పద్య ప్రతిభ
సీ. ఆదికవివరేణ్యు పాదున జనియించి
భారత కావ్యాన పరిఢవిల్లి
కవిబ్రహ్మ తిక్కన కావ్యమ్ము లందున
బహుళ ఛందస్సుతో ప్రజ్ఞ పొంది
ఆమాత్యు డెఱ్ఱన్న నందమౌ కవనాన
రమ్య ప్రబంధమై రాణ కెక్కి
పోతన కవితలో పొంది లాలిత్యమ్ము
భక్తవరుల నోట పలుక బడియు
నాంధ్రభోజునిభవ్య నాముక్తమాల్యదన్
జటిల రచన తోడ జగతి వెల్గి
ఆ. అష్ట దిగ్గజముల యాంధ్ర ప్రబంధాల
ఘనత గలుగు శ్రావ్య కవన మందు
నవని వెలుగు దివ్య యవధానముల యందు
"పద్య కుసుమ" మవని పరిఢ విల్లె
✍️గోపాలుని మధుసూదనరావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి