*దేశ వాసుల ప్రస్తుత కర్తవ్యం*
సభ్యులకు నమస్కారములు.
ఉదారము, నిర్మలమైన మన వైదిక ధర్మమును అధిక శాతం దేశవాసులు అనుసరించక పోవడం వల్లనే మన మతము దుర్భలమై, మనము (జనులు) కష్టనష్టముల పాలగుచున్నాము. ఇతర మతములు పుట్టక మునుపే వైదిక ధర్మం లోకమంతటికి మేలు చేసేమార్గం ఉపదేశించిన విషయం చారిత్రక సత్యం. వేదముల యందు ఏ మాత్రం భక్తి కల్గి ఉన్నా మనకందరికీ (కుల మరియు వర్గ రహితంగా) ఈ సనాతన ధర్మమే విహితమైన ధర్మము.
ఇతర మత గ్రంథాలన్ని వేదముల తర్వాతనే ఆవిర్భవించాయి ఇది విశ్వ వ్యాప్త సత్యము. ఎవరు, ఏ మార్గం అనుసరించినా అవన్నీ ఒకే గమ్యం చేరుతాయని వేదం ఒక్కటే చెబుతున్నది. ఇతర మతాలు తమ మార్గమే సత్యమని, తక్కినవన్ని నరక హేతువులని చెప్పుచున్నవి. *హిందు ధర్మము మాత్రమే ఇతర ధర్మాల గురించి ప్రకటనలు చేయడం లేదు*.
హిందూ మతస్తులను ఇతర మతాలు తమలో చేర్చుకుంటున్నా, హిందూ మతం ఇతరులను తనలో చేర్చుకోకపోయినా హిందూ మతం ఇంకా బాగానే ఉన్నది కదా!. దీనికి కారణమేమిటని ఆలోచిస్తే , మత సంప్రదాయాలను అనుష్టించడం వలన మాత్రమే మతాలు సజీవంగా ఉంటాయి కాని, అన్యులకు ప్రవేశమిచ్చి సంఖ్యలు పెంచడం వల్ల కాదని స్పష్టమవుతున్నది.
*అధిక శాతం* అన్యమతస్తులు....పిల్లలు, పెద్దలు అను తేడా లేకుండా క్రమశిక్షణగా తమ తమ సంప్రదాయాలు పాటిస్తూ తమ నిర్దేశిత జీవన విధానానికి కట్టుబడి ఉండడము, ముఖ్యంగా పాశ్చాత్య ధోరణులకు మొగ్గు చూపకపోవడం గమనిస్తూనే ఉన్నాము. మనలో *అధిక శాతం* స్వంత సంప్రదాయాలకు, విధానాలకు అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదన్న భావన సర్వత్రా ఉన్నది. *ఈ భావన వాస్తవ దూరం కాకపోవచ్చును కూడా*. ఇందువల్ల మనము మన దేశంలోనే ఉనికిని కోల్పోయే ప్రమాదమున్నది. *కనుక ఈ తరం యువత మన సంప్రదాయ మరియు ఆచార వ్యవహారాల పాటింపు విషయాలలో ఇతర మతస్తులను ఆదర్శంగా తీసుకోవాలి.*
కొన్ని తరాల క్రితం అని అనుకునే అవసరం లేదు...మూడు తరాల క్రితం పెద్దలు ఇంట్లో పిల్లలకు చిన్నప్పటి నుండి రామాయణ, మహాభారత మరియు భాగవత కథలు వినిపించేవారు అందువల్ల పిల్లలకు సంప్రదాయ, సంస్కారాలు అబ్బేవి. జాతి గూడా బలంగా మరియు క్రమశిక్షణగా ఉండేది.
హిందూ జాతి బలంగా ఉండి తన ఉనికిని కోల్పోవద్దు అని భావిస్తే... మనమంతా (కుల మరియు వర్గ రహితంగా) పూర్వకాలం లాగా ఆచార వ్యవహారాలను కట్టుదిట్టంగా పాటించాల్సి ఉంటుంది.
జ్ఞాన బోధ చేసే ప్రవచనకారులు, ఆశ్రమ అధిపతులు, పీఠాధి పతులు మరియు ఇతర పెద్దలు హిందూ జాతి జాగృతి మరియు స్వధర్మ రక్షణకై పూనుకోవాలి.
*కాబట్టి మనమందరం (కుల మరియు వర్గ రహితంగా) మన మత సంప్రదాయాల అనుష్టాన పరులం కావల్సిఉన్నది*. పెద్దలు విధించిన ధర్మాలను ఆచరిస్తూ ఉంటేనే ఏ మతమైనా నిలదొక్కుకుని ఉంటుంది. మనకు మతైక్యం కావాలి *ఇతరుల లాగా ఏక మత సిద్ధాంతము కాదు*. ఎవరి మతములలో వారుండి స్వధర్మాచరణ చేస్తూ ఆ సర్వవేశ్వరుని ఉపాసిద్దాము. కుల మరియు వర్గాలకు అతీతంగా అందరం కల్సి ఐకమత్యంగా భగవత్ ఆరాధనతో బాటు హిందూ సంప్రదాయ పరిరక్షణకు పూనుకుందాము.
*స్వధర్మ రక్షణకు మాత్రమే*
ధన్యవాదములు.
🙏🙏🙏
(భారత ఋషి పీఠం మాస పత్రిక ఆధారంగా)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి