5, సెప్టెంబర్ 2026, శనివారం

పరపురుషునిపై మోహము

 *2361*

*కం*

పరపురుషునిపై మోహము 

తరుణికి పతనమ్ము నొసగు తప్పక నెపుడున్.

పరిణయ మను బంధముతో 

భరియించెడి భర్త సతికి వరమిల సుజనా.

*భావం*:-- ఓ సుజనా! పర పురుషుని పై ఏ కారణం గా మోహం కలిగిన నూ ఆ స్త్రీ కి ఆ నాటి నుండి తప్పకుండా పతనం మొదలవుతుంది. వివాహం (పరిణయం ) అనే బంధం తో స్త్రీ ని భరించే భర్త ఆ స్త్రీ కి ఈ (భూ ) లోకం లో వరం.

*సందేశం*:-- వివాహ బంధం తో స్త్రీ ని భరించే భర్త ఆ స్త్రీ కి వరం, కానీ కొందరు స్త్రీ లకు పర పురుషులు గొప్పగా అనిపిస్తారు, ఆ వ్యామోహం తగ్గించుకొని భర్త వద్ద తలవంచితే ఆ స్త్రీకి విలువ పెరిగి తద్వారా వారి సంతానము నకు గౌరవ మర్యాదలతో బాటుగా సుఖ సంతోషములు కూడా కలుగగలవు. అలా కాకుండా భర్త ను విడిచి పెట్టినచో తాత్కాలిక సౌఖ్యము, స్వేచ్ఛ లభించిన నూ శాశ్వతనరకం తో బాటు పిల్లల జీవితాలు కూడా నాశనం అవుతాయి. చిన్న వయసులో చేసి న తప్పు లు ఆ చిన్న వయసులో నే సరిదిద్దు కొనకపోతే వయసు మీరిన తరువాత ఆ స్త్రీ (పురుషుడు) భూ లోక నరకానికీ, వారి పిల్లల జీవితనాశనానికీ హేతువులవుతాయి.

*సందర్బం*:-- ఈ కాలం లో ఎంతో మంది పిల్లల జీవితాలు ఇలా నాశనమై ఉండటాన్ని గమనించి ఇది రచించడమైనది, ఎంతో మంది పిల్లలకు 99 శాతం వరకూ కుదిరి కూడా వివాహం కాకపోవడానికి ఇటువంటి కారణాలు కారకాలుగా ఉంటున్నాయని భావితరాల కు ఇటువంటి సమస్య లు రాకూడదని సూచించడమైనది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: