చం. హరి వరశయ్యగా మరి సహస్రఫణీంద్రుని నెంచెనే రహిన్
గరళగళా ! గళాన నురగంబుల భూషల నెన్నుకొంటివా
గరళధరమ్ములే గరముఁ గంఠమునందిట కాటువేసినన్
హర! విషమద్ది కంధరపు హాలహలంబును మీఱదీశ్వరా ! 9.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
✍️కొరిడె విశ్వనాథ శర్మ ,
ధర్మపురి .
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి