7, మే 2024, మంగళవారం

నేత్ర వ్యాధులు

 🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

.            *🌹తాళపత్ర గ్రంధం🌹*

( అనేక గ్రంథాల్లో దాగి ఉన్న జీవన ఆచార... ఆరోగ్య సాంప్రదాయ రహస్యాలు... స్థూల అక్షరాలతో...)

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

.                    *భాగం 12*


*108. నేత్ర వ్యాధులు హరించుటకు?*


*ఓం కేశవ పుండరీకాక్ష నమో నమః.*

సాయంత్రపు ఎండలో కనులు మూసుకుని ఏకాంతప్రదేశంలో ధ్యానించుట ద్వారా కనులకి శక్తి, దృష్టి పెరిగి ఆనందం స్వంతమవుతుంది.


*109. అపమృత్యు భయం పోవాలంటే?*


గంధము, అక్షితలు, పుష్పములు వంటి

పూజాద్రవ్యములతో భరణీ నక్షత్రమునాడు యముణ్ని

పూజిస్తే అపమృత్యు భయం తొలగుతుంది.


*110. వంట ఇంటికీ, గృహానికి పరిమితమైతే మీ ఆయుషు పదేళ్ళు తగ్గినట్టే?*


ముఖ్యంగా భారత దేశంలో మహిళలు పై రెంటికే

పరిమితమవుతుంటారు. పూర్వకాలంలో గృహం పెద్ద

ఆవరణలో ఉండేది. దానితో వారు ఆ ఆవరణలో

ఇంటి పనులకు తిరగటం వల్ల సూర్య కిరణాల నుండి

వచ్చే 'డి' విటమిన్ అందేది. చర్మము పైనున్న అనేక

క్రిములు నశించిపోయేవి.

రాజపుత్ర స్త్రీలూ, ఇంకొంత మంది స్త్రీలు ఘోష

పద్ధతి వల్ల అనారోగ్యం పాలవుతారు. కేవలం నీడపట్టునే ఉండటం వల్ల భయంకరమైన టి.బి కూడా వచ్చే అవకాశము ఉంది. సూర్యరశ్మి శరీరానికి తగలకపోతే ఆయుర్వేద వైద్య రీత్యా రోగాల పాలవ్వక తప్పదు.


*111. నాగులచవితికి పుట్టలో పాలుపోస్తే సంతానం కలుగుతుందా?*


కార్తీక శుద్ధ చవితినాడు వచ్చే నాగపంచమి రోజు సంతానం కోసం పెట్టి మొలకెత్తిన

ధాన్యములతోనూ, పాలతోనూ నాగపుట్టను పూజించి ఈ

పాలు పోస్తారు. ఇలా చెయ్యటం భక్తితో పాటు

సంతానవంతులయ్యే విశేషం కూడా ఉంది. కొత్త ధాన్యముల ప్రసాదాన్ని స్వీకరించటం వల్లా, పుట్ట వద్ద పూజ చేస్తూ స్పందించటం వల్ల స్త్రీలలో నాడీమండలం ఉత్తేజం చెంది సంతానవంతులయ్యే అవకాశం కలిగిస్తుంది.


*112. ముక్కుపుడక కుట్టించుకోవటంలోని ఆరోగ్యము?*


వివాహ సమయంలో ఏడు అడుగులు వేసి ఒకరికి

ఇల్లాలైన ఆమెని పార్వతీ దేవితో సమానంగా భావించి

ముక్కుపుడకను అందివ్వటం మన సంప్రదాయం. పెళ్ళి

అయిన వారు ధరించటంలో అర్థం... భర్త

ఆయురారోగ్యాలతో, సకల ధనాలతో సంతోషంగా

ఉండాలని లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ధరించటము. ముక్కుకి

రంధ్రం చేయటం ద్వారా ఆక్యుపంక్చర్ వైద్య విధానం

ద్వారా రక్తపోటు నివారణమవుతుంది.


*113. గృహస్థు తామరాకు, మోదుగ ఆకుల్లో భోజనం చేయరాదు. ఎందువలన?*


ఆ రెండు ఆకుల్లో భోజనము మునులూ, ఋషులూ, సన్యాసులూ మాత్రమే తినాలి. ఆ ఆకుల్లో భుజించటం వల్ల సత్వగుణం అలవడుతుంది. ఆ కారణంగానే గృహస్థు జీవితం గడుపుతున్నవారు ఆ ఆకుల్లో తినరాదు. అయితే మోదుగ ఆకుల్లో ఆహారం

తీసుకోవటం వల్ల కంటి సంబంధిత అనేక వ్యాధులు

తగ్గుతాయి.


*114. అకాల భయము తొలగిపోవుటకు?*


ఓం హృషీకేశ నమో నమః అని జపించ

వలయును. రాత్రి స్నానము అయ్యాక, ఇష్ట దైవాన్ని

తలుచుకొని 108సార్లు జపిస్తే భయవీడలు

తొలగిపోతాయి.


*115. ఆడ, మగ తేడా లేకుండా చెవులు కుట్టించటం ఎందుకు?*


చెవి మధ్య భాగంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది.

అది మెదడుకి అనుసంధానం కలిగి ఉంటుంది.

ఎప్పుడైతే ఆజ్ఞా చక్రం వద్ద ఒత్తిడి తెస్తామో మెదడులో

ఉన్న జ్ఞాననేత్రం వికసించి బుద్ధి వికసిస్తుంది. ఈ కార్యాన్ని బంగారంతో చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అందువలననే బంగారు పోగులు ధరించలేని వారికి సైతం చెవి కుట్టే సమయంలో

బంగారు తీగతోనే రంధ్రం ఏర్పరచటం జరుగుతుంది.

పూర్వం చెవులు కుట్టించటం ఉపనయనం సమయంలో చేసేవారు. కానీ ఈ కాలంలో మూడు సంవత్సరాల వయస్సులోనే మగ, ఆడ బేధం లేకుండా చెవులు కుట్టించటం జరుగుతుంది.

విద్యాభ్యాసం చేసేటప్పుడు గురువులకూ, పెద్దలకూ చెవులను తమ్మె వద్ద పట్టుకుని శిష్యులు తమ గోత్రనామాలను చెప్పుకొనేవారు. ఈ విధానంలో అంతరార్థం ఆజ్ఞాచక్రంపై ఒత్తిడి

తేవటం కొరకే.


*రచన* ✍️ *మైధిలి వెంకటేశ్వరరావు.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

కామెంట్‌లు లేవు: