22, సెప్టెంబర్ 2021, బుధవారం

శ్రీమద్భాగవతము

 *22.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2269(౨౨౬౯)*


*10.1-1389-*


*క. గోపాలకృష్ణుతోడను*

*భూపాలక! మున్ను తొడరి పొలిసినవారిన్*

*నీ పాల బుధులు చెప్పరె*

*కోపాలస్యములు విడిచి కొలువం దగదే."* 🌺 



*_భావము: ఓ కంసరాజా! గోపాలకుడగు ఈ శ్రీకృష్ణుని తో ఇంతకు ముందు ఎందరో వీరులు, రాక్షసులు తలపడి నశించిపోయారు కదా! నీ కొలువులోని పెద్దలు ఇంతకు ముందే ఈ విషయమును చెప్పి, క్రోధమును, తామస బుద్ధిని త్యజించి శ్రీకృష్ణుని శరణు వేడమని చెప్పలేదా??_* 🙏



*_Meaning: O King! Already many warriors and demons attacked this cowherd Sri Krishna and perished at His hands. Didn't the well wishers and elders in your court alert and warn you about this? Didnt they advise you to give up anger and wicked behaviour and seek refuge at the feet of Sri Krishna?_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

కామెంట్‌లు లేవు: