8, జనవరి 2023, ఆదివారం

పదవవాడు

పదవవాడు 

  పూర్వకాలంలో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాతానికి వెళ్లాలంటే చక్కటి రహదారులుకాని, వాహనాలు కానీ ఉండేవి కావు చాలా కొద్దిమంది ధనవంతులు మాత్రము రాధాలు, బండ్లు కలిగి ఉండేవారు. అటువంటి రోజులల్లో ఒక అరణ్యంలో పదిమంది ప్రయాణికులు వెళుతున్నారట. వారు కొంతదూరం ప్రయాణం చేసినతరువాత వారికి ఒక నది అడ్డంగా వచ్చింది వారిలో ఏ వక్కరికి కూడా ఈతరాదు. అందరు ఆ భగవంతుని మీద భారం వేసి జాగ్రత్తగా నదిని దాటాలని నిర్ణయించుకున్నారు. ఒకరి చేయి ఒకరు పట్టుకొని లోతయిన నదిని దాటారు.  అవతలి తీరం చేరగానే అందరికి ప్రాణం లేచివచ్చినట్లు అయ్యింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే తాము పదిమంది క్షేమంగా చేరామా లేక ఎవరైనా నదిలో మునిగి పోయారా, అని అనుకోని అందులో వారిని అందరిని లెక్కించమని చెప్పారు. అతను లెక్కించి తొమ్మిది మందే వున్నారు అని చెప్పారు. అప్పుడు ఇంకొకడు లెక్కించాడు అతనికి తొమ్మిది మందే వచ్చారు. అట్లా ప్రతి వక్కరు లెక్కించారు.  కానీ పదవవాని జాడ  తెలియలేదు. అప్పుడు అందరు కలిసి తమలో ఒకడు నదిలో మునిగినట్లు నిర్ధారణ చేసుకొని ఏడవటం మొదలు పెట్టారు. 

ఆ సమయంలో నది వడ్డున వెళుతున్న ఒక బాటసారి వారిని చూసి విషయం కనుక్కొని తన ముందు మళ్ళీ లెక్కించమని అన్నాడు అందులో ఒకడు తిరిగి లెక్కించి తొమ్మిదిమందే అని  తెలిచాడు. విషయం తెలుసుకున్న ఆయన ఈ సారి మీరంతా వరుసలో వుండండి నేను లెక్కిస్తాను అని చెప్పి గణిస్తే పదిమంది తేలారు. అప్పుడు వారంతా సంతోషించి తమకు ఒకడు తక్కువ ఎందుకు వస్తున్నాడు అని అడిగారు. నాయనలారా మీలో లెక్కించే వాడు తనను తాను లెక్కించుకోలేదు అందుకే ఒకడు తగ్గాడు అని చెప్పి వారాలకు వివరణ ఇచ్చి పంపించాడు. 

సరిగ్గా ఈ కధలో లానే మనంకూడా పదవ వాడిని తెలుసుకోవటం లేదు.  ఎంతసేపు బయట తొమ్మిది మందిని లెక్కిస్తూ పదవ వానిని లెక్కించకుండా పదవవాడు దొరకటం లేడని బాధపడుతున్నాము. నిజానికి ఆ పదవవాడిని నేనె అనే ఎరుక కలగటమే వేదాంత రహస్యంగా మనకు మన అద్వయిత గురువుగారు శ్రీ ఆదిశంకరా చార్యులవారు వారి అనేక గ్రంధాలద్వారా తెలియ చేశారు. మనం మనలో వున్న భగవంతుని తెలుసుకోక బయట గుడులలో గోపురాలతో వెతుకుతూ అజ్ఞ్యానంములో జీవనాన్ని  సాగిస్తున్నాము. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే క్షేత్రాలు, తీర్ధాలు కేవలం నీకు తాత్కాలిక మానసిక ఆనందాన్ని ఇచ్చే సాధనాలు మాత్రమే నిజానికి శాశ్విత ఆనందం కేవలం నాలోని పదవవాడిని తెలుసుకున్నప్పుడు మాత్రమే కలుగుతుంది. ఫై కధలో వడ్డున ఉండి వాళ్ళను లెక్కించిన వాడు ఎవడో కాదు అతనే సత్గురువు ఆయన సాన్నిద్యంలోనే మనకు సాధనకు ఊతం లభిస్తుంది.  శ్రీ ఆది శంకరాచార్యుల వంటి సద్గురువు మనకు లభించటం మనం చేసుకున్న పూర్వ జన్మ సుకృతం. ఆచార్యుల వారి బాటలో నడుద్దాము మన జన్మ తరిమ్పచేసుకుందాము. 

దయచేసి నేనే సద్గురువును నన్ను కొలవండి, ఆరాధించండి అని ఈ రోజుల్లో అనేకమంది తారసపడుతున్నారు. వారి వెంట వెళ్లి మీ అమూల్య జీవిత కాలాన్ని, ధనాన్ని వృధా చేసుకోకండి. ముక్తికి మార్గం కేవలం అద్వైతము ఒక్కటె శ్రీ శంకరులను మించిన గురువు దేవులు లేరు.  ప్రతి సాధకుడు ముందుగా శ్రీకృష్ణ భగవానులు మనకు ఇచ్చిన అమూల్య సంపద ఐన శ్రీ భగవత్ గీతను పఠించి అర్ధం చేసుకొని గృహస్థాశ్రమాన్ని చక్కగా నిర్వహించి తరువాత ఆది శంకరుల వేదాన్త గ్రంధాలను పఠించి పాటించిన ముక్తి కలగటం తథ్యం. 

"మోక్షమ్ము ధనముతో రాదు"

ఉపనిషత్తులలో సారాన్ని మొత్తాన్ని జ్ఞ్యానామృతంగా మార్చి మనకు వసంగిన మహాను భావుడు.శ్రీ ఆది శంకరాచార్యుల వారు.  అయన బాటలో నడుద్దాము.   

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః  

మీ భార్గవ శర్మ


కామెంట్‌లు లేవు: