*కూతురు వయ్యెదో యనుcగు గోడలి వయ్యెదొ పౌత్రివయ్యెదో*
ఈ సమస్యకు నాపూరణ.
*భీష్మాచార్యులు*
పూతచరిత్ర నీకె తగు పుణ్యపు పంటవు యాజ్ఞసేనివే
చేతన మొంద పాండవులు, శ్రీవయి వైభవ రాజ్యలక్ష్మివై
ప్రీతిగ వర్తిలన్ కలుగు పెద్దన దీవన లిందు, గుంతికిన్
కూతురు వయ్యెదో యనుcగు గోడలి వయ్యెదొ పౌత్రివయ్యెదో
తాతల మైన మాకిచట ద్రౌపది! ధర్మము నిల్పు నిచ్చలున్.
*పల్లవాధరి ప్రల్లదంబది భర్త కెంతయొ హర్షమౌ*
ఈ సమస్యకు నాపూరణ.
*మత్తకోకిలా వృత్తం.*
చల్లగాలికి నారుబైటనె సంచరించెడి వానికై
మెల్ల మెల్లగ సద్దు సేయుచు మించుc బోడియె రమ్మనెన్
వల్లగాదిక మర్మకేళికి ప్రాణనాథుడు రాడనున్
పల్లవాధరి ప్రల్లదంబది భర్త కెంతయొ హర్షమౌ.
అల్వాల లక్ష్మణ మూర్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి