7, మే 2024, మంగళవారం

పరుల మేలుకై

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 

*ధనాని జీవితం చైవ పరార్థే ప్రాజ్ఞ ఉత్సృజేత్*।

*తన్నిమిత్తో వరం త్యాగో వినాశే నియతే సతి*॥


తా𝕝𝕝 *"ప్రాఙ్ఞుడైనవాడు ధనాన్ని జీవితాన్ని పరుల మేలుకై త్యజించాలి*.... మరణం తప్పనిదై ఉండగా అట్లు త్యాగం చేయుట శ్రేష్ఠము గదా!"


*ఏది శాశ్వతం*?


     👇 //------ ( *భజగోవిందం* )-----// 👇


*కాతే కాంతా ధనగతచింతా*

*వాతుల కిం తవ నాస్తి నియంతా*

*త్రిజగతి సజ్జనసంగతిరేకా*

*భవతి భవార్ణవతరణే* ॥13॥


భావం: ఓరి వెఱ్ఱివాడా! ఎందుకు నీ భార్య గురించి, ధన సంబంధ విషయాల గురించి ఆలోచిస్తావు? అన్నిటిని, అందరిని నియమించే సర్వజ్ఞుడైన ప్రభువు లేడనుకున్నావా? *ఈ ముల్లోకాలలో చావు పుట్టుకలనే భవసాగరాన్ని దాటడానికి సజ్జన సాంగత్యమే సరైన నౌక*

కామెంట్‌లు లేవు: