంతం వృషణం భూయః సందధేఽర్థాయ యోగవిత్॥7970॥*

*19.11 (పదకొండవ శ్లోకము)*

*సంబద్ధవృషణః సోఽపి హ్యజయా కూపలబ్ధయా|*

*కాలం బహుతిథం భద్రే కామైర్నాద్యాపి తుష్యతి॥7971॥*

ఆమె యజమాని ఒక బ్రాహ్మణుడు. అతడు జరిగిన విషయమును విని మిగుల క్రుద్ధుడై ఆ మేకపోతు యొక్క వృషణములను కోసివేసెను. పిమ్మట శక్తిమంతుడైన ఆ ద్విజుడు తన కూతురైన ఆ మేకకు మేలు చేయుటకొఱకై వాటిని ఎప్పటివలె సంధించెను. ప్రియురాలా! అట్లు వృషణములు జోడింపబడిన పిదప ఆ మేకపోతు బావినుండి లభించిన ఆ మేకతో పెద్దకాలము తనివిదీర సుఖించెను. ఐనను నేటికిని ఆ పోతుకు తృప్తి తీరకుండెను.

*19.12 (పండ్రెండవ శ్లోకము)*

*తథాహం కృపణః సుభ్రు భవత్యాః ప్రేమయంత్రితః|*

*ఆత్మానం నాభిజానామి మోహితస్తవ మాయయా॥7972॥*

చక్కని కనుతీరుగల సుందరీ! ప్రస్తుతము నా పరిస్థితి గూడ ఆ మేకపోతువలె ఉన్నది. నేను నీ ప్రేమ పిచ్చిలోపడి మిక్కిలి దీనుడనై యున్నాను. నీ మాయలో చిక్కుపడియుండుటచే నేను ఇప్పటికిని నా శ్రేయస్సును గూర్చి నేను ఆలోచింపకున్నాను.

*19.13 (పదమూడవ శ్లోకము)*

*యత్పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః|*

*న దుహ్యంతి మనఃప్రీతిం పుంసః కామహతస్య తే॥7973॥*

*19.14 (పదునాలుగవ శ్లోకము)*

*న జాతు కామః కామానాముపభోగేన శామ్యతి|*

*హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే॥7974॥*

లోకమున అంతులేని కోరికలతో కొట్టుమిట్టాడుచున్న మానవునకు ధనధాన్యములు, వెండి బంగారములు, పశుసంపదలు, భార్యాపుత్రులు ఇవి యేమియు మనస్సునకు తృప్తిని ఇయ్యజాలవు. మానవుడు విషయభోగములను ఎంతగా అనుభవించినను ఆ భోగవాసనలు చల్లారవు (వదలవు) సరిగదా, అతనిలో అవి వృద్ధిచెందుచునే యుండును. ఎట్లనగా, ఎంతగా ఆహుతులను సమర్పించినను అగ్నిజ్వాలలు తగ్గకుండుటయే గాక, అవి ఇంకను ఎగసిపడుచుండునుగదా!

*19.15 (పదిహేనవ శ్లోకము)*

*యదా న కురుతే భావం సర్వభూతేష్వమంగళమ్|*

*సమదృష్టేస్తదా పుంసః సర్వాః సుఖమయా దిశః॥7975॥*

మనుష్యుడు సకల ప్రాణుల యెడలను, వస్తువులమీదను రాగద్వేష వైషమ్యములను వీడినప్పుడే అతడు సమదృష్టి కలవాడగును. అనగా సమదర్శియగును. అప్పుడు అతనికి అన్ని దిక్కులును సుఖమయములుగా తోచును.

*19.16 (పదహారవ శ్లోకము)*

*యా దుస్త్యజా దుర్మతిభిర్జీర్యతో యా న జీర్యతే|*

*తాం తృష్ణాం దుఃఖనివహాం శర్మకామో ద్రుతం త్యజేత్॥7976॥*

మందబుద్ధులు (అజ్ఞానులు) అంత సులభముగా తృష్ణను త్యజింపజాలరు. శరీరమున వార్ధక్యము ప్రవేశించుచుండగా అది శిథిలమగుచుండును. కాని, అతనిలో తృష్ణమాత్రము నిత్యనూతనముగా పెంపగుచునే యుండును. కావున శ్రేయస్సును (శాంతిని) కోరుకొనువాడు వెంటనే తృష్ణను వీడవలెను.

*19.17 (పదిహేడవ శ్లోకము)*

*మాత్రా స్వస్రా దుహిత్రా వా నావివిక్తాసనో భవేత్|*

*బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి॥7977॥*

తల్లితో, తోబుట్టువుతో, కూతురుతో ఒకే ఆసనముపై కూర్చుండరాదు. ఏలయన, ఇంద్రియముల శక్తి బలీయమైనది. అవి ఎంతటి విద్వాంసుని ఐనను చలింపజేయును. కనుక, స్త్రీలు సాన్నిహిత్యమును సర్వదా త్యజింపవలెను.

*19.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*పూర్ణం వర్షసహస్రం మే విషయాన్ సేవతోఽసకృత్|*

*తథాపి చానుసవనం తృష్ణా తేషూపజాయతే॥7978॥*

నేను పూర్తిగా వేయిసంవత్సరముల నుండి తరచుగా విషయసుఖములను అనుభవించుచునే యుంటిని. ఐనను వాటియందు (సుఖభోగములయందలి) లాలస అనుక్షణము వృద్ధి చెందుచునే యున్నది.

*19.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*తస్మాదేతామహం త్యక్త్వా బ్రహ్మణ్యాధాయ మానసమ్|*

*నిర్ద్వంద్వో నిరహంకారశ్చరిష్యామి మృగైః సహ॥7979॥*

అందువలన నేను అట్టి భోగతృష్ణను త్యజించి, మనస్సును భగవంతునిపై నిలిపెదను. శీతోష్ణ సుఖదుఃఖాది ద్వంద్వములకు అతీతుడనై, అహంకార మమకారములు లేనివాడనై వనములలో మృగములతో గూడి నివసింతును.

*19.20 (ఇరువదియవ శ్లోకము)*

*దృష్టం శ్రుతమసద్బుద్ధ్వా నానుధ్యాయేన్న సంవిశేత్|*

*సంసృతిం చాత్మనాశం చ తత్ర విద్వాన్ స ఆత్మదృక్॥7980॥*

ఇహలోక సుఖములుగాని, పరలోక సుఖములుగాని (ఐహికాముష్మిక సుఖములలో ఏవైనను) శ్రేయస్కరములుగావు. కనుక, ఎవ్వడైనను వాటిని గూర్చి ఆలోచింపరాదు. వాటికి లోనుకారాదు. చింతించుటవలన జననమరణ చక్రమున చిక్కుపడవలసి వచ్చును. అనుభవించుటవలన ఆత్మనాశము సంభవించును. ఈ రహస్యమును ఎరిగి, వీటికి దూరముగా ఉన్నవాడే నిజమైన ఆత్మజ్ఞాని".

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*705వ నామ మంత్రము*

*ఓం శాస్త్రమయ్యై నమః*

శాస్త్రములే తన శరీరావయవములుగా, ఉచ్ఛ్వాస నిశ్శ్వాసములే వేదాలుగా ఒప్పారు జగన్మాతకు నమస్కారము..

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శాస్త్రమయీ* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం శాస్త్రమయ్యై నమః* అని ఉచ్చరించుచూ, పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు భక్తులకు జగన్మాత అనంతమైన జ్ఞానసంపదను ప్రసాదించి, సుఖసంతోషములతోను మరియు పరమేశ్వరీ నామ స్మరణలో జీవించి తరించును.

జగన్మాత మాతృకా వర్ణరూపిణి. శృతులు, స్మృతులు, శాస్త్రాలు అన్ని వర్ణమయమే. అందుచే చతుర్వేదాలు, 1) శిక్ష, 2) వ్యాకరణము, 3) ఛందస్సు, 4) నిరుక్తము, 5) జ్యోతిషము, 6) కల్పము, 7) మీమాంస, 8) న్యాయము, 9) పురాణము, 10) ధర్మశాస్త్రము - ఇవన్నీ సరస్వతీ రూపమయితే, ఆ సరస్వతియే జగన్మాత.ఈ శాస్త్రాలన్నిటిలో పరబ్రహ్మతత్త్వమునే వివరించటం జరుగుతుంది. అందుచేత సరస్వతీ స్వరూపిణి అయిన జగన్మాత *శాస్త్రమయి* అనడం జరుగుతోంది.

బ్రహ్మపురాణంలో పరమేశ్వరి శరీర అవయవాలే శాస్త్రాలు. ఆ తల్లి ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలే వేదాలు.

పరమేశ్వరినుంచి ఆవిర్భవించిన శాస్త్రాలు ఇవియే.

1)అభిమానంతో - మహామంత్రాలు, 2) మధురాలాపనతో - కావ్యాలు, నాటకాలు, అలంకారాలు. 3) జిహ్వ నుంచి సరస్వతి, 4) చుబుకముసుండి - వేదాంగములు, 5) కంఠం ఊర్థ్వరేఖ నుంచి - మీమాంస, న్యాయశాస్త్రము, 6) కంఠం మధ్యరేఖ నుండి - ఆయుర్వేదము, 7) కంఠం మొదటి రేఖనుంచి - చతుష్షష్టి తంత్రాలు, 8) బాహువుల నుంచి -కామశాస్త్రము. ఇవన్నీ జగన్మాతనుంఢి ఉద్భవించిన శాస్త్రాలు. అందు చేతనే జగన్మాత *శాస్త్రమయీ* అను నామముతో స్తుతింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శాస్త్రమయ్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*128వ నామ మంత్రము*

*ఓం సాధ్వ్యై నమః*

ఎన్ని జన్మలెత్తిననూ పరమేశ్వరుడే తన భర్తగా పొంది, శివునిలో సగభాగమైనది. దక్షయజ్ఞ సమయంలో తన భర్తకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక యజ్ఞకుండంలో తనను తాను ఆహుతి చేసుకున్నది. అటువంటి అనన్య సామాన్యమైన పాతివ్రత్యంతో ఒప్పారు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సాధ్వీ* యను రెండక్షరముల (ద్వ్యయక్షరీ) నామ మంత్రమును *ఓం సాధ్వ్యై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతసు ఉపాసించు సాధకునకు ఆ పరమేశ్వరీ కరుణాకటాక్షములచే సర్వాభీష్టసిద్ధి చేకూరును.

పతివ్రతలు ఎంతోమంది ఉన్నారు. వారు జన్మలెత్తునపుడు ఆయా జన్మలలో భిన్న శరీరములతో ఉన్న భర్తలు పొందుతుంటారు. కాని జగన్మాత మాత్రం ఒకే స్థూలశరీరం ఉన్మ పరమేశ్వరునే పొందుచున్నది. అంతేకాదు పరమేశ్వరుని శరీరంలో సగభాగం తన సొంతం చేసుకున్నది.

ఇదేవిషయాన్ని ఆది శంకరులు సౌందర్యలహరిలో 96వ శ్లోకం లో ఇలా చెప్పారు.

*కళత్రం వైధాత్రం - కతికతి భజంతే న కవయః*

*శ్రియో దేవ్యాః కోవా - న భవతి పతిః కైరపి ధనైః|*

*మహాదేవం హిత్వా - తవ సతి సతీనామచరమే‌*

*కుచాభ్యా మాసంగః - కురవకతరో రప్య సులభః||96||*

సతీదేవీ! గొప్పకవులను సరస్వతీవల్లభులంటారు. గొప్ప సంపన్నులను లక్ష్మీపతులంటారు. కాని నీ కౌగిలింత మాత్రము ఈశ్వరునకు మాత్రమే లభించును. గోరింట చెట్టుకు కూడా లభించదు.

*భావం*

అమ్మా! పతివ్రతాగ్రగణ్యా - ఎందరెందరో కవులు సరస్వతిని ఉపాసించి ఆమె అనుగ్రహం తో కవీశ్వరులై సరస్వతీవల్లభులనిపించుకుంటున్నారు. అలాగే లక్ష్మీదేవి ని ఆరాధించి ఆమె దయతో ధనవంతులై లక్ష్మీపతులు అవుతున్నారు.కాని అమ్మా శివునికి మాత్రమే సొంతమై శివుని లో అర్ధభాగమై ఉండు నీ అనుగ్రహం పొందుట మాత్రం అంత తేలికైన విషయం కాదు.లోకంలో కురవకవృక్షం ( గోరింటాకు చెట్టు) పండుటకు ఉత్తమ స్త్రీ ఆలింగనం చెప్పబడి ఉన్నది.నీ ఉద్యానవనం లో ఆ చెట్టుకు నీవు దోహదం చేయునప్పుడు కూడా ఆ వృక్షమునకు నీ స్పర్శ నీలో అర్ధభాగమైన సదాశివునితోనే తప్ప శివేతరగా (శివుడు లేకుండా) నిన్ను తాకుట కుదరదు.అటువంటి పతివ్రతవు నీవు.పతివ్రతలలో అగ్రగణ్యవు ( ముందు లెక్కింపవలసినదానవు) నీవు.

ఇచట శ్రీ శంకరులు చెబుతున్నది ఏమనగా - బ్రహ్మ లేకుండా సరస్వతిని ఉపాసించి సరస్వతిని మాత్రం పొందవచ్చు, విష్ణువు లేకుండా లక్ష్మి ని ఉపాసించి లక్ష్మి‌ని మాత్రం పొందవచ్చు.కాని జగన్మాత విషయంలో మాత్రం అలాకాదు, ఆమె ఒక్కరేగా నిన్ను అనుగ్రహించదు. ఆమె అనుగ్రహం పొందాలంటే అర్ధనారీశ్వరులైన వారిరువురినీ కలిపి ఉపాసించవలసినదే. అంతేకాదు లోకంలో ఎవరైనా ఎప్పటికైనా విద్యావంతులు కావచ్చు, లక్ష్మీవంతులు కావచ్చు కాని లలితా కటాక్షవంతులు కావటం మాత్రం పరమ దుర్లభం.ఎంతో కఠోరమైన "యమ నియమ ఆసన ప్రత్య ఆహార ధ్యాన ధారణ సమాధి" ఇత్యాది అష్టాంగ యోగ నిష్ఠాగరిష్టులై అనన్య భక్తితో ఉపాసించు వారికి తప్ప ఇతరులకు ఇది సాధ్యం కాదు.ఇహ లోకంలో సుఖములను ఉపకరించు ఈ విద్యా, ధనం పొందినంత సులభం కాదు పరలోకంలో ముక్తిని అనుగ్రహించు అమ్మ పాదాలు పొందుట అని కవి భావము

జగన్మాతకు నమస్కరించునపుడు
*ఓం సాధ్వ్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*22.10.2020 ప్రాతః కాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*నవమ స్కంధము - పందొమ్మిదవ అధ్యాయము*

*యయాతి గృహత్యాగము చేయుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*19.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*ఇత్యుక్త్వా నాహుషో జాయాం తదీయం పూరవే వయః|*

*దత్త్వా స్వాం జరసం తస్మాదాదదే విగతస్పృహః॥7981॥*

*19.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*దిశి దక్షిణపూర్వస్యాం ద్రుహ్యుం దక్షిణతో యదుమ్|*

*ప్రతీచ్యాం తుర్వసుం చక్రే ఉదీచ్యామనుమీశ్వరమ్॥7982॥*

*19.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*భూమండలస్య సర్వస్య పూరుమర్హత్తమం విశామ్|*

*అభిషిచ్యాగ్రజాంస్తస్య వశే స్థాప్య వనం యయౌ॥7983॥*

విషయసుఖములయెడ విరక్తుడైన యయాతి తన భార్యయగు దేవయానితో ఇట్లు పలికిన పిదప పూరునకు అతని యౌవనమును అప్పగించి, అతనినుండి తన వార్ధక్యమును స్వీకరించెను. పిమ్మట ఆ మహారాజు తన రాజ్యమునకు ఆగ్నేయ భాగమునగల ప్రదేశమునకు ద్రుహ్యుని, దక్షిణమునగల ప్రదేశమునకు యదువును, పశ్చిమభాగమునకు తుర్వసును, ఉత్తరభాగమునకు అనువును ప్రభువులనుగా జేసెను. సర్వసమర్థుడైన పూరును సమస్త భూమండలమునకు పట్టాభిషిక్తుని గావించి, ప్రజాపాలన భారమును, ఆయనకు అప్ఫగించెను. అతని సోదరులు అందరును అతని వశములో ఉండునట్లు గావించి, తాను వనములకు వెళ్ళెను.

*19.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*ఆసేవితం వర్షపూగాన్ షడ్వర్గం విషయేషు సః|*

*క్షణేన ముముచే నీడం జాతపక్ష ఇవ ద్విజః॥7984॥*

ఆ యయాతి పెక్కు సంవత్సరముల పాటు విషయసుఖ భోగములను అనుభవించియుండెను. ఐనను ఱెక్కలు వచ్చిన పక్షి గూటినివలె, అతడు విరక్తుడై క్షణములో తన సర్వస్వమును త్యజించి వెళ్ళిపోయెను.

*19.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*స తత్ర నిర్ముక్తసమస్తసంగ ఆత్మానుభూత్యా విధుతత్రిలింగః|*

*పరేఽమలే బ్రహ్మణి వాసుదేవే లేభే గతిం భాగవతీం ప్రతీతః॥7985॥*

యయాతి వనములకు చేరిన పిమ్మట సర్వసంగపరిత్యాగియై ఆత్మసాక్షాత్కారమును పొంది త్రిగుణమయమైన లింగదేహమును వీడెను. ప్రశస్తుడైన అతడు మాయకు అతీతమగు పరబ్రహ్మమైన వాసుదేవుని యందు లీనమై, భాగవతోత్తములకు ప్రాప్యమైన మోక్షమును పొందెను.

*19.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*శ్రుత్వా గాథాం దేవయానీ మేనే ప్రస్తోభమాత్మనః|*

*స్త్రీపుంసోః స్నేహవైక్లవ్యాత్పరిహాసమివేరితమ్॥7986॥*

*19.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*సా సన్నివాసం సుహృదాం ప్రపాయామివ గచ్ఛతామ్|*

*విజ్ఞాయేశ్వరతంత్రాణాం మాయావిరచితం ప్రభోః॥7987॥*

*19.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*సర్వత్ర సంగముత్సృజ్య స్వప్నౌపమ్యేన భార్గవీ|*

*కృష్ణే మనః సమావేశ్య వ్యధునోల్లింగమాత్మనః॥7988॥*

యయాతి చెప్పిన మేకపోతు గాథను విన్న పిమ్మట - దేవయాని ఇట్లు తలపోసెను. 'పరస్పరానురాగముగల స్త్రీ పురుషులకు విరహబాధ ఏర్పడినప్పుడు మనస్సులు వికలమగుచుండునని తెలుపుటకే పరిహాసపూర్వకముగా అతడు ఈ గాథను చెప్ఫెను. కాని ఇది పరిహాస ప్రస్తావన ఏమాత్రమూ గాదు. వాస్తవముగా తనలో అంతర్మథనము జరుగుటకై అనగా - తనను నివృత్తి మార్గమునకు మళ్ళించుటకై ఈ కథను చెప్పెను. స్వజనులు (పతి, పత్నీపుత్రాదులు) అందరుసు భగవధీనములోనివారు. వీరి కలయిక దాహార్తులై చలివేంద్రమునకు వచ్చి చేరిన బాటసారుల సమాగమము వంటిది. అని భగవన్మాయా విలసితము, స్వప్నసదృశము. ఇట్లు భావించిన పిమ్మట దేవయాని లౌకికములైన సమస్త విషయములయెడ ఆసక్తిని వీడెను. కృష్ణపరమాత్మయందే మనస్సును నిలిపి ఆమె తన స్థూలదేహమును పరిత్యజించెను.

*19.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే|*

*సర్వభూతాధివాసాయ శాంతాయ బృహతే నమః॥7989॥*

వాసుదేవుడు జగతృష్టికారకుడు. ఆ స్వామి సకలప్రాణులలో అంతర్యామిగా వెలుగొందుచుండును. ఆయన పరమశాంత స్వరూపుడు. విరాట్ స్వరూపుడు. సకలలోకములకును ఆధారభూతుడు. అట్టిభగవంతునకు నమస్కరించుచున్నాను. ఈ ప్రార్థనను శుకమహర్షిగాని, సూతుడుగాని చేసినట్లు భావింపనగును.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ఏకోనవింశోఽధ్యాయః (19)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు పందొమ్మిదవ అధ్యాయము (19)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*129వ నామ మంత్రము*

*ఓం శరచ్చంద్రనిభాననాయై నమః*

శరత్కాల చంద్రునితో పోల్చదగిన ముఖబింబం గలిగిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి
యందలి *శరచ్చంద్రనిభాననా* అను ఎనిమిది అక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం శరచ్చంద్రనిభాననాయై నమః* అని ఉచ్చరిస్తూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులు సర్వాభీష్టసిద్ధి పొందును.

సంవత్సరములోని ఆరు ఋతువులలో శరదృతువుకు ఒక ప్రత్యేకత ఉన్నది. శరదృతువునందే చంద్రుని కాంతి స్వచ్ఛముగా, కాంతివంతముగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందునా శరదృతువునందు పూర్ణ చంద్రునికాంతి అత్యంత రమణియంగా ఉంటుంది, కన్నుల పండువుగా ఉంటుంది. అదే విధంగా జగన్మాత ముఖబింబం శరత్కాలమునందు పున్నమి చంద్రబింబమువలె అందముగా, స్వచ్ఛంగా ఉన్నది.

శంకర భగవత్పాదులవారు సౌందర్య లహరిలో ఇలా చెప్పారు.

*స్మితజ్యోత్స్నాజాలం - తవ వదనచంద్రస్య పిబతాం*

*చకోరాణామాసీ -దతిరసతయా చంచుజడిమా |*

*అతస్తే శీతాంశో -రమృతలహరీ మామ్లరుచయః*

*పిబంతీ స్వచ్ఛందం - నిశి నిశి భృశం కాంజి కధియా || 63 ||*

చకోర పక్షులు దేవి చిఱునగవులనే వెన్నెలను గ్రోలుచున్నవి. అవి అతి మధురములైనందున అందుకు విరుగుడుగా అమృతమును పుల్లని కడుగునీళ్ళగా భావించి త్రాగుచున్నవి.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శరచ్చంద్రనిభాననాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*20.1 (ప్రథమ శ్లోకము)*

*పూరోర్వంశం ప్రవక్ష్యామి యత్ర జాతోఽసి భారత*

*యత్ర రాజర్షయో వంశ్యా బ్రహ్మవంశ్యాశ్చ జజ్ఞిరే॥7990॥*

*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! ఇప్పుడు పురుమహారాజు వంశమును గూర్చి తెలిపెదను. నీవును ఆ వంశమునకు చెందినవాడవే. ఆ వంశమున పెక్కుమంది రాజర్షులు, బ్రహ్మర్షులు జన్మించిరి.

*20.2 (రెండవ శ్లోకము)*

*జనమేజయో హ్యభూత్పూరోః ప్రచిన్వాంస్తత్సుతస్తతః|*

*ప్రవీరోఽథ నమస్యుర్వై తస్మాచ్చారుపదోఽభవత్॥7991॥*

*20.3 (మూడవ శ్లోకము)*

*తస్య సుద్యురభూత్పుత్రస్తస్మాద్బహుగవస్తతః|*

*సంయాతిస్తస్యాహంయాతీ రౌద్రాశ్వస్తత్సుతః స్మృతః॥7992॥*

పురుమహారాజు యొక్క కుమారుడు జనమేజయుడు. అతని పుత్రుడు ప్రచిన్వంతుడు. ఆయన తనయుడు ప్రవీరుడు. ప్రవీరుని కుమారుడు నమస్యుడు. అతని కొడుకు చారుపదుడు. అతని సుతుడు సుద్యుడు. వాని కుమారుడు బహుగవుడు. అతని పుత్రుడు సంయాతి. ఆయనకు కలిగినవాడు అహంయాతి. అతని కుమారుడు రౌద్రాశ్వుడు.

*20.4 (నాలుగవ శ్లోకము)*

*ఋతేయుస్తస్య కక్షేయుః స్థండిలేయుః కృతేయుకః|*

*జలేయుః సంతతేయుశ్చ ధర్మసత్యవ్రతేయవః॥7993॥*

*20.5 (ఐదవ శ్లోకము)*

*దశైతేఽప్సరసః పుత్రా వనేయుశ్చావమః స్మృతః|*

*థఘృతాచ్యామింద్రియాణీవ ముఖ్యస్య జగదాత్మనః7994॥*

జగత్తునకు ఆత్మభూతుడైన ముఖ్యునకు దశేంద్రియముల వలె రౌద్రాశ్వునివలన *ఘృతాచి* అను అప్సరసయందు పదిమంది పుత్రులు కలిగిరి. వరుసగా వారిపేర్లు - ఋతేయువు, కుక్షేయువు, స్థండిలేయువు, కృతేయువు, జలేయువు, సంతతేయువు, ధర్మేయువు, సత్యేయువు, వ్రతేయువు, చివరివాడు వనేయువు.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*130వ నామ మంత్రము*

*ఓం శాతోదర్యై నమః*

కృశించిన నడుము, ఉదరము గలిగిన సర్వజననికి నమస్కారము.

లెక్కలేనన్ని గుహలు గులవాడు శాతోదరుడు అనగా హిమవంతుని పుత్రిక అయిన జగన్మాతకు నమస్కారము.

తారకాసుర సంహారమునకు హిమంతుని ఇంట హైమావతిగా సతీదేవి జన్మించినది.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శాతోదరీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం శాతోదర్యై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తితో ఆ హైమావతి అయిన జగన్మాతను ఉపాసించు సాధకులు భౌతికంగా కుటుంబంలో సుఖసంతోషములను ధర్మార్థకామమోక్షముల కనుగుణంగా అనుభవించుచూ ఆ తల్లి కరుణచే సత్కార్యాచరణలో మేటిగా ఖ్యాతివహించి తమ ధర్మార్థకామమోక్షముల స్థాయిననుసరించి మోక్షము నందెదరు.

దక్షుని కుమార్తె *సతీదేవి* (దాక్షాయణి) శివునికి ఇల్లాలు. కాని దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయ్యింది. తరువాత ఆమె హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వత రాజ తనయ గనుక 'పార్వతి' అని ఆమె పిలువబడింది. తీవ్రమైన తపసు ఆచరించి (ఉమ, అపర్ణ అనే పేర్లు ఈ తపసు కారణం వలన వచ్చాయి.) శివుని వరించింది. శివుడు ఆమెను తన శరీరంలో సగంగా స్వీకరించాడు.

శాతోదరీ అనగా కశించిన శరీరము గలిగినది. స్త్రీ సాముద్రిక లక్షణాలలో సన్నని నడుము ఒక అందమైన లక్షణము.

హిమవంతునికి మరోపేరు శాతోదరుడు. అనగా లెక్కలేనన్ని గుహలు గలవాడు. అతని హమావతి. శాతోదరుని కుమార్తె శాతోదరి అనికూడా పేరు గలదు. తారకాసుర సంహారానికి హైమావతిగా పరమేశ్వరి జన్మించినది అనికూడా పురాణాలు చెబుతున్నాయి.

లలితా సహస్రనామావళి (36వ నామ మంత్రము) *లక్ష్యరోమ లతాధారతా సమున్నేయ మధ్యమా* కంటిచే చూడదగు సన్నని నూగారు తీకగు ఆధారంగా ఊహింపదగిన నడుము (సన్నని నడుము) గలిగినది జగన్మాత.ఈ సన్నని నడుము. సన్నని నడుము సూక్ష్మతను తెలియజేస్తుంది. ఈ సూక్ష్మత వల్ల సమస్త చరాచర జగత్తుకు జగజ్జనని ఆధారభూతమై జగన్మాత ఉన్నదని గూఢార్థము.

సన్నని నడుము సదాచార సంపన్నతకు గుర్తు. *కులాంగనా* (92వ నామ మంత్రము) పాతివ్రత్యాది గుణశీలతులు గలిగినది జగన్మాత. *సాధ్వీ* (128వ నామ మంత్రము) అనన్య సామాన్య పాతివ్రత్యంతో ఒప్పారు జగన్మాత)

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*20.6 (ఆరవ శ్లోకము)*

*ఋతేయో రంతిభారోఽభూత్త్రయస్తస్యాత్మజా నృప|*

*సుమతిర్ధ్రువోఽప్రతిరథః కణ్వోఽప్రతిరథాత్మజః॥7995॥*

*20.7 (ఏడవ శ్లోకము)*

*తస్య మేధాతిథిస్తస్మాత్ప్రస్కణ్వాద్యా ద్విజాతయః|*

*పుత్రోఽభూత్సుమతే రైభ్యో దుష్యంతస్తత్సుతో మతః॥7997॥*

రాజా! ఋతేయువు యొక్క కుమారుడు రంతిభారుడు. రంతిభారునకు సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడు అను ముగ్గురు తనయులు కలిగిరి. అప్రతిరథుని కుమారుడు కణ్వుడు. అతని సుతుడు మేధాతిథి. మేధాతిథికి ప్రస్కణ్వులు మొదలగు బ్రాహ్మణులు జన్మించిరి. సుమతి కుమారుడు రైభ్యుడు. రైభ్యుని పుత్రుడు దుష్యంతుడు.

*20.8 (ఎనిమిదవ శ్లోకము)*

*దుష్యంతో మృగయాం యాతః కణ్వాశ్రమపదం గతః|*

*తత్రాసీనాం స్వప్రభయా మండయంతీం రమామివ॥7997॥*

*20.9 (తొమ్మిదవ శ్లోకము)*

*విలోక్య సద్యో ముముహే దేవమాయామివ స్త్రియమ్|*

*బభాషే తాం వరారోహాం భటైః కతిపయైర్వృతః॥7998॥*

ఒకనాడు దుష్యంతమహారాజు కొంతమంది సైనికులతో గూడి వేట నిమిత్తమై వనములకు వెళ్ళెను. ఆ సందర్భమున అతడు యాదృచ్ఛికముగా కణ్వమహర్షి ఆశ్రమమునకు చేరెను. అచట ఆ ప్రభువునకు హాయిగా కూర్చొనియున్న ఒక తరుణి కనబడెను. లక్ష్మీదేవివలె విరాజిల్లుచున్న ఆ యువతి చక్కని తన లావణ్యశోభలతో ఆ పరిసరములనే శోభిల్ల జేయుచుండెను. దేవమాయవలె మనోహరముగా ఉన్న సర్వాంగసుందరియగు ఆ శకుంతలను జూచినంతనే అతడు మిగుల ఆకర్షితుడాయెను.

*20.10 (పదియవ శ్లోకము)*

*తద్దర్శనప్రముదితః సన్నివృత్తపరిశ్రమః|*

*పప్రచ్ఛ కామసంతప్తః ప్రహసఞ్శ్లక్ష్ణయా గిరా॥7999॥*

*20.11 (పదకొండవ శ్లోకము)*

*కా త్వం కమలపత్రాక్షి కస్యాసి హృదయంగమే|*

*కిం వా చికీర్షితం త్వత్ర భవత్యా నిర్జనే వనే॥8000॥*

*20.12 (పండ్రెండవ శ్లోకము)*

*వ్యక్తం రాజన్యతనయాం వేద్మ్యహం త్వాం సుమధ్యమే|*

*న హి చేతః పౌరవాణామధర్మే రమతే క్వచిత్॥8001॥*

ఆమెను చూచినంతనే ఆ మహారాజు ముగ్ధుడైపోయెను. అతని అలసటలు అన్నియును తొలగిపోయినట్లయ్యెను. ఆ ముద్దుగుమ్మను చూచుటతో ఆయన మోహము మొగ్గదొడిగెను. అప్పుడు ఆ ప్రభువు చిరునవ్వును చిందించుచు మధురముగా ఇట్లు ప్రశ్నించెను - "తరుణీ! చూడముచ్చటగా నున్న నీవు ఎవరు? మీ తల్లిదండ్రులు ఎవరు? ఈ నిర్జన ప్రదేశమున నీవు ఏమి చేయగోరుచున్నావు? ఏమి చేయుచుందువు? తన్వీ! నీ అందచందములనుబట్టి 'నీవు ఒక రాజ కన్యవు' అని నాకు అనిపించుచున్నది. నేను పురుమహారాజు వంశమునకు చెందినవాడను. పౌరవుల మనస్సులు అధర్మమార్గమునకు మరలవు".

*శకుంతలోవాచ*

*20.13 (పదమూడవ శ్లోకము)*

*విశ్వామిత్రాత్మజైవాహం త్యక్తా మేనకయా వనే|*

*వేదైతద్భగవాన్ కణ్వో వీర కిం కరవామ తే॥8002॥*

*20.14 (పదునాలుగవ శ్లోకము)*

*ఆస్యతాం హ్యరవిందాక్ష గృహ్యతామర్హణం చ నః|*

*భుజ్యతాం సంతి నీవారా ఉష్యతాం యది రోచతే॥8003॥*

*శకుంతల ఇట్లు పలికెను* "మహావీరా! మీరు అనుకొన్నట్లు నేను క్షత్రియ కన్యనే. మా తండ్రి విశ్వామిత్రుడు. తల్లియగు మేనక నన్ను ఇచటనే విడచి పెట్టి పోయినది. ఈ నా జన్మ వృత్తాంతమునకు కణ్వమహర్షియే ప్రమాణము. నేను ఆయన పర్యవేక్షణలో పెరిగినదానను, మిమ్ములను మేము ఎట్లు సేవింపవలెను? సుందరాంగా! ముందు సుఖాసీనుడవు కమ్ము. మా అతిథ్యమును స్వీకరింపుము. ఈ ఆశ్రమమున నీవారాన్నములు (నివారములు వనములలో లభించెడి బియ్యములు) గలవు. నీకు ఇష్టమైనచో ఆరగింపుము. నచ్చినచో ఇచట కొంత విశ్రాంతి తీసికొనవచ్చును".

*దుష్యంత ఉవాచ*

*20.15 (పదిహేనవ శ్లోకము)*

*ఉపపన్నమిదం సుభ్రు జాతాయాః కుశికాన్వయే|*

*స్వయం హి వృణుతే రాజ్ఞాం కన్యకాః సదృశం వరమ్॥8004॥*

*20.16 (పదహారవ శ్లోకము)*

*ఓమిత్యుక్తే యథాధర్మముపయేమే శకుంతలామ్|*

*గాంధర్వవిధినా రాజా దేశకాలవిధానవిత్॥8005॥*

*దుష్యంతుడు పలికెను* "శుభాంగీ! నీవు పలికిన ఈ స్వాగత సత్కారవచనములు కుశికవంశ సంజాతవైన నీ యొక్క ఔన్నత్యమునకు తగినట్లే ఉన్నవి. రాజకన్యలు అన్నివిధములుగా తమకు అనువైన వరుని స్వయముగా కోరుకొనుచుందురు". అందులకు శకుంతల ఊకొట్టుటతో (అంగీకరించుటతో) దేశకాల మర్యాదలను ఏఱిగిన దుష్యంతమహారాజు శకుంతలను గాంధర్వవివాహ విధానమున ధర్మయుక్తముగా పెండ్లియాడెను.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*131వ నామ మంత్రము*

*ఓం శాంతిమత్యై నమః*

జ్ఞానాధిక్యమైన ప్రజ్ఞానఘన స్థితిలో శాంతియుతమైన మనస్సు గలిగి విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.

తురీయావస్థలో మనోవృత్తులు ముఖ్యప్రాణమునందు లయమైనవేళ, బుద్ధిమాత్రమే జాగరూకమైయుండి, నవరసములలో కేవలం శాంతరసము మాత్రమే యుండునది ప్రజ్ఞానఘనస్థితి. అట్టి ప్రజ్ఞానఘనస్థితిలో ఇచ్ఛా క్రియాంశలు దాదాపు పోయి జ్ఞానశక్తిమాత్రమే ఉంటుంది. జ్ఞానాధిక్యమే దైవాంశము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శాంతిమతీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం శాంతిమత్యై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు నిశ్చయముగా జ్ఞానాధిక్యమైన దైవాంశతో వర్ధిల్లి అనాయాసమైన పునర్జన్మరాహిత్యమైన ముక్తిని పొందగలడు.

జగన్మాత శాంతియుతమైన మనస్సుగలిగి యుంటుంది. *ప్రజ్ఞానఘనరూపిణి* అనగా అవిద్యాసంబంధములేని మహోన్నత జ్ఞానస్వరూపిణి. శుద్ధపరబ్రహ్మము. భక్తుల నిమిత్తమై సగుణాకార రూపము దాల్చిన శ్రీమాత. భక్తులయందు జగన్మాతకు తీక్షణమైన భావము ఉండదు. అంతరింద్రియ నిగ్రహము గలిగినది. జగన్మాతకు గల అంతరింద్రియ నిగ్రహమువలన ఏర్పడే మానసికమైన సుఖావస్థయే శాంతము. నవమావరణమందు జగన్మాత ఉన్నప్పుడు శాంతరసముతో విరాజిల్లుతుంది. తురీయావస్థలో మనోవృత్తులు మఖ్యప్రాణమందు లయమౌతాయి. అట్టి స్థితిలో బుద్ధి జాగృతమై ఉంటుంది. ఇదే ప్రజ్ఞాన ఘనస్థితి. ఈ ప్రజ్ఞానఘనస్థితిలో క్రింద వివరించిన నవరసములలో తొమ్మిదవది అయిన *శాంతరసము* మాత్రమే నెలకొనియుంటుంది. ఈ స్థితిలో ఇచ్ఛా మరియు క్రియాంశములు ఇంచుమించు లేకపోయి, కేవలం జ్ఞానశక్తి మాత్రమే విలసిల్లుతూ ఉంటుంది. ఈ జ్ఞానాధిక్యత దైవాంశమునకు సంకేతము.

తొమ్మిది ప్రాథమిక రసాలను నవరసాలు అంటారు. అవి:

1) శృంగార, , 2) హాస్య, 3) కరుణ,
4) రౌద్ర, 5) వీర, 6) భయానక, 7) బీభత్స, 8) అద్భుత, *9) శాంత*

1) *శాంభవీ* (122వ నామ మంత్రము) - శంభుని పత్ని లేదా ఎనిమిది వత్సరముల కన్య,

2) *శర్వాణీ* (124వ నామ మంత్రము) శర్వుని (శివుని) పత్ని,

3) *సాధ్వీ* (128వ నామ మంత్రము) - అనన్యసామాన్యమైన పాతివ్రత్యంతో ఒప్పారు జగన్మాత,

4) *శరచ్ఛంద్రనిభాననా*, (129వ నామ మంత్రము) - శరత్కాల పూర్ణచంద్రునితో పోల్చదగిన ముఖబింబం గలిగిన పరమేశ్వరి,

5) *శాతోదరీ*(130వ నామ మంత్రము) - కృశించిన సన్నని నడుముగలిగిన లేదా అనేక గుహలు గలిగిన శాతోదరుని (హిమవంతుని) కుమార్తె,

6) *శాంతిమతి* (131వ నామ మంత్రము) - శాంతిస్వరూపిణి అయిన పరమేశ్వరి

పై ఆరుగురూ భవానీదేవి యొక్క అంగదేవతలు.

112వ నామ మంత్రము నుండి 131వ నామ మంత్రము వరకూ శాంభవీ విద్యకు సంబంధించిన నామ మంత్రములు.

1) *శర్మదాయినీ* (125వ నామ మంత్రము) - భక్తులకు సుఖశాంతులను ప్రసాదించునది,

2) *శాంకరీ* (126వ నామ మంత్రము) - సకల సుఖాలను కలుగ జేయు శంకరుని భార్య,

3) *శ్రీకరీ* (127వ నామ మంత్రము) - లక్ష్మీకరము, శుభకరములు ప్రసాదించు పరాశక్తి.

పై మూడు నామ మంత్రములు మూడునూ శాంభవీ విద్యోపాసనవలన ఫలశృతి.

ఇక శాంభవీదేవిని ఎప్పుడు ఉపాసించాలనునది 123వ నామ మంత్రములో చెప్పబడినది.

*శారదారాధ్యా* (123వ నామ మంత్రము) - వసంత ఋతువులోని నవరాత్రులలో పూజించవలెనని రుద్రయామళములో చెప్పబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శాంతిమత్యై నమః*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*706వ నామ మంత్రము*

*ఓం గుహాంబాయై నమః*

హృదయమను గుహలో ఛాయారూపిణియై తేజరిల్లు జగన్మాతకు నమస్కారము.

హృదయస్థానమునందు దహరాకాశంలో ఉండే గుహయందుండు పరమేశ్వరికి నమస్కారము.

కుమారస్వామికి (గుహునికి) మాతగా విరాజిల్లు శ్రీమాతకు నమస్కాము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *గుహాంబా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం గుహాంబాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ తల్లి కరుణచే సర్వాభీష్టసిద్ధి ప్రాప్తించును.

హృదయస్థానంలో దహరాకాశం అనే గుహ గలదు. అటువంటి గుహయందు జగన్మాత ఉన్నది. జీవాత్మరూపంలో ఉన్నది. అందుకే ఆ అమ్మను *గుహాంబా* అని అంటాము.

పార్వతీ, పరమేశ్వరుల ముద్దుబిడ్డడైన కుమార స్వామికి వివిధనామములు గలవు.

*షణ్ముఖుడు* - ఆరు ముఖాలు కలవాడు.
*స్కందుడు* - పార్వతీదేవి పిలిచిన పేరు.
*కార్తికేయుడు* - కృత్తికానక్షత్రాన జన్మించినందుకు
*వేలాయుధుడు* శూలాన్ని ఆయుధంగా కలిగిన వాడు.
*శరవణుడు* – శరవణం (రెల్లు వనం) లో జన్మించాడు కాబట్టి.
*సేనాపతి*– దేవతలకు సేనాధిపతి.
*స్వామినాథుడు* ––శివునకు ప్రణవ మంత్ర అర్ధాన్ని చెప్పినాడు కనుక.
*సుబ్రహ్మణ్యుడు* –బ్రహ్మజ్ఞానం కలిగినవాడు.
*మురుగన్‌* ఈ తమిళ నామానికి ‘అందమైన వాడు‘ అని అర్థం.

అంతేకాకుండా *గుహుడు* అను ఇంకొక నామధేయము గలదు.

పరమేశ్వరి *గుహుని* జనని గనుక *గుహాంబా* అని నామ ప్రసిద్ధమైనది.

పరమేశ్వరి భక్తుల హృదయమనే గుహలో నివసిస్తుంది గనుక *గుహాంబా* అని అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం గుహాంబాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*132వ నామ మంత్రము*

*ఓం నిరాధారాయై నమః*

సమస్తానికి తానే ఆధారమై ఉండి, తనకంటూ ఏ ఆధారమూలేని స్వయంప్రకాశ స్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిరాధారా* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం నిరాధారాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంతభక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకునికి తానే ఆధారమై, సమస్త భౌతికపరమైన సుఖశాంతులను ప్రసాదించుచూ, సాధకుని అను నిత్యము తన పాదసేవలో లీనమొనర్చి తరింపజేయును.

సృష్టికి పూర్వమే జగన్మాత కలదు. త్రిమూర్తులకన్నా, సమస్త సృష్టికన్నా తానే ముందు (ఆదిపరాశక్తిగా) ఉన్నది. ఆ స్థితిలో తాను ఎవరిపైననూ ఆధారపడలేదు. సమస్త లోకములను తనలో లీనమొనర్చుకొని, ఆ లోకములకు తానాధారమైనది. తనకు ఆధారము అవసరం లేదు. అందు చేత నిరాధారా కాదు. తానే సకలమునకు ఆధారమై నిలచియున్నది. ఎవరికైనా సాయంచేసేవారు లేకపోతే వారిని నిరాధారులు అంటాము. కాని జగన్మాత అలాంటి నిరాధార కాదు. ఆధారము అవసరములేని మరియు ఆధారము నివ్వగలంతటి శక్తులు లేవు అందుకే ఆ తల్లి *నిరాధారా*

మనం చూచుచున్న ప్రతీ వస్తువుకూ కూడా ఆధారం ఉంది.

పూలతీగకు పందిరి ఆధారం. ఆత్మకు దేహం ఆధారం, అగ్నిప్రజ్వలనానికి ఇంధనం ఆధారం. ఇలా చరాచర జగత్తుకు ఆధారమైనది శ్రీమాత. ఆధారములన్నిటికీ తానే ఆధారం. ఆ అమ్మ సర్వస్వతంత్ర.

సూత సంహితలో పూజచేయు విధానం రెండుగా చెప్పబడినది.

*పూజా శక్తేః పరాయా స్తు ద్వివిధా సంప్రకీర్తితా*

1) జగన్మాతను వ్యక్తస్వరూపంగా (కనుపించే విగ్రహము) పూజించడమనేది *బాహ్యపూజ*.దీనినే సగుణోపాసన.

2) రూపరహితంగా, కేవలం మానసికంగా, దహరాకాశంలో ఆ తల్లిని ఊహిస్తూ ధ్యానంచేయడమనేది అంతఃపూజ అనియు నిర్గుణోపాసన అనియు, ఇంకను అభ్యంతర పూజ అని కూడా అంటారు. అభ్యంతర పూజల్లో సాధార పూజలనీ, నిరాధార పూజలనీ రెండురకాల పూజలు గలవు.

ఇందులో సాధారపూజ అనగా నిత్యం ధూప, దీప, నైవేద్యములతో, స్తోత్రములు పారాయణచేస్తూ విగ్రహంలో జగన్మాతను ఊహించడం. నిరాధార పూజలలో కేవలం జ్ఞాన, ధ్యానాదులు మాత్రమే. అమ్మవారు నిరాధార పూజా స్వరూపురాలు గనుక జగన్మాత *నిరాధారా* అని నామ ప్రసిద్ధమైనది. *అంతర్ముఖ సమారాధ్యా* జగన్మాత నిరాధార పూజలకు సులభంగా భక్తపరవశ అవుతుంది. అందుకే జగన్మాత *నిరాధారా* అని స్తుతింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిరాధారాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*20.17 (పదిహేడవ శ్లోకము)*

*అమోఘవీర్యో రాజర్షిర్మహిష్యాం వీర్యమాదధే|*

*శ్వోభూతే స్వపురం యాతః కాలేనాసూత సా సుతమ్॥8006॥*

దుష్యంతుడు ఆ రాత్రిని శకుంతలతో హాయిగా గడపెను. మరునాటి ప్రాతఃకాలముననే ఆ ప్రభువు తన పురమునకు వెళ్ళిపోయెను. అద్భుత వీర్యసంపన్నుడైన ఆ మహారాజువలన ఆయన ధర్మపత్నియగు శకుంతల గర్భవతియయ్యెను. నెలలు నిండిన పిమ్మట (కొంత కాలముసకు) ఆమె ఒక చక్కని బాలుని గనెను.

*20.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*కణ్వః కుమారస్య వనే చక్రే సముచితాః క్రియాః|*

*బద్ధ్వా మృగేంద్రాంస్తరసా క్రీడతి స్మ స బాలకః॥8007॥*

శకుంతల పుత్రుడగు ఆ బాలునకు కణ్వమహర్షి ఆ ఆశ్రమమునందే తగిన రీతిలో జాతకర్మాది సంస్కారములను నెరపెను. ఆ బాలుడు చిన్నతనము నుండియే అద్భుతమైన బలపరాక్రమములతో, సద్గుణములతో వర్ధిల్లసాగెను. ఆ బాలవీరుడు అవలీలగా సింహములను బంధించుచు వాటితో ఆడుకొనుచుండెను.

*20.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*తం దురత్యయవిక్రాంతమాదాయ ప్రమదోత్తమా|*

*హరేరంశాంశసంభూతం భర్తురంతికమాగమత్॥8008॥*

*20.20 (ఇరువదియవ శ్లోకము)*

*యదా న జగృహే రాజా భార్యాపుత్రావనిందితౌ|*

*శృణ్వతాం సర్వభూతానాం ఖే వాగాహాశరీరిణీ॥8009॥*

దైవాంశ సంభూతుడు, మిగుల పరాక్రమశాలి ఐన తన కుమారుని దీసికొని, వనితారత్నమైన శకుంతల తన భర్తయగు దుష్యంతుని కడకు వెళ్ళెను. అంతట ఆ మహారాజు శకుంతలయందు ఎట్టి దోషములు లేకున్నను, ఆమెను తన ధర్మపత్నిగను, ఆ బాలుని తన తనయునిగను ఆమోదింపక వారిని స్వీకరింపకుండెను. వారి వివాహము గాంధర్వవిధముననే జరిగియున్నందున వారి పెండ్లిని ధృవపరచెడి సాక్షులును లేకుండిరి. శకుంతల దిక్కుతోచని స్థితికి గుఱియయ్యెను. ఇంతలో ఆకాశవాణి అందరును (సకలప్రాణులును) వినునట్లు ఇట్లు పలికెను-

*20.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*మాతా భస్త్రా పితుః పుత్రో యేన జాతః స ఏవ సః|*

*భరస్వ పుత్రం దుష్యంత మావమంస్థాః శకుంతలామ్॥8010॥*

*20.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*రేతోధాః పుత్రో నయతి నరదేవ యమక్షయాత్|*

*త్వం చాస్య ధాతా గర్భస్య సత్యమాహ శకుంతలా॥8011॥*

"దుష్యంతమహారాజా! సంతానప్రాప్తి విషయమున తల్లి కొలిమితిత్తివంటిది. అనగా ఆధారభూతురాలు. అందులకు తండ్రియే ముఖ్యకారకుడు. *ఆత్మావై పుత్రనామాఽసి* - అని శృతి ప్రమాణము. తల్లిదండ్రుల సుఖసంపర్కము వలననే పుత్రుడు ఉదయించును. తండ్రియే పుత్రుని రూపమున జన్మించును. ఈ బాలుడు నీ వలన కలిగినవాడే. కనుక, శకుంతలను అవమానము పాలు చేయక (లోకనిందకు గుఱిచేయక), ఆమెను ధర్మపత్నిగను, ఈ బాలుని కుమారునిగను స్వీకరింపుము. నరేంద్రా! పుత్రుడు వంశోద్ధారకుడు. అతడు తన తండ్రిని (తల్లిదండ్రులను) నరకబాధలనుండి రక్షించును. ఈ బాలుని జనకుడవు (జన్మనిచ్చినవాడవు) నీవే. శకుంతల పలికిన మాటలు ముమ్మాటికిని సత్యములు". అంతట దుష్యంతుడు ఆకాశవాణి పలికిన మాటలను విశ్వసించి, శకుంతలను, భరతుని తన భార్యాపుత్రులుగా స్వీకరించెను.

*20.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*పితర్యుపరతే సోఽపి చక్రవర్తీ మహాయశాః|*

*మహిమా గీయతే తస్య హరేరంశభువో భువి॥8012॥*

పరీక్షిన్మహారాజా! తండ్రియగు దుష్యంతుడు మరణించిన పిదప చక్రవర్తియైన భరతుడు తన చక్కని పరిపాలన వలన మిగుల వాసికెక్కెను. భూమండలమున దైవాంశసంభూతుడుగా, మహిమాన్వితుడుగా ఎంతయు కీర్తింపబడెను.

*20.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*చక్రం దక్షిణహస్తేఽస్య పద్మకోశోఽస్య పాదయోః|*

*ఈజే మహాభిషేకేణ సోఽభిషిక్తోఽధిరాడ్విభుః॥8013॥*

భరతుని కుడిచేతియందు చక్రాకార చిహ్నము, పాదముల యందు పద్మకోశాకార చిహ్నములును విలసిల్లుచుండెను. విధ్యుక్తముగా పట్టాభిషిక్తుడైన భరతుడు సార్వభౌముడుగా ఖ్యాతి వహించెను.

*20.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*పంచపంచాశతా మేధ్యైర్గంగాయామను వాజిభిః|*

*మామతేయం పురోధాయ యమునాయామను ప్రభుః॥8004॥*

PVD Subrahmanyam చెప్పారు...

*20.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*అష్టసప్తతిమేధ్యాశ్వాన్ బబంధ ప్రదదద్వసు|*

*భరతస్య హి దౌష్యంతేరగ్నిః సాచీగుణే చితః|*

*సహస్రం బద్వశో యస్మిన్ బ్రాహ్మణా గా విభేజిరే॥8005॥*

ఉతథ్యుని వలన మమతయందు జన్మించిన దీర్ఘతమ మహర్షిని పురోహితునిగా చేసికొని, భరతుడు గంగాసాగర సంగమ స్థానమునుండి గంగోత్రి వరకు గల వివిధ పవిత్ర క్షేత్రములయందు వరుసగా ఏబదియైదు యజ్ఞములను ఆచరించెను. అదే విధముగా ఆ చక్రవర్తి గంగా యమునా సంగమస్థానమైన ప్రయాగ నుండి యమునోత్రి వరకు గల దివ్యక్షేత్రముల యందు క్రమముగా డెబ్బది ఎనిమిది అశ్వమేధయాగములను నిర్వహించెను. ఈ సకల యజ్ఞములయందును ఆ ప్రభువు అపారములైన ధనరాసులను దానము చేసెను. దుష్యంతుని తనయుడైన ఈ భరతుడు సలక్షణములుగల ప్రదేశములయందు అగ్నిస్థాపన గావించెను. ఆ సందర్భమున ప్రతి
ప్రతిప్రదేశము నందును వేయిమంది బ్రాహ్మణులకు గోదానములను చేసెను. ప్రతి విప్రునకును ఆ గోదానములను అసంఖ్యాకముగా ఒనర్చెను.

*20.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*త్రయస్త్రింశచ్ఛతం హ్యశ్వాన్ బద్ధ్వా విస్మాపయన్ నృపాన్|*

*దౌష్యంతిరత్యగాన్మాయాం దేవానాం గురుమాయయౌ॥8016॥*

దౌష్యంతి (భరతుడు) దేవతలు, ఆ కాలపురాజులు కల్పించిన అడ్డంకులను అన్నింటిని అధిగమించి నూటముప్పది మూడు అశ్వమేధ యాగములను ఒనర్చెను (గంగోత్రి వరకు 55, యమునోత్రి వరకు 78 = 55+79 = 133) ఇట్లు ఆ ప్రభువు ఆ నాటి రాజులను అందరిని ఆశ్చర్యములో ముంచెత్తెను. పిమ్మట ఆ చక్రవర్తి జగద్గురువైన శ్రీమన్నారాయణుని (పరంధామమును) చేరెను.

*దేవానాం మాయాం అత్యగాత్, దేవైః నృపైశ్చ చికీర్షితం యజ్ఞ విఘ్నమ్ అపాకృత్య అయజత్. మాయామ్ = అశ్వవారణాదిరూపామ్ =* యజ్ఞాశ్వములను అడ్డగించుట మున్నగు రూపములలో (వీరరాఘవీయ వ్యాఖ్య)

అష్ట + ఉత్తరశతమ్ = అష్టోత్తరశతమ్. అట్లే త్రయస్త్రింశత్ + (ఉత్తర) శతమ్ = త్రయస్త్రింశచ్ఛతమ్ = 133.

*20.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*మృగాన్ శుక్లదతః కృష్ణాన్ హిరణ్యేన పరీవృతాన్|*

*అదాత్కర్మణి మష్ణారే నియుతాని చతుర్దశ॥8017॥*

ఇంకను ఆ చక్రవర్తి *మష్ణారము* అను సుప్రసిద్ధ పుణ్యతీర్థ ప్రదేశమున ఒక యజ్ఞమును ఆచరించెను. ఆ సమయమున అతడు తెల్లని దంతములు, నలుపు వన్నె గలిగి, బంగారు ఆభరణములతో విరాజిల్లుచున్న పదునాలుగు లక్షల భద్రగజములను విప్రులకు దానము చేసెను.

*20.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*భరతస్య మహత్కర్మ న పూర్వే నాపరే నృపాః|*

*నైవాపుర్నైవ ప్రాప్స్యంతి బాహుభ్యాం త్రిదివం యథా॥8018॥*

భరతుడు ఒనర్చిను ఇట్టి అత్యద్భుత యజ్ఞాది కార్యములను అంతకుముందున్న రాజులెవ్వరును ఆచరింపలేదు. అట్లే ఇకముందు గూడ ఆచరింపజాలరు. ఎంతటి వారైనను తమ చేతులతో (గమన సాధనములతో) స్వర్గమును అందుకొనిన వారుగాని, అందుకొనగలవారు కాని ఉండరుగదా! వేయేల భరతుని వంటి చక్రవర్తి *నభూతో నభవిష్యతి*

PVD Subrahmanyam చెప్పారు...

*20.30 (ముప్పదియవ శ్లోకము)*

*కిరాతహూణాన్ యవనానంధ్రాన్ కంకాన్ ఖశాన్ ఛకాన్|*

*అబ్రహ్మణ్యాన్ నృపాంశ్చాహన్ మ్లేచ్ఛాన్ దిగ్విజయేఽఖిలాన్॥8019॥*

సాధుపురుషులైన బ్రాహ్మణులను హింసించునట్టి కిరాతులు, హూణులు, యవనులు, ఆంధ్రులు, కంకులు, ఖశులు, శకులు, మ్లేచ్ఛులు మొదలగు హీనజాతులకు చెందిన రాజులను అందరిని భరతుడు తన దిగ్విజయ యాత్రలలో హతమార్చెను.

*20.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*జిత్వా పురాసురా దేవాన్ యే రసౌకాంసి భేజిరే|*

*దేవస్త్రియో రసాం నీతాః ప్రాణిభిః పునరాహరత్॥8020॥*

పూర్వకాలమున అసురులు దేవతలను జయించి, పెక్కుమంది దేవకాంతలను పాతాళలోకమున బంధించిరి. భరతుడు ఆ అసురులను జయించి, అచట నిర్బంధములో నున్న దివ్యభామినులను, ఇతరప్రాణులను తీసికొనివచ్చెను.

*20.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*సర్వాన్ కామాన్ దుదుహతుః ప్రజానాం తస్య రోదసీ|*

*సమాస్త్రిణవసాహస్రీర్దిక్షు చక్రమవర్తయత్॥8021॥*

ఆ ప్రభువు ఇరువది యేడువేల సంవత్సరముల దివంగతముల వరకును వ్యాపించియున్న తన సామ్రాజ్యమునకు ఏకచ్ఛత్రాధిపత్యమును వహించెను. తన ఏలుబడిలో అతడు భూతలమునను, ఆకాశమునందును గల సకలప్రాణుల కోరికలను ఈడేర్చుచు వారిని సుఖసంతోషలతో వర్ధిల్లజేసెను.

*త్రిణవ సాహస్రీః సమాః* = ఇరువది యేడువేల సంవత్సరములు. 3 x 9 = 27 x 1000 = 27000.

*20.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*స సమ్రాడ్ లోకపాలాఖ్యమైశ్వర్యమధిరాట్ శ్రియమ్|*

*చక్రం చాస్ఖలితం ప్రాణాన్ మృషేత్యుపరరామ హ॥8022॥*

సార్వభౌమ చక్రవర్తియైన ఆ భరతుడు లోకపాలుర యొక్క ఐశ్వర్యములను మించిన తన సంపదలను, తిరుగులేని సార్వభౌమాధికారములను, కడకు తన ప్రాణములను అనిత్యములుగా భావించి, వాటియెడ విరక్తుడయ్యెను.

*20.34 (ముప్పది రెండవ శ్లోకము)*

*తస్యాసన్ నృప వైదర్భ్యః పత్న్యస్తిస్రః సుసమ్మతాః|*

*జఘ్నుస్త్యాగభయాత్పుత్రాన్ నానురూపా ఇతీరితే॥8023॥*

రాజా! ఆ భరతునకు విదర్భరాజు కుమార్తెలైన ముగ్గురు భార్యలు గలరు. ఆయన వారిని సాదరముగా జూచుచుండెను. అతడు వారికి కలిగిన పుత్రులను జూచి, 'వీరు నాకు తగినవారు కాదు' అని పలికెను. అంతట ఆ రాజపత్నులు మహారాజు తమను త్యజించునేమోయని భయపడి, వారు తమ తనయులను చంపివేసిరి.

*20.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*తస్యైవం వితథే వంశే తదర్థం యజతః సుతమ్|*

*మరుత్స్తోమేన మరుతో భరద్వాజముపాదదుః॥8024॥*

ఈ విధముగా భరతుని వంశము ఆగిపోవుటతో ఆ మహారాజు పుత్రప్రాప్తికై *మరుత్స్తోమము* అను యజ్ఞమును ఆచరించెను. అంతట మరుత్తులు (దేవతలు) ప్రసన్నులై ఆయనకు ఒక సుతుని అనుగ్రహించిరి. అతని పేరు భరద్వాజుడు.

*20.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*అంతర్వత్న్యాం భ్రాతృపత్న్యాం మైథునాయ బృహస్పతిః|*

*ప్రవృత్తో వారితో గర్భం శప్త్వా వీర్యమవాసృజత్॥8025॥*

భరద్వాజుని జన్మవృత్తాంతమును గూర్చి శుకుడు తెలిపెను. దేవగురువైన బృహస్పతికి సోదరుడు ఉతథ్యుడు. అతని భార్య మమత. ఆమె గర్భవతిగా నున్నప్పుడు బృహస్పతి ఆమెతో రమించుటకు సిద్ధపడెను. అప్పుడు ఆమె గర్భములో నున్న బాలకుడు (దీర్ఘతముడు), ఆయనను వారించెను. అంతట అతడు (బృహస్పతి) 'నీవు గ్రుడ్డివాడవై పొమ్ము' అని గర్భస్థ శిశువును శపించి, బలవంతముగా ఆమెయెడ అత్యాచారమొనర్చెను.

*20.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*తం త్యక్తుకామాం మమతాం భర్తృత్యాగవిశంకితామ్|*

*నామనిర్వాచనం తస్య శ్లోకమేనం సురా జగుః॥8026॥*

PVD Subrahmanyam చెప్పారు...

*20.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*మూఢే భర ద్వాజమిమం భర ద్వాజం బృహస్పతే|*

*యాతౌ యదుక్త్వా పితరౌ భరద్వాజస్తతస్త్వయమ్॥8027॥*

మమత తనపట్ల జరిగిన అపచారమును పురస్కరించుకొని, తన భర్తయగు ఉతథ్యుడు తనను త్యజించునేమోయని భయపడెను. ఆ కారణముగా ఆమె బృహస్పతి వలన కలిగిన తన సుతుని త్యజించుటకు సన్నద్ధురాలు అయ్యెను. అప్పుడు దేవతలు ఆ బాలునకు నామ నిర్వచనము చేసిరి. అంతట బృహస్పతి 'మూఢురాలా! (మమతా!) ఈ బాలుడు నాకు ఔరసుడు, ఉతథ్యునకు క్షేత్రజుడు. కనుక, ఇతడు ఇరువురికిని చెందినవాడు (ద్వాజుడు) కనుక, ఇతనిని నీవే భరింపుము (పోషింపుము)' అని పలికెను. అందులకు మమత - 'బృహస్పతీ! ఇతడు నా పతివలన జన్మించినవాడు కాదు. నీ వలన నా యందు కలిగినవాడు. ఈతని జన్మకు కారకుడవైన నీవే ఇతనిని భరింపుము' అని నుడివెను. ఈ విధముగా వారు ఇద్దరును పరస్పరము వాదులాడుకొని ఆ బాలకుని అచటనే విడిచిపెట్టిపోయిరి. కనుక, ఆ బాలుడు భరద్వాజుడుగా వ్యవహరింపబడెను.

*20.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*చోద్యమానా సురైరేవం మత్వా వితథమాత్మజమ్|*

*వ్యసృజన్మరుతోఽబిభ్రన్ దత్తోఽయం వితథేఽన్వయే॥8028॥*

ఆ విధముగా దేవతలు నామనిర్వచనము చేసి మమతను (స్వీకరించుటకు) ప్రేరేపించిరి. కాని, బాలుడు వితథుడు అనగా వ్యర్థుడేనని తలచిన మమత వానిని విడిచిపెట్టెను. అప్పుడు మరుద్దేవతలు ఆ బాలకుని పోషించిరి. భరతుని వంశము (అంకురము లేకుండ) అంతరించిపోవుటను జూచి, దేవతలు ఆ బాలకుని భరతునకు అప్పగించిరి. ఈ విధముగా భరద్వాజుడు భరతుని వంశము వాడయ్యెను. పిమ్మట ఆ బాలునకు *వితథుడు* అని నామాంతరము ఏర్పడెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే వింశోఽధ్యాయః (20)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు ఇరువదియవ అధ్యాయము (20)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*133వ నామ మంత్రము*

*ఓం నిరాధారాయై నమః*

పొర, పక్షపాతం, అజ్ఞానం, మలినత్వం వంటి ఏవిధమైన అంజనములు లేక కేవలం సమ్యక్ దృష్టితో విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిరంజనా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం నిరంజనాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిప్రపత్తులతో ఆ శ్రీమాతను నిత్యము నియమనిబంధనలతో అర్చించు భక్తునకు, ఆ తల్లి కరుణతో వారికి మాయా సంబంధమైన అజ్ఞానపు పొరలు తొలగి, ఆధ్యాత్మికా చింతనతో, ధర్మార్థకామములను నిర్వహించుచూ జీవనము కొనసాగించి, నాలుగవ పురుషార్థమైన మోక్షము వారి దీక్షాబలముననుసరించి ముక్తిని ప్రసాదించును.

సాధారణంగా అంజనము అంటే కాటుక అందురు. *నిరంజనా* అంటే జగన్మాత కాటుక రహితమైన నయనములు గలదని భావన రావచ్చు. ఆ భావన సరికాదు. జగన్మాత నయన సౌందర్యమును
శ్రీలలితా సహస్ర నామావళి యందు *వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచనా* యని 18వ నామ మంత్రములో స్తుతించాము. తన ముఖకాంతి అనే ప్రవాహంలో ఇటునటు కదలుతున్న మీనముల జంటతో సాటి అయిన కనులు గలిగినదని ఈ నామ మంత్రములోని భావము.

అలాగే సౌందర్యలహరిలో శంకరభగవత్పాదులవారు శ్రీమాత కనులను ఇలా వర్ణించారు.

*అహః సూతే సవ్య - తవ నయనమర్కాత్మకతయా*

*త్రియామాం వామంతే - సృజతి రజనీ నాయకతయా |*

*తృతీయా - తే దృష్టిర్దరదలిత హేమాంబుజ రుచిః*

*సమాధత్తే సంధ్యాం - దివసనిశయోరంతరచరీమ్ ||*

దేవి కుడికన్ను సూర్యునివలె పగటిని, ఎడమకన్ను చంద్రునివలె రాత్రిని చేయుచున్నవి. మూడవ నేత్రము సంధ్యాకాలమును కలిగించుచున్నది

*భావము:*

అమ్మా...సూర్య రూపమైన నీ కుడికన్ను వలన ఈ లోకాలకు పగలు ఏర్పడుతున్నది.చంద్రుని స్వరూపమైన నీ ఎడమ నేత్రం వలన రాత్రి ఏర్పడుతున్నది. అగ్ని రూపమైన, కొద్దిగా వికసించిన సువర్ణ కమలము వంటి నీ నుదుటి పై నున్న మూడవ నేత్రము వలన పగటికి, రాత్రికి మధ్య ఏర్పడు ప్రాతసంధ్య, సాయంసంధ్య అనబడు ఉభయ సంధ్యలు ఏర్పడుతున్నాయి. ఇలా ఏర్పడు ఈ నాలుగు కాలాలు మాపై నీవు కురిపించు నీ కరుణా కటాక్ష వీక్షణాలే కదా తల్లీ!

స్త్రీమూర్తికి నయనములకు కాటకయే కదా అందము! మీనముల వంటి ఆ నయనములు ఆ నల్లని కాటుకతో తమ సౌందర్యాన్ని ఇనుమడింప జేసుకుంటాయిగదా!

శ్రీమాత నయనములు అంతటి సౌందర్యాన్ని సంతరించుకున్నప్పుడు *నిరంజనా* యనుట అసహజముగదా!

జగన్మాతకు పొర, పక్షపాతం, అజ్ఞానం, మలినత్వం వంటి మాయా పూరితమైన పైపూతలు అనదగు అంజనములు లేనిది.

*నిరవద్యం నిరంజనం* అను శృతివాక్యము ప్రకారము దోషరహితమైన తత్త్వం గలిగినది అని చెప్పబడినది.

అజ్ఞానులను మూడు విధములుగా తెలియవచ్ఛును.

1) *విజ్ఞానకేవలులు* ఇటువంటి వారికి విజ్ఞానము గలిగినవారై ఉందురు. వీరిది శాస్త్రజ్ఞానమేగాని ఆత్మానుభూతి జ్ఞానము లేనివారు.

2. *ప్రళయాకులులు* కర్మతోకూడి, ఆత్మను తెలుసుకోలేక అనేక జన్మలకు కారణమైన కర్మలలో మునిగినవారు.

3. *సకలులు* ద్వైతబుద్ధి (జీవుడు వేరు, దేవుడు వేరు) ని కలిగించు మలము గలిగినవారు.

ఈ మూడింటిలో మొదటి తరగతి వారు హెచ్చుమంది ఉందురు. వీరిని వ్యాపకులని కూడా అందురు. రెండవ తరగతివారు కార్మణమలము గలవారు. మొదటి తరగతివారి కంటె తక్కువగా యుందురు. మూడవ తరగతివారు మాయామలము గలవారు. రెండవ తరగతి కంటెను తక్కువగా యుందురు. ఏమైనా శ్రీమాత ఈ మూడు తరగతులలోగల ఏ మాలిన్యమూలేనిది. ఈ మూడు విధాలయిన మాలిన్యము గల లోకాలలోని వారిని శ్రీమాత వారి అజ్ఞానమును తొలగించి అనుగ్రహిస్తుంది. జగన్మాత అవిద్య, అజ్ఞానము లేనిది. మాయకు అతీతమైనది. శుద్ధజ్ఞానస్వరూపిణి. సహస్రారంలో చంద్రమండలమునందు చిత్కళారూపంలో కేవలము ఆనంద రూపిణిగా విరాజిల్లుచున్నది గనుక జగన్మాత *నిరంజనా* యనుచు స్తుతింపబడుచున్నది.

PVD Subrahmanyam చెప్పారు...

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిరంజనాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*707వ నామ మంత్రము*

*ఓం గుహ్యరూపిణ్యై నమః*

పరమ రహస్యమైన అనగా స్థూలదృష్టికి కాకుండా జ్ఞాననేత్రాలకు మాత్రమే గోచరమయ్యే సూక్ష్మరూపిణి అయిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *గుహ్యరూపిణీ* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం గుహ్యరూపిణ్యై నమః* యని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు భౌతికపరమైన సుఖసంతోషములతోబాటు, ఆధ్యాత్మిక జ్ఞానసంపదలు కూడా సంప్రాప్తించి తరించును.

సూతసంహితలో ఈ విధంగా చెప్పబడినది:

*గురుమూర్తిధరాం గుహ్యాం గుహ్యవిజ్ఞాన రూపిణీం|*

*గుహ్యభక్తజనప్రీతాం గుహాయాం నిహితం నమః॥*

"గురురూపమును ధరించినది, గుహ్యము, గుహ్యజ్ఞానమే రూపముగా గలది. గుహ్యమందు భక్తిగల జనులను ప్రేమించునది గుహయందున్నది. అనగా హృదయమందు దహరాకాశంలో ఉన్నదని భావము. అటువంటి దేవిని ధ్యానించుచున్నాను" అని సూతసంహితలో చెప్పిన శ్లోకమునకు భావము. జగద్బ్రహ్మలనగా జీవేశ్వరులు. పారమార్థిక దశలో అద్వైతమే సత్యము. అంటే అద్వైతము పారమార్థిక సత్యము. జగన్మాత ఇట్టి పారమార్థిక సత్యమును బోధించుచున్నది.

*సర్వోపనిషదాం దేవి గుహ్యోపనిష దుద్యసే* (సౌభాగ్యభాస్కరం, 822వ పుట)

అనగా అన్ని ఉపనిషత్తులందు శ్రీమాత గుహ్యోపనిషత్తు. ఆ తల్లి హృదయమందుండే దహరాకాశరూపంలో ఉంటుంది గనుక *గుహ్యరూపిణీ* యని స్తుతింపదగినది.

జగన్మాతను దర్శించాలంటే జ్ఞానదృష్టి కావలెను. స్థూలదృష్టితో చూడలేము. జ్ఞానసంబంధమైన వేదవేదాంగములలోను, శాస్త్రాలలోను, బ్రహ్మసూత్రములందు ఆ పరమేశ్వరి సూక్ష్మముగా ప్రతిపాదింపబడినది గనుక ఆ తల్లిని *గుహ్యరూపిణీ* యని స్తుతిస్తున్నాము.

అమ్మను ఏరూపంలోవెదకినా కనుపిస్తుంది. శక్తి పీఠములందు, నవదుర్గలందు, ఊరూరా వెలసిన గ్రామదేవతా స్వరూపములందు ... బెజవాడ కనక దుర్గ, అనకాపల్లి నూకాలమ్మ, పెద్దాపురం మరిడమ్మ, విజయనగరం పైడితల్లి, శంబర పోలమాంబ, మజ్జి గౌరమ్మ, ఒక ఊర్లో పోలేరమ్మా, ఇంకో ఉర్లో అసిరమ్మ, మరోచోట సుంకులాంబ, జొన్నవాడ కామాక్షి, మధుర మీనాక్షి ....ఇలా చెప్పుకుంటూ పోతే ఆ తల్లి రూపములు చతుష్షష్ఠికోటి యోగినులైనా కావచ్చు లేదా శోధకునికి శోధకుని రూపంలో మనోనేత్రములందు కూడా గోచరించునది కావచ్చు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం గుహ్యరూపిణ్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*21.1 (ప్రథమ శ్లోకము)*

*వితథస్య సుతో మన్యుర్బృహత్క్షత్రో జయస్తతః|*

*మహావీర్యో నరో గర్గః సంకృతిస్తు నరాత్మజః॥8029॥*

*21.2 (రెండవ శ్లోకము)*

*గురుశ్చ రంతిదేవశ్చ సంకృతేః పాండునందన|*

*రంతిదేవస్య హి యశ ఇహాముత్ర చ గీయతే॥8030॥*

*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! వితథుని (భరద్వాజుని) యొక్క సుతుడు మన్యువు. ఆయనకు బృహత్ క్షత్రుడు, జయుడు, మహావీర్యుడు, నరుడు, గర్గుడు అను ఐదుగురు కుమారులు గలిగిరి. నరుని తనయుడు సంకృతి. సంకృతియొక్క పుత్రులు గురుడు, రంతిదేవుడు. వీరిరువురిలో రంతిదేవుని కీర్తిప్రతిష్ఠలు ఇహపరలోకముల యందును వాసి గాంచినవి.

*21.3 (మూడవ శ్లోకము)*

*వియద్విత్తస్య దదతో లబ్ధం లబ్ధం బుభుక్షతః|*

*నిష్కించనస్య ధీరస్య సకుటుంబస్య సీదతః॥8031॥*

*21.4 (నాలుగవ శ్లోకము)*

*వ్యతీయురష్టచత్వారింశదహాన్యపిబతః కిల|*

*ఘృతపాయససంయావం తోయం ప్రాతరుపస్థితమ్॥8032॥*

రంతిదేవుడు అప్రయత్నముగా (దైవికముగా) లభించిన దాని తోడనే జీవితమును గడపు చుండెడివాడు. లభించిన వస్తువులనుగూడ ఇతరులకు దానము చేయుచుండెడి వాడు. క్రమముగా నిర్ధనుడైన అతడు కుటుంబసభ్యులతోగూడ ఆకలిదప్పులతో బాధపడుచుండెడివాడు. ధనమును కూడబెట్టుటగాని, ఇతరుల నుండి స్వీకరించుటగాని చేసెడివాడు కాదు. ఈ విధముగా ఒకసారి అతనికి వరుసగా నలుబది ఎనిమిది దినములు నీరుకూడ లభింపలేదు. ఆ మరునాటి ఉదయమున ఆయనకు నేయి, పాయసము, అన్నము (భక్ష్యవిశేషములు), జలము లభించెను.

*21.5 (ఐదవ శ్లోకము)*

*కృచ్ఛ్రప్రాప్తకుటుంబస్య క్షుత్తృడ్భ్యాం జాతవేపథోః|*

*అతిథిర్బ్రాహ్మణః కాలే భోక్తుకామస్య చాగమత్॥8033॥*

*21.6 (ఆరవ శ్లోకము)*

*తస్మై సంవ్యభజత్సోఽన్నమాదృత్య శ్రద్ధయాన్వితః|*

*హరిం సర్వత్ర సంపశ్యన్ స భుక్త్వా ప్రయయౌ ద్విజః॥8034॥*

*21.7 (ఏడవ శ్లోకము)*

*అథాన్యో భోక్ష్యమాణస్య విభక్తస్య మహీపతే|*

*విభక్తం వ్యభజత్తస్మై వృషలాయ హరిం స్మరన్॥8034॥*

అంతవరకును రంతిదేవుని కుటుంబము ఆకలి దప్పులతో అలమటించుచు సంకటములపాలై యుండెను. ప్రాతఃకాలమున లభించిన ఆహార పదార్థములను భుజించుటకు సిద్ధమైరి. ఇంతలో ఒక బ్రాహ్మణుడు వారి ఇంటికి అతిథిగా వచ్చెను. సకల ప్రాణులలోను భగవంతునే దర్శించుచుండెడి రంతిదేవుడు ఆ ఆహారపదార్థములలో కొంతభాగమును ఆ అతిథికి భక్తిశ్రద్ధలతో సమర్పించెను. పరీక్షిన్మహారాజా! రంతిదేవుడు తన కుటుంబ సభ్యులతో గూడి మిగిలిన ఆహారపదార్థములను తినబోవుచుండగా ఇంతలో ఒక శూద్రుడు భోజనార్థమై అచటికి వచ్చెను. అప్పుడు రంతిదేవుడు శ్రీహరిని స్మరించుచు అందులో కొంతభాగమును అతనికి సమర్పించెను.

*21.8 (ఎనిమిదవ శ్లోకము)*

*యాతే శూద్రే తమన్యోఽగాదతిథిః శ్వభిరావృతః|*

*రాజన్ మే దీయతామన్నం సగణాయ బుభుక్షతే॥8036॥*

శూద్రుడు భుజించి వెళ్ళిన పిమ్మట మరియొక వ్యక్తి కొన్ని కుక్కలను వెంటబెట్టుకొని, అతిథిగా వచ్చి ఇట్లనెను - 'రంతిదేవమహారాజా! నేనును, నా శునకములును మిగుల ఆకలి గొనియున్నాము. మాకు ఆహారపదార్థములను ఇప్పింపుము'.

PVD Subrahmanyam చెప్పారు...

*21.9 (తొమ్మిదవ శ్లోకము)*

*స ఆదృత్యావశిష్టం యద్బహుమానపురస్కృతమ్|*

*తచ్చ దత్త్వా నమశ్చక్రే శ్వభ్యః శ్వపతయే విభుః॥8037॥*

అంతట రంతిదేవుడు ఆ వచ్చిన వ్యక్తిని, అతని వెంటనున్న కుక్కలను భగవత్స్వరూపములుగా భావించి, నమస్కరించుచు మిగిలిన ఆహారపదార్థములను సాదరముగా సంతోషముతో ఇచ్చివేసెను.

*21.10 (పదియవ శ్లోకము)*

*పానీయమాత్రముచ్ఛేషం తచ్చైకపరితర్పణమ్|*

*పాస్యతః పుల్కసోఽభ్యాగాదపో దేహ్యశుభస్య మే॥8038॥*

పిమ్మట రంతిదేవుని కడ నీరు మాత్రమే మిగిలియుండెను. అవియును ఒక్కని దాహమును తీర్చుటకు మాత్రమే సరిపోవునట్లుండెను. ఆ స్థితిలో రంతిదేవుడు తన కుటుంబ సభ్యులతోగూడి ఆ జలములతో తమ దాహమును తీర్చుకొనుటకు సిద్ధపడుచుండగా, ఇంతలో దప్పిగొనియున్న ఒక చండాలుడు అచటికి వచ్చి - 'అయ్యా! ఈ అల్పునకు కొన్ని నీళ్ళు ఇచ్చి పుణ్యము గట్టుకొనుము' అని అర్థించెను.

*21.11 (పదకొండవ శ్లోకము)*

*తస్య తాం కరుణాం వాచం నిశమ్య విపులశ్రమామ్|*

*కృపయా భృశసంతప్త ఇదమాహామృతం వచః॥8039॥*

మిక్కిలి అలసిపోయి, దీనస్వరముతో పలుకుచున్న అతని తడబాటు మాటలను వినినంతనే అతనిపై రంతిదేవునకు మిగులజాలి కలిగెను. పిమ్మట ఆ మహారాజు అతనితో మృదుమధురముగా ఇట్లనెను-

*21.12 (పండ్రెండవ శ్లోకము)*

*న కామయేఽహం గతిమీశ్వరాత్పరామష్టర్ద్ధియుక్తామపునర్భవం వా|*

*ఆర్తిం ప్రపద్యేఽఖిలదేహభాజామంతఃస్థితో యేన భవంత్యదుఃఖాః॥8040॥*

'అయ్యా! నేను భగవంతుని నుండి అణిమాది అష్టసిద్ధులనుగాని, అష్టైశ్వర్యములనుగాని కోరుకొనను. అంతేగాదు, బ్రహ్మపదవినిగాని, కడకు మోక్షమును సైతము అభిలషింపను. సకల ప్రాణులకును నా ఆత్మస్వరూపులని భావించి, వారి దుఃఖములను నేనే అనుభవించుటకు ఇష్టపడుదురు. వారియొక్క వివిధములగు దుఃఖములను నావిగా భావింతును. అందువలన వారు తమ దుఃఖములనుండి దూరమగుదురు.

*21.13 (పదమూడవ శ్లోకము)*

*క్షుత్తృట్ శ్రమో గాత్రపరిశ్రమశ్చ దైన్యం క్లమః శోకవిషాదమోహాః|*

*సర్వే నివృత్తాః కృపణస్య జంతోర్జిజీవిషోర్జీవజలార్పణాన్మే॥8041॥*

*21.14 (పదునాలుగవ శ్లోకము)*

*ఇతి ప్రభాష్య పానీయం మ్రియమాణః పిపాసయా|*

*పుల్కసాయాదదాద్ధీరో నిసర్గకరుణో నృపః॥8042॥*

తీవ్రమగు దాహముతో మిగుల బాధపడుచున్న ఒక దీనునకు జలమును ఇచ్చుటవలన అనగా అతని దప్పిక తీర్చుటవలన అతని ప్రాణములు నిలబడును. అప్ఫుడు నా ఆకలిదప్పుల బాధలు, శరీరముయొక్క పరిశ్రమలు (బడలికలు), దైన్యము, అలసట, శోకము, విషాదము, మోహము మొదలగునవి అన్నియును తొలగిపోవును. అంతట నేను హాయిగా ఉందును'. సున్నితమైన మనస్సుగలవాడు (సహజముగా దయాళువు), ధీరుడు (ఎట్టికష్టములనైనను ధైర్యముతో ఎదుర్కొనగలవాడు) ఐన రంతిదేవుడు తాను ప్రాణములు పోవునంతగా దప్పిగొని యున్నను, ఈ విధముగా పలికి ఆ అల్పునకు తనకడనున్న ఆ మధురజలములను ఇచ్చి, అతని దాహమును తీర్చెను.

*21.15(పదిహేనవ శ్లోకము)*

*తస్య త్రిభువనాధీశాః ఫలదాః ఫలమిచ్ఛతామ్|*

*ఆత్మానం దర్శయాంచక్రుర్మాయా విష్ణువినిర్మితాః॥8043॥*

రంతిదేవునికడకు అతిథులుగా వచ్చినవారు (బ్రాహ్మణుడు, శూద్రుడు మొదలగువారు) విష్ణుమాయా కల్పితులై వేర్వేరు రూపములలో ఏతెంచినవారే. భక్తులయొక్క మనోరథములను ఈడేర్చుచుండెడి బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఆ మహారాజును ఈ విధముగా పరీక్షించిన పిదప ఆయనకు సాక్షాత్కరించిరి.

*21.16 (పదహారవ శ్లోకము)*

*స వై తేభ్యో నమస్కృత్య నిఃసంగో విగతస్పృహః|*

*వాసుదేవే భగవతి భక్త్యా చక్రే మనః పరమ్॥8044॥*

రంతిదేవుడు దేనియందును ఎట్టి మమకారమూ లేనివాడు. అంతేగాదు, ఐహికాముష్మిక ఫలములను ఏమాత్రమూ ఆశింపనివాడు. అట్టి ఆ మహాపురుషుడు తనకు ప్రత్యక్షమైన త్రిమూర్తులకు నమస్కరించెను. అతడు ఆ మహాత్ములను ఏమియు కోరిక సర్వేశ్వరుడైన శ్రీహరియందే భక్తిపూర్వకముగా తన మనస్సును పూర్తిగా లగ్నమొనర్చి తన్మయుడైయుండెను.

PVD Subrahmanyam చెప్పారు...

*21.17 (పదిహేడవ శ్లోకము)*

*ఈశ్వరాలంబనం చిత్తం కుర్వతోఽనన్యరాధసః|*

*మాయా గుణమయీ రాజన్ స్వప్నవత్ప్రత్యలీయత॥8045॥*

రాజా! రంతిదేవుడు భగవత్సేవను దప్ప తదితర ప్రయోజనమును దేనినీ ఆశింపనివాడు. అతడు తన మనస్సును పూర్తిగా భగదధీనము గావించెను. కనుక, మేల్కొన్నవానికి స్వప్నమువలె త్రిగుణాత్మకమైన మాయ అతనిపై ఎట్టి ప్రభావమును గూడ చూపలేకపోయెను.

*21.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*తత్ప్రసంగానుభావేన రంతిదేవానువర్తినః|*

*అభవన్ యోగినః సర్వే నారాయణపరాయణాః॥8046॥*

రంతిదేవుని అనుసరించియుండెడి వారందరును ఆయన సాంగత్య ప్రభావముచే శ్రీహరి భక్తి తత్పరులై, మహాయోగులై సిద్ధిని పొందిరి.

*21.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*గర్గాచ్ఛినిస్తతో గార్గ్యః క్షత్రాద్బ్రహ్మ హ్యవర్తత|*

*దురితక్షయో మహావీర్యాత్తస్య త్రయ్యారుణిః కవిః॥8047॥*

*21.20 (ఇరువదియవ శ్లోకము)*

*పుష్కరారుణిరిత్యత్ర యే బ్రాహ్మణగతిం గతాః|*

*బృహత్క్షత్రస్య పుత్రోఽభూద్ధస్తీ యద్ధస్తినాపురమ్॥8048॥*

మన్యు కుమారులలో ఒకడైన గర్గునియొక్క పుత్రుడు శిని. అతని తనయుడు గార్గ్యుడు. క్షత్రియుడైన గార్గ్యునినుండి బ్రాహ్మణవంశములు వృద్ధిచెందెను. మన్యుకుమారులలో ఒకడైన మహావీర్యునికు దురితక్షయుడు జన్మించెను. ఆ దురితక్షయునివలన త్రయ్యారుణి, కవి, పుష్కలారుణి అను వారు కలిగిరి. ఆ ముగ్గురును బ్రాహ్మణ మార్గములను అనుసరించిరి. మన్యు కుమారులలో జ్యేష్ఠుడైన బృహత్ క్షత్రునకు *హస్తి* అనువాడు కలిగెను. అతడు హస్తినాపురమును నిర్మించెను.

*21.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*అజమీఢో ద్విమీఢశ్చ పురుమీఢశ్చ హస్తినః|*

*అజమీఢస్య వంశ్యాః స్యుః ప్రియమేధాదయో ద్విజాః॥8049॥*

*21.22 (పందొమ్మిదవ శ్లోకము)*

*అజమీఢాద్బృహదిషుస్తస్య పుత్రో బృహద్ధనుః|*

*బృహత్కాయస్తతస్తస్య పుత్ర ఆసీజ్జయద్రథః॥8050॥*

*హస్తి* అను వానికి అజమీఢుడు, ద్విమీఢుడు, పురుమీఢుడు అను ముగ్గురు సుతులు కలిగిరి. అజమీఢుని పరంపరలోని వారైన ప్రియమేధుడు మొదలగు వారు బ్రాహ్మణులైరి. అజమీఢుని కుమారుడు బృహదిషువు. అతని పుత్రుడు బృహద్ధనువు. బృహద్ధనువు తనయుడు బృహత్కాయుడు. అతని సుతుడు జయద్రథుడు.

*21.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*తత్సుతో విశదస్తస్య సేనజిత్సమజాయత|*

*రుచిరాశ్వో దృఢహనుః కాశ్యో వత్సశ్చ తత్సుతాః॥8051॥*

జయద్రథుని వలన విశకరుడు కలిగెను. అతనికి జన్మించినవాడు సేనజిత్తు. సేనజిత్తు తనయులు రుచిరాశ్వుడు, దృఢహనువు, కాశ్యుడు, వత్సుడు.

*21.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*రుచిరాశ్వసుతః పారః పృథుసేనస్తదాత్మజః|*

*పారస్య తనయో నీపస్తస్య పుత్రశతం త్వభూత్॥8052॥*

రుచిరాశ్వుని కుమారుడు పారుడు. ఆ పారునకు పృథుసేనుడు, నీపుడు అను ఇరువురు కలిగిరి. నీపునకు వందమంది పుత్రులు కలిగిరి.

*21.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*స కృత్వ్యాం శుకకన్యాయాం బ్రహ్మదత్తమజీజనత్|*

*స యోగీ గవి భార్యాయాం విష్వక్సేనమధాత్సుతమ్॥8053॥*

ఈ నీపుని వలన శుకుని *(శుకుడు సర్వసంగ పరిత్యాగి. ఇతడు ఛాయాశుకుడు అని తెలియ మనవి)* కుమార్తెయగు *కృత్వి* యందు బ్రహ్మదత్తుడు అనువాడు జన్మించెను. మహాయోగియైన ఈ బ్రహ్మదత్తుని భార్య సరస్వతియందు విష్వక్సేనుడు కలిగెను.

*ఛాయాశుకుని గూర్చి సంక్షిప్తముగా*

వ్యాసుని కుమారుడైన శుకుడు సర్వసంగపరిత్యాగి. అతడు వనములకు వెళ్ళు సమయమున ఒక ఛాయాశుకుని సృష్టించెను. ఆ ఛాయాశుకుడు గృహస్థాశ్రమమును స్వీకరించెను. ఆ ఛాయాశుకుని కుమార్తెయగు *కృత్వి* యందు నీపుని వలన బ్రహ్మదత్తుడు జన్మించెను.

*21.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*జైగీషవ్యోపదేశేన యోగతంత్రం చకార హ|*

*ఉదక్స్వనస్తతస్తస్మాద్భల్లాదో బార్హదీషవాః॥8054॥*

అతడు జైగీషవ్యమునియొక్క ఉపదేశప్రభావమున యోగ తంత్రమును రచించెను. విష్వక్సేనుని తనయుడు ఉదక్స్వనుడు. అతని సుతుడు భల్లాదుడు. వీరు అందరును బృహదిషుని పరంపరలోని వారు.

PVD Subrahmanyam చెప్పారు...

*21.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*యవీనరో ద్విమీఢస్య కృతిమాంస్తత్సుతః స్మృతః|*

*నామ్నా సత్యధృతిర్యస్య దృఢనేమిః సుపార్శ్వకృత్॥8055॥*

హస్తి కుమారులలో రెండవవాడైన ద్విమీఢుని తనయుడు యవనీరుడు. అతని సుతుడు కృతిమంతుడు. కృతిమంతుని పుత్రుడు సత్యధృతి. అతని సూనుడు దృఢనేమి. దృఢనేమికి కలిగినవాడు సుపార్శ్వుడు.

*21.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*సుపార్శ్వాత్సుమతిస్తస్య పుత్రః సన్నతిమాంస్తతః|*

*కృతిర్హిరణ్యనాభాద్యో యోగం ప్రాప్య జగౌ స్మ షట్॥8056॥*

*21.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*సంహితాః ప్రాచ్యసామ్నాం వై నీపో హ్యుగ్రాయుధస్తతః|*

*తస్య క్షేమ్యః సువీరోఽథ సువీరస్య రిపుంజయః॥8057॥*

సుపార్శ్వునకు సుమతి జన్మించెను. అతని తనూజుడు సన్నుతిమంతుడు. అతని పుత్రుడు కృతి. ఈ కృతి యనువాడు బ్రహ్మదేవుని వలన యోగమును సాధనచేసి (శక్తిని పొంది) ప్రాచ్యసామము నందలి ఆరు సంహితలను అధ్యయనము చేసెను. కృతియొక్క కుమారుడు నీపుడు. అతని తనయుడు ఉగ్రాయుధుడు. అతని పుత్రుడు క్షేమ్యుడు. క్షేమ్యుని వలన జన్మించినవాడు సువీరుడు. అతని వలన కలిగినవాడు రిపుంజయుడు.

*21.30 (ముప్పదియవ శ్లోకము)*

*తతో బహురథో నామ పురమీఢోఽప్రజోఽభవత్|*

*నలిన్యామజమీఢస్య నీలః శాంతిః సుతస్తతః॥8058॥*

రిపుంజయుని తనయుడు బహురథుడు. హస్తియొక్క మూడవ కుమారుడైన పురుమీఢునకు సంతానము కలుగలేదు. హస్తి యొక్క జ్యేష్ఠపుత్రుడగు అజమీఢుని వలన *నళిని* అను నామెయందు నీలుడు పుట్టెను. అతని తనయుడు శాంతి.

*21.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*శాంతేః సుశాంతిస్తత్పుత్రః పురుజోఽర్కస్తతోఽభవత్|*

*భర్మ్యాశ్వస్తనయస్తస్య పంచాసన్ ముద్గలాదయః॥8059॥*

*21.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*యవీనరో బృహదిషుః కాంపిల్యః సంజయః సుతాః|*

*భర్మ్యాశ్వః ప్రాహ పుత్రా మే పంచానాం రక్షణాయ హి॥8060॥*

*21.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*విషయాణామలమిమే ఇతి పంచాలసంజ్ఞితాః|*

*ముద్గలాద్బ్రహ్మ నిర్వృత్తం గోత్రం మౌద్గల్యసంజ్ఞితమ్॥8061॥*

*శాంతి* అను వాని తనూజుడు సుశాంతి. అతని సుతుడు పురుజుడు. పురుజుని కొడుకు అర్కుడు. అతని తనయుడు భర్మ్యాశ్వుడు, అతనికి ముద్గలుడు, యవీనరుడు, బృహదిషువు, కాంపిల్యుడు, సంజయుడు అను ఐదుగురు కుమారులు కల్గిరి. భర్మ్యాశ్వుడు తన పుత్రులతో - 'కుమారులారా! మీరు నా అధీనములో నున్న ఐదు దేశములను రక్షించుటకు సర్వసమర్థులు' అని పలికి ఆ రాజ్యములను రక్షించు బాధ్యతను వారికి అప్పగించెను. అప్పటి ఆ ఐదుగురు *పంచాలురు* అని వ్యవహరింపబడిరి. ఈ ఐదుమందిలో పెద్దవాడైన ముద్గలుని వలన *మౌద్గల్య* గోత్రముతో బ్రాహ్మణ వంశము ఏర్పడెను.

*21.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*మిథునం ముద్గలాద్భార్మ్యాద్దివోదాసః పుమానభూత్|*

*అహల్యా కన్యకా యస్యాం శతానందస్తు గౌతమాత్॥8062॥*

భర్మ్యాశ్వుని కుమారుడైన ముద్గలుని వలన *దివోదాసుడు* అను పుత్రుడును, అహల్య అను పుత్రికయు (కవలలు) జన్మించిరి. ఆ అహల్యకు గౌతమమహాముని వలన *శతానందుడు* అను కుమారుడు కలిగెను.

*21.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*తస్య సత్యధృతిః పుత్రో ధనుర్వేదవిశారదః|*

*శరద్వాంస్తత్సుతో యస్మాదుర్వశీదర్శనాత్కిల॥8063॥*

*21.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*శరస్తంబేఽపతద్రేతో మిథునం తదభూచ్ఛుభమ్|*

*తద్దృష్ట్వా కృపయాగృహ్ణాచ్ఛంతనుర్మృగయాం చరన్|*

*కృపః కుమారః కన్యా చ ద్రోణపత్న్యభవత్కృపీ॥8064॥*

శతానందుని కుమారుడు సత్యధృతి. అతడు ధనుర్విద్యలో ఆఱితేఱినవాడు. సత్యధృతి యొక్క తనయుడు శరద్వంతుడు. అతిలోకసుందరి యగు ఊర్వశిని చూచినంతనే శరద్వంతునకు రేతస్సు పతనమయ్యెను. ఆ రేతస్సు ఱెల్లుదుబ్బు పైబడి రెండుగా విభక్తమయ్యెను. అందుండి ఒక బాలుడును, ఒక బాలికయు రూపొందిరి. వేటాడు నిమిత్తమై వచ్చిన శంతనుడు ఆ మార్గముననే వెళ్ళుచు శుభలక్షణ సంపన్నులైన ఆ ఇద్దరు శిశువులను చూచి కనికరముతో వారిని తన వెంట తీసికొనిపోయి పెంచి పెద్ద చేసెను. ఆ బాలుని పేరు *కృపుడు (కృపాచార్యుడు)*, బాలిక పేరు *కృపి*. ఆ *కృపి* యను కన్య ద్రోణాచార్యునకు ధర్మపత్ని అయ్యెను.

కృపాచార్యుడు ద్రోణాచార్యునితోబాటు కురుపాండవులకు అస్త్రవిద్యా గురువు అయ్యెను.

శంతనుని కృపకు పాత్రులైనందుననే బాలునకు *కృపుడు* అనియు, బాలికకు *కృపి* అను పేర్లు ఏర్పడెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ఏకవింశోఽధ్యాయః (21)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు ఇరువది ఒకటవ అధ్యాయము (21)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*134వ నామ మంత్రము*

*ఓం నిర్లేపాయై నమః*

ఫలితంకోసం చేసే కర్మలవలన ఏర్పడు కర్మబంధములకు అతీతంగా విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిర్లేపా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం నిర్లేపాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు ఉపాసకులు బ్రహ్మజ్ఞానులై కర్మబంధముల బాధలకు అతీతులై విరాజిల్లుదురు.

జగన్మాత కర్మబంధముల తాకిడి లేనిది. అందుచే ఆ తల్లి *నిర్లేపా* యని స్తుతింపబడుచున్నది. *లేపనము* అనగా అంటుకొనుట లేదా పూయబడినది అను అర్థములు వచ్చును. ఇక్కడ *లేపనము* అంటే ఆ తల్లికి కర్మబంధములు అంటుకొనుట, అనగా కర్మబంధముల తాకిడి సోకుట. కర్మలు చేయునప్పుడు వాటి ఫలితమునకై చూచునప్ఫుడు బంధము ఏర్పడుతుంది. దానినే కర్మబంధము అని అంటాము.

ప్రతీజీవికీ సంతానము కర్మబంధమే. సంతానము కనడంతో ఆ బంధం విడివడదు. ఆ సంతానాన్ని పెంచాలి. వారు బాగా బ్రతకాలని చదివిస్తారు. మంచి ఉద్యోగం కూడా ఏర్పాటు చేస్తారు. వారికి వివాహము, మళ్ళీ వారికి సంతానము, ఆ సంతానానికి ముద్దుముచ్చట్లు ఇలా....ఈ కర్మబంధం సాగుతునే ఉంటుంది. ఈ కర్మబంధంలో తను కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కాని అమ్మవారు వాళ్ళను పరిశీలిస్తుంది. అనుగ్రహిస్తుంది కూడా. అంతమాత్రమున తల్లిదండ్రులకు తమసంతానము కర్మబంధ ఫలితం కావచ్చేమోగాని, జగన్మాతకు భక్తులు కర్మబంధాలు కారు. వారి కర్మలఫలితాలు అమ్మవారికి అంటవు. అందుచేతనే జగన్మాత *నిర్లేపా* యని అనబడినది. జీవుని కర్మబంధములు దేవునికి (పరమేశ్వరికి) తాకవు. జీవుని చుట్టూ చేరిన మాయను తొలగించేలనే జగన్మాత ఉత్సుకత వలన గలిగిన కర్మబంధము ఆ తల్లికి అంటదు. అందుచేతనే జగన్మాత *నిర్లేపా* యని స్తుతింపబడినది.

బ్రహ్మజ్ఞాని కర్మలకు బంధీ కాజాలడు. ఆయన కర్మలు చేయడు. చేసినప్పటికినీ అవి లోకకల్యాణార్థమై చేస్తాడు. ఫలతం తనకోసంకాదు. అదేవిధంగా బ్రహ్మజ్ఞాన స్వరూపిణియైన పరమేశ్వరి తన భక్తులకు చేయునది లోకకల్యాణార్థ మగును. ఫలితము తన భక్తులకు చేరును గనుక జగన్మాతకు అది కర్మబంధము కాజాలదు. జగన్మాత కర్మలకు, మాయకు అతీతురాలు కనుక, ఆమెకు కర్మబంధములు తాకవు గాన, ఆ తల్లి *నిర్లేపా* యని అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిర్లేపాయైనమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*708వ నామ మంత్రము*

*ఓం సర్వోపాధి వినిర్ముక్తాయై నమః*

ఏ రకమైన ఉపాధులు లేనిది. అద్వైతమూర్తి. పరబ్రహ్మస్వరూపిణి. నిరాకారమైనది. చిన్నయస్వరూపిణి. జీవాత్మపరమాత్మలు ఒకటే యైనను అవిద్యతో భేదమున్నదిగా భావింపబడు మహాశక్తి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సర్వోపాధి వినిర్ముక్తా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం సర్వోపాధి వినిర్ముక్తాయై నమః* యని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ తల్లికరుణచే అత్యంత స్వచ్ఛమైన మనస్సుగలిగినవారై కలియుగ జగన్నాటకంలో మాయల ఉచ్చులలో బడక, తాము కూడా ఒరులను మాయలబారిన పడనీయక, పరిపూర్ణమనస్కులై, ఆధ్యాత్మిక చింతనాపరులై, ధర్మార్థకామసంరక్షణమందు సక్రమవర్తనులై, మోక్షసాధకులై తరింతురు.

ఉప + అధి అనగా ఉపాధి, ఇక్కడ ఉపాధి అనగా కుటుంబంమీద మిక్కిలియాస గలవాడు.అనగా కుటుంబ చింతన గలవాడు. సూక్ష్మంగా చెప్పాలంటే తను, తన కుటుంబము, వారిపోషణ అనే ఆలోచనలు గలిగి యుండుట. ఈ కర్మలంపటములు జీవికేగాని, దేవికి కాదు. ఆమె వీటినుండి విడిచిపెట్టబడినది. ఇక్కడ జీవికి, దేవికి అభేదము ఈ విషయంలో గలదు. దీనికి ఉపనిషత్తులలో ఒక చిన్నకథ గలదు. రెండు పక్షులు ఒక కొమ్మమీద ఉన్నవి. రెండూ రూపంలో ఒకటే. జాతి కూడా ఒకటే. ఆ కొమ్మ మీది ఆ రెండు పక్షులలో ఒకటేమో కన్నీరు కార్చుచున్నది. ఆత్రంగా అటూ ఇటూ చూచుచున్నది. అంటే ఆ పక్షి కర్మఫలాలను అనుభవిస్తున్నది. రెండవది ప్రశాంతంగా, మందహాసముతో నున్నట్లుగా, తనకు పట్టినవి ఏమీ లేనట్లుగా ఒక యోగిపుంగవునివలె కూర్చున్నది. ఈ రెండు పక్షులలో మొదటిది జీవాత్మ. కర్మబంధములకు లోనై ఉన్నది. రెండవది పరమాత్మ. అద్వైతంలో జీవాత్మ-పరమాత్మలు ఒకటేనని చెప్పాము. కాని ఈ జీవాత్మ-పరమాత్మలు అవిద్యచేత భేదం కలిగియుంటున్నవి. జీవాత్మలో అవిద్య తొలగిపోగానే పరమాత్మ స్వరూపాన్ని జీవాత్మ తెలిసికొంటుంది. అప్పుడు తనలోనున్న ఉపాధి (కర్మబంధం) తొలగిపోతుంది. పరబ్రహ్మలో లీనమైపోతుంది.

కాని పరమేశ్వరికి ఈ కర్మబంధములు (ఉపాధులు) లేవు. అందుచేతనే ఆ తల్లి *సర్వోపాధివినిర్ముక్తా* అని స్తుతింపబడినది.

ఆత్మకి గుణాలతో సంబంధం లేదు. నిరాకారమైనది. నిర్గుణమైనది. స్ఫటికమువలె స్వచ్ఛమైనది. కాని ఆ స్ఫటికముపై ప్రక్కనున్న వస్తువుల నీడ ప్రతిఫలించగా వివిధరంగులతో గోచరిస్తుంది. కాని పరమేశ్వరి (పరమాత్మ) ఎటువంటి ప్రక్కనున్న భక్తుల బంధములు, కర్మబంధములు తన కంటక ఉండునట్టిది. అందుచేతనే ఆ తల్లి *సర్వోపాధివినిర్ముక్తా* యని స్తుతింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సర్వోపాధి వినిర్ముక్తాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*22.1 (ప్రథమ శ్లోకము)*

*మిత్రేయుశ్చ దివోదాసాచ్చ్యవనస్తత్సుతో నృప|*

*సుదాసః సహదేవోఽథ సోమకో జంతుజన్మకృత్॥8065॥*

*22.2 (రెండవ శ్లోకము)*

*తస్య పుత్రశతం తేషాం యవీయాన్ పృషతః సుతః|*

*(స తస్మాద్ద్రుపదో జజ్ఞే సర్వసంపత్సమన్వితః)*

*ద్రుపదో ద్రౌపదీ తస్య ధృష్టద్యుమ్నాదయః సుతాః॥8066॥*

*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! ముద్గలుని కుమారుడైన దివోదాసునకు *మిత్రేయుడు* అను పుత్రుడు పుట్టెను. మిత్రేయునకు చ్యవనుడు, సుదాసుడు, సహదేవుడు, సోమకుడు - అను నలుగురు సుతులు కలిగిరి. వారిలో సోమకునకు వందమంది తనయులు జన్మించిరి. ఆ నూరుగురిలో *జంతుడు* అనువాడు పెద్దవాడు, పృషతుడు చిన్నవాడు. పృషతుని తనూజుడు ద్రుపదుడు. ద్రుపదునకు *ద్రౌపది* అను కూతురును, దృష్టద్యుమ్నుడు మొదలగు కుమారులును కలిగిరి.

*22.3 (మూడవ శ్లోకము)*

*ధృష్టద్యుమ్నాద్ధృష్టకేతుర్భార్మ్యాః పంచాలకా ఇమే|*

*యోఽజమీఢసుతో హ్యన్య ఋక్షః సంవరణస్తతః॥8067॥*

*22.4 (నాలుగవ శ్లోకము)*

*తపత్యాం సూర్యకన్యాయాం కురుక్షేత్రపతిః కురుః|*

*పరీక్షిత్సుధనుర్జహ్నుర్నిషధాశ్వః కురోః సుతాః॥8068॥*

ధృష్టద్యుమ్నుని తనయుడు ధృష్టకేతువు. భర్మ్యాశ్యుని వంశమునకు చెందిన వీరు అందరును *పాంచాలురు* అని పిలువబడిరి. అజమీఢుని మరియొక పుత్రుడు ఋక్షుడు. అతని సుతుడు సంవరణుడు. సంవరణుడు సూర్యుని పుత్రికయగు *తపతి* అను కన్యను వివాహమాడెను. సంవరణునివలన తపతియందు *కురువు* అనువాడు జన్మించెను. అతడు కురుక్షేత్రము అను ప్రదేశమును పాలించెను. అతనికి పరీక్షిత్తు, సుధన్వుడు, జహ్నువు, విషధాశ్వుడు అను నలుగురు పుత్రులు కలిగిరి.

*22.5 (ఐదవవ శ్లోకము)*

*సుహోత్రోఽభూత్సుధనుషశ్చ్యవనోఽథ తతః కృతీ|*

*వసుస్తస్యోపరిచరో బృహద్రథముఖాస్తతః॥8069॥*

*22.6 (ఆరవ శ్లోకము)*

*కుశాంబమత్స్యప్రత్యగ్రచేదిపాద్యాశ్చ చేదిపాః|*

*బృహద్రథాత్కుశాగ్రోఽభూదృషభస్తస్య తత్సుతః॥8070॥*

సుధస్వుని కుమారుడు సుహోత్రుడు, అతని తనయుడు చ్యవనుడు. చ్యవనుని సుతుడు కృతి. కృతియొక్క పుత్రుడు ఉపరిచరవసువు. అతనికి బృహద్రథుడు, కుశాంబుడు, మత్స్యుడు, ప్రత్యగ్రుడు, చేదిపుడు అను ఐదుగురు కొడుకులు కలిగిరి. వారు అందరును చేది దేశమునకు పాలకులైరి. బృహద్రథుని పుత్రుడు కుశాగ్రుడు, అతని తనూజుడు వృషభుడు.

*22.4 (ఏడవ శ్లోకము)*

*జజ్ఞే సత్యహితోఽపత్యం పుష్పవాంస్తత్సుతో జహుః|*

*అన్యస్యాం చాపి భార్యాయాం శకలే ద్వే బృహద్రథాత్॥8071॥*

*22.8 (ఎనిమిదవ శ్లోకము)*

*తే మాత్రా బహిరుత్సృష్టే జరయా చాభిసంధితే|*

*జీవ జీవేతి క్రీడంత్యా జరాసంధోఽభవత్సుతః॥8012॥*

వృషభుని వలన పుట్టినవాడు సత్యహితుడు (సత్యవంతుడు). అతని సుతుడు పుష్పవంతుడు. పుష్పవంతుని తనయుడు జహువు. బృహద్రథుని యొక్క మరియొక భార్య గర్భమునుండి రెండు శకలములు ఉద్భవించెను. ఆ రెండు ఖండములను తల్లి బయట పడవేసెను. *జర* అను రాక్షసి ఆ రెండు ముక్కలను వినోదముగా జతపరచి *జీవింపుము-జీవింపుము* అని పలికెను. అట్లు జతపరచబడిన ఆ శరీరము సజీవమయ్యెను. ఆ బాలకుడే జరాసందుడు. *జర* అను రాక్షసిచే సంధింపబడినాడు కావున, అతడు జరాసంధుడుగా వ్యవహరింపబడెను.

*22.9 (తొమ్మిదవ శ్లోకము)*

*తతశ్చ సహదేవోఽభూత్సోమాపిర్చ్ఛ్రుతశ్రవాః|*

*పరీక్షిదనపత్యోఽభూత్సురథో నామ జాహ్నవః॥8073॥*

*22.10 (పదియవ శ్లోకము)*

*తతో విదూరథస్తస్మాత్సార్వభౌమస్తతోఽభవత్|*

*జయసేనస్తత్తనయో రాధికోఽతోఽయుతో హ్యభూత్॥8074॥*

జరాసంధుని కొడుకు సహదేవుడు. అతని సుతుడు సోమాపి. సోమాపి తనయుడు శ్రుతశ్రవుడు. కురువు యొక్క పెద్దకుమారుడగు పరీక్షిత్తునకు ఎట్టి సంతానమూ లేకుండెను. కురువుయొక్క మూడవ కుమారుడైైన జహ్నునకు *సురథుడు* అనువాడు జన్మించెను. అతని సుతుడు విదూరథుడు. అతని కొడుకు సార్వభౌముడు, సార్వభౌముని పుత్రుడు జయసేనుడు. అతిని వలన రాధికుడు కలిగెను. రాధికుని తనూజుడు ఆయుతుడు.

PVD Subrahmanyam చెప్పారు...

*22.11 (పదకొండవ శ్లోకము)*

*తతశ్చ క్రోధనస్తస్మాద్దేవాతిథిరముష్య చ|*

*ఋష్యస్తస్య దిలీపోఽభూత్ప్రతీపస్తస్య చాత్మజః॥8075॥*

*22.12 (పండ్రెండవ శ్లోకము)*

*దేవాపిః శంతనుస్తస్య బాహ్లీక ఇతి చాత్మజాః|*

*పితృరాజ్యం పరిత్యజ్య దేవాపిస్తు వనం గతః॥8076॥*

ఆయుతుని వలన క్రోధనుడు పుట్టెను. అతని కుమారుడు దేవాతిథి. దేవాతిథియొక్క తనయుడు ఋష్యుడు (ఋక్షుడు). ఋష్యుని తనయుడు దిలీపుడు. అతని సుతుడు ప్రతీపుడు. అతని వలన దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అను ముగ్గురు కొడుకులు కలిగిరి. వారిలో దేవాపి తండ్రివలన తనకు లభించిన రాజ్యమును (రాజ్యాధికారమును) త్యజించి వనములకు వెళ్ళెను.

*22.13 (పదమూడవ శ్లోకము)*

*అభవచ్ఛంతనూ రాజా ప్రాఙ్మహాభిషసంజ్ఞితః|*

*యం యం కరాభ్యాం స్పృశతి జీర్ణం యౌవనమేతి సః॥8077॥*

*22.14 (పదునాలుగవ శ్లోకము)*

*శాంతిమాప్నోతి చైవాగ్ర్యాం కర్మణా తేన శంతనుః|*

*సమా ద్వాదశ తద్రాజ్యే న వవర్ష యదా విభుః॥8078॥*

దేవాపి వనములకు వెళ్ళుటతో అతని తమ్ముడగు శంతనుడు ఆ దేశమునకు రాజయ్యెను. పూర్వజన్మలో ఈ శంతనుని పేరు మహాభిషుడు. అతడు మహిమాన్వితుడు. అతని కరస్పర్శ ప్రభావమున ముసలివాడు యువకుడై, శాంతిని పొందును. కనుక, అతడు *శంతనుడు* గా ప్రసిద్ధికెక్కెను. ఈ శంతనుడు పరిపాలించుచున్నప్పుడు అతని రాజ్యమున వరుసగా పన్నెండు సంవత్సరములూ వానలు పడకపోవుటచే తీవ్రమైన కరవు ఏర్పడెను.

*22.15 (పదిహేనవ శ్లోకము)*

*శంతనుర్బ్రాహ్మణైరుక్తః పరివేత్తాయమగ్రభుక్|*

*రాజ్యం దేహ్యగ్రజాయాశు పురరాష్ట్రవివృద్ధయే॥8079॥*

కాటక పరిస్థితులకు కారణము అడుగగా బ్రాహ్మణులు శంతనునితో ఇట్లనిరి - "నీవు నీ అన్నయగు దేవాసి బ్రతికియుండగనే వివాహము చేసికొని, రాజ్యాధికారమును పొందితివి. కనుక నీవు *పరివేత్త* అనబడుదువు.

*దారాగ్నిహోత్ర సంయోగం కురుతే యోఽగ్రజేస్థితే|*

*పరివేత్తా సవిజ్ఞేయః పరివిత్తిస్తు పూర్వజః॥* (స్మృతి)

అన్నకంటెను ముందుగా పెండ్లి చేసికొని, అగ్నికార్యములను ఆచరించినవాడు *పరివేత్త* అని యనబడును. ఆ స్థితిలో ఉన్న అగ్రజుడు (అన్న) *పరివిత్తి* అని వ్యవహరింపబడును.

కనుక నీ నగరము, రాష్ట్రము (రాజ్యము) అభివృద్ధిని పొందవలెనని భావించినచో, నీవు వెంటనే నీ అన్నకు రాజ్యమును ఇచ్చివేయుము. అనగా రాజ్యాధికారమును అప్పగింపుము. అట్లొనర్చినచో, నీ రాజ్యము సుభిక్షముగా ఉండును.

*22.16 (పదహారవ శ్లోకము)*

*ఏవముక్తో ద్విజైర్జ్యేష్ఠం ఛందయామాస సోఽబ్రవీత్|*

*తన్మంత్రిప్రహితైర్విప్రైర్వేదాద్విభ్రంశితో గిరా॥8080॥*

*22.17 (పదిహేడవ శ్లోకము)*

*వేదవాదాతివాదాన్ వై తదా దేవో వవర్ష హ|*

*దేవాపిర్యోగమాస్థాయ కలాపగ్రామమాశ్రితః॥8081॥*

*22.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*సోమవంశే కలౌ నష్టే కృతాదౌ స్థాపయిష్యతి|*

*బాహ్లీకాత్సోమదత్తోఽభూద్భూరిర్భూరిశ్రవాస్తతః॥8082॥*

*22.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*శలశ్చ శంతనోరాసీద్గంగాయాం భీష్మ ఆత్మవాన్|*

*సర్వధర్మవిదాం శ్రేష్ఠో మహాభాగవతః కవిః॥8083॥*

బ్రాహ్మణులు ఇట్లు పలికిన పిమ్మట శంతనుడు తన అనుయాయులతో అన్నకడకు (వనములకు) వెళ్ళి రాజ్యమును స్వీకరింపుము అని ప్రార్థించెను. కాని, శంతనునియొక్క మంత్రియైన *అశ్మరావ* అను వాని ప్రేరణచే కొందరు బ్రాహ్మణులు దేవాపి కడకు వెళ్ళి వేదవిరుద్ధమైన బోధనలను గావించిరి. వారి బోధనల ప్రభావముతో అతడు (దేవాపి) వైదిక సంప్రదాయమును అనుసరించి, గృహస్థాశ్రమమును స్వీకరించుటకు మారుగా వేదములను నిందింపదొడగెను. అందువలన అతడు రాజ్యాధికారమునకు దూరమయ్యెను. అంతట శంతనుని రాజ్యములో వర్షములు కురిసెను. పిమ్మట *దేవాపి* యోగసాధనను కొనసాగించుచు యోగులకు ప్రముఖ స్థానమైన *కలాప* గ్రామమును ఆశ్రయించెను. కలియుగమునందు చంద్రవంశము పతనము కాగా, అతడు (దేవాపి) కృతయుగారంభమున ఆ వంశమును మరల స్థాపించును. శంతనుని తమ్ముడైన బాహ్లికుమారుడు సోమదత్తుడు. అతనికి భూరి, భూరిశ్రవుడు, శలుడు అను ముగ్గురు కుమారులు కలిగిరి. శంతనుని వలన గంగాదేవి యందు భీష్ముడు జన్మించెను. అతడు జితేంద్రియుడు, సకలధర్మములను బాగుగా ఎఱిగినవాడు. పరమ భాగవతోత్తముడు, ఉత్తమ జ్ఞానసంపన్నుడు.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*135వ నామ మంత్రము*

*ఓం నిర్మలాయై నమః*

మలము లేనటువంటిది. పరిశుద్ధమైనది, మయీక మరియు కార్మిక మలములు లేనిది, నిత్యముక్తి ప్రసాదిని, జీవుని వెంట ఉండే దోషాలు, మలనిక్షేపాల వంటి మాలిన్యములు తనకు అంటక పరిశుద్ధురాలై విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిర్మలా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం నిర్మలాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంతభక్తిభరితమైన మనస్సుతో ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి అత్యంత సులభముగా కరుణనుజూపును. ఎనలేని బ్రహ్మజ్ఞాన సంపదను, ఆత్మానందమును ప్రసాదించును. భౌతిక పరమైన సుఖసంతోషములు కూడా ప్రసాదించును.

జగన్మాత నిర్మలమైనది. అంటే ఏవిధమైన మాలిన్యము లేనిది. పరిశుద్ధమైనది. మయీక, కార్మిక మలములు లేనిది. తన భక్తులకు నిత్యము, సత్యమైన ముక్తిని ప్రసాదించునది. జీవుని వెంట ఉండే దోషాలు, మాలిన్యములు తనకంటకుండా, వారిలో సకల మాలిన్యములను పారద్రోలునది. జీవుడు ఫలములనాచరించుచూ కర్మలు చేయును. ఆ కర్మఫలములను తా ననుభవించును. జీవుని కర్మఫలములనుండి కాపాడునపుడు జగన్మాతకు కర్మలమాలిన్యములు అంటవు. జగన్మాత అంతటి పరిశుద్ధురాలు, నిర్మలమైనది. అవిద్యయున్నచోటనే మాలిన్యములుండును. కాని జగన్మాత జ్ఞానస్వరూపిణి, శ్రీవిద్యాస్వరూపిణి. అందుచే ఆ మాలిన్యములు తాకవు. జగన్మాత *ఉద్యద్భాను సహస్రాభ, చిదగ్నికుండ సంభూత* అంతటి ప్రకాశవంతమైన మరియు సహస్రకోటిసూర్యకాంతిప్రభావితమైన అటువంటి చోటికి ఏవిధమైన మాలిన్యములు రావు. వచ్చినా యజ్ఞకుండమునందు దూకు దీపం పురుగులవలె నాశనమైపోవును. అందుకే జగన్మాత *నిర్మలా* యని స్తుతింపబడుచున్నది. అవిద్య, అజ్ఞానము మొదలయిన మలములు అన్నియు దృగ్ రూపకల్పితములు. అనగా కంటికి ఆవరించిన మాయాపొరలనుండి ఉద్భవించినవి. పరమేశ్వరి అటువంటి మాయలకు అతీతమైనది గనుకనే *నిర్మలా* యని స్తుతింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిర్మలాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*709వ నామ మంత్రము*

*ఓం సదాశివ పతివ్రతాయై నమః*

తానవతరించిన వివిధ అవతారము లందును సదా శివుడే పతిగా, శివునిలో తను సగమై అర్ధనారీశ్వర తత్వమునకు ప్రతీకగా, శివునితో అవినాభావ సంబంధం గలిగి పాతివ్రత్యమునకు సంకేతమై నిలచిన తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సదాశివపతివ్రతా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం సదాశివ పతివ్రతాయై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు సర్వకామార్ధసిద్ధి సంప్రాప్తించి, అంత్యమున సాయుజ్యమునందగలరు.

శివుడు అంటే మంగళకారుడు. సదాశివుడు అంటే నిత్యమూ మంగళకారుడు. అటువంటి సదాశివుని జగన్మాత భర్తగాపొందినది. తాను అవతరించిన ప్రతీ అవతారములోను ఆయననే తన భర్తగాపొందినది. పార్వతీ-పరమేశ్వరులు అన్నారు. ఎందుచేతనంటే తనభర్తతో అవినాభావసంబంధం గలిగి పాతివ్రత్యానికి సంకేతమై తను నిలిచినది. అందుకనే జగన్మాతకు తనభర్త సదాశివునిలో గల అన్ని విభూతులు గలిగియున్నది. శివశక్త్యైక స్వరూపిణి. రూపంలోను, నామంలోను, పంచకృత్యాలలోను అన్నివిధాలా పరమేశ్వరునితో జగన్మాత సమన్వయింపబడినది. సాధకుడు యోగసాధనలో కుండలినీ శక్తిని జాగృతంచేసి ఊర్ధ్వముఖంగా పయనింపజేయగా, బ్రహ్మ,విష్ణు,రుద్ర గ్రంథులను ఛేదించి, షట్చక్రాలకావల సహస్రారంలోని చంద్రమండలంలో సుధాసాగరమధ్యమందు పరమేశ్వరునిచేరి ఆయనతో ఆనందతాండవమాడిన తరుణంలో అమృతధారలను వర్షింపజేసినది అంటే ఆ సదాశివుని ఎంతగానో కోరినదైన జగన్మాత *సదాశివపతివ్రతా* యని స్తుతింపబడవలసినదేగదా! సౌందర్యలహరిలో, 96వ శ్లోకంలో శంకరభగవత్పాదుల వారు అమ్మవారి పాతివ్రత్యాన్ని ఇలా చెప్పారు:

*కళత్రం వైధాత్రం - కతికతి భజంతే న కవయః*

*శ్రియో దేవ్యాః కోవా - న భవతి పతిః కైరపి ధనైః|*

*మహాదేవం హిత్వా - తవ సతి సతీనామచరమే‌*

*కుచాభ్యా మాసంగః - కురవకతరో రప్య సులభః||96||*

సతీదేవీ! గొప్పకవులను సరస్వతీవల్లభులంటారు. గొప్ప సంపన్నులను లక్ష్మీపతులంటారు. కాని నీ కౌగిలింత మాత్రము ఈశ్వరునకు మాత్రమే లభించును. గోరింట చెట్టుకు కూడా లభించదు.

*భావము:*

అమ్మా! పతివ్రతాగ్రగణ్యా - ఎందరెందరో కవులు సరస్వతిని ఉపాసించి ఆమె అనుగ్రహం తో కవీశ్వరులై సరస్వతీ వల్లభులు అనిపించుకుంటున్నారు. అలాగే లక్ష్మీదేవిని ఆరాధించి ఆమె దయతో ధనవంతులై లక్ష్మీపతులు అవుతున్నారు. కాని అమ్మా శివునికి మాత్రమే సొంతమై శివునిలో అర్ధభాగమై ఉండు నీ అనుగ్రహం పొందుట మాత్రం అంత తేలికైన విషయం కాదు.లోకంలో కురవకవృక్షం ( గోరింటాకు చెట్టు) పండుటకు ఉత్తమ స్త్రీ ఆలింగనం చెప్పబడి ఉన్నది. నీ ఉద్యాన వనంలో ఆ చెట్టుకు నీవు దోహదం చేయునప్పుడు కూడా ఆ వృక్షమునకు నీ స్పర్శ నీలో అర్ధభాగమైన సదాశివునితోనే తప్ప శివేతరగా (శివుడు లేకుండా) నిన్ను తాకుట కుదరదు. అటువంటి పతివ్రతవు నీవు.పతివ్రతలలో అగ్రగణ్యవు (ముందు లెక్కింపవలసినదానవు) నీవు.
ఇచట శ్రీ ఆదిశంకరులు చెబుతున్నది ఏమనగా - బ్రహ్మ లేకుండా సరస్వతిని ఉపాసించి సరస్వతిని మాత్రం పొందవచ్చు, విష్ణువు లేకుండా లక్ష్మిని ఉపాసించి లక్ష్మి‌ని మాత్రం పొందవచ్చు. కాని జగన్మాత విషయంలో మాత్రం అలాకాదు, ఆమె ఒక్కరేగా నిన్ను అనుగ్రహించదు.ఆమె అనుగ్రహం పొందాలంటే అర్ధనారీశ్వరులైన వారిరువురినీ కలిపి ఉపాసించవలసినదే. అంతేకాదు లోకంలో ఎవరైనా ఎప్పటికైనా విద్యావంతులు కావచ్చు, లక్ష్మీవంతులు కావచ్చు కాని లలితా కటాక్షవంతులు కావటం మాత్రం పరమ దుర్లభం. ఎంతో కఠోరమైన "యమ నియమ ఆసన ప్రత్య ఆహార ధ్యాన ధారణ సమాధి" ఇత్యాది అష్టాంగ యోగ నిష్ఠాగరిష్టులై అనన్య భక్తితో ఉపాసించు వారికి తప్ప ఇతరులకు ఇది సాధ్యం కాదు. ఇహ లోకంలో సుఖములను ఉపకరించు ఈ విద్యా, ధనం పొందినంత సులభం కాదు పరలోకంలో ముక్తిని అనుగ్రహించు అమ్మ పాదాలు పొందుట అని కవి భావము.

జగన్మాత ఆయన ప్రేమఅనే మణిరత్నాన్ని మొత్తంగా తనదిగా చేసుకోవడానికి తన స్తన ద్వయమనే ప్రపిఫలాన్ని అచ్చం ఇచ్చేసిందనడానికి, శ్రీలలితా సహస్రనామావళిలోని 33వ నామ మంత్రాన్ని పరిశీలించుదాము: *కామేశ్వరప్రేమరత్న మణి ప్రతిపణస్తనీ* పరమ పదాన్ని పొందడానికి భక్తి, జ్ఞానములు రెండూ కూడా కావాలని గూఢార్థము.

ఆ మహాతల్లి ఎంతటి పతివ్రత అంటే *కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా* (శ్రీలలితా సహస్ర నామావళి లోని 39వ నామ మంత్రము). పతివ్రతామతల్లులు తమ ముఖపద్మమును సహితం ఒరులకు కనుపింపనీయరు. అటువంటిది కామేశ్వరునికి మాత్రమే తెలిసిన, సౌభాగ్య మృదుత్వాలతోగూడిన ఉరుద్వయం గలిగిన మహాతల్లి జగన్మాత ఎంతటి పతివ్రతామతల్లి. శివశక్త్యైక్యము ఇక్కడ నిరూపితమౌతోందిగదా!

తన భర్త వలదు వలదని చెప్పినా వినక తన తండ్రి (దక్షుడు) నిర్వహించు దక్షయజ్ఞమునకు వెళ్ళగా, తాను (జగన్మాత) పిలవని పేరంటమునకు వచ్చినదనియు, అలా పంపించిన పరమేశ్వరుని (దక్షుడు) నానా దుర్భాషలాడగా, తన భర్త అవమానము తనదిగా భావించిన జగన్మాత, యజ్ఞకుండంలో తనువు చాలించి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్నది.

PVD Subrahmanyam చెప్పారు...

సురాసురులు అమృతము కొరకై చేయు క్షీరసాగరమథనమందు లోకభయంకరమైన హాలాహలము ఉత్పన్నమైనవేళ, జీవకోటి హాహాకారములు చేస్తుండగా, లోకానికి వచ్చిన పెనుముప్పుకు తల్లడిల్లినది జగన్మాత. ఆ తల్లి ఆ పెనుముప్పును తప్పించలేకనా? తన మాంగల్యసౌభాగ్యమును, తన పాతివ్రత్య మహనీయతను ఎంతగానో విశ్వసించినదిగా, అంతటి భయంకరమైన హాలాహలమును పరమేశ్వరునిచే సేవింపజేసింది. ఎందుకని? తన పాతివ్రత్యాన్ని, తన మాంగల్యబలాన్ని అందరికీ ఆదర్శంగా ఉండడంకోసం . ఇదే విషయాన్ని బమ్మెర పోతనామాత్యులవారు అమ్మవారి పాతివ్రత్యానికి అబ్బురపడిన ఈ పద్యరత్నములను ఒకసారి పరిశీలిద్దాము.

*కంద పద్యము*

మ్రింగెడి వాఁడు విభుం డని
మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!

*తాత్పర్యం*

ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది.

*ఆ హాలాహలమును పరమ శివుడు గ్రోలినప్పుడు*

*మత్తేభ విక్రీడితము*

కదలం బాఱవు పాఁప పేరు; లొడలన్ ఘర్మాంబుజాలంబు పు
ట్టదు; నేత్రంబులు నెఱ్ఱ గావు; నిజజూటా చంద్రుఁడుం గందఁడున్;
వదనాంభోజము వాడ; దా విషము నాహ్వానించుచో డాయుచోఁ
బదిలుండై కడి జేయుచోఁ దిగుచుచో భక్షించుచో మ్రింగుచోన్.

*తాత్పర్యము*

మహాదేవుడు ప్రచండమైన ఆ హాలాహలాగ్నిని ఆహ్వానిస్తున్నప్పుడు కానీ, దానిని సమిపించే టప్పుడు కానీ, పదిలంగా పట్టుకుని ముద్దచేసే టప్పుడు కానీ, నోట్లో ఉంచుకునే టప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, మ్రింగే టప్పుడు కానీ, ఆయన కంఠాన హారాలుగా ఉన్న సర్పాలు కదలలేదు; చెమటలు గ్రమ్మ లేదు; కన్నులు ఎఱ్ఱబార లేదు; సిగలోని చంద్రుడు కందిపోలేదు; ఆయన ముఖ పద్మం వడల లేదు.

అంతటి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సదాశివపతివ్రతాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*22.20 (ఇరువదియవ శ్లోకము)*

*వీరయూథాగ్రణీర్యేన రామోఽపి యుధి తోషితః|*

*శంతనోర్దాశకన్యాయాం జజ్ఞే చిత్రాంగదః సుతః॥8084॥*

*22.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*విచిత్రవీర్యశ్చావరజో నామ్నా చిత్రాంగదో హతః|*

*యస్యాం పరాశరాత్సాక్షాదవతీర్ణో హరేః కలా॥8085॥*

*22.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*వేదగుప్తో మునిః కృష్ణో యతోఽహమిదమధ్యగామ్|*

*హిత్వా స్వశిష్యాన్ పైలాదీన్ భగవాన్ బాదరాయణః॥8086॥*

*22.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*మహ్యం పుత్రాయ శాంతాయ పరం గుహ్యమిదం జగౌ|*

*విచిత్రవీర్యోఽథోవాహ కాశిరాజసుతే బలాత్॥8087॥*

*22.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*స్వయంవరాదుపానీతే అంబికాంబాలికే ఉభే|*

*తయోరాసక్తహృదయో గృహీతో యక్ష్మణా మృతః॥8089॥*

భీష్ముడు వీరశిరోమణి, కురుక్షేత్ర యుద్ధమున సైన్యాధిపత్యము వహించినవాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*భీష్ముని పూర్వజన్మము* భీష్ముడు పూర్వజన్నలో ప్రభాసుడు. ప్రభాసుడు అష్టవసువులలో ఎనిమిదవవాడు. అష్టవసువులు ఒకసారి వసిష్ఠుని కడకేగిరి. వసిష్ఠుని యొక్క హోమధేనువు పాలు త్రాగిన వారికి జరామరణములు ఉండవని వారికి తెలిసెను. అప్ఫుడు ప్రభాసుని భార్య ఆ ధేనువునకై ఆశపడెను. ఆమె కోరికమేరకు అష్టవసువులు ఆ ధేనువును దొంగిలించిరి. అందులకు వసిష్ఠుడు 'మీరు మనుష్యులై జన్మింపుడు' అని వారిని శపించెను. వారిలో పెద్ద తప్పు చేసినవాడు ప్రభాసుడు. కావున వసిష్ఠుడు 'నీవు మనుష్యుడవై పుట్టుటయేకాదు, సంతానము లేనివాడవు అగుదువు. జీవితాంతము మనుష్యుడవై యుందువు'. అని ప్రభాసుని శపించెను. ఈ అష్టవసువులు శంతనుని వలన గంగాదేవియందు మానవులై జన్మించిరి. వారిలో మొదటి ఏడుగురును నరజన్మనెత్తి వెంటనే మరణించి, శాపవిముక్తి పొందిరి. ప్రభాసుడు మాత్రము భీష్మునిగా పుట్టి జీవితాంతము అనపత్యుడై (బ్రహ్మచారిగనే) ఉండెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
భీష్ముడు పరశురాముని కడ అస్త్రవిద్యలను నేర్చెను. ఒకానొక సందర్భమున భీష్ముడు తన గురువగు పరశురామునితో యుద్ధమొనర్చి, తన యుద్ధకౌశలముచే గురువునే మెప్పించెను. శంతనుని వలన దాశకన్య (సత్యవతి) యందు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు జన్మించిరి. ( *దాశకన్య* - ఈమెకు మత్స్యగంధి, యోజనగంధి, సత్యవతి అను పేర్లుగలవు. ఉపరిచర వసువుయొక్క వీర్యమును చేప భక్షింపగా, ఆ మత్స్యగర్భమున జన్మించి మత్స్యగంధి యయ్యెను. ఈమె దాశరాజు పోషణలో పెరిగినందున దాశకన్యగా ప్రసిద్ధికెక్కెను) చిత్రాంగదుడు యుద్ధమున ఒక గంధర్వుని చేతిలో హతుడయ్యెను. పరాశరమహర్షి వలన ఆ దాశకన్యయందు వేదవ్యాస మహాముని శ్రీహరియంశ కలిగి కృష్ణవర్ణముతో జన్మించెను. అతడు వేదములను రక్షించి లోకప్రశస్తి గన్నవాడు. పరీక్షిన్మహారాజా! ఆ మహాత్ముని నుండియే నేను (శుకుడు) ఈ భాగవతమును అభ్యసించితిని. పూజ్యుడైన ఆ బాదరాయణుడు (వ్యాసుడు) పరమగోప్యమైన ఈ భాగవతమును తన శిష్యులైన పైలుడు మొదలగు వారికి బోధింపలేదు. తనకు పుత్రుడను, పైగా శాంతస్వభావము గలవాడను ఐన నన్ను భాగవతమును అధ్యయనము చేయుటకు అర్హునిగా భావించి, దానిని నాకు బోధించెను. కాశిరాజు కుమార్తెయైన అంబిక, అంబాలిక అను వారిని స్వయంవర మండపమునుండి బలాత్కారముగా తీసికొనివచ్చి, భీష్ముడు విచిత్రవీర్యునకు (సత్యవతి రెండవ కుమారునకు) ఇచ్చి వివాహమొనర్చెను. విచిత్రవీర్యుడు తన ఇరువురి భార్యలయందు అమితమైన ఆసక్తిగలవాడై సుఖలోలుడయ్యెను. క్రమముగా క్షయరోగమునకు లోనై మృతి చెందెను.

*22.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*క్షేత్రేఽప్రజస్య వై భ్రాతుర్మాత్రోక్తో బాదరాయణః|*

*ధృతరాష్ట్రం చ పాండుం చ విదురం చాప్యజీజనత్॥8089॥*

విచిత్రవీర్యుడు మరణించు నాటికి అతని భార్యలగు అంబిక, అంబాలిక అనువారికి సంతానము లేకుండెను. వంశాభివృద్ధికై తల్లియగు సత్యవతియొక్క ఆదేశమును అనుసరించి, వ్యాసమహర్షి తన తమ్ముని భార్యలైన అంబికయందు ధృతరాష్ట్రునకును, అంబాలికయందు పాండురాజునకును జన్మమిచ్చెను. పిమ్మట ఒక దాసియందు విదురునకు జన్మమిచ్చెను.

*22.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*గాంధార్యాం ధృతరాష్ట్రస్య జజ్ఞే పుత్రశతం నృప|*

*తత్ర దుర్యోధనో జ్యేష్ఠో దుఃశలా చాపి కన్యకా॥8090॥*

పరీక్షిన్మహారాజా! ధృతరాష్త్రుని వలన గాంధారియందు నూరుగురు కుమారులును, దుశ్శల (దుస్సల) అను కుమార్తెయు కలిగిరి. వారిలో దుర్యోధనుడు పెద్దవాడు.

PVD Subrahmanyam చెప్పారు...

*22.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*శాపాన్మైథునరుద్ధస్య పాండోః కుంత్యాం మహారథాః|*

*జాతా ధర్మానిలేంద్రేభ్యో యుధిష్ఠిరముఖాస్త్రయః॥8091॥*

*22.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*నకులః సహదేవశ్చ మాద్ర్యాం నాసత్యదస్రయోః|*

*ద్రౌపద్యాం పంచ పంచభ్యః పుత్రాస్తే పితరోఽభవన్॥8092॥*

*22.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*యుధిష్ఠిరాత్ప్రతివింధ్యః శ్రుతసేనో వృకోదరాత్|*

*అర్జునాచ్ఛ్రుతకీర్తిస్తు శతానీకస్తు నాకులిః॥8093॥*

*22.30 (ముప్పదియవ శ్లోకము)*

*సహదేవసుతో రాజన్ శ్రుతకర్మా తథాపరే|*

*యుధిష్ఠిరాత్తు పౌరవ్యాం దేవకోఽథ ఘటోత్కచః॥8094॥*

*22.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*భీమసేనాద్ధిడింబాయాం కాల్యాం సర్వగతస్తతః|*

*సహదేవాత్సుహోత్రం తు విజయాసూత పార్వతీ॥8095॥*

'భార్యా సంగమము జరిపినచో నీవు మృతి చెందెదవు' అని పాండురాజును కిందమహాముని శపించెను. అందువలన ఆయన పెద్దభార్యయగు కుంతియందు యమధర్మరాజు వలన యుధిష్ఠిరుడు (ధర్మరాజు), వాయుదేవుని వలన భీముడు, ఇంద్రుని వలన అర్జునుడు జన్మించిరి. అట్లే పాండురాజుయొక్క రెండవ భార్యయైన మాద్రియందు అశ్వినీదేవతల (అశ్వినీకుమారుల) వలన నకుల సహదేవులు పుట్టిరి. వీరు అందఱును మహారథులు. ఈ పంచపాండవులవలన ద్రౌపదియందు ఐదుగురు సుతులు కలిగిరి. వీరందరును నీకు (పరీక్షిన్మహారాజునకు) పెదతండ్రులు. రాజా! యుధిష్ఠిరునివలన ప్రతివింధ్యుడు, భీమసేనుని వలన శ్రుతసేనుడు, అర్జునుని వలన శ్రుతకీర్తి, నకులుని వలన శతానీకుడు, సహదేవుని వలన శ్రుతకర్మ అనువారు ద్రౌపదియందు జన్మించిరి. ఇంకను ధర్మరాజునకు *పౌరవి* అను నామెయందు దేవకుడు, భీమునకు హిడింబియందు ఘటోత్కచుడు, *కాళి* అను నామెయందు సర్వగతుడు అనువారు జన్మించిరి. అట్లే సహదేవుని వలన పర్వతుని కూతురైన *విజయ* అను నామెయందు సుహోత్రుడు పుట్టెను.

*22.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*కరేణుమత్యాం నకులో నరమిత్రం తథార్జునః|*

*ఇరావంతములుప్యాం వై సుతాయాం బభ్రువాహనమ్|*

*మణిపూరపతేః సోఽపి తత్పుత్రః పుత్రికాసుతః॥8096॥*

నకులుని వలన *కరేణుమతి* అనునామె యందు నిరమిత్రుడు జన్మించెను. అర్జునుని వలన నాగకన్యయైన ఉలూపియందు ఇరావంతుడు, మణిపూరమహారాజు యొక్క పుత్రికయైన చిత్రాంగదయందు బభ్రువాహనుడు జన్మించెను. ఇతడు తన తాతయైన మణిపూరమహారాజు కడనే పెరిగి పెద్దవాడైనందున ఆ మహారాజుచే పుత్రుడుగా పరిగణింపబడెను.

*22.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*తవ తాతః సుభద్రాయామభిమన్యురజాయత|*

*సర్వాతిరథజిద్వీర ఉత్తరాయాం తతో భవాన్॥8097॥*

మీ తాతయగు అర్జునునివలన సుభద్రయందు మీ తండ్రియగు అభిమన్యుడు జన్మించెను. ఆ అభిమన్యుడు మహావీరుడు. అతిరథులను అందరిని జయించినవాడు. ఆ వీరాభిమన్యుని వలననే ఉత్తరయందు నీవు పుట్టితివి.

*22.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*పరిక్షీణేషు కురుషు ద్రౌణేర్బ్రహ్మాస్త్రతేజసా|*

*త్వం చ కృష్ణానుభావేన సజీవో మోచితోఽన్తకాత్॥8098॥*

కురుక్షేత్ర యుద్ధమున దుర్యోధనాది కౌరవులు ఎల్లరును మరణించుటచే కృద్ధుడైన అశ్వత్థామ మాతృ గర్భములో నున్న నీపై బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. కాని, శ్రీకృష్ణపరమాత్మ యొక్క అనుగ్రహమున నీవు మృత్యువునుండి రక్షింపబడి సజీవుడవైతివి.

*22.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*తవేమే తనయాస్తాత జనమేజయపూర్వకాః|*

*శ్రుతసేనో భీమసేన ఉగ్రసేనశ్చ వీర్యవాన్॥8099॥*

నాయనా! పరీక్షిన్మహారాజా! జనమేజయుడు, శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అను నీ కుమారులు ఇచ్చటనే యున్నారు. వీరు అందరును మిక్కిలి పరాక్రమవంతులు.

*22.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*జనమేజయస్త్వాం విదిత్వా తక్షకాన్నిధనం గతమ్|*

*సర్పాన్ వై సర్పయాగాగ్నౌ స హోష్యతి రుషాన్వితః॥8100॥*

ఇక మున్ముందు జరుగబోవు విషయములను గూడ చెప్పెదను వినుము. నీవు తక్షకుని కాటునకు గుఱియై మృత్యువు పాలగుదువు. అంతట జనమేజయుడు మిగుల క్రుద్ధుడై సర్పయాగమొనర్చి, ఆ అగ్నియందు సర్పములను అన్నింటిని ఆహుతి యొనర్చును.

*22.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*కావషేయం పురోధాయ తురం తురగమేధయాట్|*

*సమంతాత్పృథివీం సర్వాం జిత్వా యక్ష్యతి చాధ్వరైః॥8101॥*

పిదప జనమేజయుడు కవష (కలష) తనయుడగు తురుని పురోహితునిగా జేసికొని అశ్వమేధయాగమును ఆచరించును. అనంతరము సమస్త భూమండలమును జయించి, యజ్ఞములద్వారా భగవంతుని ఆరాధించును.

*136వ నామ మంత్రము*

*ఓం నిత్యాయై నమః*

సర్వకాల సర్వావస్థలయందును, నిత్యమై, శాశ్వతమై, జన్మమృత్యుజరాభయములు లేక, భూతభవిష్యద్వర్తమానముల యందును, జాగ్రస్వప్న సుషుప్తుల యందును నాశనములేనిదై విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిత్యా* యను రెండక్షరముల (ద్వాక్షరీ) నామ మంత్రమును *ఓం నిత్యాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ అఖిలాండేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకునకు ఎనలేని బ్రహ్మజ్ఞాన సంపద, ఆత్మానందానుభూతిని ప్రసాదించును.

అవిద్యచే మాలిన్యము ఏర్పడును. తన్మూలముగా అనిత్యత సంతరించును. క్షణిక విజ్ఞానవాదము ప్రారంభమగును. ద్వైతము (జీవాత్మ, పరమాత్మల భేదము) మితిమీరును. కాని జగన్మాత బ్రహ్మజ్ఞాన స్వరూపిణి. అందుచే జన్మమృత్యు జరాభయాదులుగాని, భూతభవిష్యద్వర్తమానముల యందు, జాగ్రస్వప్నసుషుప్తులలోను కూడా నాశనముగాని లేనిదై విరాజిల్లును. భూత భవిష్యద్వర్తమానములకు అతీతమైనది (కాలాతీత), త్రిగుణాలకు, త్రిశక్తులకు అతీతమై శాశ్వతమైనది. సృష్టికి ముందు, సృష్టికి పిమ్మట, సృష్టి సమయములయందు అనునది లేక నిత్యమై యుండునది. ఆదిమధ్యాంతరహితమైనది. అందుచే జగన్మాత *నిత్యా* యని నామ ప్రసిద్ధమైనది.

PVD Subrahmanyam చెప్పారు...

ఈ నిత్యల గురుంచి వామకేశ్వర తంత్రంలోని *ఖడ్గమాలలో* చెప్పబడినది.

కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలినీ, చిత్రా, మహానిత్య ఈ పదహారు నిత్యలలో *మహానిత్య* అని చెప్పబడినదియే పదహారవకళ అయిన సాక్షాత్తు పరమేశ్వరి. జగన్మాత ఈ నిత్యాదేవత స్వరూపిణి గనుకనే, ఆ తల్లిని *నిత్యా* అని యన్నాము.

చంద్రకళలను సూచించే తిథులకు - అమ్మవారి కళలకు సమన్వయం ఉన్నది. శుక్లపక్షమి చంద్రుడు, పాడ్యమి నుండి క్రమంగా ఒక్కొక్క కళ పెరుగుతూ పూర్ణిమ వరకు నిండు చంద్రుడౌతాడు. చంద్రునియొక్క పదహారు కళలు శ్రీవిద్యలో *నిత్య* లని అంటారు. రెండు పక్షాలలోని తిథులకు నిత్యలని సమన్వయం చేయడమైనది.
🌻🌻🌻
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻శుక్ల పక్షము

1. పాడ్యమి - కామేశ్వరి
2. విదియ - భగమాలిని
3. తదియ - నిత్యక్లిన్నా
4. చవితి - భేరుండా
5. పంచమి - వహ్నివాసినీ
6. షష్టి - మహావజ్రేశ్వరీ
7. సప్తమి - శివదూతీ
8. అష్టమి - త్వరతా
9. నవమి - కులసుందరీ
10. దశమి - నిత్యా
11. ఏకాదశి - నీలపతాకా
12. ద్వాదశి - విజయ
13. త్రయోదశి-సర్వమంగళా
14. చతుర్దశి - జ్వాలామాలిని
15. పూర్ణిమ - చిత్రా

కృష్ణ పక్షము

1. పాడ్యమి - చిత్రా
2. విదియ - జ్వాలామాలిని
3. తదియ - సర్వమంగళా
4. చవితి - విజయా
5. పంచమి - నీలపతాకా
6. షష్టి - నిత్యా
7. సప్తమి - కులసుందరీ
8. అష్టమి - త్వరితా
9. నవమి - శివదూతీ
10. దశమి - మహావజ్రేశ్వరి
11. ఏకాదశి - వహ్నివాసిని
12. ద్వాదశి - భేరుండా
13. త్రయోదశి-నిత్యక్లిన్నా
14. చతుర్దశి - భగమాలిని
15. అమావాస్య - కామేశ్వరీ

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే శుక్లపక్షము నందలి నిత్యాదేవతలు పాడ్యమి నుండి పౌర్ణమి వరకు అనులోమక్రమం అనగా పాడ్యమి నాడు కామేశ్వరి నుండి పౌర్ణమి నాడు *చిత్రా* గా గమనిస్తే, కృష్ణపక్షంలో విలోమము అనగా పౌర్ణమి నాటి నిత్యాదేవత చిత్ర కాగా కృష్ణపక్ష పాడ్యమికి కూడా నిత్యాదేవత *చిత్రా* తో ప్రారంభమై విలోమక్రమంలో అమావాస్యనాటికి నిత్యాదేవత (మహానిత్య) కామేశ్వరి అవుతుంది. ఇది చంద్రకళల క్రమంలో ఏర్పడింది. కాని శుక్లపక్షమునందు, కృష్ణ పక్షము నందు *అష్టమి* నాటి నిత్యాదేవత *త్వరితా* అగును. అంటే *అష్టమీచంద్రవిభ్రాజదళకస్థల శోభితా* అను నామ మంత్రములో వశిన్యాది దేవతలు చెప్పిన అష్టమి చంద్రుడు శుక్లపక్షమైనా, కృష్ణపక్షమైనా ఒకే విధముగా ఉంటాడు అంటే అంతటి అష్టమి చంద్ర శోభతో జగన్మాత ఫాలభాగము శోభాయమానమై ఉన్నదని వశిన్యాది దేవతలు చెప్పారంటే అమ్మను వారు తిలకించియున్నారు గదా!🌹🌹🌹ఈ పదిహేను నిత్యలలో - శుక్లపక్షములో ఒక్కొక్క కళ పెరుగుతూ ఉంటుంది. కృష్ణపక్షములో ఒక్కొక్క కళ తగ్గుతూ ఉన్న మూలభూతమైన కళను *మహానిత్యయని* అందురు. దీనినే లలితకళ, ఆద్యకళ, చిత్కళ, సంవిత్కళ అని అంటారు. ఈ మహానిత్య లలితాంగిగా ఉన్నందున మిగతా కళలు నిత్యల యందు అంగభాగములుగా ఉండును.🌹🌹🌹జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిత్యాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*710వ నామ మంత్రము*

*ఓం సంప్రదాయేశ్వర్యై నమః*

శ్రీవిద్యా సంప్రదాయము పరమేశ్వరుని నుండి గురుశిష్య పరంపరగా కొనసాగుతూ, అట్టి సంప్రదాయములకు తానే స్వరూపమై నిలచిన శ్రీవిద్యాస్వరూపిణికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సంప్రదాయేశ్వరీ* యను ఆరు అక్షరముల(షడక్షరీ) నామ మంత్రమును *ఓం సంప్రదాయేశ్వర్యై నమః* యని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతకు పూజలు చేయు భక్తులు, ఆ తల్లికరుణచే కులసాంప్రదాయములు, కుటుంబ సాంప్రదాయములు సక్రమముగా పాటించుచూ, ఆ తల్లి సంకీర్తనమందు తమ జీవితమునకు ధన్యతనందెదరు.

సంప్రదాయమనునది పారంపర్యముగా వచ్చును. పరమేశ్వురుని నుండి ప్రారంభమై, నేటికిని గురుశిష్య పరంపరగా కొనసాగుతున్నది శ్రీవిద్య. శ్రీమాత శ్రీవిద్యాస్వరూపిణి గనుక ఆ తల్లిని *సంప్రదాయేశ్వరీ* యను నామముతో స్తుతించుచున్నాము.

వేదాధ్యయనము వలనగాని, శాస్త్రపఠనము వలనగాని బ్రహ్మజ్ఞానం సంప్రాప్తమవదు. అది కేవలం గురుశిష్యపరంపరగా (గురువు శిష్యునికి బోధించును. పిదప ఆ శిష్యుడు గురుస్థానమలంకరించి తన శిష్యులకు బోధించుచూ కొనసాగే క్రమము) కొనసాగునది. పరమేశ్వురుని నుండి ప్రారంభమై నేటికిని గురుసాంప్రదాయానికి మూలమైన ఆ పరమేశ్వరి సాక్షిగా కొనసాగుచున్నది అందుకే జగన్మాత *సంప్రదాయేశ్వరీ* యని నామాంకిత అయినది.

శ్రీవిద్యోపాసకులు మొత్తం పద్నాలుగు మంది ప్రధానంగా ఉన్నారు. కొందరు పన్నెండు అంటారు కానీ మరొక ఇద్దరిని కూడా ప్రముఖంగా తీసుకొచ్చి పధ్నాలుగురు గురించి మానసోల్లాస గ్రంథం చెప్పింది. శ్రీవిద్యను మనదాకా గురుశిష్యపరంపరగా తీసుకువచ్చిన మహానుభావులు వీరు. వీళ్ళందరూ కూడా దేవతా స్థాయి వాళ్ళు. మానవ స్థాయిలో ఉన్న ఋషులు చాలామంది ఉన్నారు. శంకరులు మొదలైన వారెందరో. కానీ దేవతలకు సంబంధించిన మనం వారి సిద్ధ్యౌఘ, దివ్యౌఘ, పాదౌఘ అని కూడా అంటూంటాం. ఇలా అనేకమంది ఉన్నారు. కానీ ప్రధానంగా పద్నాలుగు మంది. వీరిని ఎప్పుడూ తలచుకోవాలి. వీళ్ళు శ్రీవిద్యోపాసన వల్ల శక్తి పొంది జగద్రచన చేస్తారు. వాళ్ళు ముందుగా
శివుడు - ఆయనొక పెద్ద భక్తుడు. అందుకే శివారాధ్యా అని అంటున్నాం. విష్ణువు, బ్రహ్మ, మనువులు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి,
మన్మథుడు - *మన్మథుడు ఉపాసించిన శ్రీవిద్యే మనకు ప్రసిద్ధి*. ఇప్పుడు చేస్తున్న పంచదశీ విద్య అంతా మన్మథుడు చేసినదే.
వీళ్ళు ఎలా ఉపాసించారు అన్నది మనకు తెలియదు. వాళ్ళయొక్క మంత్రవిద్యలు వేరు. వాళ్ళందరూ శ్రీమాతను ఉపాసించారు అని తెలుసు కానీ వాళ్ళ పద్ధతులు ఏవో మనకు తెలియవు. మనం ఉపాసిస్తున్నది మన్మథ విద్య - కామరాజ విద్య. అదే *ఆత్మ విద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా* అమ్మ ఇచ్చాశక్తి స్వరూపిణి కదా! ఆవిడ అనుగ్రహం లేకపోతే మన్మథుడు ఈ ప్రపంచం నడపలేడు, ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు, ఇందులో మన్మథుడు వరకు చెప్పి ఊరుకుంటారు కొందరు. దత్తాత్రేయుడు పెద్ద శ్రీవిద్యోపాసకుడు. ఆయన పరశురాముడికి శ్రీవిద్యోపాసన తెలియజేశాడు. కనుక అమ్మను ఆరాధించేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కదా! అందుకే శంకరులు *హరిహర విరించాదిభిరపి* అని. ఇలా వీళ్ళందరి చేతా ఆరాధించబడినది.

జగన్మాతకు వేలాది నామాలు, వాటికి వివరణలు, భాష్యాలు చెపుతుంటే, ప్రతీ నామానికి మళ్ళీ ఇంకెన్నో నామాలను ఉటంకించవలసినంత గొప్పది *శ్రీలలితా సహస్ర నామావళి*

శ్రీలలితా సహస్రనామస్తోత్ర మహాత్మ్యం (శ్రీలలితా సహస్రనామస్తోత్రమందలి ఉత్తర పీఠికయందు తృతీయోధ్యాయంలో) - ఫలశృతిలో ఇలా స్తుతిస్తూ ఉంటాము మనం;

*శ్రీమంత్రరాజసదృశో యథామంత్రో న విద్యతే* (47వ శ్లోకం రెండవ పాదం)

*దేవతా లలితా తుల్యా యథానాస్తి ఘటోద్భవ*

*రహస్యనామసాహస్ర తుల్యా నాస్తి తథా స్తుతిః॥48॥*

అగస్త్యా! ఎలా శ్రీమంత్రరాజంతో సమానమైస మంత్రం లేదో, లలితా దేవికి తులతూగే దేవత లేదో, అలాగే రహస్యమైన సహస్రనామాలతో సాటైన మరో స్తోత్రం లేదు.

PVD Subrahmanyam చెప్పారు...

అంతటీ సాంప్రదాయమున్న శ్రీవిద్యా స్వరూపిణికి నమస్కరించునపుడు *ఓం సంప్రదాయేశ్వర్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

అంతటీ సాంప్రదాయమున్న శ్రీవిద్యా స్వరూపిణికి నమస్కరించునపుడు *ఓం సంప్రదాయేశ్వర్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*22.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*తస్య పుత్రః శతానీకో యాజ్ఞవల్క్యాత్త్రయీం పఠన్|*

*అస్త్రజ్ఞానం క్రియాజ్ఞానం శౌనకాత్పరమేష్యతి॥8102॥*

జనమేజయుని కుమారుడైన శతానీకుడు యాజ్ఞవల్క్య మహామునినుండి ఋగ్యజుస్సామ వేదములను, కర్మకాండకు సంబంధించిన తదితర మంత్రములను అభ్యసించును. కృపాచార్యుని కడ అస్త్రవిద్యయందు శిక్షణను పొందును. అట్లే శౌనకునివలన ఆత్మజ్ఞానమును సాధించి, తద్ద్వారా పరమేశ్వరుని అనుగ్రహమునకు పాత్రుడగును.

*22.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*సహస్రానీకస్తత్పుత్రస్తతశ్చైవాశ్వమేధజః|*

*అసీమకృష్ణస్తస్యాపి నేమిచక్రస్తు తత్సుతః॥8103॥*

శతానీకుని పుత్రుడు సహాస్రానీకుడు. అతని పుత్రుడు అశ్వమేధజుడు. అశ్వమేధజుని తనయుడు అసీమ కృష్ణుడు. అతని సుతుడు నేమిచక్రుడు.

*22.40 (నలుబదియవ శ్లోకము)*

*గజాహ్వయే హృతే నద్యా కౌశాంబ్యాం సాధు వత్స్యతి|*

*ఉక్తస్తతశ్చిత్రరథస్తస్మాత్కవిరథః సుతః॥8104॥*

హస్తినాపురము గంగానదియందు మునిగిపోయినప్పుడు నేమి చక్రుడు తన నివాసమును కౌశాంబి నగరమునకు మార్చుకొని, అచట సుఖముగా ఉండును. నేమిచక్రునకు చిత్రరథుడు అను తనయుడు కలుగును. అతనికి కవిరథుడు అను కొడుకు పుట్టును.

*22.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*తస్మాచ్చ వృష్టిమాంస్తస్య సుషేణోఽథ మహీపతిః|*

*సునీథస్తస్య భవితా నృచక్షుర్యత్సుఖీనలః॥8105॥*

కవిరథునకు వృష్టిమంతుడు, అతనికి సుషేణుడు కలుగుదురు. సుషేణుడు గొప్ప పరిపాలకుడు అగును. సుషేణుని తనయుడు సునీథుడు. అతని పుత్రుడు నృచక్షువు. నృచక్షుని కుమారుడు సుఖీనలుడు.

*22.42 (నలుబది రెండవ శ్లోకము)*

*పరిప్లవః సుతస్తస్మాన్మేధావీ సునయాత్మజః|*

*నృపంజయస్తతో దూర్వస్తిమిస్తస్మాజ్జనిష్యతి॥8106॥*

సుఖీనలునకు పరిప్లవుడు, పరిప్లవునకు సునయుడు, అతనికి మేధాని తనయులగుదురు. మేధాని కుమారుడు నృపంజయుడు, అతని సుతుడు దూర్వుడు. దూర్వునకు తిమి అను తనూజుడు కలుగును.

*22.43 (నలుబది మూడవ శ్లోకము)*

*తిమేర్బృహద్రథస్తస్మాచ్ఛతానీకః సుదాసజః|*

*శతానీకాద్దుర్దమనస్తస్యాపత్యం మహీనరః॥8107॥*

తిమి యొక్క పుత్రుడు బృహద్రథుడు; అతని కుమారుడు సుదాసుడు. సుదాసుని తనయుడు శతానీకుడు. అతనికి దుర్దమనుడు అను తనయుడు కలుగును. అతని సుతుడు బహీనరుడు.

*22.44 (నలుబది నాలుగవ శ్లోకము)*

*దండపాణిర్నిమిస్తస్య క్షేమకో భవితా నృపః|*

*బ్రహ్మక్షత్రస్య వై ప్రోక్తో వంశో దేవర్షిసత్కృతః॥8108॥*

బహీనరునకు *దండపాణి* అను సుతుడు కలుగును. అతని కుమారుడు నిమి. నిమికి క్షేమకుడు పుట్టును. అతడు మహారాజుగా ఖ్యాతి వహించును. పరీక్షిన్మహారాజా! ఇంతవరకును చంద్రవంశము నందలి బ్రాహ్మణ, క్షత్రియ గోత్రజులను గూర్చి వివరించితిని. వీరందరును ధర్మనిరతులైనందున దేవతలయొక్క, ఋషులయొక్క అనుగ్రహములకు పాత్రులైరి. వారినుండి ఆశీస్సులను, సత్కారములను పొందిరి.

*22.45 (నలుబది ఐదవ శ్లోకము)*

*క్షేమకం ప్రాప్య రాజానం సంస్థాం ప్రాప్స్యతి వై కలౌ|*

*అథ మాగధరాజానో భవితారో వదామి తే॥8109॥*

కలియుగమునందు సోమ (చంద్ర) వంశజుల పరంపరలో క్షేమకుడే చివరివాడు. అతడు మహారాజుగా ప్రసిద్ధి వహించును. ఇక భవిష్యత్తులో మగధదేశమును పరిపాలించెడి రాజులను గూర్చి తెలిపెదను వినుము.

*22.46 (నలుబది యారవ శ్లోకము)*

*భవితా సహదేవస్య మార్జారిర్యచ్ఛ్రుతశ్రవాః|*

*తతోఽయుతాయుస్తస్యాపి నిరమిత్రోఽథ తత్సుతః॥8110॥*

జరాసంధుని కుమారుడైన సహదేవునకు మార్జారి అనువాడు కలుగును. మార్జారి తనూజుడు శ్రుతశ్రవుడు. అతని సుతుడు అయుతాయువు. అయుతాయువునకు నిరమిత్రుడు అను కొడుకు పుట్టును.

*22.47 (నలుబది మూడవ శ్లోకము)*

*సునక్షత్రః సునక్షత్రాద్బృహత్సేనోఽథ కర్మజిత్|*

*తతః సుతంజయాద్విప్రః శుచిస్తస్య భవిష్యతి॥8111॥*

నిరమిత్రుని తనయుడు సునక్షత్రుడు. అతని సూనుడు బృహత్సేనుడు. అతనికి *కర్మజిత్తు* అను కుమారుడు జన్మించును. కర్మజిత్తునకు సుతంజయుడు, అతనికి విప్రుడు, విప్రునకు శుచి అను వారు పుత్రులు అగుదురు.

*22.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*

*క్షేమోఽథ సువ్రతస్తస్మాద్ధర్మసూత్రః శమస్తతః|*

*ద్యుమత్సేనోఽథ సుమతిః సుబలో జనితా తతః॥8112॥*

శుచివలన క్షేముడు, అతని వలన సువ్రతుడు, అతనికి ధర్మసూత్రుడు అనువారు జన్మింతురు. ధర్మసూత్రునకు శముడు, అతనికి ద్యుమత్సేనుడు, అతనివలన సుమతి, సుమతికి సుబలుడు కలుగుదురు.

*22.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*

*సునీథః సత్యజిదథ విశ్వజిద్యద్రిపుంజయః|*

*బార్హద్రథాశ్చ భూపాలా భావ్యాః సాహస్రవత్సరమ్॥8113॥*

సుబలుని కుమారుడు సునీథుడు. అతని తనయుడు సత్యజిత్తు. అతని తనూజుడు విశ్వజిత్తు. అతనికి రిపుంజయుడు పుట్టును. వీరు అందరును బృహద్రథుని పరంపరకు చెందిన రాజులు, వీరు రాబోవు వేయి సంవత్సరములవరకును కీర్తిప్రతిష్ఠలతో వర్ధిల్లుదురు.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ద్వావింశోఽధ్యాయః (22)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు ఇరువది రెండవ అధ్యాయము (22)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*23.1 (ప్రథమ శ్లోకము)*

*అనోః సభానరశ్చక్షుః పరోక్షశ్చ త్రయః సుతాః|*

*సభానరాత్కాలనరః సృంజయస్తత్సుతస్తతః॥8114॥*

*23.2 (రెండవ శ్లోకము)*

*జనమేజయస్తస్య పుత్రో మహాశీలో మహామనాః|*

*ఉశీనరస్తితిక్షుశ్చ మహామనస ఆత్మజౌ॥8115॥*

*శ్రీశుకుడు పలికెను* యయాతి కుమారుడైన అనువునకు సభానరుడు, చక్షువు, పరోక్షుడు అను మువ్వురు పుత్రులు కలిగిరి. సభానరునకు కాలనరుడు, అతనికి సృంజయుడు అను కుమారులు కలిగిరి. సృంజయుని సుతుడు జనమేజయుడు. అతని తనయుడు మహాశీలుడు. మహాశీలుని తనూజుడు మహామనసుడు. మహామనసునకు ఉశీనరుడు, తితిక్షువు అను ఇద్దరు కొడుకులు కలిగిరి.

*23.3 (మూడవ శ్లోకము)*

*శిబిర్వనః శమిర్దక్షశ్చత్వారోశీనరాత్మజాః|*

*వృషాదర్భః సువీరశ్చ మద్రః కైకేయ ఆత్మజాః॥8116॥*

*23.4 (నాలుగవ శ్లోకము)*

*శిబేశ్చత్వార ఏవాసంస్తితిక్షోశ్చ రుషద్రథః|*

*తతో హేమోఽథ సుతపా బలిః సుతపసోఽభవత్॥8117॥*

ఉశీనరునివలన శిబి, వనుడు, శమి, దక్షుడు అను నలుగురు పుత్రులు జన్మించిరి. శిబికి వృషాదర్భుడు, సువీరుడు, మద్రుడు, కేకయుడు అను నలుగురు తనయులు ఉద్భవించిరి. ఉశీనరుని తమ్ముడైన తితిక్షువునకు రుశద్రక్షుడు, అతని వలన హేముడు పుట్టిరి. హేముని కుమారుడు సుతపుడు, అతని సుతుడు బలి.

*23.5 (ఐదవ శ్లోకము)*

*అంగవంగకలింగాద్యాః సుహ్మపుండ్రాంధ్రసంజ్ఞితాః|*

*జజ్ఞిరే దీర్ఘతమసో బలేః క్షేత్రే మహీక్షితః॥8118॥*

*23.6 (ఆరవ శ్లోకము)*

*చక్రుః స్వనామ్నా విషయాన్ షడిమాన్ ప్రాచ్యకాంశ్చ తే|*

*ఖనపానోఽఙ్గతో జజ్ఞే తస్మాద్దివిరథస్తతః॥8119॥*

బలియొక్క భార్యయగు సుధేష్ణయందు *దీర్ఘతముడు* అను మహర్షివలన అంగ, వంగ, కళింగ, సుహ్మ, పుండ్ర, ఆంధ్రులు అనెడి ఆరుగురు పుత్రులు కలిగిరి. (బలియొక్క ప్రార్థనపై దీర్ఘతముడు అను మహర్షి ఆయన మందిరమునకు ఏతెంచెను. బలియొక్క భార్యయగు సుధేష్ణ తన భర్త నియోగమును అనుసరించి, ఆ మహర్షి అనుగ్రహముతో ఆరుగురు పుత్రులను పొందెను) ఈ ఆరుగురును బలికి క్షేత్రజులు. ఈ ఆరుమందియు తమ తమ పేర్లతో తూర్పుభాగమున ఆరు రాజ్యములను స్థాపించిరి. అతనికి దివిరథుడు పుట్టెను.

*23.7 (ఏడవ శ్లోకము)*

*సుతో ధర్మరథో యస్య జజ్ఞే చిత్రరథోఽప్రజాః|*

*రోమపాద ఇతి ఖ్యాతస్తస్మై దశరథః సఖా॥8120॥*

*23.8 (ఎనిమిదవ శ్లోకము)*

*శాంతాం స్వకన్యాం ప్రాయచ్ఛదృష్యశృంగ ఉవాహ తామ్|*

*దేవేఽవర్షతి యం రామా ఆనిన్యుర్హరిణీసుతమ్॥8121॥*

*23.9 (తొమ్మిదవ శ్లోకము)*

*నాట్యసంగీతవాదిత్రైర్విభ్రమాలింగనార్హణైః|*

*స తు రాజ్ఞోఽనపత్యస్య నిరూప్యేష్టిం మరుత్వతః॥8122॥*

*23.10 (పదియవ శ్లోకము)*

*ప్రజామదాద్దశరథో యేన లేభేఽప్రజాః ప్రజాః|*

*చతురంగో రోమపాదాత్పృథులాక్షస్తు తత్సుతః॥8123॥*

దివిరథునకు ధర్మరథుడు, అతనికి చిత్రరథుడు కలిగిరి. చిత్రరథునకు *రోమపాదుడు* అను నామాంతరము గలదు. అతడు అయోధ్యాపతియగు దశరథ మహారాజునకు మిత్రుడు. రోమపాదునకు సంతానము లేకుండుట వలన దశరథుడు తన కుమార్తెయగు శాంతను దత్తపుత్రికగా ఒసంగెను. విభాండకుని కుమారుడగు ఋష్యశృంగుడు ఆమెను పెండ్లియాడెను. ఋష్యశృంగుడు లేడి గర్భమున జన్మించి విభాండక మహర్షికడ పెరిగి పెద్దవాడయ్యెను.. రోమపాదుని రాజ్యమున ఒకానొక సమయమున పెక్కు సంవత్సరముల వరకు వర్షములు లేక కఱవు కాటకములు ఏర్పడెను. అప్పుడు రోమపాదుని ఆదేశముపై వారాంగనలు తమ నాట్యభంగిమల చేతను, గాన మాధుర్యముల చేతను, వీణావేణుమృదంగ కళాకౌశలము చేతను, హావభావముల చేతను (ఒయ్యారముల చేతను), ఆలింగనముల వలనను, ఇంకను వివిధ సేవలచేతను ఋష్యశృంగుని ఆకర్షించి, ఆయనను రోమపాదుని రాజ్యమునకు తీసికొనివచ్చిరి. ఋష్యశృంగుడు మధుత్వద్దేవతాత్మకమైన (ఇంద్రదేవతా ప్రధానమైన) ఇష్టిని (యజ్ఞమును) రోమపాదునిచే నిర్వహింపజేసెను. ఆ యజ్ఞాచరణ ఫలముగా రోమపాదునకు సంతానము కలిగెను. పుత్రసంతానములేని దశరథమహారాజు ఋష్యశృంగుని పిలిపించి, ఆయన పర్యవేక్షణములో *పుత్రకామేష్టి* అను యజ్ఞమును ఆచరించెను. తత్ఫలితముగా ఆ మహారాజు నలుగురు పుత్రులను పొందెను. రోమపాదునకు చతురంగుడు, అతనికి పృథులాక్షుడు అను తనయులు కలిగిరి.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*711వ నామ మంత్రము*

*ఓం సాధువే నమః*

శుద్ధ సత్త్వంతో కూడిన స్వరూపం గలిగిన పరమేశ్వరికి నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సాధు* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం సాధువే నమః* అని భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ తల్లి నామ మంత్రజపమహిమతో తనలోని అరిషడ్వర్గములను నియత్రించుకొని సాధు స్వభావముతో పరమేశ్వరి కృపాకటాక్షములకు పాత్రుడై తరించును.

సంప్రదాయముచే మాత్రమే జగన్మాత తెలియదగినది. ఇంతకు ముందు (710వ) నామ మంత్రములో జగన్మాతను *సంప్రదాయేశ్వరీ* యని అన్నాము. అనగా సత్సంప్రదాయములకు తానే ప్రభ్వి. గాన సత్సంప్రదాయములు గలవారు సాధు తత్త్వం (శుద్ధ సత్త్వం) తో తేజరిల్లుదురు అనుటకు సముచితముగానున్నది.

*సాధ్వీ* యని 128వ నామ మంత్రములో అనన్య సామాన్య పతివ్రత జగన్మాత అని తెలిసియుంటిమి. ఇప్పుడు ఈ నామ మంత్రములో మరల అదే చెపితే పునరుక్తి దోషమగును గనుక *సాధువే నమః* అని యనుటయే సముచితమని భాస్కరరాయలువారు అన్నారు. వారి మాటనే ప్రమాణముగా ఇక్కడ గ్రహించ గలము.

జగన్మాత సంప్రదాయమను మంత్రార్థమునకు ఈశ్వరి. అందుచే
ఆ తల్లిని *సాధు* అని అన్నాము.

సాధు అను పదమునకు సాత్వికుడు, సుజనుడు, సహృదయుడు, ఉదారుడు మొదలైన అర్థములు వస్తాయి.

జగన్మాత *సాత్వికురాలు*. భక్తులు ఆపదలకు ఓర్చుకోలేక ఎంత నోరుజారి మాటలాడినను చిరునవ్వుతో వారి ఆర్తిని బాపును. అంతే గాని తన భక్తుడు తొందర పడ్డాడని కోపించదు.

జగదీశ్వరి ఉదారస్వభావురాలు గనుకనే లోకభయంకరమైన హాలాహలాన్ని తన భర్తచే సేవింపజేసి లోకాలను రక్షించినది.

పరమేశ్వరి సుజన అనగా చాలా మంచిది. భర్త కోపాగ్నిలో భస్మమైన మన్మథునికి తాను సంజీవనియై తిరిగి ఆ మన్మథుని సజీవుని జేసి, రతీదేవికి సౌభాగ్యాన్ని ప్రసాదించినది.

ఆ అఖిలాండేశ్వరి *సహృదయ*. భక్తుల హృదయంలోని దహరాకాశంలో ఎల్లప్పుడూ విలసిల్లుతూ, వారిలో సహృదయత పెంపొందింపజేసి లోకకళ్యాణ కారిణియగుచున్నది.

ఇలాంటివి ఎన్నైనా చెప్పవచ్చు జగన్మాత *సాధు* అను పదమునకు సరియైన స్వరూపిణియని.

అందుచే ఆతల్లి పాదపద్మములకు నమస్కరించునపుడు *ఓం సాధువే నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*137వ నామ మంత్రము*

*ఓం నిరాకారాయై నమః*

కోరిన వారికి కోరిన రూపంలో కనుపించునేగాని తనకంటూ ఒక ఆకారములేని పరబ్రహ్మస్వరూపిణి అయిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిరాకారా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం నిరాకారాయై నమః* యని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఆరాధించు సాధకులకు జగన్మాత వారి ఇష్టకామ్యములను తీర్చుటలో అనుగ్రహము చూపును.

ఇక్కడ *నిరాకారా* అని జగన్మాతను అన్నామంటే అసలు ఆకారము లేనిదని కాదు. కోరిన వారికి కోరిన రూపంలో కనుపిస్తుంది. అది ఆపదల సమయంలో ఆపదలనుండి ఆపద్బాంధవిగా, తలచిన పనులు శుభకరము, జయకరము చేయునప్పుడు ఎవరో ఒక మిత్రుని రూపంలోనో, అధికారి రూపంలోనో.....మరేదో రూపంలో కనిపించును. అటువంటి సాకార రూపమే నిత్యము మనము పారాయణచేయు సహస్రనామస్తోత్ర పారాయణలో మనము స్తుతించు *చతుర్భాహు సమన్వితా* - నాలుగు బాహువులు కలిగియున్నది, *కురువిందమణి శ్రేణీకనత్కోటీర మండితా* - కురువిందమణులతో ప్రకాశించు కిరీటంతో భాసించు తల్లి, *అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా* - అష్టమీచంద్రుని వలె ప్రకాశించే లలాట ప్రదేశం గలిగిన మహాతల్లి.....ఇలా 51వ నామ మంత్రము వరకూ జగన్మాత సాకార రూపాన్ని స్తుతించాము గదా! మరి ఇప్పుడు ఈ *నిరాకారా* అని అనడమేమిటి అను సందేహం కలుగుతుంది ఎవరికైనా. *జగన్మాత భక్తుల ప్రీత్యర్థం సాకార రూపాన్ని దాల్చుతుంది* భక్తుల సేవలు అందుకోవడానికి. వారి ఇష్టకామ్యములను సిద్ధింపజేయడానికి. పరబ్రహ్మ నిర్గుణ స్వరూపుడు. జగన్మాత అట్టి నిర్గుణ స్వరూపమైన *పరబ్రహ్మ స్వరూపిణి*.

దేవీ భాగవతంలో ఇలా చెప్పబడినది:

తారకాసుర సంహారంకోసం దేవతలు శ్రీమాతను ప్రార్థించారు. ఆ తల్లి చైత్రశుద్ధ నవమి నాడు జగన్మాత దేవతలకు దర్శన మిచ్చినది. ఆ జగన్మాత తేజస్సు రూపుదాల్చిన నాలుగువేదములచేత స్తుతింపబడినది. అప్పుడు ఆరూపం *ఉద్యద్భానుసహస్రాభా* (ఉదయించుచున్న వేయిసూర్యుల కాంతినిబోలిన కాంతి కలిగియున్నది), కోటిచంద్రుల చల్లదనంగలిగి యున్నది, *తటిల్లతాసమరుచి* మెఱుపుతీగతో సమానమైన కాంతితో తళుక్కుమన్నట్లు ఉన్నదట. ఇవన్నీ మనం స్తుతించు చున్నవే. అంటే, అది మన ఇంద్రియములకు కనిపించే ఆకారము మాత్రమే. అమ్మగూర్చి మనం కొనియాడే స్వరూపము శరీరానికే. ఆత్మకు కాదు. ఆత్మ అనేది పరబ్రహ్మ స్వరూపము. పరబ్రహ్మము అనేది నిర్గుణము, నిరాకారము. కనుక, జగన్మాతను *నిరాకారా* అన్నాము. జగన్మాత సూక్ష్మతర రూపాన్ని ఈ క్రింది విధంగా స్తుతించాము మనము.

జగన్మాత *మూలమంత్రాత్మిక* (88వ నామ మంత్రము) - పంచదశాక్షరీ మంత్రమే శ్రీమాత ఆత్మస్వరూపము.

*శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజా* (85వ నామ మంత్రము) - పంచదశియందు గల మొదటి కూటమియైన వాగ్భవకూటమియే పరమేశ్వరి ముఖకమలము.

*కంఠాధః కటిపర్యంత మధ్యకూటస్వరూపిణీ* (86వ నామ మంత్రము) పంచదశి యందలి మధ్యకూటము అయిన కామరాజకూటమియే శ్రీమాత కంఠము దిగువ నుండి కటిసీమ వరకూ గల శరీరము.

*శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణీ* (87వ నామమంత్రము) పంచదశి యందలి మూడవకూటము అయిన శక్తి కూటమియే శ్రీమాత కటి దిగువ నుండి పాదపద్మముల వరకూ గల శరీరము.

శ్రీమాత *మూలకూటత్రయ కళేబరా*(89వ నామ మంత్రము) మొత్తముగా
85, 86, 87 నామ మంత్రములందు చెప్పిన వాగ్భవ, కామరాజ, శక్తికూటములే జగన్మాత సూక్ష్మతరశరీరము. జగన్మాత పరబ్రహ్మ స్వరూపిణి గనుకనే ఆ తల్లిని మంత్రస్వరూపిణిగా, సూక్ష్మతర స్వరూపిణిగా మనము భావించాము. అంటే ఆ తల్లి భక్తులు ఏరూపంలో చూడాలనుకుంటే ఆ విధంగా గోచరిస్తుంది గనుక తనకంటూ, తను ఏర్పరచుకున్న ఆరాము ఏదీ లేని *నిరాకార* స్వరూపిణి.

ఆ తల్లికి నమస్కరించునపుడు *ఓం నిరాకారాయై నమః* అని అనవలయును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*23.11 (పదకొండవ శ్లోకము)*

*బృహద్రథో బృహత్కర్మా బృహద్భానుశ్చ తత్సుతాః|*

*ఆద్యాద్బృహన్మనాస్తస్మాజ్జయద్రథ ఉదాహృతః॥8124॥*

పృథులాక్షునకు బృహద్రథుడు, బృహత్కర్మ, బృహద్భానుడు అను మువ్వురు కుమారులు జన్మించిరి. బృహద్రథుని సుతుడు బృహన్మనసుడు. అతని తనూజుడు జయద్రథుడు.

*23.12 (పండ్రెండవ శ్లోకము)*

*విజయస్తస్య సంభూత్యాం తతో ధృతిరజాయత|*

*తతో ధృతవ్రతస్తస్య సత్కర్మాధిరథస్తతః॥8125॥*

జయద్రథుని వలన భార్యయగు సంభూతియందు *విజయుడు* అను కుమారుడు జన్మించెను. విజయుని పుత్రుడు ధృతి. అతని తనయుడు ధృతవ్రతుడు. ధృతవ్రతుని తనూజుడు సత్కర్ముడు. సత్కర్ముని కొడుకు అధిరథుడు.

*23.13 (పదమూడవ శ్లోకము)*

*యోఽసౌ గంగాతటే క్రీడన్ మంజూషాంతర్గతం శిశుమ్|*

*కుంత్యాపవిద్ధం కానీనమనపత్యోఽకరోత్సుతమ్॥8126॥*

అధిరథునకు సంతానము లేకుండెను. అతడు ఒకనాడు గంగాతీరమున విహరించుచుండగా శిశువుతో గూడిన ఒక పెట్టె ఆ నదియొద్దకు చేరెను. వెంటనే అధిరథుడు ఆ శిశువును తీసికొనిపోయి తన కుమారునిగా జేసికొనెను. ఆ శిశువు ఎవరోగాదు. కన్యగా నున్న కుంతీ దేవికి సూర్యుని వరప్రభావమున జన్మించినవాడు. ఆ కానీనుని (కన్యకు జన్మించినవాని) పేరు కర్ణుడు.

*23.14 (పదునాలుగవ శ్లోకము)*

*వృషసేనః సుతస్తస్య కర్ణస్య జగతీపతేః|*

*ద్రుహ్యోశ్చ తనయో బభ్రుః సేతుస్తస్యాత్మజస్తతః॥8127॥*

*23.15 (పదునైదవ శ్లోకము)*

*ఆరబ్ధస్తస్య గాంధారస్తస్య ధర్మస్తతో ధృతః|*

*ధృతస్య దుర్మదస్తస్మాత్ప్రచేతాః ప్రాచేతసం శతమ్॥8128॥*

పరీక్షిన్మహారాజా! కర్ణుని కుమారుడు వృషసేనుడు. యయాతి కుమారుడైన ద్రుహ్యుని పుత్రుడు బభ్రువు. అతని తనయుడు సేతువు. అతని సుతుడు అరబ్ధుడు. ఆ అరబ్ధునకు గాంధారుడు, అతనికి ధర్ముడు పుట్టిరి. ధర్ముని తనూజుడు ధృతుడు. అతని పుత్రుడు దుర్మనసుడు. దుర్మనసుని కొడుకు ప్రచేతసుడు. అతనికి వందమంది కుమారులు జన్మించిరి.

*23.16 (పదహారవ శ్లోకము)*

*మ్లేచ్ఛాధిపతయోఽభూవన్నుదీచీం దిశమాశ్రితాః|*

*తుర్వసోశ్చ సుతో వహ్నిర్వహ్నేర్భర్గోఽథ భానుమాన్॥8129॥*

ప్రచేతసుని సుతులైన నూరుగురును ఉత్తరదిశయందలి మ్లేచ్ఛులకు ప్రభువులైరి. యయాతియొక్క మరియొక కుమారుడైన తుర్వసునకు వహ్ని అను పుత్రుడు కలిగెను. అతనికి భర్గుడు, భర్గునకు భానుమంతుడు పుట్టిరి.

*23.17 (పదిహేడవ శ్లోకము)*

*త్రిభానుస్తత్సుతోఽస్యాపి కరంధమ ఉదారధీః|*

*మరుతస్తత్సుతోఽపుత్రః పుత్రం పౌరవమన్వభూత్॥8130॥*

భానుమంతుని సుతుడు త్రిభానుడు. అతని తనయుడు కరంధముడు. అతడు మిక్కిలి ఉదారబుద్ధిగలవాడు. కరంధముని పుత్రుడు మరుత్తు. అతనికి సంతానము లేకుండుటవలన పూరువంశమునకు చెందిన దుష్యంతుని తన కుమారునిగా జేసికొనెను.

*23.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*దుష్యంతః స పునర్భేజే స్వం వంశం రాజ్యకాముకః|*

*యయాతేర్జ్యేష్ఠపుత్రస్య యదోర్వంశం నరర్షభ॥8131॥*

కాని, దుష్యంతుడు రాజ్యాధికారముపైగల అభిలాషతో తిరిగి తన వంశమునకే చేరెను. పరీక్షిన్మహారాజా! ఇక యయాతియొక్క జ్యేష్ఠకుమారుడైన యదువుయొక్క వంశమును గూర్చి వివరించెదను వినుము.

*23.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*వర్ణయామి మహాపుణ్యం సర్వపాపహరం నృణామ్|*

*యదోర్వంశం నరః శ్రుత్వా సర్వపాపైః ప్రముచ్యతే॥8132*

*23.20 (ఇరువదియవ శ్లోకము)*

*యత్రావతీర్ణో భగవాన్ పరమాత్మా నరాకృతిః|*

*యదోః సహస్రజిత్క్రోష్టా నలో రిపురితి శ్రుతాః॥8133॥*

రాజా! ఈ యదువంశ వృత్తాంతము మిగుల పవిత్రమైనది. మానవుల సర్వపాపములను హరించునది. *సర్వేశ్వరుడైన శ్రీకృష్ణపరమాత్మ మానవాకృతిలో అవతరించినది ఈ వంశమునందే. కనుక, ఈ వంశవృత్తాంతమును వినినవారు, చదివినవారు, చదివించినవారు సకల పాపములనుండి విముక్తులగుదురు*. యదువునకు సహస్రజిత్తు, క్రోష్టుడు, నలుడు, రిపువు అను కుమారులు కలిగిరి.

PVD Subrahmanyam చెప్పారు...

*23.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*చత్వారః సూనవస్తత్ర శతజిత్ప్రథమాత్మజః|*

*మహాహయో వేణుహయో హైహయశ్చేతి తత్సుతాః॥8134॥*

ఆ నలుగురిలో మొదటివాడైన సహస్రజిత్తు కుమారుడు శతజిత్తు. అతనికి మహాహయుడు, వేణుహయుడు, హైహయుడు అను ముగ్గురు పుత్రులు జన్మించిరి.

*23.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*ధర్మస్తు హైహయసుతో నేత్రః కుంతేః పితా తతః|*

*సోహంజిరభవత్కుంతేర్మహిష్మాన్ భద్రసేనకః॥8135॥*

హైహయుని తనయుడు ధర్ముడు. అతని తనూజుడు నేత్రుడు. అతని సుతుడు కుంతి. కుంతి పుత్రుడు సోహంజి. సోహంజి పుత్రుడు మహిష్మంతుడు. అతని పుత్రుడు భద్రసేనుడు.

*23.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*దుర్మదో భద్రసేనస్య ధనకః కృతవీర్యసూః|*

*కృతాగ్నిః కృతవర్మా చ కృతౌజా ధనకాత్మజాః॥8136॥*

భద్రసేనునకు దుర్మదుడు, ధనకుడు అను ఇద్దరు కుమారులు కలిగిరి. ధనకుని వలన జన్మించినవారు కృతవీర్యుడు, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజుడు.

*23.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*అర్జునః కృతవీర్యస్య సప్తద్వీపేశ్వరోఽభవత్|*

*దత్తాత్రేయాద్ధరేరంశాత్ప్రాప్తయోగమహాగుణః॥8137॥*

*23.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*న నూనం కార్తవీర్యస్య గతిం యాస్యంతి పార్థివాః|*

*యజ్ఞదానతపోయోగశ్రుతవీర్యదయాదిభిః॥8138॥*

కృతవీర్యుని తనయుడు అర్జునుడు. అతడు కార్తవీర్యార్జునుడుగా ప్రసిద్ధి వహించెను. ఏడు ద్వీపములకు అధిపతి యయ్యెను. అతడు శ్రీహరియొక్క అంశావతారమైన దత్తాత్రేయుని వలన యోగవిద్యను, అణిమాది అష్టసిద్ధులను సాధించెను. తీవ్రమైన తపస్సొనర్చినవాడతడు, యోగవిద్యలను సాధించినవాడు. అతని పాండిత్యము అపూర్వమైనది, ఆచరించిన యజ్ఞములు అసంఖ్యాకములు. అతడు పెక్కు దానములను ఒనర్చెను. అతని పరాక్రమము నిరుపమానము. సాధించిన విజయములు అద్భుతములు. ఇతర రాజులెవ్వరును ఈ శుభలక్షణములలో కార్తవీర్యార్జునునితో సాటికాజాలరు. ఇది నిశ్చయము.

*23.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*పంచాశీతి సహస్రాణి హ్యవ్యాహతబలః సమాః|*

*అనష్టవిత్తస్మరణో బుభుజేఽక్షయ్యషడ్వసు॥8139॥*

కార్తవీర్యార్జునుడు నిరంతరము శ్రీహరి అంశావతారమైన దత్తాత్రేయుని స్మరించుచుండుటచే తిరుగులేని బలపరాక్రమములు గల వాడయ్యెను. ఆ స్వామి అనుగ్రహము వలన అతడు తరగని సంపదలతో తులతూగుచు, తనివితీర ఇంద్రియసుఖానుభవములను పొందెను. ఈ విధముగా అతడు ఎనుబది యైదువేల సంవత్సరములు రాజ్యపాలన గావించెను.

*23.27 (ఇరువది ఏడవవ శ్లోకము)*

*తస్య పుత్రసహస్రేషు పంచైవోర్వరితా మృధే|*

*జయధ్వజః శూరసేనో వృషభో మధురూర్జితః॥8140॥*

అతని వేయిమంది కుమారులలో ఐదుగురు తప్ప మిగిలినవారు అందరును యుద్ధరంగమున పరశురాముని క్రోధాగ్నికి ఆహుతియైరి. జయధ్వదుడు, శూరసేనుడు, వృషభుడు, మధువు, ఊర్జితుడు అను ఐదుమంది మాత్రము తమ ప్రాణములను దక్కించుకొనిరి.

*23.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*జయధ్వజాత్తాలజంఘస్తస్య పుత్రశతం త్వభూత్|*

*క్షత్రం యత్తాలజంఘాఖ్యమౌర్వతేజోపసంహృతమ్॥8141॥*

జయధ్వజుని కుమారుడు తాలజంఘుడు. అతనికి వందమంది కుమారులు కలిగిరి. వారు అందరును తాలజంఘులు అనియే వ్యవహరింపబడిరి. ఔర్వముని ప్రసాదించిన శక్తిచేత సగరుడు వారిని అందరిని హతమార్చెను.

*23.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*తేషాం జ్యేష్ఠో వీతిహోత్రో వృష్ణిః పుత్రో మధోః స్మృతః|*

*తస్య పుత్రశతం త్వాసీద్వృష్ణిజ్యేష్ఠం యతః కులమ్॥8142॥*

*23.30 (ముప్పదియవ శ్లోకము)*

*మాధవా వృష్ణయో రాజన్ యాదవాశ్చేతి సంజ్ఞితాః|*

*యదుపుత్రస్య చ క్రోష్టోః పుత్రో వృజినవాంస్తతః॥8143॥*

తాలజంఘుని వందమంది పుత్రులలో వీతిహోత్రుడు జ్యేష్ఠుడు. వీతిహోత్రుని తనయుడు మధువు. మధువునకు నూరుగురు కొడుకులు కలిగిరి. వారిలో పెద్దవాడు వృష్టి. అతని వలన వృద్ధి చెందిన ఆ వంశము వృష్టివంశముగా వ్యవహరింపబడెను. పరీక్షిన్మహారాజా! పరంపరగా వర్ధిల్లిన ఆ వంశమున మధువు , వృష్టి, యదువు అనువారు మిగుల ప్రసిద్ధి వహించిరి. వారివలన వృద్ధిచెందిన ఆయా వంశములవారు మాధవులుగా, వార్ష్ణేయులుగా, యాదవులుగా వ్యవహరింప బడిరి. యదువుయొక్క పుత్రుడు క్రోష్టుడు. క్రోష్టుని కుమారుడు వృజినవంతుడు.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*712వ నామ మంత్రము*

*ఓం ఈ (యై) నమః*

*ఈం* అను బీజాక్షర స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

తురీయస్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ఈ* అను ఏకాక్షర నామ మంత్రమును *ఓం ఈ (యై) నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు సాధకుడు ఆత్మానందానుభూతినంది తరించును.

*ఈం* అనేది శక్తి బీజం. ఈ బీజమును కలుపుకునే మాయాబీజం, లక్ష్మీ బీజం, సరస్వతీ బీజములు ఏర్పడ్డాయి. కామకళా బీజం కూడా ఏర్పడినది. కామకళా బీజమే దేవీ స్వరూపము. ఈ దేవి నారాయణుని సోదరి మరియు శివునిపత్ని. సృష్టికి మూలమైన శక్తి ధ్యానింపతగిన మన్మథబీజము కూడా.

*ఈ* అను అక్షరము తురీయస్వరూపమునకు నిర్వచనము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం ఈ (యై) నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*138వ నామ మంత్రము*

*ఓం నిరాకులాయై నమః*

కలత, కలవరపాటు, మనోచాంచల్యత వంటి అవిద్యా సంబంధితమైనవి ఏమియునూ లేని శ్రీవిద్యాస్వరూపిణియైన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిరాకులా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం నిరాకులాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరాత్పరిని అత్యంత భక్తితత్పరతతో ఆరాధించు భక్తులకు భౌతికపరమైన వ్యాకులత, చిత్తచాంచల్యత వంటి భావవికారముల నుండి విముక్తి కలిగి శాశ్వతమైన ఆత్మానందానుభూతి సంప్రాప్తించును.

మనసు అనేది కోతి వంటిది. అజ్ఞానం వలన ఏర్పడిన చంచల స్వభావంతో నిలకడ లేక పోవుట జరుగును. పుట్టుకతోనే తను, తనవారు, తనచుట్టూవారు అనే బాంధవ్యము ఆ బాంధవ్యము వలన ఏర్పడే సుఖదుఃఖములు, కలతలు ఇలాంటి అన్నియు సహజము. దాగట్లో పడ్డ వెలగకాయవంటిది. అకులా అంటే అవిద్యా సంబంధిత కలతలు. ఇవి కేవలం జీవునికి మాత్రమే. పరమాత్మకు ఇలాంటివి ఏమియును ఉండవు. ఇదే జీవునికి దేవునికి గల భేదము. పరమేశ్వరి బ్రహ్మస్వరూపిణి. పరమాత్మ. ఆతల్లికి ఇలాంటి అవిద్యా సంబంధితమైన కలతలు లేనిది.అంతేకాదు ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తే, అవిద్యాపరమైన కలతలు తొలగించమని వేడుకుంటే జీవునిలో కూడా నిశ్చలత, కలతలను ఎదుర్కొనే మనో నిబ్బరత, అసంకల్పితంగా ఏర్పడిన ఆపదలనెదుర్కొనే ధైర్యము కలుగుతాయి. ఇంకా మరింత ముందుకు వెళ్ళి అంతర్ముఖసమారాధన జరిపితే ఆ అమ్మ మరింత సులువుగా ప్రసన్నమై శాశ్వతమైన బ్రహ్మానందాన్ని సంప్రాప్తింపజేస్తుంది.

శంకర భగవత్పాదులవారు ఇలా అన్నారు.

*సత్సంగత్వే నిస్సంగత్వమ్* *నిస్సంగత్వే నిర్మోహత్వమ్|*
*నిర్మోహత్వే నిశ్చలతత్త్వమ్*
*నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః*|

సత్సాంగత్యం వల్ల అసంగత్వం ఏర్పడి మోహం, భ్రాంతి తొలగిపోతాయి. అప్పుడే మనసు నిశ్చలమై ముక్తి లభిస్తుంది.
భగవశ్చింతనవల్ల సద్భక్తుల సహవాసం లభిస్తుంది. ఆ సహవాసం ముక్తికి సోపానమై, జన్మ చరితార్ధమవుతుంది. సత్కర్మాచరణ, సత్యనిష్ఠ, సాధుసత్పురుషుల సాంగత్యం వల్ల మోహం నశించి ఆత్మ నిరంతరం చైతన్యాత్మలో సంగమిస్తుంది. పెడదారి పట్టిన మనస్సును సరిదిద్దే గొప్ప అవకాశం సత్సంగత్వం. సత్సాంగత్వం వల్ల మోహం, భ్రాంతి నశిస్తాయి. మనస్సు నిర్మోహమై, నిశ్చలమవుతుంది. అంతఃకరణ శుద్ధమై, పరమాత్మకు నిలయమవుతుంది. అప్పుడే జీవన్ముక్తి.

ఇనుముకు మట్టి అంటితే తుప్పు పడుతుంది. అదే ఇనుము నిప్పులలో కాలిస్తే తిరిగి మెరుస్తుంది. సత్ సహవాసం నిప్పులాంటిది. మనలోని మాలిన్యాలను ప్రక్షాళనం చేసి మనస్సును, చిత్తాన్ని, అంతరంగాన్ని పరిశుద్ధం చేస్తుంది. క్రమేపి ఆత్మతత్త్వాన్ని అర్ధం చేసుకొని, అద్వైతానందానుభూతిని పొందవచ్చు.
ఇదే మనం ఆ పరమేశ్వరి *నిరాకులా* యను నాలుగక్షరముల నామ మంత్ర స్మరణ ఫలితము.

జగన్మాతకు నమస్కరించు నపుడు *ఓం నిరాకులాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*23.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*శ్వాహిస్తతో రుశేకుర్వై తస్య చిత్రరథస్తతః|*

*శశబిందుర్మహాయోగీ మహాభోజో మహానభూత్॥8144॥*

*23.32 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*చతుర్దశమహారత్నశ్చక్రవర్త్యపరాజితః|*

*తస్య పత్నీసహస్రాణాం దశానాం సుమహాయశాః॥8145॥*

*23.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*దశలక్షసహస్రాణి పుత్రాణాం తాస్వజీజనత్|*

*తేషాం తు షట్ ప్రధానానాం పృథుశ్రవస ఆత్మజః॥8146॥*

*శ్వాహి* యనువాడు వృజినవంతుని తనయుడు. *శ్వాహి* తనూజుడు రుశేకుడు. అతనీ సుతుడు చిత్రరథుడు. చిత్రరథుని వలన కలిగినవాడు శశబిందువు. ఆ మహాత్ముడు భోగైశ్వర్య సంపన్నుడు, గొప్పయోగి, మిక్కిలి పరాక్రమశాలి. ఆ శశబిందువు మహారాజు చతుర్దశ మహారత్న సంపన్నుడు. అతడు అజేయుడు, సప్తద్వీపాధిపతి (చక్రవర్తిగా) ఖ్యాతికెక్కిన శశబిందువునకు పదివేలమంది భార్యలు గలరు. ఆ చక్రవర్తికి ప్రతిభార్యయందును లక్షమంది కుమారులు కలిగిరి. వారిలో సుప్రసిద్ధులు ఆరుగురు. ఆ ఆరుగురిలో పృథశ్రవుడు ఒకరు.

*శ్లో. గజ, వాణి, రథ, స్త్రీషు, నిధి, మాల్యాంబరద్రుమాః| శక్తిపాశ, మణీ, చ్ఛత్ర, విమానాని చతుర్దశ॥*

గజములు, అశ్వములు, రథములు, స్త్రీలు, శరములు, నిధులు, హారములు, వస్త్రములు, వృక్షములు, శక్తి, పాశము, మణులు,ఛత్రములు, విమానములు అను పదునాలుగును శ్రేష్ఠమైన సంపదలు. అవి చతుర్దశ మహారత్నములు అని మార్కండేయ పురాణమున పేర్కొనబడినవి. (శ్రీధరవ్యాఖ్య, వీరరాఘవీయ వ్యాఖ్య)

*23.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*ధర్మో నామోశనా తస్య హయమేధశతస్య యాట్|*

*తత్సుతో రుచకస్తస్య పంచాసన్నాత్మజాః శృణు॥8147॥*

పరీక్షిన్మహారాజా! సావధానముగా వినుము. పృథుశ్రవుని పుత్రడు ధర్ముడు. ధర్ముని కుమారుడు ఉశముడు. అతడు వంద అశ్వమేధయాగములను ఆచరించెను. అతని తనయుడు ఋచకుడు. అతనికి ఐదుగురు కుమారులు జన్మించిరి.

*23.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*పురుజిద్రుక్మరుక్మేషుపృథుజ్యామఘసంజ్ఞితాః|*

*జ్యామఘస్త్వప్రజోఽప్యన్యాం భార్యాం శైబ్యాపతిర్భయాత్॥8148॥*

*23.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*నావిందచ్ఛత్రుభవనాద్భోజ్యాం కన్యామహారషీత్|*

*రథస్థాం తాం నిరీక్ష్యాహ శైబ్యా పతిమమర్షితా॥8149॥*

పురుజిత్తు, రుక్ముడు, రుక్మేషుడు, పృథువు, జ్యామఘుడు అను ఐదుగురు రుచకుని కొడుకులు. వారిలో జ్యామఘుని భార్యపేరు శైల్య. అతనికి సంతానము లేకున్నప్పటికిని తన భార్యకు భయపడి, మరియొక వివాహము చేసికొనలేదు. ఒక సందర్భమున జ్యామఘుడు తన శత్రువును జయించి అతని ఇంటినుండి సుఖానుభవమునకై *భోజ్య* అను కన్యను తీసికొనివచ్చెను. అంతట శైల్య రథముపై పరస్త్రీతో గూడియున్న తన భర్తను జూచి, అసూయతో మిగుల కుపితయై ఇట్లు పలికెను.

*23.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*కేయం కుహక మత్స్థానం రథమారోపితేతి వై|*

*స్నుషా తవేత్యభిహితే స్మయంతీ పతిమబ్రవీత్॥8150॥*

*23.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*అహం వంధ్యాసపత్నీ చ స్నుషా మే యుజ్యతే కథమ్|*

*జనయిష్యసి యం రాజ్ఞి తస్యేయముపయుజ్యతే॥8151॥*

*23.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*అన్వమోదంత తద్విశ్వేదేవాః పితర ఏవ చ|*

*శైబ్యా గర్భమధాత్కాలే కుమారం సుషువే శుభమ్|*

*స విదర్భ ఇతి ప్రోక్త ఉపయేమే స్నుషాం సతీమ్॥8152॥*

"మోసగాడా! రథమునందు నా స్థానమున కూర్చొని యున్న ఈ యువతి ఎవరు?" అనగా, అందుకు జ్యామఘుడు 'ఈమె నీ కోడలు' అని నుడివెను. పిమ్మట శైల్య దరహాసమొనర్చుచు భర్తతో ఇట్లనెను - "నాకు ఇంతవరకును సంతానము లేదు. నాకు సవతియులేదు. మఱి ఈమె నాకు కోడలు ఎట్లగును?" అంతట జ్యామఘుడు తన భార్యయగు శైల్యతో 'రాణీ! నీకు కలుగబోవు పుత్రునకు ఈమె భార్యయగును' ఆవిధముగా నీకు కోడలగును. తన పతి మాటలకు శైల్య ఎంతయు సంతోషించెను. జ్యామఘుడు నిత్యను విశ్వేదేవతలను, పితృదేవతలను ఆరాధించుచుండెడి వాడు. జ్యామఘుని మాటలకు వారు ప్రసన్నులై 'ఆ పలుకులు సత్యములగును' అని తమ ఆమోదమును తెలిపిరి. కొంతకాలమునకు పితృదేవతల అనుగ్రహమున శైల్య గర్భవతియై ఒక చక్కని కుమారుని గనెను. *విదర్భుడు* అను పేరుగల ఆ బాలునకును, భోజ్యకును వివాహము జరిపి శైల్య ఆ దంపతులను జూచి సంతసించెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే త్రయోవింశోఽధ్యాయః (23)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు ఇరువది మూడవ అధ్యాయము (23)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*24.1 (ప్రథమ శ్లోకము)*

*తస్యాం విదర్భోఽజనయత్పుత్రౌ నామ్నా కుశక్రథౌ|*

*తృతీయం రోమపాదం చ విదర్భకులనందనమ్॥8153॥*

*శ్రీశుకుడు నుడివెను* శైల్యా జ్యామఘుల కుమారుడైన విదర్భునివలన అతని భార్యయగు భోజయందు కుశుడు, క్రథువు, రోమపాదుడు అను మువ్వురు కుమారులు కలిగిరి. వారిలో రోమపాదుడు విదర్భ వంశమునకు వన్నెదెచ్చిన మహాత్ముడు.

*24.2 (రెండవ శ్లోకము)*

*రోమపాదసుతో బభ్రుర్బభ్రోః కృతిరజాయత||*

*ఉశికస్తత్సుతస్తస్మాచ్చేదిశ్చైద్యాదయో నృప॥8154॥*

పరీక్షిన్మహారాజా! రోమపాదుని కుమారుడు బభ్రువు. అతని కొడుకు కృతి. కృతియొక్క పుత్రుడు ఉశికుడు. అతని సుతుడు చేది. దమఘోషుడు, శిశుపాలుడు ఈ చేది వంశమునకు చెందినవారే.

*24.3 (మూడవ శ్లోకము)*

*క్రథస్య కుంతిః పుత్రోఽభూద్ధృష్టిస్తస్యాథ నిర్వృతిః|*

*తతో దశార్హో నామ్నాభూత్తస్య వ్యోమః సుతస్తతః॥8155॥*

*24.4 (నాలుగ శ్లోకము)*

*జీమూతో వికృతిస్తస్య యస్య భీమరథః సుతః|*

*తతో నవరథః పుత్రో జాతో దశరథస్తతః॥8156॥*

విదర్భుని రెండవ కుమారుడైన క్రథునకు *కుంతి* అనువాడు జన్మించెను. కుంతియనువాని తనయుడు ధృష్టి. అతని సుతుడు నిర్వృతి, నిర్వృతి పుత్రుడు దశార్హుడు. అతని తనూజుడు వ్యోముడు. వ్యోముని కొడుకు జీమూతుడు. అతని వలన కలిగినవాడు వికృతి. వికృతి కుమారుడు భీమరథుడు. అతని సుతుడు నవరథుడు. నవరథుని తనయుడు దశరథుడు.

*24.5 (ఐదవ శ్లోకము)*

*కరంభిః శకునేః పుత్రో దేవరాతస్తదాత్మజః|*

*దేవక్షత్రస్తతస్తస్య మధుః కురువశాదనుః॥8157॥*

దశరథుని వలన శకుని జన్మించెను. శకుని వలన కరంభి పుట్టెను. అతని పుత్రుడు దేవరాతుడు. దేవరాతుని కొడుకు దేవక్షత్రుడు. అతని తనయుడు మధువు. మధువు తనూజుడు కురువశుడు. అతని తనయుడు అనువు.

*24.6 (ఆరవ శ్లోకము)*

*పురుహోత్రస్త్వనోః పుత్రస్తస్యాయుః సాత్వతస్తతః|*

*భజమానో భజిర్దివ్యో వృష్ణిర్దేవావృధోఽన్ధకః॥.8158॥*

*24.7 (ఏఢవ శ్లోకము)*

*సాత్వతస్య సుతాః సప్త మహాభోజశ్చ మారిష|*

*భజమానస్య నిమ్లోచిః కింకిణో ధృష్టిరేవ చ॥8159॥*

*24.8 (ఎనిమిదవ శ్లోకము)*

*ఏకస్యామాత్మజాః పత్న్యామన్యస్యాం చ త్రయః సుతాః|*

*శతాజిచ్చ సహస్రాజిదయుతాజిదితి ప్రభో॥8160॥*

అనువుయొక్క కుమారుడు పురుహోత్రుడు. అతని వలన ఆయువు అనువాడు జన్మించెను. ఆయువు తనయుడు సాత్వతుడు. పరీక్షిన్మహారాజా! (పరీక్షిన్మహారాజునకు *మారిషుడు* అనునది మరియొకపేరు) సాత్వతునకు భజమానుడు, భజి,దివ్యుడు, వృష్టి, దేవావృధుడు, అంధకుడు, మహాభోజుడు అను ఏడుగురు పుత్రులు కలిగిరి. భజమానునకు గల ఇద్దరు భార్యలలో ఒక ఆమెయందు నిమ్లోచి, కింకణుడు, ధృష్టి అను ముగ్గురు పుత్రులు కలిగిరి. అతనికే రెండవ భార్యయందు శతాజిత్తు, సహస్రాజిత్తు, అయుతాజిత్తు అను ముగ్గురు కుమారులు జన్మించిరి.

*24.9 (తొమ్మిదవ శ్లోకము)*

*బభ్రుర్దేవావృధసుతస్తయోః శ్లోకౌ పఠంత్యమూ|*

*యథైవ శృణుమో దూరాత్సంపశ్యామస్తథాంతికాత్॥8161॥*

సాత్వతుని కుమారుడైన దేవావృధుని వలన బభ్రువు అనువాడు పుట్టెను. దేవావృధుడు, బభ్రువు - ఈ ఇరువురును లోకప్రశస్తిని గన్నవారు. ఆర్యులు వీరిని గూర్చి ఇట్లు ప్రశంసించుచుందురు - "ఇంతవరకును ఈ మహాపురుషులను గూర్చి వినియుంటిమేగాని చూచియుండలేదు. ఇప్పుడు ప్రత్యక్షముగా కనులార చూచుచున్నాము. ఇది మనభాగ్యము.

*24.10 (పదియవ శ్లోకము)*

*బభ్రుః శ్రేష్ఠో మనుష్యాణాం దేవైర్దేవావృధః సమః|*

*పురుషాః పంచషష్టిశ్చ షట్ సహస్రాణి చాష్ట చ॥8162॥*

*24.11 (పదకొండవ శ్లోకము)*

*యేఽమృతత్వమనుప్రాప్తా బభ్రోర్దేవావృధాదపి|*

*మహాభోజోఽపి ధర్మాత్మా భోజా ఆసంస్తదన్వయే॥8163॥*

బభ్రువు మానవులలో అగ్రగణ్యుడు (శ్రేష్ఠుడు). దేవావృధుడు దేవతలతో సమానుడు. ఈ ఇరువురి ఉపదేశముల ప్రభావమున పదునాలుగువేల అరువది ఐదుమంది అమృతత్వమును (ముక్తిని) పొందిరి". పర్వతుని యొక్క కుమారులలో ఒకడైన మహాభోజుడు గూడ మిక్కిలి ధర్మాత్ముడు. పరంపరగా వర్ధిల్లిన అతని వంశమువారు అందరును *భోజులు* అని వ్యవహరింపబడిరి.

*పురుషాః పంచషష్ట్యధిక - చతుర్దశ సహస్రసంఖ్యాకాః|*

*తే సర్వే త్రయోఃప్రభావాత్ అమృతత్వం (ముక్తిం) ప్రాప్తాః॥* (వీరరాఘవీయ వ్యాఖ్య)

షట్ సహస్రాణి, అష్టవ = (6+8) పదునాలుగువేలు. పంటషష్ఠి = అరువది ఐదు. వెఱసి 14, 65 మంది.

PVD Subrahmanyam చెప్పారు...

*24.12 (పండ్రెండవ శ్లోకము)*

*వృష్ణేః సుమిత్రః పుత్రోఽభూద్యుధాజిచ్చ పరంతప|*

*శినిస్తస్యానమిత్రశ్చ నిమ్నోఽభూదనమిత్రతః॥8164॥*

పరీక్షిన్మహారాజా! సాత్వతుని తనయులలో ఒకడైన వృష్ణివలన సుమిత్రుడు, యుధాజిత్తు అను ఇరువురు పుత్రులు కలిగిరి. యుధాజిత్తునకు శిని, అనమిత్రుడు అనువారు జన్మించిరి. అనమిత్రుని పుత్రుడు నిమ్నుడు.

*24.13 (పదమూడవ శ్లోకము)*

*సత్రాజితః ప్రసేనశ్చ నిమ్నస్యాప్యాసతుః సుతౌ|*

*అనమిత్రసుతో యోఽన్యః శినిస్తస్యాథ సత్యకః॥8165॥*

నిమ్నునకు సత్రాజిత్తు, ప్రసేనుడు అనువారు పుట్టిరి. యదువంశములో వారు సుప్రసిద్ధులు. అనమిత్రునకు నిమ్నుడుగాక మఱియొక సుతుడును గలడు. అతని పేరు శిని. శిని తనయుడు సత్యకుడు.

*24.14 (పదునాలుగవ శ్లోకము)*

*యుయుధానః సాత్యకిర్వై జయస్తస్య కుణిస్తతః|*

*యుగంధరోఽనమిత్రస్య వృష్ణిః పుత్రోఽపరస్తతః॥8166॥*

సత్యకుని తనూజుడు యుయుధానుడు. అతడు *సాత్యకి* అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. సాత్యకి పుత్రుడు జయుడు. జయునివలన *కుణి* అనువాడు జన్మించెను. కుణి యొక్క కుమారుడు యుగంధరుడు. అనమిత్రునియొక్క మరియొక (మూడవ) తనయుడు (వృష్టి).

*24.15 (పదునైదవ శ్లోకము)*

*శ్వఫల్కశ్చిత్రరథశ్చ గాందిన్యాం చ శ్వఫల్కతః|*

*అక్రూరప్రముఖా ఆసన్ పుత్రా ద్వాదశ విశ్రుతాః॥8167॥*

*24.16 (పదునారవ శ్లోకము)*

*ఆసంగః సారమేయశ్చ మృదురో మృదువిద్గిరిః|*

*ధర్మవృద్ధః సుకర్మా చ క్షేత్రోపేక్షోఽరిమర్దనః॥8168॥*

*24.17 (పదిహేడవ శ్లోకము)*

*శత్రుఘ్నో గంధమాదశ్చ ప్రతిబాహుశ్చ ద్వాదశ|*

*తేషాం స్వసా సుచీరాఖ్యా ద్వావక్రూరసుతావపి॥8169॥*

*24.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*దేవవానుపదేవశ్చ తథా చిత్రరథాత్మజాః|*

*పృథుర్విదూరథాద్యాశ్చ బహవో వృష్ణినందనాః॥8170॥*

వృష్ణి తనూజులు శ్వఫల్కుడు, చిత్రరథుడు. శ్వఫల్కుని వలన అతని భార్యయగు గాందిని యందు అక్రూరుడు మొదలగు పన్నెండు మంది పుత్రులు పుట్టిరి. అక్రూరుడు, అసంగుడు, సారమేయుడు, మృదురుడు, మృదువిదుడు, గిరి, ధర్మవృద్ధుడు, సుకర్మ, క్షేత్రోపేక్షుడు, అయిమర్దనుడు, శత్రుఘ్నుడు, గంధమాదుడు, ప్రతిబాహువు అనువారు శ్వఫల్కుని తనయులు. శ్వఫల్కునకు *సుచీర* అను పుత్రికయు కలదు. అక్రూరునకు దేవవంతుడు, ఉపదేవుడు అను ఇరువురు పుత్రులు కలరు. అట్లే శ్వఫల్కుని తమ్ముడైన చిత్రరథునకు పృథువు, విదూరథుడు మొదలగు పెక్కుమంది కొడుకులు కలిగిరి. వీరు అందరును వృష్ణివంశమువారిలో శ్రేష్ఠులే.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*139వ నామ మంత్రము*

*ఓం నిర్గుణాయై నమః*

శరీరధర్మములు తప్ప చిద్ధర్మములు గాని గుణములు ఏవియు లేక సకలగుణాతీతయై, నిర్గుణ స్వరూపిణియై తేజరిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిర్గుణా* యను మూడక్షరముల (త్ర్యైక్షరీ) నామ మంత్రమును *ఓం నిర్గుణాయై నమః* యని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతను ఆరాధన చేయు భక్తులకు ఆ పరమేశ్వరి ఎనలేని సద్గుణ సంపదనిచ్చి జీవనమంతయూ తన భక్థులను ఆ తల్లి తన ధ్యాననిమగ్నతయందుంచి తరింపజేయును.

*సాక్షిచేతా కేవలోనిర్గుణశ్చ* (సౌభాగ్య భాస్కరం - 343వ పుట) జగన్మాత నిర్గుణురాలు. సాక్షి చైతన్యము. కేవలము. నిర్గుణము. పరమేశ్వరిని లక్షించుటకు గుర్తించుటకు వీలుకానట్టిది. గుణములన్నియు కేవలము పాంచభౌతిక శరీరమునకు మాత్రమే. జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. *చిదగ్నికుండ సంభూత* చైతన్యమనెడి అగ్నికుండమునుండి పుట్టినది. శుద్ధ చైతన్య స్వరూపిణి. అగ్నికుండమనెడి చైతన్యమునుండి పుట్టినది. అటువంటి జగన్మాత *నిర్గుణ* స్వరూపురాలు గనుకనే ఆ తల్లి *నిర్గుణా* యను నామాంకిత అయినది. దీనిచే తార్కికశాస్త్రము త్రోసిపుచ్చబడినది. తర్కశాస్త్రంలో ఆత్మకు గుణాలున్నాయని నిరూపించారు. ఈ నామంలో తర్కశాస్త్రం ఖండింపబడినది. వృద్ధి, క్షయములు, వికాసము, నాశనము మొదలైన వికారాలన్నీ శరీరధారులకే. కాని జగన్మాత పరమాత్మ. అందుకే శ్రీమాత *నిర్గుణా* యను నామముతో అత్యంత భక్తి శ్రద్ధలతో స్తుతింపబడుచున్నది. పదార్థాలననుసరించే లక్షణాలు ఉంటాయి. వేపకాయ చేదుగా ఉంటుంది. మామిడికాయ పుల్లగా ఉంటుంది. అలాగే శరీరాలను బట్టి గుణాలు ఉంటాయి. అలాగే శరీరాలను బట్టి గుణాలు. ఇంద్రియాలు కూడా అంతే. బుద్ధి వశంలో ఉంటే ఇంద్రియాలు కుదురుగా ఉంటాయి. మనసు వికృతంగా ఆలోచిస్తే భావాలు కూడా వికృతంగా ఉంటాయి. వివక్షత లోపిస్తుంది. ఏది ఏమైనా అరిషడ్వర్గాలు అదుపులో ఉండవలసింది శరీరధారులకే. పరబ్రహ్మస్వరూపిణికి ఇవన్నీ సంబంధించవు. అందుకే జగన్మాత *నిర్గుణ* స్వరూపిణి. అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిర్గుణాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*139వ నామ మంత్రము*

*ఓం నిర్గుణాయై నమః*

శరీరధర్మములు తప్ప చిద్ధర్మములు గాని గుణములు ఏవియు లేక సకలగుణాతీతయై, నిర్గుణ స్వరూపిణియై తేజరిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిర్గుణా* యను మూడక్షరముల (త్ర్యైక్షరీ) నామ మంత్రమును *ఓం నిర్గుణాయై నమః* యని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతను ఆరాధన చేయు భక్తులకు ఆ పరమేశ్వరి ఎనలేని సద్గుణ సంపదనిచ్చి జీవనమంతయూ తన భక్థులను ఆ తల్లి తన ధ్యాననిమగ్నతయందుంచి తరింపజేయును.

*సాక్షిచేతా కేవలోనిర్గుణశ్చ* (సౌభాగ్య భాస్కరం - 343వ పుట) జగన్మాత నిర్గుణురాలు. సాక్షి చైతన్యము. కేవలము. నిర్గుణము. పరమేశ్వరిని లక్షించుటకు గుర్తించుటకు వీలుకానట్టిది. గుణములన్నియు కేవలము పాంచభౌతిక శరీరమునకు మాత్రమే. జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. *చిదగ్నికుండ సంభూత* చైతన్యమనెడి అగ్నికుండమునుండి పుట్టినది. శుద్ధ చైతన్య స్వరూపిణి. అగ్నికుండమనెడి చైతన్యమునుండి పుట్టినది. అటువంటి జగన్మాత *నిర్గుణ* స్వరూపురాలు గనుకనే ఆ తల్లి *నిర్గుణా* యను నామాంకిత అయినది. దీనిచే తార్కికశాస్త్రము త్రోసిపుచ్చబడినది. తర్కశాస్త్రంలో ఆత్మకు గుణాలున్నాయని నిరూపించారు. ఈ నామంలో తర్కశాస్త్రం ఖండింపబడినది. వృద్ధి, క్షయములు, వికాసము, నాశనము మొదలైన వికారాలన్నీ శరీరధారులకే. కాని జగన్మాత పరమాత్మ. అందుకే శ్రీమాత *నిర్గుణా* యను నామముతో అత్యంత భక్తి శ్రద్ధలతో స్తుతింపబడుచున్నది. పదార్థాలననుసరించే లక్షణాలు ఉంటాయి. వేపకాయ చేదుగా ఉంటుంది. మామిడికాయ పుల్లగా ఉంటుంది. అలాగే శరీరాలను బట్టి గుణాలు ఉంటాయి. అలాగే శరీరాలను బట్టి గుణాలు. ఇంద్రియాలు కూడా అంతే. బుద్ధి వశంలో ఉంటే ఇంద్రియాలు కుదురుగా ఉంటాయి. మనసు వికృతంగా ఆలోచిస్తే భావాలు కూడా వికృతంగా ఉంటాయి. వివక్షత లోపిస్తుంది. ఏది ఏమైనా అరిషడ్వర్గాలు అదుపులో ఉండవలసింది శరీరధారులకే. పరబ్రహ్మస్వరూపిణికి ఇవన్నీ సంబంధించవు. అందుకే జగన్మాత *నిర్గుణ* స్వరూపిణి. అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిర్గుణాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*713వ నామ మంత్రము*

*ఓం గురుమండల రూపిణ్యై నమః*

గురుపరంపర రూపంలో పారమార్థిక జ్ఞానమును ప్రసాదించు పరబ్రహ్మస్వరూపిణికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *గురుమండలరూపిణీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం గురుమండల రూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఎనలేని భక్తితత్పరతతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు ఆధ్యాత్మిక జ్ఞాన సంపదతో విరాజిల్లును.

గురుమండలము అనగా గురుపరంపర. పరమశివుని నుండి లేదా నారాయణుని నుండి తనవరకూ గల గురువులందరినీ కలిపి గురుపరంపర యని యందురు. అట్టి గురుపరంపరనే గురుమండలమని యందురు. అట్టి గురుమండలమే తన స్వరూపముగా *గురుమండలరూపిణీ* యను నామాంకిత అయినది.

712వ నామ మంత్రములో చెప్పిన *ఈం* యొక్క స్వరూపనిశ్చయము వెనుక చెప్పిన కామకళాస్వరూపురాలగు శక్తిస్వరూపము మిక్కిలి రహస్యమయినది. అందుచేతనే ఆ రహస్యము గురుముఖము నుండియే నిష్కర్షగా తెలిసికొని చేయదగినది అని అర్థము. ఇదంతయు భాస్కరరాయలు వారు చెప్పినది.

*సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం*

*నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం*

*గురుపరంపర – కంచి కామకోటి పీఠం*
పై శ్లోకంలో ఆది శంకరులవరకూ గల గురుపరంపర వివరణ *సదాశివ, నారాయణ, చతుర్ముఖబ్రహ్మ, వశిష్ఠ మహర్షి, శక్తిమహర్షి, పరాశర మహర్షి, వేదవ్యాస మాహర్షి, శ్రీ శుక ఆచార్య, శ్రీ గౌడపాదాచార్య, శ్రీ గోవిందభగవత్పాద, శ్రీ శంకర భగవత్పాద* ఈ గురువులందరి రూపంలోని గురువులందరి రూపంలోను అమ్మవారే గురుప్రభావాన్ని చూపుతుంది గనుకనే ఆ పరమేశ్వరి *గురుమండల రూపిణీ* అని నామ ప్రసిద్ధమైనది.

గురువులు శిష్యులు వెళ్ళుమార్గమును సరైనది అవునా కాదా అని చూస్తూ ఉంటారు. సరైనది కాకుంటా సరైన మార్గం చూపుతారు.

ఎడతెగని గురు పరాక్రమములో చెప్పబడినప్పుడే ఈ రహస్య స్వరూపము తెలియును. పుస్తకములలో వ్రాసుకుని, చదివి, వల్లెవేసినంత మాత్రమున ఈ రహస్యము తెలియదు. గనుకనే యోగినీ హృదయములో *గురువులు చెప్ఫుట, శిష్యులు చెప్పుట అనుక్రమముగా ఈ రహస్యార్థము భూలోకమునకు వచ్చినది* అని చెప్పబడెను.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం గురుమండల రూపిణ్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*24.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*కుకురో భజమానశ్చ శుచిః కంబలబర్హిషః|*

*కుకురస్య సుతో వహ్నిర్విలోమా తనయస్తతః॥8171॥*

*24.20 (ఇరువదియవ శ్లోకము)*

*కపోతరోమా తస్యానుః సఖా యస్య చ తుంబురుః|*

*అంధకో దుందుభిస్తస్మాదవిద్యోతః పునర్వసుః॥8172॥*

*24.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*తస్యాహుకశ్చాహుకీ చ కన్యా చైవాహుకాత్మజౌ|*

*దేవకశ్చోగ్రసేనశ్చ చత్వారో దేవకాత్మజాః॥8173॥*

*24.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*దేవవానుపదేవశ్చ సుదేవో దేవవర్ధనః|*

*తేషాం స్వసారః సప్తాసన్ ధృతదేవాదయో నృప॥8174॥*

*24.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*శాంతిదేవోపదేవా చ శ్రీదేవా దేవరక్షితా|*

*సహదేవా దేవకీ చ వసుదేవ ఉవాహ తాః॥8175॥*

సాత్వతుని తనయులలో ఒక్కడైన అంధకునకు కుకరుడు, భజమానుడు, శుచి, కంబలబర్హిషుడు అను నలుగురు కుమారులు కలిగిరి. కుకురుని పుత్రుడు వహ్ని. వహ్నియొక్క తనూజుడు విలోముడు. విలోముని తనూజుడు కపోతరోముడు. అతని సుతుడు అనువు. ఈ అనువు *తుంబురుడు* అను గంధర్వునకు మిత్రుడు. అనువు పుత్రుడు అంధకుడు. అతని కుమారుడు దుందుభి. దుందుభి కొడుకు అరిద్యోతుడు, అతని సుతుడు పునర్వసువు. పునర్వసునకు ఆహుకుడు అను తనయుడు, ఆహుకి అని పుత్రికయు కలిగిరి. ఆహుకుని వలన దేవకుడు, ఉగ్రసేనుడు అను సుతులు జన్మించిరి. దేవకునకు దేవవంతుడు, ఉపదేవుడు, సుథేవుడు, దేవవర్ధనుడు అను నలుగురు కుమారులు జన్మించిరి. రాజా! దేవకునకు ఈ నలుగురు కుమారులే గాక - ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి అను ఏడుగురు కుమార్తెలును గలరు. ఈ ఏడుగురును వసుదేవునకు భార్యలైరి.

*24.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*కంసః సునామా న్యగ్రోధః కంకః శంకుః సుహూస్తథా|*

*రాష్ట్రపాలోఽథ సృష్టిశ్చ తుష్టిమానౌగ్రసేనయః॥8176॥*

*24.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*కంసా కంసవతీ కంకా శూరభూ రాష్ట్రపాలికా|*

*ఉగ్రసేనదుహితరో వసుదేవానుజస్త్రియః॥8177॥*

ఆహుకుని సుతుడైన ఉగ్రసేనునకు కంసుడు, సునాముడు, న్యగ్రోధుడు, కంకుడు, శంకువు, సుహువు, రాష్ట్రపాలుడు, సృష్టి, తుష్టిమంతుడు అను తొమ్మిదిమంది తనయులు ఉద్భవించిరి. ఉగ్రసేనునకు ఈ తొమ్మిది మంది కుమారులేగాక, కంస, కంసవతి, కంక, శూరభవు, రాష్ట్రపాలిక అను ఐదుగురు కుమార్తెలును గలరు. వీరు వసుదేవుని తమ్ములైన దేవభాగుడు మొదలగువారికి భార్యలైరి.

*24.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*శూరో విదూరథాదాసీద్భజమానః సుతస్తతః|*

*శినిస్తస్మాత్స్వయం భోజో హృదీకస్తత్సుతో మతః॥8178॥*

*24.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*దేవబాహుః శతధనుః కృతవర్మేతి తత్సుతాః|*

*దేవమీఢస్య శూరస్య మారిషా నామ పత్న్యభూత్॥8179॥*

చిత్రరథుని కుమారుడైన విదురథునకు శూరుడనువాడు జన్మించెను. ఈ శూరునకు దేవమీఢుడు, శూరసేనుడు అను పేర్లుగలవు. శూరుని పుత్రుడు భజమానుడు. అతని సుతుడు శిని. శిని తనయుడు స్వయంభోజుడు. అతని తనూజుడు హృదీకుడు. హృదీకునకు దేవబాహువు, శతధనువు, కృతవర్మ అను ముగ్గురు కొడుకులు కలిగిరి. దేవమీఢుడను పేరుగల శూరుని భార్యపేరు మారిష.

PVD Subrahmanyam చెప్పారు...

*24.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*తస్యాం స జనయామాస దశ పుత్రానకల్మషాన్|*

*వసుదేవం దేవభాగం దేవశ్రవసమానకమ్॥8180॥*

*24.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*సృంజయం శ్యామకం కంకం శమీకం వత్సకం వృకమ్|*

*దేవదుందుభయో నేదురానకా యస్య జన్మని॥8181॥*

*24.30 (ముప్పదియవ శ్లోకము)*

*వసుదేవం హరేః స్థానం వదంత్యానకదుందుభిమ్|*

*పృథా చ శ్రుతదేవా చ శ్రుతకీర్తిః శ్రుతశ్రవాః॥8182॥*

*24.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*రాజాధిదేవీ చైతేషాం భగిన్యః పంచ కన్యకాః|*

*కుంతేః సఖ్యుః పితా శూరో హ్యపుత్రస్య పృథామదాత్॥8183॥*

శూరుని వలన మారిష యందు పదిమంది పుత్రులు జన్మించిరి. వారు వసుదేవుడు, దేవభాగుడు, దేవశ్రవనుడు, ఆనకుడు, సృంజయుడు, శ్యామకుడు, కంకుడు, శమీకుడు, వత్సకుడు, వృకుడు - వీరు అందరును పుణ్యపురుషులు. వసుదేవుడు జన్మించినప్పుడు దేవదుందుభులు, ఆనకములు (ఢంకాలు లేదా తప్పెటలు) మ్రోగుటచే ఆయనకు *ఆనక దుందుభి* అను పేరు ఏర్పడెను. అవతారపురుషుడైన శ్రీకృష్ణునకు తల్లిదండ్రులైన దేవకీ వాసుదేవులు ధన్యాత్ములు. ఈ మారిష శూరులగు వసుదేవాది పుత్రులేగాక పృథ (కుంతీదేవి), శ్రుతదేవ, శ్రుతకీర్తి, శ్రుతశ్రవ, రాజాధిదేవి అను పుత్రికలును గలరు. వసుదేవుని తండ్రియైన శూరునకు (శూరసేనునకు) కుంతిభోజుడు అను మిత్రుడు గలడు. అతనికి సంతానము లేకపోవుటచే ఈ శూరుడు తన కూతురైన పృథను కుంతిభోజునకు దత్తత ఇచ్చెను. కుంతిభోజునిచే పెంచబడినంధున పృథకు *కుంతి* అను పేరు వచ్చెను.

*24.32 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*సాఽఽప దుర్వాససో విద్యాం దేవహూతీం ప్రతోషితాత్|*

*తస్యా వీర్యపరీక్షార్థమాజుహావ రవిం శుచిమ్॥8184॥*

*24.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*తదైవోపాగతం దేవం వీక్ష్య విస్మితమానసా|*

*ప్రత్యయార్థం ప్రయుక్తా మే యాహి దేవ క్షమస్వ మే॥8185॥*

కుంతీదేవి సేవలకు సంతుష్టుడైన దుర్వాసమహాముని ఆమెకు *దేవహూతి* అను (దేవతలసు ఆహ్వానించు) పవిత్రమైన విద్యను (మంత్రమును) ఉపదేశించెను. ఒకనాడు కుంతీదేవి ఆ మంత్రప్రభావమును పరీక్షించటకై పరమపవిత్రుడగు సూర్యభగవానుని ఆహ్వానించెను. వెంటనే సూర్యనారాయణుడు ఆమె ముందు నిలిచెను. అప్ఫుడు ఆమె మిగుల ఆశ్చర్యపడుచు - 'స్వామీ! నా మంత్రశక్తిని తెలిసికొనుటకై దానిని స్మరించితిని. నా అపరాధమును క్షమించి, నీవు నీ స్థానమునకు చేరుము' అని ప్రార్థించెను.

*24.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*అమోఘం దర్శనం దేవి ఆదిత్సే త్వయి చాత్మజమ్|*

*యోనిర్యథా న దుష్యేత కర్తాహం తే సుమధ్యమే॥8186॥*

*24.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*ఇతి తస్యాం స ఆధాయ గర్భం సూర్యో దివం గతః|*

*సద్యః కుమారః సంజజ్ఞే ద్వితీయ ఇవ భాస్కరః॥8187॥*

*24.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*తం సాత్యజన్నదీతోయే కృచ్ఛ్రాల్లోకస్య బిభ్యతీ|*

*ప్రపితామహస్తామువాహ పాండుర్వై సత్యవిక్రమః॥8188॥*
అంతట సూర్యభగవానుడు ఆమెతో ఇట్లనెను. "సుందరీ! నా దర్శనము అమోఘమైనది. అది నిష్ఫలము కారాదు. నీ కన్యాత్వము దూషితము కాకుండ, నీకు ఒక కుమారుని అసుగ్రహించెదను". ఇట్లు పలికిన పిమ్మట ఆ మహాత్ముడు ఆమెను గర్భవతిని గావించి దివికేగెను. వెంటనే కుంతీదేవి ఒక కుమారుని గనెను. ఆ శిశువు మరియొక్క భాస్కరుని (సూర్యుని) వలె తేజరిల్లుచుండెను. పిమ్మట ఆమె లోకనిందకు భయపడి ఆ శిశువును ఒక పెట్టెలో నుంచి నదీజలములలోనికి వదలెను. అనంతరము ఆమె నీకు ముత్తాతయు, పరాక్రమ సంపన్నుడును ఐన పాండురాజును వివాహమాడెను.

*24.37 (ముప్పది ఏఢవ శ్లోకము)*

*శ్రుతదేవాం తు కారూషో వృద్ధశర్మా సమగ్రహీత్|*

*యస్యామభూద్దంతవక్త్రః ఋషిశప్తో దితేః సుతః॥8189॥*

పరీక్షిన్మహారాజా! కుంతీదేవీ సోదరియగు శ్రుతదేవను కరూపదేశాధిపతియగు వృద్ధశర్మ పెండ్లియాడెను. ఆమెకు *దంతవక్త్రుడు* అను కుమారుడు కలిగెను. సనకాది మహర్షుల శాప ఫలితముగా పూర్వజన్మమున దితియందు పుట్టిన హిరణ్యాక్షుడు ఇతడే.

PVD Subrahmanyam చెప్పారు...

*24.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*కైకేయో ధృష్టకేతుశ్చ శ్రుతకీర్తిమవిందత|*

*సంతర్దనాదయస్తస్యాం పంచాసన్ కైకయాః సుతాః॥8190॥*

కుంతీదేవియొక్క మరియొక సోదరియైన శ్రుతకీర్తిని కైకయ దేశ ప్రభువగు దృష్టకేతువు పరిణయమాడెను. ఆ దంపతులకు సంతర్దనుడు (ప్రత్యర్దనుడు) మున్నగువారు ఐదుగురు తనయులు కలిగిరి.

*24.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*రాజాధిదేవ్యామావంత్యౌ జయసేనోఽజనిష్ట హ|*

*దమఘోషశ్చేదిరాజః శ్రుతశ్రవసమగ్రహీత్॥8191॥*

జయసేనుడు (జయత్సేనుడు) అనువాడు కుంతీదేవియొక్క మఱియొక సోదరియగు రాజాధిదేవిని వివాహము చేసికొనెను. వారికి విందాను విందులు అను ఇరువురు కుమారులు కలిగిరి. వారు అవంతి దేశమును పాలించిరి. (జయసేనుని వఞన రాజాధిదేవియందు *మిత్రవింద* అను కూతురుగూడ కలిగెను) చేదిదేశ ప్రభువగు దమఘోషుడు కుంతీదేవియొక్క మఱియొక సోదరియగు శ్రుతశ్రవను (సాత్వతిని) చేపట్టెను.

*24.40 (నలుబదియవ శ్లోకము)*

*శిశుపాలః సుతస్తస్యాః కథితస్తస్య సంభవః|*

*దేవభాగస్య కంసాయాం చిత్రకేతుబృహద్బలౌ॥8192॥*

ఆ దంపతులకు శిశుపాలుడు అను కుమారుడు కలిగెను. అతని పుట్టుకను గూర్చి ఇదివరలో (7వ స్కంధమున) ప్రస్తావింపబడినది. (ఈ శిశుపాలుడే పూర్వజన్మలో హిరణ్యకశిపుడు). వసుదేవుని తమ్ముడైన దేవభాగుని వలన అతని భార్యయగు కంసయనునామె (కంసుని చెల్లెలు) యందు చిత్రకేతువు. బృహద్బలుడు అను ఇద్దరు కుమారులు జన్మించిరి.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*714వ నామ మంత్రము*

*ఓం కులోత్తీర్ణాయై నమః*

కులము (ఇంద్రియాల గుంపు), మనస్సులచే ఎరుగబడనిదైన (అతీంద్రియ స్వరూపిణియైన) జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కులోత్తీర్ణా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం కులోత్తీర్ణాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు సాధకుడు ఆ తల్లి కరుణచే తన ఇంద్రియాలను సన్మార్గంలోనికి నడిపించుకొని నిరంతరం భగవద్ధ్యానంలో జన్మతరింపజేసికొనును.

జగన్మాత ఇంద్రిసముదాయమునకు గోచరించనిది. అనగా *సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణభూషితా* అని లలితాసహస్రనామస్తోత్రంలో చెప్పినట్లు ఆతల్లి ధరించిన వస్త్రములు, సుమమాలలు మొదలైనవి వన్నిటితోనూ, దోషరహితమైన అవయవ సొంపుతో ఉండి సర్వాభరణ భూషితయైన ఆ తల్లిని ఈ చర్మ చక్షువులతో చూడలేము, *నిజసల్లాపమాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ* యను నామ మంత్రములో చెప్పినట్లు ఈ శరీరంలో ఉన్న చెవులతో సరస్వతీ దేవియొక్క కచ్ఛపీ వీణానాదమునకన్నా మధురమైన ఆ తల్లి పలుకులను వినలేము, *చంపకాశోకపున్నాగ సౌగంధిక లసత్కచా* యను నామమంత్రములో చెప్పినట్లు సంపంగి, అశోక, పున్నాగ పుష్పసౌగంధములలరిన ఆతల్లి శిరోజముల సౌగంధము గాలిలో తేలియాడుతూ మన శరీరంలోని ఘ్రాణేంద్రియమైన నాసికా రంధ్రములను తాకదు, ఒకవేళ తాకినా గ్రహించలేము, అలాగే *సుధాసారాభివర్షిణీ* అను నామమంత్రంలో చెప్ఫినట్లు సహస్రారంలోని చంద్రమండలమందు స్రవించు అమృతధారలు, నానా రకాల భౌతికప్రపంచ పదార్థముల షడ్రుచుల మేళవింపుల రుచిమరిగిన జిహ్వను చేరనేలేవు, ఆ అమృతధారలలోని మధురిమలు ఈ నాలుకతో రుచి కూడాచూడలేము. ఇంకనూ *పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా* అను నామ మంత్రములో చెప్పినట్లు పద్మములను కూడా తిరస్కరించే మృదుత్వ, సౌకుమార్యాది లక్షణములతో భాసిల్లు పదద్వయంపై ఈ శిరస్సును తాకించినను ఆ పాదస్పర్శలోని దివ్యత్వాన్ని తెలియలేము. ఎందుకంటే నేను అనే భ్రాంతిని విడచి, పరమాత్మలోనైక్యమునంది జీవన్ముక్తుడైతేనే తెలియగలముగాని లేకుంటే కులము (భౌతిక శరీరమందలి ఇంద్రియాల గుంపు) వలన గాని, ఈ శరీరముపై మమకార పూరితమైన మనసుతోగాని ఆ తల్లిని తెలియలేనంత అతీంద్రియ స్వరూపిణి అయినది జగన్మాత.

కులము అంటే అజ్ఞానము. అజ్ఞానానికి గురువురూపంలో జ్ఞానోపదేశంచేసి, సాధకుణ్ణి కడతేర్చేది పరమేశ్వరి. అందుచే *కులోత్తీర్ణా* యను నామముతో ఆ తల్లి స్తుతింపబడుచున్నది.

ఆ తల్లికి నమస్కరించునపుడు *ఓం కులోత్తీర్ణాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*140వ నామ మంత్రము*

*ఓం నిష్కలాయై నమః*

శరీరభాగములైన అవయము లేవియు లేక నిరాకారమైన పరబ్రహ్మ స్వరూపిణియైన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహన్ర నామావళి యందలి *నిష్కలా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం నిష్కలాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగజ్జననిని ఉపాసించు సాధకుడు ఆ తల్లి కరుణచే సుఖసంతోషములతో, ఇష్టకామ్యార్థసిద్ధితో బాటు ఆత్మానందమును పొంది జన్మతరించినదను తృప్తినందును.

*కలా* అనగా అంశము, భాగము, అవయవము అని నిఘంటువులో అర్థములు గలవు. శరీరములోని భాగములు అని అనుకుంటే అవయవములు. *నిష్కలా* అని అంటే శరీరములోని భాగములు అనగా అవయవములు లేనిది. అవయవములు అనేవి శరీరధారులకే. జీవాత్మలకే శరీరములు ఉంటాయి. శుద్ధచైతన్య స్వరూపురాలు, పరబ్రహ్మ అయిన పరమేశ్వరి దేహధారికాదు. గాన జగన్మాత *నిష్కలా* యని అనబడినది.

*శ్లో. ధ్యానం యా నిష్కలా చింతా నిరాధారా నిరాశ్రయా|*

*న తు ధ్యానం శరీరస్య ముఖహస్తాది కల్పనే॥* (సౌభాగ్య భాస్కరం ర, 344వ పుట)

ధ్యానమనునది నిష్కలచింత. అది నిరాధారము, నిరాశ్రయము అయి ఉన్నది. శరీరము, ముఖహస్తాదులు అని వివిధ అవయవములు కల్పించి చేయునది ధ్యానము కాదు. ముఖ్యంగా తెలియవలసినది ఏమంటే పరబ్రహ్మనుండి ఉద్భవించిన జీవసముదాయానికి అవయవములు ఉన్నవి గాని ఆ పరమాత్మకు లేవు. అందుచే పరమాత్మ అయిన జగన్మాత *నిష్కలా* యని అనబడినది. నిష్కళా అనగా కళాతీతురాలు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిష్కలాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*24.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*కంసవత్యాం దేవశ్రవసః సువీర ఇషుమాంస్తథా|*

*కంకాయామానకాజ్జాతః సత్యజిత్పురుజిత్తథా॥8193॥*

వసుదేవుని మఱియొక సోదరుడగు శ్రవసునకు కంసవతి (కంసునిచెల్లెలి) యందు సువీరుడు, ఇషుమంతుడు అనువారు కలిగిరి. వసుదేవుని వేరొక సోదరుడగు ఆనకునకు కంకయందు (కంసుని సోదరియందు) సత్యజిత్తు, పురుజిత్తు అను కుమారులు ఉద్భవించిరి.

*24.42 (నలుబది రెండవ శ్లోకము)*

*సృంజయో రాష్ట్రపాల్యాం చ వృషదుర్మర్షణాదికాన్|*

*హరికేశహిరణ్యాక్షౌ శూరభూమ్యాం చ శ్యామకః॥8194॥*

వసుదేవుని తమ్ముడగు సృజయుని వలన రాష్ట్రపాలిక (కంసుని చెల్లెలి) యందు వృషుడు, దుర్మర్షణుడు మొదలగు ఎందరో తనయులు జన్మించిరి. వసుదేవుని తమ్ముడైన శ్యామకునకు శూరభూమి యందు (శూరభువునందు - కంసుని చెల్లెలియందు) హరికేశుడు, హిరణ్యాక్షుడు అను ఇద్దరు పుత్రులు జన్మించిరి.

*24.43 (నలుబది మూడవ శ్లోకము)*

*మిశ్రకేశ్యామప్సరసి వృకాదీన్ వత్సకస్తథా|*

*తక్షపుష్కరశాలాదీన్ దుర్వార్క్ష్యాం వృక ఆదధే॥8195॥*

*24.44 (నలుబది నాలుగవ శ్లోకము)*

*సుమిత్రార్జునపాలాదీన్ శమీకాత్తు సుదామినీ|*

*కంకశ్చ కర్ణికాయాం వై ఋతధామజయావపి॥8196॥*

వసుదేవుని తమ్ముడగు వత్సకునివలన *మిశ్రకేశి* యను అప్సరసయందు వృకుడు మొదలగు పెక్కుమంది కుమారులు కలిగిరి. వసుదేవుని తమ్ముడగు వృకుని వలన *దుర్వార్ క్షియందు* తక్షుడు, పుష్కరుడు, శాలుడు మున్నగు తనూజులు ఉద్భవించిరి. వసుదేవుని అనుజుడగు శమీకునకు సుదామిని యందు మిత్రుడు, అర్జున పాలుడు మొదలగు పుత్రులు జన్మించిరి. వసుదేవుని తమ్ముడగు కంకునివలన *కర్ణిక* యను నామెయందు ఋతధాముడు, జయుడు అనువారు పుట్టిరి.

*24.45 (నలుబది ఐదవ శ్లోకము)*

*పౌరవీ రోహిణీ భద్రా మదిరా రోచనా ఇలా|*

*దేవకీప్రముఖా ఆసన్ పత్న్య ఆనకదుందుభేః॥8197॥*

*24.46 (నలుబది ఆరవ శ్లోకము)*

*బలం గదం సారణం చ దుర్మదం విపులం ధ్రువమ్|*

*వసుదేవస్తు రోహిణ్యాం కృతాదీనుదపాదయత్॥8198॥*

*ఆనకదుందుభి* అను నామాంతరముగల వసుదేవునకు పౌరవి, రోహిణి, భద్ర, మదిర, రోచన, ఇలా, దేవకి మొదలగు పెక్కుమంది భార్యలు గలరు. వసుదేవుని వలన రోహిణి యందు బలుడు, గదుడు, సారణుడు, దుర్మదుడు, విపులుడు, ధ్రువుడు, కృతుడు మొదలగు పుత్రులు కలిగిరి.

*24.47 (నలుబది ఏడవ శ్లోకము)*

*సుభద్రో భద్రవాహశ్చ దుర్మదో భద్ర ఏవ చ|*

*పౌరవ్యాస్తనయా హ్యేతే భూతాద్యా ద్వాదశాభవన్॥8199॥*

*24.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*

*నందోపనందకృతకశూరాద్యా మదిరాత్మజాః|*

*కౌసల్యా కేశినం త్వేకమసూత కులనందనమ్॥8200॥*

ఇంకను వసుదేవునకు పౌరవియందు సుభద్రుడు, భద్రవాహుడు, దుర్మదుడు, భద్రుడు, భూతుడు మొదలగు పన్నెండు మంది కుమారులు జన్మించిరి. మరియు వసుదేవునివలన *మదిర* యను భార్యయందు నందుడు, ఉపనందుడు, కృతకుడు, శూరుడు మున్నగు తనయులు పుట్టిరి. ఇంకను వసుదేవునకు కౌసల్య (భద్ర) యందు *కేశి* యను ఒక కొడుకు పుట్టెను. ఇతడు వంశమునకు వన్నెదెచ్చినవాడు.

*24.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*

*రోచనాయామతో జాతా హస్తహేమాంగదాదయః|*

*ఇలాయామురువల్కాదీన్ యదుముఖ్యానజీజనత్॥8201॥*

*24.50 (యాబదియవ శ్లోకము)*

*విపృష్ఠో ధృతదేవాయామేక ఆనకదుందుభేః|*

*శాంతిదేవాత్మజా రాజన్ శ్రమప్రతిశ్రుతాదయః॥8202॥*

ఇంకను వసుదేవునకు గల ఇతర భార్యలలో రోచనయందు హస్తుడు, హేమాంగదుడు మొదలగు వారును, *ఇల (ఇళ)* యందు ఉరువల్కుడు మున్నఘు యాదవ ముఖ్యులును, ధృతదేవియందు విపృష్ఠుడును, శాంతిదేవయందు శ్రముడు, ప్రతిశ్రుతుడు మొదలగువారు జన్మించిరి.

PVD Subrahmanyam చెప్పారు...

*24.51 (ఏబది ఒకటవ శ్లోకము)*

*రాజానః కల్పవర్షాద్యా ఉపదేవాసుతా దశ|*

*వసుహంససువంశాద్యాః శ్రీదేవాయాస్తు షట్ సుతాః॥8203॥*

*24.52 (ఏబది రెండవ శ్లోకము)*

*దేవరక్షితయా లబ్ధా నవ చాత్ర గదాదయః|*

*వసుదేవః సుతానష్టావాదధే సహదేవయా॥8204॥*

*24.53 (ఏబది మూడవ శ్లోకము)*

*పురువిశ్రుతముఖ్యాంస్తు సాక్షాద్ధర్మో వసూనివ|*

*వసుదేవస్తు దేవక్యామష్ట పుత్రానజీజనత్॥8205॥*

*24.54 (ఏబది నాలుగవ శ్లోకము)*

*కీర్తిమంతం సుషేణం చ భద్రసేనముదారధీః|*

*ఋజుం సమ్మర్దనం భద్రం సంకర్షణమహీశ్వరమ్॥8206॥*

*24.55 (ఏబది ఐదవ శ్లోకము)*

*అష్టమస్తు తయోరాసీత్స్వయమేవ హరిః కిల|*

*సుభద్రా చ మహాభాగా తవ రాజన్ పితామహీ॥8207॥*

ఉపదేవయందు కల్పవర్షుడు మొదలగు పదిమంది కుమారులు కలిగిరి. వీరు మహారాజులుగా ప్రసిద్ధి వహించిరి. శ్రీదేవ యందు వసువు, హంసుడు, సువంశుడు మున్నగు ఆరుగురు కొడుకులు పుట్టిరి. దేవరక్షితయందు గదుడు మొదలగు తొమ్మిదిమంది కుమారులు ఉద్భవించిరి. ధర్మునకు అష్టవసువులవలె వసుదేవునకు సహదేవయను భార్యయందు పురువిశ్రుతుడు మొదలగు ఎనిమిదిమంది సుతులు కలిగిరి. అట్లే ఉదార స్వభావముగల వసుదేవుని వలన దేవకీదేవి యందు కీర్తిమంతుడు, సుషేణుడు, భద్రసేనుడు, ఋజుడు, సమ్మర్ధనుడు, భద్రుడు, సంకర్షణుడు (బలరాముడు), శ్రీకృష్ణుడు అను ఎనిమిదిమంది పుత్రులు జన్మించిరి. బలరాముడు ఆదిశేషుని అవతారము. శ్రీమన్నారాయణుడు దేవకీదేవియొక్క అష్టమ గర్భమునందు శ్రీకృష్ణుడై అవతరించెను. పరీక్షిన్మహారాజా! నీకు పీతామహియు (తండ్రి తల్లియు), మహాత్మురాలును ఐన సుభద్ర గూడ దేవకీ వసుదేవుల ముద్దులపట్టియే.

PVD Subrahmanyam చెప్పారు...

*24.56 (ఏబది ఆరవ శ్లోకము)*

*యదా యదేహ ధర్మస్య క్షయో వృద్ధిశ్చ పాప్మనః|*

*తదా తు భగవానీశ ఆత్మానం సృజతే హరిః॥8208॥*

భూమండలమున ధర్మము క్షీణించినప్ఫుడును, పాపము పెచ్చు పెఱిగినప్పుడును, ధర్మసంస్థాపనకై సర్వేశ్వరుడైన శ్రీహరి స్వయముగా అవతరించుచుండును.

*24.57 (ఏబది ఏడవ శ్లోకము)*

*న హ్యస్య జన్మనో హేతుః కర్మణో వా మహీపతే|*

*ఆత్మమాయాం వినేశస్య పరస్య ద్రష్టురాత్మనః॥8209॥*

పరీక్షిన్మహారాజా! ఆ శ్రీహరి మాయను (ప్రకృతిని) నియంత్రించువాడు, అసంగుడు (పుణ్యాపుణ్యకర్మల ఫలములు అంటనివాడు) , సర్వసాక్షి (సకలప్రాణుల యందును అంతర్హితుడై సర్వమునకును సాక్షీభూతుడై యుండువాడు), స్థావరజంగమాత్మకమయిన విశ్వమునందు అంతటను వ్యాపించి యుండువాడు. అట్టి పరమాత్మయైన శ్రీహరి యొక్క అవతారములకు, లీలావినోదములకు ఆ సర్వేశ్వరుని సంకల్పము దప్ప మరియొక హేతువు ఉండదు.

*24.58 (ఏబది ఎనిమిదివ శ్లోకము)*

*యన్మాయాచేష్టితం పుంసః స్థిత్యుత్పత్త్యప్యయాయ హి|*

*అనుగ్రహస్తన్నివృత్తేరాత్మలాభాయ చేష్యతే॥8210॥*

జీవులయొక్క ఉత్పత్తి, స్థితిలయములు అన్నియును ఆ పరాత్పరుని సంకల్ప ప్రభావములే. భగవంతుని మాయావిలాసమే జీవునియొక్క పుట్టుక, జీవనము, మృత్యువులకు కారణము. ఆ భగవంతుని అనుగ్రహమే మనకు ఆ మాయను పోగొట్టి ఆత్మస్వరూపమును పొందింపచేయుటయే.

*24.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)*

*అక్షౌహిణీనాం పతిభిరసురైర్నృపలాంఛనైః|*

*భువ ఆక్రమ్యమాణాయా అభారాయ కృతోద్యమః॥8211॥*

*24.60 (అరువదియవ శ్లోకము)*

*కర్మాణ్యపరిమేయాణి మనసాపి సురేశ్వరైః|*

*సహసంకర్షణశ్చక్రే భగవాన్ మధుసూదనః॥8212॥*

అసుర ప్రవృత్తిగలవారు (అసురులు) మహారాజుల రూపములలో విలసిల్లుచు, పెక్కు అక్షౌహిణుల సైన్యములకు అధిపతులై భూమండలమును ఆక్రమించి, పెక్కు ఆగడములకు (అకృత్యములకు) పాల్పడుచుండిరి. అట్టి స్థితిలో భూభారమును తొలగించుటకై శ్రీహరి (శ్రీకృష్ణుడు) బలరామునితో గూడి అవతరించెను. బ్రహ్మేంద్రాది దేవతలకును ఊహింపరాని లీలలను ప్రదర్శించి భూభారమును తగ్గించెను. (కంసాది దుష్టులను సంహరించి, భూభారమును తొలగించెను.

*24.61 (అరువది ఒకటవ శ్లోకము)*

*కలౌ జనిష్యమాణానాం దుఃఖశోకతమోనుదమ్|*

*అనుగ్రహాయ భక్తానాం సుపుణ్యం వ్యతనోద్యశః॥8213॥*

ద్వాపరయుగమున శ్రీకృష్ణపరమాత్మ అవతరించిన లక్ష్యము మిగుల విస్తృతమైనది. రాక్షస సంహారమొనర్చుట ద్వారా భూభారమును తొలగించుటకు దాని ముఖ్య ప్రయోజనమే యైనను, కలియుగమున జన్మించునట్టి భక్తులు ఆ స్వామియొక్క పవిత్రయశమును కీర్తించినను, వినినను వారి యొక్క దుఃఖశోకములను, అజ్ఞానమును రూపుమాపుచు వారికి పరమశ్రేయస్సును ఒనగూర్చుటద్వారా వారిని (భక్తులను) అనుగ్రహించుటయు దాని పరమప్రయోజనము.

*24.62 (అరువది రెండవ శ్లోకము)*

*యస్మిన్ సత్కర్ణపీయుషే యశస్తీర్థవరే సకృత్|*

*శ్రోత్రాంజలిరుపస్పృశ్య ధునుతే కర్మవాసనామ్॥8214॥*

భగవంతుని యశోగానము సత్పురుషుల కర్ణములకు అమృతప్రాయమైనది. అట్టి పవిత్ర (పరమ) యశస్తీర్థమును చెవులనెడి దోసిళ్ళద్వారా (చెవులార) ఒక్కసారి సేవించినను అట్టి వారి కర్మవాసనలు అన్నియును ప్రక్షాళితములగును.

*24.63 (అరువది మూడవ శ్లోకము)*

*భోజవృష్ణ్యంధకమధుశూరసేనదశార్హకైః|*

*శ్లాఘనీయేహితః శశ్వత్కురుసృంజయపాండుభిః॥8215॥*

*24.64 (అరువది నాలుగవ శ్లోకము)*

*స్నిగ్ధస్మితేక్షితోదారైర్వాక్యైర్విక్రమలీలయా|*

*నృలోకం రమయామాస మూర్త్యా సర్వాంగరమ్యయా॥8216॥*

భోజ, వృష్ణి, అంధక, మధు, శూరసేన, దశార్హ, కురు, సృంజయ, పాండు మొదలగు వంశములకు చెందినవారు శ్రీకృష్ణలీలలను సర్వదా శ్లాఘించుటకే ఆరాటపడుచుందురు. సర్వశ్లాఘనీయుడైన ఆ కృష్ణపరమాత్మ సౌహార్దపూర్వకములైన చిరునవ్వుల తోడను, చల్లని చూపులతోను, అనుగ్రహవచనములతోను, పరాక్రమ లీలలచేతను సర్వాంగ సుందరమైన రూపవైభవము చేతను మానవలోకమును ఆనందింపజేయుచుండును.

PVD Subrahmanyam చెప్పారు...

*24.65 (అరువది ఐదవ శ్లోకము)*

*యస్యాననం మకరకుండలచారుకర్ణభ్రాజత్కపోలసుభగం సవిలాసహాసమ్|*

*నిత్యోత్సవం న తతృపుర్దృశిభిః పిబంత్యో నార్యో నరాశ్చ ముదితాః కుపితా నిమేశ్చ॥8217॥*

శ్రీకృష్ణుని వదన వైభవము అపూర్వమైనది. ఆ స్వామియొక్క మనోజ్ఞములైన కర్ణములయందు శోభిల్లుచున్న మకర కుండలముల కాంతులు చెక్కిళ్ళపై ప్రతిఫలించుచు వాటి అందచందములను, ఇనుమడింప జేయుచున్నవి. విలాసవంతములైన ఆ స్వామి చిరునవ్వులు అనుక్షణము కనువిందు గావించుచు, చూచెడి వారి మనస్సులను దోచుకొనుచున్నవి. ఆ విధముగా విరాజిల్లుచున్న ఆ ప్రభువు ముఖసౌందర్యామృతమును తమ చూపులద్వారా ఎంతగా ఆస్వాదించుచున్నను స్త్రీలకును, పురుషులకును తనివిదీరకుండెను. ఆ సంతోష సమయమున తమ దర్శనానందమునకు విఘాతమును కలిగించుచున్న ఱెప్పపాటులను గూడ వారు సహింపలేకుండిరి. అందువలన వారు తమ ఱెప్పపాట్లపై కుపితులగుచు, 'దేవతలవలె మనమును అనిమిషులమై యున్నచో ఎంత బాగుండెడిది' అని అనుకొనుచుండిరి.

*24.66 (అరువది ఆరవ శ్లోకము)*

*జాతో గతః పితృగృహాద్వ్రజమేధితార్థో హత్వా రిపూన్ సుతశతాని కృతోరుదారః|*

*ఉత్పాద్య తేషు పురుషః క్రతుభిః సమీజే ఆత్మానమాత్మనిగమం ప్రథయన్ జనేషు॥8218॥*

శ్రీకృష్ణుడు మధురయందు దేవకీ వసుదేవుల ముద్దులపట్టియై అవతరించెను. పిమ్మట నందగోపుని ఇంటికి చేరి, గోకులమునందు తన లీలలచే గోవులను, గోపాలురను, గోపికలను ఆనందింపజేసెను. వ్రేపల్లెలోనూ, మధురలోను, ద్వారకయందును దుష్టులైన శత్రువులను హతమార్చెను. రుక్మిణి మొదలగు ఎనిమిదిమంది రాకుమార్తెలను, పదునారువేలమంది తరుణీమణులను పెండ్లియాడెను. వారియందు వందలకొలది పుత్రులను బడసెను. ఆ ఆది పురుషుడు తనను శరణుజొచ్చినవారిని కరుణించెను. యజ్ఞపురుషుడును, యజ్ఞకర్తయును, యజ్ఞఫలభోక్తయును తానే ఐనను, వైదిక మర్యాదలను పరిరక్షించుటకును, వాటియెడ ప్రజలలో ఆదరాభిమానములను కల్గించుటకును ఆ స్వామి పెక్కు యజ్ఞములను ఆచరించెను.

*24.67 (అరువది ఏడవ శ్లోకము)*

*పృథ్వ్యాః స వై గురుభరం క్షపయన్ కురూణామంతఃసముత్థకలినా యుధి భూపచమ్వః|*

*దృష్ట్యా విధూయ విజయే జయముద్విఘోష్య ప్రోచ్యోద్ధవాయ చ పరం సమగాత్స్వధామ॥8219॥*

శ్రీకృష్ణుడు కౌరవపాండవుల మధ్య సంభవించిన కలహము నిమిత్తముగా భూభారమును తొలగించెను. యుద్ధరంగమున తన చూపులతోడనే రాజుల సైన్యములను తుదముట్టించి, అర్జునునకు విజయమును చేకూర్చెను. ఉద్ధవునకు తత్త్వోపదేశమును గావించెను. ఇట్లు కృష్ణపరమాత్మ తస అవతార లీలలను ప్రదర్శించి, తన పరంధామమునకు చేరెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే చతుర్వింశోఽధ్యాయః (24)*

ఇది భాగవత మహాపురాణమునందలి నవమ స్కంధమునందు ఇరువది నాలుగవ అధ్యాయము (24)

🙏🙏🙏 ఇతి నవమస్కంధః సమాప్తః🙏🙏🙏
🌹🌹🌹ఓం తత్సత్🌹🌹🌹

*🌹🌹🌹తరువాయి దశమస్కంధము🌹🌹🌹*

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*715వ నామ మంత్రము*

*ఓం భగారాధ్యాయై నమః*

భగమనే సూర్యమండలములో ఉపాసింపబడు (సాధకుని హృదయస్థానంలోని దహరాకాశంలో కోటి సూర్యుల ప్రకాశంతో విరాజిల్లుతూ ధ్యానింపబడు) పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భగారాధ్యా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం భగారాధ్యాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుని ఆ పరమేశ్వరి తన కరుణా కటాక్ష వీక్షణములవలన ఆధ్యాత్మికా జ్ఞాన సంపదతో తేజరిల్లుచూ, భౌతికపరమైన సుఖసంతోషములతోబాటు ఆధ్యాత్మికానందమును కూడా కలిగియుండును.

భగము అనగా ద్వాదశాదిత్యులలో ఒకరు. అట్టి ద్వాదశాదిత్యులలో ఒకరైన భగముచే ఆరాధింపబడినది గనుక శ్రీమాత *భగారాధ్యా* యను నామ ప్రసిద్ధమైనది. 1) ఐశ్వర్యము, 2) ధర్మము,3) యశస్సు, 4) సిరి, 5) జ్ఞానము, 6)వైరాగ్యము - షట్భగములైన వీటిచే ఆరాధింప బడునది గనుక శ్రీమాత *భగారాధ్యా* యను నామాంకిత అయినది. సూర్యమండలము రహస్యోపాసనలకు ఆధారము గనుక సూర్యమండలమందు ఉపాసింపదగినది జగన్మాత.

1) అణిమ, 2) లఘిమ, 3) మహిమ, 4) గరిమ, 5) ఈశిత్వ, 6) వశిత్వ, 7) ప్రాకామ్య, 8) ప్రాకామ్య - అష్టభగములైన వీటిచే ఆరాధింపబడునది గనుక జగన్మాతను *భగారాధ్యా* యను నామముతో స్తుతించు చున్నాము.

*భ* ప్రకాశము లేదా కాంతి. *గ* అనగా గమనము. ప్రకాశిస్తూ గమించేవాడు సూర్యుడు. అట్టి పన్నెండు (పద్నాలుగు) మంది శ్రీవిద్యోపాసకులలో ఒకడైన సుర్యునిచే ఆరాధింపబడునది గనుక జగన్మాత *భగారాధ్యా* యను నామముతో స్తుతింపబడుచున్నది. సూర్యుడు శ్రీవిద్యోపాసనలో సిద్ధినంది జగన్మాత అనుగ్రహమువలన నవగ్రహాధిపత్యమును పొంది సర్వలోకారాధ్యుడయినాడు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భగారాధ్యాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*141వ నామ మంత్రము*

*ఓం శాంతాయై నమః*

అనుకూల ప్రతికూలములు, ప్రమాదప్రమోదములు, సుఖదుఃఖములు వంటి ద్వంద్వముల వలన ఏవిధమైన భీతి, తొట్రుపాటును చెందని నిశ్చలతయే శాంతము. ఇట్టి శాంతస్థితితో తేజరిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శాంతా* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం శాంతాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధన చేయు సాధకులకు ఆ జగన్మాత దయతో అనుకూల-ప్రతికూల, సుఖ-దుఃఖములు, ప్రమాద-ప్రమోదముల వంటి ద్వంద్వములవలన భీతి, తొట్రుపాటు చెందని నిశ్చలతను జీవనకాలమంతయు ప్రసాదించి, అంత్యమున ఆనందానుభూతి కలుగజేసి తరింపజేయును.

శమము గలది గనుకనే శాంత. అనగా కామక్రోదాధి అరిషడ్వర్గములనుమాట జగన్మాత దృష్టిలో శూన్యము. అందుకే జగన్మాత *శాంతా* యని అనబడుచున్నది. *నిష్కలం, నిశ్చలం, శాంతం* అని శ్రీమాత రూపాన్ని త్రిపురోపనిషత్తులో చెప్పబడినది. వీటికి అర్థము క్రమముగా *దోషములేనిది, స్థిమితము, ప్రశాంతత* కలిగిన రూపము శ్రీమాతది. మరి జగన్మాతకు *శాంత* యను నామము సరియైనదేగదా! సరియైనదే. అని మనంచెప్పలేదు. వశిన్యాదులు, వ్యాసభగవానులు వంటి మహిమాన్వితులే చెప్పారు. *శ* అను వర్ణము అమృతబీజము. జగన్మాత అట్టి అమృతబీజమే ఆత్మగా గలది. శాంతా అంటే సమస్తాన్నీ, ముఖ్యంగా తన ఉపాసకులకు సమస్తాన్నీ సుఖాంతం చేస్తుందని భావము. *శం* అనగా శుభము, మంగళకరము అని ఇంతకు ముందు నామ మంత్రములలో అనుకోవడం జరిగింది. లలితా సహస్రనామస్తోత్రంలో 44వ శ్లోకంలో "నిర్గుణా *నిష్కలాశాంతా* నిష్కామా నిరుపప్లవా" అను రెండవ పాదం పరిశీలిస్తే *ఆశాంతా* అనగా దిగంతములన్నియు వ్యాపించినదని కూడా యని భావించవచ్చు. అనగా జగన్మాత
*ఇందు గలదందు లేదని*
*సందేహమువలదుజనని సర్వముతానే* అనగా జగన్మాత కొంత పరిధికి మాత్రమే పరిమితంకాదు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శాంతాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీవేదవ్యాస భాగవతం - దశమస్కంధం - పూర్వార్ధభాగము - ప్రథమాద్యాయం

*రాజోవాచ*

*1.1 (ప్రథమ శ్లోకము)*

*కథితో వంశవిస్తారో భవతా సోమసూర్యయోః|*

*రాజ్ఞాం చోభయవంశ్యానాం చరితం పరమాద్భుతమ్॥8221॥*

*1.2 (రెండవ శ్లోకము)*

*యదోశ్చ ధర్మశీలస్య నితరాం మునిసత్తమ|*

*తత్రాంశేనావతీర్ణస్య విష్ణోర్వీర్యాణి శంస నః॥8222॥*

*పరీక్షిన్మహారాజు నుడివెను* "పూజ్యమహర్షీ! నీవు ఇంతవరకును సూర్యచంద్రవంశ మహారాజుల చరిత్రములను గూర్చి విపులముగా తెలిపితివి. అవి అత్యద్భుతములు. యదుమహారాజు ఎంతయు ధర్మస్వభావముగలవాడు. ఆ సుప్రసిద్ధ వంశమునందు తన యంశయైన బలరామునితోగూడి, అవతరించిన శ్రీమహావిష్ణువు (శ్రీకృష్ణుని) యొక్క వైభవ ప్రభావములను గుఱించి వినుటకు కుతూహలపడుచున్నాను. దయతో వివరింఫుము.

*1.3 (మూడవ శ్లోకము)*

*అవతీర్య యదోర్వంశే భగవాన్ భూతభావనః|*

*కృతవాన్ యాని విశ్వాత్మా తాని నో వద విస్తరాత్॰8223॥*

ఆ శ్రీహరి విరాట్ పురుషుడు (సకల ప్రాణులలో అంతర్యామియై యుండువాడు) సత్పురుషులను రక్షించుచుండెడివాడు. అట్టి పరమాత్మ యదువంశమున ఉద్భవించి చేసిన ఘనకార్యములను , ప్రదర్శించిన లీలలను సవిస్తరముగా తెలుపుము.

*1.4 (నాలుగవ శ్లోకము)*

*నివృత్తతర్షైరుపగీయమానాద్భవౌషధాచ్ఛ్రోత్రమనోభిరామాత్|*

*క ఉత్తమశ్లోకగుణానువాదాత్పుమాన్ విరజ్యేత వినా పశుఘ్నాత్॥8224॥*

ఆ పరమపురుషునియొక్క దివ్యగుణములు మహిమాన్వితములు, సుగావహములు, మధురాతి మధురములు. అట్టి గుణములను, విషయవాంఛలనుండి విముక్తులైన మహాత్ములు నిరంతరము కీర్తించుచుందురు. ఐనను, వారికి తనివితీరదు. అవి ముముక్షువుల (మోక్షముసు గోరువారి) భవరోగనులను రూపుమాపినట్టి దివ్యౌషధములు. విషయాసక్తులైనవారికి గూడ అవి వీనులవిందు గావించుచు, మనస్సులను ఆహ్లాదపఱచుచుండును. అట్టి భవ్యగుణములను కీర్తించుటకు విముఖుడైనవాడు పశుఘాతియే - అనగా ఆత్మఘాతియే.

*1.5 (ఐదవ శ్లోకము)*

*పితామహా మే సమరేఽమరంజయైర్దేవవ్రతాద్యాతిరథైస్తిమింగిలైః|*

*దురత్యయం కౌరవసైన్యసాగరం కృత్వాతరన్ వత్సపదం స్మ యత్ప్లవాః॥8225॥*

యుద్ధమున కౌరవపక్షమున నిలిచిన భీష్మాదులైన అతిరథులు దేవతలనుగూడ జయింపగల సమర్థులు. అట్టి భీష్మాదులు అనెడి తిమింగలములతో గూడినది కౌరవసైన్యమనెడి సాగరము. అపారమైన ఆ సైన్యసముద్రమును దాటుట ఎట్టివారికైనను అసాధ్యము. కాని, నా పితామహులైన పాందవులు, శ్రీకృష్ణభగవానుని పాదపద్మములనెడి నౌకను ఆశ్రయించి, ఆ సాగరమును గోష్పాదమునువలె (ఆవు డెక్కతో ఏర్పడిన గుంటను దాటినట్లు) అవలీలగా దాటిరి.

*1.8 (ఆరవ శ్లోకము)*

*ద్రౌణ్యస్త్రవిప్లుష్టమిదం మదంగం సంతానబీజం కురుపాండవానామ్|*

*జుగోప కుక్షిం గత ఆత్తచక్రో మాతుశ్చ మే యః శరణం గతాయాః॥8226॥*

శుకమహర్షీ! నా ఈ శరీరము కౌరవుల-పాండవుల (ఉభయ) వంశములు (వంశాంకురము) నిలబడుటకు మూలము. అది నా మాతృగర్భమునందు ఉన్నప్పుడే అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రముచే (బ్రహ్మశిరో నామకాస్త్రముచే) దగ్ధమైనది. అట్టి స్థితిలో మా తల్లియైన ఉత్తర కృష్ణపరమాత్మను శరణుజొచ్చినది. ఆ పురుషోత్తముడు తన సుదర్శన చక్రమును చేబూని, మా జనని గర్భమున ప్రవేశించి నన్ను పరిరక్షించెను.

PVD Subrahmanyam చెప్పారు...

*1.7 (ఏ శ్లోకము)*

*వీర్యాణి తస్యాఖిలదేహభాజా- మంతర్బహిః పూరుషకాలరూపైః|*

*ప్రయచ్ఛతో మృత్యుముతామృతం చ మాయామనుష్యస్య వదస్వ విద్వన్ ॥8227॥*

మహాత్మా! (జ్ఞానసంపన్నా!) ఆ విరాట్ పురుషుడు సకల ప్రాణుల యొక్క లోపలను, వెలుపలను విలసిల్లుచుండును. అతడు కాలస్వరూపుడై (నిమిషములు, గంటలు, దినములు మున్నగు రీతిలో కాలరూపమును పొంది) ఆత్మదృష్టిగల జ్ఞానులకు మోక్షమును ప్రసాదించుచుండును. బాహ్యదృష్టిగల అజ్ఞానులకు జనన, మరణ, క్లేశములతో గూడిన సంసారబంధములను కల్పించుచుండును. అట్టి ప్రభువు మానవరూపములొ ప్రతీతుడగుట ఆయన యొక్క లీలావిశేషమే. ఐశ్వర్యమాధుర్య విలసితములైన ఆ స్వామి లీలలను వర్ణింపుము.

సకలప్రాణులయొక్క అంతఃకరణమునందు అంతర్యామిగా నున్న భగవంతుడు వారికి అమతత్వమును (జీవనమును) ప్రసాదించుచుండును. అట్లే వెలుపల కాల స్వరూపుడై వారిని మృత్యుముఖమునకు చేర్చుచుండును. అనగా అంతర్దృష్టితో ఆ అంతర్యామిని ఉపాసించుచుండెడి ఆత్మజ్ఞానులకు ఆ స్వామి మోక్షమును ప్రసాదించుచుండును.విషయసుఖతత్పరులై కేవలము బాహ్యదృష్టిగల అజ్ఞానులకు జననమరణ రూపమైన మృత్యువునే కల్పించుచుండును.

*1.8 (ఎనిమిదవ శ్లోకము)*

*రోహిణ్యాస్తనయః ప్రోక్తో రామః సంకర్షణస్త్వయా|*

*దేవక్యా గర్భసంబంధః కుతో దేహాంతరం వినా॥8228॥*

మహామునీ! బలరాముడు రోహిణీ తనయుడని నీవు ఇదివరకు తెలిపియుంటివి. అనంతరము ఆయనను దేవకీపుత్రులలో ఒకరుగా పేర్కొనియుంటిరి. ఒకే శరీరముతో (మరియొక శరీరము ధరింపకుండ) ఇద్దఱు తల్లులకు కుమారుడెట్లయ్యెను?

*1.9 (తొమ్మిదవ శ్లోకము)*

*కస్మాన్ముకుందో భగవాన్ పితుర్గేహాద్వ్రజం గతః|*

*క్వ వాసం జ్ఞాతిభిః సార్ధం కృతవాన్ సాత్వతాంపతిః॥8229॥*

అసురులకును ముక్తినిచ్చువాడు, భక్తులకు తన వాత్సల్యమును పంచియిచ్చువాడు ఐన శ్రీకృష్ణభగవానుడు తన తండ్రి యింటినుండి (మధుర నుండి) గోకులమున (రేపల్లె) కు ఎందులకు చేరెను? భక్పవత్సలుడైన ఆ యదువంశ శిరోమణి నందాది గోపాలురతో ఎచ్చటెచ్చట నివసించెను?

*1.10 (పదియవ శ్లోకము)*

*వ్రజే వసన్ కిమకరోన్మధుపుర్యాం చ కేశవః|*

*భ్రాతరం చావధీత్కంసం మాతురద్ధాతదర్హణమ్॥8230*

బ్రహ్మదేవుని, పరమశివుని శాసింపగల ఆ ప్రభువు (కేశవుడు) గోకులమునందును, మధురలోను ఒనర్చిన లీలలు ఎట్టివి? ఆ ప్రభువునకు సాక్షాత్తుగా మేనమామయైనందున, కంసుడు వధార్హుడు కాదు గదా! మఱి ఏల చంపెను?

PVD Subrahmanyam చెప్పారు...

*1.11 (పదకొండవ శ్లోకము)*

*దేహం మానుషమాశ్రిత్య కతి వర్షాణి వృష్ణిభిః|*

*యదుపుర్యాం సహావాత్సీత్పత్న్యః కత్యభవన్ ప్రభోః॥8231॥*

సచ్చిదానందస్వరూపుడైన శ్రీకృష్ణుడు మానవరూపమును ధరించి, యదువంశజులతోగూడి, ద్వారకానగరమునందు ఎంతకాలము నివసించెను? సర్వశక్తిమంతుడైన ఆ ప్రభువునకు ఎంతమంది భార్యలు ఉండిరి.

*1.12 (పండ్రెండవ శ్లోకము)*

*ఏతదన్యచ్చ సర్వం మే మునే కృష్ణవిచేష్టితమ్|*

*వక్తుమర్హసి సర్వజ్ఞ శ్రద్దధానాయ విస్తృతమ్॥8232॥*

మహామునీ! శ్రీకృష్ణునిలీలలను గూర్చి నేను అడిగినవానిని, అడగనివానిని గూడ విపులముగా తెలుపుము. ఏలయన, సర్వజ్ఞుడవైన నీవు అందులకు సమర్థుడవు. నేను శ్రద్ధగా వినగోరుచున్నాను (వాటిని వినుటకై నేను మిగుల కుతూహలపడుచున్నాను).

*1.13 (పదమూడవ శ్లోకము)*

*నైషాతిదుఃసహా క్షున్మాం త్యక్తోదమపి బాధతే|*

*పిబంతం త్వన్ముఖాంభోజచ్యుతం హరికథామృతమ్॥8233॥*

మహాత్మా! నీ ముఖారవిందమునుండి జాలువారుచున్న శ్రీహరి కథామృతమును త్రాగు చుండుటవలన నా మనస్సు పరవశించిపోవుచున్నది. ప్రాయోపవిష్టుడవైయున్న నన్ను దుస్సహమైన ఆకలిదప్ఫులుగూడ ఏమాత్రమూ బాధించుటలేదు.

*సూత ఉవాచ*

*1.14 (పదునాలుగవ శ్లోకము)*

*ఏవం నిశమ్య భృగునందన సాధువాదం వైయాసకిః స భగవానథ విష్ణురాతమ్|*

*ప్రత్యర్చ్య కృష్ణచరితం కలికల్మషఘ్నం వ్యాహర్తుమారభత భాగవతప్రధానః॥8234॥*

*సూతుడు వచించెను* "శౌనకమహర్షీ! పరీక్షిత్తుయొక్క సముచితమైన అభ్యర్థనను ఆలకించి, భాగవత శిరోమణియైన మహాత్ముడగు శుకయోగి సవిస్తరముగా తెలుపుటకు ప్రారంభించెను. ఆ స్వామియొక్క వృత్తాంతము కలికల్మషములను రూపుమాపునట్టిది" (వక్తలయొక్క, శ్రోతలయొక్క పాపములను అంతరింపజేయునట్టిది).

*శ్రీశుక ఉవాచ*

*1.15 (పదునైదవ శ్లోకము)*

*సమ్యగ్వ్యవసితా బుద్ధిస్తవ రాజర్షిసత్తమ|*

*వాసుదేవకథాయాం తే యజ్జాతా నైష్ఠికీ రతిః॥8235॥*

*1.16 (పదునారువ శ్లోకము)*

*వాసుదేవకథాప్రశ్నః పురుషాంస్త్రీన్ పునాతి హి|*

*వక్తారం పృచ్ఛకం శ్రోతౄంస్తత్పాదసలిలం యథా ॥8236॥*

*శ్రీ శుకుడు నుడివెను* "మహారాజా! వాసుదేవుని కథలయెడ నీకుగల నిష్ఠ, అభిరుచి (నిరతి) మిగుల ప్రశంసింపదగినవి. వాటిని చక్కగా వినవలెననెడి నీ నిశ్చయబుద్ధి సముచితమైనది. శ్రీకృష్ణుని కథలను గూర్చిన ప్రస్తావనలు ప్రశ్నించువారిని, ప్రవచించెడివారిని, చదివించెడివారిని, చదివెడివారిని భక్తిశ్రద్ధలతో వినుచున్న స్త్రీ, పురుషులను ఆ శ్రీహరి పాదములనుండి ఉద్భవించి, పునీతమైన గంగాజలములవలె పవిత్రమొనర్చును.

*1.17 (పదిహేడవ శ్లోకము)*

*భూమిర్దృప్తనృపవ్యాజదైత్యానీకశతాయుతైః|*

*ఆక్రాంతా భూరిభారేణ బ్రహ్మాణం శరణం యయౌ॥8237॥*

రాజ్యాధికారములను పొందిన దైత్యులు గర్వోన్మత్తులై లక్షల సంఖ్యలో భూమండలమును ఆక్రమించిరి. వారి భారమునకు తట్టుకొనలేక శోకసంతప్తయైయున్న భూదేవి రక్షణకొరకై (భారమును తొలగించుకొనుటకై) గోరూపమున బ్రహ్మదేవుని శరణుజొచ్చెను.

*1.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*గౌర్భూత్వాశ్రుముఖీ ఖిన్నా క్రందంతీ కరుణం విభోః|*

*ఉపస్థితాంతికే తస్మై వ్యసనం స్వమవోచత॥8238॥*

ఆ దేవి ఖిన్నురాలై ఆక్రందించుచు, దైన్యముతో బొటబొట కన్నీరు కార్చుచుండెను. ఆమె ఆ పితామహుని (బ్రహ్మను) సమీపించి, ఆయనకు తన గోడును విన్నవించుకొనెను.

*1.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*బ్రహ్మా తదుపధార్యాథ సహ దేవైస్తయా సహ|*

*జగామ సత్రినయనస్తీరం క్షీరపయోనిధేః॥8239॥*

*1.20 (ఇరువదియవ శ్లోకము)*

*తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిమ్|*

*పురుషం పురుషసూక్తేన ఉపతస్థే సమాహితః॥8240॥*

అంతట బ్రహ్మదేవుడు ఆమె బాధను సావధానముగా ఆలకించెను. అనంతరము అతడు ఆ భూదేవితో, శంకరునితో, తదితర దేవతలతోగూడి, క్షీరసాగరతీరమునకు చేరెను. శ్రీమహావిష్ణువు సకలదేవతలకును ఆరాధ్యదైవము, జగద్రక్షకుడు, భక్తులయొక్క క్లేశమును తొలగించి వారిని అనుగ్రహించు ప్రభువు. అట్టి పరమ పురుషుని గూర్చిబ్రహ్మదేవుడు సమాహితచిత్తుడై (ఏకాగ్రచిత్తుడై) పురుషసూక్త మంత్రముల ద్వారా ప్రస్తుతించెను.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*716వ నామ మంత్రము*

*ఓం మాయాయై నమః*

విచిత్రమైన కార్యములు చేయుట, కోరని ఫలములు ఇచ్చుట, ఇంద్రజాలము అనిపించేది మాయయే. పరబ్రహ్మము నుండి వెలువడు శక్తియే మాయ. ఆ మాయా స్వరూపిణియైన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మాయా* అను రెండుఅక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం మాయాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు మాయామయమైన జగత్తు నుండి విడుదలై నిత్యము, సత్యము అయిన ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తనలో ఊహించుకుంటూ ఆత్మానందానుభూతితో 'తరించితిని' అను తృప్తి పొందును.

దేవీపురాణంలో

*విచిత్ర కార్యకరణా అచింతి త ఫలప్రదా|*

*స్వప్నేంద్రజాలవ ల్లోకే మాయా తేన ప్రకీర్తితా॥* (సౌభాగ్య భాస్కరం 831వ పుట)

మాయ అనేది పరబ్రహ్మనుండియే వెలువడినది. చాలా విచిత్రమైన కార్యములు నిర్వహించునది ఆ మాయయే. కోరని ఫలములను ఇచ్చేస్తుంది. అది ఒక ఇంద్రజాలమని అనిపిస్తుంది కూడా. ఈ జగత్తు అంతయు మాయయే. ఈ ప్రపంచమే ఒక మాయానాటక రంగం. ఆ నాటకరంగంలో జీవులే పాత్రధారులు. అందులో నాయకుడు, నాయకి, వారిలో అనుబంధము, అందువలన మళ్ళీ వేరేజీవులు పిల్లల పాత్రలో ప్రవేశిస్తారు. ఆ పిల్లల పాత్రధారులకు, ఆ పిల్లల జననీ జనకుల పాత్రధారులకు మధ్య అనేక సంఘటనలు. ప్రేమ, అనుబంధం, ఆరాధన, ఆరాటము అన్నీ ఉంటాయి. అందులో సాధారణంగా తల్లిదండ్రుల పాత్రలో జీవులు నిష్క్రమణ జరుగుతుంది. నాటక రంగం అలాగే తెరపడకుండా ఉంటుంది. జీవులు వివిధపాత్రధారులుగా ప్రవేశం, నిష్క్రమణ ఇలా ప్రవాహం పాత నీరుపోయి క్రొత్త జలములు వచ్చినట్లుగా ఉంటుంది. కలసి గుంపులు గుంపులుగా, అనుబంధాలతో, అనురాగాలతో జీవించడం ఆపైన దానికి సంసారం అనే పేరు కూడా ఆ గుంపునకు. ఇదంతా మాయయే. ఆంతా ఆ పరబ్రహ్మమునుండి బయటకు వచ్చినమాయయే. ఆ పరబ్రహ్మము ఎవరంటే ఇంకెవరు ఆ పరాశక్తియే. అందుకే ఆ పరాశక్తిని చమత్కారంగా *మాయా* అన్నాము. ఈ మాయను తెలుసుకోవాలంటే జ్ఞాని కావాలి. జ్ఞానికావాలంటే పరమేశ్వరి పాదములనాశ్రయిస్తే తెలుస్తుంది జగమే మాయ అని. కాని ఈ మాయ రెండు రకములు. *ఒకటి* విద్యామాయ. *రెండవది* అవిద్యామాయ.

విద్యామాయ జ్ఞానసమ్మిళితమైనది. పరమాత్మ కొరకు అన్వేషణ చేసి తెలుసుకుంటుంది. వివేకము, వైరాగ్యము అని రెండు కలుగజేస్తుంది. భగవంతుని శరణు కోరుతుంది.

రెండవది అవిద్యామాయ. మహా మాయలాడి ఈ అవిద్య. కామక్రోధాది అరిషడ్వర్గముల మధ్య నిలుపుతుంది. నేను, నాది అనే అహంకారాన్ని రెచ్చగొడుతుంది. సంసారం అనే కారాగారంలో బంధింపజేస్తుంది. విద్యామాయ వ్యక్తం అయితే అవిద్యామాయ పలాయనం చిత్తగిస్తుంది, జ్ఞానజ్యోతులతో కాంతిమయమైన పరమాత్మ సన్నిధానాన్ని తిలకిస్తుంది జీవాత్మ. ఇది ఆ జీవుని పూర్వజన్మల కర్మలవాసనా ప్రభావితంగా పనిజేస్తుంది. ఇదంతా పరమేశ్వరి విసరిన మాయాజాలమే. అందుకే ఆ *అజ్ఞానధ్వాంత దీపిక* యైన ఆ పరమేశ్వరిని శరణు వేడుతూ *ఓం మాయాయై నమః* అని స్తుతిస్తూ చేతులు జోడించి నమస్కరించవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*142వ నామ మంత్రము*

*ఓం నిష్కామాయై నమః*

తనకంటూ కోరికలు ఏమియును లేక, జీవుల కోరికలకు తానే అధిపతియై, జీవులకు సర్వకామార్థ సిద్ధిని చేకూర్చు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిష్కామా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం నిష్కామాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీమాతను ఉపాసించు సాధకునకు భౌతిక పరమైన సుఖసంతోషముల కన్నా ఆ పరమేశ్వరీ పాదార్చనయే పరమావధిగా జీవించి తరించుదురు.

జగన్మాత మన అమ్మ. మన అందరి కోర్కెలు తీర్చు తల్లి. ఆ తల్లి పరమేశ్వరుని పతిగా పొందుటతో అన్ని కోర్కెలు సిద్ధించినదై, ఇంక అంతకన్నా ఇంకేమియు కోర్కెలు లేనిదై, *నిష్కామ* గా మిగిలినది. మానవుని కోర్కెలు అనంతము. ఒకటి తీరితే ఇంకొకటి వెంటనే మరోకోరిక పుడుతుంది. మానవుడు పుట్టడమే కోరికల పొ(పు)ట్టనుండి పుట్టాడు. మానవుడంటే జీవాత్మ. పుట్టగానే నాలుగు నీటిబిందువులు జల్లగానే గతస్మృతులు మరచిపోయి *కేర్* మని ఏడవడం జరుగుతుంది. అక్కడ నుండి తన అనంతమైన కోర్కెల జాబితా వెలికి తీస్తాడు మానవుడు. జగన్మాత పరమాత్మ. భక్తుల కోరికలు తీర్చడమే పనిగా పెట్టుకున్న ఆ తల్లికి ఏముంటాయి కోరికలు. అందుకే ఆ తల్లిని *నిష్కామా* అను నామంతో భక్తిగా స్మరిస్తాము.

*అవాప్తాఖిలకామాయాః తృష్ణా కిం విషయా భవేత్?*(సౌభాగ్యభాస్కరం 345వ పుట).
సకల కోరికలు పొంది (పరమేశ్వరుని భర్తగా పొందుటయే ఆ తల్లి అసలైన కోరిక) ఉన్న శ్రీమాతకు ఏ కోరికా లేదు. తానే సకల జీవులకు ఏమికావాలో (ధర్మబద్ధమైనవి) వాటిని తానే సిద్ధింప జేస్తుంది. ఏ విధమైన కోరికలు లేనిదైన పరమేశ్వరి *నిష్కామా*. ఆ తల్లి కోరికలకు అతీతమైనది గనుకనే *నిష్కామా* అని నామ ప్రసిద్ధమైనది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిష్కామాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*1.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*గిరం సమాధౌ గగనే సమీరితాం నిశమ్య వేధాస్త్రిదశానువాచ హ|*

*గాం పౌరుషీం మే శృణుతామరాః పునర్విధీయతామాశు తథైవ మా చిరమ్॥8241॥*

పిమ్మట బ్రహ్మదేవుడు సమాధిస్థితియందు అశరీరవాణిని విని, అనంతరము దేవతలతో ఇట్లనెను- "సురులారా! ఆ పురుషోత్తముని వచనములను నేను వింటిని. వాటిని మీరు శ్రద్ధగా వినుడు. ఇక ఏమాత్రమూ విలంబము చేయక ఆ శ్రీహరి వచనములను శిరసావహింపుడు.

*1.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*పురైవ పుంసావధృతో ధరాజ్వరో భవద్భిరంశైర్యదుషూపజన్యతామ్|*

*స యావదుర్వ్యా భరమీశ్వరేశ్వరః స్వకాలశక్త్యా క్షపయంశ్చరేద్భువి॥8242॥*

సర్వేశ్వరుడైన శ్రీహరి భూదేవిక్లేశమును గూర్చి, ఇంతకుపూర్వమే ఎఱుగును. అందువలన మీరు మీమీ అంశలతో యదువంశమునందు జన్మింపుడు. ఆ ప్రభువు తన కాలశక్తి ప్రభావమున భూభారమును తొలగించుచు తన లీలలను ప్రదర్శించుచున్నంతవరకును మీరు అందరును ఆ స్వామిని అనుసరించుచు సంచరించుచుందురు.

*1.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*వసుదేవగృహే సాక్షాద్భగవాన్ పురుషః పరః|*

*జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రియః॥8243॥*

పరమపురుషుడైన శ్రీమహావిష్ణువు వసుదేవుని యింట స్వయముగా (కృష్ణభగవానుడై) అవతరింఫగలడు. కనుక ఆ స్వామిని సేవించుటకై సురభామినులు (దేవతలు) ఎల్లరును (గోపికలై) జన్మింపవలెను.

*1.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*వాసుదేవకలానంతః సహస్రవదనః స్వరాట్|*

*అగ్రతో భవితా దేవో హరేః ప్రియచికీర్షయా॥8244॥॥*

వేయిపడగలుగల ఆదిశేషుడు (అనంతుడు) ఆ శ్రీహరియొక్క అంశయే. అతడు కర్మవశుడుగాడు. అనగా కర్మలఫలములను అనుభవించుట కొఱకై జన్మించుచున్నవాడు కాదు. శ్రీహరి కృష్ణుడై అవతరింపకముందే ఆ అనంతుడు ఆ స్వామికి ప్రియములైన కర్మలను ఆచరించుటకై ముందుగా అవతరించును.

*1.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*విష్ణోర్మాయా భగవతీ యయా సమ్మోహితం జగత్|*

*ఆదిష్టా ప్రభుణాంశేన కార్యార్థే సంభవిష్యతి॥8245॥*

జగత్తును మోహములో ముంచివేయునట్టి యోగమాయ ఆ హరి అధీనములో ఉండి మసలుకొనుచుండును. ఆ దివ్యమాయ స్వామి ఆదేశానుసారము ఆయన లీలలను కార్యరూపమున సఫలమొనర్చుటకై దైవాంశముతో ప్రాదుర్భవించుచుండును".

*శ్రీశుక ఉవాచ*^

*ఇత్యాదిశ్యామరగణాన్ ప్రజాపతిపతిర్విభుః|*

*ఆశ్వాస్య చ మహీం గీర్భిః స్వధామ పరమం యయౌ॥8246॥*

*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! ప్రజాపతులకు నాయకుడు, సృష్టికర్తయు ఐన బ్రహ్మదేవుడు దేవతలను ఈ విధముగా ఆదేశించి, తగినట్లుగా మృదుమధురవచనములతో భూదేవికి ఊరట గూర్చెను. అనంతరము అతడు తన సత్యలోకమునకు వెళ్ళెను.

*1.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*శూరసేనో యదుపతిర్మథురామావసన్ పురీమ్|*

*మాథురాంఛూరసేనాంశ్చ విషయాన్ బుభుజే పురా॥8247॥*

పూర్వకాలమున యదువంశప్రభువైన శూరసేనుడు మధురానగరమున నివసించుచుండెను. ఆ రాజు మాథురదేశ వాసులను, శూరసేనదేశ ప్రజలను చక్కగా పరిపాలించుచుండెను.

*1.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*రాజధానీ తతః సాభూత్సర్వయాదవభూభుజామ్|*

*మథురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరిః॥8248॥*

యాదవమహారాజులకు అందరికీని ఆ మథురాపురము రాజధానియై యుండెను. ఆ పట్టణమే సర్వేశ్వరుడైన శ్రీహరికి అవతారస్థానము ఐనది.

*1.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*తస్యాం తు కర్హిచిచ్ఛౌరిర్వసుదేవః కృతోద్వహః|*

*దేవక్యా సూర్యయా సార్ధం ప్రయాణే రథమారుహత్॥8249॥*

ఒకానొకప్పుడు శూరుని కుమారుడైన వసుదేవుడు ఆ మథురానగరము నందే దేవకీదేవిని పెండ్లియాడెను. అనంతరము అతడు తన నవవధువు (భార్య) తోగూడి స్వగృహమునకు చేరుటకై రథమునందు ఆసీనుడయ్యెను.

*1.30 (ముప్పదియవ శ్లోకము)*

*ఉగ్రసేనసుతః కంసః స్వసుః ప్రియచికీర్షయా|*

*రశ్మీన్ హయానాం జగ్రాహ రౌక్మై రథశతైర్వృతః॥8250॥*

ఉగ్రసేనమహారాజు కుమారుడైన కంసుడు తన చెల్లెలగు దేవకికి ప్రీతిని గూర్చుటకై సారథియై రథాశ్వముల కళ్ళెములను చేబూనెను. ఆయన రథమును పెక్కు బంగారు రథములు అనుసరించియుండెను.

PVD Subrahmanyam చెప్పారు...

*1.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*చతుఃశతం పారిబర్హం గజానాం హేమమాలినామ్|*

*అశ్వానామయుతం సార్ధం రథానాం చ త్రిషట్శతమ్॥8251॥*

*1.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*దాసీనాం సుకుమారీణాం ద్వే శతే సమలంకృతే|*

*దుహిత్రే దేవకః ప్రాదాద్యానే దుహితృవత్సలః॥8252॥*

కూతురుపై ప్రేమానురాగములుగల దేవకుడు (ఉగ్రసేనుని సోదరుడు, దేవకికి తండ్రి) బంగారు ఆభరణములతో అలంకరింపబడిన నాలుగువందల ఏనుగులను, పదునైదువేల గుర్రములను, పదునెనిమివందల రథములను, చక్కని వస్త్రాభరణములను అలంకరించుకొనిన సుకుమారులగు రెండువందలమంది దాసీలను దేవకీదేవికి ఆ ప్రయాణ శుభసమయమున కానుకలుగా ఇచ్చెను.

*1.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*శంఖతూర్యమృదంగాశ్చ నేదుర్దుందుభయః సమమ్|*

*ప్రయాణప్రక్రమే తావద్వరవధ్వోః సుమంగళమ్॥8253॥*

ఆ ప్రయాణ సంతోషసమయమున నవనధూవరులకు మంగళసూచకముగా శంఖములు పూరింపబడినవి. తూర్యఘోషలు, మృదంగధ్వనులు, ఢంకానాదములు మిన్నుముట్టినవి.

*1.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*పథి ప్రగ్రహిణం కంసమాభాష్యాహాశరీరవాక్|*

*అస్యాస్త్వామష్టమో గర్భో హంతా యాం వహసేఽబుధ॥8254॥*

మార్గమున ప్రయాణము కొనసాగుచుండగా రథాశ్వముల పగ్గములను పట్టుకొనియున్న కంసునితో ఆకాశవాణి ఇట్లు పలికెను - "మూర్ఖుడా! నీవు రథముపై తీసుకొని వెళ్ళుచున్న ఈ దేవకిదేవి యొక్క అష్టమసంతానము నిన్ను హతమార్చును".

*1.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*ఇత్యుక్తః స ఖలః పాపో భోజానాం కులపాంసనః|*

*భగినీం హంతుమారబ్ధః ఖడ్గపాణిః కచేఽగ్రహీత్॥8255॥*

కంసుడు మిగుల క్రూరుడు. అతడు భోజవంశజులలో అధముడు, వంశమునకే మచ్చదెచ్చినవాడు. ఆ మహాపాపి ఆకాశవాణి మాటలను విన్నంతనే క్రుద్ధుడై, ఖడ్గమును చేబూని, తన చెల్లెలగు దేవకి కొప్పుపట్టుకొని ఆమెను చంపుటకు సిద్ధపడెను.

*1.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*తం జుగుప్సితకర్మాణం నృశంసం నిరపత్రపమ్|*

*వసుదేవో మహాభాగ ఉవాచ పరిసాంత్వయన్॥8256॥*

కఠినాత్ముడైన కంసుడు సిగ్గుమాలినవాడై నింద్యమైనపనికి పూనుకొనగా (చెల్లెలిని చంపుటకు ఉద్యుక్తుడుకాగా) మహాత్ముడైన వసుదేవుడు అతనిని బుజ్జగించుచు ఇట్లనెసు.

*వసుదేవ ఉవాచ*

*1.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*శ్లాఘనీయగుణః శూరైర్భవాన్ భోజయశస్కరః|*

*స కథం భగినీం హన్యాత్స్త్రియముద్వాహపర్వణి॥8257॥*

*వసుదేవుడు ఇట్లు చెప్పెను* - "రాజకుమారా! నీవు ఎల్లరకును ఆదరణీయుడవు. నీ గుణములను శూరులును మెచ్చుకొందురు. అంతేగాదు, నీవు భోజవంశమునకే వన్నెదెచ్చెడి వాడవు. అట్టి ఉత్తముడవైన నీవు నవనధువైన నీ చెల్లెలు మెట్టినింటికి వెళ్ళుచున్న ఈ శుభసమయమున ఆమె కాళ్ళపారాణి ఆరకముందే ఇట్లు చంపబూనుట పాడిగాదు. ఇది ఘోరకృత్యుము.

*1.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహ జాయతే|*

*అద్య వాబ్దశతాంతే వా మృత్యుర్వై ప్రాణినాం ధ్రువః॥8258॥*

మహావీరుడా! పుట్టిన ప్రతిప్రాణియు గిట్టుట సహజము. పుట్టినవెంటనే నీడవలె మృత్యువు గావచ్చును లేక, నూఱేండ్లకైనను గావచ్చును. కావున, ప్రాణులకు మరణము నిశ్చితముగదా!

*1.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*దేహే పంచత్వమాపన్నే దేహీ కర్మానుగోఽవశః|*

*దేహాంతరమనుప్రాప్య ప్రాక్తనం త్యజతే వపుః॥8259॥*

దేహమునకు మృత్యువు ఆసన్నమైనప్పుడు దేహిా(జీవాత్మ) తన సుకృత దుష్కృత కర్మలను అనుసరించి, మరియొక దేహమును పొంది, అప్పటి (పూర్వ) దేహమును త్యజించును. దేహి సర్వదా కర్మవశుడేగాని, స్వతంత్రుడు గాడు.

*1.40 (నలుబదియవ శ్లోకము)*

*వ్రజంస్తిష్ఠన్ పదైకేన యథైవైకేన గచ్ఛతి|*

*యథా తృణజలూకైవం దేహీ కర్మగతిం గతః॥8260॥*

మనుష్యుడు నడచుచున్నప్పుడు మొదటి అడుగు కుదురుకొనిన పిమ్మటనే, రెండవ అడుగు వేయును. ప్రతిప్రాణియు తన కర్మలను అనుసరించి, తృణజలూక న్యాయమున మరియొక దేహమును త్యజించును.

గడ్డిపురుగు ప్రాకునపుడు ముందటి గడ్డిపోచను పట్టుకొనకుండా, తానున్న (వెనుకటి) గడ్డిపోచను విడువదు. దీనిని తృణజలూకన్యాయము అని యందురు. అట్లే 'జీవుడు మరియొక దేహమును చూచుకొనకుండా పూర్వదేహమును విడిచి పెట్టడు' అని దీనివలన సూచింప బడుచున్నది.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*717వ నామ మంత్రము*

*ఓం మధుమత్యై నమః*

వైదికమగు మధుమతీ విద్యాస్వరూపిణిగా తేజరిల్లు జగదీశ్వరికి నమస్కారము.

యోగశాస్త్రమందలి నాల్గవ ప్రజ్ఞాభూమికా (మధుమతి) స్వరూపురాలైన తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మధుమతీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం మధుమత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకుడు జీవనమంతయు సుఖసంతోషములతోను, సిరిసంపదలతోను వర్ధిల్లుటయేగాక, ఆధ్యాత్మిక జ్ఞానసంపదతో జగన్మాత పాదసేవలో తరించును.

జగన్మాతను ఆరాధించునపుడు పట్టుతేనె వాడుదురు. అనగా పుష్పములనుండి తేనెటీగలు తెచ్చిన తేనె పూలలోని మకరందముకన్నా మధురముగా ఉండును. దానికి కారణము వివిధ ఫుష్పముల కలబోతగా తేనెతుట్టెలో చేరిన తేనె. అంత మధురమైన తేనెను పరమేశ్వరి పూజాద్రవ్యముగా వాడుతున్నారు గనుక, అంత ముధురమైన పట్టుతేనె జగన్మాతకు ప్రీతి గనుక జగన్మాత *మధుమతీ* అని నామాంకిత అయినది. *నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్ఛపీ* అని 27వ నామ మంత్రములో అని నట్లు సరస్వతీ దేవి వీణ అయిన కచ్ఛపీ వీణకన్నా మధురముగా జగన్మాత పలుకులు ఉంటాయి అంటే, పట్టుతేనెలోని తీయదనాన్ని తన పలుకుల మధురిమలో సమ్మిళతం చేయుట చేతనే ఆంత మధురిమ సంతరించుకుంది. అందుచేతనే ఆ తల్లి *మధుమతీ* అని నామాంకిత అయినదని భావించక తప్పదు. ఇంకొక విషయమేమంటే శ్రీమాతను ఆరాధించునపుడు మధువు (తేనె)తో ఆరాధన చేసినపుడు సాధకుడు సౌందర్యవంతుడు కాగలడని అంటారు. జగన్మాతను *మధుమతీ* అను నామముతో స్తుతించడానికి ఇదికూడా కారణం కావచ్చు. వేదములలో చెప్పబడిన మధుమతీ విద్యాస్వరూపురాలు జగన్మాత. ఎందుకంటే జగన్మాత *వేదవేద్యా* - వేదములద్వారా తెలియదగినది అని 335వ నామ మంత్రముతో స్తుతింపబడినది. యోగశాస్త్రములో నలుగురు యోగులను చెప్పారు. వారిలో నాల్గవయోగి మొదటి ముగ్గురి కంటెను ఉత్తముడు. అలా ఉత్తముడు అయినప్పటికిని ఈ నాల్గవయోగి యోగశాస్త్రములోని ప్రజ్ఞాభూమికలను అతిక్రమించవలయును. ఆ ఫ్రజ్ఞాభూమికలలో నాలుగవ భూమికకు *మధుమతి* యని పేరు. జగన్మాత అటువంటి మధుమతీ భూమికా స్వరూపురాలు గనుక అమ్మవారిని *మధుమతీ* అని యన్నారు. ఈ నాల్గవభూమికయందు సంప్రాప్తించిన జ్ఞానము సంసారము నుండి తరింపజేయును కావున ఆ నాల్గువ భూమికకు సంసార తారకయని పేరు గలదని యోగమాత్రభాష్యాదులలో స్పష్టము చేయబడినది. అది ఏమనిన 'జగన్మాత మధుమతీ స్వరూపురాలై, అట్టి *మధుమతీ* స్వరూపురాలు సంసారమునుండి తరింపజేయునది, అన్ని విధముల అన్నిటిని తెలిసికొనునది, క్రమము లేకుండ సంభవించునది, ప్రకృతి పురుషుల వివేకముచే కలిగినదియునగు జ్ఞానస్వరూపురాలు'. *మధుమతీ* అను నదీ స్వరూపురాలు జగన్మాత. అట్టి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మధుమత్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*143వ నామ మంత్రము*

*ఓం నిరుపప్లవాయై నమః*

శ్రీమాత ఆద్యంత రహితురాలు, ఆత్మస్వరూపిణి గాన నాశరహితురాలు. అటువంటి ఆదిపరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిరుపప్లవా* యను ఐదక్షరముల నామ మంత్రమును *ఓం నిరుపప్లవాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంతభక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకునకు జీవాత్మపరమాత్మలు ఒకటేయను అద్వైతభావము ఇనుమడించి, సకలమూ ఆ పరమాత్మలోనే తిలకించుచూ ఆధ్యాత్మికానందమును నిత్యము అనుభవించుచునేయుండును. తన్మూలంగా పరబ్రహ్మ స్వరూపిణియైన జగన్మాతయందు అనన్యభక్తితత్పరతతో జన్మతరించినదియని సంతసించును.

ఆత్మ అనునది శరీరములో ఉండును. శరీరమునకు బాల్యము, యౌవనము, కౌమారము, వార్ధక్యము అను స్థితులు కలిగియుండును. పాతవస్త్రమును విడిచి క్రొత్తవస్త్రమును ధరించినట్లు ఆత్మ ఒక శరీరమును వదలి వేరొక శరీరమును ఆశ్రయించును. అంటే శరీరము మాత్రము నాశనముగును గాని ఆత్మకు నాశనములేదు. శ్రీమాత ఆత్మస్వరూపిణి. పరమాత్మస్వరూపిణి. అటువంటి తల్లికి నాశనము ఉండదు. సృష్టి,స్థితి,లయలకు అతీతంగా ఉంటుంది గనుక జగన్మాత *నిరుపప్లవా* అను నామాంకిత అయినది.

*ఉపప్లవము* అను పదమునకు దగ్గరలో ఉన్న నీటిలో తేలియాడునది అనగా పడవ. సంసారమను నడిసముద్రంలో జగన్మాత ఒడ్డుకు చేర్చు పడవ వంటిది. సంసారసాగరము నుండి బయటపడు తరుణోపాయము జగన్మాతయే.

ఇక్కడ నిరుపప్లవమను పదమును:-
*నిర్* అనగా సంపూర్తిగా,నిశ్శేషముగా,

*ఉప* అనగా సమీపములో నున్నది

*ప్లవము* అనగా అమృత ప్రవాహము

సాధకుడు తన తీవ్రసాధనలో కుండలినీ శక్తిని మూలాధారములో జాగృతముజేసి, బ్రహ్మ, విష్ణ, రుద్రగ్రంథుల ఛేదనముతో, షట్చక్రములు దాటి సహస్రారమునందు చంద్రమండలములో అమృతధారలవృష్టిని కలుగజేయగా, ఆ అమృతస్రావముతో సాధకుని డెబ్బదిరెండువేల నాడీమండలాన్ని తడిసి బ్రహ్మజ్ఞాన సంపదతో తరించుతాడు. అందుచేత జగన్మాత *నిరుపప్లవా* అను నామాంకిత అయినది.

జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఉపాసించు ఉపాసకులకు ఏవిధమైన ఆపదలు కలుగవు. ఉపద్రవములేర్పడవు. భవసాగరమునుండి విముక్తుడై జీవన్ముక్తుడగును. గాన జగన్మాత *నిరుపప్లవా* యను నామాంకితగా భక్తులచే స్తుతింపబడుచున్నది.

ఆ తల్లికి నమస్కరించునపుడు *ఓం నిరుపప్లవాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమద్భాగవత మహాపురాణ పఠనంపై*

*బ్రహ్మశ్రీ తోపెల్ల సత్యనారాయణ మూర్తిగారు,శ్రీవిద్యోపాసకులు, సంస్కృతాంధ్ర పండితులు, ప్రముఖ ఆధ్యాత్మిక విశ్లేషకులు, వారి మాటల్లో....*

అద్వైత సాగరాన్ని మధిస్తే వచ్చే నవనీతం భాగవతం. భగవంతుని అవతారాల్లో దేని వైభవం దానికే ఉన్నప్పటికీ రామ, కృష్ణ అవతారాల విషయంలో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అని శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని అంటాము. దీనిని బట్టి ఈ రెండు అవతార మూర్తులు పరబ్రహ్మ తత్త్వాన్ని అందిస్తాయని తెలుస్తోంది. ధర్మ నిష్ఠ రామాయణం అనుగ్రహిస్తే భక్తి భాగవతం అందిస్తుంది. భాగవతంలో నవరసాలు ఆయా ఘట్టాలలో వర్ణింపబడినా అంతటా భక్తి పూలదండలో దారం మాదిరిగా అనుస్యూతంగా ఉంటుంది. ఇదే భాగవతం ప్రత్యేకత. ఇంతటి మహత్తరమైన శ్రీమద్భాగవత మహాపురాణాన్ని అందరూ చదవాలి, చదివించాలి, అందరూ ధన్యులు కావాలి

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

PVD Subrahmanyam చెప్పారు...

*7.11.2020 మధ్యాహ్న సందేశము*

*శ్రీ పద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము*

*కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|*

*కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్*

*మొదటి అధ్యాయము - మూడవ భాగము*

*దేవర్షి నారదుడు భక్తిదేవిని కలియుట*

సనకసనందనాది నలుగురు ఋషులు నిర్మలమైన వారు. ఒకదినము వారు సత్సంగము కొరకై విశాలపురము అనగా బదరీ నారాయణ క్షేత్రమునకు విచ్చేసిరి. అచట వారు నారదుని చూచిరి.

*సనకాది మునులు పలికిరి*- మహర్షీ! మీరెందులకు దీనముఖముతో ఉన్నారు? మీరేల చింతాక్రాంతులై యున్నారు?ఇప్పుడు మీరు ఎచటినుండి వచ్చుచున్నారు? తిరిగి ఇంత తొందర తొందరగా మీరు ఎచటికి పోవుచున్నారు? సకల సంపదలను కోల్పోయిన వ్యక్తివలె మీరు ఎంధుకు బాధపడుచున్నారు? మీవంటి అనాసక్తులైన పురుషులకు ఇది సముచితము కాదు కదా? దీనికి కారణమేదియో తెలుపుడు.

*నారదుడు పలికెను*- నేను ఈ పుడమిని అన్ని లోకములలో కెల్ల ఉత్తమమైనదని భావించి ఇచటికి చేరితిని. ఇక్కడ పుష్కరము, ప్రయాగ, కాశీ, గోదావరి (నాసిక్), హరిద్వారము, కురుక్షేత్రము, శ్రీరంగము, సేతుబంధనము (రామేశ్వరము) మొదలగు అనేక తీర్థస్థానములందు ఇటునటు విహరించుచుంటిని. కాని, నాకు ఎచటనూ సుఖసంతోషములను కలిగించునట్టి శాంతి లభించలేదు. ఇప్పుడు అధర్మమునకు తోడ్పడునట్టి కలియుగము తాండవించుచున్నది. అది సమస్త భూమండలమున బాధించుచున్నది. ఇప్పుడిక్కడ సత్యము లేనేలేదు. ఇక తపస్సు, శౌచము అనగా బాహ్యాభ్యంతరముల పవిత్రత, దయ, దానము మున్నగునవి ఏవియును లేవు. జీవుల నామమాత్రులై కేవలము ఉదరపోషణయందే నిమగ్నమైయున్నారు. వీరు అసత్యవాదులై, సోమరిపోతులై, బుద్ధిహీనులై , దురదృష్టవంతులై, ఆపదలలో చిక్కుకొన్నవారై యున్నారు. సాధువులను, సత్పురుషులము అని చెప్పుకొనువారందరు పాషండులై యున్నారు. వీరు చూచుటకు వైరాగ్యవంతులుగా కనిపించుచు స్త్రీలను, ధనాదులను పరిగ్రహించుచుందురు. ఇండ్లలో ఆడవారే పెత్తనము చలాయించెదరు. బావమరుదులు సలహాదారులై యుందురు. లోభముచే కన్యలను విక్రయించుచుందురు. భార్యాభర్తలు ఎల్లవేళల పోట్లాడుకొనుచుందురు. మహాత్ముల ఆశ్రమములమీద, పవిత్రతీర్థ స్థానములమీద, నదులమీద, యవనులు అధికారమును చేజిక్కించుకొనిరి. ఆ దుష్టులు అనేక దేవాలయములను ధ్వంసమేనర్చిరి. ఇప్పుడు ఈ నేలమీద యోగులుగాని, సిద్ధపురుషులుగాని, జ్ఞానులుగాని, సత్కర్మలు చేయువారుగాని లేరు. సమస్త సాధనములు కలిరూపమైన దావానలముచేత భస్మమైపోయినవి. ఈ కలియుగమునందు జన్మించినవారిలో పెక్కుమంది విపణి వీధులయందు అన్నమును అమ్ముకొనుచున్నారు. బ్రాహ్మణులు ధనమును తీసికొని వేదములను విక్రయించుచున్నారు. స్త్రీలు సదాచారహీనులై (వేశ్యావృత్తితో) జీవితమును గడుపుచున్నారు. *అట్టమన్నం శివోవేదః శూలో విక్రయ ఉచ్యతే| కేశోభగమితి ప్రోక్తమృషిభిస్తత్ప్వ దర్శిభిః॥*

ఈ విధముగా కలికాలమునందలి దోషములను పరికించుచు, ఈ భూమిమీద నేను సంచరించుచు శ్రీకృష్ణభగవానుని లీలలకు నిలయమైన యమునానదీ తీరమును చేరితిని. మునివర్యులారా! వినుడు! అక్కడ నేను ఒక గొప్ప ఆశ్చర్యమును తిలకించితిని. అచట ఒక యువతి ఖిన్నురాలై కూర్చొనియుండెను. ఆమె ప్రక్కన పడియున్న ఇరువురు ముసలివారు నిశ్చేష్టులై, నిట్టూర్పులను విడుచుచుండిరి. ఆ యువతి వారికి సేవలు చేయుచు, చైతన్యవంతులుగా చేయుటకు ప్రయత్నించుచుండెను. వారి యెదుట కూర్చునియున్న ఆమె అప్ఫుడప్పుడు ఏడ్చుచుండెను. ఆ యువతి తనను రక్షించెడి పరమాత్మునికొరకై దశదిశలయందు వెదకుచుండెను. ఆమెకు నాలుగువైపుల వందలకొలది స్త్రీలు నిలబడి వింజామరలు వీచుచు, ఆమెను పదేపదే ఓదార్చుచుండిరి. కొంతదూరము నుండి ఈ విషయమును గమనించిన నేను కుతూహలముతో ఆమె దగ్గరకు వెళ్ళితిని. నన్ను చూచి ఆమె నిలబడెను. మిక్కిలి కలతనొందినదై ఆమె నాతో ఇట్లు చెప్పసాగెను.

*శ్రీమద్భాగవత మహాత్మ్యము - ప్రథమాధ్యాయము* తరువాయి భాగము రేపు మధ్యాహ్మము....

*🙏🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏🙏*

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

PVD Subrahmanyam చెప్పారు...

*3.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*మర్త్యో మృత్యువ్యాలభీతః పలాయన్ లోకాన్ సర్వాన్నిర్భయం నాధ్యగచ్ఛత్|*

*త్వత్పాదాబ్జం ప్రాప్య యదృచ్ఛయాద్య స్వస్థః శేతే మృత్యురస్మాదపైతి॥8358॥*

స్వామీ! మానవుడు మృత్యువు (జననమరణ రూప సంసారము) అనెడి సర్పమునకు భయపడి దానినుండి తప్పించుకొనుటకై అనేక లోకములకు పరుగులు దీయుచుండును. ఐనప్పటికిని అతనికి నిర్భయస్థానము ఎచ్చటను లభింపదు. కాని అదృష్టవశమున అతడు నీ పాదపద్మములను ఆశ్రయించి, స్వస్థుడై ప్రశాంతముగా (గుండెమీద చేయివేసికొని) జీవించును. అనగా జననమరణ రూప సంసారభయము నుండి ముక్తుడగును. ఇక, మృత్యువు అతని దరిదాపులకును చేరదు.

*3.28 (ఇరువది ఎనిమిదగవ శ్లోకము)*

*స త్వం ఘోరాదుగ్రసేనాత్మజాన్నస్త్రాహి త్రస్తాన్ భృత్యవిత్రాసహాసి|*

*రూపం చేదం పౌరుషం ధ్యానధిష్ణ్యం మా ప్రత్యక్షం మాంసదృశాం కృషీష్ఠాః ॥8359॥*

ప్రభూ! నీవు భక్తుల భయమును తొలగించి, అభయమిచ్చువాడవు. దుష్టుడైన ఉగ్రసేనుని పుత్రుడగు కంసునకు భయపడి జీవించుచున్న మమ్ములను కాపాడుము. పరమపురుషా! దివ్యమైన నీ ఈ చతుర్భుజరూపము మహాయోగులకు ధ్యానైక గమ్యము. కనుక దేహాభిమానులగు వారికి, ఈ చర్మచక్షువులకు ఇట్టి నీ భవ్యరూపమును ప్రకటింపవలదు.

*3.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*జన్మ తే మయ్యసౌ పాపో మా విద్యాన్మధుసూదన|*

*సముద్విజే భవద్ధేతోః కంసాదహమధీరధీః॥8360॥*

మధుసూదనా! నీవు నాయందు జన్మించిన విషయము పాపాత్ముడైన ఈ కంసుడు ఎఱుంగరాదు. నీ కారణముగా కంసునివలన ఎట్టిప్రమాదము వాటిల్లునోయని నా మనస్సు మిగుల భయకంపితమగుచున్నది.

*3.30 (ముప్పదియవ శ్లోకము)*

*ఉపసంహర విశ్వాత్మన్నదో రూపమలౌకికమ్|*

*శంఖచక్రగదాపద్మశ్రియా జుష్టం చతుర్భుజమ్॥8361॥*

*3.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*విశ్వం యదేతత్స్వతనౌ నిశాంతే యథావకాశం పురుషః పరో భవాన్|*

*బిభర్తి సోఽయం మమ గర్భగోఽభూదహో నృలోకస్య విడంబనం హి తత్॥8362॥*

విశ్వరూపా! చతుర్భుజముల యందును శంఖ, చక్ర, గదా, పద్మములతో విరాజిల్లెడి నీ ఈ అలౌకిక (దివ్య) రూపమును ఉపసంహరింపుము. సర్వేశ్వరా! పరమపురుషుడవైన నీవు చిదచిదాత్మకమైన (జడచైతన్యాత్మకమైన) ఈ విశ్వమును ప్రళయకాలమున నీ గర్భమున (నీ యందు) ధరించియుందువు. అట్టి లోకారాధ్యుడవైన నీవు నేడు నా గర్భస్థుడవైతివి. మర్త్యలోకమునుఅనుసరించిన నీ ఈ లీల మిక్కిలి ఆశ్చర్యకరము".

*శ్రీభగవానువాచ*

*3.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*త్వమేవ పూర్వసర్గేఽభూః పృశ్నిః స్వాయంభువే సతి|*

*తదాయం సుతపా నామ ప్రజాపతిరకల్మషః॥8363॥*

*భగవంతుడు నుడివెను* తల్లీ! స్వాయంభువ మన్వంతరమున నీవు పూర్వజన్మలో *పృశ్ని* అను సాధ్వీమణివి. మహాత్ముడైన ఈ వసుదేవుడు *సుతపుడు* అను పేరుతో ప్రజాపతిగా వర్ధిల్లెను. మీ ఇరువురి హృదయములును నిర్మలములు.

*3.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*యువాం వై బ్రహ్మణాఽఽదిష్టౌ ప్రజాసర్గే యదా తతః|*

*సన్నియమ్యేంద్రియగ్రామం తేపాథే పరమం తపః॥8364॥*

అమ్మా! బ్రహ్మదేవుడు ప్రజాసృష్టికి మీ ఇద్దరిని ఆదేశించెను.అంతట మీరు ఇంద్రియనిగ్రహముతో ఉత్కృష్టమైన తపశ్చర్యకు పూనుకొంటిరి.

*3.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*వర్షవాతాతపహిమఘర్మకాలగుణానను|*

*సహమానౌ శ్వాసరోధవినిర్ధూతమనోమలౌ॥8365॥*

*3.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*శీర్ణపర్ణానిలాహారావుపశాంతేన చేతసా|*

*మత్తః కామానభీప్సంతౌ మదారాధనమీహతుః॥8366॥*

*3.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*ఏవం వాం తప్యతోస్తీవ్రం తపః పరమదుష్కరమ్|*

*దివ్యవర్షసహస్రాణి ద్వాదశేయుర్మదాత్మనోః॥8367॥*
అప్పుడు మీరు ఇరువురును కాలానుగుణములైన వర్షములను, పెనుగాలులను, బలమైన ఎండబాధలను, తీవ్రమైన చలితాకిడులను, దుర్భరమైన వేసవితాపములను సహించితిరి. ప్రాణాయామసాధన ద్వారా మనోమాలిన్యములను కడిగివేసికొంటిరి. ఆ తపశ్చర్యా సమయమున చెట్లనుండి రాలిపడిన ఎండుటాకులను మాత్రమే తినుచు కాలము గడిపితిరి. క్రమముగా వాటినిగూడ మానివైచి, వాయువును ఆహారముగా స్వీకరించితిరి. ఈ విధముగా మీరు ప్రశాంతచిత్తులై, నానుండి మీ అభీష్టములను తీర్చుకొనుటకై నన్ను ఆరాధించితిరి. పవిత్రాత్ములారా! ఈ విధముగా మీరు నాయందే చిత్తములను నిల్పి, పన్నెండువేల దివ్యసంవత్సరముల పాటు, తీవ్రమైన రీతిలో మిగుల దుష్కరమైన తపస్సును ఆచరించితిరి.

PVD Subrahmanyam చెప్పారు...

*3.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*తదా వాం పరితుష్టోఽహమమునా వపుషానఘే|*

*తపసా శ్రద్ధయా నిత్యం భక్త్యా చ హృది భావితః॥8368॥*

*3.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*ప్రాదురాసం వరదరాడ్ యువయోః కామదిత్సయా|*

*వ్రియతాం వర ఇత్యుక్తే మాదృశో వాం వృతః సుతః॥8369॥*

అమ్మా! అత్యంత భక్తిశ్రద్ధలతో నిరంతరము నన్నే మీ హృదయములయందు స్మరించుచు నిరాహారపూర్వకముగా తీవ్రమైన తపస్సునొనర్చితిరి. అంతట మీ తపశ్చర్యలకు మిగుల పరితుష్టుడనై, వరప్రదుడనైన నేను మీ మనోరథములను ఈడేర్చుటకై ఈ చతుర్భుజరూపమున మీకు సాక్షాత్కరించితిని. 'వరములను కోరుడు' అని పలుకగా, మీరు నావంటి కుమారుని ప్రసాదించవలసినదిగా కాంక్షించితిరి.

*3.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*అజుష్టగ్రామ్యవిషయావనపత్యౌ చ దంపతీ|*

*న వవ్రాథేఽపవర్గం మే మోహితౌ మమ మాయయా॥8370॥*

మీరు తుచ్ఛములైన విషయసుఖముల స్పర్శలేనట్టి పవిత్ర దంపతులు. అట్టి మీరు మోక్షప్రదుడనైన నేను ప్రత్యక్షమైనప్పుడు ముక్తిని కోరక సంతానములేని కారణమున, నా మాయలోబడి పుత్రుడనే వాంఛించితిరి.

*3.40 (నలుబదియవ శ్లోకము)*

*గతే మయి యువాం లబ్ధ్వా వరం మత్సదృశం సుతమ్|*

*గ్రామ్యాన్ భోగానభుంజాథాం యువాం ప్రాప్తమనోరథౌ॥8371॥*

జననీ! మీరు నా వంటి పుత్రుని వరముగా కోరుకొనిన పిదప నేను అచటినుండి అంతర్ధానమైతిని. ఇట్లు సఫలమనోరథులైన పిమ్మట మీరు లౌకిక విషయసుఖములను ఆదరించితిరి.

*3.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*అదృష్ట్వాన్యతమం లోకే శీలౌదార్యగుణైః సమమ్|*

*అహం సుతో వామభవం పృశ్నిగర్భ ఇతి శ్రుతః॥8372॥*

మాతా! శీలము, ఔదార్యము మొదలగు ఉదాత్త లక్షణములు గలవాడు నా యంతటి వాడు మఱి యొకడు లేనందున నేనే మీకు సుతుడనై *పృశ్నిగర్భుడు* అను పేరుతో ఖ్యాతి వహించితిని.

*3.42 (నలుబది రెండవ శ్లోకము)*

*తయోర్వాం పునరేవాహమదిత్యామాస కశ్యపాత్|*

*ఉపేంద్ర ఇతి విఖ్యాతో వామనత్వాచ్చ వామనః॥8373॥*

తరువాతి జన్మమున నీవు *అదితి* విగను, సుతపుడు *కశ్యపుడు* గను పుట్టితిరి. అప్పుడు మీకు నేను *ఉపేంద్రుడు* అను పేరుతో పుత్రుడనైతిని. పొట్టివాడను అగుట వలన *వామనుడు* అను పేరున వ్యవహరింపబడితిని.

*3.43 (నలుబది మూడవ శ్లోకము)*

*తృతీయేఽస్మిన్ భవేఽహం వై తేనైవ వపుషాథ వామ్|*

*జాతో భూయస్తయోరేవ సత్యం మే వ్యాహృతం సతి॥8374॥*

*3.44 (నలుబది నాలుగవ శ్లోకము)*

*ఏతద్వాం దర్శితం రూపం ప్రాగ్జన్మస్మరణాయ మే|*

*నాన్యథా మద్భవం జ్ఞానం మర్త్యలింగేన జాయతే॥8375॥*

*3.45 (నలుబది ఐదవ శ్లోకము)*

*యువాం మాం పుత్రభావేన బ్రహ్మభావేన చాసకృత్|*

*చింతయంతౌ కృతస్నేహౌ యాస్యేథే మద్గతిం పరామ్॥8376॥*

సాధ్వీమణీ! ఈ మూడవజన్మమున నేను మీయందు అదే చతుర్భుజ రూపముతో ఆచరించితిని. నా మాట ముమ్మాటికిని సత్యము (నా మాటను నేను నిలబెట్టుకొంటిని). నా పూర్వజన్మల గూర్చి మీకు తెలుపుటకొరకే నా చతుర్భుజ రూపమున ప్రదర్శించితిని. లేనిచో (నేను మానవ శరీరముతో జన్మించినచో) నా అవతారవైశిష్ట్యమును మీరు గుర్తింపజాలరు. మీరు ఎల్లప్పుడును నన్ను పుత్రభావము తోడనే వాత్సల్యపూర్వకముగా ఆదరించుచున్నను, అప్ఫుడప్ఫుడు నన్ను పరబ్రహ్మముగా భావించినచో (స్మరించినచో) నా పరమగతిని (నా పరంధామమును) పొందగలరు".

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*723వ నామ మంత్రము*

*ఓం స్వతంత్రాయై నమః*

ఎవరికీ అధీనురాలు కానిది, సర్వనియంతృత్వము, సర్వకర్తృత్వము కలిగిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *స్వతంత్రా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం స్వతంత్రాయై నమః* యని ఉచ్చరించుచూ, ఆ జగజ్జననిని ఉపాసించు సాధకుడు ఉత్తమమైన స్వతంత్రాలోచనలు, ఎవరిపైనను ఆధారపడక, తిరిగి తానే ఒరులకు సహాయపడు కార్యదక్షత, ఎంతటి ఉన్నతస్థానమునైనను అలంకరించి అనాయాసముగా కార్యనిర్వహణా సామర్థ్యమునుజూపగలుగుట వంటి నైపుణ్యతను సంప్రాప్తింపజేయును.

జగన్మాత పరాధీనతకాదు. స్వతంత్రమను నిత్యాతంత్ర స్వరూపురాలు. ఆ తల్లి ఆత్మీయములైన అన్ని తంత్రములు గలిగినది. సాక్షాత్తు తన పతియైన శివుడే తన యధీనమునందు గలిగి *స్వాధీన వల్లభా* (శ్రీలలితా సహస్రనామావళి యందలి 54వ నామ మంత్రము) యని నామ ప్రసిద్ధమైనది. పరమేశ్వరుడు శక్తితో కూడి ఉన్నప్పుడే సృష్టిస్థితిలయ కార్యములను చేయగలవాడు. కాబట్టి తన పతినే తన అధీనములో నుంచుకున్నంతటి స్వతంత్రురాలు. సృష్టికి పూర్వము సమస్తసృష్టిని తనలోనుంచుకొనిన సర్వస్వతంత్రురాలు. తానొక ధర్మబద్ధమైన నియంత. సామంతులైన త్రిమూర్తులను, అష్టదిక్పాలకులను, నవగ్రహములను వారి వారి కార్యనిర్వహణలయందు వారికి సర్వస్వతంత్రత ప్రసాదిస్తూ, వారి నిర్వహణను తానుమాత్రమే పర్యవేక్షించగల సర్వకర్తృత్వముగలిగిన పరిపాలనాదక్షురాలు. శైవాది తంత్రములు శ్రీమాతకు సంబంధించినవే. వాటిలో ఆ తల్లి విభూతులే చెప్పబడినవి. ఒక్కమాటలో చెప్పాలంటే తమకు ఏ అవసరంలేదని గొప్పగా చెప్పుకుంటారు చాలామంది. కాని పంచభూతములైన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశములపై ఆధారపడకుండా ఉండలేరు. కాని జగన్మాత పంచభూతములనే తన అధీనములోనుంచుకున్నది. స్వతంత్రముగా పంచభూతములకు ఆజ్ఞలు జారీచేయగలిగినది. పంచభూతములే పరాశక్తిపై ఆధారపడినంతటి స్వతంత్రురాలు కనుకనే ఆతల్లి *స్వతంత్రా* యని అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం స్వతంత్రాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*149వ నామ మంత్రము*

*ఓం నిత్యబుద్ధాయై నమః*

త్రికాలములందును బ్రహ్మజ్ఞాన స్వరూపిణి, సకల వేదాంత సారము, సకల వేదాంగసారము, సర్వజీవన వేదసారము తానై విలసిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిత్యబుద్ధా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం నిత్యబుద్ధాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు భక్తులకు ఆ తల్లి ఎనలేని బ్రహ్మజ్ఞానసంపదలు, బుద్ధి కుశలత, కార్యదక్షతయందు సామర్థ్యము, సుఖసంతోషములు సంప్రాప్తింపజేయును.

పరబ్రహ్మస్వరూపిణియైన జగన్మాత నిత్యజ్ఞానస్వరూపిణి యనుటలో సందేహం లేదు. బుద్ధ యనగా పరిపూర్ణమైన జ్ఞానం. జగన్మాత సదా పరిపూర్ణమైన జ్ఞానవంతురాలు. అందుకనే ఆతల్లి శ్రీమహారాజ్ఞియై విలసిల్లుచున్నది. అందుకనే *నిత్యబుద్ధా* యనబడుచున్నది. సమస్త సృష్టిని తన యధీనములోనుంచుకొన్నది. తానొక మహాసామ్రాజ్ఞి బ్రహ్మకు సత్యలోకము, సృష్టి కార్యముల నిచ్చినది. శ్రీమహావిష్ణువుకు వైకుంఠమునిచ్చి స్థితి కార్యమునొసంగినది. పరమేశ్వరునకు కైలాసమునిచ్చి లయకార్యమునొసంగినది. అష్టదిక్పాలకులకు, నవగ్రహములకు వివిధ విభాగములనొసగి సమర్థనీయమైన పరిపాలనమును చేబూనినదంటే ఎంతటి జ్ఞానస్వరూపురాలో అర్థము చేసుకోవచ్చును. గనుకనే ఆ తల్లిని *నిత్యబుద్ధా* యని నామప్రసిద్ధమైనది. ఆతల్లి చిద్రూపిణి గనుకనే *నిత్యబుద్ధా* యని అన్నాము. *చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ* అని స్తుతించుచున్నాము. జైనసంబంధులైన శుద్ధ, బుద్ధులు అను తీర్థంకరులు శ్రీమాత అనుగ్రహముచే నిత్యులయారు. షడ్దర్శనపూజయను జైనదర్శనమున చూపబడిన మార్గమందు ఉపాసింపబడు తారానామకదేవీ స్వరూపిణి జగన్మాత.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిత్యబుద్ధాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*3.46 (నలుబది ఆరవ శ్లోకము)*

*ఇత్యుక్త్వాసీద్ధరిస్తూష్ణీం భగవానాత్మమాయయా|*

*పిత్రోః సంపశ్యతోః సద్యో బభూవ ప్రాకృతః శిశుః॥8377॥*

*శ్రీశుకుడు పలికెను* సర్వేశ్వరుడైన శ్రీహరి ఈ విధముగా దేవకీదేవితో పలికిన పిదప, ఆ తల్లిదండ్రులు చూచుచుండగనే తన మాయా ప్రభావమున ఆ స్వామి సామాన్య (మానవ) శిశురూపమును దాల్చెను.

*3.47 (నలుబది ఏడవ శ్లోకము)*

*తతశ్చ శౌరిర్భగవత్ప్రచోదితః సుతం సమాదాయ స సూతికా గృహాత్|*

*యదా బహిర్గంతుమియేష తర్హ్యజా యా యోగమాయాజని నందజాయయా॥8378॥*

పిమ్మట వసుదేవుడు భగవంతుని ప్రేరణమేరకు ఆ శిశువును దీసికొని, ప్రసూతి గృహము నుండి (చెఱసాల నుండి) బయటికి వెళ్ళుటకు సంకల్పించెను. అదే సమయమున భగవంతునివలె జన్మరహితయైన యోగమాయ నందుని భార్యయైన యశోదాదేవికి బాలికగా జన్మించెను.

*3.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*

*తయా హృతప్రత్యయసర్వవృత్తిషు ద్వాఃస్థేషు పౌరేష్వపి శాయితేష్వథ|*

*ద్వారస్తు సర్వాః పిహితా దురత్యయా బృహత్కపాటాయసకీలశృంఖలైః॥8379॥*

*3.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*

*తాః కృష్ణవాహే వసుదేవ ఆగతే స్వయం వ్యవర్యంత యథా తమో రవేః|*

*వవర్ష పర్జన్య ఉపాంశుగర్జితః శేషోఽన్వగాద్వారి నివారయన్ ఫణైః ॥8380॥*

ఆ సమయమున అభేద్యములైన చెఱసాలద్వారము లన్నియును బలమైన ఇనుపగడియల తోడను, గొలుసుల తోడను బంధింపబడియుండెను (తాళములు వేయబడి యుండెను). కాని, యోగమాయా ప్రభావమున సమస్త ద్వారపాలకులును, పౌరులును గాఢనిద్రలో మునిగి, అచేతనులై యుండిరి. అంతట వసుదేవుడు కృష్ణుని దీసికొని తమను సమీపించినంతనే ఆ ద్వారములన్నియును, సూర్యోదయమున చీకట్లవలె తమంతట తామే విడిపోయెను. అప్పుడు మేఘములు తిన్నతిన్నగా గర్జించుచు వర్షింపసాగెను. ఆదిశేషుడు వర్షధారలు ఆ శిశువుపై పడకుండా తన పడగలను ఛత్రమువలె అడ్డుపెట్టి వసుదేవుని అనుసరించెను.

*3.50 (ఏబదియవ శ్లోకము)*

*మఘోని వర్షత్యసకృద్యమానుజా గంభీరతోయౌఘజవోర్మిఫేనిలా|*

*భయానకావర్తశతాకులా నదీ మార్గం దదౌ సింధురివ శ్రియః పతేః॥8381॥*

అది వర్షాకాలమగుటవలన సంతతధారగా వర్షములు పడుచుండుటచే యమునానదీ జలములు పరవళ్ళుద్రొక్కుచుండెను. తరంగములు ఎగసిపడుచుండెను. నురుగులు దట్టముగా ఏర్పడుచుండెను. వందలకొలదిగా (పరంపరగా) సుడులు తిరుగుచుండెను. ఆ కారణముగా మిగుల భయంకరముగా నున్న యమునానది దైవయోగము వలన, పూర్వము శ్రీరామచంద్రునకు సముద్రమువలె వసుదేవునకు (శ్రీకృష్ణునకు) దారి ఇచ్చెను.

*3.51 (ఏబది ఒకటవ శ్లోకము)*

*నందవ్రజం శౌరిరుపేత్య తత్ర తాన్ గోపాన్ ప్రసుప్తానుపలభ్య నిద్రయా|*

*సుతం యశోదాశయనే నిధాయ తత్సుతాముపాదాయ పునర్గృహానగాత్॥8382॥*

పిమ్మట వసుదేవుడు నందగోకులమున (వ్రేపల్లె) కు చేరి, గాఢనిద్రలో మునిగియున్న గోపాలురను క్రమముగా దాటి నందుని గృహమునకు చేరెను. అనంతరము అతడు శిశువును (కృష్ణుని) యశోదాదేవి శయ్యపై ఉంచి, అచటగల ఆడుశిశువును తీసికొని, తిన్నగా మథురలోని చెఱసాలకు చేరెను.

*3.52 (ఏబది రెండవ శ్లోకము)*

*దేవక్యాః శయనే న్యస్య వసుదేవోఽథ దారికామ్|*

*ప్రతిముచ్య పదోర్లోహమాస్తే పూర్వవదావృతః॥8383॥*

*3.54 (ఏబది నాలుగవ శ్లోకము)*

*యశోదా నందపత్నీ చ జాతం పరమబుధ్యత|*

*న తల్లింగం పరిశ్రాంతా నిద్రయాపగతస్మృతిః॥8384॥*

అంతట వసుదేవుడు ఆ ఆడుశిశువును దేవకీదేవి శయ్యయందు ఉంచెను. అనంతరము అతడు తన కాళ్ళకు ఇనుపసంకెలను తగిలించుకొని మునుపటివలె ఉండెను. నందుని భార్యయగు యశోద తనకు సంతానము కలిగినట్లు తెలిసికొనెను. కాని మిక్కిలి అలసి యుండుట వలనను, యోగమాయా ప్రభావమున అచేతనస్థితికి లోనగుటచేతను ఆమె తనకు కలిగినది మగశిశువో, ఆడుశిశువో, అను విషయమును గుర్తింపలేకుండెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే తృతీయోఽధ్యాయః (3)*

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి మూడవ అధ్యాయము (3)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*4.1 (ప్రథమ శ్లోకము)*

*బహిరంతఃపురద్వారః సర్వాః పూర్వవదావృతాః|*

*తతో బాలధ్వనిం శ్రుత్వా గృహపాలాః సముత్థితాః॥8385॥*

*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! వసుదేవుడు మరలి వచ్చిన పిదప ఆ నిర్బంధమందిరము (చెఱసాల) యొక్క బయట, లోపలగల ద్వారములన్నియును మునుపటివలె మూసికొనెను. పిమ్మట పసిశిశువుయొక్క రోదన ధ్వనిని విని, రక్షకభటులు మేల్కొనిరి.

*4.2 (రెండవ శ్లోకము)*

*తే తు తూర్ణముపవ్రజ్య దేవక్యా గర్భజన్మ తత్|*

*ఆచఖ్యుర్భోజరాజాయ యదుద్విగ్నః ప్రతీక్షతే॥8386॥*

వెంటనే వారు కంసుని కడకేగి, దేవకీదేవి ప్రసవించిన వార్తను తమ ప్రభువునకు తెలిపిరి. మృత్యుభీతితో నున్న కంసుడు ఆతురతతో ఆ వార్తకై ఎదురు చూచుచుండెను.

*4.3 (మూడవ శ్లోకము)*

*స తల్పాత్తూర్ణముత్థాయ కాలోఽయమితి విహ్వలః|*

*సూతీగృహమగాత్తూర్ణం ప్రస్ఖలన్ ముక్తమూర్ధజః॥8387॥*

భటులవలన ఆ వార్తను విన్నంతనే అతడు శయ్యపై నుండి ఉలిక్కిపడి లేచెను. 'నన్ను చంపెడివాడు జన్మించెను' అని యనుకొనుచు అతడు విహ్వలపాటునకు లోనయ్యెను. పిమ్మట ఆ కంసుడు చిరాకుతో సూతికా గృహమునకు పరుగెత్తెను. ఆ తత్తరపాటులో అతని కాళ్ళు తఢబడెను, జుట్టుముడి వీడిపోయెను.

*4.4 (నాలుగవ శ్లోకము)*

*తమాహ భ్రాతరం దేవీ కృపణా కరుణం సతీ|*

*స్నుషేయం తవ కల్యాణ స్త్రియం మా హంతుమర్హసి॥8388॥*

*4.5 (ఐదవ శ్లోకము)*

*బహవో హింసితా భ్రాతః శిశవః పావకోపమాః|*

*త్వయా దైవనిసృష్టేన పుత్రికైకా ప్రదీయతామ్॥8389॥*

అంతట దేవకీదేవి మిగుల దీనురాలై తన సోదరుడగు కంసునితో జాలిగొల్పునట్లు ఇట్లనెను - "నా శుభమును గోరెడి అనుంగుసోదరా! ఇప్పుడు జన్మించినది ఆడుశిశువు. నీ మేనగోడలు. కావున స్త్రీ హత్యకు పాల్పడవలదు. సోదరా! అగ్నివలె తేజోమూర్తులైన (చూడముచ్చట గొలిపెడి) పెక్కుమంది శిశువులను విధివశమున పొట్టన బెట్టుకొంటివి. ఇది మగశిశువు కాదు గదా! ఈ కూతురునైనను నాకు దక్కనిమ్ము. ప్రియసోదరా! కంసమహారాజా! నేను నీకు అనుంగు చెల్లెలిని గదా!

*4.6 (ఆరవ శ్లోకము)*

*నన్వహం తే హ్యవరజా దీనా హతసుతా ప్రభో|*

*దాతుమర్హసి మందాయా అంగేమాం చరమాం ప్రజామ్॥8390॥*

పెక్కుమంది శిశువులను కోల్పోయి గర్భశోకముతో నున్న దీనురాలను సుమా! దురదృష్టవంతురాలనైన నాకు ఈ చివరి సంతానమునైనను విడిచిపెట్టుము".

*శ్రీశుక ఉవాచ*

*4.7 (ఏడవ శ్లోకము)*

*ఉపగుహ్యాత్మజామేవం రుదత్యా దీనదీనవత్|*

*యాచితస్తాం వినిర్భర్త్స్య హస్తాదాచిచ్ఛిదే ఖలః॥8391॥*

*4.8 (ఎనిమిదవ శ్లోకము)*

*తాం గృహీత్వా చరణయోర్జాతమాత్రాం స్వసుః సుతామ్|*

*అపోథయచ్ఛిలాపృష్ఠే స్వార్థోన్మూలితసౌహృదః॥8392॥*

*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! అంతట దేవకీదేవి ఆ ఆడుశిశువును తన పొత్తిళ్ళలో దాచుకొనుచు అతి దైన్యముతో కన్నీరుమున్నీరుగా ఏడువసాగెను. ఆమె అంతగా రోదించుచున్నను ఇసుమంతయును కనికరము లేక ఆ దుర్మార్గుడు ఆమె చేతులనుండి శిశువును బలవంతముగా లాగికొనెను. స్వార్థపరుడు, కఠినాత్ముడు ఐన ఆ కంసుడు తన చెల్లెలి గర్భమున అప్పుడే పుట్టి కనులు తెరవని ఆ పసికందుయొక్క కాళ్ళను ఒడిసిపట్టుకొని ఒక బండకేసి కొట్టబోయెను.

*4.9 (తొమ్మిదవ శ్లోకము)*

*సా తద్ధస్తాత్సముత్పత్య సద్యో దేవ్యంబరం గతా|*

*అదృశ్యతానుజా విష్ణోః సాయుధాష్టమహాభుజా॥8393॥*

*4.10 (పదియవ శ్లోకము)*

*దివ్యస్రగంబరాలేపరత్నాభరణభూషితా|*

*ధనుఃశూలేషుచర్మాసిశంఖచక్రగదాధరా॥8394॥*

అంతట విష్ణుసోదరియైన ఆ యోగమాయ కంసుని చేతులనుండి ఆకసమునకు ఎగిరి, పిదప ఆమె తన ఎనిమిది భుజములయందును ఆయుధములను ధరించి, శక్తిరూపిణియై అచటనున్న వారికి గోచరమయ్యెను. అప్పుడు ఆ దేవి దివ్యములైన వస్త్రములతో, మాలలతో, లేపనములతో, మణిమయములైన ఆభరణములతో అలంకృతయై యుండెను. ఆమె ధనుర్బాణములను, శూలమును, డాలును, ఖడ్గమును, శంఖచక్రములను, గదను దాల్చియుండెను.

*150వ నామ మంత్రము* 13.11.2020

*ఓం నిరవద్యాయై నమః*

ఏవిధముగానూ ఆపాదించదగిన దోషములు లేనిదై, తన భక్తులకు అవిద్యాపరముగా ఆవహించిన సర్వదోషములను సమూలంగా నాశనమొనర్చు బ్రహ్మజ్ఞాన స్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిరవద్యా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం నిరవద్యాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబికను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు భక్తులను ఆ పరమేశ్వరి దోషరహితమైన జీవనము ప్రసాదించి, ఆధ్యాత్మిక జ్ఞానసంపదతోబాటు, భౌతికపరమైన శాంతిసౌఖ్యములను ప్రసాదించును.

అజ్ఞానముచే మానవుడు అనేకమైన దోషపూరితమైన కార్యములనొనర్చుచుండును. దానికి కారణము అజ్ఞానముచేత అరిషడ్వర్గములకు లోబడిపోవుటయే. అందుచే అనేక విధములైన పాపకార్యములు చేయుచునేయుండును. అట్టివానికి జన్మరాహిత్యమైన మోక్షము లభింపదు సరిగదా తానొనర్చిన పాపకార్యముల వలన వికృతమైన క్రిమికీటకాదులుగా కూడా జన్మించును. జననమరణ చక్రములో చిక్కుకొని పుట్టును, చచ్చును మరల పుట్టుచునేయుండును. ఇవన్నియు జీవునికేగాని పరమాత్మకు కాదు. పరమాత్మ స్వరూపిణియైన జగన్మాత జ్ఞానస్వరూపిణి. ఆ తల్లికి అజ్ఞానంలేదు. *నిరవద్యం నిరంజనం* (సౌభాగ్యభాస్కరం 349వ పుట) ఆత్మ *నిరవద్యము, నిరంజనమని* వేదములు చెప్పుచున్నవి. అవద్యమనునది ఒక నరకము.

*శ్లో. తస్మా దహర్నిశం దేవీం సంనరేత్పురుషో యది|*

*న యా త్యవద్యం నరకం సంక్షీణా శేషపాతకః॥* (సౌభాగ్యభాస్కరం, 349వ పుట)

జగన్మాతను ఉపాసించిన భక్తులకు ఆ తల్లి అనుగ్రహముచే అవద్యమను నరకము దరిచేరదు. *ఎవరైతే అహర్నిశలు శ్రీమాతను స్మరించునో వారికి అవద్యనరకములను పొందరు* అని కూర్మపురాణమందు చెప్పబడినది.

*శ్లో. మాయాం తాశ్చైవ ఘోరాద్యా అష్టావింశతి కోటయః|*

*నరకాణా మవద్యానాం పచ్యం త్యేతాసు పాపినః|*

*అనాశ్రితా భవానీశం శంకరం నీలలోహిత* (సౌభాగ్యభాస్కరం, 349వ పుట)

*ఘోరము మొదలుకొని మాయ చివరివరకు గల ఇరువది ఎనిమిది కోట్ల నరకములలో అవద్యనరకము ఉన్నది. శంకరునాశ్రయించని పాపాత్ములు ఈ అవద్యనరకములో చిక్కుకొందురని* లింగపురాణములోగూడ కలదు.

జగన్మాత అనుగ్రహం పొందినవారికి అవద్య నరకము దరిజేరదు. కాబట్టి జగన్మాత *నిరవద్యా* యని నామప్రసిద్ధి చెందినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిరవద్యాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*725వ నామ మంత్రము* 15.11.2020

*ఓం దక్షిణామూర్తి రూపిణ్యై నమః*

సనకాది ఋషులకు బ్రహ్మజ్ఞానము బోధింప దక్షిణాభిముఖుడై కదలివచ్చి జ్ఞానోపదేశము గావించిన పరమేశ్వరుడే దక్షిణామూర్తి యనగా అట్టి దక్షిణామూర్తి స్వరూపమే తానై విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *దక్షిణామూర్తిరూపిణీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం దక్షిణామూర్తి రూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ దక్షిణామూర్తి స్వరూపిణి యైన జగన్మాత అనంతమైన ఆధ్యాత్మిక జ్ఞానసంపదలను అనుగ్రహించును.

దక్షిణామూర్తి యనగా పరమేశ్వరుడే.

దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.

బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెదుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మదేవుడు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు.

ఇక ఈ నలుగురూ గురువు కోసం వెదుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మ దేవుడినే అడుగుదామనుకొన్నారు. కాని ప్రక్కన సరస్వతీదేవిని చూసి " ఈయనే పెళ్ళి చేసుకొని సంసారంలో ఉన్నాడు. ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు" అని అనుకొని బ్రహ్మను అడుగలేదు. అలాగే మహావిష్ణువునూ, పరమశివుడినీ కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవినీ, పార్వతీదేవినీ చూసి వారిని కూడా అడుగలేదు.

పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నాడు. వారు వెళ్ళే దారిలో *భాండీరము* అను ఒక మర్రిచెట్టు క్రింద దక్షిణాభి ముఖంగా పద్మాసనంలో కూర్చుని దక్షిణ హస్తంతో *చిన్ముద్ర* ధరించి తురీయస్థితిలో వారికి దర్శనమిచ్చాడు.. వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి, అతని తేజస్సుకు ఆకర్షితులై, ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు, మనసుకూ అందనివారు కాబట్టి అలా బోధించారు.

జగన్మాత పరమశివుని శరీరం సగభాగం గనుకను, భర్తకు స్వంతమైనవి భార్యకు కూడా స్వంతమగునను వాడుక యుండుటచేతను, శివశక్తులు ఇరువురికి అభేదము గలదనుట చేతను జగన్మాతను *దక్షిణామూర్తిరూపిణీ* యను నామముతో స్తుతించదగును.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం దక్షిణామూర్తిరూపిణ్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*151వ నామ మంత్రము* 15.11.2020

*ఓం నిరంతరాయై నమః*

సర్వాంతర్యామి-సర్వవ్యాపి. సృష్టి-స్థితి-లయ-తిరోధాన-అనుగ్రహ కృత్యములు నిర్వహించు కాలస్వరూపిణి. అభిన్నమైన, శాశ్వతమైన అఖండస్వరూపిణి. అటువంటి పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిరంతరా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం నిరంతరాయై నమః* అని ఉచ్చరించుచూ, జగన్మాతను ఉపాసించు సాధకుడు అనంతమైన, శాశ్వతమైన ఆత్మానందమును అనుభవించుటయే గాక, లౌకిక పరమైన శాంతిసౌఖ్యములుగూడా పొందును.

*అంతర* అనగా అవకాశము, అవధి, భేదము, ఛిద్రము అను అర్థములు గలవు. జగన్మాత భక్తితో ఆరాధించు వారిని అనుగ్రహించదు అను *అవకాశము* ఇసుమంతయును లేదు. ఆ తల్లి అనుగ్రహమునకు *అవధులు* లేవు. ఆ తల్లి దృష్టిలో తనను ధ్యానించువారు, తనను గూర్చి కఠోరమైన తపస్సు చేయువారు, వారిని అనుగ్రహించుటలో *భేదము* చూపక, కేవలం అంతర్ముఖారాధనకే సంతృప్తిచెంది అనుగ్రహించును. ఆ తల్లిని నమ్మి ఆరాధించువారు ఏవిధమైన మానసిక *ఛిద్రములు* లేక ఆనందముగా జీవింతురు. అనగా ఆ తల్లి అవకాశములకు, అవధులకు, భేదములకు, ఛిద్రములకు అతీతమైనది. దేహంవేరు, ఆత్మవేరు అను ద్వైత భావమును దూరంచేసి ఆత్మానందాన్ని కలుగజేస్తుంది. ఆ తల్ఞి సర్వాంతర్యామి. సర్వవ్యాపి. ఆ తల్లి అనుగ్రహానికి హద్దులు చూపనిది. అందుకే ఆ తల్లి *నిరంతరా* యని స్తుతింపబడుచున్నది.

*య యేతస్మిన్నుదరమంతరం కురుతే, అథ తస్య భయం భవతీ* (సౌభాగ్యభాస్కరం 350వ పుట)

పరమాత్మకాక వేరొకరు గలరనెడి భేదము కలిగియుండునో అట్టివారి జీవనము భయకంపితమే అగునని శృతియందు చెప్పబడినది.

ఇటువంటి భేదభావనలను తన భక్తులనుండి దూరము చేయును గనుక ఆ తల్లి *నిరంతరా* యని అన బడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిరంతరాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*4.11 (పదకొండవ శ్లోకము)*

*సిద్ధచారణగంధర్వైరప్సరఃకిన్నరోరగైః|*

*ఉపాహృతోరుబలిభిః స్తూయమానేదమబ్రవీత్॥8395॥*

అప్పుడు ఆ దేవికి సిద్ధులు, చారణులు, గంధర్వులు, అప్సరసలు, కిన్నరులు, నాగజాతివారు అమూల్యములైన కానుకలను సమర్పించి, ఆమెను మిగుల ప్రస్తుతింపసాగిరి. అంతట ఆ దేవి కంసునితో ఇట్లు నుడివెను.

*4.12 (పండ్రెండవ శ్లోకము)*

*కిం మయా హతయా మంద జాతః ఖలు తవాంతకృత్|*

*యత్ర క్వ వా పూర్వశత్రుర్మా హింసీః కృపణాన్ వృథా॥8396॥*

"మూర్ఖుడా! నన్ను చంపుటవలన నీకు ఏమి ప్రయోజనము? పూర్వము అశరీరవాణి పలికిన నీ శత్రువు నిన్ను సంహరించుటకై మరియొకచోట జన్మించియే ఉన్నాడు. కనుక, నీవు ఏ పాపమూ ఎరుగని పసికందులను చంపుట వ్యర్థము".

*4.13 (పదమూడవ శ్లోకము)*

*ఇతి ప్రభాష్య తం దేవీ మాయా భగవతీ భువి|*

*బహునామనికేతేషు బహునామా బభూవ హ॥8397॥*

భగవతియైన ఆ యోగమాయాదేవి ఇట్లు పలికి అంతర్ధానమయ్యెను. పిదప ఆమె భూతలమున పెక్కు ప్రదేశములలో పలు పేర్లతో వెలసి, ఖ్యాతి వహించెను.

*4.14 (పదునాలుగవ శ్లోకము)*

*తయాభిహితమాకర్ణ్య కంసః పరమవిస్మితః|*

*దేవకీం వసుదేవం చ విముచ్య ప్రశ్రితోఽబ్రవీత్॥8398॥*

ఆ దేవి పలికిన మాటలను విన్నంతనే కంసుడు మిగుల సంభ్రమాశ్చర్యచకితుడయ్యెను. పిమ్మట అతడు దేవకీ వసుదేవులను బంధవిముక్తులను గావించి, వినమ్రుడై ఇట్లు పలికెను-

*4.15 (పదునైదవ శ్లోకము)*

*అహో భగిన్యహో భామ మయా వాం బత పాప్మనా|*

*పురుషాద ఇవాపత్యం బహవో హింసితాః సుతాః॥8399॥*

*4.16 (పదునారవ శ్లోకము)*

*స త్వహం త్యక్తకారుణ్యస్త్యక్తజ్ఞాతిసుహృత్ఖలః|*

*కాన్ లోకాన్ వై గమిష్యామి బ్రహ్మహేవ మృతః శ్వసన్॥8400॥*

"ప్రియమైన సోదరీ! దేవకీ! బావా! వసుదేవా! నేను ఎంతటి పాపాత్ముడను? రాక్షసునివలె మీకు కలిగిన పెక్కుమంది పసికందులను చంపివైచితివి. నేను ఏమాత్రమూ కనికరము అనునదియే లేనివాడనై, బంధుమిత్ర భావనను త్యజించి, అట్లు అకృత్యములకు పాల్పడితిని. అట్టి నేను ఎట్టి నరకయాతనలకు గుఱియగుదునో తెలియదు. వాస్తవముగా నేను బ్రహ్మహత్య చేసి జీవన్మృతుడనే.

శ్రీహరి అవతారమైన శ్రీకృష్ణభగవానుని దర్శనమునకు నోచుకొనని ధన్యాత్ములు దేవకీ వసుదేవులు. అట్టి పుణ్యమూర్తుల దర్శన ప్రభావమున కంసుని హృదయమునందుగూడ వినయము, సద్భావన, ఔదార్యము మొదలగు శుభలక్షణములు చోటుచేసికొనినవి. అందువలననే అతని నోట సద్వచనములు వెలువడినవి. దేవకీ వసుదేవుల ఎదుట ఉన్నంతవరకే అతనిలో ఈ సద్బుద్ధి మిగిలినది. కానీ దుష్టులైన అతని మంత్రుల మధ్యలో చేరినంతనే అతని దుష్టస్వభావము యథాతథముగ ఉండిపోయినది.

*4.17 (పదునేడవ శ్లోకము)*

*దైవమప్యనృతం వక్తి న మర్త్యా ఏవ కేవలమ్|*

*యద్విశ్రంభాదహం పాపః స్వసుర్నిహతవాంఛిశూన్॥8401॥*

*4.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*మా శోచతం మహాభాగావాత్మజాన్ స్వకృతంభుజః|*

*జంతవో న సదైకత్ర దైవాధీనాస్తదాసతే॥8402॥*

*4.19 (పదునెనిమిదవ శ్లోకము)*

*భువి భౌమాని భూతాని యథా యాంత్యపయాంతి చ|*

*నాయమాత్మా తథైతేషు విపర్యేతి యథైవ భూః॥8403॥*

కేవలము మానవులేగాదు, దైవము సైతము అసత్యము పలుకునని విశ్వసించి, పాపాత్ముడనైన నేను సొంత చెల్లెలియొక్క శిశువులనే హతమార్చితిని. మహాత్ములారా! మీ పుత్రులు అసువులను కోల్పోయినందులకు మీరు ఏ మాత్రమూ దుఃఖింపవలదు. వారు తమ పూర్వజన్మ కర్మఫలములను అనుభవించిరి. ప్రాణులన్నియును విధి నిర్ణయము ప్రకారము ప్రారబ్ధములను అనుభవింపక తప్పదు. అందువలన వారు (ప్రాణులు) ఒకేచోట కలిసియుండుట సంభవము కాదు. ఈ భూలోకముస మట్టితో నిర్మింపబడిన కుండలు మొదలగు వస్తువులు నశించినను మృత్తిక నశింపదు. అట్లే పంచభూతాత్మకములైన శరీరములు నశించినను ఆత్మ ఎట్టి వికారమునకునూ లోనుగాదు.

*4.20 (ఇరువదియవ శ్లోకము)*

*యథానేవంవిదో భేదో యత ఆత్మవిపర్యయః|*

*దేహయోగవియోగౌ చ సంసృతిర్న నివర్తతే॥8404॥*

ఈ తత్త్వమును ఎఱుగనివారు అనాత్మయైన శరీరమునే ఆత్మగా భావించెదరు. తత్ఫలితముగా జననమరణ చక్రములో చిక్కుపడుదురు. ఈ అజ్ఞానము తొలగిపోనంతవరకును మానవుడు సుఖదుఃఖరూప సంసార బంధములనుండి విముక్తుడు కాజాలడు.

PVD Subrahmanyam చెప్పారు...

*4.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*తస్మాద్భద్రే స్వతనయాన్ మయా వ్యాపాదితానపి|*

*మానుశోచ యతః సర్వః స్వకృతం విందతేఽవశః॥8405॥*

అనుంగుచెల్లెలా! నీ కుమారులు నా వలననే తమ ప్రాణములను కోల్పోయినను అందులకై నీవు శోకింపవలదు. ఏలయన, ప్రతిప్రాణియు తన సుకృతదుష్కృత ఫలములను విధిగా అనుభవింపవలసియే యుండును.

*4.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*యావద్ధతోఽస్మి హంతాస్మీత్యాత్మానం మన్యతే స్వదృక్|*

*తావత్తదభిమాన్యజ్ఞో బాధ్యబాధకతామియాత్॥8406॥*

*4.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*క్షమధ్వం మమ దౌరాత్మ్యం సాధవో దీనవత్సలాః|*

*ఇత్యుక్త్వాశ్రుముఖః పాదౌ శ్యాలః స్వస్రోరథాగ్రహీత్॥8409॥*

ఆత్మస్వరూపమును ఎఱుగనంతవఱకును దేహాభిమాని 'నేను చంపువాడను, చంపబడువాడను' అని భావించుచునే యుండును. అట్టి అజ్ఞాని బాధ్యబాధకభావములను పొందుచునే యుండును. అనగా, అతడు ఇతరులకు హాని కలిగించుచునే యుండును, తానును దుఃఖమునకు లోనగుచునే యుండును. మీరు పరమ సాధుస్వభావము గలవారు. దీనులయెడ కనికరమును చూపెడివారు. కనుక నా అపచారములను అన్నింటిని మన్నింపుడు" ఇట్లు పలికిన పిదప కంసుడు కన్నీరు గార్చుచు తన చెల్లెలు, బావయు అగు దేవకి వసుదేవులయొక్క పాదముల పై పడెను.

*4.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*మోచయామాస నిగడాద్విశ్రబ్ధః కన్యకాగిరా|*

*దేవకీం వసుదేవం చ దర్శయన్నాత్మసౌహృదమ్॥8408॥*

అంతట ఆ కంసుడు యోగమాయ మాటలపై విశ్వాసమును ఉంచి, దేవకీ వసుదేవుల సంకెలలను తొలగించెను. పిమ్మట అతడు పలువిధములుగా వారియెడ ఆత్మీయతను ప్రదర్శించెను.

*4.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*భ్రాతుః సమనుతప్తస్య క్షాంత్వా రోషం చ దేవకీ|*

*వ్యసృజద్వసుదేవశ్చ ప్రహస్య తమువాచ హ॥8409॥*

పిమ్మట దేవకీదేవి తన సోదరుడగు కంసుడు మిగుల పశ్చాత్తప్తుడగుటను జూచి జాలిపడుచు అతనిని క్షమించెను. వసుదేవుడు కోపమును వీడి, నవ్వుచు అతనితో ఇట్లనెను-

*4.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*ఏవమేతన్మహాభాగ యథా వదసి దేహినామ్|*

*అజ్ఞానప్రభవాహంధీః స్వపరేతి భిదా యతః॥8410॥*

మహానుభావా! ఇంతవరకును నీవు చెప్పిన మాటలు నిజమే. దేహాభిమానులలో అజ్ఞానకారణముగా ఏర్పడిన అహంకారము వలన స్వపరభేదము (తనవాడు - పరాయివాడు - అను భేదభావము) మెదలుచునే యుండును.

*4.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*శోకహర్షభయద్వేషలోభమోహమదాన్వితాః|*

*మిథో ఘ్నంతం న పశ్యంతి భావైర్భావం పృథగ్దృశః॥8411॥*

స్వపరభేదబుద్ధిగలవారు శోకము, హర్షము, భయము, ద్వేషము, లోభము, మోహము, మదము మున్నగువానికి లోనగుచు 'తామే చంపెడివారమనియు, చంపబడువారము' అనియు భావించుచుందురు. అట్టివారు నిజముగా జీవుల జననమరణములకు సృష్టిస్థితి లయకారకుడైన భగవంతుడే ప్రేరకుడని గ్రహింపజాలరు.

శ్రీశుక ఉవాచ

*4.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*కంస ఏవం ప్రసన్నాభ్యాం విశుద్ధం ప్రతిభాషితః|*

*దేవకీవసుదేవాభ్యామనుజ్ఞాతోఽవిశద్గృహమ్॥8412॥*

*శ్రీశుకుడు పలికెను* దేవకీవసుదేవులు ప్రసన్నులై, నిష్కల్మషభావముతో ఇట్లు సంభాషించిన పిదప కంసుడు వారి అనుమతి గైకొని, తన భవనమున ప్రవేశించెను.

*4.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం కంస ఆహూయ మంత్రిణః|*

*తేభ్య ఆచష్ట తత్సర్వం యదుక్తం యోగనిద్రయా॥8413॥*
ఆ రాత్రి గడచిన పిమ్మట ప్రాతఃకాలమున కంసుడు తన మంత్రులను పిలిపించి, సమావేశపఱచెను. అనంతరము అతడు యోగమాయ పలికిన మాటలను పూర్తిగా వారికి వివరించెను.

*4.30 (ముప్పదియవ శ్లోకము)*

*ఆకర్ణ్య భర్తుర్గదితం తమూచుర్దేవశత్రవః|*

*దేవాన్ ప్రతి కృతామర్షా దైతేయా నాతికోవిదాః॥8414॥*

సహజముగనే దైత్యులు (కంసమంత్రులు) దేవతలయెడ ఈర్ష్యగలవారు, పైగా యుక్తాయుక్త విచక్షణ లేనివారు (కార్యాకార్య వివేకరహితులు). దేవతలయెడ శత్రుభావము వహించియున్న ఆ మంత్రులు తమ ప్రభువు చెప్పిన విషయములను వినిన పిమ్మట అతనితో ఇట్లనిరి-

PVD Subrahmanyam చెప్పారు...

*4.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*ఏవం చేత్తర్హి భోజేంద్ర పురగ్రామవ్రజాదిషు|*

*అనిర్దశాన్ నిర్దశాంశ్చ హనిష్యామోఽద్య వై శిశూన్॥8415॥*

"కంసమహారాజా! యోగమాయ చెప్పినమాలు నిజమేయైనచో పురుషులను, గ్రామములను, గొల్లపల్లెలను, తదితర ప్రదేశములను గాలించెదము. అచటనున్న పదిదినములు వయస్సు నిండిన శిశువులను, నిండనివారిని గూడ నేడే చంపివేసెదము.

*4.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*కిముద్యమైః కరిష్యంతి దేవాః సమరభీరవః|*

*నిత్యముద్విగ్నమనసో జ్యాఘోషైర్ధనుషస్తవ॥8416॥*

దేవతలు యుద్ధమను మాటను విన్నంతనే భీతిల్లుచుందురు. అంతేగాక, నీ ధనుష్టంకారము వినబడినంతనే ఎల్లప్పుడు భయకంపితులగుచుందురు. అట్టివారు తమ ప్రయత్నములచే మనలను ఏమి చేయగలరు?

*4.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*అస్యతస్తే శరవ్రాతైర్హన్యమానాః సమంతతః|*

*జిజీవిషవ ఉత్సృజ్య పలాయనపరా యయుః॥8417॥*

నీవు ప్రయోగించిన శరపరంపరచే చావుదెబ్బలు తినుచు అందులకు తట్టుకొనలేక, దేవతలు తమ ప్రాణములను రక్షించుకొనుటకై, యుద్ధరంగమును వీడి చెల్లాచెదరై పలాయనము చిత్తగింతురు.

*4.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*కేచిత్ప్రాంజలయో దీనా న్యస్తశస్త్రా దివౌకసః|*

*ముక్తకచ్ఛశిఖాః కేచిద్భీతాః స్మ ఇతి వాదినః॥8418॥*

దేవతలలో కొందరు తమ అస్త్రశస్త్రములను పరిత్యజించి, దీనులై చేతులు కట్టుకొని, నీ ముందు నిలుతురు. మరికొందరు తమ పంచకట్టులు, జుట్టుముడులు విడిపోగా, 'ఆర్యా! మేము భయగ్రస్తులమైతిమి, మమ్ము రక్షింపుము" అని నిన్ను వేడుకొందురు.

*4.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*న త్వం విస్మృతశస్త్రాస్త్రాన్ విరథాన్ భయసంవృతాన్|*

*హంస్యన్యాసక్తవిముఖాన్ భగ్నచాపానయుధ్యతః॥8419॥*

కంసభూపతీ! అస్త్రమంత్రములను మరచిపోయినవారిని, శస్త్రములను ప్రయోగించుటలో నైపుణ్యమును కోల్పోయినవారిని, రథములు విరిగిపోయినవారిని, భయముతో వణికిపోవుచున్నవారిని, బ్రతుకుపైగల ఇచ్ఛతో యుద్ధవిముఖులైనవారిని, ధనుర్బాణములు భగ్నములు కాగా యుద్ధమును మానుకొనినవారిని నీవు చంపవుగదా?

*4.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*కిం క్షేమశూరైర్విబుధైరసంయుగవికత్థనైః|*

*రహోజుషా కిం హరిణా శంభునా వా వనౌకసా|*

*కిమింద్రేణాల్పవీర్యేణ బ్రహ్మణా వా తపస్యతా॥8420॥*

దేవతలు గృహములయందే తమ శౌర్యములను ప్రకటించుకొనుచుందురు. అంతేగాదు, వారు రణరంగముల యందుగాక ఇతర ప్రదేశముల యందు తమ బలపరాక్రమములను గూర్చి బీరములు పలుకుచుందురు. ఇంక త్రిమూర్తులలో విష్ణువు రహస్యముగా సంచరించు చుండును. శివుడు వనములయందు నివసించు చుండును. బ్రహ్మదేవుడు తఫశ్చర్యలలో మునిగియుండును. ఇక ఇంద్రుని సంగతి సరేసరి. అతడు మనముందు దుర్బలుడు. కనుక ఇట్టివారికై మనకు భయపడవలసిన పని యేమున్నది.

*4.37 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*తథాపి దేవాః సాపత్న్యాన్నోపేక్ష్యా ఇతి మన్మహే|*

*తతస్తన్మూలఖననే నియుంక్ష్వాస్మాననువ్రతాన్॥8421॥*

ఐనను, దేవతలు మనకు దాయాదులు (జ్ఞాతులు). కావున వారిని ఉపేక్షించదగదు. కనుక వారిని సమూలముగా సంహరింప వలసియున్నది. మేము నీకు నమ్మిన బంటులము. కావున, వారిని హతమార్చుటకై మమ్ములను ఆజ్ఞాపింపుము.

*4.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*యథాఽఽమయోఽఙ్గే సముపేక్షితో నృభిర్న శక్యతే రూఢపదశ్చికిత్సితుమ్|*

*యథేంద్రియగ్రామ ఉపేక్షితస్తథా రిపుర్మహాన్ బద్ధబలో న చాల్యతే॥8422॥*

మనుష్యులు తమ శరీరముల యందు ఏర్పడిన రోగములకు తగు చికిత్స చేయక ఉపేక్షించినచో, అవి ముదిరిపోయిన పిమ్మట వాటిని నయము చేయుట అసాధ్యము. ఇంద్రియములయెడ ఉపేక్షాభావము వహించినచో వాటిని అదుపుచేయుట కష్టము. అట్లే శత్రువిషయమున సాచివేత భావమును చూపినచో అతడు బలవంతుడగును. అంతట అతనిని ఎదుర్కొనుట అశక్యము.

PVD Subrahmanyam చెప్పారు...

*4.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*మూలం హి విష్ణుర్దేవానాం యత్ర ధర్మః సనాతనః|*

*తస్య చ బ్రహ్మగోవిప్రాస్తపో యజ్ఞాః సదక్షిణాః॥8423॥*

*4.40 (నలుబదియవ శ్లోకము)*

*తస్మాత్సర్వాత్మనా రాజన్ బ్రాహ్మణాన్ బ్రహ్మవాదినః|*

*తపస్వినో యజ్ఞశీలాన్ గాశ్చ హన్మో హవిర్దుఘాః॥8424॥*

సమస్త దేవతలకును మూలపురుషుడు (రక్షకుడు) విష్ణువు సనాతనధర్మము వర్ధిల్లుచుండెడిచోట అతడు నివసించుచుండును. వేదములు, గోవులు, బ్రాహ్మణులు, తపశ్చర్యలు, దక్షిణలతోగూడిన యజ్ఞములు మొదలగునవి సనాతన ధర్మమునకు మూలములు. కావున, కంసప్రభూ! వేదవాదులైన బ్రాహ్మణులను, తపస్సంపన్నులను, యజ్ఞములను ఆచరించు స్వభావము గలవారిని, యజ్ఞహోమములకై ఆవశ్యకములైన నేయి, పాలు, పెఱుగు మొదలగు పదార్థములను సమకూర్చెడి గోవులను పూర్తిగా రూపుమాపెదము.

*4.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*విప్రా గావశ్చ వేదాశ్చ తపః సత్యం దమః శమః|*

*శ్రద్ధా దయా తితిక్షా చ క్రతవశ్చ హరేస్తనూః॥8425॥*

*4.42 (నలుబది రెండవ శ్లోకము)*

*స హి సర్వసురాధ్యక్షో హ్యసురద్విడ్గుహాశయః|*

*తన్మూలా దేవతాః సర్వాః సేశ్వరాః సచతుర్ముఖాః|*

*అయం వై తద్వధోపాయో యదృషీణాం విహింసనమ్॥8426॥*

మహారాజా! బ్రాహ్మణులు, గోవులు, వేదములు, తపస్సులు, సత్యము, దమము (బాహ్యేంద్రియ నిగ్రహము) , శమము (మనో నిగ్రహము), శ్రద్ధ, దయ, సహనము, క్రతువులు - ఇవి అన్నియును శ్రీహరియొక్క శరీరాంగములు. వాటిని రూపుమాపినచో అతడు అంతరించును. అట్టి శ్రీమన్నారాయణుడు సకల దేవతలకునూ అధిపతి, అసురులకు ప్రధాన శత్రువు. సత్పురుషుల హృదయములే ఆయనకు నివాసములు. ఈశ్వరుడు, బ్రహ్మ మొదలగు సకల దేవతలకును అతడే ఆధారము. కావున ఋషులను హింసించుటయే ఆయనను వధించుటకు తగిన ఉపాయము".

*శ్రీశుక ఉవాచ*

*4.43 (నలుబదిమూడవ శ్లోకము)*

*ఏవం దుర్మంత్రిభిః కంసః సహ సమ్మంత్ర్య దుర్మతిః|*

*బ్రహ్మహింసాం హితం మేనే కాలపాశావృతోఽసురః॥8427॥*

*శ్రీశుకుడు పలికెను* కంసుడే దుష్టుడు, అతని మంత్రులు అతని కంటెను మిగుల దుర్మార్గులు. అతడు వారితో సమాలోచన చేసిన పిమ్మట కాలపాశవశుడై (ఆయువు మూడినవాడై) బ్రాహ్మణులను హింసించుటవలననే తనకు మేలు కలుగునని తలంచెను.

*4.44 (నలుబది నాలుగవ శ్లోకము)*

*సందిశ్య సాధులోకస్య కదనే కదనప్రియాన్|*

*కామరూపధరాన్ దిక్షు దానవాన్ గృహమావిశత్॥8428॥*

దానవులు సహజముగనే యుద్ధకండూతిగలవారు. పైగా కామరూపధరులు. అట్టివారిని కంసుడు సాధుజనులను హింసించుటకై ఆదేశించి, అన్ని దిక్కులకును పంపి, తన భవనమున ప్రవేశించెను.

*4.45 (నలుబది ఐదవ శ్లోకము)*

*తే వై రజఃప్రకృతయస్తమసా మూఢచేతసః|*

*సతాం విద్వేషమాచేరురారాదాగతమృత్యవః॥8429॥*

దానవులు సహజముగా రజోగుణము గలవారు, వారు తమోగుణకారణముగా ఉచితానుచితజ్ఞాన రహితులు. పైగా చావుమూడి యున్నందున వారు సత్పురుషులను ద్వేషింపసాగిరి.

*4.46 (నలుబది ఆరవ శ్లోకము)*

*ఆయుః శ్రియం యశో ధర్మం లోకానాశిష ఏవ చ|*

*హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమః॥8430॥*

పరీక్షిన్మహారాజా! సత్పురులకు అపచారమొనర్చిన మానవులు తమ దుష్కృత్యముల కారణముగా ఆయువును, సంపదలను, కీర్తిప్రతిష్ఠలను ధర్మమును (పుణ్యమును) ఇహలోక పరలోక సుఖములను, సకలశ్రేయస్సులను కోల్పోవుదురు. ఇక పూనిక వహించి, తమ అపరాధముల ద్వారా పాపములను మూటగట్టుకొనెడి దానవుల విషయమున చెప్పనేల?

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే చతుర్థోఽధ్యాయః (4)*

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి నాలుగవ అధ్యాయము (4)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*152వ నామ మంత్రము* 16.11.2020

*ఓం నిష్కారణాయై నమః*

సృష్టి-స్థితి-లయ-తిరోధాన-అనుగ్రహములను పంచకృత్యముల నిర్వహణలో తనకంటూ కారణములు ఏవియూ లేక ఇచ్ఛాజ్ఞానక్రియా శక్తిస్వరూపిణియై, సర్వానికి తానే కారణమై తేజరిల్లు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిష్కారణా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం నిష్కారణాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు భక్తులకు సర్వాభీష్ట సిద్ధికలుగును మరియు ఆత్మానందానుభూతితో జన్మతరించినది యని సంతోషింతురు.

జగన్మాత జగత్తులో ప్రాణికోటికి కావలసినవన్నీ అనుగ్రహించడానికి కారణములేవియు ఉండవు. తానే అన్నిటికీ కారణమైయున్నది. ఇంకనూ యోచనచేసిచూడ కారణములకే అధిష్ఠానదేవత జగన్మాత. సమస్త విశ్వనిర్మాణంలో కారణాల నిమిత్తంలేనిది జగన్మాత. ఎందుకంటే ఆ తల్లి పరమాత్మ. పరబ్రహ్మస్వరూపిణి. ఆ తల్లి సహస్రారంలో ఉన్నది *సహస్రారాంబుజారూఢా* (105వ నామ మంత్రము) - బ్రహ్మరంధ్రానికి దిగువన వేయిదళముల పద్మమందు ఉన్నది. సహస్రారమునే మహాపద్మవనమని కూడా అందురు. *మహాపద్మాటవీ సంస్థా* (59వ నామ మంత్రము) - గొప్పపద్మములు గల అడవి (సహస్రార చక్రంలో ఉన్న సహస్రదళపద్మము) యందు ఉన్నది. వీటన్నిటికీ కారణములు ఏమియు ఉండవు. అందుకే తల్లిని *నిష్కారణా* యని అనబడినది.

ఆత్మస్వరూపిణియైన జగన్మాత దేనికైనా కారణమౌతుంది గాని పరమాత్మయైన ఆ తల్లికి కార్యకారణము లేవియు ఉండవు. గాన జగన్మాత *నిష్కారణా* యను నామ మంత్రముతో స్తుతింప బడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిష్కారణాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*726వ నామ మంత్రము* 16.11.2020

*ఓం సనకాది సమారాధ్యాయై నమః*

శ్రీవిద్యా గురుపరంపర లోని సనకసనందనాదులచే ఆరాధింపబడిన శ్రీవిద్యాస్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సనకాదిసమారాధ్యా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం సనకాదిసమారాధ్యాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఉపాసించు ఉపాసకులు ఆ పరమేశ్వరి కరుణచే బ్రహ్మజ్ఞానసంపదలతోబాటు ఎనలేని శాంతిసౌఖ్యములు కూడా పొందుదురు.

సనక సనందనాదులగు మహర్షులు శ్రీవిద్యోపాసకులు. ఇంద్రాది దేవతల నుండి శ్రీవిద్య సనక సనందనాదులకు లభించినది. వీరు శ్రీవిద్యను మానవులకు కూడా బోధిస్తూ, వారుకూడా శ్రీవిద్యోపాసనద్వారా జగన్మాతను ఉపాసించారు. గనుకనే శ్రీవిద్యాగురుపరంపరలో సిద్ధౌఘమునందున్నవారు. వీరిని కూడా లెక్కించారు.

విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయవిజయుల శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయవిజయులు ఇరువురూ విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోని రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడమూ... వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలను దాల్చడం తెలిసిందే! ఇంతకీ ఆ జయవిజయులకు శాపం ఇచ్చి, పరోక్షంగా లోకకళ్యాణానికి కారణమైన వారు మరెవ్వరో కాదు- సనకసనందనాదులు! ఇంతకీ ఎవరీ సనకసనందనాదులు?

చాలామంది సనకసనందనాదులు ఇద్దరనుకుంటారు. నిజానికి వీరు నలుగురు అన్నదమ్ములు. వారి పేర్లు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతలు. కొన్ని చోట్ల సనత్సుజాతుని పేరు బదులుగా సనాతన అన్న పేరు కనిపిస్తుంది. ఈ నలుగురు అన్నదమ్ములూ బ్రహ్మమానస పుత్రులు. ప్రాణులను సృష్టించే పనిని ప్రారంభించిన బ్రహ్మదేవుడు, తన పనిలో తోడుగా ఉంటారని తలంచి ఈ నలుగురికీ జన్మనిచ్చాడట. అయితే బ్రహ్మదేవుని మానసం నుంచి పూర్తి సత్వ గుణంతో ఆవిర్భవించిన సనకసనందనాదులు... తమ జీవితాలను వైరాగ్యంలోనే గడిపేందుకు సిద్ధపడ్డారు.

సనకసనందనాదులు బాల్యంలోనే వేదాలను ఔపోసన పట్టేశారు. బ్రహ్మజ్ఞానంలోని లోతులను దాటేశారు. బ్రహ్మచారులై లోకసంచారం చేస్తూ, తమకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ ఉండేవారట. నిష్మల్మషమైన మనసు కలిగిన వారు కావడం చేత వీరి శరీరాలు ఎప్పుడూ బాల్యావస్థని దాటి ఎరుగవు. కానీ వృద్ధులైనవారికి సైతం ఆధ్మాత్మిక రహస్యాలను అందించగల జ్ఞానవృద్ధులు. నారదుడు, మార్కండేయుడు వంటి మహారుషులు సైతం వీరి నుంచి బోధను గ్రహించినవారే. ‘అజ్ఞానానికి అహంకారమే మూలం’ అంటూ పృధు చక్రవర్తికి బోధించినా, ‘ఆత్మ ఒక్కటే సత్యం’ అంటూ దృతరాష్ట్రుని మనసుని తేటపరచినా... అది సనకసనందనాదులకే చెల్లింది.
భాగవత పురాణం ప్రకారం వీరు భగవంతుని లీలావతారాలలో భాగం. ఇక రామాయణంలోని ఉత్తరకాండలో సనకసనందనాదులు రాముని కలుసుకునే సన్నివేశం కనిపిస్తుంది. మహాభారతంలో అయితే జ్ఞానబోధకులుగా వీరు పలుమార్లు కనిపిస్తారు. ఇలా సనకసనందనాదులు గురించి పురాణాలలో ఏవో ఒక ప్రస్తావనలు కనిపిస్తూనే ఉంటాయి. అటు విష్ణుసంబంధమైన సాహిత్యంలోనూ, ఇటు శైవ సాహిత్యంలోనూ వీరి గురించి ఏవో ఒక గాథలు వినిపిస్తూనే ఉంటాయి.

అటువంటి సనకాది బ్రహ్మవేత్తలచే ఆరాధింపబడినది గనుక జగన్మాత *సనకాది సమారాధ్యా* యని నామప్రసిద్ధయైనది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సనకాది సమారాధ్యాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*5.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*పూజితః సుఖమాసీనః పృష్ట్వానామయమాదృతః|*

*ప్రసక్తధీః స్వాత్మజయోరిదమాహ విశాంపతే॥8452॥*

పరీక్షిన్మహారాజా! అంతట నందుడు వసుదేవునకు స్వాగత మర్యాదలను జరిపి, ఆయనను సుఖాసీనుని గావించెను. పిమ్మట అతడు వసుదేవునితో సాదరముగా కుశలప్రశ్నలు గావించెను. అనంతరము వసుదేవుడు తన ఇరువురు కుమారుల (బలరామకృష్ణుల) యొక్క యోగక్షేమముల యెడ మిగుల ఆసక్తి కలవాడై ఇట్లనెను-

*5.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*దిష్ట్యా భ్రాతః ప్రవయస ఇదానీమప్రజస్య తే|*

*ప్రజాశాయా నివృత్తస్య ప్రజా యత్సమపద్యత॥8453॥*

*5.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*దిష్ట్యా సంసారచక్రేఽస్మిన్ వర్తమానః పునర్భవః|*

*ఉపలబ్ధో భవానద్య దుర్లభం ప్రియదర్శనమ్॥8454॥*

*5.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*నైకత్ర ప్రియసంవాసః సుహృదాం చిత్రకర్మణామ్|*

*ఓఘేన వ్యూహ్యమానానాం ప్లవానాం స్రోతసో యథా॥8455॥*

"సోదరా! నందగోపా! వృద్ధుడవైన నీకు ఇంతవరకును సంతానము కలుగకుండెను. కలుగునను ఆశయు లేకుండెను. అదృష్టవశమున నీకు సంతానము లభించెను. ఆత్మీయులమైన మనము ఇరువురము ఇప్పుడు ఇట్లు కలిసికొనుట సంతోషదాయకము. ఈ సంసార చక్రమున ఇట్లు జరుగుట సాధారణముగా మిగుల దుర్లభము. మన ఈ సమాగమము మహాభాగ్యవిశేషము. ఒక విధముగా పునర్జన్మవంటిది. నదీ ప్రవాహమున కొట్టుకొనిపోవుచుండెడి కర్రలు ఒకచోట చేరజాలనట్లు, ఎట్టి అరమరికలు లేని ప్రాణమిత్రులు ఒకచోట చేరి నివసించుటయు అసంభవము. ఏలయన, వారి వారి కర్మలననుసరించి వారు వేర్వేరుగా ఉండవలసివచ్చును గదా!

*5.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*కచ్చిత్పశవ్యం నిరుజం భూర్యంబుతృణవీరుధమ్|*

*బృహద్వనం తదధునా యత్రాస్సే త్వం సుహృద్వృతః॥8456॥*

సోదరా! ఇప్పుడు నీవును, నీ బంధుమిత్రులు నివసించుచున్న నందగోకులము సుఖప్రదమేగదా! గోసంతతి అంతయును క్షేమమే గదా! సరస్సులును, వాగులును నీళ్ళతో నింఢియున్నవి గదా! పశువుల మేతకై పచ్చికబయళ్ళు సమృద్ధిగా వర్ధిల్లుచున్నవిగదా!

*5.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*భ్రాతర్మమ సుతః కచ్చిన్మాత్రా సహ భవద్వ్రజే|*

*తాతం భవంతం మన్వానో భవద్భ్యాముపలాలితః॥8457॥*

నా కుమారుడగు బలరాముడు, తల్లితో సహా (రోహిణితో గూడ) నీ గోకులమునందే నివసించుచున్నాడు. మీ దంపతుల చల్లని చేతులలో అతడు అల్లారు ముద్దుగా పెరుగుచున్నాడు. అందువలన అతడు మిమ్ములను కన్న తల్లిదండ్రులనుగా భావించుచుండవచ్చును.

*5.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*పుంసస్త్రివర్గో విహితః సుహృదో హ్యనుభావితః|*

*న తేషు క్లిశ్యమానేషు త్రివర్గోఽర్థాయ కల్పతే॥8458॥*

పురుషునకు విహితములైన ధర్మార్థకామములవలన స్వజనులు సుఖించినప్పుడే అవి అర్థవంతములగును. అట్లుగాక స్వజనులు దుఃఖములపాలై యుండగా, వాటి వలన అతడు మాత్రమే సుఖములను పొందుచున్నచో అవి వ్యర్థములే యగును".

*నంద ఉవాచ*

*5.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*అహో తే దేవకీపుత్రాః కంసేన బహవో హతాః|*

*ఏకావశిష్టావరజా కన్యా సాపి దివం గతా॥8459॥*

*5.30 (ముప్పదియ శ్లోకము)*

*నూనం హ్యదృష్టనిష్ఠోఽయమదృష్టపరమో జనః|*

*అదృష్టమాత్మనస్తత్త్వం యో వేద న స ముహ్యతి॥8460॥*

*నందుడు నుడివెను* "వసుదేవా! నీ భార్యయగు దేవకీదేవియందు జన్మించిన పలువురు పుత్రులను కంసుడు హతమార్చెను. కడకు మిగిలియున్న ఆ ఒక్క కుమార్తెయు ఆకాశమునకు చేరినదటగదా! వాస్తవముగా ప్రాణుల సుఖదుఃఖములన్నియును వారివారి అదృష్టముపై ఆధారపడి యుండును. అన్నింటికిని అదృష్టమే మూలము. ఈవిషయమును గుర్తించినవారు మోహజాలములో చిక్కుకొనరు".

*వసుదేవ ఉవాచ*

*5.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*కరో వై వార్షికో దత్తో రాజ్ఞే దృష్టా వయం చ వః|*

*నేహ స్థేయం బహుతిథం సంత్యుత్పాతాశ్చ గోకులే॥8461॥*

*వసుదేవుడు పలికెను* సోదరా! నందా! నీవు రాజునకు వార్షికమైన కప్పమును చెల్లించితివి. మనము ఇద్దరము కలిసికొనుటయు జరిగినది. ఇక ఇక్కడ ఎక్కువ దినములు ఉండుట తగదు. అచట గోకులమునందు పెక్కు ఉత్పాతములు కలుగుచున్నవి".

*శ్రీశుక ఉవాచ*

*5.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*ఇతి నందాదయో గోపాః ప్రోక్తాస్తే శౌరిణా యయుః|*

*అనోభిరనడుద్యుక్తైస్తమనుజ్ఞాప్య గోకులమ్॥8462॥*

*శ్రీశుకుడు వచించెను* వసుదేవుడు ఇట్లుపలికిన పిదప నందుడు మొదలగు గోపాలురు ఆయన అనుమతిని గైకొని, వృషభములను పూన్చిన బండ్లపై గోకులమునకు వెళ్ళిరి.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే పంచమోఽధ్యాయః (5)*

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి ఐదవ అధ్యాయము (5)

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశుక ఉవాచ*

*6.1 (ప్రథమ శ్లోకము)*

*నందః పథి వచః శౌరేర్న మృషేతి విచింతయన్|*

*హరిం జగామ శరణముత్పాతాగమశంకితః॥8463॥*

*శ్రీశుకుడు పలికెను* "వసుదేవుడు (గోకులమున ఉత్పాతములు సంభవింపవచ్చునని) పలికిన మాటలు నిజమే కావచ్చును" అని అనుకొనుచు నందుడు తన ప్రయాణమును కొనసాగించెను. పిదప అతడు 'అన్నింటికిని ఆ శ్రీహరియే రక్షకుడు' అని తలంచి, ఆ సర్వేశ్వరుని ప్రార్థించెను.

*6.2 (రెండవ శ్లోకము)*

*కంసేన ప్రహితా ఘోరా పూతనా బాలఘాతినీ|*

*శిశూంశ్చచార నిఘ్నంతీ పురగ్రామవ్రజాదిషు॥8464॥*

కంసుడు భయంకర రాక్షసియగు పూతనను బాలురను సంహరించుటకై ఆదేశించియుండెను. నందుడు గోకులమునకు చేరకముందే ఆ రాక్షసి-పురములయందును, గ్రామములయందును, గోకులముల యందునుగల శిశువులను హతమార్చుచు తిరుగసాగెను.

*6.3 (మూడవ శ్లోకము)*

*న యత్ర శ్రవణాదీని రక్షోఘ్నాని స్వకర్మసు|*

*కుర్వంతి సాత్వతాం భర్తుర్యాతుధాన్యశ్చ తత్ర హి॥8465॥*

భక్తులకు ఆ సర్వేశ్వరుడే పరమాశ్రయుడు. అందువలన వారు నిత్యము తమ తమ పనులను ఆచరించుచునే ఆ దేవదేవుని స్మరించుచుందురు. భగవన్నామ శ్రవణ కీర్తనాదులు ప్రవర్తిల్లు ప్రదేశముల యందు రాక్షసుల దురాగతములు పనిచేయవు. అట్టి భగవచ్చింతన లేనిచోట్ల మాత్రమే రాక్షసులు తమ అకృత్యములకు పాల్పడుచుందురు.

*6.4 (నాలుగ శ్లోకము)*

*సా ఖేచర్యేకదోపేత్య పూతనా నందగోకులమ్|*

*యోషిత్వా మాయయాఽఽత్మానం ప్రావిశత్కామచారిణీ॥8466॥*

ఆకాశమున సంచరింపగల ఆ పూతన క్రమముగా నందగోకులమును సమీపించెను. పిమ్మట ఆ కామచారిణి (ఇష్టమైనరీతిలో సంచరింపగల ఆ రాక్షసి) తన మాయాప్రభావమున చక్కని సుందరి (గోపిక) రూపమును దాల్చి గోకులమునందు ప్రవేశించెను.

*6.5 (ఐదవ శ్లోకము)*

*తాం కేశబంధవ్యతిషక్తమల్లికాం బృహన్నితంబస్తనకృచ్ఛ్రమధ్యమామ్|*

*సువాససం కంపితకర్ణభూషణ-త్విషోల్లసత్కుంతలమండితాననామ్॥8467॥*

*6.6 (ఆరవ శ్లోకము)*

*వల్గుస్మితాపాంగవిసర్గవీక్షితైర్మనో హరంతీం వనితాం వ్రజౌకసామ్|*

*అమంసతాంభోజకరేణ రూపిణీం గోప్యః శ్రియం ద్రష్టుమివాగతాం పతిమ్॥8468॥*

అప్పుడు ఆ పూతన (సుందరి) తన కురులపై మల్లెపూల మాలికలను తురుముకొనియుండెను. ఆమె నితంబముల (పిఱుదుల) తీరు నిండుగానుండెను. వక్షస్థలము అనువగు శోభలతో ఒప్పుచుండెను. సన్నని నుడుము అందములను చిందించుచుండెను. ఆమె మేలైన వస్త్రములను ధరించియుండెను. అటునిటు కదలుచున్న కుండలముల కాంతులచేతను, ముంగురుల సోయగములచేతను ఆమె ముఖము శోభాయమానముగా నుండెను. ఆమె మనోజ్ఞమైన తన చిఱునవ్వుతోడను, ఇంపైన క్రీగంటి చూపులచేతను, ఆ వ్రజభామినుల యొక్క మనస్సులను దోచుకొనుచుండెను. కమలమును చేత ధరించి వచ్చుచున్న ఆ సుందరిని (పూతనను) చూచి గోపికలు 'ఆ లక్ష్మీదేవియే తన పతిని చూచు నెపముతో తమ భాగ్యములను పండించుటకై వచ్చినదా! యేమి? అని తలపోయసాగిరి.

*6.7 (ఏడవ శ్లోకము)*

*బాలగ్రహస్తత్ర విచిన్వతీ శిశూన్ యదృచ్ఛయా నందగృహేఽసదంతకమ్|*

*బాలం ప్రతిచ్ఛన్ననిజోరుతేజసం దదర్శ తల్పేఽగ్నిమివాహితం భసి॥8469॥*

బాలుర పాలిట మృత్యువైన ఆ పూతన శిశువులను వెదకుచు అప్రయత్నముగా (తలవని తలంపుగా) నందుని గృహమున ప్రవేశించెను. పిమ్మట ఆమె దుష్టసంహారకుడైన ఆ బాలకృష్ణుని జూచెను. అప్పుడు శయ్యపై పరుండియున్న ఆ స్వామి నివురుగప్పిన నిప్ఫువలె తన దివ్య తేజస్సును కప్పిపుచ్చుకొని యుండెను.

*భస్మచ్ఛన్నాగ్ని న్యాయము* - బూడిదచే కప్పబడిన అగ్నిరీతి - బూడిదచే కప్పబడిన నిప్పు బయటికి ఆరిపోయినట్లు కనబడుచున్నను, అది లోలోన కణకణలాడుచు మెరయుచునే యుండును. అట్లే శ్రీకృష్ణుడు బయటికి శిశువుగా కనబడుచున్నను లోపల దివ్యతేజస్సుతో వెలుగొందుచునే యుండెను.

*6.8 (ఎనిమిదవ శ్లోకము)*

*విబుధ్య తాం బాలకమారికాగ్రహం చరాచరాత్మా స నిమీలితేక్షణః|*

*అనంతమారోపయదంకమంతకం యథోరగం సుప్తమబుద్ధిరజ్జుధీః॥*

శ్రీకృష్ణుడు చరాచర జగత్తునకు ఆత్మస్వరూపుడు. అందువలన ఆ స్వామి ఆ వచ్చిన సుందరి శిశువుల ప్రాణములను హరించునట్టి రాక్షసియని గ్రహించి కనులు మూసికొనియుండెను. అంతట ఆ రాక్షసి (పూతన) ప్రాణాంతకమైన సర్పమును 'త్రాడు' అని భ్రమించి చేతికి తీసికొనినట్లుగా అనంతుడైన ఆ ప్రభువును తన యొడిలోనికి చేర్చుకొనెను.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*728వ నామ మంత్రము*

*ఓం చిత్కలాయై నమః*

సర్వజీవులలో శుద్ధ చైతన్యం యొక్క అంశయైన చిత్కలా రూపంలో ప్రకాశించు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *చిత్కలా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం చిత్కలాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు భక్తులు ఆ తల్లి కరుణచే ఆత్మానందానుభూతితో జన్మతరించినది యని సంతోషింతురు.

జగన్మాత సచ్చిదానంద స్వరూపిణి. ఆ పరమాత్మ యొక్క అఖండ చైతన్యములోని కొంతభాగము జీవుల శరీరాలలో ఉంటుంది. ఆ పరమేశ్వరి విరాట్స్వరూపాన్ని పోలిన మానవుణ్ణి సృష్టించాడు. ఆ పరమాత్మ బ్రహ్మరంధ్రం ద్వారా అతనిలో ప్రవేశించాడు. ఆ బ్రహ్మరంధ్రంద్వారా ప్రవేశించిన పరమాత్మ అంశమే చిత్కల (సచ్చిదానందరూపమైన పరబ్రహ్మ అంశము). సృష్టిలోని సమస్త అంశములూ పరమాత్మ అంశలు. ఈ చిత్కలయే చైతన్యము కాగా, పరమేశ్వరిస్వరూపమే ఈ చిత్కల. కాబట్టి జగన్మాత *చిత్కలా* అని అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం చిత్కలాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*154వ నామ మంత్రము*

*ఓం నిరుపాధయే నమః*

ఉపాధి అనగా శరీరము. శరీర సంబంధం వలన అజ్ఞానము, ద్వైదీభావన వంటి అవిద్యాలక్షణములెన్నియో ఏర్పడును. వీటన్నిటికి అతీతురాలైన పరబ్రహ్మస్వరూపిణి యైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిరుపాధిః* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం నిరుపాధయే నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు సాధకుడు జ్ఞానసంపన్నుడై, ద్వైదీభావము విడనాడి ఆత్మానందానుభూతితో తరించును.

ఉపాధి అనగా శరీరము. శరీరమునకు అవిద్యా (అజ్ఞాన) సంబంధమైన భేదభావము లెన్నియో కలుగును. ఉపాధి తన సమీపములో ఉన్నవాటిపై తన ప్రభావము చూపుట అని కూడా అర్థం తీసుకోవచ్చును. తెల్లని స్ఫటికం ప్రక్కన ఎర్రని మందార పుష్పం ఉంచినట్లైతే ఆ స్ఫటికమునకు ఎర్రని రంగులో గోచరిస్తుంది. దీనినే ఉపాధి అందురు. ఆత్మకు శరీరం ఉపాధి. శరీరం సంబంధంవల్ల శరీరంలోని ఆత్మకు భేదభావన, అజ్ఞానము కలుగుతాయి. అందువలన అరిషడ్వర్గములు ఆవహించుతాయి. అంతటితో ఆ శరీరమునావహించిన ఆత్మ అజ్ఞానపరమైన దుష్కృత్యము లెన్నియో ఒనర్చి, వాటి ఫలితంగా మరుజన్మలో ఆ ఆత్మ అనేకములైన శరీరములలో ప్రవేశించి మరింత అజ్ఞాన ప్రభావితమవుతుంది. అదే ఆ శరీరంపై శరీరంలోని ఆత్మ ఆధిపత్యము వహిస్తే శరీరసంబంధమైన అవిద్యాపరమైన అవలక్షణాలు ఆపాధింపబడక ధ్యానముతోను, అంతర్ముఖ సమారాధనతోను పరమాత్మకు మరింత దగ్గరై పరమాత్మనుండి విద్యాపరమైన భగవధ్యానము, ధర్మార్దకామముల సక్రమనిర్వహణ, దేవుడు మరియు జీవుడు ఒకటే అని చెప్పు అద్వైత తత్త్వము తనపరముగావించుకొని ఉత్తమగతులు లభింప జేసుకొనును. ఆరునెలలు అయితే వారు వీరు అవుతారు అంటారు. అంటే ఒక మంచివాడు చెడ్డవాడిని చేరదీస్తే చెడ్డవాడు మంచివాడైనా కాగలడు లేదా చెడ్డవాడు మంచివాడైనా కాగలడు. అది ఆధిపత్యప్రభావంపై ఉంటుంది. ప్రభావం పొందినదానికి ప్రాభావితము చేసినది ఉపాధి అవుతుంది. ఇది శరీరధారులకే కాని పరమాత్మస్వరూపిణి అయిన జగన్మాతకు కాదు. పరమాత్మను ప్రభావితం చేయునవేమియును లేవు. అందుకే ఆ తల్లిని *నిరుపాధి* అన్నారు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిరుపాధయే నమః* అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*నంద ఉవాచ*

*8.10 (పదియవ శ్లోకము)*

*అలక్షితోఽస్మిన్ రహసి మామకైరపి గోవ్రజే|*

*కురు ద్విజాతిసంస్కారం స్వస్తివాచనపూర్వకమ్॥8553॥*

*నందుడు ప్రార్థించెను* "ఆచార్యా! అట్లైనచో మా బంధుమిత్రాదులకు కూడ తెలియకుండా ఈ గోకులమునందు (ఈ గోశాలయందు) గోప్యముగా (ఎట్టి మేళతాళముల ఆర్భాటము లేకుండా) స్వస్తివాచన పూర్వకముగా (వేదమంత్రములతో) మా కుమారులకు ద్విజాతి సంస్కారములను (నామకరణాదులను) నిర్వహింపుము".

*శ్రీశుక ఉవాచ*

*8.11 (పదకొండవ శ్లోకము)*

*ఏవం సంప్రార్థితో విప్రః స్వచికీర్షితమేవ తత్|*

*చకార నామకరణం గూఢో రహసి బాలయోః॥8554॥*

*శ్రీశుకుడు వచించెను* - నందుడు ఆ విధముగా (గర్గమహామునివలననే తన బాలకులకు నామకరణాది సంస్కారములు జరుగవలయునను) తన కోరికను విన్నవించెను. అంతట ఆ మహర్షి ఎవ్వరికిని తెలియకుండా గోప్యముగా ఆ బాలకులకు నామకరణాది సంస్కారములను నెఱపెను.

*గర్గ ఉవాచ*

*8.12 (పండ్రెండవ శ్లోకము)*

*అయం హి రోహిణీపుత్రో రమయన్ సుహృదో గుణైః|*

*ఆఖ్యాస్యతే రామ ఇతి బలాధిక్యాద్బలం విదుః|*

*యదూనామపృథగ్భావాత్సంకర్షణముశంత్యుత॥8555॥*

*గర్గమహర్షి నుడివెను* "నందా! ఇతడు రోహిణీ పుత్రుడగుటవలన *రౌహిణేయుడు* అనియు, తన సుగుణ సంపదచే బంధుమిత్రులను ఆనందింపజేయువాడు కావున *రాముడు* అనియు పిలువబడును. ఇతడు అమిత (మిగుల) బలశాలికాగలడు. అందువలన *బలుడు* అనియు ప్రసిద్ధి వహించును. అంతేగాక, మీకును, యదువంశజులకును ఎట్టి భేదములకు తావులేకుండా సామరస్యమును కూర్చువాడు కావున *సంకర్షుణుడు* అనియు వ్యవహరింపబడును. శ్రీమహావిష్ణువుయొక్క ఆజ్ఞమేరకు యోగమాయ దేవకీదేవి గర్భస్థుడైయున్న ఏడవశిశువు రోహిణి కడుపున చేర్చుటచే ఈయనకు *సంకర్షణుడు* అను పేరు ప్రసిద్ధికెక్కెను.

*8.13 (పండ్రెండవ శ్లోకము)*

*ఆసన్ వర్ణాస్త్రయో హ్యస్య గృహ్ణతోఽనుయుగం తనూః|*

*శుక్లో రక్తస్తథా పీత ఇదానీం కృష్ణతాం గతః॥8556॥*

ఈ రెండవబాలుడు ప్రతియుగమునందును శుక్ల (తెలుపు) రక్త (ఎఱుపు) పీత (పసుపుపచ్చ) వర్ణములుగల (వన్నెలుగల) దేహములతో అలరారుచు లోకకళ్యాణార్థము అవతరించుచు వచ్చెను. ఈ యుగమునందు (ఇప్పుడు) కృష్ణవర్ణముతో (శ్యామవర్ణముతో) ఒప్పుచున్నందున ఇతడు *కృష్ణుడు* అని వ్యవహరింపబడును.

*8.14 (పదునాలుగవ శ్లోకము)*

*ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజః|*

*వాసుదేవ ఇతి శ్రీమానభిజ్ఞాః సంప్రచక్షతే॥8557॥*

పూర్వము ఒకప్పుడు ఈ నీ కుమారుడు వసుదేవుని ఇంట జన్మించెను. అందువలన అభిజ్ఞులు (ఈ రహస్యమును ఎఱిగినవారు). సకల శుభలక్షణ సంపన్నుడైన ఇతనిని *వాసుదేవుడు* అనియు పిలిచెదరు.

*8.15 (పదునైదవ శ్లోకము)*

*బహూని సంతి నామాని రూపాణి చ సుతస్య తే|*

*గుణకర్మానురూపాణి తాన్యహం వేద నో జనాః॥ 8558॥*

ఈ నీ కుమారునకు పెక్కురూపములు, పలునామములు గలవు. అవి అతని గుణకర్మలను అనుసరించి ఏర్పడినవి. వాటిని అన్నింటిని నేను ఎఱుగుదును. సామాన్యజనులు ఎఱుగరు.

*8.16 (పదహారవ శ్లోకము)*

*ఏష వః శ్రేయ ఆధాస్యద్గోపగోకులనందనః|*

*అనేన సర్వదుర్గాణి యూయమంజస్తరిష్యథ॥8559॥*

నందగోపా! ఈ బాలుడు (కృష్ణుడు) మీకు సకలశ్రేయస్సులను (ఐహిక-ఆముష్మిక సుఖసంపదలను) చేకూర్చగలడు. మీ పాలిట ఇతడు సకల శ్రేయోనిధి. మఱియు, ఇతడు గోపాలురకును, గోవులకును పరమానందదాయకుడు. ఎట్టి ఇక్కట్లు వచ్చినను ఈయన సహాయమున మీరు అవలీలగా బయటపడగలరు.

*8.17 (పదునేడవ శ్లోకము)*

*పురానేన వ్రజపతే సాధవో దస్యుపీడితాః|*

*అరాజకే రక్ష్యమాణా జిగ్యుర్దస్యూన్ సమేధితాః॥8560॥*

నందభూపతీ! పూర్వయుగమున అరాజక పరిస్థితులు ఏర్పడినప్పుడు తమను రక్షించువారు లేక సాధుపురుషులు దుర్మార్గులవలన పెక్కుబాధలకు లోనైరి. అప్పుడు ఈయన సహాయమువలన వారు ఉత్తేజితులై ఆ దుర్జనులపై విజయమును సాధించిరి.

*8.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*య ఏతస్మిన్ మహాభాగాః ప్రీతిం కుర్వంతి మానవాః|*

*నారయోఽభిభవంత్యేతాన్ విష్ణుపక్షానివాసురాః॥8561॥*

విష్ణురక్షణలో నున్న దేవతలను రాక్షసులు ఏమియు చేయజాలనట్లు, భక్తిశ్రద్ధలతో ఈ మహాత్ముని సేవించిన భాగ్యశాలురను కామక్రోధాది అంతఃశ్శత్రువులుగాని, దుష్టులైన కంసుడు మొదలగు బాహ్యశత్రువులుగాని ఏమియును చేయజాలరు.

*8.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*తస్మాన్నందాత్మజోఽయం తే నారాయణసమో గుణైః|*

*శ్రియా కీర్త్యానుభావేన గోపాయస్వ సమాహితః॥8562॥*

నందగోపా! ఈ నీ కుమారుడు తన కీర్తిప్రతిష్ఠలచేతను, సంపదలచేతను, ప్రాభవముల చేతను, తదితరములైన ఉదాత్తగుణములచేతను శ్రీమన్నారాయణునితో సమానుడు కాగలడు. అందువలన ఈతనిని కంటికి ఱెప్పవలె భద్రముగా చూచుకొనుచుండుము.

*8.20 (ఇరువదియవ శ్లోకము)*

*ఇత్యాత్మానం సమాదిశ్య గర్గే చ స్వగృహం గతే|*

*నందః ప్రముదితో మేనే ఆత్మానం పూర్ణమాశిషామ్॥8563॥*

ఈ విధముగా గర్గమహర్షి నందుని ఆదేశించి స్వస్థానమునకు వెళ్ళెను. పిదప నందుడు ఎంతయు సంతుష్టుడై ఆ మహాముని ఆశీస్సులతో తాను ధన్యాత్ముడైనట్లుగా భావించుకొనెను.

PVD Subrahmanyam చెప్పారు...

*8.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*కాలేన వ్రజతాల్పేన గోకులే రామకేశవౌ|*

*జానుభ్యాం సహ పాణిభ్యాం రింగమాణౌ విజహ్రతుః॥8564॥*

కొన్ని దినములకు పిమ్మట బలరామకృష్ణులు మోకాళ్ళతో, చేతులతో అటునిటు ప్రాకుచు గోకులమునందు అంతటను క్రీడింప (విహరింప) సాగిరి.

*8.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*తావంఘ్రియుగ్మమనుకృష్య సరీసృపంతౌ ఘోషప్రఘోషరుచిరం వ్రజకర్దమేషు|*

*తన్నాదహృష్టమనసావనుసృత్య లోకం ముగ్ధప్రభీతవదుపేయతురంతి మాత్రోః॥8565॥*

ఆ ఇరువురును తమ చిట్టి చిట్టి పాదములతో, చేతులతో దోగాడుచు, గోకులము నందలి తేమనేలలపై తిరుగాడుచుండిరి. అప్ఫుడు వారి కాళ్ళయందును, నడుముల యందును గల చిఱుగజ్జెల సవ్వడులు వినసొంపుగా నుండెను. ఆ ధ్వనులను వినుచు వారు ఎంతయు మురిసిపోవుచుండిరి. అప్ఫుడప్ఫుడు క్రొత్తవారివెంట వెళ్ళుచు, వారు అపరిచితులని తెలియగనే భయముతో వెంటనే అమాయకులవలె వెనుకకు మఱలుచు చకచక తమ తల్లులగు రోహిణీ యశోదల కడకు చేరుచుండిరి.

*8.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*తన్మాతరౌ నిజసుతౌ ఘృణయా స్నువంత్యౌపంకాంగరాగరుచిరావుపగుహ్య దోర్భ్యామ్|*

*దత్త్వా స్తనం ప్రపిబతోః స్మ ముఖం నిరీక్ష్య ముగ్ధస్మితాల్పదశనం యయతుః ప్రమోదమ్॥8566॥*

అంతట యశోదారోహిణులు తమ కడకు వచ్చిన సుతులను మమకారముతో చూచుచున్నంతనే వారి స్తనములనుండి క్షీరము పొంగారుచుండెను. నేలపై తిరుగాడుటచే ధూళిధూసరితములై యున్న వారి శరీరముల సొబగులు ఆ తల్లుల ఆనందములను ఇనుమడింపజేయుచుండెను. వెంటనే వారు తమ చిన్నారులను ఆత్మీయతతో తమ చేతులలోనికి దీసికొని అక్కున జేర్చుకొనుచుండిరి. స్తన్యమును గ్రోలుచున్న ఆ బుడుతల ముఖములను జూచుచు వారు మురిసిపోవుచుండిరి. అప్పుడు ఆ శిశువులు అమాయకముగా తల్లులవైపు చూచుచు నవ్వుచుండగా వచ్చియు రాని చిఱుదంతములుగల ఆ కన్నయ్యల ముఖములను జూచుచు ఆ రోహిణీ యశోదలు పొందుచుండెడి సంతోషము అపారము.

*8.24 (ఇరువది నాలుగ శ్లోకము)*

*యర్హ్యంగనా దర్శనీయకుమారలీలావంతర్వ్రజేతదబలాః ప్రగృహీతపుచ్ఛైః|*

*వత్సైరితస్తత ఉభావనుకృష్యమాణౌ ప్రేక్షంత్య ఉజ్ఝితగృహా జహృషుర్హసంత్యః॥8567॥*

బలరామకృష్ణులు కొద్దిగా పెద్దవారైరి. చూడముచ్చట గొలిపెడి ఆ ఇరువురి బాల్యలీలలను గాంచుచు గోకులమునందలి గోపకాంతలు మిగుల ఆనందించుచుండిరి. ఆ చిట్టిబాలురు చిలిపితనముతో ఆవులేగల తోకలను గట్టిగా పట్టుకొనుచుండగా, ఆ దూడలు భయముతో వారినిగూడ లాగికొనుచు ఇటునటు పరుగెత్తసాగెను.ఆ అద్భుత దృశ్యమునకు అబ్బురపడిన గోపవనితలు తమ తమ ఇంటి పనులను గూడ మానుకొని, బయటికి వచ్చి, వారి అల్లరిచేష్టలను జూచుచు మిక్కిలి సంతోషపడుచుండిరి.

*8.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*శృంగ్యగ్నిదంష్ట్ర్యసిజలద్విజకంటకేభ్యః క్రీడాపరావతిచలౌ స్వసుతౌ నిషేద్ధుమ్|*

*గృహ్యాణి కర్తుమపి యత్ర న తజ్జనన్యౌ శేకాత ఆపతురలం మనసోఽనవస్థామ్॥8568॥*

బలరామకృష్ణుల నిలుకడ లేకుండా తమ ఆటలలో భాగముగా చేసెడి అల్లరిపనులకు అంతులేకుండెను. అప్పుడప్పుడు వారు కొమ్ములుగల హరిణములను, ఆవులను ఆటపట్టించుచుండిరి. నిప్పులతో చెలగాట మాడుచుండెడివారు, కోఱలుగల కుక్కపిల్లలతో వింతగా ఆడుకొనుచుండిరి. మిగుల పదునుగల కత్తులను దీసికొని మెఱపు వేగముతో త్రిప్పుచుండిరి. జలములలో నిర్భయముగా ఈదులాడుచుండిరి. నెమళ్ళు మొదలగు పక్షులతో గూడి గంతులు వేయుచుండిరి. ముండ్లబాటలలో సైతము పరుగెత్తుచుండిరి. హానికరములైన ఆ ఆటలనుండి వారిని మఱల్పలేక తల్లులు మిగుల భీతిల్లుచు, ఆ భయములో వారు తమ గృహకృత్యములను గూడ చేసికొనలేకుండిరి. అప్పటి ఆ తల్లుల మనస్సులకు ఏమాత్రమును స్వస్థత లేకుండెను.

*8.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*కాలేనాల్పేన రాజర్షే రామః కృష్ణశ్చ గోకులే|*

*అఘృష్టజానుభిః పద్భిర్విచక్రమతురంజసా॥8569॥*

రాజశ్రేష్ఠా! స్వల్పకాలములోనే బలరామకృష్ణులు మోకాళ్ళపై దోగాడుట మాని, అనాయాసముగా అడుగులు వేయుచు గోకులమునందు అంతటను హాయిగా తిరుగాడుచుండిరి.

*8.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*తతస్తు భగవాన్ కృష్ణో వయస్యైర్వ్రజబాలకైః|*

*సహ రామో వ్రజస్త్రీణాం చిక్రీడే జనయన్ ముదమ్॥8570॥*

శ్రీకృష్ణభగవానుడు క్రమముగా తన యీడు గోపబాలురతోడను, అన్నయగు బలరామునితోడను కూడి, కేరింతలతో క్రీడించుచు అచటి గోపాంగనలను ఆనందింపజేయుచుండిరి.

*8.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*కృష్ణస్య గోప్యో రుచిరం వీక్ష్య కౌమారచాపలమ్|*

*శృణ్వంత్యాః కిల తన్మాతురితి హోచుః సమాగతాః॥8571॥*

శ్రీకృష్ణుడు బాల్యచాపల్యమున చేసెడి చిలిపి చేష్టలకు అంతులేకుండెను. చూచుటకు అవి ముద్దు మురిపెములను గూర్చుచున్నను, ఆ అల్లరిపనులకు గోపికలు తట్టుకొనలేకుండిరి. అంతటవారు యశోదమ్మ కడకు వచ్చి, ఆమెతో ఇట్లు మొరపెట్టుకొనిరి.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*158వ నామ మంత్రము*

*ఓం నిర్మదాయై నమః*

శరీరమదము, ధనమదము, అధికారమదము, విద్యామదము, సంపదమదము వంటి మదములు మనసుకు సంబంధించినవి. ఆత్మకు సంబంధించవు. అటువంటి మదములు ఏమియు లేక నిర్మదయై విరాజిల్లు పరమాత్మ స్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిర్మదా* యను మూడక్షరాల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం నిర్మదాయై నమః* అని ఉచ్చరించుచూ, భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతను ఉపాసించు సాధకుడు నిశ్చయంగా అరిషడ్వర్గములకు అతీతంగా విరాజిల్లుచూ పరమేశ్వరీ పాదసేవలో తరించును.

అరిషడ్వర్గము లనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. అరిషడ్వర్గములు కేవలం మనసుకు సంబంధించినవి. ఆత్మకు కాదు. పరమేశ్వరి పరమాత్మ. ఆ తల్లికి ఇవేమియు (మదము వంటివి) ఉండవు. కాబట్టి ఆ తల్లి *నిర్మదా* యని నామ ప్రసిద్ధమైనది.

మనసున్న ప్రతీ జీవికి పలుకోరికలు ఉండడం సహజం. కోరిక అనగా కామము. కోరిక వెనుక క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఒకదాని వెంట ఒకటి ఆయా సందర్భములలో వచ్చేస్తాయి. అరిషడ్వర్గములలో మదము ఒకటి. మదము అనగా పలు అర్థములు గలవు. పొగరు, ఒళ్ళుకొవ్వెక్కడం, పరవశం అనగా తనను తను మరచిపోవడం. ఇక మదం ఉంటే దర్పం ఏర్పడుతుంది.

మదం అనేది *శారీరక మదం* (కండబలం) తనే బలవంతుడను, తనను మించిన వాడు లేడనే గర్వం అను లక్షణం , *ధనమదం* - నేనే ధనవంతుడను, ఏదైనా ధనంతో కొనవచ్చు, ధనహీనులనిన అసహ్యించుకోవడం, అవమానించడం ఇలా ఏధైనా కావచ్చు, *అధికారమదం* - తనకధికారం వస్తే, తనవద్దనున్నవారిని తూలనాడడం, పగసాధించడం కోసం వారిని హింసించడం, అధికార దుర్వినియోగంతో అక్రమంగా సంపాదించడం వంటి లక్షణములు కావచ్చు, *విద్యామదం* - తనకేదైనా విద్యలో పరిపూర్ణత సాధించుకున్నప్పుడు ఆ వ్యక్తిలో మార్పుకొందరికి వచ్చేస్తుంది. గర్వం ఏర్ఫడుతుంది. *విద్యా వినయేన శోభతే* అనునది మరచిపోయి తక్కువ విద్య ఉన్నవారిని *అల్పులని* మాటతూలడం లేదా వారు ఏదైనా విషయం చెపితే తిరస్కార భావంగా చూడడం, సూటిపోటి మాటలతో విమర్శించడం, సద్విమర్శలు చేయక హేళన చేయడం ఇలాంటి లక్షణములు, *భాగ్యమదం* - పుట్టుకతోనే భాగ్యవంతుడై ఉండడం, తన్మూలంగా భాగ్యహీనులను అవమానించడం వంటి లక్షణములు. ఇవన్నియు మదమునకు ఉన్న లక్షణములు. ఒళ్ళుతెలియక మాటలు తూలడం, ఎదుటి వారిని అవమానించడం, హింసించడం, ఎదుటి వారు బాధపడుతుంటే వికటాట్టహాసం చేయడం జరుగుతుంది. మదము అనేది జాగ్రస్వప్న అవస్థలయందే ఉంటుంది. సుషుప్తిలో ఉండదు. డంభము, దర్పము, దురభిమానము వంటి రాక్షస లక్షణములు మదము అని అంటారు. ఒళ్ళుతెలియక పరిమితులు దాటి మాట్లాడుతారు. ఇవన్నీ కేవలం మనసుకు సంబంధించినవి. ఆత్మకు సంబంధించినవి కావు. పరమేశ్వరి పరమాత్మస్వరూపిణి. గనుక ఆ తల్లికి అరిషడ్వర్గములలోని మదము ఉండదు. అందుకే ఆ తల్లి *నిర్మదా* యను నామముతో స్తుతింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిర్మదాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*732వ నామ మంత్రము*

*ఓం నామపారాయణ ప్రీతాయై నమః*

మాతృకానామ పారాయణ, సహస్రనామస్తోత్ర పారాయణ, ఖడ్గమాల పారాయణ, పంచదశాక్షరీ మంత్రయుత త్రిశతీ నామపారాయణ - ఇటువంటి నామపారాయణల యందు ప్రీతిగలిగిన జగజ్జననికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నామపారాయణప్రీతా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం నామపారాయణప్రీతాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు పరమేశ్వరి అనుగ్రహానికి పాత్రుడై అనంతమైన ఆత్మానందానుభూతిని పొందును. భౌతిక సుఖశాంతులు కూడా పొందును.

జగన్మాత తన నామములను అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆ తల్లిని అంతర్ముఖంగా వీక్షిస్తూ పారాయణ చేస్తే, అ పరమేశ్వరి బ్రహ్మానందభరితయై భక్తులను వరముల అమృతవృష్టిలో పరవశింపజేస్తుంది. ఆ జగన్మాతను స్మరించడానికి అనంతకోటి నామములు ఉన్నాయని చెప్పడానికి అతిశయోక్తికాదు. సహస్రనామస్తోత్రపారాయణ సాధారణంగా చేసి ఆ పరమేశ్వరిని ఆనందింపజేస్తాము. *ఖడ్గమాలాస్తోత్రం పారాయణ* చేస్తూ శ్రీమాతను సంబోధనచేస్తూ, న్యాసాంగదేవతలను (హృదయదేవీ, శిరోదేవీ, శిఖాదేవీ, కవచదేవి, నేత్రదేవీ, అస్త్రదేవీ) స్మరిస్తూ, శ్రీచక్రములోని నవావరణ దేవతలను స్తుతిస్తాము. పారాయణగా చదువుతాము. కుంకుమార్చన, పుష్పార్చన కూడా చేస్తాము. ఖడ్గమాలలోని నవావరణలోని దేవతలందరూ జగన్మాత స్వరూపములు. గాన ఖడ్గమాల పారాయణ శ్రీమాతకు ఆనందమిచ్చును.

*త్రిశతి* అనగా మూడువందల నామ మంత్రములు. పంచదశాక్షరిలోని పదునైదు బీజాక్షరముల (15) (క,ఏ,ఈ,ల,హ్రీం,హ,స,క,హ,ల,హ్రీం,స,క,ల,హ్రీం) కు ఒక్కొక్క బీజాక్షరమునకు ఇరువది (20) నామ మంత్రములతో మొత్తం త్రిశతి (300) . ఈ త్రిశతిని పారాయణగా గాని, పుష్పములు లేదా కుంకుమతో అర్చనగా గానిచేసి అమ్మవారిని ఆనందింప జేయవచ్చును. ఇంకను అష్టోత్తరశతనామ పారాయణ, శక్తిపంచాక్షరీ, బాలాత్రిపురసుందరి, పంచదశి, షోడశి మంత్రానుష్ఠానము కూడా పరమేశ్వరికి ఆనందము చేకూర్చునదే. సప్తశతి, మహావిద్య మొదలైనవి కూడా జగన్మాతను ఆనందింపజేయు నామపారాయణములలోనికి వచ్చును.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయము. అకారాది క్షకారాంతము వర్ణాలు అచ్చులతో కలిపి అసంఖ్యాకములైన నామ మంత్రములను మనం ఏర్పరుచవచ్చను. ఈ అసంఖ్యాకమైన నామములు ఒక విధంగా 20,736 నామ మంత్రములు కూర్పుచేయగలము. ఒక్కొక్క నామ మంత్రము ఏడక్షరములతో ఏర్పడుతుంది. వీటిని ఒకరోజులో గాని, వారం రోజులోగాని, పక్షంలోగాని పారాయణ చేస్తే అద్భుతమైన ఫలితం ఆ జగన్మాత ఆనందించగా లభిస్తుంది.

PVD Subrahmanyam చెప్పారు...

*ఈ 20,736 నామ మంత్రములు నేను (పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం) కూర్పు చేయుచున్నాను. రెండు లేదా మూడురోజులలో ఈ శుభకార్యక్రమము పూర్తి అవుతుంది అని విశ్వసిస్తున్నాను. అది ఎలాగో నేను సౌభాగ్యభాస్కరంలో చెప్పినవిధంగా చేయబోవుచున్నాను. ఆ నామమంత్రములు కావలసినవారు నన్నుసంప్రదించమని మనవి*

ఆ 20,736 నామములు కూర్చవలయునని అభిలాష గలవారికి ఇక్కడ వివరణ ఇవ్వడమైనది.

అ నుండి అః వరకు అచ్చులు - 16.

క నుండి క్ష వరకు హల్లులు - 35

35 హల్లులకు అచ్చులలోని అ మాత్రం చేర్చగా 36 అక్షరాలు అవుతాయి. ఈ ముప్పైఆరు హల్లులకు మొదట ఒక్కొక్క అచ్చును కలుపుతూ వ్రాయగా 36 x 16 = 576 అక్షరములగును. ఇవి అన్నియు కూర్పుచేయబోవు నామములకు ప్రథమాక్షరములు అవుతాయి. ఈ 576 అక్షరములను ప్రథమమున వ్రాస్తూ దాని తరువాత ముప్పై ఆరు అక్షరములను రెండు, మూడు, నాలుగు క్రమమున వ్రాయుచుండవలయును. అలా వ్రాయగా చివర ఆ, ఈ అను అక్షరములను చిట్టచివర కలుపుచు రెండు మూడు నాలుగు అను క్రమమున కకారాదిక్షకారాంతహల్లులన్నిటికిని స్వరములనన్నిటిని కూర్చుచుండవలయును. అలా చేస్తే ఇరవైవేలకు పైగా అత్యంత రహస్యనామములు పుట్టుచున్నవి. దేవీ భాగవతము తృతీయస్కంధమునందుగూడ "ఓ రామచంద్రమూర్తీ! అకారాది క్షకారాంతముగల అక్షరములను అచ్చులతోడను, హల్లులతోడను మరల మరల కూర్చినచో అసంఖ్యేయములు నామములగును" అని చెప్పబడినది. ఇలా కూర్చిన నామములను 1. అన్ని నామములను ఒకే రోజులో పారాయణచేయుట, 2. అన్ని నామములను వారములో పూర్తిచేయుట, 3. అన్ని నామములను పదునైదు దినములలో పూర్తిచేయుట, 4. అన్ని నామములను నెలలో పూర్తిచేయుట, 5. అన్ని నామములను ముప్పదియారు దినములలోపూర్తిచేయుట. దీనినే *నామపారాయణ కర్మమని* అందురు. అమ్మవారి *నామపారాయణప్రీతా* అను నామ మంత్రమునకు ఇదియే క్రమము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నామపారాయణప్రీతాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*159వ నామ మంత్రము*

*ఓం మదనాశిన్యై నమః*

డంబము, దర్పము, మదము వంటి అసురలక్షణములను నాశనము చేసి సాధకుని సన్మార్గమందు ముందుకు నడిపించుచూ అమృతత్త్వస్థితికి చేర్చు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మదనాశినీ* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం మదనాశిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునిలో ఏమైనా డంబము, దర్పము, మదము వంటి అసురలక్షణములేవైనా ఉంటే, అటువంటివి అన్నియు మటుమాయమై, సన్మార్గమునందు నడచుచూ, అమృతత్త్వస్థితికి చేరి తరించుననుటలో సందేహము లేదు.

ఇంతకు ముందు 158వ నామ మంత్రములో జగన్మాత పరమాత్మయనియు, అట్టి పరమాత్మ అరిషడ్వర్గములకు అతీతురాలని తెలిసియున్నాము. ఈ నామ మంత్రములో *(మదనాశనీ)* ఆ తల్లి తన భక్తులను కూడా డంబము, దర్పము, మదము వంటి అసురీలక్షణములకు అతీతులను చేయును. కాబట్టి ఆ తల్లిని *మదనాశినీ* అని అన్నాము.

మదము అంటే పొగరు. తనకు మించిన వారు లేరనేది తలబిరుసు. ఆ తలబిరుసులో మంచి వారినికూడా దుర్భాషలాడును. రావణాబ్రహ్మ బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. కైలాసాన్ని తనభుజస్కంధములతో పైకెత్తేసిన భుజబలశాలి. తన ప్రేగులతో వీణానాదము సృష్టించి శివస్తుతి చేసి తరించాడు. కాని బలమదముతో, విద్యామదముతో (బ్రహ్మజ్ఞాని కదా) అధికారమదముతో (లంకాధిపతి అయిన కారణముతో) నాశనమయాడు. జగన్మాత తన చేతి పదివ్రేళ్ళ గోళ్ళ సందులనుండి నారాయణుని దశావతారములు సృజించి *(కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః)* అతని మదమును నాశనము చేసినది. అంతేనా? కంసుడు, శిశుపాలుడు, దుర్యోధనాది కౌరవులు, హిరణ్యకశిపుడు, బలిచక్రవర్తి, కార్తవీర్యార్జునుడు మొదలైన మదమే తమస్వరూపమైన ఎందరో అసురలక్షణములున్నవారిని వారిమదమును నాశనము చేసినది. కాని జగన్మాత తన నామమును అంతర్ముఖసమారాధనతో స్మరించిన భక్తులలో మదము మరియు ఇతర అరిషడ్వర్గములను నాశనము చేసి సన్మార్గములో నడిపించి అమృతత్త్వస్థితికి చేర్చుతుంది.

మదము నశించినప్ఫుడు సమదృష్టి ఏర్పడుతుంది. అసురలక్షణములు అంతరించి దైవస్వరూపులౌతారు. వినయ విధేయతలు, విశ్వజనీనత వికసిస్తుంది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మదనాశిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*733వ నామ మంత్రము*

*ఓం నందివిద్యాయై నమః*

నటరాజ స్వామిచే నందీశ్వరాదులకు ఉపదేశింపబడిన ఆనందవిద్యా స్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నందివిద్యా* యను నాలుగక్షరముల(చతురక్షరీ) నామ మంత్రమును *ఓం నందివిద్యాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధిస్తే సాధకునికి ఆ పరమేశ్వరి అంతులేని ఆనందమయమైన జీవితమును ప్రసాదించి భౌతికపరమైన సుఖసంతోషములతో బాటు ఆధ్యాత్మిక పరమైన బ్రహ్మానందమునుకూడ అనుగ్రహించి తరింపజేయును.

శ్రీవిద్యవంటిదే నందివిద్యకూడా. నటరాజస్వామిచే నందీశ్వరాదులకు నందివిద్య ఉపదేశింపబడినది. నందీశ్వరుడు ఉపాసించాడు గనుక నందివిద్య అని అన్నారు. శ్రీవిద్యకూడా పరమేశ్వరునిచే ఉపదేశింపబడినదే. గనుక జగన్మాత *శ్రీవిద్యాస్వరూపిణి* అనబడినట్లే *నందివిద్యా స్వరూపిణి* అనికూడా అనబడినది. ఇక పరమేశ్వరుడు నటరాజు. అనగా నృత్యకళకే రాజు. ఆవిధంగా నందివిద్య నటరాజుచే ఉపదేశింపబడినది గనుక నృత్యకళ కు సంబంధించిన తాళము, లయ, ఛందస్సు, స్వరము, శ్రుతి, రంగప్రసాధనము అనునవి నందివిద్యలోని అంశములే. ఇందులో రంగప్రసాధనము అనగా రంగస్థలమునకు సంబంధించినవి. సాధారణంగా రంగస్థలంపై నాటకములో సన్నివేశమునకు సంబంధించిన విధంగా రంగస్థలం అలంకరింప బడుతుంది. ఉదాహరణకు సత్యహరిశ్చంద్ర నాటకములో హరిశ్చంద్రుడు కాటికాపరిగా ఉన్నప్ఫుడు స్మశానవాటికను కూడా చూపవలసివస్తుంది. సత్యహరిశ్చంద్రుడు నల్లని దుస్తులతో, తలకు నల్లని గుడ్డతో, భుజముపై నల్లని కంబళితో, చేతిలో ఒక కర్రతో, శవాల చితిమంటలతో, స్మశానమంతయు మానవ కపాలములతో, ఎముకలతో ...రంగస్థలం వాస్తవముగా స్మశానమే అను భ్రమ ప్రేక్షకునిలో కల్పించాలి. ఆ దృశ్యములో ప్రేక్షకుడు లీనమవాలి అనేవిధంగా రంగస్థలమును అలంకరించుటయే రంగప్రసాధనము అందురు. ఇందులో అనుష్ఠానపరంగా మంత్రము గలదు. రంగస్థలప్రసాధనము అనునది తంత్రభాగము. ఇలాంటి విద్యను నటరాజు నందీశ్వరునికి ఉపదేశించగా నందీశ్వరుడు ఈ విద్యను మంత్రయుక్తంగా ఉపాసించాడు గాన ఈ విద్యను *నందివిద్యా* అని అన్నారు. ఇందులో ఉన్న మంత్రభాగమే శ్రీవిద్యవలె నందివిద్యయని అనబడినది. ఈ విద్య నందీశ్వరుడు ఉపాసిస్తూ జగన్మాతను ఆరాధించగా జగన్మాత తన చతుష్షష్ఠికళలలోగల నృత్యకళయందు కూడా పరిపూర్ణురాలై *నందివిద్యా* స్వరూపిణి అయినది. గాన ఆ అమ్మవారు *నందివిద్యా* యని నామ ప్రసిద్ధమైనది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నందివిద్యాయై నమః* అని అనవలెను.

*160వ నామ మంత్రము*

*ఓం నిశ్చింతాయై నమః*

కలత, బాధ, నిరాశ, నిస్పృహ వంటి విచారకరమైన విషయములే చింతలు. ఇవి అన్నియూ మనసుకు సంబంధించినవేగాని ఆత్మకు సంబంధించినవి కావు. అట్టి చింతలు లేని తల్లియైన పరమాత్మస్వరూపిణి జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిశ్చింతా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం నిశ్చింతాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకుడు ఏవిధమైన చింతలు లేక భౌతిక సుఖసంతోషములతోబాటు, ఆత్మానందానుభూతితో జీవించును.

చింత అనేది మనసుకు సంబంధించినది. తానొకటి తలంచితే, జరిగేది వేరొకటై, ఆ జరిగినది తనతలంపుకు వ్యతిరేకమైనది అయితే నిరాశ ఏర్పడుతుంది. మానసికంగా సంఘర్షణ ప్రారంభమవుతుంది. మనసు పరిపరి విధములైన ఆలోచనలతో నిండిపోతుంది. పరధ్యానం ఏర్పడుతుంది. దీనినే చింత అంటారు. నమ్మిన మిత్రుడు మోసంచేసినా, ఎన్నో ఆశలు పెట్టుకున్న కొడుకులు పెళ్ళితరువాత తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆ కన్నవారికి అవసానదశపై మానసిక సంఘర్షణ (చింత) ఏర్పడుతుంది, ప్రేమించిన భార్య తనను నిర్లక్ష్యంచేస్తూ, మానసిక ప్రశాంతతలేకుండా వివాదాలు కల్పిస్తుంటే మానసిక సంఘర్షణ (చింత) ఏర్పడుతుంది. సంపాదన చాలకపోయినా, పిల్లలు చదువులో వెనుకబడినా, ఎదిగిన ఆడపిల్లకు మంచి సంబంధం తేవడానికి ఆర్ధికంగా తాహతు చాలకున్నా...ఇవే చింతలు అంటాము. మనసు తీవ్రమైన సంఘర్షణకు గురియవుతుంది. ఇదంతా మనసుకు సంబంధించినది. ఆత్మకు కాదు. పరమాత్మయైన జగన్మాత ఇటువంటి చింతలకతీతురాలు. అందుకే ఆ తల్లి *నిశ్చింతా* యని నామ ప్రసిద్ధమైనది. ఈ చింత అనేది సుషుప్తిలో ఉన్నప్పుడు ఉండదు. అప్ఫుడు ఆత్మమాత్రమే పనిచేస్తుంది. ఏ చింతా ఉండదు. అందుకే మానసిక వేదనతో ఉన్నవారిని ప్రశాంతంగా నిద్రపుచ్చడానికి వైద్యులు ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ మానసిక ప్రశాంతత జగన్మాతను అంతర్ముఖంగా ధ్యానించడమే. అన్నీ మరచి ధ్యాననిమగ్నతలో ఉంటే తప్పకుండా అమ్మవారు తన భక్తులను అన్నిరకాల చింతలనుండీ దూరం చేస్తుంది.

చింత అనునది *కపటము* అని అర్థం చేసుకుంటే జగన్మాత తనపై భక్తులకు గల భక్తికి హెచ్చుతగ్గులు పరికించదు. అంతర్ముఖంగాధ్యానం చేయువారిని, దీక్షగా ఉపాసన చేయువారిని కూడా భక్తులుగానే పరిగణిస్తుంది. కపటరహితంగా తన భక్తులను పరిగణిస్తుంది గనుక జగన్మాత *నిశ్చింతా* యని స్తుతింపబడుచున్నది.

*చింతా చితా సమాజ్ఞేయా చింతా వై బిందునాఽధికా|*

*చితా దహతి నిర్జీవం చింతా దహతి జీవితమ్ ॥* (సౌభాగ్యభాస్కరం, 356వ పుట)

*చింత* అను శబ్దములో మధ్య బిందువును తొలగించితే *చిత* అవుతుంది గదా! చిత అంటే చితి. చితి కేవలం ప్రాణంలేని కట్టెనే (మృత కళేబరమునే) కాల్చుతుంది. కాని చింత ప్రాణమున్న జీవుడినే దహిస్తుంది. చింత అనేది మనసుకు సంబంధించిన వ్యాధి అనగా *మనోవ్యాధి*. మనోవ్యాధికి కేవలం జగన్మాత నామ మంత్ర స్మరణ తప్ప వేరే మందు లేదు. జగన్మాత తనభక్తులను నిశ్చింతులను చేస్తుంది గనుక ఆ తల్లిని *నిశ్చింతా* యని స్తుతిస్తున్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిశ్చింతాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*734వ నామ మంత్రము*

*ఓం నటేశ్వర్యై నమః*

చిదంబర నటేశ్వరుని అనుకరించుచూ నృత్యము చేయు చతుష్షష్టి కళా స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నటేశ్వరీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం నటేశ్వర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ అఖిలాండేశ్వరిని భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి సర్వాభీష్టసిద్ధిని ప్రసాదించును.

నటేశ్వరీ అనగా నటించుటకు ఈశ్వరీ. ఈ విశాల జగత్తే ఒక రంగస్థలం. ఈ రంగస్థలానికి నిర్మాత ఆ జగజ్జనని. అందుకే ఆ తల్లి *నటేశ్వరీ* యని అనబడుచున్నది. ఈ రంగస్థలంపై జీవులన్నియు పాత్రధారులే. పాత్రల ప్రవేశం, నిష్క్రమణ అనేవి నిర్దేశించేది ఆ జగన్మాతయే. రంగస్థలంపై నటించడానికి కావలసిన శాస్త్రీయత సాక్షాత్తు చిదంబర నటరాజస్వామినుండియే అనుకరణకు కావలసిన సాంకేతికత గ్రహించినది జగన్మాత.

ఈ జగన్నాటకంలో జీవులు తమ పాత్రలలో శాస్త్రబద్ధంగా (ధర్మబద్ధంగా) జీవించాలి. ఆ ధర్మ బద్ధత ఏమిటంటే ధర్మార్ధకామములు, అరిషడ్వర్గ నియంత్రణ వంటి సాంకేతిక ధర్మములకు తగిన విధంగా జీవులు తమ పాత్రలలో జీవించాలి. జీవుల పాత్రపోషణకు జగన్మాత దర్శకురాలు. అందుకే ఆ తల్లి *నటేశ్వరీ* యని అనబడినది.

పరమేశ్వరుడు నటేశ్వరుడు. నాట్యభంగిమలో ఉన్నవాడు. ప్రదోషకాలంలో ఆయన నృత్య ప్రదర్శన ఇస్తూ ఉంటాడు. జగన్మాత ఆయనను అనుకరించింది. అందుకనే పరమేశ్వరుడు నటేశ్వరుడైతే, పరమేశ్వరి *నటేశ్వరీ* యని అనబడినది. జగన్మాత *చతుష్షష్ఠి కళామయి* అందుచేత నటేశ్వరుని అనుకరించడం ఆ తల్లికి సులభతరమైనది. చిదంబరేశ్వరుని అనుకరించి ఆయన వలెనే నాట్యముచేసినది జగన్మాత. ఆ తల్లి శంకరునివలెనే నటనము చేయడానికి ఒక కాలిని మోకాలివరకూ పైకెత్తినపుడు, ఆ వ్రేలాడు పాదము పద్మముగాను, పిక్కవరకూ ఉన్న కాలుని నాళముగాను, కాలి వ్రేళ్ళ గోళ్ళు కింజల్కములుగాను, పాదముల పారాణికాంతులు పద్మముయొక్క రేకులుగాను, కాలియందె తుమ్మెదగాను వర్ణనము చేయబడినది. అందుచే పార్వతి శంకరుని నటనమును అనుకరించినది గాన శంకరుడు నటేశ్వరుడైతే, జగన్మాత *నటేశ్వరి* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నటేశ్వర్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*735వ నామ మంత్రము*

*ఓం మిథ్యాజగదధిష్ఠానాయై నమః*

మిథ్యాభూత జగత్తునకు అధిష్ఠానమై (ఆధారభూతమై) విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మిథ్యాజగదధిష్ఠానా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం మిథ్యాజగదధిష్ఠానాయై నమః* యని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ తల్లి అనుగ్రహముతో జగత్తు అంతయు మిథ్య యనియు సత్యము, నిత్యమైనది పరమాత్మసన్నిధియనియు, అందుకోసము తానేమిచేయవలెనో తెలిసికొనును. అందుకోసం తన సాధన కొనసాగించి సాధించుకొనును.భౌతికపరమైన సుఖసంతోషములు కూడా ఆ తల్లి అనుగ్రహముచే సంప్రాప్తమవును.

మిథ్య అను పదానికి అర్థం మాయ. ఇంతకు ముందు *మాయా* యను 716వ నామ మంత్రము వివరణ జరిగినది. కాని ఈ మాయ రెండు రకములు. *ఒకటి* విద్యామాయ. *రెండవది* అవిద్యామాయ.

విద్యామాయ జ్ఞానసమ్మిళితమైనది. పరమాత్మ కొరకు అన్వేషణ చేసి తెలుసుకుంటుంది. వివేకము, వైరాగ్యము అని రెండు కలుగజేస్తుంది. భగవంతుని శరణు కోరుతుంది.

రెండవది అవిద్యామాయ. మహా మాయలాడి ఈ అవిద్య. కామక్రోధాది అరిషడ్వర్గముల మధ్య నిలుపుతుంది. నేను, నాది అనే అహంకారాన్ని రెచ్చగొడుతుంది. సంసారం అనే కారాగారంలో బంధింపజేస్తుంది. విద్యామాయ వ్యక్తం అయితే అవిద్యామాయ పలాయనం చిత్తగిస్తుంది, జ్ఞానజ్యోతులతో కాంతిమయమైన పరమాత్మ సన్నిధానాన్ని తిలకిస్తుంది జీవాత్మ. ఇది ఆ జీవుని పూర్వజన్మల కర్మలవాసనా ప్రభావితంగా పనిజేస్తుంది. ఇదంతా పరమేశ్వరి విసరిన మాయాజాలమే.

మిథ్య అను మాటకు వస్తే. జగత్తు అసత్యము. జగత్తు అనేది రంగస్థలం వంటిది. పాత్రలు ప్రవేశిస్తాయి నిష్క్రమిస్తాయి. నాటకమనేది రాత్రి చీకట్లో ప్రదర్శిస్తారు. అలాగే జగమనే నాటకంకూడా అజ్ఞానమనే చీకట్లో నడపబడుతుంది. అందుకే *అజ్ఞానధ్వాంత దీపిక* అయిన జగన్మాత అసత్యమయిన ఈ జగత్తులో తానొక అధిష్ఠానదేవతయై అజ్ఞానమనే (మిథ్యా) చీకటికి (జగత్తుకు) జ్ఞానదీపికయై (అధిష్ఠానయై) జీవులను సత్యమార్గంలో నడుపుతుంది గనుకనే జగన్మాత *మిథ్యాజగదధిష్ఠానా* యని నామప్రసిద్ధయైనది. అసత్యమైన జగత్తు భాసించాలంటే జగన్మాత ఆధారమైనది. ఈ మిథ్యాజగత్తులో లేనిపోని భ్రమలు, తాడు పామువలె, ముత్యపు చిప్ప వెండిచిప్పగా, మోసగాడు మంచివాడుగా, కులటలు పతివ్రతలుగా భ్రమలోకి రాకుండా జగన్మాత అధిష్ఠానపీఠముపైనుండి అసత్యంలోని సత్యాన్న వెలికి తీస్తుంది. అందుకే జగన్మాత *మిథ్యాజగదధిష్ఠానా* అని స్తుతింపబడుచున్నది. అసత్యమనే చత్వారానికి జ్ఞానమనే సులోచనముగా జగన్మాత అధిష్ఠాన పీఠముపైనధిష్ఠించి సత్యమనే అసలు దృష్టిని ఇస్తుంది కనుక జగన్మాత *మిథ్యాజగదధిష్ఠానా* యనునామముతో కీర్తింపబడుచున్నది. జగత్తు మిథ్యయను అనారోగ్యముతో అజ్ఞానమను అవసానదశకు చేరుకుంటుంటే జగన్మాత పరమాత్మగా ప్రాణముగా నిలచినది. బ్రహ్మమన్నది ఒక్కటే ఉంటుంది. అదే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే జగన్మాత. ద్వైతబుద్ధి మాయచే కల్పించబడుచున్నది. అద్వైతమే పరమార్థము. బ్రహ్మసత్యమైతే జగత్తు మిథ్య. అట్టి మిథ్య అయిన జగత్తుకు జగన్మాత ఆధారమైనది గాన జగన్మాతను *మిథ్యాజగదధిష్ఠానా* అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునఫుడు *ఓం మిథ్యాజగదధిష్ఠానాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*161వ నామ మంత్రము*

*ఓం నిరహంకారాయై నమః*

సాత్త్విక, రాజస, తామసములను త్రిగుణాత్మకమైన అహంకారము లేక నిరహంకారియై తేజరిల్లు పరమాత్మస్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిరహంకారా* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం నిరహంకారాయై నమః* యని ఉచ్చరించుచూ, ఆ పరాశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు నేను, నాది, అంతా నావలననే యను అహంకారముపోయి, కేవలం జగన్మాత నామస్మరణేపరమావధిగా జీవించి తరించును. అమ్మవారు అతనికి భౌతికపరమైన సుఖసంతోషములు, ఆత్మానందకరమైన బ్రహ్మజ్ఞాన సంపదలు ప్రసాదించి తరింపజేయును.

తల్లిప్రేగు త్రెంచుకుని భౌతిక ప్రపంచంలోకి రాగానే ఆ పసికందుపై నీళ్ళు జల్లుటతోనే ఆ శిశువు ఏడుపు ప్రారంభించును. శరీరంపై గిల్లుటతోడనే కేర్ మని నొప్పితో ఏడ్చును. అంటే ఆ దేహం తనది, దానికి నొప్పి కలిగిందనిగదా ఏడ్ఛేది. కొంచం ఊహవచ్చే సరికి తన తల్లి, తన తండ్రి, తన పరిసరాలు ఇలా నేను, నాది అనే భావం కలుగుతుంది. మాటలు వచ్చి, ప్రపంచం అంతా చూచుటతోనే తన వస్తువులు, తన ఇల్లు ఇలా తన, పర అనే భేదము తెలుస్తుంది. ఇదంతా అహంకారమే. ఇటువంటి అహంకారములు మూడు విధములు. 1) సాత్త్విక, 2) రాజస, 3) తామసములనెడి త్రిగుణాత్మకమైనది అహంకారము. ఇది నా దేహము అనే భావన వస్తుంది. తన గుండెలపై చేయివేసుకుని నేను అనడం జరుగుతుంది. అహంకారము కొంతవరకూ పరవాలేదు. తనయొక్క భౌతిక పరమైన బాధ్యతా నిర్వణవరకూ అహంకారం ఉండాలి. అది కొంచం ముదిరి అన్నీ తానే, తానే అన్నిటికీ కారణము, తనపైనే సర్వం ఆధారపడి ఉంది. ఈ పొలం నాది. ఈ భూమినాది అనే అహంకారం అది అరిషడ్వర్గముల వలన ఏర్పడుతుంది. నిజానికి పుట్టినప్ఫుడు మొలత్రాడుకూడా ఉండదు. పొయినప్పుడు ఒంటిమీద నూలుప్రోగు కూడా ఉండనీయరు. ఇవన్నీ మధ్యలోవచ్చినవే. అలాంటప్పుడు అహంకారందేనికి? అంటే శరీరం ఉంది కనుక. ఆ శరీరం తనది అని భావించును గనుక. కాని ఆత్మకు ఇవి ఏమియు ఉండవు. నిర్గుణమైనది. ఆత్మ అగ్నికి దహింపబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే కదిలించబడదు, మట్టి అంటుకొనదు, నాశనము లేనిది. ఆత్మలకే పరమాత్మయైన జగన్మాత ఈ త్రిగుణాత్మకమైన అహంకారహితమైనది. శరీరంతో సంబంధంలేనిది. కాబట్టి ఆ తల్లి *నిరహంకారా* యని అనబడినది. జగన్మాతను సేవించిన సాధకునికి ఆ తల్లి అహంకార రహితిస్థితిని కలుగజేస్తుంది. అప్ఫుడు ఆ సాధకునికి శరీరంపై మమకారం తొలగిపోయి బ్రహ్మజ్ఞాన సముపార్జనకు మార్గాన్ని అన్వేషిస్తాడు. తన మార్గం సన్మార్గమవుతుంది. పరబ్రహ్మతతత్వం తెలిసి శాశ్వతమైన ఆత్మానందాన్ని పొందుతాడు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిరహంకారాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*162వ నామ మంత్రము*

*ఓం నిర్మోహాయై నమః*

స్వస్వరూప విస్మరణ, చిత్తభ్రాంత్యాది అవలక్షణములు లేక, మోహరహితురాలై తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిర్మోహా* యను మూడక్షరముల (త్ర్రక్షరీ) నామమంత్రమును *ఓం నిర్మోహాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుని ఆ జగన్మాత భౌతికపరమైన మోహపాశములకు దూరముగానుంచి శాశ్వతమైన పరబ్రహ్మతత్త్వమును అన్వేషించు దిశగా నడిపించును.

తల్లిగర్భమునుండి భౌతికప్రపంచములోనికి అడుగిడిన జీవికి మోహము అనేది నిశ్చయముగా ఉంటుంది. విశాలమైన విశ్వంలో అనంతకోటి జీవరాసులు ఉన్నను తను తనవారు, వారితోటే తను అని ఒక పరిధికి లోబడి ఉండడం జరుగుతుంది.తన తల్లి తను, తనకు తన జీవితభాగస్వామి, తన బిడ్డలు, తన సంసారము ఇవన్నీకూడా మోహమునకు సాక్ష్యములే. ఈ లోకంలోకి వచ్చినది తాను మాత్రమే. మళ్ళీ నిష్క్రమించునది కూడా తను మాత్రమే. ఈ మధ్యనే ఈ బంధాలు. జగమే మాయ అనుకుంటే ఈ బంధాలు ఆ మాయ వలన ఏర్పడిన మోహాము వలననే. ఇది శరీరధారులకు మాత్రమే. ఆత్మకు కాదు. పరమాత్మస్వరూపిణీయైన జగన్మాత ఈ మోహమునకు అతీతురాలు. అందుకే ఆ తల్లిని *నిర్మోహా* యని అన్నాము. మోహము అనగా భ్రాంతి, అజ్ఞానము. అరిషడ్వర్గములలో ఒకటి. కామము (కోరిక) వలన మనసులో మోహం ఉద్భవిస్తుంది. అప్పుడు పురుషార్ధములు ధర్మబద్ధముగా నిర్వహింపబడితాయి కాని మోహము మాత్రము అధర్మయుతంగా నిర్వహింపబడుతుంది. అనగా జ్ఞానం నశించి భ్రాంతిలో మునిగిపోవడం జరుగుతుంది. పుట్టినప్పుడు జానెడు నేలపై పవళిస్తే గిట్టినఫుడు ఆరడగులు పొడవు, మూడడుగుల వెడల్పుగల నేలకావాలి. కాల్చడానికైనా, కప్ఫెట్టడానికైనా. ఎకరాల ఎకరాల భూమికొనేసి భూస్వామినైపోవాలనే కామము (కోరిక) జనిస్తుంది. అందుకు అధర్మంగానైనా కబ్జాలుచేసైనా ఆక్రమించేయాలని కోరిక జనిస్తుంది. అధర్మం వలన అజ్ఞానం తనలో పేరుకుపోతుంది. కారణం అరిషడ్వర్గాలు మనసును ఆవహించాయి. అరిషడ్వర్గాలలో (కామ,క్రోధ, లోభ, *మోహ*, మద, మాత్సర్యములు) మోహం ఉందిగదా. ఇది మనసుకు సంబంధించినది గదా. ఆత్మకు సంబంధించినది కానేకాదు. శ్రీమాత ఆత్మలకు పరమాత్మ. ఆతల్లి అరిషడ్వర్గాలకు అతీతురాలు గనుక అమ్మవారిని *నిర్మోహా* అని యన్నాము. అనడమేమిటి? *ఓం నిర్మోహాయై నమః* అంటూ స్తుతిస్తూ పూజించుచున్నాము. ఇది ఒక నామ మంత్రము. ఈ నామ మంత్రముతో సాధకుడు ఆ పరమేశ్వరిని ఆరాధిస్తే జ్ఞానం లభిస్తుంది. ఆ లభించిన జ్ఞానంతో అరిషడ్వర్గాలను జయించుతాడు. తద్వారా మోహాన్ని జయిస్తాడు. జగన్మాతకు నమస్కారం చేయునపుడు *ఓం నిర్మోహాయై నమః* అని అంటే చాలు మోహాన్ని జయించవచ్చును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*736వ నామ మంత్రము*

*ఓం ముక్తిదాయై నమః*

ఆరాధన శాస్త్రీయము, అశాస్త్రీయముల నిమిత్తములతో కాకుండా, కేవలము అంతర్ముఖసాధనతో ఆరాధించిన మాత్రముననే ముక్తిని ప్రసాదించీ జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ముక్తిదా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం ముక్తిదాయై నమః* అని ఉచ్చరించుచూ, అ జగన్మాతను భక్తిశ్రద్ధలతో నారాధించు సాధకునకు జగన్మాత అనుగ్రహముతో బ్రహ్మజ్ఞానసంపదలు లభించి పునర్జన్మరహితమైన మోక్షమునకు పాత్రుడగును.

జగన్మాతను *ముక్తిదా* అన్నాము. అంటే ముక్తిని ప్రసాదిస్తుంది. జన్మరాహిత్యమైన ముక్తిని ప్రసాదిస్తుంది. పునరపి జననం, పునరపి మరణం అనే జననమరణచక్రభ్రమణములో చిక్కుకోకుండా కాపాడుతుంది జగన్మాత. అంటే అమ్మవారి అనుగ్రహం సంపాదించుకోవాలి. అంటే ఆరాధించాలి. ఆ ఆరాధన శాస్త్రీయమా, అశాస్త్రీయమా అన్నది ముఖ్యంకాదు. కేవలం అంతర్ముఖంగా ఆతల్లిని మనోనేత్రాలతో హృదయంలోని దహరాకాశంలో వీక్షిస్తూ, సమస్త మోహాలను విడిచిపెట్టి ధ్యానిస్తే లభించేదే ముక్తి. ముక్తి అనేది ముంధుగా అరిషడ్వర్గ విముక్తి. అంటే కామక్రోధలోభమోహమదమాత్సర్యములను జయించడం. అంతే! అంతటితో సాధకునికి సాయుజ్యం లభిస్తుంది. పరబ్రహ్మలో లీనమైపోతాడు. పరబ్రహ్మ స్వరూపుడైపోతాడు. అంతేగాని వేదాలు చదివేసినంత మాత్రాన సువర్ఞఘంటాకంకణ బిరుదాంకితుడైనంత మాత్రాన యజ్ఞయాగాది కర్మలు నిర్వహించినంతమాత్రాన ముక్తి కలుగదు. అరిషడ్వర్గములను తన మనసునుండి పారద్రోలి, ఆత్మజ్ఞానియై, ఇంద్రియాలను బంధించి తన దృష్టిని అంతర్ముఖంచేసి ఆ పరమేశ్వరిని ధ్యానం చేసుకుంటే ఆతల్లి ముక్తిని ప్రసాదిస్తుంది. అందుచేతనే అమ్మవారు *ముక్తిదా* అను నామ ప్రసిద్ధమైనది.

ఏ వేదంబు పఠించె లూత , భుజగం బే శాస్త్రముల్సూచె దా
నే విద్యాభ్యసనం బొనర్చె గరి , చెంచే మంత్ర మూహించె , బో
ధావిర్భావ నిధానముల్ చదువులయ్యా ? కావు , మీ పాద సం
సేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా !

ఓ ఈశ్వరా ! జ్ఞాన సముపార్జనకు ప్రాణులకు విద్య అవసరం లేదు. నీ పాదసేవయే సమస్తజ్ఞానమును కల్గించును . ఎట్లనగా నిన్ను సేవించిన సాలెపురుగు ఏ వేదాధ్యయనము చేసి,జ్ఞానమును సముపార్జించినది . నిన్ను సేవించిన సర్పము ఏ శాస్త్రమును చదివినది . నిను పూజించిన ఏనుగు ఏ విద్య నభ్యసించినది . బోయవాడైన తిన్నడు ఏ మంత్రమును చదివి నిన్ను సేవించి ముక్తి పొందినాడు . కావున నీ పాదములను సేవించాలనే కుతూహలమే సమస్త జ్ఞానమును కల్గించును ప్రభూ

జగన్మాత ఆ పరమేశ్వరుని అర్ధాంగియేగదా! పై పద్యము అమ్మవారికి అన్వయించు కుంటే అమ్మవారిని ఆరాధించడానికి ఆచారము శాస్త్రీయమా, అశాస్త్రీయమా అన్నది ప్రక్కనబెట్టి నిర్మలమైన మనస్సుతో ధ్యానిస్తే చాలు ఆ తల్లి ముక్తిప్రదాత అవుతుంది. కాబట్టి ఆ తల్లి *ముక్తిదా* యని స్తుతిస్తున్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం ముక్తిదాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*163వ నామ మంత్రము*

*ఓం మోహనాశిన్యై నమః*

సకల లోకములు తన స్వరూపములై, ఎంతటి దుర్ఘటనకూ చలింపక (మోహరహితురాలై), సాధకునిలో అజ్ఞానముచే గలిగిన శోకమునుగూడ నశింపజేయు (మోహరహితులను జేయు) తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మోహనాశినీ* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం మోహనాశిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు వారిలో గల రాగద్వేషములను తొలగించి, సుఖదుఃఖములు రెండిటినీ సమభావనతో ఆస్వాదిస్తూ, నిత్యమైన, సత్యమైన ఆత్మానందాన్ని అనుభవింపజేయును.

అరిషడ్వర్గములు అనునవి మానసిక సంఘర్షణకు సంబంధించినవి. ఆత్మకు సంబంధించినవి కావు. జ్ఞానస్వరూపిణి అయిన పరమాత్మకు మోహము, దుఃఖము వంటి మానసిక సంబంధమైన వికారములు ఉండవు. తననాశ్రయించిన భక్తులలో ప్రప్రథమంగా వారిలో ఉన్న సమస్త దుఃఖములకు హేతువైన మోహమును తొలగిస్తుంది. తరువాతనే తనభక్తులకు పరబ్రహ్మతత్త్వమును అన్వేషించుటకు కావలసిన సాధనపై దృష్టిని నిలుపుకొనే ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. అరిషడ్వర్గములలో అత్యంత ప్రమాదకరమైన మోహమును సాధకునిలో సమూలంగా నాశనంజేస్తుంది కనుకనే ఆ తల్లి *మోహనాశినీ* యను నామ ప్రసిద్ధమైనది.
మహాభారతయుద్ధము ప్రారంభమైనది. అర్జునునికి రథసారథి శ్రీకృష్ణుడు. రథమును పార్థసారథి కురుసైన్యములదిశగా పోనిచ్చాడు. కురుసైన్యంలో తనగురువు ద్రోణుడు, తాత భీష్ముడు, తన సోదరులు దుర్యోధనుడు, దుశ్శాశనుడు మొదలైనవారు కనిపించారు. అంతా తనవాళ్ళే. వారితోనే యుద్ధంచేయాలి. వారినే చంపాలి. అంతా తనవాళ్ళే. తన గురువులు, తన బంధువులు...వీరినా నేను చంపాలి. అను మోహము ఒక్కసారి అర్జునిణ్ణి ఆవహించింది. తనవారే కదా అనే భ్రాంతి కలుగజేసింది అతనిలోనున్న మోహపాశం. అంతే రథం దిగిపోయాడు. అస్త్రాలను ప్రక్కనపెట్టేశాడు. యుద్ధముచేయలేనని దిగాలుగా కూర్చుండిపోయాడు. భగవానుఢు కృష్ణపరమాత్మ తన విరాట్స్వరూపాన్ని చూపించాడు (విశ్వరూపం ప్రదర్శించాడు) గీతోపదేశం చేశాడు. అర్జునునిలోనున్న మోహాన్ని పారద్రోలాడు.. అర్జునుడు తనకర్తవ్యాన్ని తాను నిర్వహించాడు. మోహం సర్వనాశనకారి అన్న సత్యం తెలుసుకున్నాడు.

PVD Subrahmanyam చెప్పారు...

శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటిమహాకవి పద్యంలో ఈ మోహమనే సముద్రంలో జీవుడు కొట్టుమిట్టాడుతూ పరమాత్మను తలవలేకపోతున్నాడని బాధపడతాడు. అందుకు ఆ మహాకవి ఆ పరమేశ్వరునితో ఏమని మొరపెట్టుకున్నాడో పరిశీలిద్దాము:-

*శార్ధూలము*

అంతా మిథ్య తలంచి చూచిన
......నరుండట్లౌ టెరింగిన్ సదా
కాంతల్ పుత్రులు నర్థముల్ తనువు
......నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుగాని,
......పరమార్థంబైన నీయందు దా
జింతాకంతయు జింత నిల్పడు
......గదా, శ్రీకాళహస్తీశ్వరా!

*భావం*

ఆలోచించినచో ఈ జగతత్తంతయును మాయయేగదా! మానవు డా సంగతి తెలిసియుండియు, భార్యయు, పుత్రులు, ధనములు, తన శరీరము అన్నియు శాశ్వతములని భావించి మోహమునొందుచు, జీవనమునకు పరమార్థభూతుడైన నిన్ను మనసులో ఒక్క నిమిషమైనను ధ్యానించడు గదా! ఎంత అజ్ఞానము!

అంటే ఈ అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నట్టుండి ఈ బంధాలను త్రెంచుకోవాలా? కాదు. చింతాకంతయు నైనను ఆ పరమాత్మను ధ్యానించాలి. ఆ ధ్యానంలో ఈ మోహాన్ని విస్మరించాలని ధూర్జటిమహాకవి భావన. ఆ పరమేశ్వరి పాదచింతన మాత్రమే ఆ సమయంలో ఉంటే ఆ తల్లి ఈ మోహబంధాలను క్రమంగా తప్పించి జన్మరాహిత్యమైన ముక్తిని ప్రసాదిస్తుంది. అందుచేతనే ఆ పరమేశ్వరి *మోహనాశినీ* అను నామముతో స్తుతిస్తున్నాము.

పరబ్రహ్మమనేది ఒకటే ఉన్నది. రెండవ మాటలేదు. అలా ద్వీతీయమనునది ఉన్నది అంటే అది అజ్ఞానము. అది ద్వైతభావన. అట్టిద్వైత భావనను లేకుండా చేయుటయే మనలోని మోహమును నాశనము చేయుట. జగన్మాత ద్వైతభావనను లేకుండా చేసి (మోహమును నాశనముచేసి), అద్వైతమును తెలియగల జ్ఞానమును కలుగజేస్తుంది గనుక ఆ పరమాత్మస్వరూపిణి అయిన జగన్మాతను *మోహనాశినీ* అని స్తుతిస్తున్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మోహనాశిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*737వ నామ మంత్రము*

*ఓం ముక్తి రూపిణ్యై నమః*

ఇంద్రియములను మనస్సునందు, మనస్సును బుద్ధియందు, బుద్ధిని ముఖ్యప్రాణమునందు లయంచేయు తురీయస్థితియే ముక్తి. తురీయాతీతస్థితి కూడా ఇదియే. అట్టి ముక్తిస్వరూపిణియైన తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ముక్తిరూపిణీ* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం ముక్తిరూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంతభక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు సాధకుడు అన్ని విధములైన అజ్ఞాన సంబంధిత వికారములనుండి విముక్తుడై, సదా పరబ్రహ్మతత్త్వాన్వేషణలో నిమగ్నుడై జీవించి, పరబ్రహ్మజ్ఞానసిద్ధి కలిగి తరించును.

జగన్మాత ముక్తి స్వరూపిణి. నిరంతర ధ్యాన సమాధిలో ఆ జగన్మాతను తన హృదయమందు దహరాకాశంలో జ్ఞాన నేత్రంతో వీక్షిస్తే జ్ఞానమే పరమేశ్వరి రూపంగా గోచరిస్తుంధి. అంటే సాధకునికి జ్ఞానోదయం కలిగిందన్నమాట. ధ్యానదీక్షలో ఇంద్రియాలను మనస్సులోను, మనస్సును బుద్ధియందు, బుద్ధిని ముఖ్యప్రాణంలోను లయంచేయడమే ముక్తి యనబడుతుంది.

జగన్మాత ముక్తి ప్రసాదిస్తుంది అని అన్నాము. అంతేకాదు ఆ తల్లి ముక్తిస్వరూపిణి కూడా. మనలోని అజ్ఞానమునకు విముక్తి కలిగిస్తుంది. తద్వారా అరిషడ్వర్గ విముక్తి లభిస్తుంది. అట్టి పరిస్థితిలో స్వస్వరూపజ్ఞానము కలుగుతుంది. స్వస్వరూపజ్ఞానం ఎప్పుడు లభిస్తుందో ముక్తి లభించినట్లే. అజ్ఞానాన్ని తొలగించేది జ్ఞానమైతే, ఆ జ్ఞానస్వరూపిణి జగన్మాత. జ్ఞానస్వరూపిణి అంటే ఆతల్లి ముక్తి స్వరూపిణియని అనబడుతుంది.
మనిషి పుట్టినదే బంధములతో. మొదటి బంధం ప్రేగుబంధం. అదే ప్రేగు బంధంతో తల్లి,బిడ్డలకు ఒకరిపై ఒకరికి మోహం ఉంటుంది. ఎందుకంటే తల్లి దేహంలోంచి ఆ బిడ్డదేహం వచ్చింది గనుక. అంటే మోహం అనేది దేహానికి సంబంధించినది. ఆ బిడ్డ తల్లిగర్భంలోనికి రావడానికి తండ్రి దేహం కారణం. అంటే తల్లిదండ్రులకు బిడ్డకు ప్రేగుబంధం, దేహబంధం. ఆ బంధం భగవంతుడు మోహబంధంగా ఏర్పరచాడు. ఆ మోహబంధం లేకపోతే తండ్రి బిడ్డ యోగక్షేమములు చూడలేడు. ఇక తల్లి అయితే అది ప్రేగుబంధమే. ఆకలికి బిడ్డఏడిస్తే తల్లి తల్లడిల్లిపోతుంది. ఎన్ని పనులున్నా అన్నీ ప్రక్కన ఉంచి స్తన్యమిస్తుంది. లాలపోస్తుంది. అందంగా కాటుక, బొట్టు పెడుతుంది. అన్నిటికీ మించి ఆ బిడ్డకు దృష్టిదోషం తగలకుండా బుగ్గచుక్కపెడుతుంది. ఇదే మోహం అంటే. ఆ బిడ్డపెరగడం, యోగ్యతసాధించడం, పెళ్ళి, మళ్ళీ అదే మోహపాశం. ఇది జీవనభ్రమణం. ఈ పాశములనుండి ఒకేసారి ముక్తికోరడం అంటే అది అధర్మం. కనుక ధ్యానించిన ఆ ఒక్కనిముషం ఈ బంధములను తలంపులోనికి రానీయక ఉంచడమే ముక్తి. అది జన్మరాహిత్య ముక్తికి మొదటిసోపానం. *తాను సంసారంలో ఉండవచ్చు. తనలో సంసారం ఉండకూడదు* అంటే పరమాత్మయందు ధ్యానం సమయంలో పరమాత్మయే మనోనేత్రాలలో ఉండాలి. ఇలా సాధకుడిని అనుగ్రహిస్తుంది ముక్తిరూపిణియైన జగన్మాత. వానప్రస్థంలో ఈ బంధాలనుండి విమక్తిని కలిగించి కేవలం పరమాత్మయందే ధ్యానం ఉండడమనేది కూడా జగన్మాత ముక్తిస్వరూపిణిగా అనుగ్రహిస్తుంది. ఇలా సాధకునికి ఏ వేళ ఏముక్తి కావాలో ప్రసాదించి, పరబ్రహ్మతత్త్వాన్ని అన్వేషించడంలో సరైన మార్గాన్ని మూక్తిస్వరూపిణిగా జగన్మాత అనుగ్రహిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సాధకుని కళ్ళఎదుట స్థూలరూపంలోనున్న జగన్మాత మూర్తి (విగ్రహము లేదా చిత్తరువు) యే ముక్తిరూపిణి.

అటువంటి ముక్తిరూపిణియైన జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం ముక్తిరూపిణ్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*164వ నామ మంత్రము*

*ఓం నిర్మమాయై నమః*

నేను, నాది యను అహంకారము లేక మమకార రహితురాలై తేజరిల్లు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిర్మమా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రముసు *ఓం నిర్మమాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంతభక్తిశ్రద్ధలతో ఆ అఖిలాండేశ్వరిని ఉపాసించు సాధకునకు నేను, నాది యను మమకారములన్నియు తొలగి సర్వము ఆ పరమాత్మ కరుణయే యను భావముతో మమకార రాహిత్యంతో జీవించి తరించును.

జగన్మాత పరమాత్మ. దేహసంబంధమైన లేదా మనసుకు సంబంధమైన మోహము, మమకారము, చింత వంటి వికారములు లేక *నిర్మమా* (మమకార రహితు రాలు) యను నామముతో స్తుతింపబడుచున్నది. నేను, నాది అను భావము శరీరసంబంధమైనది. జగన్మాత నిర్గుణస్వరూపురాలు అనగా రూపం గానీ, భౌతికపరమైన మరే లక్షణాలు గానీ లేని పరబ్రహ్మస్వరూపిణి. తనకంటె వేరేమియు లేనిది. అంతయూ తానే. జీవులన్నిటిలోనూ తానేయుంటూ భేదజ్ఞానములేనిదగుటచే *నిర్మమా* యని అన్నాము.

తల్లి గర్భమునుండి బాహ్యప్రపంచంలోనికి వచ్చిన తరువాత నేను అనే భావన ఉండుట అతిసహజము. అలాగే నాది అనే భావనకూడా వచ్చేస్తుంది. ఈ ఇల్లు నాది. ఈ వస్త్రమునాది. మమ అనగా ఇంద్రియాలపై భ్రాంతి. జీవించినంత కాలము ఇల్లు, వాకిలి, సంపదలు, వస్తువులు అన్నీ నావి అనడం జరుగుతుంది. తనవనుకున్నవాటిపై మమకారం పెంచుకోవడం జరుగుతుంది. కొన్ని సమయాలలో ప్రాణంకన్నా తనవి అనుకున్నవాటిపై భ్రాంతి పెంచుకోవడం జరుగుతుంది. ఈ హద్దువరకూ నాభూమి, హద్దుదాటితే వాళ్ళది అనే తన,పర భేదం ఏర్పడుతుంది. ఈమె నా జీవిత భాగస్వామిని. ఈ పిల్లలు మా పిల్లలు అని అనడంకూడా సహజమే. వినేవారు కూడా ఏమాత్రం ఆలోచించకుండా 'అలాగా, సంతోషమండి. పిల్లలు ఆణిముత్యాలులా ఉన్నారు' అని అనేస్తారు. అంతేగాని వేదాంతం మాట్లాడుతారా? అంటే మాట్లాడరు. ఎందుకంటే వారూ, వీరూ కూడా శరీరధారులే. పుట్టుక ఒక్కనిగా, గిట్టుట ఒక్కనిగా అయినను పదుగురిలో. బంధములమధ్య. ఈ బంధముల మధ్యయుండుటచేతనే నాది, నీది యనే మమకారము. ఇవన్నీ శరీరానికి, మనసుకు మాత్రమే. ఆత్మకు కాదు. పరమాత్మస్వరూపిణియైన జగన్మాత ఇందుగలదందు లేదనే సందేహం లేకుండా సర్వవ్యాపిని. స్వపరభేదాలుండవు. ఈ మమకారములకు అతీతురాలు జగన్మాత. గనుక అమ్మవారిని *నిర్మమా* యని అన్నాము. దివంగతులైన వారిని ఉద్దేశించి *ఆత్మ శాంతించుగాక* అంటూ వేదాంతపరమైన సందేశము ఇస్తాము. అంటే అంతవరకూ ఆ ఆత్మ ఆ శరీరంలో ఉండి, అరిషడ్వర్గములతో సహచరించి, బంధాలు, అనుబంధాలు, మమకారాలు, అహంకారాలు, రాగము, ద్వేషము మొదలైన భౌతిక వికారముల మధ్య ఉంటూ, తీవ్రక్షోభకు గురికాబడినది అనే భావనతో దేహాన్ని విడిచి వెళ్ళిన ఆ ఆత్మకు శాంతికోరుచున్నామని అర్థము. శరీరమును వదలి పయనమైన ఆ ఆత్మ ఎవరి గురుంచి ఘోషించదు. అంతవరకూ తనవారనుకున్నవారి గతి ఏమిటా అనికూడా ఘోషించదు. మమకారము అనేది శరీర సంబంధమైనది. ఆ మమకార భావన అనేది ఆ శరీరము నాశ్రయించిన మనసుది. అంతే గాని శరీరమును విడిచి పయనమయిన ఆత్మది కాదు. ఆత్మకు ఏవిధమైన భౌతిక వికారములు ఉండవు. ఆత్మలలో పరమాత్మ అయిన జగన్మాతకు ఇవేమీ ఉండవు గనుక *నిర్మమా* యని అన్నాము.

జగన్మాతకు గల ఈ నామములన్నియూ మంత్రములే. ఆ నామ మంత్రములు వాటిలోని పరబ్రహ్మతత్త్వాన్ని మనకు తెలియ జేస్తున్నది గనుక మనము పరమాత్మయైన జగన్మాతను నామస్తోత్రములతో కీర్తిస్తూ పరబ్రహ్మతత్త్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అందుచే ఒక్కసారి ఈ వ్యాఖ్యానము చదివినవెంటనే జగన్మాతకు నమస్కరించుదాము. అలా నమస్కారం చేయునపుడు *ఓం నిర్మమాయై నమః* అని అందాము. *శ్రీమాత్రేనమః*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*738వ నామ మంత్రము*

*ఓం లాస్యప్రియాయై నమః*

సాక్షాత్తు నటరాజు అయిన పరమేశ్వరుని భార్యగా, చతుష్షష్టికళామయిగా, ఆ చతుష్షష్టి కళలలో ఒకటైనది, స్త్రీలు చేయు సుకుమారమైన నృత్యమైన లాస్యమునందు ప్రీతిగలిగిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *లాస్యప్రియా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం లాస్యప్రియాయై నమః* అని ఉచ్చరించుచూ, భక్తిప్రపత్తులతో జగన్మాతకు చేతులు జోడించి నమస్కరిస్తూ, సుగంధ భరితమై, నానావర్శ సుశోభితమైన పుష్పములతో అర్చనచేస్తూ తరించు సాధకులను ఆ జగన్మాత కరుణించి ఇష్టకామ్యార్థసిద్ధియు, ఆత్మానందానుభూతినీ అనుగ్రహించును.

జగన్మాత చతుష్షష్టికళామయి. చతుష్షష్ఠి తంత్రప్రధానమైనది. అన్నిటికీ మించి నటరాజస్వరూపుడు, నాట్యవేదస్వరూపుడు అయిన పరమేశ్వరాని భార్య అయిన జగన్మాత, స్త్రీలు చేయు సుకుమారమైన నృత్యమైన లాస్యమునందు అత్యంత ప్రీతిగలిగినది. ఆహార్యము, అంగికము, వాచికము, సాత్వికము అను కావలసిన నాలుగు నాట్యాంశములు సమపాళ్ళలో మేళవించి నాట్యము చేయునంతటి *లాస్యప్రియ* జగన్మాత. అందుచేతనే అమ్మకుగల అనంతకోటి నామ మంత్రములలో *లాస్యప్రియా* యనునది కూడా ఒక నామ మంత్రము. ఆ నామము ఒక మంత్రమే. స్త్రీలు చేయు సుకుమార నృత్యము లాస్యము అయితే పురుషులు చేయు నృత్యమునందు వీరము, రౌద్రము కలిగిన తాండవము. ఆధారచక్రమందు పరమేశ్వరుడు శివతాండవము చేస్తే జగన్మాత లాస్యయుతమైన నాట్యము ఆయనతో కలిసి చేస్తుంది. ఇదే విషయాన్ని ఆదిశంకరులు ఇలా చెప్పారు.

శ్రీ ఆదిశంకర విరచిత *సౌందర్యలహరి* లోని 41వ శ్లోకం

*తవాధారే మూలే - సహ సమయయా లాస్యపరయా*

*నవాత్మానం మన్యే - నవరస మహాతాండవ నటమ్ |*

*ఉభాభ్యామేతాభ్యా -ముదయవిధి ముద్దిశ్య దయయా*

*సనాథాభ్యాం జఙ్ఞే - జనక జననీమత్జగదిదమ్ || 41 ||*

*భావము:*

మూలాదారచక్రంలో ఆనందభైరవీ నామంతో శక్తిస్వరూపంగా ఉన్న నీతో కలసి శివుడు నవరస భరితమైన,నవ వ్యూహాత్మకమైన, లాస్య రూపమైన నాట్యం చేస్తాడు. మీ ఇద్దరి నాట్యంలోంచి ఈ జగత్తు మరల సృష్టించ బడుతున్నది.ఆనందభైరవి, మహాబైరవులుగా మీచే సృజింపబడిన ఈ జగత్తుకు మీరే జగన్మాత, జగత్పితరులుగా భావించి నమస్కరించుచున్నాను.

PVD Subrahmanyam చెప్పారు...

సాక్షాత్తు ఆ పరమేశ్వరునితో తాండవమాడు వేళ ఆయనతో అడుగువేస్తూ, ఆయన చేతులతో ఆ తల్లికూడా లయబద్ధంగా చేతులు కలుపుతూ, ఆయన చేతులలో ఒదిగిపోతూ, తన ముఖపద్మముపై పరమేశ్వరుని వదనము ఒక భ్రమరము వలె వాలి ఉండగా తన్మయమైపోవు జగన్మాత *లాస్యప్రియా* యని అనదగునుగదా! అదే అనుకుంటాను *కామేశ్వరముఖాలోక కల్పితశ్రీగణేశ్వరా* అను నామములో అన్నట్లు కామేశ్వరుని ముఖమును అమ్మవారు ఆ తాండవకేళివేళ వీక్షించి *గణేశ్వరుని* కల్ఫించుకున్నది అనిపిస్తుంది. ఆ తాండవకేళి సమయంలో కామేశ్వరుడు ప్రేమగా వీక్షిస్తే తన వక్షోజములను ఆయనకు ప్రతిపణము ఇచ్చినందులకేమో అమ్మవారికి *కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తనీ* (లలితా సహస్రనామావళి యందలి 33వ నామ మంత్రము) - కామేశ్వరుని ప్రేమయను రత్నమునకు ప్రతిఫలముగా తన వక్షోజములను ఇచ్చిన తల్లి - యను నామము కూడా ఏర్పడినది. జగన్మాత నటరాజు అయిన పరమేశ్వరునితో అంతగా తాండవనృత్యకేళి జరిపినది అంటే ఆతల్లికి స్త్రీలు చేయు సుకుమార నృత్యమైన లాస్యము నందు ప్రీతి ఎంత ఉన్నదో *లాస్యప్రియా* యను నామమే మనకు తెలియజేయుచున్నది.

జగన్మాత తాను సృజించిన జగమే నృత్యప్రదర్శన వేదిక. జీవులన్నియు తమతమసహజమైన కదలికలే నృత్యభంగిమలు. ఆ నృత్యభంగిమలకు జగన్మాతయే నాట్యాచారిణి. జీవుల రూపములే ఆహార్యము. జీవుల నోటి సవ్వడులే వాచకము. జీవుల కదలికలే ఆంగికము. జీవుల సహజసిద్ధమైన ప్రవర్తనయే సాత్త్వికము. జగన్మాత పరమశివునితో జరిపిన నృత్యవిలాసమే మానవజాతిలోని భార్యాభర్తల అన్యోన్య జీవనశైలికి ఆదర్శము. జగన్మాతలోని లాస్యప్రియత్వమే జగత్తులోని జీవకోటికి ఆనందభైరవీరాగము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం లాస్యప్రియాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*165వ నామ మంత్రము*

*ఓం మమతాహంత్ర్యై నమః*

భక్తులయందు గల నేను, నాది అనే అహంకారమును తొలగించు పరమాత్మస్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మమతాహంత్రీ* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం మమతాహంత్ర్యై నమః* అని ఉచ్చ రించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులలోని మమకార లక్షణాన్ని పొగొట్టి ఆత్మజ్ఞానమును ప్రసాదించి తరింపజేయును.

జగన్మాత *నిర్మమా* యను నామ ప్రసిద్ధమైనది. అనగా నేను, నాది అను దేహేంద్రియాదులే నేను అనుకునే మమకారము లేని పరమాత్మ స్వరూపిణి. అలాగే తన భక్తులలోని దేహేంద్రియాదులనే తాను అనుకునే మమకారాన్ని పోగొట్టి ఆత్మజ్ఞానమును ప్రసాదించు అనుగ్రహమూర్తి ఆ జగన్మాత. ఇక్కడ *హంత్రీ* అనగా నాశనము చేయునది. లేకుండా చేయునది. తొలగించునది అని అర్థంచేసుకోగలము. జగన్మాత *నిర్మమా* యని గత నామ మంత్రములో తెలిసియుంటిమి. ఇక్కడ *మమతాహంత్రీ* యనగా భక్తులలో నేను, నాది యను మమకారమును తొలగుటకు కావలసిన స్వస్వరూపజ్ఞానమును ప్రసాదిస్తుంది. భవబంధాలను త్రెంచి మోక్షమార్గమును చూపుతుంది.

ఒక విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సంసారములో ఉన్నవాడు అమ్మవారిని పూజించి నాలోని భవబంధాలను తొలగించు తల్లీ అంటే ఆ తల్లి తొలగించేస్తుందా? తాను సంసారములో ఉన్నాడు. సంసారం తనతో పెనవేసుకుపోయింది. అప్పుడు తనపాటికి తను అన్నీ త్రెంచుకుపోతే అది సన్యాసం స్వీకరించినట్లు అవుతుంది. తనతో ఉన్నవారిని నట్టేట్లో ముంచినట్లవుతుంది కదా! గనుక తను ధ్యానం చేసుకునే సమయంలో, పరమాత్మ తప్ప వేరే ధ్యాస ఉండకుండా, ఆ సమయంలో కూడా భౌతిక పరమైన, భవబంధపరమైన ఆలోచనలు లేకుండా, కేవలం పరమాత్మనే ధ్యానం చేసుకుంటూ ముక్తికి ఒక్కొక్కసోపానమును నిర్మించుకుంటూ పోవడానికి జగన్మాత అనుగ్రహిస్తుంది. *మమతాహంత్రీ* యను నామ మంత్రమునకు ఈ భావం సమన్వయమవుతుందని నా భావన. జీవుడు పరమాత్మను అర్థంచేసుకునే జ్ఞానాన్ని జగన్మాత ప్రసాదిస్తుంది. తద్వారా పురుషార్థములలో ధర్మార్ధకామములను సక్రమమార్గంలో నిర్వహింపజేసి ముక్తికి సోపానములు నిర్మించుకోగలగడం జరుగుతుంది ఇదే పరమపదసోపాన నిర్మాణము. ఈ పరమపద సోపాన మార్గంలో ఏమాత్రం పట్టుతప్పినా, ధ్యాస దిశతప్పి వికారములకు లొంగినట్లైతే ఆ మేరకు అజ్ఞానమనే సర్పదంష్టృడై క్రిందకు జారుతాడు సాధకుడు. అందుకని పరమేశ్వరీ ధ్యానం నిరంతరం చేస్తూ జీవనము కొనసాగిస్తూ పరమపదసోపాన నిర్మాణం చేసుకోవాలి.

జగన్మాతచే అనుగ్రహింప బడిన ఆత్మజ్ఞానంతో సాధకుడు మమకారరహితుడై మోక్షమార్గంలో జీవనయానం కొనసాగించు కోగలడు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మమతాహంత్ర్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*739వ నామ మంత్రము*

*ఓం లయకర్యై నమః*

చిత్తమును ద్యేయరూపముతో ఐక్యము చేసి పదిరెట్లు ధ్యానఫలమును ప్రసాదించు పరబ్రహ్మ స్వరూపిణికి నమస్కారం.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *లయకరీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం లయకర్యై నమః* అని ఉచ్చరిస్తూ, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ పరమేశ్వరి కరుణచే తన జీవనవీణ లయతప్పకుండా ఆనందజీవనరాగాన్ని ఆలపించినట్లుగా సుఖసంతోషాలతో, ఆత్మానందానుభూతిని పొందును.

*లయః చిత్తావస్థావిశేషః* (సౌభాగ్యభాస్కరం, 849వ పుట) - లయము అనునది మనసుకు సంబంధించినది. అలాగే *దశధ్యానసమో లయః* (సౌభాగ్యభాస్కరం, 849వ పుట) పదిధ్యానముల ఫలితం లయము వలన లభిస్తుంది. లయములో చిత్తము ధ్యేయరూపముతో ఐక్యమందునట్లు అనుగ్రహించునది గనుకనే జగన్మాత *లయకరీ* అని నామముతో స్తుతించబడుచున్నది. భగవదారాధన సమయంలో మనసును లయంచేసి, అన్యమేమియు తన మనసులోనికి రానీయక చేయు ఆరాధన పదింతలు ఫలితమును ఇస్తుంది. అంతటి నిమగ్నతను అనుగ్రహించునది జగన్మాతయే గనుక *లయకరీ* అని నామ ప్రసిద్ధమైనది. అలాగే సంగీత విద్వాంసులు నృత్యమునకు, గీతమునకు కాలసామ్యమును చేతివ్రేళ్ళు, తాళములతో కొలుచుట లయమునబడును. దీనినే శ్రుతి,లయలు గానమునకు జననీ జనకులనికూడా అంటారు. లయతప్పిన నృత్యము, శ్రుతి తప్పిన గానము గతి తప్పిన జీవనము వంటిది. జగన్మాత *లాస్యప్రియా* అను నామ మంత్రములో చెప్పినట్లు స్త్రీ సహజమైన సుకుమార మిళితమైన నృత్యమందు మిక్కిలి ప్రీతిగలిగినదగుటచే అట్టి నృత్యమును అత్యంత లయబద్ధంగా శివతాండవమునకు సాటిగా నృత్యమొనరించి *లయకరీ* యని నామప్రసిద్ధమైనది.

పరమాత్మను ధ్యానము చేయునపుడు ధ్యానము లో లయము చేయునది జగన్మాత, కాబట్టి ఆ తల్లిని *లయకరీ* అని స్తుతిస్తున్నాము.

బ్రహ్మజ్ఞానాన్వేషణలో సాధకుడు కేవలము తన సాధనను బ్రహ్మజ్ఞానమార్గంలోనే నిలపడానికి దృష్టిని ఆ అన్వేషణలోనే లయముచేయునది జగన్మాత, గనుకనే కోట్లాది నామ మంత్రములలో *లయకరీ* యను నామ మంత్రముతో స్తుతిస్తున్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం లయకర్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*740వ నామ మంత్రము*

*ఓం లజ్జాయై నమః*

స్త్రీలకు అలంకారమైన లజ్జా (నమ్రత) రూపంలో సర్వజీవులయందునూ విలసిల్లు పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *లజ్జా* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం లజ్జాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకుని అత్యంత నమ్రతతోను, అహంకార రహితంగాను ప్రవర్తింపజేయును మరియు ఇష్టకామ్యార్థసిద్ధియు కలుగజేయును.

లజ్జ అనగా స్త్రీ సహజమైన సిగ్గు మాత్రమే కాదు. స్త్రీ మూర్తికి ఉండవలసిన *నిరహంకారము*. సాధారణంగా స్త్రీ మూర్తి కపటరహితంగా ఉంటుంది. సుకుమారమైన స్త్రీ మూర్తి *నమ్రత* గానుండు సలక్షణము కూడా.

పరమేశ్వరుని సన్నిధిలో జగన్మాత లజ్జా స్వరూపిణిగా ఆయన హృదయంలో ఒదిగి పోతుంది. అందుకే జగన్నాత *లజ్జా* యని నామ ప్రసిద్ధమైనది.

ఆ తల్లి జగన్మాత. సకల లోకాలకు శ్రీమహారాజ్ఞి. *చిదగ్నికుండ సంభూత* భండాసురాది రాక్షసులను సంహరించిన ధీరురాలు. భర్తఅయిన పరమేశ్వరుణ్ణి తన స్వాధీనంలో ఉంచుకుని, పరమేశ్వరుడు శక్తికి అధీనుడు అనిపించుకున్న *స్వాధీనవల్లభా* యను నామ ప్రసిద్ధ. శ్రీవిద్యానగరానికి నాయికగా *శ్రీమన్నగరనాయికా* యను నామము గలిగి విరాజిల్లు తల్లి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశాన, సదాశివులచే నిర్మితమైన ఆసనమును కలిగి *పంచబ్రహ్మాసన సంస్థితా* యను నామముతో స్తుతింప బడుచున్నది. అయినప్పటికిని ఆ తల్లి తన పతియైన పరమేశ్వరుని వద్ద వినమ్రతామూర్తి (విధేయురాలు) గనుకనే *లజ్జా* యను నామ మంత్రమునకు సార్థకమయినది. తానెంత *శ్రీమహాసామ్రాజ్ఞి* యైనను, *చిదగ్నికుండ సంభూత* అయినను, సౌందర్యనిధియై *మహాలావణ్యశేవధిః* అని అనిపించుకున్నను అవధులులేని నిరహంకారి గనుకనే *లజ్జా* యను నామ మంత్రముతో ఆరాధింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం లజ్జాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*166వ నామ మంత్రము*

*ఓం నిష్పాపాయై నమః*

అవిద్య, అజ్ఞానము, అన్యులకు అకారణముగా దుఃఖకారణమగుట వంటి పాపహేతు లక్షణములు లేని పాపరహితురాలైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిష్పాపా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం నిష్పాపాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులను తెలిసిగాని, తెలియకగాని, అజ్ఞానముచేగాని వారు చేసిన పాపకర్మలవలన లభించిన దోషములను తొలగించి సత్కర్మలను వారిచే చేయునట్లుగా అనుగ్రహించి తరింపజేయును.

జగన్మాత పరమాత్మ స్వరూపిణి. అజ్ఞానము, అవిద్య సంబంధిత పాపహేతువులకు సంబంధించిన లక్షణములు ఉండవు. ఆతల్లి పాపరహితురాలు.

మానవుడు చేసే ప్రతీ పనివలన పాపహేతువైనదైనా కావచ్చు, పుణ్యకార్యమైనా కావచ్చు. భక్తరామదాసు శ్రీరామాలయం నిర్మించి, సీతారామలక్ష్మణులకు నగలు చేయించినది పుణ్యకార్యమే. అయినా ఆయన చెరసాలజీవితం అనుభవించారు. కారణం? రామచిలుకను పెంచి, ప్రేమమాటలు నేర్పించారు. కాని దానిని పంజరంలో బంధించారు. అలాగే చేసుకున్నవారికి చేసుకున్నంత. పాపకర్మలకైనా, పుణ్యకర్మలకైనా ఫలితం ఈ జన్నలోనే ఇప్పుడైనా కావచ్చు, లేదా మరుజన్మకు సంచితమైనా కావచ్చు. మంచి కర్మలు చేస్తే తరువాత జన్మ మంచిది అవుతుంది. పాపకర్మలు చేస్తే ఆ జన్మ పిల్లిగా గాని, బల్లిగాగాని మరియేదైనా పశువులు, పక్షులు, క్రిమికీటకాలుగా నైనా కావచ్చు. చేసేపాపం భౌతికముగా గాని మానసికంగా గాని ఎలా చేసినా అది పాపమే. అందుకు ఫలితం తథ్యం.
చేసిన పాపం కట్టి కుడుపుతుంది అంటారు. నిజమే. అది ఈ జన్మలోనే జరగడం సాధారణం.

అలాగే మనం చేయవలసిన సత్కర్మలు అనేకం ఉన్నాయి. అవి నిర్వర్తించక పోవడం కూడా *మహాపాపమే* అవుతుంది.

దైవికముగా ఆధ్యాత్మికముగా ఋణము అంటే మనము జీవితములో విధిగా చేయవలసిన కార్యములు అని అర్ధము. అవి మూడు

త్రిఋణాలు అనగా మనిషికి జన్మనిచ్చిన వారికి అతను మూడు విధాలుగ ఋణపడి ఉంటాడు. ఈ ఋణములను అతను తన జీవిత కాలంలొ తీర్చుకోవలసి ఉంటుంది. అవి

*1) దైవ ఋణములు, 2) పితృ ఋణములు, 3) ఋషి ఋణములు*

ఆశ్రమ ధర్మాలు అనగా మనిషి జన్మ తంతు ప్రారంభమయినప్పటి నుండి పరమపదించేవరకు మనిషి వివిధ వయసులలో చెయ్యవలసిన కర్మలే.

*దైవ ఋణాలు:*
మనిషి జన్మకు మూల కారణం దేవుడు కనుక మొదటగ మనిషి దేవతలకు ఋణము తేర్చుకోవాలి! యజ్ఞ యాగాదులు నిర్వహించడము దైవఋణములు తీర్చుకోవడనికి ఒక త్రోవగా చెప్పడమయినది. యజ్ఞ తంతు లో వైదిక దేవతలయిన ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, అశ్విని దేవతలు మొదలయినవారిని పూజించడం చెయ్యవలెను. వివిధ రకాలయిన ద్రవ్యములు ప్రధానంగా ఆవు నెయ్యి యజ్ఞ కుండములో అగ్నికి సమర్పించడం జరుగుతుంది. తదుపరి భూతబలులు ఇచ్చి దేవతలకు ఆహారముగ సమర్పించడం జరుగుతుంది. అనగా యజ్ఞ తంతు లో తోటి జనులకు విందు భోజనములు నిర్వహించాలి.

*పితృ ఋణములు:*
భౌతికంగా మనిషి కి జన్మనిచ్చిన జననీ జనకులకు, వారికి జన్మనిచ్చిన వారి పితృదేవతలకు...ప్రతి మనిషి ఋణపడి ఉంటాడనేది పితృఋణము. తల్లి దండ్రులను అవసాన దశలో కంటికి రెప్పలా కాపాడుకోవడం, వారు శయ్యపైనే ఉండిపోతే (తమ పసితనంలో తల్లి, దండ్రి తమ మలమూత్రాలను భరిస్తూ, తమకు విద్యాబుద్ధులు చెప్పించి, చేయిపట్టి నడిపించి, ఒక ఇంటివాడిని చేయువరకూ వారు పడిన తపన గుర్తుంచుకొంటూ) సేవచేసి, మరణించిన పిదప అంత్యక్రియల నుండి కర్మకాండల వరకు, తరువాత ప్రతి అమావాస్యకు పితృదేవతలకు తర్పణవిధి, ప్రతిసంవత్సరము శ్రాద్ధకర్మలాచరించడం ద్వారా పితృఋణం తీరుతుంది.

*ఋషి ఋణములు:*
ఋషులు అనగా మనకు జ్ఞాన సంపదను అందించిన మన గురువులు. మనకు తరతరాలుగా వారసత్వంగా వస్తున్న వేదములు, పురాణాలు, వేదాంగాలు, ఇతిహాసాలు - రామాయణ, భారతాలు, ఉపనిషత్తులు, శిక్ష, నిరుక్తి, వ్యాకరణము, యోగ, మొదలయిన జ్ఞాన సంపదను మనకు అందించిన దైవాంశ సంభూతులయిన మహా పురుషులే ఋషులు. వీరికి మనము అనగా హిందువులు ప్రత్యేకంగా ఋణపడి ఉంటారు. పైన ఉదహరించిన శాస్త్రాల్ని అభ్యసించడం ద్వారాను జ్ఞాన సముపార్జన చెయ్యడం ద్వారాను మరియు పర్వ దినాల్లో బ్రహ్మచర్యం , ఉపవాసము పాటించడం ద్వారాను హిందువులు ఋషులకు చెల్లించాల్సిన ఋణాల్ని తీర్చుకోవలెను.

మనిషి తన ఈ జన్మ లో ఈ మూడు ఋణాల్ని తీర్చుకోవడం ప్రధానకర్తవ్యం.

ఈ ఋణములు సక్రమంగా తీర్చుకోకపోవడం కూడా ఒక *మహాపాపమే* ఈ పాపానికి నిష్కృతి లేదు. జగన్మాతకూడా వీటిని క్షమించదు.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే*

శ్రీశైలశిఖర దర్శనం చేసుకున్నవారికి పునర్జన్మ ఉండదు. అంటారు. అందుకు ఒక కథ ఉన్నది.

ఒకసారి భ్రమరాంబ, మల్లికార్జునులు భక్తులను పరీక్షింపదలచారు.

మల్లికార్జునుడు వృద్ధబ్రాహ్మణునిగాను, భ్రమరాంబ ఆయనభార్యవృద్ధ బ్రాహ్మణ ముత్తైదువగానూ కొండ దిగువకు వచ్చారు. వృద్ధబ్రాహ్మణుడు ఒక ఊబిలో దిగబడిపోతున్నాడు. ఆ బ్రాహ్మణ ముత్తైదువు ఒడ్డున నిలబడి "అయ్యా! అమ్మా! నాభర్త ఊబిలో దిగబడిపోయారు. మీలో పాపంలేనివారు ఎవరైనా ఉంటే చేయి అందివ్వండి. ఆయన పైకి వచ్చేస్తారు. నా భర్త నాకు దక్కుతారు" అంటూ జాలిగా గోలపెడుతున్నది.

వచ్చేపోయేవారు అందరూ ఒకరి ముఖములు ఒకరు చూచుకుంటున్నారు. పెదవులు విరుస్తున్నారు. "అసలే మానవ జన్మ. పాపకర్మలు తప్ప పుణ్యకార్యములు చేసేది ఉండదు. మనం ఎలా చేయి అందిస్తాము అనుకుంటున్నారు"

ఆ బ్రాహ్మణ ముత్తైదువ ఆక్రందన మరింత ఎక్కువ అయినది.

ఇంతలో ఒక వేశ్య ఆ ఆక్రందన విన్నది.

"శ్రీశైల శిఖరం చూచినవారికి పాపాలు ఉండవుకదా. మరి నాకు పాపం ఎలా ఉంటుంది?" అనిఅంటూ "శ్రీశైల శిఖరం చూచాను. ఇంకనాకు పాపాలు లేవుగదా! పట్టవయ్యా బ్రాహ్మణోత్తమా నాచేయి. ఊబినుంచి పైకి రావయ్యా! నీ భార్య నీకోసం దుఃఖిస్తోంది" అంటూ ఆ వేశ్య చేయి అందించి ఆ బ్రాహ్మణరూపంలో ఉన్న మల్లికార్జున స్వామిని లాగింది. భ్రమరాంబా మల్లికార్జునులు ఆవేశ్యా స్త్రీకి మరింత పుణ్యఫలం ప్రసాదించి ఆమెకు ఉత్తమ గతులు కలిగించారు.

ఇది మనకు తెలియకనే పుణ్యమూ చేస్తాము, పాపమూ చేస్తాము. అందుచే జగన్మాత నామస్మరణ మాత్రమే తెలిసి చేయు పుణ్యకారణమైన సత్కర్మ.

మానవునికే ఇన్ని చిక్కులు. మానవునికే కాదు ప్రతీ శరీరధారికి రాసిపెట్టినవే. పాపంచేయడానికి ఎన్ని అవకాశములు ఉన్నవో పుణ్యములు చేయడానికి కూడా అన్ని అవకాశములు ఉన్నాయి. కాని ఆత్మకు కాదు. పరమాత్మకు అసలేకాదు. అందుకే జగన్మాత *నిష్ఫాపా* అని నామ ప్రసిద్ధమయినది.

గనుక జగన్మాతకు నమస్కరిస్తూ *ఓం నిష్పాపాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*741వ నామ మంత్రము*

*ఓం రంభాదివందితాయై నమః*

రంభ, ఊర్వశి, మేనక మొదలైన అప్సరాంగనలచే నమస్కరింపబడు జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *రంభాదివందితా* యను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును *ఓం రంభాదివందితాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకునకు స్వర్గసుఖములంతటి సుఖసంతోషములను ప్రస్తుత జీవనమునందు ప్రసాదించి, ఆధ్యాత్మికతయందు, భగవన్మామ సంకీర్తనమునందుగూడ మనసును నిలుపును.

రంభ మొదలైన అప్సరసలచే నమస్కరింపబడుచున్నది జగన్మాత.

*సప్త-అప్సరసలు*

1. రంభ, 2. ఘృతాచి, 3. మేనక, 4. తిలోత్తమ, 5. మంజుఘోష, 6. ఊర్వశి, 7. సుకేశి.

*ద్వాదశ-అప్సరసలు*

1. కృతస్థల, 2. పుంజికస్థల, 3. మేనక, 4. సహజన్య, 5. నీప్రమ్లోచ, 6. అనుమ్లోచ, 7. ఘృతాచి, 8. విశ్వాచి, 9. పూర్వజితి, 10. తిలోత్తమ, 11. రంభ.

*షోడశ-అప్సరసలు*

1. పాథాసూత, 2. మహాభాగ, 3. దేవి, 4. దేవర్షిత, 5. అలంబుష, 6. మిశ్రకేళి, 7. విద్యుత్పర్ణ, 8. తిలోత్తమ, 9. అరుణ, 10. రక్షిత, 11. రంభ, 12. మనోరమ, 13. కేశిని, 14. సుబాహువు, 15. సురత, 16. సురజ.

అప్సరసలు కశ్యపుడను మునియందు పుట్టినట్లును, పాలసముద్రమునందు పుట్టినట్లును చెప్పుదురు. బ్రహ్మదేవునికి పిక్కలనుండి పుట్టినవారుగా కూడా చెబుతారు.

వీరు ఇంద్రుని కొలువులో ఉండెడి దేవవేశ్యలు. అవివాహితలు. ఇంద్రుడు వీరిని విశ్వామిత్రుని వంటి మునుల తపస్సులను భగ్నము చేయడానికి, హరిశ్చంద్రుని వంటి సత్యశీలుర వ్రతభంగము చెరచడానికి భూలోకానికి పంపుతుండేవాడని అంటారు. ఊర్వశి అర్జునుని మోహించి, అర్జునునిచే తిరస్కరింపబడి, అతనిని నపుంసకునిగా కొంతకాలము జీవించమని శాపమిచ్చినది. ఆ శాపము అర్జునునికి వరమై, అజ్ఞాతవాసంలో ఉపయోగపడినది.

అప్సరసలు సంగీతము, నృత్యము వంటి కళలందు ప్రావీణ్యత గలవారు. ఇంద్రుని సభలో వీరు నృత్యప్రదర్శనలు, సంగీత సభలు నిర్వహించేవారు.

జగన్మాత చతుష్షష్టి కళామయి. సంగీతప్రియ, సామగానప్రియ, లాస్యప్రియ. సహజముగా కళాకారిణులైన రంభ,ఊర్వశి మొదలైన అప్సరసలు వాగ్దేవీ స్వరూపిణియైన అమ్మవారిని ఆరాధించి వారి కళాకౌశలమును మరింత రాణింపననుగ్రహించమని కోరుకొంటూ నమస్కరించేవారు. కాబట్టి జగన్మాతకు *రంభాదివందితా* యను నామ మంత్రమొకటి సార్థకమైనది.

రంభ అనగా హృల్లేఖ హ్రీంకారము. పరమేశ్వరి *హ్రీం* కారముచే జపింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం రంభాది వందితాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*167వ నామ మంత్రము*

*ఓం పాపనాశిన్యై నమః*

కేవలం మంత్రజపం చేతగాని, నామస్మరణం చేతగాని భక్తుల పాపాలను నాశనం చేయు పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పాపనాశినీ* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం పాపనాశిన్యై నమః* అని ఉచ్చరిస్తూ, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ అఖిలాండేశ్వరిని ఆరాధించు భక్తులను వారు తెలిసిగాని, తెలియకగాని చేసిన పాపకృత్యములను క్షమించి సద్బుద్ధిని ప్రసాదించి తరింపజేయును.

జగన్మాత *నామ పారాయణప్రీతా* యని నామ ప్రసిద్ధమైనది. తనకిష్టమైన తన నామ మంత్రమును జపించు భక్తుల పాపములను నశింపజేస్తుంది. *ఓం శ్రీమాత్రే నమః* అని నోరారా స్మరించండి. వెంటనే ఆ తల్లి వారి పాపములను అగ్నిలో దూదివలెను, ఎండుగడ్డివలెనూ దహింపజేస్తుంది. అలాగని పాపకృత్యం చేయడం, వెంటనే నామ మంత్రజపం చేస్తే ఆ తల్లి ఊరుకోదు. పాపకృత్యములు చేయు ఆ దుష్టబుద్ధిని తగలబెట్టి సద్బుద్ధిని ప్రసాదిస్తుంది. అందుకే జగన్మాత *పాపసాశినీ* అని నామ ప్రసిద్ధమైనది.

వాసిష్ఠసృతియందు ఇలా చెప్పబడినదని సౌభాగ్య భాస్కరంలో 359వ పుటలో చెప్పబడినది.

*శ్లో. విద్యాతపోభ్యాం సంయుక్తం సదాపి పాపకర్మాణమేనో*

*న ప్రతియుజ్యతే జాపినాం హోమినాం చైవధ్యాయినాం*

*తీర్థవాసినాం న సంవసంతి పాపాని యే చ స్నాతాశ్శిరోవ్రతైః*

విద్యాతపస్సులతో గూడి జపపరాయణుడైన బ్రాహ్మణుడు పాపకర్మలు నిత్యము చేయుచున్నను అతనికి పాపములు అంటవు. మంత్రజపములు చేయువానిని, సదా ధ్యాన నిమగ్నుడైనవానిని దివ్యతీర్థములను సేవించువానిని, శిరస్సునందు అగ్నిని ధరించునతనిని పాపములు అంటవు.

మరియు

పద్ళపురాణంలో,పుష్కరఖండంలో ఇలాచెప్పబడినదని సౌభాగ్యభాస్కరంలో చెప్పబడినది:

*శ్లో. మేరుపర్వతమాత్రోఽపి రాశిః పాపస్య కర్మణః*

*కాత్యాయినీం సమాసాద్య నశ్యతి క్షణమాత్రతః॥*

పాపకర్మలు చేయువాని పాపములరాశి మేరు పర్వతమంత పెద్దదైననూ, జగన్మాత దర్శనంచేత అంతపాపమూ నశిస్తుంది.

దేవీభాగవతంలో ఈ విధంగా చెప్పబడినదని సౌభాగ్యభాస్కరంలో చెప్పడంజరిగినది:

*శ్లో. ఛిత్వా భిత్వా చ భూతాని హత్వా సర్వమిదం జగత్|*

*ప్రణమ్య శిరసా దేవీం న స పాపైర్వితిప్యతే॥*

వర్ణాశ్రమ ధర్మములు విడిచినవారు, పాపకర్ములు, జగన్మాతను ధ్యానించినంతనే వారి పాపములు నాశనమై, పుణ్యాత్ములగుదురు.

ఇక్కడ ఒక విషయం మనం అర్థంచేసుకోవాలి. అదేమిటంటే చేయాలనుకున్న పాపకృత్యములు చేసేసి, అంతా ఆ దైవభారమంటూ నామజపంచేసేస్తే పుణ్యాత్ములై పోతారనేది, పాపం పోతుందనికాదు. జగన్మాత అంతటి భక్తసులభురాలు. చేసిన పాపాలకు అనుభవం ఏనాటికైనా తప్పదు. చేసిన పాపాలు కట్టికుడుపుతాయి. కాని జగన్మాత నామ స్మరణతో మనం పాపకర్మలకు దూరంగా ఉంటాము. అదియే *పాపనాశినీ* యను నామ మంత్రమునకు పరమార్థము. ఆ తల్లి మనను పాపము చేయనీయకుండా, పుణ్యకర్మలనాచరించుటయంధు మనసును నిమగ్నము చేస్తుంది. ఈ పరమార్థం దృష్టిలో ఉంచుకొని జగన్మాతకు నమస్కరిస్తూ *ఓం పాపనాశిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*168వ నామ మంత్రము*

*ఓం నిష్క్రోధాయై నమః*

జగన్మాత బ్రహ్మజ్ఞాన స్వరూపిణి. అరిషడ్వర్గములకు అతీతురాలు. కాబట్టి రాగద్వేషాదులు కూడా ఆమె దరిచేరవు. అట్టి జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిష్క్రోధా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం నిష్క్రోధాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదాంబను ఉపాసించు సాధకులు రాగద్వేషరహితులై, అరిషడ్వర్గములు దరిజేరక, సదా లలితాంబ పాదసేవయే పరమావధిగా జీవించి తరించుదురు.

జగన్మాత పరమాత్మ స్వరూపిణి. ఆ తల్లి అరిషడ్వర్గములకు అతీతురాలు. బ్రహ్మజ్ఞాన స్వరూపిణి గనుక క్రోధమునకు కూడా అతీతురాలు. అందుచే *నిష్క్రోధా* యను నామ మంత్రముతో భక్తులచే స్తుతింపబడుచున్నది.

కామ, క్రోధ లోభ, మోహ మదమాత్సర్యములనేవి మనస్సుకు సంబంధించినవి. ఆత్మకు సంబంధించినవి కావు. జగన్మాత పరమాత్మస్వరూపిణి గనుక క్రోధరహితురాలు. గనుక *నిష్క్రోధా* యసు నామ మంత్రముతో స్మరించబడుతున్నది.

పుత్రుడు ఎంతటి దుర్మార్గుడైనను తల్లికి ప్రేమ తప్పక్రోధము ఉండదు. పుత్రునిపై తల్లికి కోపం వచ్చినా, అది ప్రేమపూరితమైనకోపము మరియు తాత్కాలికమే అవుతుంది. ఆ కోపము ద్వేషపూరితము కాదు. అలాంటి కోపం క్రోధమనిపించుకోదు. క్రోధమనేది అజ్ఞానం వల్ల వస్తుంది. ఆ కోపంలో ఆలోచన నశించి వినాశనానికి దారితీస్తుంది.

మహిషాసురాది రాక్షసులు జగన్మాతకు బిడ్డలవంటివారే. వారి రాక్షసకృత్యములకు జగన్మాత వారిలోని క్రోధప్రవృత్తిని సంహరించి వారి ఆత్మలను తనలో లీనంచేసుకున్నది. కోపం శరీరంతోటే అంతమవుతుంది తప్ప ఆత్మతో శరీరంనుండి శరీరానికి ప్రయాణంచేయదు.

కోపం తాత్కాలికమైతే, అటువంటి వారు ఉత్తములు. కొన్ని క్షణాలు ఉంటే మధ్యములు అంటారు. అదే కోపం పగగా మారి, తమ ప్రాణం పోయేవరకూ అవతలి వారిపై కోపం ఉంటే అది క్రోధము మరియు అట్టివారు పాపాత్ములు అని అనబడతారు. వీలయినంతవరకూ తమ కోపకారణం అవతలి వారికి వివరించి, మార్పుకోసం ప్రయత్నించాలి. అవతలివారిలో మార్పురాకపోతే వారి కర్మకు వారిని విడచిపెట్టి మౌనం పాటించాలి. ఒక వేళ వారు మనసులో మెదిలితే చిన్న చిరునవ్వుతో తమ కోపాన్ని అదిమిపట్టాలి. ఇది ఉత్తమ లక్షణం.

జగన్మాతకు బ్రహ్మజ్ఞాన స్వరూపిణి గనుక కోపం ఉండదు. దుష్టులైనా వారిపై కోపంకన్నా, వారిపై జాలి ఉంటుంది. జగన్మాత క్రోధము లేనిది గనుక *నిష్క్రోధా* యని నామ ప్రసిద్ధమైనది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిష్క్రోధాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*742వ నామ మంత్రము*

*ఓం భవదావసుధావృష్ట్యై నమః*

సంసార దావానలంమధ్య చిక్కుకుపోయి, అట్టి దావానలాన్ని యధిగమించలేక అలమటించే జీవులను అమృతవర్షిణియై రక్షించు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భవధావసుధావృవ్టిః* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం భవదావసుధావృష్ట్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగజ్జననిని ఆరాధించు భక్తులకు సంసారసంబంధమైన దుఃఖములు లేకుండా చేయును మరియు సుఖసంతోషమయమైన జీవితమును అనుగ్రహించును. పునర్జన్మరాహిత్యమైన మోక్షమును కలుగజేయును.

భవ అనగా సంసారము. దావ అనగా కార్చిచ్చు (అడవిలో చెలరేగు అగ్ని) సుధ అనగా అమృతము. వృష్టిః అనగా వర్షపుజల్లు. సంసారమను కార్చిచ్చుపై అమృతవృష్టిని కురిపించును జగన్మాత.

సంసారమును ఒక మహావృక్షముగా - వేదవ్యాసకృత శ్రీమద్భాగవతము, దశమస్కంధము - పూర్వార్థము - రెండవ అధ్యాయము - ఇరువది ఏడవ శ్లోకములో చెప్పబడిన విధానమును పరిశీలించుదాము

*ఏకాయనోఽసౌ ద్విఫలస్త్రిమూలశ్చతూరసః పంచవిధః షడాత్మా|*

*సప్తత్వగష్టవిటపో నవాక్షో దశచ్ఛదీ ద్విఖగో హ్యాదివృక్షః॥*

సంసారము (ప్రపంచము) అనెడి వృక్షమునకు మూలప్రకృతియే పాదు (ఆలవాలము). సుఖదుఃఖములు రెండును దీని ఫలములు. సత్త్వరజస్తమో గుణములు మూడును దీని వ్రేళ్ళు. ధర్మార్థకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్థములు దీని రుచులు. త్వక్చక్షుశ్శ్రోత్రజిహ్వాఘ్రాణములు అను పంచేంద్రియములు దీనిని తెలియు సాధనములు. ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అను ఆరును దీని స్వభావములు. చర్మము, రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముకలు, మజ్జ (ఎముకలయందుండు జిడ్డు పదార్థము), శుక్రము అను ఏడు ధాతువులును దీని పై పొరలు. పంచమహా భూతములును, బుద్ధి, మనస్సు, అహంకారము - అను ఎనిమిదియు దీని కొమ్మల మొదళ్ళు (రెండు చేతులు, రెండు పాదములు, శిరస్సు, కంఠము, వక్షస్థలము, జఠరము అను ఎనిమిదియు దీని కొమ్మలు), నవరంధ్రములు దీని కోటరములు (తొర్రలు). దశప్రాణములు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములనెడి మహాప్రాణములు ఐదును, నాగ, కూర్మ, క్రుకర, దేవదత్త, ధనంజయములు అను ఉపప్రాణములు ఐదును - వెరసి పదిప్రాణములు దీని పత్రములు. జీవుడు, ఈశ్వరుడు (జీవేశ్వరులు) అను రెండును ఈ సంసార రూప వృక్షమునకు పక్షులు. ఇట్టి సంసారమను వృక్షమునకు కార్చిచ్చు వచ్చినప్పుడు జగన్మాత అమృతవర్షిణియై శాంతింపజేయును.

సంసారి తన జీవిత భాగస్వామి (భార్య లేదా భర్త) తో బంధమేర్పడిన తరువాత నుండి బిడ్డలు, బిడ్డల పెంపకం, మనస్పర్థలు, అనారోగ్యం, ఆదాయం చాలకపోతే అప్పులు, పిల్లల విద్య, వైద్యం...ఇలా ఎన్నో ఉంటాయి. కష్టాలు తెరలు తెరలుగా వస్తాయి. అందులోనే తాత్కాలిక సంతోషాలు, పండుగలు, పబ్బాలు, బంధువుల రాకపోకలు...ఒకటేమిటి సంసారమంటే తెరలు తెరలుగా వచ్చేసంతోషాలు వాటి వెనుక వచ్చే ఇబ్బందులు, ఆపదలు మొదలైనవి. సంసారసాగరానికి ఆటుపోట్ల వంటి సుఖదుఃఖముల కెరటాలు వస్తూనే ఉంటాయి. సంసారంలో కలిగే దుంఖములన్నియూ సంసారమనే మహారణ్యంలో పెద్దకార్చిచ్చు వంటివి. అటువంటి కార్చిచ్చును ఉపశమింపజేయు అమృతవృష్టియే జగన్మాత కరుణాకటాక్షములు.

PVD Subrahmanyam చెప్పారు...

భవుడు అనగా మహాశివుడు. పవిత్రతకే పవిత్రమైనవాడు’ శివుని పేరు ఉచ్చరించినా చాలు మనసుకు శాంతి చేకూరుతుంది. ఆయనను ఆరాధించుటవలన మనస్సునకు సుఖశాంతులు లభిస్తాయి. పరమశివుడు దేవతలకే దేవుడు, మహాదేవుడుగా కూడా అభివర్ణిస్తారు. అంటే ఆయన సూర్యుడు, భూమి, నీరు మరియు గాలిని (పంచభూతములను) మించిన దేవుడని అర్థం. అటువంటి పరమశివుని సాన్నిధ్యము అనగా మోక్షమును ప్రసాదించునది జగన్మాత. ఆయన భోళా శంకరుడు. భక్తసులభుడు. జగన్మాతను ఆరాధిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుంది. శివుని ఆస్తి రత్నాలు, ధనరాసులు. అన్నిటికీ మించి మహాశివుని ఆస్తి జ్ఞానము. వీటిని జగన్మాత తన భక్తులకు పంచుతుంది. అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భవదావసుధావృష్ట్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*743వ నామ మంత్రము*

*ఓం పాపారణ్యదవానలాయై నమః*

పాపాలనే మహారణ్యములో చిక్కుకొని పాపకర్మఫలాలనే క్రూరమృగముల భయముతో అల్లాడునపుడు, అట్టి పాపారణ్యాన్నే దహించి రక్షించు దవానలము వంటి తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పాపారణ్యదవానలా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం పాపారణ్యదవానలాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగజ్జననిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తులను పాపకర్మల వలన సంచితమైన ఫలములను నివారించి, తన భక్తులను సన్మార్గంలో నడిపించి సద్గతులను ప్రసాదించును.

పాపము అనేది ఒక మహారణ్యమువంటిది. పాపకర్మల ఫలములు ఆ మహారణ్యంలో క్రూరజంతువులవంటివి. అట్టిమహారణ్యమును దహించివేయు దవానలము వంటిది శ్రీమాత. కాబట్టి ఆ తల్లిని *పాపారణ్యదవానలా* యను నామ మంత్రముతో స్తుతిస్తున్నాము.

పాపములనేవి ఒక జన్మలో అనుభవించడం అవదు లేదా ఒకే జన్మలో చేసినవి కూడా కాకపోవచ్చు. అవి జన్మజన్మలకూ సంచితములౌతూ ఉంటాయి. అలాగే ఆ పాపకర్మలననుసరించి జన్మలు కూడా మారుతూ ఉంటాయి. ఇది ఒక bank ఖాతా వంటిది. పాపమయితే ఖర్చుప్రక్క (debit side), పుణ్యమయితే జమప్రక్కా (credit side) చేరుతూ సంచితము అవుతూ ఉంటుంది. ఈ జమ ఖర్చులలో ఖర్చు ఎక్కువయితే నీచ జన్మలూ, జమ ఎక్కువయితే ఉత్తమ జన్మలూ లభిస్తాయి. అంటే నిల్వలో పాపములు ఎక్కువయితే పాపపునిల్వ, పుణ్యములు ఎక్కువయితే పుణ్యపునిల్వ ఉంటుంది. పరమేశ్వర నామ స్మరణ (త్రికరణ శుద్ధి) తో పాపపుణ్యములు సమానమై నిల్వ లేకపోవడంతో (nill balance) అయితే అంతటితో మోక్షం సిద్ధిస్తుంది. పరమేశ్వర సాన్నిధ్యం లభిస్తుంది. మనం సాధారణంగా వింటూంటాం - ఒక కుక్క ఆలయంలో రోజూ ప్రదక్షిణములు చేస్తూ ఉంటుందని. లేదా ఒక నాగుపాము శివలింగంపై చుట్టుకొని, ఎవరినీ ఎమీ అనకుండా ఉంటుందని, ఒక గోవు రోజూ మహలక్ష్మీ ఆలయంలో ప్రవేశించి ప్రదక్షిణములు చేసి అక్కడే ఉండి ఎంతమంది బెదిరించినా పోలేదని. ఇదంతా వాటికి పూర్వజన్మ జ్ఞానం కలిగి ఈ జన్మలో సత్కర్మలు చేయుచున్నవిగా భావిస్తాము. జన్మలలో మానవ జన్మ ఉత్తమమైనది. అందునా ఉత్తమకర్మలాచరించు వానిగా జీవించడం మరింత ఉత్తమమైనది. కనుక జన్మసార్థకత చేసుకోవాలంటే తాను ఎలాంటి ఉత్తమ కర్మలాచరించాలి అనేది తెలుసు కోవాలి.

జన్మజన్మలకూ సంచితమవుతూ ఉండే పాపములు ఒక దట్టమైన మహారణ్యం వంటివి. పాపకర్మల ఫలములు ఆ దట్టమైన అరణ్యములో క్రూరజంతువుల వంటివి. అట్టి పాపకర్మల పలములనే క్రూరజంతువుల బారినుండి రక్షింపబడాలి అంటే జగన్మాతను త్రికరణశుద్ధితో ధ్యానించాలి. జగన్మాత ఆ పాపకర్మల మహారణ్యాన్ని తానొక దవానలంగా దహించి, పాపకర్మల ఫలములు అనే క్రూరజంతువుల బారినుండి కాపాడుతుంది గనుకనే జగన్మాత *పాపారణ్యదవానలా* యను నామ మంత్రముతో స్తుతింపబడుచున్నది. అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం పాపారణ్యదవానలాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*169వ నామ మంత్రము*

*ఓం క్రోధశమన్యై నమః*

కోపము శత్రువు వంటిది. కోపము అజ్ఞానమునకు చిహ్నము. కోపము గలవాడు చేయు యజ్ఞములు, జపములు, పూజలు నిష్ఫలములు. తన భక్తులలో అట్టి కోపమును నశింపజేయు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *క్రోధశమనీ* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం క్రోధశమన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరాశక్తిని అత్యంతభక్తి తత్పరతతో ఉపాసించు సాధకునకు ఆ తల్లి కరుణచే తొలుత తనలో తనకు శత్రుసమానముగా ఉండు కోపము నశించును. పిదప జగన్మాత నామ స్మరణపై నిమగ్నత అధికమై ఆత్మానందానుభూతిని పొందును. సుఖసంతోషములతో జీవించును. అంత్యమున జన్మరాహిత్యత కూడిన మోక్షము లభించును.

కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము ఈ ఆరింటిని అరిషడ్వర్గములు అందురు. వర్గము అంటే కూటమి. అరి అంటే శత్రువు. అరిషడ్వర్గము అంటే ఒక శత్రువు ఏవిధంగా సంహరిస్తాడో అలాగే ఈ వర్గములో ఏలక్షణమైనా శత్రువుతో సమానమే. అందునా క్రోధము చాలా ప్రమాదమైన శత్రువు. క్రోధము వలన ఫలితం వెంటనే తెలిసిపోతుంది. ఇవన్నీ మనసుకు సంబంధించినవి. ఆత్మకు సంబంధించవు. జగన్మాత పరమాత్మ స్వరూపిణి. కాబట్టి మనసుకు సంబంధించినది మరియు శరీరధారులకు ఉండే క్రోధము జగన్మాతకు ఉండదు. అందుచే ఆ తల్లి *నిష్క్రోధా* అనగా కోపము లేనిది అను నామ మంత్రముగలిగినది. తను నిష్క్రోధా యనబడుచున్నది గనుక తన భక్తులకు కూడా క్రోధము ఉండ కూడదు. అందుకు తన భక్తులలోని క్రోధాన్ని నశింపజేస్తుంది.

*క్రోధయుక్తో యద్యజతి యజ్జుహోతి యదర్చతి|*

*సతస్య హరతే సర్వం ఆమకుంభో యథోదకమ్॥*

పచ్చికుండలో ఉదకము (నీరు) నిలబడనట్లు క్రోధము ఉన్నవాడు చేయు యజ్ఞములు, జపములు, పూజలు నిష్ఫలాన్ని ఇస్తాయి. క్రోధము ఉన్నవాడు అజ్ఞానితో సమానం. క్రోధము ఉన్నవాడు తనకు తెలియకుండానే అయినదానికి, కానిదానికి ఊగిపోతూ ఉంటాడు. అది ఆరోగ్యానికి కూడా మంచిదికాదు. రెండవది కోపం అనేది విచక్షణాజ్ఞానంలేకుండా చేస్తుంది. గనుక ఎదుటవారిని మానసిక మరియు భౌతికపరంగా హింసించడం జరుగుతుంది. దాని వలన క్రోధం కలిగి ఉండడం ఒక పాపమయితే, ఆ కోపంలో తాను చేయు హింసవలన మరింత పాపం సంచిత మౌతుంది. అపఖ్యాతిని మూటగట్టుకుంటాడు. లేదా తనను తానే శిక్షించుకొను రీతిలో తన యునికిని తానే పోగొట్టుకొని, తనతో పాటు, తనపై ఆధారపడినవారినికూడా ఇక్కట్లపాలు చేయడం జరుగుతుంది. అందుకే తన కోపము తనకే శత్రువు అని అన్నారు పెద్దలు.

*క్రోధస్య దుష్టత్వం ఆపస్తంబేనోక్తం* క్రోధముయొక్క దుష్టత్వాన్ని ఆపస్తంబుడు చెప్పడం జరిగింది (ఆయన చెప్పడం ఏమిటి? అందరికీ స్వానుభవమే! కాదంటారా? ఎవ్వరూ అనరు.) అయినా.

జగన్మాత తన భక్తులలోని ఇంతటి ప్రమాదకరమైన క్రోధమును నశింపజేయును గనుకనే *క్రోధశమనీ* యను నామ మంత్రముతో స్తుతింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం క్రోధశమన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*744వ నామ మంత్రము*

*ఓం దౌర్భాగ్య తూలవాతూలాయై నమః*

దూది పింజలను గాలి ఎగురగొట్టినట్లు జీవుల దౌర్భాగ్యాన్ని (దురదృష్టాన్ని) పారద్రోలు జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *దౌర్భాగ్య తూలవాతూలా* యను ఎనిమిదక్షరముల నామ మంత్రమును *ఓం దౌర్భాగ్య తూలవాతూలాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిప్రపత్తులతో ఆ శ్రీమాతను ఉపాసించు సాధకుడు దురదృష్టములనేవి తన జీవనకాలంలో ఎదుర్కొనక, సౌభాగ్యములతో, అదృష్టవంతుడై, సుఖసంతోషములతో ఆ పరమేశ్వరి నారాధించి తరించును.

దౌర్భాగ్యము అనగా దురదృష్టము, తూల అనగా దూదిరాశి, వాతూలా అనగా గాలి దుమారము.

దౌర్భాగ్యమనెడి దూది పింజలు (ఎగిరిపోవుటకు) జగన్మాత గాలిదుమారం వంటిది అని ఈ నామ మంత్రములోని భావము.

భాగ్యము (అదృష్టము) లేక పోయినా పరవాలేదు. దౌర్భాగ్యము (దురదృష్టము) సంభవింపకూడదు.

దౌర్భాగ్యములు ఎనిమిది (అష్టదౌర్భాగ్యములు)

1) *ఋణము* (ఆస్తి లేకపోయినా పరవాలేదు. అప్ఫులు ఉండకూడదు)

2) *యాచన* (కష్టపడడానికి కూడా అవకాశం లేకపోవడం)

3) *ముసలితనము* (వృద్ధాప్యము తప్పని అవస్థ, కాని తన పనులు తను చేసుకుంటూ, వేరొకరు విసుగుతో సేవలు చేయకుండా ప్రాణంపోవడం మేలు)
4) *జారత్వము* (పరస్త్రీ వ్యామోహము వలన పదుగురిలో గౌరవము లేక పోవుట) 5) *చోరత్వము* (కష్టపడి పని చేసుకోవాలి. ఒరుల సొత్తును అపహరించ కూడదు) 6) *దరిద్రము* (పచ్చికట్టెలు పొయ్యిలోనికి, ఇంట్లో పిల్లలు ఆకలితో ఏడ్వడం, కట్టుకోవడానికి గుడ్డలు లేక పోవడం, సమయానికి అందవలసిన ధనము అందక పోవడం, చలికి దుప్పటి కూడా లేక పోవడం, ఉండడానికి నీడలేక పరుల పంచన ఉండడం, కష్టపడకుండా ఒరుల సంపాదనపై బ్రతకడం వంటి దరిద్రములు) 7) *రోగము* (శరీరంలో శక్తి లేకపోయినా పరవాలేదు. రోగాల బాధ ఉండకూడదు) 8) భుక్తశేషభోజనము (తినకపోయినా పరవాలేదు. ఒరులు పెట్టు ఎంగిలి కూటికి ఆశపడకూడదు)

భాగ్యము లేక యుండుట వేరు. దౌర్భాగ్యము ఉండుటవేరు.

జగన్మాతను నమ్మి, ఆరాధిస్తే, జీవుని దౌర్భాగ్యములు అను దూదిపింజలకు జగన్మాత గాలిదుమారం వంటిది. అనగా గాలికి దుమారంలో దూదిపింజలు ఎలా అయితే ఎగిరిపోతాయో, జగన్మాత కరుణిస్తే భక్తుల దౌర్భాగ్యములు చెల్లాచెదరైపోతాయి. అంటే దురదృష్టం తన భక్తులకు జగన్మాత అంటనీయదు.

జగన్మాతను ఉపాసించు ఉపాసకునికి దురదృష్టము గాని దౌర్భాగ్యము గాని ఉండదు. జగన్మాతను ఆరాధిస్తూ చేయు పూజలు గాని, జపములు గాని, క్రతువులు గాని, నామ స్మరణగాని లేదా జగన్మాతకు సంబంధించిన మరియే ఇతర కర్మలు గాని దారిద్ర్యమును పోగొట్టును.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం దౌర్భాగ్య తూలవాతూలాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*170వ నామ మంత్రము*

*ఓం నిర్లోభాయై నమః*

తనకున్నది తనుకూడా అనుభవింపక, ఒరులకు పెట్టక, ఉన్నది చాలు అనే తృప్తిలేక ఇంకా ఇంకా కూడబెట్టాలనే లోభ గుణం మనసుకు సంబంధించినది. ఆత్మకు సంబంధించదు. అటువంటి లోభ గుణంలేని పరమాత్మ స్వరూపిణియైన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిర్లోభా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం నిర్లోభాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ అఖిలాండేశ్వరియైన లలితాంబను అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించిన సాధకుడు లోభత్వము లేక ఉన్నదానితో తృప్తినందుతూ, పరమేశ్వరీ పాదసేవయందు నిమగ్నుడై ఆత్మానందముతో జీవించి తరించును.

తనకున్నది తనుకూడా అనుభవింపక, పరమదరిద్రాన్ని అనుభవిస్తూ, ఒరులకు పెట్టక, ఉన్నది చాలు అనే తృప్తిలేక ఇంకా ఇంకా కూడబెట్టాలనే దురాశ కలిగియుండుట, లేక మొత్తం తనకే కావాలి వేరొకరికి కాకూడదు అనే దురాశ,, ఇంకా ఇంకా కూడబెట్టాలి, అందుకు ఎంతైనా నైచ్యానికి దిగజారుటయే లోభత్వం. ఇది ఒక మానసిక వ్యాధి. కేవలం మనసుకు సంబంధించినది. ఆత్మకు సంబంధించదు.

మనకు ఏదైనా కలిగి ఉంటే, అది భగవంతుడు ఇచ్చినది. పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు. తను తినాలి. కొంత దానధర్మములకు వెచ్చించాలి. సద్గతుల మాట ఎలా ఉన్నా మళ్ళీ వచ్చేజన్మలో నైనా పుణ్యకార్యములకు మనకున్నదాంట్లో కొంత వెచ్చించాలి. దాన ధర్మములు కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా, పుచ్చుకొనేవారి అర్హతను అనుసరించి దానము ఇవ్వవలెను. ఒక అవిటివానికి, తిండికి లేనివానికి, ఆపదలో ఉన్నవారికి, పేదవిద్యార్ధికి...ఇలా పాత్రమెరిగిన దానముచేయుటయే ఔదార్యత మరియు నిర్లోభత్వము

నిర్లోభా అనగా లోభత్వము లేనిది. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు - ఈ ఆరును అరిషడ్వర్గములు. ఇవి మానసిక శత్రువులు. అనగా మనసుకు సంబంధించినవి. ఆత్మకు సంబంధించనివి. జగన్మాత పరమాత్మస్వరూపిణి. కాబట్టి లోభము అన్న గుణము నాపాదించుటయే దోషము. గనుక

*అత్యంతమౌదార్యాన్నిర్లోభా* (సౌభాగ్యభాస్కరం, 361వ పుట)

అమ్మవారు మిగుల ఔదార్యము గలది అని అనుట ఉచితము. భక్తులు కోరిన ధర్మబద్ధమైన కోరికలను తీర్చును. కాబట్టి ఆ తల్లి *నిర్లోభా* అనగా భక్తుల కోరికలను తీర్చుటకు సంశయించదు అని భావించవలెను.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిర్లోభాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*745వ నామ మంత్రము*

*ఓం జరాధ్వాంత రవిప్రభాయై నమః*

ముసలితనపు అగచాట్లనే చీకట్లను పోగొట్టడానికి తానొక రవికిరణమై విరాజిల్లు జగజ్జననికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *జరాధ్వాంతరవిప్రభా* యను ఎనిమిదక్షరముల నామ మంత్రమును *ఓం జరాధ్వాంత రవిప్రభాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు సాధకునకు, వయసు మీదపడి ముసలితనము వచ్చినా, జగన్మాత ఆరాధనకు అవరోధమయే ముసలితనపు అగచాట్లు లేకుండా కాపాడును. సుఖశాంతులు ప్రసాదించి, ఆత్మానందానుభూతితో తరింపజేయును.

జరా అనగా ముసలితనము (అనే) ధ్వాంత అనగా చీకటి (కి) రవిప్రభా అనగా సూర్యకిరణముల (వంటిది).

జీవితంలో చివరియవస్థ వృద్ధాప్యము. వృద్ధాప్యం చాలా భారమైనది. పరమాత్మ తనను తీసుకుపోతే చాలు అనుకునే అవస్థ వృద్ధాప్యము. కాటికి కాళ్ళు, కూటికి నోరు చాపుకుని ఉన్న పరిస్థితి. కళ్ళు సరిగా కనబడవు, చెవులు సరిగా వినిపించవు, ఇష్టంగా ఏదైనా తినాలంటే అరగని పరిస్థితి, నాలుగడుగులు వేసి నడవాలంటే కర్ర చేతికి ఉండాలి. ఇదే జరాధ్వాంతము (ముసలితనపు చీకటి) అంటే. తనభక్తులకు ముసలితనం అనే చీకట్లు పోగొట్టడానికి తానొక రవికిరణమై జగన్మాత విరాజిల్లుచున్నది గనుకనే ఆ తల్లి *జరాధ్వాంతరవిప్రభా* యను నామము కలిగియున్నది. ఈ సందర్భంలోనే ఆదిశంకరులు సౌందర్యలహరిలో ఇలా అన్నారు:

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*171వ నామ మంత్రము*

*ఓం లోభ నాశిన్యై నమః*

స్వపరభేదములు, దురాశ, పిసినారితనము మొదలైన అసురభావములను రేకెత్తించు లోభగుణము తన భక్తులకు లేకుండా నశింపజేసి, త్యాగ గుణవర్తనులుగా జేయు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *లోభనాశినీ* యను ఐదక్షరముల నామ మంత్రమును *ఓం లోభనాశిన్యై నమః* అని ఉచ్చరించుచు, అత్యంత భక్తిశ్రద్ధలతో జగన్మాతను అర్చించు భక్తులకు లోభగుణము లేకుండా, త్యాగగుణసంపన్నతను ప్రసాదించి తరింపజేయును.

అరిషడ్వర్గములలో ఒకటైన లోభగుణము మనిషిలోని మంచిగుణములను అన్నింటినీ నాశనంచేస్తుంది. ఆశారహితుడు, సంశయము లేనివాడు, సందేహములను పోగొట్టువాడు అని తంత్ర తంత్రరాజములో గురువుయొక్క లక్షణము చెప్పబడినది.

ఇంతకు ముందు 171వ నామ మంత్రములో జగన్మాతను *నిర్లోభా* అని అన్నాము. అనగా లోభత్వం అనేది అరిషడ్వర్గములో ఒకటి. ఇది కేవలం మనసుకు సంబంధించినది. ఆత్మకు సంబంధించదు. జగన్మాత పరమాత్మ స్వరూపిణి. ఆ తల్లి తన భక్తులకు కోరిన కోరికలకు అనుగుణంగా, అత్యంత ఉదారతతో, వారి ధర్మబద్ధమైన కోరికలు తీరుస్తుంది. గనుకనే ఆ తల్లి *నిర్లోభా* యను నామ మంత్రముతో ఆరాధింప బడుచున్నది. తను ఏవిధంగా *నిర్లోభా* యని అనబడినదో, తన భక్తులు కూడా లోభత్వం లేకుండా, వారు త్యాగబుద్ధితో తమకున్న కలిమిని తాము అనుభవిస్తూ, తమ వారిని సంతసింపజేస్తూ, త్యాగనిరతితో ఒరులకు కూడా సహాయపడేలాజేసి సద్గతులను అనుగ్రహిస్తుంది.

పుట్టినపుడు మనం తెచ్చేది ఏదీ ఉండదు. అలాగే గిట్టునపుడు తీసుకుపోయేది అసలే ఉండదు. ఉన్నంత కాలం సంపాదించు కోవడం, తినడం, ఒరులకు ఇంత ఇవ్వడం. పూర్వ జన్మ సుకృతం వలన ఇబ్బడి ముబ్బడిగా సంపాదించే అవకాశం రావచ్చు. కాని ఆ సంపాదన ధర్మబద్ధమై ఉండాలి. అలాంటి సంపాదనలో తన భవిష్యత్తుకి, తనవారికి జాగ్రత్తచేసుకుంటూ ధర్మకార్యములకు కూడా వినియోగించడం త్యాగ లక్షణం. తనకున్నది తాను అనుభవించక, కనీసం సరైన తిండైనా తినక, మంచి బట్టకూడా కట్టక, తనవారిని కూడా అలాగే కట్టడి చేస్తూ, ఒరులకు కూడా పెట్టక, భగవంతుని సేవకు కూడా అసలే వినియోగించక ఒక మహా లోభిగా ప్రవర్తించే వాడు ఆ పరమాత్మచే క్షమింపబడడు. పైగా పదిమందిలో అటువంటి లోభికి గౌరవంకూడా ఉండదు. ఇటువంటి లోభత్వాన్ని తన భక్తులకు నశింపజేసి, ధర్మగుణవర్తనులై నిలుపుతుంది. గనుకనే జగన్మాత *లోభనాశినీ* యని స్తుతింపబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం లోభనాశిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*746వ నామ మంత్రము*

*ఓం భాగ్యాబ్ధి చంద్రికాయై నమః*

వెన్నెల సముద్రమును పొంగునట్లు చేయు విధంగా భక్తుల భాగ్యమును (సంపదలను) వృద్ధి చేయు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భాగ్యాబ్ధిచంద్రిగా* యను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును *ఓం భాగ్యాబ్ధి చంద్రికాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ శ్రీమాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే,తన భక్తులకు సిరిసంపదలు మాత్రమే గాక, బ్రహ్మజ్ఞాన సంపదలుకూడా ప్రసాదించును, ఉన్న వాటిని కరుణించి వృద్ధిచేయును.

జగన్మాతను *భాగ్యాబ్ధి చంద్రికా* యని ఆరాధిస్తున్నాము ఈ నామ మంత్రముతో. భాగ్య అనగా సంపదలు. అబ్ధి అనగా సముద్రము, చంద్రిక అనగా వెన్నెల. భాగ్యము అనే సముద్రము (పొంగుట) కు జగన్మాత వెన్నెలవంటిది.

పున్నమి వెన్నెలకు సముద్రము పరవశిస్తుంది. పొంగుతుంది. కెరటాలతో ఆనందంగా నృత్యం చేస్తుంది. అలాగే భక్తుల భాగ్యములనే సముద్రము పొంగడానికి జగన్మాత వెన్నెల వంటిది యని భావము.

భాగ్యము అంటే కేవలం ధనము, బంగారము, ఇళ్ళు, వాకిళ్ళు మాత్రమేకాదు. ఇవన్నీ ప్రాపంచిక సుఖములతో ఆనందాన్నిస్తాయి. ఈ భౌతికపరమైన సుఖములనిచ్చే సంపదలకన్నా అతీతమైనది బ్రహ్మజ్ఞాన సంపద కూడా ఒకటి గలదు.

భౌతికపరమైన సంపదలు కేవలం ఐహికంగా సుఖపెడతాయి. కాని బ్రహ్మజ్ఞాన సంపదలు శాశ్వతమైన పునర్జన్మ రహితమైన ముక్తిని ప్రసాదిస్తాయి. ఆత్మానందాను భూతిని కలుగజేస్తాయి. జగన్మాత నామస్మరణతో లేదా భక్తిప్రపత్తులు కలిగిన ఆరాధనతో లేదా నిరంతరమైన యోగసాధనతో ఆ తల్లిని సేవిస్తే ఆ తల్లి భక్తుల భౌతికపరమైన మరియు ఆధ్యాత్మికపరమైన భాగ్యములనెడి సముద్రమునకు వెన్నెలై ఆ సంపదలను వృద్ధిజేస్తుంది. కాబట్టి ఆ పరమేశ్వరి *భాగ్యాబ్ధి చంద్రికా* యను నామముతో ప్రసిద్ధి చెందినది. గనుక జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భాగ్యాబ్ధి చంద్రికాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*172వ నామ మంత్రము*

*ఓం నిస్సంశయాయై నమః*

సంశయములు లేనిది, సంశయములను నాశనము చేయునది మరియు కోరికలు లేనట్టి గురుస్వరూపిణియైన జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిస్సంశయా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం నిస్సంశయాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదాంబను అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకుడు సంశయరహితుడై, జన్మకు కారణములు, పునర్జన్మ రహితమైన మోక్షసాధనకు తానేమి చేయవలెనో ఆ పరమేశ్వరి కరుణతో తెలిసికొని, ఆత్మానందానుభూతితో జీవించి తరించును.

మానవ జన్మే సంశయాత్మకమైనది. ద్వైతమంటే ఏమిటి? అద్వైతమంటే ఏమిటి? ఈ రెండిటిలో దేనిని అనుసరించాలి? జీవుడు వేరు, దేవుడు వేరు అని చెప్పే ద్వైతము ఎంతవరకూ అనుసరించదగినది, జీవుడు, దేవుడు ఒకటే అని చెప్పే అద్వైతము యొక్క నిర్వచనమేమిటి? అది అనుసరించినందువల్ల ఆత్మానందానుభూతి కలుగుతుందా? ఆత్మ, దేహము ఈ రెండూ ఒకటేనా? ఈ రెండూ కాని మనస్సే ఆత్మ అవుతుందా? ఇవి ఏమియు కాని బుద్ధికి, మనస్సుకు గల సంబంధం ఏమిటి? ఇవన్నీ సంశయాలే!

ఇంకా ఎన్నో ఉన్నాయి. దేవుడు అని చెబుతారు. దేవలోకం ఉంది అంటారు. ఊర్ధ్వలోకాలు, అధోలోకాలలో ఏది దేవలోకం? అసలు దేవతలను ఎవరైనా చూడడం జరిగిందా?

ఇంక పరబ్రహ్మమంటే ఏమిటి? కర్మఫలం అనేది ఉందా? ఉంటే దానిని అనుభవింపజేసేవారు ఎవరు? దేవుడి గుడి, విగ్రహం, పుణ్యక్షేత్రం ఇవి ఏమిటి? దేవుడు సర్వాంతర్యామి అయితే, గుడికే ఎందుకు వెళ్ళాలి? , దేవుడిని విగ్రహంలోనే ఎందుకు వెదకాలి? పుణ్యక్షేత్రాలలోనే దేవుడు ఎందుకు ఉంటాడు? ఇవన్నీ సంశయాలే మనకు.

వీటికి సమాధానాలు వేదవేదాంగములందు, శాస్త్రములందు, పురాణేతిహాసములందు తెలిసికోవచ్చు. అంతమాత్రమే కాదు. ఆ జగన్మాతను త్రికరణ శుద్ధిగా ధ్యానిస్తే కూడా మానవునికి గల అనేక సంశయాలకు సమాధానం దొరుకుతుంది.

జగన్మాత సర్వ మంత్రస్వరూపిణి మరియు సర్వమంత్రాత్మిక. ఇంకను సర్వతంత్రాత్మిక. జగన్మాత శ్రీవిద్యా స్వరూపిణి. కుండలినీ శక్తిగా షట్చక్రములలో ఉంటూ, బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథులను ఛేదించుకుంటూ, సహస్రారంలో సుధాసాగరమందు పరమేశ్వరుని చేరి, అమృతధారలలో సాధకుని తన్మయుణ్ణిచేసి పరబ్రహ్మతత్త్వాన్ని అనుభవైకవేద్యంగా బోధించే గురుమండలరూపిణి గనుక *నిస్సంశయా* యని నామ ప్రసిద్ధమైనది. ఆ తల్లి సర్వ మంత్రస్వరూపిణి, సర్వతంత్రరూపిణి, మహాయో
గేశ్వరేశ్వరి గనుక *నిస్సంశయా* అని అనబడినది. ఆ పరమేశ్వరి మూలమంత్రాత్మికా, మూలకూటత్రయకళేబరా, జ్ఞానదాయనీ, సర్వవేదాంత సంవేద్యా,, సత్యానంద స్వరూపిణీ, ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తి స్వరూపిణీ, గురుమండల రూపిణీ, దక్షిణామూర్తి రూపిణీ, శివజ్ఞాన ప్రదాయనీ, శాస్త్రసారా, పరబ్రహ్మస్వరూపిణీ అని వివిధ నామ మంత్రములే తన స్వరూపమైనది ఆ తల్లికి సంశయాలు ఉంటాయా? ఉండవు. కాబట్టి *నిస్సంశయా* యని నామ మంత్రముతో స్తుతింప బడుచున్నది. అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిస్సంశయాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*173వ నామ మంత్రము*

*ఓం సంశయఘ్న్యై నమః*

దేహము, ఇంద్రియాలే తాను అనే అజ్ఞానభావన అను హృదయగ్రంథి విడిపోయి, సాధకునికి తానే సచ్చిదానందరూపుడనే జ్ఞానమును అన్ని వర్ణముల (బ్రహ్మక్షత్రియవైశ్యశూద్ర యను వర్ణముల) వారికి ప్రసాదించు జగజ్జననికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సంశయఘ్నీ* యను నాలుకక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం సంశయఘ్న్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకునకు ఆ తల్లి సంశయములన్నియు తీర్చి, సచ్చిదానంద స్వరూపుడనను జ్ఞానాన్ని ప్రసాదించును.

పరమాత్మస్వరూపిణి అయిన జగన్మాతను ఆరాధిస్తున్నాము. అనేక సంశయాలు ఉండడం సహజం.

అజ్ఞానమను అంధకారాన్ని పోగొట్టి జ్ఞానమనే జ్యోతిని వెలిగించు నతడు గురువు. మంత్రోపదేశం చేసి, దీక్ష ఇచ్చి, ఎలా సాధనచేయాలో తెలియజేయునతడు గురువు. సాధకునికి సంశయాలు ఉండడం సహజం గనుక సంశయాలకు సమాధానంచెప్పేది గురువు మాత్రమే. అటువంటి గురుస్వరూపిణి కాబట్టి *సంశయఘ్నీ* యను నామము కలిగియున్నది.

జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. *గురుమూర్తిః* (603వ నామ మంత్రము) గురువుయొక్క రూపముగా ఉన్నది జగన్మాత. అందుచే *సంశయఘ్నీ* అను నామ మంత్రము కలిగియున్నది.

*త్రిమూర్తిః* (628వ నామ మంత్రము) సత్త్వరజస్తమోగుణ ప్రకృతులకు అధిదేవతలైన త్రిమూర్తిస్వరూపిణి, త్రిగుణాతీతమైన పరబ్రహ్మను సూచించే గురుస్వరూపిణి గనుక ఆ తల్లి భక్తుల సంశయములను తీర్చుతుంది. అందుచే అమ్మవారిని *సంశయఘ్నీ* అని స్తుతిస్తున్నాము.
*దక్షిణామూర్తిరూపిణీ* (725వ నామమంత్రము) వటవృక్షం క్రింద, దక్షిణాభిముఖంగా, పద్మాసనంలో, చిన్మయముద్రతో, తురీయస్థితిలో కూర్చుని త్రిమూర్తులకే గురువుగా ప్రసిద్ధికెక్కిన దక్షిణామూర్తి స్వరూపిణి అమ్మవారు. దక్షిణామూర్తి స్వరూపంలో జగన్మాత దర్శనం సర్వసంశయములను పోగొడుతుంది. గనుకనే జగన్మాత *సంశయఘ్నీ* యని నామ ప్రసిద్ధి చెందినది. శ్రీవిద్యాపరంపరలో సిద్ధౌఘమునందున్న సనకసనందనాదులచే ఆరాధింపబడిన గురుస్వరూపిణి గనక జగన్మాత *సంశయఘ్నీ* యని స్తుతింపబడుచున్నది. *శివజ్ణానప్రదాయినీ* (727వ నామ మంత్రము) జగన్మాత శివసంబంధమైన జ్ఞానాన్ని ప్రసాదించు గురుస్వరూపిణి గనుక జగన్మాత *సంశయఘ్నీ* యను నామమునకు సార్థకత కలిగియున్నది.

*భిద్యతే హృదయగ్రంథిః ఛిద్యంతే సర్వసంశయాః|*

*క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే॥*

అజ్ఞానంతో ఈ దేహము, ఇంద్రియములు మాత్రమే తాను అనే భావన అయిన హృదయగ్రంథి విడిపోయి, సాధకుడు తానొక సచ్చిదానంద స్వరూపుడనను జ్ఞానంతో తనలోనున్న సంశయనాశనమునకు కారణమైన జగన్మాత *సంశయఘ్నీ* యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సంశయఘ్న్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*747వ నామ మంత్రము*

*ఓం భక్తచిత్తకేకి ఘనాఘనాయై నమః*

భక్తుల మనస్సులనే నెమళ్ళకు తానొక దట్టమైన మేఘమై, భక్తుల హృదయాలను ఆనందడోలికలలో తేలియాడించు జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా నహస్ర నామావళి యందలి *భక్తచిత్తకేకిఘనాఘనా* యను పది అక్షరముల నామ మంత్రమును *ఓం భక్తచిత్త కేకి ఘనాఘనాయై నమః* అని ఉచ్చరించుచూ, భక్తిప్రపత్తులతో జగన్మాతను ఆరాధించు సాధకులను ఆత్మానందానూభూతితో ఆనందింపజేసి, జన్మతరింపజేయును.

భక్తచిత్త అనగా *భక్తుల మనస్సు (అనెడి)* కేకి అనగా *నెమళ్ళ(కు)* ఘనాఘనా అనగా *దట్టమైన మేఘము (వంటిది)* తొలకరిలో దట్టమైన మేఘములను చూడగానే నెమళ్ళు ఆనందముతో పురివిప్పి నృత్యం చేస్తాయి. అలాగే భక్తిభావంతో జగన్మాతను స్మరించుచూ, పూర్తిగా నిమగ్నమైన సాధకునికి అనుకోకుండా ఆనందాశ్రువులు కళ్ళనుండి స్రవిస్తాయి. అంటే అంతర్ముఖసమారాధనలో తనచుట్టూ ఉన్న పరిసరాలనే మరచి నిమగ్నమైన సాధకుల హృదయాలను జగన్మాత పరమానందడోలికలలో తేలియాడించును అని భావము మనం తీసుకోవచ్చును.

సాధకుడు మూలాధారంలో నున్న కుండలినీ శక్తిని జాగృతంచేసి, షట్చక్రములగుండా పయనింపజేస్తూ, బ్రహ్మ,విష్ణు,రుద్రగ్రంథులను ఛేదింపజేసి, సహస్రారమునకు చేర్చగానే కుండలినీ శక్తిస్వరూపిణియైన జగన్మాత చంద్రమండలమందు, పరమేశ్వరుని చేరి, అమృతధారలను కురిపింపజేయగా, సాధకుని 72,000 వేల నాడులు ఆ అమృత వృష్టిలో తడిసిముద్దై, సాధకుడు తరించితినను భావనతో పరమానందభరితుడగుట జరుగును. ఈ స్థితికి సాధకుని చేర్చుటయే *భక్తచిత్త కేకి ఘనాఘనా* యను నామ మంత్రమునకు పరమార్థం. జగన్మాత ధ్యానంలో సాధకుని సాధన పరాకాష్ఠకు చేర్చడమే *భక్తచిత్త కేకి ఘనాఘనా* యను నామ మంత్రమునకు గల పరమార్థము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భక్తచిత్త కేకి ఘనాఘనాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*748వ నామ మంత్రము*

*ఓం రోగపర్వత దంభోళయే నమః*

రోగములనే పర్వతములను పిండిచేసే పిడుగుపాటు లేదా వజ్రాయుధము వంటి పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *రోగపర్వతదంభోళిః* యను ఎనిమిదక్షరముల నామ మంత్రమును *ఓం రోగపర్వత దంభోళయే నమః* అని ఉచ్చరించుచూ, ఆ శ్రీమాతను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు సాధకునకు ఆ తల్లి ఆయురారోగ్యములు ప్రసాదించి, భగవన్నామ స్మరణయందు మనసు నిమగ్నముచేసి తరింపజేయును.

జగన్మాత రోగములనెడి పర్వతమునకు వజ్రాయుధము వంటిది.

పుట్టిన ప్రతీజీవి జీవించుతూ, పెరుగుతూ అవస్థాచతుష్టయంలో ఆయా అవస్థల ధర్మముప్రకారం జీవనం కొనసాగించుట జరుగుతుంది. అందులోనే రోగాలబారిన పడడం కూడా జరుగుతుంది. నిత్యము జగన్మాత నామస్మరణతో జీవించువారికి వచ్చు రోగాలకు తానొక ధన్వంతరిగా, ఆ రోగములనే పర్వతములకు వజ్రాయుధంగా తేజరిల్లుతూ కాపాడుతుంది.

రోగాలు సాధారణంగా రెండు రకాలు. అవి శారీరకము - అనారోగ్యకారణంగా వివిధ రోగాలు వస్తాయి. రెండవది మానసికము - తనకున్నది పోయిందనో, లేక రావలసినది రాలేదనో, ప్రేమ విఫలమయిందనో, కుటుంబంలో కలతలు ఏర్పడినకారణంగానో, ఎదిగిన పిల్లలకు విద్య, ఉద్యోగము, వివాహము వంటి విషయాలలో అవాంఛిత పరిణామముల వలన ఏర్పడినవి మానసికంగా వచ్చే రోగాలు. అన్నిటికీ ఆ పరమేశ్వరిని శరణు వేడుతూ, మనస్పూర్తిగా ఆ తల్లి నామస్మరణచేస్తే ఆ శ్రీమాత తప్పక అటువంటి రోగములనుండి కాపాడుతుంది. గనుకనే *రోగపర్వత దంభోళిః* యను నామ మంత్రము కలిగియున్నది. *సర్వవ్యాధి ప్రశమనీ* (551వ నామ మంత్రము) సమస్త మానసిక, శారీరక రోగములను శమింపజేస్తుంది. తద్వారా *సర్వమృత్యునివారిణీ* (552వ నామ మంత్రము) - అపమృత్యువులను, కాలమృత్యువులను నివారిస్తుంది.

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీలలితా సహస్రనామస్తోత్రపారాయణ ఫలశ్రుతిలో ఇలా చెప్పబడినది:-*

*పౌర్ణ్మాస్యాం చంద్రబింబే ధ్యాత్వా శ్రీలలితాంబికామ్॥21॥*
*పంచోపచారైస్సం పూజ్య పఠేన్నమసాస్రకమ్|*

*సర్వేరోగా: ప్రణశ్యంతి దీర్ఘాయుస్హ్యంచ విదంతి॥22॥*

పౌర్ణమి నాడు చంద్రుడిలో లలితాదేవిని ధ్యానించి, పంచోపచారాలతో (గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాలతో) పూజచేసి, లలితా సహస్రనామస్తోత్రపారాయణ చేస్తే, సమస్త రోగాలు పోయి, దీర్ఘాయుష్షు కలుగుతుంది.

*అయ మాయుష్కరో నామ ప్రయోగ: కల్పచోదిత:|*

*జర్వార్తం శిరసి స్పృష్ట్వా పఠేన్నామసహస్రకమ్॥23॥*

*తత్ క్షణాత్ప్రశమం యాతి శిరస్తోదో జ్వరోఽపి చ||*

లలితాసహస్రనామ స్తోత్ర పారాయణ ఆయుష్షును పెంచుతుందని కల్పగ్రంథాలలో చెప్పబడింది. జ్వరం ఉన్నవారి తలమీద చెయ్యిపెట్టి ఈ సహస్రనామస్తోత్ర పారాయణం చేస్తే జ్వరం గుణమౌతుంది. తలనొప్పి కూడా ఉండదు.

*సర్వవ్యాధి నివృత్త్యర్థం స్పష్ట్వా భస్మ జపేదిదమ్॥24॥*

*తద్భస్మధారణాదేవ నశ్యంతి వ్యాధయః క్షణాత్|*

సమస్తరోగాలు పోవడానికి విభూతిని లలితా సహస్రనామ జపంతో మంత్రించాలి. అలాటి విభూతిని ధరించిస మాత్రానే సమస్తరోగాలు నయమవుతాయి.

*జలం సమ్మంత్ర్య కుంభస్థ: నామ సాహస్రతో మునే॥25॥*;

*అభిషించే ద్గ్రహ గ్రస్తాన్ గ్రహా నశ్యంతి తత్ క్షణాత్|*

నీటితో కలశాన్ని నింపి, ఆ నీటిని సహస్రనామస్తోత్ర పారాయణ చేసి మంత్రించి, ఆ నీటితో స్నానం చేయిస్తే గ్రహపీడలు వెంటనే తొలగిపోతాయి.

*సుధాసాగర మధ్యస్థాం ధ్యాత్వా శ్రీ లలితాంబికామ్॥26॥*

*య: పఠేన్నామసాహస్రం విషం తస్య వినశ్యతి|*

అమృత సముద్రంలో (సహస్రారంలో చంద్రమండలమునందు) ఉన్న శ్రీలలితాంబను ధ్యానిస్తూ లలితాస్తోత్ర నామ పారాయణాన్ని చేస్తే ఎలాంటి విషం కూడా దిగిపోతుంది.

ఇంత ప్రభావమున్న జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం రోగపర్వత దంభోళయే నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*174వ నామ మంత్రము*

*ఓం నిర్భవాయై నమః*

జీవికి ఉండు ఆరు వికారములు (పుట్టుక, స్థితి, వృద్ధి, విపరిణామము, క్షయము, నాశనము) లేని పరబ్రహ్మ స్వరూపురాలు అయిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిర్భవా* యను మూడక్షరముల నామ మంత్రమును *ఓం నిర్భవాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిపూరిత హృదయంతో ఉపాసించు సాధకునకు ఆ తల్లి కరుణచే ఆధ్యాత్మికజ్ఞాన సంపదను ప్రసాదించును మరియు సుఖసంతోషములతో భౌతిక జీవనము కొనసాగునట్లు అనుగ్రహించును.

భౌతిక జీవులకు శరీరం ఏర్పడడమనేదే పుట్టుక. అలా పుట్టిన తరువాత భౌతిక ప్రపంచంలో ఉంటూ, దినదిన ప్రవర్ధమానంగా శరీరం పెరుగుతూ, ఆ పెరుగుదలలో మార్పులు ఏర్పడుతూ, పెరుగుట విరుగుట కొరకే యన్నట్లు క్రమంగా శరీరంలోని జవసత్త్వాలు క్షయమవుతూ, శరీరంనుండి జీవుడు నిష్క్రమించగానే శరీరం పంచభూతాలలో కలిసిపోతూ ఉంటుంది. వీటినే జీవికి గల ఆరు వికారములు అంటారు.

మానవుడు పుట్టిననుండి నాలుగు అవస్థలు ఉన్నాయి. వాటిని *అవస్థా చతుష్టయం* అని కూడా అన్నారు. అవి - 1) బాల్యం, 2) కౌమారం, 3) యౌవనం, 4) వార్ధక్యం.

ఒక ఆంగ్లకవి (షేక్స్పియర్) ఈ ప్రపంచం ఒక నాటకరంగం. జీవిత నాటకం రంగంలో ఏడుగా విభజింపబడినది. ఒక్కొక్క రంగంలోను మాసవుడు ఒక్కొక్క పాత్రలో నటిస్తాడు. ఆయా పాత్రలకనుగుణమైన విధంగా రంగస్థలలాలంకరణ ఉంటుంది. ఏడు పాత్రలు పోషిస్తాడు. ఏడవ పాత్ర పూర్తికాగానే జీవిత నాటక రంగం నుండి నిష్క్రమిస్తాడు.
ఆ ఏడు పాత్రలూ మానవుని జీవితాన్ని ఏడు దశలుగా చెప్పడం జరిగింది. అది బాల్యము, విద్యార్ధి, నవయౌవనము (13 నుండి 19 సంవత్సరముల మధ్య), యౌవనము, మధ్యవయస్సు, వృద్ధాప్యము, అవసానదశ. ఇవి జీవితమనే నాటకరంగంలో మానవుని ఏడు పాత్రలు.

పుట్టిన జీవి గిట్టువరకూ గల దశలన్నియు ఇన్నివిధాలుగా వివిధ కోణాలలో చెప్పబడింది. ఇది అంతయు భౌతిక జీవునికి మాత్రమే. పరబ్రహ్మస్వరూపిణి అయిన శ్రీమాతకు కాదు. సకల జీవులను తాను సృష్టిస్తుంది. ఆడిస్తుంది. ఆ ఆట ముగియగానే తనలో లయంచేసుకుంటుంది. ఆ జీవుని కర్మలఫలాన్ననుసరించి మరల పుట్టడమా, పుట్టడమయితే ఏశరీరంతో పుట్టడం, కర్మఫలం ఏవిధంగా అనుభవించడం అనేది అంతా నిర్ణయించేది ఆ పరమేశ్వరియే.
జగన్మాత కనులు తెరిస్తే జగత్తు ఉద్భవిస్తుంది. కళ్ళు మూస్తే జగత్తు ఆమెలో లయమవుతుంది. *ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః* (281వ నామ మంత్రము - కన్నులు తెరచినంతనే బ్రహ్మాండములు సృష్టింపజేస్తూ, కన్నులు మూసినంతనే బ్రహ్మాండాలను నశింపజేయునది)
అటువంటి పరబ్రహ్మ స్వరూపిణి - *నిర్భవా* అంటే ఆమెకు పుట్టడం, గిట్టడం, మరల పుట్టడం అనే జననమరణచక్రభ్రమణం ఉండవు.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిర్భవాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*175వ నామ మంత్రము*

*ఓం భవనాశిన్యై నమః*

భవబంధముల (పుట్టుక, చావు మరల పుట్టుక వంటి జనన మరణచక్రభ్రమణము) నుండి తప్పించు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భవనాశినీ* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం భవనాశిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాపరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకులకు ఆ తల్లి కరుణించి సంసారక్లేశముల నుండి కాపాడి, శాశ్వతమైన పునర్జన్మరహిత మోక్షమునకు కావలసిన సాధనాపటిమను కలుగజేయును.

*పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనమ్|*

*ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే॥*

మళ్ళీ మళ్ళీ పుట్టడం, మరణించడం మళ్ళీ అదే...ఈ జనన మరణ చక్రభ్రమణం భౌతిక జీవులకు పరిపాటి. ఈ సంసారక్లేశమునుండి కాపాడమని ఈ భౌతిక జీవులు ఆ పరమాత్మను వేడుకుంటాయి.

పుట్టాలంటే తల్లిగర్భంలో ఉండడం అంటే చిన్న విషయం కాదు. మలమూత్రాలమధ్య, ఆకలిబాధతో, క్రిములు కరుస్తుంటే, తలక్రిందులుగా ప్రాణాలు పిడికిట్లో పెట్టుకుని ఉండే గర్భవాసం ఒక మహానరకం. అంధకారమైన గర్భంలో ఈ ప్రక్కనుండి ఆ ప్రక్కకు తిరగడానికి కష్టమయేస్థితిలో శిశువుపడే బాధ వర్ణనాతీతం. నరకంలో కోట్లాది సంవత్సరాలు ఉండవచ్చు, కాని గర్భవాసంలో జీవుడు నవమాసాలు పడేబాధ మహా దుర్భరం.

బాల్యయౌవనకౌమారవృద్ధాప్యావస్థలను అనుభవించి, అవసానదశలో ఎన్ని కష్టాలు పడాలి? రోగములు చుట్టుముట్టగా, కఫము, వాతము, పైత్యముల బాధతో, నోటినుండి మాటరాక, తనవాళ్ళు, తన ఆస్తులు వీటిపై మమకారము పీడిస్తుంటే ఆ దుర్భరపరిస్థితి వర్ణనాతీతం.

ఇటువంటి జనన మరణ చక్రభ్రమణమనే బాధలనుండి జగన్మాత కాపాడుతుంది.

గంగానది ఒక జీవనది. పవిత్రమైన నది. గంగానదీ స్నానం సర్వపాపాలకు పరిహారం. ఆ నదీ పవిత్రస్నానంతో పాపాలన్నీ నశిస్తాయి. జగన్మాత గంగానదీ స్వరూపురాలు గనుక *భవనాశినీ* యను నామముతో స్తుతింపబడుచున్నది.

శక్తిరహస్యం అనే గ్రంథంలో ఇలా చెప్పబడినది.

*నవమ్యాం శుక్లపక్షే తు విధివత్ చండికాం నృప|*

*ఘృతేన స్నపయే ద్యస్తు తస్య పుణ్యఫలం శృణు॥*

*దశ పూర్వాన్ దశ పరా నాత్మానం చ విశేషతః|*

*భవార్ణవా త్సముద్ధృత్య దుర్గా లోకే మహీయతే॥* (సౌభాగ్యభాస్కరం, 364వ పుట)

శుక్లపక్షంలో నవమి తిథినాడు చండికను ఆవు నేతిలో స్నానం చేయించు సాధకులను అటు పదితరములు,ఇటు పదితరములు వరకూ సంసారసాగరమునుండి ఆ పరమేశ్వరి రక్షించును.

కూర్మపురాణంలో ఇలాగలదు:-

*సైషా ధాత్రీ విధాత్రీ చ పరమానన్ద మిచ్ఛతామ్|*

*సంసారతాపా న్నిఖిలా న్నిహంతీశ్వర సంజ్ఞయే॥* (సౌభాగ్య భాస్కరం, 364వ పుట)

తనను పూజించువారికి, పరమానందమును కోరువారికి ఆ తల్లి సంసారతాపములను నశింపజేయును.

దేవీ భాగవతంలో శ్రీమాత ఇలా చెప్పినది.

*అహం వై మత్సరాన్ భక్తా నైశ్వర్యం యోగమాశ్రితాన్|*

*సంసారసాగరా త్తస్మా దుద్ధరా మ్యచిరేణతు॥*

నా యందు ఆసక్తి గలవారై పరమేశ్వరుని యోగము నాశ్రయించిన భక్తులను సంసారార్ణవము నుండి శీఘ్రముగా ఉద్ధరింతును

జగన్మాత భవనాశిని. గనుక ఆ పరమేశ్వరిని నిశ్చలచిత్తముతో ధ్యానించినచో తప్పక భవబంధవిముక్తి కలిగించును.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భవనాశిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*176వ నామ మంత్రము*

*ఓం నిర్వికల్పాయై నమః*

సంకల్ప వికల్పములు లేని శుద్ధచైతన్య స్వరూపిణి అయిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిర్వికల్పా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం నిర్వికల్పాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు భక్తులు జ్ఞానపరిపూర్ణులై, సదా పరమేశ్వరీ ధ్యానమునందు మనస్సును నిమగ్నముచేసి తరించుదురు.

సంకల్పము అంటే ఏదైనా చేయాలనే ఆలోచన. సాధారణంగా పూజచేయునపుడు ఆచమనం చేసి, తమ యునికికి సంబంధించిన కాలము, ప్రదేశము, తిథివారనక్షత్రాదులు, ఆపైన సంకల్పంచేయువారి గోత్రము, నామధేయం, ఎందు నిమిత్తం సంకల్పం చేస్తున్నామో...ఇత్యాదులు సంకల్పంలో ఉంటాయి. అలాగే ఏదైనా కార్యక్రమం చేయాలనుకోవడాన్ని కూడా సంకల్పం అంటాము. కాని వికల్పము అంటే సంకల్పానికి వ్యతిరేకంగా అర్థం తీసుకోకూడదు. వికల్పానికి అర్థం *భ్రాంతి* అని అంటే ఇక్కఢ సందర్భం కుదురుతుంది. అంటే లేని వస్తువును గూర్చి వివరణ ఈయడం. దీనినే శూన్యమైన విషయము నుండి పుట్టిన జ్ఞానము. దీనికి ఒక ఉదాహరణముగా ధూర్జటి మహాకవి వ్రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ఒక పద్యం పరిశీలిద్దాము.

శా||అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా

కాంతల్ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ

భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా

జింతాకంతయు జింత నిల్పడు గదా, శ్రీకాళహస్తీశ్వరా!

*ఈ పద్యంలోని భావము*

ఓ శ్రీకాళహస్తీశ్వరా! పరమేశ్వరా! ఈ జగత్తు, ఈ జీవనము, జననము-మరణము మళ్ళీ జన్మించడం అనేవి అంతయూ మిథ్య. అలా తెలిసి కూడా ఎల్లప్పుడూ భార్యా, బిడ్డలు, సంపదలు, తనువు అనేవి శాశ్వతమనియు, సత్యమనియు తలచుచూ మోహము అనే సముద్రం (మోహార్ణవములో) లో మునిగి పోవును గాని, జన్మకు పరమార్థమునిచ్చే నీయందు రవ్వంతైనను ధ్యానము నిల్పడు కదా. ఇదంతా అజ్ఞానమే కదా!

ఈ రకమైన అజ్ఞానమే వికల్పము అంటారు. వికల్పము అనునది అజ్ఞాన సంబంధమైనది. లేనిది ఊహించుకొని అదే నిజమని భ్రాంతి చెందడం. ఇది కేవలం మనసుకు సంబంధించినది. పరమాత్మసంబంధమైనది కాదు. గనుక పరమాత్మ, బ్రహ్మజ్ఞాన స్వరూపిణి అయిన జగన్మాత *నిర్వికల్పా* యని అనబడినది. సాధకుడు యోగసాధనలో పరాకాష్ఠదశలో సమాధిస్థితికి చేరుతాడు. ఆ స్థితిలో సంకల్పవికల్పములు ఉండవు. దీనినే నిర్వికల్ప సమాధి స్థితి యంటారు. పరబ్రహ్మస్వరూపిణియైన జగన్మాతకు సంకల్పవికల్పములు ఉండవు. గాన *నిర్వికల్పా* యను నామంత్రముతో స్తుతింపబడు చున్నది.

జగన్మాత *చతుష్షష్టికళామయి* (236వ నామ మంత్రము) అనగా అరవై నాలుగు కళలలోను పరిపూర్ణురాలు. అటు వంటి కళాప్రపూర్ణ అయిన జగన్మాత
*విజ్ఞాన ఘనరూపిణీ* (253వ నామ మంత్రము) అన్ని కళలయందును జ్ఞానము కలిగి యుండుటను విజ్ఞానఘనము అందురు. గనుక ఆ తల్లి *విజ్ఞానఘనరూపిణీ* యని అనబడుచున్నది గనుక జ్ఞానమునకు పరాకాష్ఠ అయినది గనుక సంకల్పవికల్పములు ఉండవు. కావున *నిర్వికల్పా* యని అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిర్వికల్ఫాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*750వ నామ మంత్రము*

*ఓం మహేశ్వర్యై నమః*

మహోన్నతమైన మరియు మహోత్కృష్టమైన ఈశ్వరి అయిన జగజ్జననికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహేశ్వరీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం మహేశ్వర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబను ఆరాధించు భక్తులు, ఆ తల్లి కరుణచే సుఖశాంతులతోబాటు, ఆత్మానందానుభూతిని కూడా పొందుదురు.

జగన్మాత శ్రీమహారాజ్ఞి. అనగా సకలలోకములకూ మంగళకరమైన మహారాజ్ఞి. పంచబ్రహ్మలను తన ఆసనమునకు కోళ్ళుగా గలిగి జగత్తులకే ఏలిక. చిదగ్నికుండ సంభూత (శుద్ధచైతన్యమునుండి ఉద్భవించినది). జగత్తునకు సృష్టిస్థితిలయలకు కారణమైనది. మహేశ్వరునికి శక్తి. జగత్తంతా ఆమెయే. జగత్తు కానిది కూడా ఆమెయే. ప్రణవస్వరూపుడైన పరమేశ్వరుని పత్ని, అట్టి ప్రణవమునకే ఆది అయిన ఆదిశక్తి. మహాప్రళయం సమయంలో కర్మక్షయంకాని జీవులను, ఆ జీవరాసుల కర్మపక్వం అగువరకూ తనలోనే ధరించి, ఆ జీవరాశికి కర్మ పరిపక్వత కలిగిన యనంతరం పుట్టుక కలుగజేసిన మహాశక్తి. పంచవింశతి (ఇరువది ఐదు) వ్యూహములు గల మహేశ్వరుని భార్య.

1) *దేవకార్యసముద్యతా* దేవతల యొక్క కార్యములను నిర్వహించడానికి సంసిద్ధత యను *గొప్పదనము* గలిగినది.

2) భండుడు, మహిషాసురాది రాక్షసులను తెగటార్చిన సైనిక *సామర్థ్యము* గలిగినది.

3) *బ్రహ్మోపేంద్రమహేంద్రాది దేవసంస్థుత వైభవా* - భండాసురాది రాక్షస సంహారము సమయంలో చూపిన పరాక్రమానికి బ్రహ్మాది దేవతలచే స్తుతింపబడిన *వైభవము* గలిగినది.

4) *హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నషధిః* శివుని నేత్రాగ్నికి ఆహుతి అయిన మన్మథుని సజీవుడిని చేసి సాటి స్త్రీ మూర్తి అయిన రతీ దేవికి అమంగళము లేకుండా చేసిన *మంచిదనము* కలిగినది.

5) సకలలోకములకు మహాసామ్రాజ్ఞియై, త్రిమూర్తులకు, అష్టదిక్పాలకులకు, నవగ్రహములకు వారి వారి సమర్థతలకనుగుణంగా లోకపాలుకులుగా ఆధిపత్యమునిచ్చిన *అధికారికలక్షణం* గలిగినది. కాబట్టి, పైన చెప్ఫిన 1) గొప్పదనం, 2) సామర్థ్యం, 3) వైభవం, 4) మంచిదనం, 5) అధికారిక లక్షణం వంటి లక్షణముల కలబోతగా *మహా* లక్షణం గలిగిన సగుణాత్మకమై విరాజిల్లు జగన్మాత *మహేశ్వరీ* యను నామ మంత్రమునకు సార్థకత కలిగి యున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మహేశ్వర్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*177వ నామ మంత్రము*

*ఓం నిరాబాధాయై నమః*

సృష్టికి ముందు గాని, తరువాత గాని బాధ యనునది లేని ఆనంద స్వరూపిణియైన పరాత్పరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిరాబాధా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం నిరాబాధాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ కరుణామయి అయిన లలితాంబను ఆరాధించు భక్తులకు ఆ తల్లి సుఖశాంతులను ప్రసాదించి, ఆత్మానందానుభూతిని కలిగించి తరింపజేయును.

నిరాబాధా అంటే బాధలు, వేధలు లేనిది. జగన్మాత పరమాత్మ స్వరూపిణి. ఆ తల్లికిబాధలేమిటి? ఉండవు. జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి కదా! అందుచేత ఆమెకు బాధలు లేనిది అనగా *నిరాబాధా* అని నామ మంత్రము కలిగియున్నది. బాధ అనేది ఎప్పుడు ఉంటుంది. అనుకన్నది కాకపోతే, తన కిష్టంలేనిది ఏదైనా సంభవిస్తే. ఒక్కమాటలో చెప్పాలంటే కష్టానికి అర్థం ఇష్టం లేనిది. అవివేకం, అజ్ఞానం, వికల్పాలు అనేవి చోటుచేససుకుంటే అక్కడ బాధలు ఉంటాయి. జగన్నాతను *నిరాబాధా* అంటే బాధలు లేని పరబ్రహ్మస్వరూపిణి యని స్వరూపిణి అని మనం అనుకోవాలి. అమ్మవారికి బాధ అనేది ఏర్పడితే ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహిద్దాము.

అహంకారంతో విర్రవీగిన దక్షుడు తను జరుపుతున్న యాగానికి అల్లుడైన ఈశ్వరుడిని ఆహ్వానించలేదు. అయినా ఈశ్వరుడి సతీమణి, దక్షుడి కుమార్తె దాక్షాయణి తండ్రి చేసిన తప్పును తెలిపి ఆయన మనసు మార్చడానికి ప్రయత్నించింది. శక్తి స్వరూపిణి దాక్షాయణి చేసిన నీతిబోధలు దక్షుడికి రుచించలేదు. దాంతో దక్షాయణి విరక్తి చెందింది. దక్షుడి అహంకారాన్ని అణచడానికి యాగం జరగకూడదని హోమాగ్నిలో దూకింది. దాక్షాయణి అగ్నికి ఆహుతి అయిపోయింది. ఈ విషయం తెలిసిన ఈశ్వరుడు క్రోధంతో రగిలిపోయాడు. దక్షుడు చేయబూనిన యాగాన్ని నాశనం చేశాడు. దాక్షాయణి కళేబరాన్ని భుజంపై వేసుకుని రుద్రతాండవం ఆడాడు. అఖిలాండం దద్దరిల్లింది. భీతి చెందిన దేవతలు పరంధామున్ని సహాయం కొరకు ఆశ్రయించారు. ఈశ్వరుని క్రోధాన్ని తగ్గించి మామూలు స్ధితికి తీసుకురమ్మని వేడుకొన్నారు. పరంధాముడు(విష్ణుమూర్తి) తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. చక్రాయుధం ఈశ్వరుని భుజంపై నిర్జీవంగా వున్న దాక్షాయణి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. దాంతో ఈశ్వరుడు తిరిగి మామూలు స్ధితికి చేరుకుని తప్పిదాన్ని తెలుసుకున్నాడు. "ఉమామహేశ్వరి శరీరంలోని అవయవాలు ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలలో శక్తిపీఠాలు విలసిల్లాయి.

అమ్మవారికి కలిగిన బాధ లోకానికి మేలుచేసిందికదా. శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. జగన్మాతను అనేక రూపాల్లో సేవించుకుంటున్నాము. ఆ తల్లికి బాధకలిగి అవతారం చాలించింది మళ్ళీ అవతారంలో *నిరాదాధా* అనే నామ మంత్రానికి సార్థకత చేకూర్చింది.

బాధ అనేది దేహానికి గనుక బాధ వచ్చిన ఆదేహాన్ని అగ్నికి సమర్పించింది. అంటే బాధ అనేది దేహానికి గాని ఆత్మకు కాదు. జగన్మాత నిర్గుణమూర్తి. గనుక ఆతల్లి *నిర్బాధా* యని అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిర్బాధాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*751వ నామ మంత్రము*

*ఓం మహాకాళ్యై నమః*

అనంతమైన కాలస్వరూపము, కాలచక్రమును నియమానుసారం పరిభ్రమింపజేయు మహేశ్వర శక్తిగా, మృత్యువుకే మృత్యువుగా విరాజిల్లు మహాకాళి స్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహాకాళీ* యను నాలుగు అక్షరాల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం మహాకాళ్యై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరబ్రహ్మస్వరూపిణియైన జగన్మాతను ఆరాధించు భక్తులను ఆ లలితాంబిక సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి చేస్తుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగజేస్తుంది.

మహాకాళి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతియని అని త్రిశక్తులను నిత్యం పూజలు చేయునప్పుడు స్మరిస్తుంటాము. అలాగే దశమహావిద్యలలో కాళి కూడా ఒక మహావిద్య. కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది. ఈ మహాకాళికి పదిచేతులు ఉంటాయి. పది చేతులలో ఖడ్గము, చక్రము, గద, ధనుస్సు, బాణాలు, ఇనుపకట్లగుదియ, శూలము, భుశుండి, శిరస్సు, శంఖము - పది చేతులలో ధరిస్తుంది.

మహాకవి కాళిదాసు కాళికాదేవి భక్తుడు. ఆ తల్లి అనుగ్రహంతో ఒకనాటి గొర్రెలకాపరి, నిరక్షరకుక్షి అయిన అతడు సంస్కృత భాషలో మహాకవి అయాడు. ఎన్నో సంస్కృత మహాకావ్యాలు రాయగలిగాడు. మహాకవి కాళిదాసు గురుంచి నాలుగు మాటలు:-

విద్వత్తులో తనను పరాజయించిన వానినే పరిణయమాడెదను అని ప్రతిజ్ఞ పూనిన విద్యోత్తమ అనబడే ఓ యువరాణి, విక్రమాదిత్యుని ఆస్థానములోని పండితులనందరినీ తన పాండిత్యముచే పరాజయము పాలుచేసింది. ఈ అవమానము సహించలేని ఆ పండితులు, ఆనాటికి మందబుద్ధిగా ఉన్న కాళిదాసుని గొప్ప పండితుడని ఆమెను మోసగించి, వారిరువురికినీ పరిణయము గావించిరి. పెళ్ళి తరువాత కాళిదాసు నిజస్వరూపమును గ్రహించిన ఆమె తన అవివేకమునకు, తనకు జరిగిన అవమానమునకు క్రుంగిపోవును. ఇది గ్రహించిన కాళిదాసు జ్ఞాన సముపార్జనకునూ, విద్వత్తు గల భార్యకు తగు సమానునిగను ఉండవలెనన్న తలంపుతో, తన ఇష్టదైవమయిన కాళికాదేవిని ప్రసన్నము చేసుకొనుటకు ఇల్లు విడుచును. అతని ప్రార్థన ఆలకించిన మాత ప్రసన్నురాలై, కాళిదాసుకు గొప్ప విద్వత్తును, మాటనేర్పరి తనాన్ని అనుగ్రహించును. ఈ విధంగా కాళీమాత అనుగ్రహంతో సంస్కృతభాషలో ఒక మహాకవి అయాడు.

మహాకాళి అనగా పరిచ్ఛేద్యము (హద్దులు, పరిమితులు, నిర్వచనములు, కొలమానములు మొదలగునవి) లేని అనంత రూపిణి మహాకాళి.

మహాకాళి అంటే మృత్యువుకే మృత్యువు. మహాకాళి జగన్మాత అంశ. గనుకనే జగన్మాత అయిన లలితాంబ *మహాకాళీ* యను నామ మంత్రముతో ఆరాధింపబడుచున్నది.

అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మహాకాళ్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*178వ నామ మంత్రము*

*ఓం నిర్భేదాయై నమః*

స్వజాతీయము, విజాతీయము, స్వగతము అను మూడు భేదములు లేక విలసిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిర్భేదా* యను మూడక్షరముల నామ మంత్రమును *ఓం నిర్భేదాయై నమః* అని ఉచ్చరించుచు, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ శ్రీమాత పాదసన్నిధిలో ధ్యాన నిమగ్నుడైన భక్తులకు భేదరహితమైన జీవనమును కొనసాగించుచు, భౌతిక సుఖసంతోషములు, ఆత్మానందమమును అనుభవించి తరించును.

సకల జగత్తునందు, జీవులన్నిటిలోను విలసిల్లుతూ, మానవులు, పశుపక్ష్యాదులు, అడవిజంతువులు, వృక్షసంతతి యందును ఏవిధమైన భేదదృష్టి ప్రసరింపజేయక, జీవకోటి యంతయు తనదిగా భావించి, ఏ జీవసమూహమనకు ఏమికావలెనో, ఎలాకావలెనో సమకూర్చుచున్నది. కాబట్టి ఆ తల్లి *నిర్భేదా* యని అనబడుచున్నది. సహస్రనామములలో *శ్రీమాతా* యని అన్నాము. అనగా జగత్తుకంతటికీ మాతృమూర్తి. తల్లి తన బిడ్డలను భేద భావముతో చూడక అన్నపానీయములు, విద్యా బుద్ధులు వయసుననుసరించి సమకూర్చును. చంటిబిడ్డకు పాలు పడితే, ఎడ బిడ్డకు గోరుముద్దలు, ఎదిగిన బిడ్డకు అన్నము పెడుతుంది. భేదభావము ఉండకూడదని బిడ్డలందరికీ పాలు మాత్రమే పట్టదు. లేదా అందరికీ ఆవకాయతో అన్నమే పెట్టదు. అలాగే జీవులకు ఆహారపు అలవాట్లు, జీవనము కొనసాగించు సరళిని బట్టి కావలసినవి సమకూర్చుతుంది జగన్మాత. ఒకరిపై అతిప్రేమ, మరొకరిపై ఏహ్యభావము చూపదు గనుకనే *నిర్భేదా* యను నామ మంత్రము సార్థకమైనది. జీవుల కర్మవాసనలు కూడా పరిగణిస్తూ ప్రాప్తి ఎంత ఉంటుందో అంతవరకూ జీవుల అవసరాలను సమకూర్చుతుంది.

సాధారణంగా భేదము అనునది జాతిపరమైనది కావచ్చు, లేదా సజాతిలోనే వర్గభేదం కావచ్చు, తన శరీరంలో పాదము, శిరస్సు అను అవయవ భేదము కావచ్చు ... ఈ విధమైన సజాతి, విజాతి, స్వగతము అను భేదత్రయము లేనిది.

ఆదిశంకరాచార్యులవారు. పరమాత్మకూ, జీవాత్మకూ భేదం లేదు. ఈ రెండూ ఒకటే. పరమాత్మ నిర్గుణం అని బోధిస్తుంది. అద్వైతం

*ఏకమేవా ద్వితీయం బ్రహ్మ*,

పరమేశ్వరుడు ఒక్కడే. రెండవవాడు లేడు.

*ఏకం సద్విప్రా బహుధా వదంతి*

సత్యం ఒక్కటే' దానిని జ్ఞానులు బహువిధాలుగా చెపుతారు.

*సర్వం ఖల్విదం బ్రహ్మ*

ఈ సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే. వేరేమీ లేదు.

*జీవో బ్రహ్మైవ నాపరః*

జీవుడు బ్రహ్మము తప్ప అన్యము కాదు

*తత్త్వమసి*

చరాచరమంతా వ్యాపించియున్న శుద్ధచైతన్యము ఎక్కడో లేదు, అది నీవే.

వంటి వాక్యాలన్నీ అద్వైతసిద్ధిని చెపుతాయి. జీవాత్మ పరమాత్మరూపమే. అయితే మాయాసంబంధముచేత జీవాత్మ ఈ సత్యాన్ని గ్రహించడంలేదు. జ్ఞానంద్వారా ఈ సత్యాన్ని గ్రహించగల్గుతుంది. ఈ జ్ఞానంపొందిన జీవాత్మ మోక్షం పొందగలుగుతుంది. అంటే పరమాత్మయై ఊరకుంటుంది. జగన్మాత పరబ్రహ్మ స్వరూపిణి. గనుక *నిర్భేదా* యని అన్నాము.

కూర్మపురాణంలో ఇలా చెప్పబడినది:

*శ్లో. త్వం హి సా పరమా శక్తిః అనంతా పరమేష్ఠినీ సర్వభేదవినిర్ముక్తా సర్వభేదవినాశినీ॥* (సౌభాగ్య భాస్కరం, 387వ పుట)

నీవే మహాశక్తివి. అనంతపు పరమేష్ఠిస్వరూపురాలవు. సకల భేదములు లేనిదానవు. సకల భేదములు నశింపజేయుదానవు.

శివశక్తులు ఇరువురు ఒకరు లేక మరొకరు లేరు.ఇద్దరూ ఒకటే. పరమాత్మకు లింగభేదం లేదు. కనుక జగన్మాత *నిర్భేదా* అని నామ మంత్రముతో స్తుతింప బడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిర్భేదాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*179వ నామ మంత్రము*

*ఓం భేదనాశిన్యై నమః*

భక్తులలోని జీవాత్మ, పరమాత్మలు *వేరు వేరు* అను భేద బుద్ధిని నశింపజేయు పరబ్రహ్మస్వరూపిణికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భేదనాశినీ* యను ఐదుఅక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం భేదనాశిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరబ్రహ్మ స్వరూపిణియైన లలితాంబను భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకునకు భేదరహితమైన భక్తి మరింత కలిగి, సుఖశాంతులతో జీవనముకొనసాగిస్తూ, ఆత్మానందానుభూతితో జీవించును.

జీవాత్మ, పరమాత్మల భిన్నత్వాన్ని భావించే ద్వైతభావనను భక్తులలో తొలగించి,అద్వైతభావనను పెంచుతుంది జగన్మాత గనుక *భేదనాశినీ* యను నామ మంత్రము కలిగియున్నది.

నేను అంటే ఈ శరీరము, ఇంద్రియాలు అని కాదు. యజుర్వేదంలోని బృహదారణ్యకోపనిషత్తు *అహం బ్రహ్మస్మి* అని చెప్పింది. *అహం బ్రహ్మ అస్మి* అంటే *నేను బ్రహ్మ అగుగాక* అని, బ్రహ్మ జ్ఞానం సంపాదించాలని అంతరార్థం. ప్రతి మనిషిలోను భగవంతుడు కొలువై ఉంటాడు. అందుకే అన్నారు *అహం బ్రహ్మస్మి* అని కానీ చాలా కొద్దిమంది మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకుంటారు.

శరీరము వేరు, నేను అనుకునే నేను వేరు. నేను అనేది అత్మ మాత్రమే. ఈ నేను అనే ఆత్మ అలా కర్మలనాచరిస్తూ, కర్మవాసనలననుసరించి దేహాలు మారుతూ ఉంటుంది. కర్మపరిపక్వతచెంది, సత్కర్మలైతే ఫలితంగా జన్మరాహిత్యం లభిస్తుంది. ముక్తిలభిస్తుంది.

చరాచర జగత్తులో పంచభూతాలు (నేల, నింగి, నిప్పు, నీరు, గాలి),కొండలు, జలరాశులు, జీవరాశులు మొదలైనవాటిని ఊహిస్తే అంతా పరబ్రహ్మస్వరూపమే. పరబ్రహ్మము తప్ప మరేదియు తోచదు. వేరేదైనా ఉంది అనిభావిస్తే అది అజ్ఞానమౌతుంది. అట్టి అజ్ఞానమే భేదభావము. జగన్మాత తన భక్తులలో ఈ భేదభావాన్ని పోగొడుతుంది గనుక *భేదనాశిని* యని అనబడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం భేదనాశిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*752వ నామ మంత్రము*

*ఓం మహాగ్రాసాయై నమః*

ప్రళయ కాలమందు సృష్టినంతటినీ ఒక మహాకబళంగా తనలోనికి మ్రింగిన *మహాగ్రాసా* యను నామముతో విరాజిల్లు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహాగ్రాసా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం మహాగ్రాసాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ శక్తిస్వరూపిణియైన పరమేశ్వరిని ఆరాధించు సాధకునకు భౌతికముగా అన్నవస్త్రములకు లోటులేకుండా కరుణించును. మరియు ఆ తల్లి తనభక్తులకు జన్మరాహిత్య మోక్షమునకు కావలసిన బ్రహ్మజ్ఞానమను మహాగ్రాసమును ప్రసాదించి తరింపజేయును.

గ్రాసము అంటే ఆహారము. ప్రతీ జీవికీ అవసరమైన ఆహారంకోసం మరొకజీవిపై ఆధారపడడం అనేది జీవనధర్మం.

వేదాలలో *యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవత ఓదనః* అనగా పరమాత్మకు బ్రహ్మక్షత్రియాది వర్ణములుగల కార్యజాతమంతయు ఓదనము అని చెప్పబడినది. ఓదనము అనగా అన్నము లేదా ఆహారము.

మానవులకు అన్నము, రొట్టెలు, కాయగూరలు, మత్స్యమాంసములు ఆహారము. వీటితోబాటు నీరు కూడా ఆహారంతో తీసుకోవడం జరుగుతుంది.

శాఖాహార పక్షులు పళ్ళు, గింజధాన్యములు, మాంసాహార పక్షులు పురుగులు, వాటి కన్నా చిన్న జీవులపై ఆధారపడతాయి.

పశుపక్ష్యాదులు గడ్డి, ఆకులు, గింజధాన్యములు ఆహారంగా తీసుకుంటాయి.

వృక్షజాతి గాలి, నీరు, భూమిలోని ఖనిజలవణములు ఆహారంగా స్వీకరిస్తాయి.

ఇన్ని రకముల గ్రాసములను ఆ జగన్మాత జీవుల ఆహారసరళిని బట్టి సమకూరునట్లు చేస్తుంది గనుక ఆ పరాశక్తిని *మహాగ్రాసా* అన్నాము.

నమిలి తినే ఆహారాన్ని అశనము అని చెపితే గ్రాసము అనగా నమలకుండా మ్రింగు ఆహారము అనికూడా భావించవచ్చు.

ప్రళయకాలంలో జగత్తునంతయు తన కుక్షిలో గుప్తముగా దాచడానికి ఒక పెద్ద కబళంగా సృష్టినంతయూ (బ్రహ్మాండమునంతటినీ) మ్రింగినది గనుక ఆ తల్లి *మహాగ్రాసా* యని అంటున్నాము.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మహాగ్రాసాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

PVD Subrahmanyam చెప్పారు...

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*753వ నామ మంత్రము*

*ఓం మహాశనాయై నమః*

విశ్వానికి ప్రతీకయైన వైశ్వానరుని స్వరూపంతో, విశ్వమే (గొప్పదైన) ఆహారంగా గలిగిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహాశనా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం మహాశనాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు భౌతిక జీవనమందు అన్నవస్త్రములకు లోటులేకుండా, పాడిపంటలతో, సిరిసంపదలతో దినదిన ప్రవర్ధమానమై జీవించుచూ, పరమేశ్వరీ ధ్యానంతో జీవితాన్ని కొనసాగించుచూ జన్మ తరించినది అను భావన కలుగునట్లు అనుగ్రహించును.

ఇంతకు ముందు నామములో (752వ నామ మంత్రము - *మహాగ్రాసా*) ప్రళయకాలంలో విశ్వమంతయు ఒక్క కబళంగా తన కుక్షిలో నిక్షేపము చేసుకున్నదని భావము.

ప్రస్తుతము *మహాశనా* అనగా గొప్ఫదైన ఆహారము (అన్నము) కలిగినది అనగా విశ్వంలో ప్రతీ వస్తువు కూడా పరబ్రహ్మ స్వరూపమే. అంతటి పరబ్రహ్మ స్వరూపమే పరమేశ్వరికి ఆహారము గనుక మహా (గొప్పదైన) అశనా (ఆహారముగా గలిగినది) అని చెప్పబడింది.

PVD Subrahmanyam చెప్పారు...

విశ్వానికి ప్రతీక విశ్వానరుడు. అతని ఆహారమే ఈ విశ్వం. ఎవరీ విశ్వానరుడు. ఆ వివరం తెలుసుకుందాం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ*

పరమాత్మ స్వరూపములలో ఒక స్వరూపమునకు పేరు *వైశ్వానరుడు* అని. ఇతనినే *అనిరుద్ధుడు* అనికూడా అందురు. ఈయన చక్షురీంద్రియము నందు ఉంటాడు. చక్షువు అనగా కన్ను. ఈ కంటిలోని నల్లగుడ్డుపై మనకు ఆకారాన్ని కన్నింపచేసే ఇంద్రియముంటుంది. దానినే చక్షురీంద్రియమంటారు. ఆ ఇంద్రియాన్ని స్థానంగా కలిగి ఉంటాడు. వైశ్వానరుడు లేదా అనిరుద్ధుడు అని పిలవబడే పరమాత్మ యొక్క మొదటి స్వరూపము. జాగ్రత్‌ దశలో (మేల్కొని ఉన్నపుడు) జీవుడు చక్షురీంద్రియము ద్వారా బాహ్య విషయములను గుర్తించి, వాటిని అనుభవించుచుండును. ఆ జాగ్రత్‌ దశలోని జీవునికి అంతరాత్మగా ఉండి ఆయా విషయములను అనుభవించిపచేస్తూ ఉండే స్వరూపమే వైశ్వానరుడిది.

వైశ్వానరుడు అంటేనే (విశ్వాన్‌ – నరాన్‌ నయతి ఇతి వైశ్వానర:) జీవులను నడిపించువాడు (పొందించువాడు) అని అర్థము. ఈ వైశ్వానరుడు చక్షురీంద్రియమును స్థానంగా చేసుకొని జీవునిలో ఉండి బాహ్యములయిన పదార్థములను (రూప, రస, స్పర్శ, గంధ, శబ్దాలు) తాను తెలిసికొనుచుండును, ఆ పదార్థజ్ఞానమును జీవునికి కల్గింపచేయును. ఇది వాని వ్యాపారము (కార్యము). ఇక
వాని రూపము నాలుగు భూజములతో, రెండు పాదములతో, తొండముతోను ఏడు అవయవములు కలిగి, 19 ముఖములు కలిగి ఉండును. మధ్యముఖము గజముఖముగా తొండము కల్గి ఉండి, అటు తొమ్మిది, ఇటు తొమ్మిది ముఖములు పురుష ముఖ ఆకారము కలిగి ఉండును. ఇది ఆయన రూపము.

మరొకచోట వైశ్వానర విద్యలో వైశ్వానరుని రూపము మరొకలా వర్ణించబడి ఉంది. ఆ విద్యలో కూడా వైశ్వానరుడికి 7 అంగములు, 19 ముఖములు చెప్పబడి ఉన్నాయి. ద్యులోకుడు వైశ్వానరుడి మూర్థస్థానమునే ఒక అంగముగాను, సూర్యుడు చక్షువనే అంగముగాను, వాయువు వైశ్వానరుడి ప్రాణముగాను, ఆకాశమంతా ఆయన శరీరమధ్యభాగముగాను, జలము ఆయన మూత్రాశయముగాను, పృథివీ ఆయన పాదములుగాను, జాగ్రత్‌ దశలో ఉన్న జీవుడు వైశ్వానరుడి 7వ అంగముగాను వర్ణించబడినాయి.

ఇక ఆ వైశ్వానర విద్యలోని వైశ్వానరుడికి గల 19 ముఖములు ఏమిటంటే జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు, ప్రాణవృత్తులు (వ్యాన, ఉదాన, సమానాదులు) ఐదు, అంత:కరణ వృత్తులు (మనస్‌, చిత్త, అహంకార, బుద్ధులు) నాలుగు.

ఇక్కడ మాండూక్యోపనిషత్‌లోనూ వైశ్వానర నామధేయంతో, 7 అంగములు, 19 ముఖములు గల రూపము వర్ణించబడింది. వైశ్వానరవిద్య ఛాందోగ్యోపనిషత్‌లోనూ వైశ్వానరుడికి 7 అంగములు, 19 ముఖములే చెప్తూ వేరే వర్ణించబడిన ఆ అవయవములను ప్రస్తుతము కూడా అన్వయించుకోవచ్చును. ఇక ఇట్టి విలక్షణ రూపము కలిగి జాగ్రత్‌ దశా జీవునిలో ఉండు వైశ్వానరుడు స్థూల భుక్‌ అంటారు. స్థూలములు అంటే బాహ్యముగా ఆయా ఇంద్రియములచేత గ్రహించబడునట్టి విషయములు. రూపముకలిగిన పదార్థములు, రుచి కల్గినవి, శబ్ధించునవి, స్పర్శ కల్గినవి, గంథము కల్గిన వి అన్నీ స్థూలములనబడును. ఈ స్థూలపదార్థములను జీవునికి అనుభవింపచేయువాడు కనుక వైశ్వానరుడు స్థూలభుక్‌.

అయితే స్థూలభుక్‌ అంటే నిజానికి స్థూలములైన బాహ్య పదార్థములను అనుభవించువాడు అనికదా అర్థము చెప్పవలసింది. అని సందేహము రావచ్చును. పదార్థానుభవము తద్వారా సుఖదు:ఖాది అనుభవమనునది కర్మనుబట్టి ఏర్పడుచుండును. ఆ కర్మఫల అనుభవమునది జీవునికే కానీ, పరమాత్మకి ఉండదు. కానీ శ్రుతి, కర్మఫల అనుభవ, కర్తృత్వాన్ని జీవ, పరమాత్మలిద్దరికీ చెప్పి, అది ఏ విధంగానో సమర్థిస్తుంది. *బుతం పితంబౌ సుకృతస్య లోకే...* అనే మంత్రంలోని కర్మఫలమును జీవుడు, పరమాత్మ ఇద్దరూ అనుభవిస్తున్నారని శ్రుతి చెప్తున్నది. అయితే జీవుడిలాగే పరమాత్మ కర్మ అనుభవించాల్సివస్తే ఇక తేడా ఏముంటుంది? ఆయనా జీవుడితోపాటు ఈ శరీరంలో ఉంటూ సుఖమో, దు:ఖమో పొందవలసివస్తుంది.

PVD Subrahmanyam చెప్పారు...

అందుకని శ్రుతి మరొక మంత్రములో *ద్వాసుపర్ణా సయుజా సఖాయా, సమానంవృక్షం పరిషస్వజాతే తయోరన్య: పిప్పలం స్వాదు అత్తి, అనశ్నన్‌ అన్యో అభిచాకశీతి* అని జీవపరమాత్మలిరువురూ శరీరంలో ఉన్నా, జీవుడు మాత్రమే కర్మఫలాన్ని అనుభవిస్తాడని, పరమాత్మేమో జీవునిచేత ఆ కర్మఫలాన్ని అనుభవింపచేస్తూ ఉంటాడని జెప్పింది. కనుక పరమాత్మకి ప్రయోజన కర్తృత్వము, జీవునికి ప్రయోజ్యకర్తృత్వము సిద్ధిస్తాయి. ప్రస్తుతమున బాహ్యపదార్థముల అనుభవ విషయములో కూడా ఆయా పదార్థాలని అనుభవించేదీ, సుఖమో-దు:ఖమో పొందేదీ ప్రయోజ్యకర్త అయిన జీవుడే, పరమాత్మ కేవలము కూడా ఉండి ఆయా పదార్థాలని అనుభవింపచేస్తూ ప్రయోజక కర్త తానవుతున్నాడు. కనుక, వైశ్వానరుడు స్థూలభుక్‌ అయ్యాడు. ఇదియే భోగ్యము.

ఈ విధంగా జాగ్రత్‌ దశలో ఉండు జీవునికి అన్తర్యామిగానుండి శాసించువాడు అనిరుద్ధ, వైశ్వానర నామములకల పరమాత్మ యొక్క మొదటి స్వరూపమని, వాని స్థానము చక్షురీంద్రియమని, వాని వ్యాపారము బాహ్యపదార్థముల యొక్క జ్ఞానము జీవునికి కల్గించడమని, 7 అంగములు, 19 ముఖములు కల్గినది వాని రూపమని, స్థూలపదార్థములన్నీ వాని భోగ్యములను ఐదు విషయములు వివరించబడినవి.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
విశ్వమే ఆహారంగా గల సాక్షాత్తు విశ్వానరుడి స్వరూపమే పరమేశ్వరి గనుక ఆ తల్లి *మహాశనా* అని సార్థక నామాంకిత అయినది. ఆ పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం మహాశనాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

«అన్నిటి కంటే పాతది ‹పాతవి   360లో 201 – 360   కొత్తది» సరి కొత్తది»