మలమూత్రాలు దారిలో విసర్జిస్తే ఎవరు శిక్షార్హులు కారు.
__________________________________
శ్లోకం.
ఆతురే నియమో నాస్తి బాలే వృద్ధే తథైవ చ
సదాచారరతే చైవ హ్యేష ధర్మ స్సనాతన:
॥ మనుస్మ్రతి॥
భయపడినవాడు, వృద్ధుడు, గర్భిణి, బాలుడు వీరు దారిలో మలమూత్రాలు విసర్జిస్తే శిక్షార్హులు కారని చాణక్యనీతి. ఎందుకంటే వీరిలో గర్భిణికి తప్ప మిగిలినవారికి మనస్సు శరీరం వీరి ఆధీనంలో వుండవు. అలాగే గర్భిణికి కూడా శరీరం వశంలో వుండదు. అందుకని పై వారు పొరపాటున మలమూత్రవిసర్జన చేస్తే శిక్షించరాదని అర్థశాస్త్రం చెపుతోంది.
పై విషయాన్నిబట్టి చూస్తే ఆ రోజులలో గ్రామశుభ్రతకు ప్రాముఖ్యతనిచ్చేవారని, ఉల్లంఘించినవారు శిక్షార్హులని అవగతమైతోంది.
పై మనుస్మ్రతి శ్లోకం ఇదే విషయాన్ని తెలియచేస్తోంది. కాకపోతే బాలుడు వృద్ధుడు గర్భిణిలకు అదనంగా సదాచార సంపన్నుడిని చేర్చడం జరిగింది.
శ్లోకం.
కర్త కారయితా చైవ ప్రేరక శ్చానుమోదక:
సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన:
॥పరాశరస్మ్రతి॥
మంచికార్యమైనా చెడుకార్యమైనా దానిని ప్రేరేపించేవాడికి చేయించేవాడికి ఆమోదించేవాడికి చేసేవాడికి, ఈ నలుగురికి భాగస్వామ్యముంటుంది.
వీరు మంచిని చేస్తే మంచే దక్కుతుంది.
చెడును చేస్తే చెడే లభిస్తుంది.
॥సేకరణ॥
_____________________________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి