20, ఫిబ్రవరి 2023, సోమవారం

విచార వివేకము

 *విచార వివేకము*

*స్నానము-విధానాలు..*

1. మంత్ర స్నానము

2. మృత్తికా స్నానము

3. భస్మ స్నానము

4. వాయు స్నానము

5. జల స్నానము

6. కాపిల స్నానము

7. దివ్య స్నానము

8. మానసిక స్నానము

9. ధ్యాన స్నానము

మఱియు

10. వారుణ స్నానము.


1. మంత్రోక్తముగా అభిమంత్రించిన నీటి బిందువుల సంప్రోక్షణము

2. చెదలుగా ఉండే పుట్టమన్ను లేదా గోధూళి లేదా తెల్లనిగడ్డి మొలిచిన ప్రదేశములోని మట్టిని శరీరానికి పులుముట

3. భస్మమును (పగటివేళ తడిగా, రాత్రివేళ పొడిగా) దేహమంతా అలముట

4. ప్రాణాయామముతో చేయునది

5. గంగాస్మరణతో ఇంట్లో నీటితో చేయునది

6. శరీరమును తడిబట్టతో తుడుౘుట

7. ఎండావానలు ఒకేసారి ఉండే సమయంలో వర్షములో తడియుట

8. భగవన్నామ (పుండరీకాక్షాయనమః) జపముతో చేయునది

9. పూజా/తులసీ తీర్థము ౘల్లుకొనుట

మఱియు

10. బొడ్డు లోతు నీటిలో నదియందు ముక్కు, చెవులు మూసుకుని మూడు సార్లు మునిగి తేలుట.


న్యాయ్యేన మార్గేణ స్వస్తి ప్రజాభ్యః...

కామెంట్‌లు లేవు: