22, సెప్టెంబర్ 2021, బుధవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 33

 ప్రశ్న పత్రం సంఖ్య: 33 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

ఇక్కడ అడిగే  ప్రశ్నలు నిజానికి ప్రశ్నలు కావు ఎందుకంటె ప్రతి ప్రశ్నకు ఒక నిర్దుష్ట జవాబు ఉండాలి కానీ కేవలం కొన్ని జరగని విషయాలు యాదృచ్చికంగా జరిగితే మనం ఎలా స్పందిస్తామని అలోచించి ఈ ప్రశ్నలు తయారు చేయటం జరిగింది. ఎవరి అభిప్రాయాలు వారివి. ఎవరు ఎలా ఆలోచిస్తారా అన్న తమషాను చూద్దాం. . 

 1) శిశువు పుట్టిన వెంటనే మాట్లాడితే ఎట్లావుండుంది. 

2)  ప్రపంచంలో వున్నమానవులందరికి నిశ్చయంగా నూరు సంవత్సరాల ఆయుర్దాయం స్థిరంగా (common)గా ఉంటే మనుషులు ఎలా ఆలోచిస్తారు. 

·3)  పశువుల లాగ మనుషుల పిల్లలు కూడా పుట్టిన వెంటనే నడిస్తే యెట్లా ఉంటుంది.  

4) మనం నరకం, స్వర్గం అని అంటున్నాం కదామనుషులు చేసే కర్మలకు ఒక నిర్దుష్ట సమయం అంటే ఒక సంవస్త్సర కాలం తరువాత దాని ఫలితం అంటే పాప, పుణ్యఫలితం వస్తే యెట్లా ఉంటుంది. 

 5) ప్రతి మనిషికి తన గత జన్మ గుర్తువుంటే ఏమి చేస్తారు. 

 6) మనం దివ్య ద్రుష్టి అని పురాణఇతిహాసాలలో చదువుకున్నాం కదా ఏదో ఒక విద్య వలన కొంత జ్ఞ్యానం వున్నవారు ఆ శక్తిని పొందితే ఎలా ఉంటుంది. 

7)  మన శరీరంలో అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో మనం చూడలేముకదా. ఆలా కాకుండా ఒక శక్తిని సంపాయిస్తే మనశరీరంలో ప్రతి అవయవాన్ని మనం చూసి దానిని నియంత్రించే శక్తి ఉంటే, ఉదాహరణకు మీరు ఏదో కొంచం ఎక్కువగా భుజించారనుకోండి అప్పుడు వెంటనే జీర్ణం కాక ఇబ్బంది పడతారు కానీ మీకు ఆశక్తివల్ల వెంటనే జీర్ణం చేయగలరు. ఇంకొకటి ఎవరికైనా ఏదైనా ఎముక విరిగినదనుకోండి దానిని తెలుసుకొని వెంటనే ఆ విరిగిన ఎముకను అతికించగల శక్రి. 

8) కనురెప్పలు పారదర్శకంగా అంటే ఒక గాజుపలకం లాగ ఇటునుంచి అటు కాంతి ప్రసరిస్తే ఎలావుంటుంది. 

9) ఎదుటి వారి మనసులో వున్నది ఏమిటో తెలుసుకుంనే శక్తి ఉంటే ఎలావుంటుంది. 

10) మనం అనారోగ్యవంతులం అయితే వెంటనే ఏది తింటే, తాగితే ఆ రోగం తగ్గుతుందో ప్రతివారికి తెలిస్తే ఎలావుంటుంది. 

11) మనుషులు కూడా పక్షుల లాగ గాలిలో ఎగరగలిగితే ఎలా ఉంటుంది. 

12) మనిషికి రెండు చేతులు కాకుండా నాలుగు చేతులు ఉంటే ఎలావుంటుంది. 

13)కోతులకు లాగ మనుషులకు కూడా దవడలు రెండువైపులా రెండు సంచులు ఉండి ఒకసారి ఎక్కువ ఆహరం తీసుకొని ఆ సంచులు నింపుకొని మరల ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొద్దికొద్దిగా తినే విధానం ఉంటే ఎలావుంటుంది. 

15).మనుషులు నీటిలో ముంగి చేపలలాగా ఈతకొట్టే శక్తి ఉంటే ఎలా ఉంటుంది.  

16) మనిషి తనకు కావలసినంత ఎత్తు మరియు కావాలంటే చిన్నగా అంటే కామరూపులుగా వుండే విద్య ఉంటే ఎలావుంటుంది. 

17) ఒకసారి ఆహరం తీసుకుంటే కొన్ని నెలలదాకా ఆకలి కాకుండా ఉంటే ఎలావుండుండి. 

18).ఒకేసారి బహుపనులు చేయగలిగితే అంటే ఒకవైపు మాట్లాడుతూ, ఒకవైపు తింటూ, వింటూ, చేతులతో వివిధపనులు చేస్తూ వుండే శక్తి ఉంటే ఎలా ఉంటుంది. 

19. తనుతలచిన వారితో మనసులో తలుచుకున్న వెంటనే ఎంతదూరంలో వున్నా చూసి మాట్లాడే శక్తి ఉంటే ఎలావుంటుంది. 

20  మనిషి తన ఆయుష్షును తానె నిర్ణయించుకునే అవకాశం ఉంటే ఎలావుంటుంది. 

ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వ దలచిన వారు ముందుగా follower గా అయ్యి క్రింద comment box లో మీ సమాదానాలు  వ్రాయగలరు. వాటిని ఇక్కడ పబ్లిష్ చేయబడును. 

ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడు మీ ఊహలకు పదును పెట్టండి. 


కామెంట్‌లు లేవు: